కొన్ని టేక్–అవే సెంటర్లలో ఆకర్షించడానికి బయటికి కనిపించేలా అమర్చే చికెన్ ఎర్రటి రంగులో ఉండటం చూసే ఉంటారు. అలాగే చిల్లీ–చికెన్, చికెన్ మంచూరియా, డ్రై చికెన్ వంటివి మాత్రమే కాకుండా మరికొన్ని మాంసాహారాలనూ ఆకర్షణీయంగా ఉంచడంతో పాటు ఒక రకమైన ఫ్లేవర్ వచ్చేందుకు అడెటివ్ సోడియమ్ నైట్రేట్ అనే రంగునిచ్చే పదార్థాన్ని వాడుతారు. ఇది ఒక నైట్రేట్ సాల్ట్. ఇది కంటికి ఇంపుగా కనిపించేందుకూ, ఫ్లేవర్ కోసం మాత్రమే కాకుండా.. ఓ ప్రిజర్వేటివ్‌గా కూడా ఉపయోగిస్తారు.
అయితే చికెన్... ఇతర మాంసాహారాలు ప్రోటీన్లతో కూడిన మంచి పోషకాహారాలే అయినప్పటికీ సోడియమ్ నైట్రేట్ కారణంగా అది హానికరంగా మారే అవకాశం ఎక్కువ. నిజానికి ఆ రకం సోడియమ్ సాల్ట్ ఒక క్యాన్సర్ కారకం. అది బ్లడ్‌క్యాన్సర్స్ (లుకేమియా), కోలోరెక్టల్ క్యాన్సర్‌ను, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్ వంటి వాటికి దారితీసే ముప్పు ఉంది. అందుకే బేకరీలలో, హోటళ్లలో ఇలాంటి ఎర్రగా ఆకర్షణీయంగా కనిపించే మాంసాహార పదార్థాలకు బదులుగా ఏ రంగూ, అడెటివ్ లేని మామూలు వాటినే తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment