sodium
-
ఈ మోతాదులో ఉప్పు తీసుకుంటే గుండె, కిడ్నీ వ్యాధులను నివారించొచ్చు..!
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సిఫార్సు చేసిన మోతాదులో ఉప్పు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చని మోడలింగ్ అధ్యయనం పేర్కొంది. ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన మోతాదులో ఉప్పు తీసుకోవడం వల్ల పదేళ్లలో గుండె, మూత్రపిండాలకు సంబంధించిన దీర్ఘకాలికి వ్యాధుల కారణంగా సంభవించే..దాదాపు మూడు లక్షల మరణాలను నివారించొచ్చని పేర్కొంది. అధిక స్థాయి సోడియం అనేది ప్రధాన ఆహార ప్రమాదాల్లో ఒకటి. అధిక ఆదాయ దేశాల్లో సోడియంకి సంబంధించిన ప్యాక్ చేసిన ఆహారాలు ప్రధాన వనరు. ఇక తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో వీటి వినియోగం మరింత ఎక్కువగా ఉండటం బాధకరం. ముఖ్యంగా భారతదేశంలో ఉప్పు తగ్గించి తీసుకునేలా సరైన జాతీయ వ్యూహం లేదని హైదరాబాద్‌లోని ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ పరిశోధకులు చెబుతున్నారు. ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన ఉప్పు ఒక టీ స్పూన్ లేదా ఐదు గ్రాముల కంటే తక్కువగా ఉంటుందని మోడలింగ్ అధ్యయనం పేర్కొంది. ఈ మోతాదులోనే ప్రతి రోజూ వినియోగించినట్లయైతే దాదాపు 17 లక్షల కార్డియోవాస్కులర్ సంఘటనలు, గుండెపోటులు, స్ట్రోక్‌లతో సహా క్రానిక్ కిడ్న వ్యాధులను నివారించడమే గాక గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందగలమని పరిశోధన వెల్లడించింది. ముఖ్యంగా భారతదేశంలో పూర్తిస్థాయిలో ఇది అమలవ్వాలని పేర్కొంది. ఇక్కడి ప్రజలు ఎక్కువగా ప్యాక్ చేసిన ఆహారాలను ఉపయోగిస్తున్నట్లు పరిశోధన వెల్లడించింది. ఈవిషయమై ఆహార తయారీదారులకు అవగాహన కల్పించడం, పాటించేలా చేయడం అత్యంత ముఖ్యమని తెలిపింది. కాగా, అధిక స్థాయిలో సోడియం తీసుకోవడం తగ్గించేలా ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా 2018 నుంచి అవగాహన కార్యక్రమాలు ప్రారంభించింది. అయితే ప్రస్తుతం మాత్రం ఈట్ రైట్ ఇండియా అనే జాతీయ కార్యక్రమం ద్వారా సోడియంను తగ్గించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుందని పరిశోధకులు తెలిపారు.(చదవండి: వాట్ ఏ రికార్డ్!..గుమ్మడికాయ పడవతో 26 గంటలు..) -
ఇకపైన పొటాషియం ఉప్పు వాడకం?!
మానవ జీవితంలో ప్రాధాన్యం ఉన్న లవణం ఉప్పు (సోడియం క్లోరైడ్). దీన్ని ఆహారంలో తీసుకునే పరిమాణాన్ని బట్టి మన ఆరోగ్య పరిస్థితి ఆధారపడి ఉంటుందనేది ప్రచారంలో ఉన్న విషయం. ఒకప్పుడు అయోడిన్ అనే సూక్ష్మ పోషకం లోపం కారణంగా చాలామంది ఆరోగ్య సమస్యను ఎదుర్కొన్నందున అయోడిన్ కలిపిన ఉప్పును వాడుతూ ఆ సమస్య నుంచి బయటపడ్డారు. ఇప్పుడు మరో కొత్త విషయాన్ని కనుగొన్నారు. పొటాషియాన్ని తగినంతగా తీసుకోకపోవడం వల్ల బీపీ (బ్లడ్ ప్రెషర్) పెరుగుతున్నదనీ, అందువల్ల ఉప్పులో పొటాషియంను కలిపి తీసుకోవాల్సిన అవసరం ఉందనీ పరిశోధకుల సలహా.ప్రజల్లో అయోడిన్ లోపాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వపరంగా నిర్ణయాలు జరిగాయి. పరిశ్రమల వారు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కనుక ప్రపంచంలో అందరికీ ఉప్పుతో పాటు అయోడిన్ కూడా అందింది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఒక ఆరోగ్య సమస్యకు అన్ని దేశాల వారూ కలిసి సమాధానం తెలుసుకుని అమలు చేయగలిగారు. మరి అదే విధంగా పొటాషియం లోపాన్ని తగ్గించడానికి ఇంతటి కృషి ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందా? మనకు తెలిసి హైపర్ టెన్షన్, లేదా అధిక రక్తపోటు అనేది పెద్ద ఆరోగ్య సమస్య. అసలు నిజానికి అనారోగ్యాలు, మరణాలకు ఇదే ఎక్కువగా కారణంగా ఉంటున్నది. అందుకు కారణం ఏమిటి అని వెతికితే ఉప్పు ఎక్కువగా తినడం అని తెలిసిపోయింది. ఇంకేముంది, అందరూ వీలైనంత తక్కువగా ఉప్పు తింటున్నారు. చాలామంది కారం కూడా తినడం లేదు. మొత్తానికి తిండి తీరు మారిపోయింది. ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉన్నది. ఉప్పు ప్రభావం అందరి మీద ఉంటుంది అనడానికి లేదు. ప్రభావం కనిపించే 50 శాతం మందిలో మాత్రం అది సూటిగా తెలిసిపోతుంది. ఉప్పు ప్రభావం మీద జన్యుపరంగా వచ్చే లక్షణాల పాత్ర ఉందని తెలిసింది. పరిశోధకులు అంతా పూనుకుని ఈ విషయం గురించి ఎన్నో సంగతులను కనుగొన్నారు. ఇప్పుడు అందరూ పొటాషియం కలిపిన ఉప్పు తింటే ఈ బ్లడ్ ప్రెషర్ సమస్య తగ్గుతుందని అంటున్నారు. అంటే మనం తినే తిండి తీరు మరొకసారి మారిపోతుందన్నమాట. ఏదో ఒక పేరున అందరూ సోడియం బాగా తింటున్నారు. అవసరం కన్నా ఎక్కువ తింటున్నారు. కనుక రక్తపోటు పెరుగుతున్నది. ఎవరికీ ప్రయత్నించి పొటాషియం తినడం అన్నది తెలియదు. శరీరానికి అవసరమైనంత పొటాషియం తినేవారు మొత్తం జనాభాలో 14 శాతం మాత్రమే ఉన్నారని పరిశోధకులు గుర్తించారు. సోడియం పూర్తిగా తినకుండా ఉండడం కుదరదు. అదే సమయంలో శరీరంలో సోడియం – పొటాషియం ఉండవలసినంత ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. ఈ సంగతి ఎవరికీ అంత వివరంగా తెలియదు. అంటే మరోసారి ప్రభుత్వాలు, పరిశ్రమల వారు పరిస్థితిని గుర్తించి పనిలోకి దిగవలసిన సమయం వచ్చింది. ఒకప్పుడు ఉప్పుతో కలిపి అయోడిన్ తిన్నట్టే, ఇప్పుడు ఉప్పుతోనూ, మరిన్ని రకాలుగానూ సోడియం బదులు పొటాషియం తీసుకోవాలి. ఈ మార్పు వస్తే వెంటనే బ్లడ్ ప్రెషర్ అంటే రక్త పోటు అనే సమస్యకు దానంతట అదే సమాధానం దొరుకుతుంది. కనుక ప్రస్తుతం మన పరిస్థితిని గుర్తించుకొని వెంటనే అదనంగా పొటాషియం తీసుకోవడం మొదలుపెట్టాలి. పరిశ్రమల వారు ఉప్పుతోనూ, తిండి పదార్థాలతోనూ పొటాషియం అదనంగా అందించే పరిస్థితి లేకపోతే ప్రభుత్వాలు రంగంలోకి దిగాలి. రక్తపోటు పెరగడం ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలకు ప్రపంచం తల్లడిల్లి పోతున్నది. సోడియంతో పాటు పొటాషియం తిన్నందుకు రుచిలో ఎటువంటి తేడా కూడా రాదు. ఇది అందరూ గుర్తించవలసిన మరొక విషయం. సిడ్నీ (ఆస్ట్రేలియా)లో ఉన్న ‘జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్’ అనే సంస్థలో పనిచేస్తున్న బ్రూస్ నీల్ పొటాషియం వాడుక మంచిదని గట్టిగా చెబుతున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. మనం తినే తిండిలో ఎంత పొటాషియం ఉంది అని గుర్తించడం కష్టం. అందరూ అవసరమైన దానికి తక్కువ తీసుకుంటున్నారు అన్నది మాత్రం నిజం. కనీసం 3.5 గ్రాముల పొటాషియం శరీరానికి అందాలి. అందుకోసం అందరూ పండ్లు ఎక్కువగా తినాలట! అన్నట్టు అరటిపళ్ళలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. బొప్పాయి పళ్లలో కూడా ఉంటుంది. ఏదో రకంగా పొటాషియం శరీరానికి అందే పద్ధతులు రావాలి. త్వరలోనే రక్తపోటు సమస్య తగ్గుతుందని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. డా. కె.బి. గోపాలం వ్యాసకర్త సైన్స్ విషయాల రచయిత ‘ 98490 62055 -
అది ఎర్రటి రంగేసిన ఆకర్షణీయమైన వంటకమా? అయితే డేంజరే!
కొన్ని టేక్–అవే సెంటర్లలో ఆకర్షించడానికి బయటికి కనిపించేలా అమర్చే చికెన్ ఎర్రటి రంగులో ఉండటం చూసే ఉంటారు. అలాగే చిల్లీ–చికెన్, చికెన్ మంచూరియా, డ్రై చికెన్ వంటివి మాత్రమే కాకుండా మరికొన్ని మాంసాహారాలనూ ఆకర్షణీయంగా ఉంచడంతో పాటు ఒక రకమైన ఫ్లేవర్ వచ్చేందుకు అడెటివ్ సోడియమ్ నైట్రేట్ అనే రంగునిచ్చే పదార్థాన్ని వాడుతారు. ఇది ఒక నైట్రేట్ సాల్ట్. ఇది కంటికి ఇంపుగా కనిపించేందుకూ, ఫ్లేవర్ కోసం మాత్రమే కాకుండా.. ఓ ప్రిజర్వేటివ్‌గా కూడా ఉపయోగిస్తారు. అయితే చికెన్... ఇతర మాంసాహారాలు ప్రోటీన్లతో కూడిన మంచి పోషకాహారాలే అయినప్పటికీ సోడియమ్ నైట్రేట్ కారణంగా అది హానికరంగా మారే అవకాశం ఎక్కువ. నిజానికి ఆ రకం సోడియమ్ సాల్ట్ ఒక క్యాన్సర్ కారకం. అది బ్లడ్క్యాన్సర్స్ (లుకేమియా), కోలోరెక్టల్ క్యాన్సర్‌ను, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్ వంటి వాటికి దారితీసే ముప్పు ఉంది. అందుకే బేకరీలలో, హోటళ్లలో ఇలాంటి ఎర్రగా ఆకర్షణీయంగా కనిపించే మాంసాహార పదార్థాలకు బదులుగా ఏ రంగూ, అడెటివ్ లేని మామూలు వాటినే తీసుకోవాలి. -
దాహమైనపుడు, దాహం తీరేంత వరకే నీళ్లు తాగాలి.. లేదంటే అంతే సంగతులు!
నీళ్లు ఎంతగా తాగితే ఆరోగ్యం కూడా అంతగా బాగుంటుందని చాలా మంది చెబుతుంటారు. ఇందుకు కారణం చెబుతూ... మనం నీళ్లు తాగుతున్న కొద్దీ దేహంలోని వ్యర్థాలు కొట్టుకుపోతాయనీ, మలినాలు కడిగినట్లుగా అవుతుంటాయని అంటుంటారు. కానీ నీళ్లు తాగడం అన్నది మన దాహం మీద ఆధారపడి ఉంటుంది. మనకు ఎంత దాహం వేస్తే అన్ని నీళ్లే తాగాలి. ఓ మోస్తరుగా కాస్త ఎక్కువైనా పర్లేదుగానీ... మరీ ఎక్కువగా తాగడం ప్రమాదమే అంటున్నారు వైద్యనిపుణులు. అంతేకాదు... అతిగా తాగితే నీళ్లతో కూడా ఆరోగ్యం చెడే ప్రమాదం ఉంటుందంటున్నారు. అంటే దాహం కొద్దీ నీరు మాత్రమే ఆరోగ్యకరం అన్నమాట. అదెలాగో చూద్దాం. నీళ్లు ప్రాణాధారం. ఆహారం లేకుండానైనా ఓ వ్యక్తి మూడు వారాలు బతకగలడేమోగానీ... నీళ్లు లేకుండా ఏ వ్యక్తి కూడా రెండు, మూడు రోజులకు మించి బతకలేడు. దేహంలోని అనేక కీలకమైన జీవక్రియలకు నీళ్లు ఉపయోగపడతాయి. దేహం ఒక నియమిత పద్ధతిలో తన అవసరాల కోసం నీటిని సమర్థంగా వాడుకుంటూ ఉంటుంది. ఉదాహరణకు మన శరీర ఉష్ణోగ్రతను నిలకడగా ఉంచడానికి నీళ్లు కావాలి. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు దేహ ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడానికి వీలుగా చెమట పడుతుంది. అది మనలో ఉన్న లేటెంట్ హీట్‌ను గ్రహించి, ఆవిరైపోయే క్రమంలో శరీర ఉష్ణోగ్రతను ఎప్పుడూ ఒకేలా ఉంచడానికి ఈ నీరు దోహదపడుతుంది. అనేక కార్యకలాపాలకు కీలకం... నీరు అలాగే రక్తప్రసరణ సరిగా జరగడం కోసం, మల విసర్జన సాఫీగా జరగడానికి, మూత్ర విసర్జన రూపంలో దేహంలోని వ్యర్థాలూ, మలినాలను బయటకు పంపడానికి నీరు చాలా కీలక భూమిక పోషిస్తుంది. దేహానికి అవసరమైన మేర నీరు తాగడం మంచిది. ఓ మేరకు కాస్త ఎక్కువైనా పర్లేదుగానీ... మరీ ఎక్కువైనప్పుడు... శరీరం తాను చేయాల్సిన కీలకమైన పనులను పక్కనబెట్టి దేహంలో ఎక్కువగా ఉన్న నీటిని ఎలా బయటకు పంపాలా అని చూస్తుంది. అందుకే మూత్రరూపంలో బయటకు పంపుతుంది. అందుకే ఎంత ఎక్కువగా నీరు తాగితే అంతగా మూత్రానికి వెళ్లాల్సిన అవసరం వస్తుంటుంది. ఈ క్రమంలో కేవలం నీరు మాత్రమే బయటకు పోదు. దాంతోపాటు దేహానికి అవసరమైన విలువైన సోడియమ్, పొటాషియమ్ లాంటి లవణాలూ విసర్జితమవుతుంటాయి. సోడియం, పొటాషియమ్ వంటివి మన దేహంలో ఏ భాగంలోని కండరాలు సక్రమంగా పనిచేయడానికి చాలా అవసరం. నీరు బయటకు ఎక్కువగా పోతున్నప్పుడు తనతో పాటు లవణాలను తీసుకెళ్లడం వల్ల మెదడు నుంచి కండరాలకు వెళ్లాల్సిన ఆదేశాలు చక్కగా అందక... కండరాలు బిగుసుకుపోతాయి. మూత్రవిసర్జన ఎక్కువగా జరిగేందుకు మందులు (డై–యూరిటిక్స్) వాడుతూ హైబీపీ కోసం మాత్రలు వాడే వారిలోనూ, ఉప్పు చాలా తక్కువగా వాడేవారు, ఎక్కువగా చెమటపట్టే స్వభావం కలిగినవారు... వీళ్లంతా నీరు చాలా ఎక్కువగా తాగితే ‘డల్యూషనల్ హైపోనేట్రీమియా’ గురయ్యే అవకాశాలు ఎక్కువ. హై–బీపీ బాధితుల్లోనూ, వయసుపైబడ్డవాళ్లలోనూ, ఆటగాళ్లలోనూ ఈ పరిణామాలు చోటు చేసుకోడాన్ని అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ (ఏసీఎస్ఎమ్), కెనెడియన్ న్యూట్రిషన్ సొసైటీ వంటి పలు ఆరోగ్య సంస్థలు గుర్తించాయి. ∙ వాటర్ ఇంటాక్సికేషన్ తప్పకపోవచ్చు... శరీర అవసరాలకంటే ఎక్కువగా నీరు తాగితే ఒక్కోసారి అది మన జీవకణాల్లోకి చొచ్చుకుపోయి వాటిని నాశనం చేసే ప్రమాదమూ ఉంది. దీన్నే ‘వాటర్ ఇంటాక్సికేషన్’ అంటారు. బరువు తక్కువగా ఉండే చిన్నారులూ, బాగా ఎండలో ఆటలాడే స్పోర్ట్స్ పర్సన్స్, ఎవరెక్కువ నీళ్లు తాగుతారో అంటూ నిర్వహించే గేమ్ షోలలో పాల్గొనేవారిలో (ఇలా గేమ్షోలలో పాల్గొని నీరు ఎక్కువగా తాగడంతో) ‘సెల్ఫ్ ఇండ్యూస్డ్ వాటర్ ఇంటాక్సికేషన్’ (ఎస్ఐడబ్ల్యూఐ అనే అనర్థం ఏర్పడవచ్చు. అలాగే సైకోజెనిక్ పాలీడిప్సియా అనే మానసిక వ్యాధితో బాధపడేవారు కూడా ఎక్కువగా నీరు తాగుతుంటారు. (ఈ రుగ్మత ఉన్నవారు దాహంవేస్తున్నట్లుగా అనిపించడం వల్ల అదేపనిగా నీళ్లు తాగేస్తూ ఉంటారు). ఇలా ‘సెల్ఫ్ ఇండ్యూస్డ్ వాటర్ ఇంటాక్సికేషన్’కు పాల్పడేవారు, సైకోజెనిక్ పాలీడిప్సియా ఉన్నవారు అధికమొత్తంలో నీరు తాగినప్పుడు శరీరంలోని లవణాలు కోల్పోయి... అలాగే మెదడు నుంచి లవణాల అయాన్ల ద్వారా కరెంటు రూపంలో అందాల్సిన ఆదేశాలు అందక ఒక్కోసారి అది ప్రాణాంతకం కూడా కావచ్చు. అందుకే దేహానికి ఎంత అవసరమో, మనకు ఎంత దాహం వేస్తుందో... ఆ మేరకే, అవసరమైనన్ని నీళ్లు మాత్రమే తాగాలని సూచిస్తున్నారు వైద్యనిపుణులు. మరి ఎన్ని నీళ్లు తాగాలి? ఎలా తాగాలి? ∙దాహమైనప్పుడు మాత్రమే నీళ్లు తాగాలి. దాహం తీరేవరకే తాగాలి. ∙మూత్రం మరీ తెల్లగా వస్తోందంటే శరీరంలో నీరు ఎక్కువైందని అర్థం. మరీ పచ్చగా వస్తోందంటే నీరు తగ్గిందని అర్థం. ఈ రెండూ ప్రమాదమే. కాబట్టి మూత్రం దాని స్వాభావిక రంగులో వచ్చేంత నీరు మాత్రమే తాగాలి. ∙అందుకే ఒకసారికి దాదాపు 100 ఎం.ఎల్. గానీ లేదా దాహం బాగా తీరే మేరకు మాత్రమే తాగడం మంచిది. ∙ఉజ్జాయింపుగా చెప్పాలంటే... వారి వారి బరువును బట్టి ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ 2 లీటర్ల నుంచి 3.5 లీటర్ల వరకు నీళ్లు తాగవచ్చు. మరీ నిర్దిష్టంగా చెప్పాలంటే... మహిళలు 2.7 లీటర్లు (11.5 కప్పులు), పురుషులు 3.7 లీటర్లు (15.5 కప్పులు) తాగడం మేలు. అంతకంటే ఎక్కువ నీరు తాగడం అంత మంచిదికాదు. తక్కువగానూ మంచిది కాదు. -
ముప్పును తగ్గించే కొత్త ఉప్పు.. లక్షల ప్రాణాలకు రక్ష!
తినే ఉప్పు.. శాస్త్రీయ నామం సోడియం క్లోరైడ్ ఎక్కువైతే ముందు రక్తపోటు.. జాగ్రత్తలేవీ తీసుకోకపోతే.. కొంత కాలం తరువాత గుండెజబ్బులు, గుండెపోటు వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ. అనేక శాస్త్ర పరిశోధనలు ఇప్పటికే తేల్చి చెప్పాయి ఈ విషయాన్ని. కానీ మనకే కాదు.. ప్రపంచం మొత్తమ్మీద ఉప్పులేని వంటకం తినడం దాదాపు ఎవరికీ ఇష్టం లేదు. మరి ఏం చేయాలి? ఉప్పులో సోడియం క్లోరైడ్ తగ్గించి.. పొటాషియం క్లోరైడ్ పెంచితే సరి అంటున్నారు ‘ద జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్’’ శాస్త్రవేత్తలు. ఆస్ట్రేలియా, చైనాలతోపాటు భారత్‌లోనూ కేంద్రాలున్న ఈ స్వతంత్ర వైద్య పరిశోధన సంస్థ ఇటీవలే ఒక భారీస్థాయి అధ్యయనం ఒకదాన్ని నిర్వహించింది. ఉప్పులో సాపేక్షంగా పొటాషియం క్లోరైడ్‌ను ఎక్కువ చేసి ఇవ్వడం వల్ల దుష్ప్రభావాలేవీ ఉండవని నిర్ధారించింది. అంతేకాదు.. ఈ కొత్త రకం ఉప్పును తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండెపోటు, అకాల మరణం వంటివి కొంతమేరకు తగ్గుతాయని కూడా ఈ పరిశోధన చెబుతోంది. -సాక్షి, హైదరాబాద్ ప్రాణాలకు రక్ష! కొత్త రకం ఉప్పును అందరూ వాడటం మొదలుపెడితే ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కాపాడవచ్చునని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త బ్రూస్ నీల్ చెబుతున్నారు. అవసరానికి మించి ఉప్పు తినడం ఇప్పుడు అన్నిచోట్ల ఎక్కువ అవుతోందని, ఇప్పటికే మార్కెట్లో ఉన్న ప్రత్యామ్నాయాల (సైంధవ లవణం వంటివి)ను ఉపయోగించడం ఖరీదైన వ్యవహారం అవుతోందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో సోడియం క్లోరైడ్ తక్కువగా, పొటాషియం క్లోరైడ్ ఎక్కువగా ఉన్న ఉప్పును తయారు చేసి, పంపిణీ చేయడంతోపాటు, వాడకాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వాలు విధానాలు రూపొందించడం ఎంతైనా అవసరమని, పైగా ఈ కొత్త రకం ఉప్పు ఖరీదు తక్కువేనని వివరించారు. తీవ్రమైన మూత్రపిండాల సమస్యలు ఉన్నవారిని మినహాయించి మిగిలిన వాళ్లు ఎవరైనా ఈ కొత్తరకం ఉప్పును వాడవచ్చునని చెప్పారు. ఇదీ పరిశోధన... ప్రత్యామ్నాయ ఉప్పు ప్రభావాన్ని, సమర్థతను అంచనా వేసేందుకు ‘ద జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్’’ చైనాలో దాదాపు 21 వేల మందిపై పరిశోధన నిర్వహించింది, గుండెపోటు లేదా అదుపులో లేనంత ఎక్కువ రక్తపోటు ఉన్న వారిని దాదాపు 600 గ్రామాల నుంచి ఎంపిక చేసింది. 2014 ఏప్రిల్‌లో మొదలుపెట్టి 2015 జనవరి వరకూ అంటే దాదాపు తొమ్మిది నెలలపాటు వీరిలో కొందరికి ప్రత్యామ్నాయ ఉప్పు మరికొందరికి సాధారణ ఉప్పు అందించింది. ఒక్కో వ్యక్తికి రోజుకు 20 గ్రాముల చొప్పున ఈ ప్రత్యామ్నాయ ఉప్పును అందించి వంట, నిల్వ (ఊరగాయ లాంటివి)లకు వాడేలా జాగ్రత్తలు తీసుకుంది. ఆ తరువాత అంటే 2015 నుంచి ఐదేళ్లపాటు ఈ గ్రామాల ప్రజల ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తూ వచ్చింది. ఐదేళ్ల కాలంలో మూడు వేల మంది గుండెపోటుకు గురయ్యారు. అయితే ప్రత్యామ్నాయ ఉప్పును తీసుకున్న వారిలో ఈ ప్రమాదం 14 శాతం వరకూ తక్కువగా ఉన్నట్లు తేలింది. గుండెకు సంబంధించిన సమస్యల విషయానికి వస్తే 13 శాతం తగ్గుదల నమోదు కాగా... అకాల మృత్యువు బారిన పడే అవకాశం 12 శాతం వరకూ తగ్గింది. చదవండి: హర్ష్ గోయెంకా ఫన్నీ వీడియో, లక్కీ ఫెలో అంటున్న నెటిజన్లు సిద్దిపేటలోనూ పరిశోధన ప్రత్యామ్నాయ ఉప్పును వాడటం వల్ల రక్తపోటు సమస్య తగ్గుతుందనేందుకు ‘ద జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్’’ భారత్‌లో జరిపిన ఒక పరిశోధన తార్కాణంగా నిలుస్తోంది. సుమారు ఆరు నెలల క్రితం వెలువడ్డ ఈ పరిశోధన ఫలితాల ప్రకారం.. ప్రత్యామ్నాయ ఉప్పు వాడిన వారిలో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ గణనీయంగా తగ్గింది. తెలంగాణలోని సిద్దిపేట ప్రాంతంలో తాము 502 మందిపై ఈ పరిశోధన నిర్వహించామని వీరిలో కొంతమందికి 70 శాతం సోడియం క్లోరైడ్, 30 శాతం పొటాషియం క్లోరైడ్ల మిశ్రమమైన ప్రత్యామ్నాయ ఉప్పును, మరికొందరికి వంద శాతం సోడియం క్లోరైడ్ ఇచ్చామని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త సుధీర్ రాజ్ థౌట్ తెలిపారు. చదవండి : మనీషాయే దిక్కు.. ‘తమిళనాడు థెరిస్సా’ మూడు నెలల తరువాత పరిశీలించినప్పుడు ప్రత్యామ్నాయ ఉప్పును వాడిన వారిలో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 4.6 యూనిట్లు తగ్గిపోగా, డయాస్టోలిక్ బ్లడ్‌ప్రెషర్‌లో, మూత్రంలో ఉప్పు అవశేషాల విషయంలోనూ సానుకూల మార్పులు కనిపించాయని వివరించారు. ఈ ఫలితాలు రక్తపోటు నివారణకు ఉపయోగించే మాత్రల ప్రభావంతో పోల్చదగ్గదిగా ఉందన్నారు. చదవండి : జొమాటోకు మరో ఎదురుదెబ్బ, నెటిజనుల మండిపాటు -
ఉప్పుతో ముప్పు లేదట..
లండన్ : ఉప్పుతో ఆరోగ్యానికి పెనుముప్పేనని వైద్యులు హెచ్చరిస్తుండగా తాజా అధ్యయనం ఉప్పు కొంచెం ఎక్కువగా తీసుకున్నా ఇబ్బందేమీ ఉండదని వెల్లడించింది. రోజుకు ఒక టీస్పూన్‌కు మించి ఉప్పు తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదం తప్పదని పలు దేశాల్లో వైద్య ఆరోగ్య మార్గదర్శకాలు స్పష్టం చేస్తుండగా తాజా అధ్యయనం ఇందుకు భిన్నంగా వెల్లడైంది. రోజుకు రెండున్నర టీస్పూన్లు లేదా ఐదు గ్రాముల వరకూ ఉప్పు ఆహారంలో భాగంగా తీసుకున్నా ఎలాంటి ప్రమాదం లేదని ఒంటారియోకు చెందిన మెక్‌మాస్టర్ యూనివర్సిటీ నిర్వహించిన తాజా అధ్యయనం స్పష్టం చేసింది. ఉప్పును పరిమితి మించి తీసుకునే వారు సైతం అధికంగా పండ్లు, కూరగాయలు, పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా సమతుల్యతను పాటించవచ్చని పేర్కొంది. ఉప్పుతో కూడిన ఆహారం అధికంగా తీసుకునే చైనా వంటి దేశాల్లో సోడియం తగ్గించాలనే ప్రచారం అవసరమని, ఐరోపా, ఉత్తర అమెరికాల్లో ఈ తరహా ప్రచారం అవసరం లేదని అధ్యయన రచయితలు చెప్పుకొచ్చారు. తగినంత మోతాదులో ఉప్పు తినే వారిలో గుండె జబ్బులు, స్ర్టోక్ ముప్పును నివారించేందుకు సోడియంను తగ్గించాలని సూచించేందుకు నిర్ధిష్ట ఆధారాలేమీ లభించలేదని అధ్యయన రచయిత, అసోసియేట్ క్లినికల్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ మార్టిన్ ఓడోనెల్ పేర్కొన్నారు. రోజుకు ఐదు గ్రాముల కన్నా ఎక్కువగా ఉప్పు తీసుకున్న వారిలోనే గుండె జబ్బులు, స్ర్టోక్స్ ముప్పు ఉన్నట్టు తమ అధ్యయనంలో గుర్తించామని చెప్పారు. రోజుకు ఏడు గ్రాముల కంటే అధికంగా సోడియం తీసుకునే వారిలోనే గుండె జబ్బుల ఉదంతాలు, హైబీపీతో మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడైందన్నారు. సోడియంను తగిన మోతాదులోనే తీసుకుంటే గుండెకు పదిలమని చెప్పారు. మరోవైపు రోజుకు ఒక టీస్పూన్ లేదా రెండు గ్రాములకు మించి ఉప్పు తీసుకోరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. -
కీరదోస తింటే...
కాయ‘ఫలాలు’ కీరదోసలో 96 శాతం నీరే. ఈ నీరు దేహాన్ని డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది. దేహంలోని విషతుల్యమైన వ్యర్థాలను బయటకు పంపేస్తుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, సోడియం ఉంటాయి. ఇవి రక్తపోటును క్రమబద్ధీకరిస్తాయి. హైబీపీ అదుపులోకి రావాలంటే రోజూ ఒక కీరదోస కాయను తినడం చక్కటి మార్గం. ఇందులోని ‘కె’ విటమిన్ ఎముకలు, కీళ్ల పనితీరును మెరుగుపరుస్తుంది. న్యూరాన్ల పనితీరు మెరుగవడంతో అల్జీమర్స్ (మతిమరుపు) రాదు. కీరదోస... గ్యాస్ట్రిక్ అల్సర్ నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది, జుట్టు పెరగడానికి దోహదం చేస్తుంది. గోళ్లు పెళుసుబారడాన్ని తగ్గిస్తుంది. కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. కడుపులో పురుగులను నిర్మూలిస్తుంది. చిగుళ్ల సమస్యలను, మూత్ర సంబంధ సమస్యలను నివారిస్తుంది. ప్యాంక్రియాస్ పనితీరులో లోపం వల్ల ఎదురైన సమస్యలను కీరదోస పరిష్కరిస్తుంది. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు రోజూ తినవచ్చు. బరువు తగ్గడానికి కూడా కీరదోస దోహదం చేస్తుంది. కాబట్టి అధికబరువు, స్థూలకాయంతో బాధపడేవారు కూడా హాయిగా తినవచ్చు. -
వెల్లుల్లి వాసన కలిగిన మూలకం?
రసాయన శాస్త్రం పదార్థం-మార్పులు 1. {దవస్థితిలో ఉండే మూలకం..? 1) సోడియం 2) పొటాషియం 3) బ్రోమిన్ 4) పాస్ఫరస్ 2. అతి తక్కువ సంయోగ సామర్థ్యం గల మూలకం? 1) హైడ్రోజన్ 2) ఆక్సిజన్ 3) నైట్రోజన్ 4) సల్ఫర్ 3. కాల్షియం కార్బొనేట్ ఏ రంగులో ఉంటుంది? 1) ఎరుపు 2) తెలుపు 3) పసుపు 4) నీలం 4. {పయోగశాలలో ఆక్సిజన్‌ను తయారుచేసే క్రమంలో పొటాషియం క్లోరేట్(ఓఇై3)కు ఏ ఉత్ప్రేరకాన్ని కలుపుతారు? 1) మెర్క్యూరిక్ ఆక్సైడ్ (HgO) 2) పొటాషియం నైట్రేట్ (KnO3) 3) మాంగనీస్ డై ఆక్సైడ్ (MnO2) 4) పొటాషియం పర్మాంగనేట్ (KMnO4) 5. శాఖీయ నూనెలను ఘన రూపంలోని కొవ్వు పదార్థాలుగా మార్చే విధానంలో ఉపయో గించే వాయువు? 1) కార్బన్ డై ఆక్సైడ్ 2) క్లోరిన్ 3) హైడ్రోజన్ 4) ఆక్సిజన్ 6. పీడనం ఎక్కువయ్యేకొద్దీ నీటిలో కార్బన్ డై ఆక్సైడ్ ద్రావణీయత? 1) మారదు 2) పెరుగుతుంది 3) తగ్గుతుంది 4) నీటి స్వభావంపై ఆధారపడి ఉంటుంది 7. ఆమ్లాలు లోహాలతో చర్యనొందినప్పుడు వెలు వడే వాయువు? 1) హైడ్రోజన్ 2) ఆక్సిజన్ 3) క్లోరిన్ 4) కార్బన్ డై ఆక్సైడ్ 8. బంగారం లాటిన్ నామం? 1) అర్జెంటీనం 2) నేట్రియం 3) కాలియం 4) ఆరమ్ 9. 8 గ్రాముల కాల్షియం కార్బోనేట్‌ను వేడిచేస్తే విడుదలైన కార్బన్ డై ఆక్సైడ్ భారమెంత? 1) 44 గ్రాములు 2) 35.2 గ్రాములు 3) 3.52 గ్రాములు 4) 4.4 గ్రాములు 10. Zn+CuSO4®ZnSO4+Cu అనేది ఏ రసాయన చర్య? 1) రసాయన సంయోగం 2) రసాయన వియోగం 3) రసాయన స్థానభ్రంశం 4) రసాయన ద్వంద్వ వియోగం 11. హెన్రీ కెవెండిష్ ఏ వాయువును తయారు చేశాడు? 1) హైడ్రోజన్ 2) క్లోరిన్ 3) నైట్రోజన్ 4) ఆక్సిజన్ 12. వాయు ఇంధనం (Fuel gas)లో హైడ్రో జన్ను ఎందుకు ఉపయోగిస్తారు? 1) హైడ్రోజన్ తేలికైన మూలకం 2) హైడ్రోజన్‌కు సులభంగా మండే స్వభావం ఉంటుంది 3) దీనికి అధిక దహనోష్ణం ఉంటుంది 4) పైవన్నీ 13. హైడ్రోజన్‌ను నీటి ఊర్థ్వముఖ స్థానభ్రంశం ద్వారా పొందవచ్చు. ఎందుకంటే..? 