వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సిఫార్సు చేసిన మోతాదులో ఉప్పు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చని మోడలింగ్ అధ్యయనం పేర్కొంది. ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన మోతాదులో ఉప్పు తీసుకోవడం వల్ల పదేళ్లలో గుండె, మూత్రపిండాలకు సంబంధించిన దీర్ఘకాలికి వ్యాధుల కారణంగా సంభవించే..దాదాపు మూడు లక్షల మరణాలను నివారించొచ్చని పేర్కొంది.
అధిక స్థాయి సోడియం అనేది ప్రధాన ఆహార ప్రమాదాల్లో ఒకటి. అధిక ఆదాయ దేశాల్లో సోడియంకి సంబంధించిన ప్యాక్ చేసిన ఆహారాలు ప్రధాన వనరు. ఇక తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో వీటి వినియోగం మరింత ఎక్కువగా ఉండటం బాధకరం. ముఖ్యంగా భారతదేశంలో ఉప్పు తగ్గించి తీసుకునేలా సరైన జాతీయ వ్యూహం లేదని హైదరాబాద్‌లోని ది జార్జ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ పరిశోధకులు చెబుతున్నారు.
ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన ఉప్పు ఒక టీ స్పూన్ లేదా ఐదు గ్రాముల కంటే తక్కువగా ఉంటుందని మోడలింగ్ అధ్యయనం పేర్కొంది. ఈ మోతాదులోనే ప్రతి రోజూ వినియోగించినట్లయైతే దాదాపు 17 లక్షల కార్డియోవాస్కులర్ సంఘటనలు, గుండెపోటులు, స్ట్రోక్‌లతో సహా క్రానిక్ కిడ్న వ్యాధులను నివారించడమే గాక గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందగలమని పరిశోధన వెల్లడించింది. ముఖ్యంగా భారతదేశంలో పూర్తిస్థాయిలో ఇది అమలవ్వాలని పేర్కొంది.
ఇక్కడి ప్రజలు ఎక్కువగా ప్యాక్ చేసిన ఆహారాలను ఉపయోగిస్తున్నట్లు పరిశోధన వెల్లడించింది. ఈవిషయమై ఆహార తయారీదారులకు అవగాహన కల్పించడం, పాటించేలా చేయడం అత్యంత ముఖ్యమని తెలిపింది.
కాగా, అధిక స్థాయిలో సోడియం తీసుకోవడం తగ్గించేలా ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా 2018 నుంచి అవగాహన కార్యక్రమాలు ప్రారంభించింది. అయితే ప్రస్తుతం మాత్రం ఈట్ రైట్ ఇండియా అనే జాతీయ కార్యక్రమం ద్వారా సోడియంను తగ్గించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుందని పరిశోధకులు తెలిపారు.
(చదవండి: వాట్ ఏ రికార్డ్!..గుమ్మడికాయ పడవతో 26 గంటలు..)
Comments
Please login to add a commentAdd a comment