కీరదోస తింటే... | Kiradosa eating ... | Sakshi
Sakshi News home page

కీరదోస తింటే...

Published Mon, May 5 2014 11:07 PM | Last Updated on Sat, Sep 2 2017 6:58 AM

కీరదోస తింటే...

కాయ‘ఫలాలు’
 
కీరదోసలో 96 శాతం నీరే. ఈ నీరు దేహాన్ని డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది. దేహంలోని విషతుల్యమైన వ్యర్థాలను బయటకు పంపేస్తుంది.
 
ఇందులో పొటాషియం, మెగ్నీషియం, సోడియం ఉంటాయి. ఇవి రక్తపోటును క్రమబద్ధీకరిస్తాయి. హైబీపీ అదుపులోకి రావాలంటే రోజూ ఒక కీరదోస కాయను తినడం చక్కటి మార్గం.
 
ఇందులోని ‘కె’ విటమిన్ ఎముకలు, కీళ్ల పనితీరును మెరుగుపరుస్తుంది. న్యూరాన్ల పనితీరు మెరుగవడంతో అల్జీమర్స్ (మతిమరుపు) రాదు.
     
 కీరదోస... గ్యాస్ట్రిక్ అల్సర్ నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది, జుట్టు పెరగడానికి దోహదం చేస్తుంది. గోళ్లు పెళుసుబారడాన్ని తగ్గిస్తుంది. కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. కడుపులో పురుగులను నిర్మూలిస్తుంది. చిగుళ్ల సమస్యలను, మూత్ర సంబంధ సమస్యలను నివారిస్తుంది.
     
ప్యాంక్రియాస్ పనితీరులో లోపం వల్ల ఎదురైన సమస్యలను కీరదోస పరిష్కరిస్తుంది. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు రోజూ తినవచ్చు.
     
బరువు తగ్గడానికి కూడా కీరదోస దోహదం చేస్తుంది. కాబట్టి అధికబరువు, స్థూలకాయంతో బాధపడేవారు కూడా హాయిగా తినవచ్చు.   
 

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement