magnesium
-
ఆకలి... నిద్ర సరిగా లేవా? మెగ్నీషియం లోపం కావచ్చు
మన శరీరం ఫిట్‌గా ఉండాలంటే మెగ్నీషియం దేహంలో అధికంగా ఉండాలి. కార్బోహైడ్రేట్స్, కొవ్వు, ప్రోటీన్స్ నుంచి మనకు శక్తి వచ్చేలా చేయడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మంచి శక్తితోపాటు చక్కటి నిద్ర పట్టేలా చేస్తుంది. రక్తంలో చక్కెరలను, హార్మోన్లను క్రమబద్ధీకరిస్తుంది. మెగ్నీషియం తగినంత లేకపోతే కలిగే అనర్థాలేమిటో తెలుసుకుందాం. అనారోగ్యాలు వేధిస్తుంటాయి!శరీరంలో మెగ్నీషియం లోపం ఉంటే ఆకలి వేయదు. వికారంగా... వాంతులు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. నీరసంగా ఉంటారు. హార్ట్ బీట్‌రేట్ లో హెచ్చుతగ్గులు వస్తాయి. కళ్ళు మసక బారుతుంటాయి. కండరాలలో నొప్పి వస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది. నిద్ర సరిగ్గా పట్టదు. హైబీపీ వస్తుంది. ఆస్తమా రోగులకు మెగ్నీషియం లోపిస్తే ఈ సమస్య తీవ్రంగా మారుతుంది. ఆకుకూరలలోనూ, అవకాడో, అరటిపండ్లు, రాస్ బెర్రీస్, ఫిగ్స్ వంటి పండ్లలోనూ మెగ్నీషియం ఉంటుంది. అలాగే బ్రకోలీ, క్యాబేజి, పచ్చి బఠానీలు, మొలకలు వంటి వాటిలో కూడా ఇది దొరుకుతుంది. బ్రౌన్ రైస్, ఓట్స్, సీఫుడ్స్‌లో మెగ్నీషియం లభిస్తుంది. మెగ్నీషియం వెంటనే రావాలి అంటే ఒక కప్పు కాఫీ తాగాలి. చాక్లెట్ తిన్నా ఫలితం ఉంటుంది. మెగ్నీషియం లోపానికి వెంటనే జాగ్రత్తలు తీసుకోకుంటే అనారోగ్యానికి గురవుతారు.సబ్జా గింజలు, ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో కూడిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే మెగ్నీషియం లోపించదు. -
46లో అలా.. 64లో ఇలా.. అలా ఎలా?
కొన్ని కొన్ని విషయాలు డాక్టర్లు కాదు.. పేషేంట్లు చెబితేనే బాగా అర్థమవుతాయి. సరిగ్గా అలాంటి ప్రయత్నమే చేశారు ఇయాన్ క్లార్క్. ట్విట్టర్లో ఆయన పంచుకున్న అంశాలు .. కచ్చితంగా మనకు ఆరోగ్య రహస్యాలెన్నో చెబుతాయి. నాకప్పుడు 46 ఏళ్లు అధిక బరువుతో బాధ పడ్డాను ఏడాదికి మూడు సార్లు ఏదో ఒక జబ్బు వచ్చేది వీపరీతమైన నిరాశ, నిస్పృహాల్లో మునిగిపోయేవాడిని జుట్టు వేగంగా ఊడిపోయేది నాకిప్పుడు 64 ఏళ్లు ఆరోగ్యకరమైన బరువుతో ఉన్నా ఎలాంటి రోగాలు, జబ్బులు లేవు సంతోషంగా ఉన్నాను నాకు గుండు ఏమాత్రం కనిపించనంతగా పూర్తి స్థాయిలో వెంట్రుకలున్నాయి. అసలేం జరిగింది? ఈ 46 నుంచి 64 ఏళ్ల మధ్య కాలంలో నేను ఏం చేశాను? అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా మారడానికి నేను పడ్డ కష్టమేంటీ? ముందుగా నేను ఏ డాక్టర్‌ను కలవలేదు. ఎలాంటి మందులు వాడలేదు. అసలు హెల్త్ ఇన్సూరెన్సే తీసుకోలేదు. నేను చేసిన పనులేంటో మీరే చదవండి. 1. ఆహారంగా తాజా పళ్లు, కాయగూరలు నా ఆరోగ్యం బాగుండడానికి నేను చేసిన మొదటి పని ఆహారంగా తాజా పళ్లు, కాయగూరలు తీసుకోవడం. ఇది వారంలో ఒక రోజు చేసింది కాదు. రోజూ దీన్ని అనుసరించాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకోవద్దనే నియమాన్ని కఠినంగా అనుసరించాను. ల్యాబ్‌ల్లో తయారై బాక్సుల్లో అందంగా ప్యాక్ చేసి కనిపించే భోజనాన్ని పూర్తిగా దూరం పెట్టాను. నా చుట్టున్న మార్కెట్లో, పంట పొలాల్లో నాకు మట్టిలో కనిపించే ఆహార పదార్థాలను ఎంచుకున్నాను. సూపర్ మార్కెట్లో దొరికే వాటి కంటే ఈ పదార్థాల్లో ఎన్నో పోషకాలుంటాయి. 2. మాంచి నిద్ర పోవడం మొదలెట్టాను కచ్చితంగా నిద్ర కోసం సమయాన్ని కేటాయించుకున్నాను. సమయమయిందంటే చాలు.. ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలు ఆపేసి నిద్ర పోవడం అలవాటు చేసుకున్నాను. అంతేనా.. రోజులో కూడగా ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకున్నాను. దీని వల్ల మనసు ప్రశాంతంగా అనిపించింది. నా మెదడుకు ఎంతో రిలాక్స్ దొరికింది. వయస్సు మీద పడినట్టుగా అనిపించే కారకాలన్నీ దూరమయ్యాయి. అతి ముఖ్యమైన విషయం. నిద్ర రావడానికి టాబ్లెట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకండి. - మీరు పడుకునే చోట ఎలాంటి లైట్లు ఉండకూడదు - రూం టెంపరేచర్ తక్కువగా ఉంటే మంచిది - ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఉండకూడదు. 3. ఉపవాసం ఉపవాసం అతి ముఖ్యమైనది. ఎందుకంటే... మన భోజన షెడ్యూల్‌ను కచ్చితంగా అనుసరించడం.. అంటే ఒకే సమయంలో అల్పహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్ర భోజనం తీసుకోవడం చాలా మంచిది. సాయంత్రం అని ఎందుకంటున్నానంటే.. పడుకునేకంటే చాలా ముందుగా ఆహారం తీసుకోవడం వల్ల సులభంగా జీర్ణమవుతుంది. అలాగే అప్పుడప్పుడు చేసే ఉపవాసాల వల్ల శరీరం నుంచి యాంటీ అక్సిడెంట్స్ సులువుగా బయటికి వెళ్లిపోతాయి. ఇవి వెళ్లిపోవడం వల్ల కాన్సర్, అల్జీమర్స్, స్ట్రోక్, గుండె వ్యాధులు లాంటివి రావు. గత కొన్నాళ్లుగా నేను కేవలం రెండు పూటలకు మాత్రమే పరిమితమయ్యాను. అదీ కూడా సేంద్రీయ సాగు ద్వారా పండించిన పంటలనే ఎంచుకుంటున్నాను. ఈ అలవాట్ల వల్ల నా భోజనం ఖర్చు సగానికి సగం తగ్గింది. 4) మెగ్నిషియం సప్లిమెంట్ మన శరీరానికి మెగ్నిషియం చాలా అవసరం. కండరాలు, జాయింట్లు, రోగ నిరోధక శక్తి మెదడు, గుండె, ఇతర ముఖ్య శరీర భాగాలు వీటన్నింటికి మెగ్నిషియం అవసరం. మనం ఎలాంటి భోజనం తీసుకున్నా.. వీటికి సరిపడా మెగ్నిషియం రాదు. సాగులో మనం అనుసరిస్తున్న విధానాలు అలాంటివి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 75శాతం మంది మెగ్నిషీయం లోపంతో బాధపడుతున్నారు. అందుకే మెగ్నిషియంను అదనంగా సప్లిమెంట్ రూపంలో తీసుకుంటున్నాను. ఇవీ నేను అనుసరిస్తున్న విధానాలు. అందుకే 46 ఏళ్లలో ఉన్నప్పుడు ఎదుర్కొన్న సమస్యల కంటే 64 ఏళ్లలో ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాను. -
నిద్ర సరిగ్గా పట్టట్లేదా? ఈ మినరల్ లోపిస్తే అంతే! నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు పాడై!
Health Tips In Telugu: మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఎ, బి, సి, డి, ఈ, కె, బీకాంప్లెక్స్, బీట్వెల్వ్(బీ12) వంటి విటమిన్లు ఏవిధంగా అవసరమో, అదేవిధంగా క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ కూడా అవసరం. మన శరీరం ఫిట్‌గా ఉండాలంటే మెగ్నీషియం దేహంలో అధికంగా ఉండాలి. కార్బోహైడ్రేట్స్, కొవ్వు, ప్రోటీన్స్ నుంచి మనకు శక్తి వచ్చేలా చేయడంలో మెగ్నీషియం కీలకపాత్ర పోషిస్తుంది. ఇది మంచి శక్తితోపాటు చక్కటి నిద్ర పట్టేలా చేస్తుంది. రక్తంలో చక్కెరలను, హార్మోన్లను క్రమబద్ధీకరిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు చేకూర్చే మెగ్నీషియం తగినంత లేకపోతే కలిగే అనర్థాలేమిటో తెలుసుకుందాం. మెగ్నీషియం లోపిస్తే ఈ అనారోగ్యాలు వస్తాయి..!! ►సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో సరిపడా మెగ్నీషియం లేకపోతే కిడ్నీలు తమ దగ్గరున్న మెగ్నీషియం దేహానికి అందిస్తాయి. ►ఇలా ఎక్కువసార్లు మెగ్నీషియం కోసం కిడ్నీలపై ఆధారపడితే అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంతేకాకుండా కిడ్నీలు కూడా పాడవుతాయి. ►శరీరంలో తగినంత మెగ్నీషియం లేనప్పుడు మనకు కొన్ని సూచనలు వస్తాయి. వాటిని గమనిస్తే ముందుగానే ఈ లోపం గురించి తెలుసుకొని నివారించవచ్చు. లక్షణాలు..( Magnesium Deficiency Symptoms) ►మెగ్నీషియం లోపం ఉంటే ఆకలి వేయదు. ►వికారంగా ఉంటుంది. ►వాంతులు వస్తున్నట్లు అనిపిస్తుంది. ►నీరసంగా ఉంటారు. ► హార్ట్ బీట్‌రేట్ లో హెచ్చుతగ్గులు వస్తాయి. ► కళ్ళు మసక బారిన ఎక్కువగా ఉంటుంది. ►కండరాలలో నొప్పి వస్తుంది. ►ఒత్తిడి పెరుగుతుంది. ►నిద్ర సరిగ్గా పట్టదు. ►అధిక రక్తపోటు వస్తుంది. ►ఆస్తమాతో బాధపడేవారు మెగ్నీషియం లోపిస్తే ఈ సమస్య తీవ్రంగా మారుతుంది. మెగ్నీషియం ఉండే ఆహార పదార్థాలు..!! (Magnesium Rich Foods) ►ఆకుకూరలలోనూ, అవకాడో, అరటి పండ్లు, రాస్ బెర్రీస్, ఫిగ్స్ వంటి పండ్లలోనూ మెగ్నీషియం ఉంటుంది. ►అలాగే బ్రకోలీ, క్యాబేజి, పచ్చి బఠానీలు, మొలకలు వంటి వాటిలో కూడా ఇది దొరుకుతుంది. ►బ్రౌన్ రైస్, ఓట్స్, సీఫుడ్స్‌లో కూడా మెగ్నీషియం లభిస్తుంది. ►మెగ్నీషియం వెంటనే రావాలి అంటే ఒక కప్పు కాఫీ తాగాలి. ►డార్క్ చాక్లెట్ తిన్నా ఫలితం ఉంటుంది. ►మెగ్నీషియం లోపించినట్లు అనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే అనారోగ్యానికి