Food Center
-
వడాపావ్ మంత్రం: పద్మాసని విజయరహస్యం
ఇంటి పనులతోనే సమయం సరిపోవడం లేదనే కంప్లైంట్ గృహిణుల నోట తరచూ వినిపిస్తుంటుంది. కొందరు మాత్రం కొద్దిపాటి ఖాళీ సమయాన్ని కూడాసద్వినియోగం చేసుకుంటూ తమని తాము తీర్చిదిద్దుకుంటారు. అలాంటి కొందరిలో పద్మాసని దరూరి ఒకరు. హైదరాబాద్ మాదాపూర్‌లో ఉంటున్న 53 ఏళ్ల పద్మాసని దరూరి గృహిణిగా ఉంటూ సంస్కృతంతో పాటు అనేక భాషల మీద పట్టు సాధించారు.భర్త ఉద్యోగరీత్యా పుణెలో ఉండటంతో అక్కడి స్థానిక వంటకాలను నేర్చుకున్నారు. పిల్లలు ఉద్యోగాలు చేసే సమయానికి వచ్చేసరికి నగరవాసులకు ‘పావ్ మంత్ర’ పేరుతో మహారాష్ట్రియన్ వంటకాలను పరిచయం చేస్తూ ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగారు. లోనూ ‘పంచసత్వ’ పేరుతో సౌత్ ఇండియన్ క్యుజిన్‌ను ్రపారంభిస్తున్నారు.గృహిణిగా ఉంటూనే వ్యాపారవేత్తగా ఎదిగిన పద్మాసని దరూరిని పలకరిస్తే ఇలా ఎన్నో కబుర్లు మన ముందుంచారు.‘‘మనలో అభిరుచి ఉండాలే గానీ ఎక్కడ ఉన్నా దానిని వృద్ధిలోకి తీసుకురావచ్చు. మా వారి ఉద్యోగ రీత్యా పుణేలో ఉండేవాళ్లం. గృహిణిగా ఇల్లు, పిల్లల పనులు ఎప్పుడూ ఉండేవే. పిల్లలు హై స్కూల్‌కి వచ్చాక నేను వేదాంత అకాడమీలో చేరి మూడు నెలల్లో సంస్కృతాన్ని నేర్చుకున్నాను. మన పురాణేతిహాసాలు చదువుతూ సబ్జెక్ట్‌పై పట్టు సాధించగలిగాను. కార్పొరేట్ కంపెనీలలో పని చేసేవారి ఆసక్తిని బట్టి, అక్కడకు వెళ్లి సంస్కృతం క్లాసులు తీసుకునేదాన్ని. రామాయణ, మహా భారతాల గురించి క్షుణ్ణంగా వివరించేదాన్ని. వేదాంత అకాడమీలో నేర్చుకున్న విషయాలను ఇంటికి వచ్చి పిల్లలకు చెబుతుండేదాన్ని. దీంతో వారు స్కూల్లో చదువుకున్న విషయాలే కాకుండా మన వేదాల గురించి, పురాణాల గురించీ కూడా తెలుసుకోగలిగారు.వివిధ రకాల భాషలుసంస్కృతంతో పాటు హిందీ, ఇంగ్లిష్, మరాఠీ.. ఇలా రకరకాల భాషలను ఆసక్తితో నేర్చుకున్నాను. వీటితోపాటు దేశంలోని అన్ని రకాల ్రపాచీన సంస్కృతుల గురించి తెలుసుకోవడం, వాటిని ఆచరించడం చేస్తుండేదాన్ని. ఈ క్రమంలో అన్ని రకాల వంటకాల తయారీని ఇష్టంగా చేసేదాన్ని. వాటిని మా ఇంట్లో వారికే కాదు మా చుట్టుపక్కల వారికీ రుచి చూపించేదాన్ని. అందరూ మెచ్చుకునేవారు. మా అబ్బాయిలిద్దరూ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తయ్యాక నాకు మరింత వెసులుబాటు దొరికింది. నా వంటకాల రుచితో బిజినెస్ చేయాలనే ఆలోచన వచ్చింది. రుచిగా.. పావ్ మంత్రతరచూ ఇంట్లో బిజినెస్ ఆలోచనల గురించి చర్చ జరుగుతున్నప్పుడు నేను, మా పెద్దబ్బాయి కలిసి ఒక ఫుడ్ స్టార్టప్ ్రపారంభించాలనుకున్నాం. మా స్టార్టప్‌కి వాత్సల్య అనే పేరు అనుకున్నాం. పుణెలో స్థానిక ఫుడ్ వడాపావ్. అక్కడ స్ట్రీట్ఫుడ్గా దీనికి పేరుంది. హైదరాబాద్ వాసులకు ఈ వడాపావ్ రుచిని కొత్తగా అందించాలనుకున్నాను. పుణెలో వడాపావ్ టేస్ట్, మన దగ్గర టేస్ట్‌కి భిన్నంగా ఉంటుంది. ఏ పనైనా ఒకసారి మొదలుపెడితే దాంట్లో నూటికి నూరు శాతం దృష్టి పెట్టాల్సిందే అనుకొని వ్యాపారంలోకి దిగాను. పావ్‌కి విభిన్నమైన రుచిని తెప్పించడం కోసం రకరకాల ప్రయోగాలు చేసి, విజయవంతమయ్యాం. మా పిల్లలు వామన్, కేశవ్ లు తమ పూర్తి సహకారాన్ని నాకు అందించారు. దాంతో ‘పావ్మంత్ర’ పేరుతో ఫుడ్ బిజినెస్‌ను కరోనా సెకండ్ వేవ్‌లో మాదాపూర్‌లో ్రపారంభించాం. మా స్టార్టప్‌కి మహారాష్ట్ర, ఫార్సీ ఆంబియన్స్ వచ్చేలా ΄్లాన్ చేశాం. కొద్ది రోజుల్లోనే నోటి మాట ద్వారానే అందరికీ తెలియడంతో మంచి పేరు వచ్చింది. నేను కన్న కల రెండున్నరేళ్లలోనే సాకారం అయ్యింది. ఈ నెలలో పుణెలో ‘పంచసత్వ’ పేరుతో సౌత్ ఇండియన్ క్యుజిన్‌ను అందించబోతున్నాను. గృహిణిగా ఇంటి పనులు, వంట పనులు చేసుకుంటూ ఉన్న నేను 53 ఏళ్ల వయసులో ఇలా బిజినెస్ ఉమెన్‌గా ఎదుగుతానని అస్సలు ఊహించలేదు. నా అభిరుచికి మేరకు ఒక్కో ప్రయత్నం చేస్తూ ప్రయాణిస్తున్నాను. ఈ ప్రయాణంలో నా పిల్లలు తోడయ్యారు. తొంభై ఏళ్ల వయసున్న నా తల్లిదండ్రులూ నా ఆసక్తిని, అభిరుచిని గౌరవిస్తూ తమ ఆశీస్సులను అందిస్తున్నారు. అమ్మనాన్నలను చూసుకుంటూ, భర్త, పిల్లల బాగోగులను గమనిస్తూ, నన్ను నేనుగా మెరుగుపరుచుకోవడానికి చేసిన ప్రయత్నం ఎప్పుడూ నాకు మంచి ఫలితాలను ఇస్తూ వచ్చింది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరింతగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నాను’ అంటూ వివరించారు పద్మాసని. – నిర్మలారెడ్డి -
ది గ్రేట్ వడా పావ్ వార్
దిల్లీ ‘వైరల్ వడా పావ్ గర్ల్’గా పాపులర్ అయిన చంద్రికా గెరా దీక్షిత్ తాజాగా తన ఫుడ్ కార్ట్ సార్టప్తో రాత్రికి రాత్రి సెన్సేషన్‌గా మారింది. దీక్షిత్ పాపులారిటీ మాట ఎలా ఉన్నా ఆమెకు పోటీదారులు పెరిగారు. దీక్షిత్ ఫుడ్ కార్ట్ చుట్టుపక్కల పోటీదారులు వడా పావ్ బండ్లను ఏర్పాటు చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ‘పాపులారిటీనే కొంప ముంచిందా!’ లాంటి హెడ్‌లైన్స్ నెటిజనుల నుంచి లైన్ కట్టాయి. ‘నిన్న నేను రానందున తన బండిని ఉంచానని ఆంటీ చెప్పింది. ఈరోజు కూడా ఇక్కడే పెట్టింది. ఒకరి వ్యాపారాన్ని దెబ్బతీయాలనుకోవడం సమంజసమా!’ అని తన ఆవేదనను వెళ్లగక్కింది దీక్షిత్. ఫుడ్ వ్లాగర్ పూడీ మానేహా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోటీదారు ఆంటీ ‘ఒకరి వ్యాపారాన్ని దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. నా పని నేను చేసుకుపోతున్నాను’ అని ఎర్రటి ఎండల్లో కూల్‌గా బదులిచ్చింది. ‘బండి ఎవరు పెట్టారనేది కాదు... రుచి ముఖ్యం’ అని కూడా సెలవిచ్చింది. -
Hyd: కుమారి ఆంటీకి బిగ్ షాక్
నాన్నా.. నాన్నా.. అంటూ కొసరి కొసరి వడ్డిస్తూ.. టూ లివర్స్ ఎక్స్ట్రా మీది మొత్తం థౌజండ్ అయ్యిందని సోషల్ మీడియాను షాక్ అయ్యేలా చేసి ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్ ఆంటీ కుమారి. అయితే తాజాగా ఆమెకు షాక్ ఇచ్చారు పోలీసులు. ఆమె ఫుడ్ కోర్టును బంద్ చేయించగా.. తనకు మాత్రమే బంద్ చేయించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఏ సోషల్ మీడియా అయితే ఆమెను ఫేమస్ చేసిందో.. అదే ఆమెకు దెబ్బేసింది. ఆమె