1) ఇది గాలికంటే తేలికైంది 2) గాలికంటే బరువైంది 3) ఇది మండే స్వభావం గల వాయువు 4) ఇది విష వాయువు 14. ఘన పరిమాణాత్మకంగా ఆక్సిజన్ ఎందు లో ఎక్కువగా ఉంటుంది? 1) గాలి 2) ఇసుక 3) నీరు 4) కర్బన పదార్థాలు 15. కింది వాటిలో సల్ఫర్ ధాతువు? 1) మాగ్నసైట్ 2) డోలమైట్ 3) కార్నలైట్ 4) గెలినా 16. MnO2+HCl®MnCl2+H2O+? 1) O2 2) C2 3) H2 4) Mn 17. టియర్ గ్యాస్ (Tear gas) ఫార్ములా? 1) Cl3CnO2 2) Cl2CnO2 3) Cl3CnO 4) Cl3CnHO2 18. మాంసం, చేపలు, పచ్చళ్లు నిల్వ ఉంచ డానికి ఉపయోగించే రసాయనం? 1) NaNO3 2) NaCl 3) NaOH 4) NaHg 19. {Oబెన్ ద్రావణం అంటే..? 1) ఉప్పు-నీరు ద్రావణం 2) చక్కెర-నీరు ద్రావణం 3) స్పటికం-నీరు ద్రావణం 4) సల్ఫూరిక్ ఆమ్లం-నీరు ద్రావణం 20. కింది వాటిలో మైనం వంటి మెత్తటి పదార్థం? 1) సోడియం క్లోరైడ్ 2) పాదరసం 3) అమ్మోనియా 4) పాస్ఫరస్ 21. ఒక వాయువును పీడనానికి గురిచేసి, వ్యాకోచింపచేసి, చల్లబరిచే విధానాన్ని ఏమంటారు..? 1) సీబెక్ ప్రభావం 2) మాక్స్వెల్ ప్రభావం 3) జౌల్-థామ్సన్ ప్రభావం 4) ఫెల్టీరియర్ ప్రభావం 22. అమ్మోనియం నైట్రేట్‌ను నేరుగా వేడి చేయ రాదు ఎందుకంటే..? 1) ఇది ఒక పేలుడు పదార్థం 2) ఇది ఒక అణుధార్మిక పదార్థం 3) దీనికి ఉష్ణధారణ సామర్థ్యం తక్కువ 4) దీనికి విశిష్టోష్ణం విలువ ఎక్కువ 23. 2NH2Cl+..?® CaCl2+H2O+2NH3 1) Ca (OH)2 2) CaO 3) Ca(NH)2 4) CaClO3 24. కొంత ఫెర్రిక్ క్లోరైడ్ ద్రావణానికి అమ్మోని యం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని చుక్కలు చుక్కలుగా కలిపితే ఏర్పడే అవక్షేపపు రంగు ఏది? 1) నీలి 2) జేగురు 3) పసుపు 4) నలుపు 25. మంచు తయారీలో శీతలీకరణిగా ఉపయో గించే పదార్థం? 1) నైట్రిక్ ఆమ్లం 2) కార్బన్ డై ఆక్సైడ్ 3) అమ్మోనియా 4) యూరియా 26. అధిక ఆక్సిజన్ సమక్షంలో అమ్మోనియా ఆక్సీకరణం పొందితే ఏర్పడే పదార్థం? 1) NO2 2) N2O 3) N2O3 4) N2 27. అద్దకం పరిశ్రమలో వస్త్రాలపై అచ్చు వేసేందుకు ఉపయోగించే పదార్థం? 1) అమ్మోనియం క్లోరైడ్ 2) సోడియం క్లోరైడ్ 3) మెగ్నీషియం క్లోరైడ్ 4) కార్బన్ టెట్రా క్లోరైడ్ 28. పేలుడు పదార్థం అమ్మోటాల్లో..ట్రైనైట్రో టోలీన్ (TNT) శాతం ఎంత? 1) 40% 2) 60% 3) 20% 4) 75% 29. బంగారం, వెండి వంటి లోహాలను శుద్ధి చేయడానికి ఉపయోగించేది? 1) అమ్మోనియం క్లోరైడ్ 2) నైట్రిక్ ఆమ్లం 3) గాఢ HCl 4) అయోడిన్ ఆమ్లం 30. వర్షపు నీటిలో గల నత్రికామ్లంతో చర్య పొంది నైట్రేట్ల నిచ్చే భూమిలోని ఆక్సైడ్లు? 1) ఆమ్ల ఆక్సైడ్లు 2) క్షార ఆక్సైడ్లు 3) తటస్థ ఆక్సైడ్లు 4) ద్వి స్వభావ ఆక్సైడ్లు 31. సల్ఫర్ రూపాంతరాల్లో స్థిరమైన రూపం? 1) మోనోక్లినిక్ రూపం 2) ప్లాస్టిక్ సల్ఫర్ 3) రాంబిక్ సల్ఫర్ 4) ప్రిస్మాటిక్ సల్ఫర్ 32. రబ్బరు వల్కనీకరణం (Valcanisation of rubber)ÌZ వాడే పదార్థం? 1) పాస్ఫరస్ 2) సల్ఫర్ 3) క్రోమియం 4) కోబాల్ట్ 33. చారిత్రక కట్టడాలకు నష్టం కలిగించే వాయువు? 1) జింక్ ఆక్సైడ్ 2) కాపర్ ఆక్సైడ్ 3) సల్ఫర్ డై ఆక్సైడ్ 4) కార్బన్ డై ఆక్సైడ్ 34. ఒక పదార్థం రంగును పోగొట్టడాన్ని ఏమంటారు..? 1) హైడ్రోజనీకరణ 2) విరంజన చర్య 3) సల్ఫొనోషన్ 4) కార్బోనేషన్ 35. రసాయనాల రాజు (King of the chemicles) అని దేనిని అంటారు? 