Sesame Seeds Benefits: నవధాన్యాలలో నువ్వులు ఒకటి. సంస్కృతంలో తిలలు అంటారు. ఈ నూనెను చాలా వంటలలో ఉపయోగిస్తారు. వీటిని ఆహారంలో భాగంగా తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
►ముఖ్యంగా ఊరగాయ పచ్చళ్లలో నువ్వుపప్పునూనె వాడటం వల్ల అవి చాలా కాలం నిల్వ ఉండటమేగాక రుచికరంగా కూడా ఉంటాయి. దీపారాధనకు నువ్వుల నూనె శ్రేష్ఠమని పెద్దలు చెబుతారు. నువ్వులను దంచి చిమ్మిలి, వేయించి నువ్వుండలు మొదలైన మిఠాయిలు తయారు చేస్తారు.
►బ్రెడ్‌లోనూ, బర్గర్లలోనూ, వివిధ రకాల వంటకాలలో, కూరలలోనూ వేస్తారు. వేయించి, పొడికొడతారు. పచ్చడి కూడా చేస్తారు.
►నువ్వులలోని మెగ్నీషియం క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇందులోని జింక్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద!
►నువ్వులు ఒమేగా–3, ఒమేగా –6, ఒమేగా– 9 ఆమ్లాలను కలిగి ఉండి, జుట్టు పెరుగుదలకు దోహద పడతాయి.
►గ్లాసు పాలలో కన్నా, చెంచా నువ్వులలో ఎక్కువ క్యాల్షియం ఉంటుందని రుజువైంది. నువ్వులు రుచిగా ఉంటాయి కానీ, వీటివల్ల కొందరిలో అలర్జీ కలగవచ్చు.
►అలాగే, ఇవి అమితంగా వేడి చేసే గుణం కలిగి ఉంటాయి కాబట్టి వేసవిలో ఎక్కువ తినరాదు.
►అయితే శీతాకాలంలో నువ్వులను వాడటం వల్ల శరీరానికి తగిన ఉష్ణోగ్రత అందుతుంది. అందుకే శీతాకాలంలో సంక్రాంతి పండుగకు నువ్వుల ఉండలను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవడం, ఈ పండుగ ప్రత్యేకమైన అరిశలకు నువ్వులను అద్దడం ఆచారంగా మారింది.
చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు..
Comments
Please login to add a commentAdd a comment