గురవుతారు. ►సబ్జా గింజలు, ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో కూడిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువైతే..? ►మెగ్నీషియం ఎక్కువైనా కూడా ఇబ్బందులు తప్పవు. ► కడుపునొప్పి, డయేరియా వచ్చే అవకాశం ఉంది. ►మెగ్నీషియం ఎంత అవసరమో అంతే ఉండేలా చూసుకోవాలి. లోపించినా ప్రమాదమే; ఎక్కువైనా ప్రమాదమే కాబట్టి సమంగా ఉండేలా చూసుకోవాలి. చదవండి: Vitamin D Deficiency: విటమిన్- డి.. ఆ హార్మోన్ ఉత్పత్తికి ఇది అవసరం! Vitamin C Deficiency: విటమిన్ ‘సి’ లోపిస్తే అంతే సంగతులు.. ఇవి తింటే మేలు! -
Summer Drinks: మ్యాంగో మస్తానీ.. ఇందులోని సెలీనియం వల్ల..
Summer Drinks- Mango Mastani Recipe: మంచి ఎండలో బయట నుంచి ఇంటికి వచ్చాక మ్యాంగో మస్తానీ తాగితే దాహం తీరుతుంది. ఎంతో రుచిగా ఉండే ఈ మస్తానీ తాగే కొద్ది తాగాలనిపిస్తుంది. ఈ ఒక్క జ్యూస్ తాగడం వల్ల.. విటమిన్ ఎ, బి2, బి6, బి12, సి, డి, క్యాల్షియం, అయోడిన్, ఫాస్ఫరస్, పొటాషియం, పీచుపదార్థం, ఫోలేట్, మెగ్నీషియం, మ్యాంగనీస్, సెలీనియంలు శరీరానికి పుష్కలంగా అందుతాయి. యాంటీ ఆక్సిడెంట్ అయిన సెలీనియం రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో తోడ్పడుతుంది. మ్యాంగో మస్తానీ తయారీకి కావాల్సినవి: మామిడి పండు ముక్కలు – కప్పు, చల్లటి క్రీమ్ మిల్క్ – కప్పు, జాజికాయ పొడి – చిటికెడు, ఐస్‌క్యూబ్స్ – పావు కప్పు, పంచదార – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, ఐస్‌క్రీమ్ – రెండు స్కూపులు, చెర్రీ, పిస్తా, బాదం పప్పు, టూటీప్రూటీ, మామిడి ముక్కలు – గార్నిష్‌కు సరిపడా, ఉప్పు – చిటికెడు. మ్యాంగో మస్తానీ తయారీ విధానం: ►మామిడి పండు ముక్కల్ని బ్లెండర్లో వేయాలి. ►దీనిలో పంచదార, జాజికాయ పొడి, ఉప్పు వేసి ప్యూరీలా గ్రైండ్ చేయాలి. ►ఈ ప్యూరీలో పాలు, ఐస్‌క్యూబ్స్ వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. ►ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంగుళం గ్యాప్ ఉండేలా గ్లాసులో పోయాలి. ►గ్లాసులో గ్యాప్ ఉన్న దగ్గర ఐస్‌క్రీమ్, మామిడి పండు ముక్కలు, డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. వేసవిలో ట్రై చేయండి: Summer Drinks: రోజు గ్లాసు బీట్రూట్ – దానిమ్మ జ్యూస్ తాగారంటే.. -
Healthy and Shiny Hair: జుట్టు వేగంగా పెరగాలంటే ఈ విత్తనాలు తప్పక తినాలి..!