1) H2SO4 2) HNO3 3) H2SO7 4) H2S2O7 36. ఓలియం (ైleum) ఫార్ములా? 1) H2SO4 2) H2S2O6 3) H2SO7 4) H2S2O7 37. {పయోగశాలలో కిప్సు పరికరాన్ని(ఓజీఞఞట ్చఞఞ్చట్చ్టఠట) ఉపయోగించి ఏ వాయు వును తయారు చేస్తారు? 1) కార్బన్ డై ఆక్సైడ్ 2) సల్ఫర్ డై ఆక్సైడ్ 3) హైడ్రోజన్ సల్ఫైడ్ 4) ఆక్సిజన్ 38. అల్యూమినియం సంయోజకత ఎంత? 1) 3 2) 2 3) 4 4) 1 39. ఫార్మాల్డీహైడ్ అణు ఫార్ములా? 1) C2HO 2) CH2O 3) CHO2 4) C2H2O 40. {పమాణ ఉష్ణోగ్రతా పీడనాల వద్ద (NTP) ఒక మోల్ ఇై2 వాయువు ఎన్ని లీటర్ల ఘన పరిమాణాన్ని ఆక్రమిస్తుంది? 1) 20.4 2) 2.24 3) 22.4 4) 224 41. నీటి విద్యుత్ విశ్లేషణ ప్రయోగంలో కాథోడ్ వద్దకు చేరే వాయువు? 1) హైడ్రోజన్ 2) ఆక్సిజన్ 3) నీటిఆవిరి 4) పైవేవీ కావు 42. నీటి భాష్పీభవన ఉష్ణోగ్రత? 1) 98°C 2) 1000°C 3) 120°C 4) 100°C 43. బెర్జీయస్ పద్ధతిలో ఏ పదార్థాన్ని తయారు చేస్తారు? 1) పెట్రోల్ 2) డీజిల్ 3) కోల్తార్ 4) అమ్మోనియా 44. కింది వాటిలో ఆమ్ల ఆక్సైడ్ కానిది? 1) SO2 2) P2O5 3) CO2 4) CaO 45. ఏ సల్ఫర్ రూపాంతరానికి ఎక్కువ సాపేక్ష సాంద్రత ఉంటుంది? 1) ప్లాస్టిక్ 2) రాంబిక్ 3) మోనోక్లీనిక్ 4) ఛ సల్ఫర్ 46. చర్మ వ్యాధుల నివారణలో వాడే సల్ఫైడ్ ఏది? 1) మెర్క్యూరిక్ సల్ఫైడ్ 2) జింక్ సల్ఫైడ్ 3) కాపర్ సల్ఫైడ్ 4) హైడ్రోజన్ సల్ఫైడ్ 47. సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఏ పద్ధతిలో తయారు చేస్తారు? 1) స్పర్శ పద్ధతి 2) ఫ్రాష్ పద్ధతి 3) నెల్సన్ పద్ధతి 4) హెబర్ పద్ధతి 48. కృత్రిమ సిల్క్(సెల్యూలోజ్ నైట్రేట్) తయా రీలో ఏ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు? 1) సల్ఫ్యూరిక్ ఆమ్లం 2) హైడ్రోక్ల్లోరిక్ ఆమ్లం 3) నత్రికామ్లం 4) కార్బాక్సిలిక్ ఆమ్లం 49. వెల్లుల్లి వాసన కలిగిన మూలకం? 1) పాస్ఫరస్ 2) సల్ఫర్ 3) క్లోరిన్ 4) హైడ్రోజన్ 50. ఏ పరిశ్రమలో పనిచేసే శ్రామికులకు దవడ ఎముకలు నశించే ఫాసిజా జబ్బు వస్తుంది? 1) సల్ఫర్ 2) పాస్ఫరస్ 3) క్వారీ 4) సిమెంట్ 51. కింది వాటిలో నిర్జలీకరిణిగా ఉపయోగ పడేది? 1) Na2PO4 2) P2O5 3) Ca3(PO4)2 4) H3PO4 52. 0.001క హైడ్రోక్లోరిక్ ఆమ్లం ్కఏ విలువ ఎంత? 1) 1 2) 103 3) 3 4) 0 53. క్షార ద్రావణంలో మిథైల్ ఆరెంజ్ సూచిక రంగు? 1) పసుపు 2) నారింజ 3) ఆకుపచ్చ 4) ఎరుపు 54. స్వచ్ఛమైన నీరు ్కఏ విలువ 7. కాబట్టి ఇది? 1) ఆమ్ల ద్రావణం 2) తటస్థ ద్రావణం 3) క్షార ద్రావణం 4) చెప్పలేం 55. క్షారాలు ఆమ్లాలతో చర్య పొంది..? 1) లవణాలను ఏర్పరుస్తాయి 2) నీటిని ఏర్పరుస్తాయి 3) లవణాలు, నీటిని ఏర్పరుస్తాయి 4) లవణాలు, నీటిని, కొద్దిగా ఆక్సిజన్‌ను ఏర్పరుస్తాయి సమాధానాలు 1) 3; 2) 1; 3) 2; 4) 3; 5) 3; 6) 2; 7) 1; 8) 4; 9) 3; 10) 3; 11) 1; 12) 3; 13) 1; 14) 3; 15) 4; 16) 2; 17) 1; 18) 2; 19) 1; 20) 4; 21) 3; 22) 1; 23) 2; 24) 2; 25) 3; 26) 1; 27) 1; 28) 3; 29) 2; 30) 2; 31) 3; 32) 2; 33) 3; 34) 2; 35) 1; 36) 4; 37) 3; 38) 1; 39) 2; 40) 3; 41) 2; 42) 4; 43) 1; 44) 4; 45) 2; 46) 1; 47) 1; 48) 3; 49) 1; 50) 2; 51) 2; 52) 3; 53) 1; 54) 2; 55) 3.