నల్లని ఒత్తైన జుట్టు అందరికీ ఇష్టమే! ఐతే రోజువారీ పనుల్లో పడి కేశ సౌందర్యానికి తగినంత శ్రద్ధ తీసుకోవడం కుదరట్లేదనేది ఎక్కువ మంది చెప్పే కారణం. జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే కేవలం ఆరోగ్య ఆహారం మాత్రమే తీసుకుంటే జుట్టు సంబంధిత సమస్యలు దూరం కావు. అవసరమైన నూట్రీషన్లు, ప్రొటీన్లు, ఫ్యాటీ ఆమ్లాలు కూడా అందుతున్నాయో లేదో గమనించుకోవాలి. ఇవన్నీ కేవలం పండ్లలో మాత్రమే దొరుకుతాయని అనుకుంటే పొరపాటే. రకరకాల విత్తనాల్లో కూడా ఈ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. వీటిని పచ్చిగా లేదా ఉడికించి ఎలా తిన్నా మీ జుట్టు ఒత్తుగా పెరగడానికి తోడ్పడతాయి. వెంట్రుకల ఆరోగ్యనికి మేలు చేసే విత్తనాలను నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.. అవిసె గింజలు ఈ గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. జుట్టు రాలడాన్ని నివారించి, మాడు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. వీటిల్లో ప్రొటీన్లు, మ్యాగ్నీషియం, పొటాషియం, జింక్ కూడా పుష్కలంగా ఉంటుంది. నువ్వులు నల్లని లేదా తెల్లని నువ్వుల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫ్యాటీ ఆమ్లాలు వంటి పోషకాలు నిండుగా ఉంటాయి. ఇవి జుట్టు పెరగడాన్ని ప్రోత్సహించి, సహజంగా మెరిసేలా చేస్తుంది. చదవండి: Viral: సింహాన్ని పరుగులు పెట్టించిన భౌభౌ!! పొద్దు తిరిగుడు గింజలు పొద్దు తిరిగుడు గింజల్లో విటమిన్ ‘ఇ’తోపాటు ఇతర పోషకాలు చర్మ, జుట్టు సంబంధిత సమస్యల నివారణలో కీలకంగా వ్యవహరిస్తాయి. గుమ్మడి విత్తనాలు జుట్టు సమస్యలను ఎదుర్కొవడంలో గుమ్మడి విత్తనాల తర్వతే ఏదైనా అని చెప్పవచ్చు. గుమ్మడి విత్తనాలను పోషకాల గని అనికూడా అంటారు. దీనిలో జింక్, మాగ్నీషియం, కాల్షియం, ఐరన్.. వంటి ఎన్నోఖనిజాలు ఉంటాయి. వెంట్రుకలు చిట్లడాన్ని, ఊడటాన్ని నివారిస్తుంది కూడా. చియా విత్తనాలు వీటిల్లో ఫ్యాటీ ఆమ్లాలు, ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లతోపాటు ముఖ్యమైన ఖనిజాలు జుట్టు ఆరోగ్యం పెరగడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా చియా విత్తనాలల్లోని ఐరన్, సెలీనియం వెంట్రుకల కుదుళ్లను బలపరచి, వేగంగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి. చదవండి: Health Tips: గుండె సమస్యలను పారదోలడంలో ఇది బెస్ట్! -
Health Tips: తిలలు తింటే ఎంతో మేలు.. అయితే, అలర్జీలు రావచ్చు అతి వద్దు!
Sesame Seeds Benefits: నవధాన్యాలలో నువ్వులు ఒకటి. సంస్కృతంలో తిలలు అంటారు. ఈ నూనెను చాలా వంటలలో ఉపయోగిస్తారు. వీటిని ఆహారంలో భాగంగా తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ►ముఖ్యంగా ఊరగాయ పచ్చళ్లలో నువ్వుపప్పునూనె వాడటం వల్ల అవి చాలా కాలం నిల్వ ఉండటమేగాక రుచికరంగా కూడా ఉంటాయి. దీపారాధనకు నువ్వుల నూనె శ్రేష్ఠమని పెద్దలు చెబుతారు. నువ్వులను దంచి చిమ్మిలి, వేయించి నువ్వుండలు మొదలైన మిఠాయిలు తయారు చేస్తారు. ►బ్రెడ్‌లోనూ, బర్గర్లలోనూ, వివిధ రకాల వంటకాలలో, కూరలలోనూ వేస్తారు. వేయించి, పొడికొడతారు. పచ్చడి కూడా చేస్తారు. ►నువ్వులలోని మెగ్నీషియం క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇందులోని జింక్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! ►నువ్వులు ఒమేగా–3, ఒమేగా –6, ఒమేగా– 9 ఆమ్లాలను కలిగి ఉండి, జుట్టు పెరుగుదలకు దోహద పడతాయి. ►గ్లాసు పాలలో కన్నా, చెంచా నువ్వులలో ఎక్కువ క్యాల్షియం ఉంటుందని రుజువైంది. నువ్వులు రుచిగా ఉంటాయి కానీ, వీటివల్ల కొందరిలో అలర్జీ కలగవచ్చు. ►అలాగే, ఇవి అమితంగా వేడి చేసే గుణం కలిగి ఉంటాయి కాబట్టి వేసవిలో ఎక్కువ తినరాదు. ►అయితే శీతాకాలంలో నువ్వులను వాడటం వల్ల శరీరానికి తగిన ఉష్ణోగ్రత అందుతుంది. అందుకే శీతాకాలంలో సంక్రాంతి పండుగకు నువ్వుల ఉండలను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవడం, ఈ పండుగ ప్రత్యేకమైన అరిశలకు నువ్వులను అద్దడం ఆచారంగా మారింది. చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు.. -
‘సూపర్’ గ్రహాలపై జీవ సమ్మేళనాలు!
మాస్కో: సౌర కుటుంబం అవతల సూపర్ ఎర్త్‌గా పిలిచే గ్రహాల (భూమికన్నా ఐదు నుంచి పది రెట్లు పెద్దవి)పై జీవానికి అనుకూలమైన పరిస్థితులను కల్పించే రసాయన సమ్మేళనాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మాస్కో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ టెక్నాలజీ లేబొరేటరీ ఆఫ్ కంప్యూటర్ డిజైన్ హెడ్ ఆర్టెమ్ ఒగనోవ్ ఆధ్వర్యంలో ఈ అంశంపై పరిశోధన చేశారు. ‘సూపర్’ గ్రహాల్లో అత్యధిక పీడనం ఉంటుంది. దీంతో సిలికాన్, ఆక్సిజన్, మెగ్నీషియం మూలకాల మధ్య రసాయన చర్యలు జరిగి సమ్మేళనాలు ఏర్పాడతాయని, ఈ పరిస్థితులు జీవం మనుగడకు అనుకూల పరిస్థితిని కల్పిస్తున్నాయని పరిశోధకులు వెల్లడించారు. -
పత్తిలో మెగ్నీషియం, జింక్ లోపం
మార్కాపురం : జిల్లాలో పత్తి పంట(వేసవి పత్తి+ఖరీఫ్ పత్తి) 77 వేల హెక్టార్లలో సాగవుతోంది. వేసవిలో సాగు చేసిన పత్తి దిగుబడి ప్రారంభమైంది. అయితే కొన్ని ప్రాంతాల్లోని పత్తి ఆకులు కుంకుమ రంగులోకి మారి పొలం మొత్తం ఎర్రగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని మార్కాపురం వ్యవసాయాధికారి డీ బాలాజీనాయక్ దృష్టికి తీసుకెళ్లగా మెగ్నీషియం, జింక్ లోపం వల్లే ఆకులు ఎర్రగా కనిపిస్తున్నాయని వివరించారు. సూక్ష్మ ధాతు లోపాలను నివారించుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చని తెలిపారు. ‘పత్తి పంట 90 నుంచి 120 రోజుల దశల్లో ఉంది. వర్షపాతం ఎక్కువైనా, వర్షం లేకపోయినా పత్తిలో ఈ లోపం కనిపిస్తుంది. ఆకులు కుంకుమ రంగులోకి మారి పత్ర హరితాన్ని కోల్పోతాయి. ఎరుపుగా మారిన ఆకు పచ్చగా మారి రాలిపోతుంది. పక్వానికి రాని కాయలు పగలడం, మొక్క ఎత్తు పెరగకపోవడం, ఉన్న పత్తి బరువు తగ్గిపోవటం జరుగుతుంది. పూత, పిందె రాలిపోతాయి. దీని వల్ల పంట దిగుబడి 60 నుంచి 80 శాతం తగ్గిపోతుంది. మోతాదుకు మించి నత్రజని, భాస్వరం, పొటాష్ వాడటం, సేంద్రియ ఎరువులు వాడకపోవడం వల్ల జింక్, మెగ్నీషియం లోపం కనిపిస్తుంది. జింక్ లోపం ఉంటే ఆకుల మధ్య భాగం పసుపు పచ్చగా మారి పత్రహరితాన్ని కోల్పోతాయి. మొక్క ఆహారం తయారు చేసుకునే శక్తి కోల్పోతుంది. కొమ్మలు రాలిపోయి తక్కువ పూత వస్తుంది. పిందె పెరుగుదల ఉండదు. నివారణకు ఎకరాకు 20 కిలోల మెగీషియం సల్ఫేట్ భూమిలోగానీ లేదా పైపాటుగా ఎకరాకు 2 కిలోల మెగ్నీషియం సల్ఫేట్, ఈడీటీఏ 12 శాతం జింక్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. దీంతో కొత్తగా వచ్చే ఆకుల్లో మెగ్నీషియం లోపం ఉండదు’. -
సూక్ష్మలోపం.. భారీ నష్టం!
సూక్ష్మధాతు లోపం వల్ల బొప్పాయి (పొప్పడి) పంట దిగుబడి తగ్గుతుంది. అవగాహన లోపం వల్ల దీన్ని సవరించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో దిగుబడి తగ్గటంతో పాటు వివిధ రకాల తెగుళ్ల బారిన పడి పంట పూర్తిగా పాడవుతుంది. సమస్యను సకాలంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపడితే ధాతులోపాలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. పంటకు ప్రధానంగా జింక్, మెగ్నీషియం, బోరాన్, ఐరన్ ధాతు లోపాలు వస్తుంటాయి. ఉద్యాన, వ్యవసాయశాఖ అధికారుల సూచనలు పాటిస్తే దీన్ని అధిగమించడం సులువే. జింక్ లోపం లక్షణాలు ఆకు కణజాలం పూర్తిగా ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. ఈనెల మధ్యభాగం పసుపు పచ్చరంగులోకి మారి వాడిపోయినట్లుగా ఉంటుంది. పిందె సైజు పెరగదు. దిగుబడి తగ్గుతుంది. నాణ్యత, రుచి లోపిస్తుంది. నివారణ... జింక్‌లోపం నివారణకు లీటరు నీటిలో 2 గ్రాముల జింక్ సల్ఫేట్ మరియు 10 గ్రాముల యూరియా ద్రావణాన్ని కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి. మెగ్నీషియం లోపిస్తే మెగ్నీషియం లోపం వల్ల ఆకు పూర్తిగా మూడతపడి తిరగబడుతుంది. దీంతో ఆకు మొత్తం పేలవంగా మారుతుంది. మొక్క ఎదుగుదల లోపిస్తుంది. నివారణ... లీటరు నీటికి 2 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ మరియు 10 గ్రాముల యూరియా కలిపిన ద్రావణాన్ని మొక్కలపై పిచికారీ చేయాలి. ఐరన్ లోపంతో... ఆకులు బంగారు వర్ణంలోకి మారుతాయి. ఈనెల మధ్య భాగం తెల్లగా మారుతుంది. ఐరన్ లోపం ఎక్కువైతే ఈనెలు, ఈనెల మధ్యభాగం పూర్తిగా తెలుపు రంగులోకి మారుతుంది. నివారణ... లీటరు నీటికి 2 గ్రాముల ఫైసల్ఫేట్ మరియు 1గ్రాము నిమ్మ ఉప్పు కలిపిన ద్రావణాన్ని స్ప్రేచేయాలి. బోరాన్ లోపం... బొప్పాయి ఆకులు పూర్తిగా జీవం కోల్పోతాయి. పిందె తక్కువగా కడుతుంది. పిందె రాలిపోవడం ప్రారంభమవుతుంది. కాయలపై మచ్చలు ఏర్పడుతాయి. కాయ రూపం మారుతుంది. నివారణ... దీన్ని నివారించేందుకు లీటర్ నీటిలో 4గ్రాముల ఫార్ముల-4 అనే మందును పిచికారీ చేయాలి. -
బంగాళ దుంప తింటే బీపీ తగ్గుతుందా?
రూట్ ఫ్యాక్ట్స్ అధిక రక్తపోటుతో బాధపడుతున్న వాళ్లు రోజూ ఒక మీడియం సైజు ఉడికించిన బంగాళదుంపను తింటుంటే రక్తపోటు అదుపులోకి వస్తుంది. డయేరియాతో బాధపడుతున్నప్పుడు ఆహారంలో ఉడికించిన బంగాళదుంప తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే మితిమీరి తింటే అదే విరేచనాలకు కారణం అవుతుంది కూడా. బంగాళదుంపలో క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోధించే శక్తి ఉంటుంది. బంగాళదుంపలో బీ కాంప్లెక్స్, సి విటమిన్లతోపాటు ఖనిజలవణాలు, కొద్ది మోతాదులో పీచు, కెరటినాయిడ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంతోపాటు శరీరం లోపలి అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయులను పెంచుతాయి. కాబట్టి స్థూలకాయులు, షుగర్ ఉన్నవారు బంగాళదుంప చాలా పరిమితంగా తీసుకోవడమే మంచిది. పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ వంటి సూక్ష్మ పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. -
కీరదోస తింటే...
కాయ‘ఫలాలు’ కీరదోసలో 96 శాతం నీరే. ఈ నీరు దేహాన్ని డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది. దేహంలోని విషతుల్యమైన వ్యర్థాలను బయటకు పంపేస్తుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, సోడియం ఉంటాయి. ఇవి రక్తపోటును క్రమబద్ధీకరిస్తాయి. హైబీపీ అదుపులోకి రావాలంటే రోజూ ఒక కీరదోస కాయను తినడం చక్కటి మార్గం. ఇందులోని ‘కె’ విటమిన్ ఎముకలు, కీళ్ల పనితీరును మెరుగుపరుస్తుంది. న్యూరాన్ల పనితీరు మెరుగవడంతో అల్జీమర్స్ (మతిమరుపు) రాదు. కీరదోస... గ్యాస్ట్రిక్ అల్సర్ నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది, జుట్టు పెరగడానికి దోహదం చేస్తుంది. గోళ్లు పెళుసుబారడాన్ని తగ్గిస్తుంది. కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. కడుపులో పురుగులను నిర్మూలిస్తుంది. చిగుళ్ల సమస్యలను, మూత్ర సంబంధ సమస్యలను నివారిస్తుంది. ప్యాంక్రియాస్ పనితీరులో లోపం వల్ల ఎదురైన సమస్యలను కీరదోస పరిష్కరిస్తుంది. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు రోజూ తినవచ్చు. బరువు తగ్గడానికి కూడా కీరదోస దోహదం చేస్తుంది. కాబట్టి అధికబరువు, స్థూలకాయంతో బాధపడేవారు కూడా హాయిగా తినవచ్చు.