వీడియోలు వైరల్ అయ్యాక ఆ ఫుడ్ కోర్టుకు జనాలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో జనం వస్తుండడం.. వాహనాల పార్కింగ్తో ఈ మధ్య మాదాపూర్‌లోని ఆమె ఫుడ్ కోర్టు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో మంగళవారం నాడు పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె ఫుడ్‌కోర్టును అక్కడి నుంచి తరలించారని ఆదేశించారు. వారం పాటు దుకాణం బంద్ చేయాలని.. ఈలోపు జీహెచ్ఎంసీ సమన్వయంతో మరో దగ్గర ఫుడ్ కోర్టు తెరుచుకోవాలని ఆమెకు సూచించారు. కుమారి ఆంటీ పూర్తి పేరు దాసరి సాయి కుమారి. ఆమె స్వస్థలం ఏపీలోని గుడివాడ. నగరంలోని మాదాపూర్‌లోని కోహినూరు హోటల్ ఎదురుగా 2011లో స్ట్రీట్‌ఫుడ్ సెంటర్‌ను ప్రారంభించింది. మొదట్లో కేవలం 5 కేజీల రైస్‌తో ప్రారంభమైన కుమారి ఫుడ్ బిజినెస్.. ఇప్పుడు రోజుకు 100 కేజీలకు పైగానే అమ్ముడుపోతోందట!. ప్రేమగా వడ్డించే ఆమె విధానంతో పాటు అక్కడి రేట్లు కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. దీంతో.. ఆమె ఓ సెన్సెషన్‌గా మారిపోయారు. This is the reason y police halted #Kumariaunty hotel at ITC kohinoor Mari intha picholu unaru endi ra#hyderbad pic.twitter.com/b4yArC7pQR — Nandeeshwar (@SNandeeshwar) January 30, 2024 ట్రాఫిక్ పోలీసులు బిజినెస్ క్లోజ్ చేయటంపై కుమారి ఆంటీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు తన ఒక్కరి బండి మాత్రమే ఆపారని ఆరోపిస్తున్నారు. మిగతా అందరి వ్యాపారాలకు అనుమతి ఇచ్చి తన ఒక్కరిపట్లే ఎందుకిలా అంటూ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారానే పైకి వచ్చానని, ఇప్పుడు వారే ఆదుకోవాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాలంటూ తన వద్దకు వచ్చే ఫుడ్ లవర్స్‌కు కుమారి ఆంటీ విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం.. చాలారోజుల నుంచి ఆమెను హెచ్చరిస్తూ వస్తున్నామని చెబుతున్నారు. ఆమె స్టాల్ మూలంగానే ఇక్కడ ట్రాఫిక్‌జామ్ అవుతోంది. ఈ విషయంపై ఆమెకు చెబుతూ వస్తున్నా.. ఆమె స్పందించలేదు. ఖాళీ చేసి ట్రాఫిక్ సమస్యలు తలెత్తని మరోచోట బిజినెస్ చేస్కోమని ఆమెకు చెబుతున్నాం. పైగా అది ఆమె సొంత స్థలం కాదు. ఆమెనే కాదు.. ప్రస్తుతం నగరంలో ఉన్న చాలా రోడ్‌సైడ్ ఈటరీ స్టాల్స్‌కు అనుమతులు లేవు. ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా వ్యాపారం చేసుకుంటే మాకు ఫర్వాలేదు. కానీ, ఇక్కడ పరిస్థితి అలా లేదు. ఒకవేళ ఈ అంశంపై కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటే గనుక మేం ఏం చేయలేం. ఒకవేళ కోర్టు గనుక తొలగించాల్సిందేనని చెబితే మాత్రం తీసేస్తాం అని రాయ్‌దుర్గం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ విజయానంద్ స్పష్టం చేశారు. -
అది ఎర్రటి రంగేసిన ఆకర్షణీయమైన వంటకమా? అయితే డేంజరే!
కొన్ని టేక్–అవే సెంటర్లలో ఆకర్షించడానికి బయటికి కనిపించేలా అమర్చే చికెన్ ఎర్రటి రంగులో ఉండటం చూసే ఉంటారు. అలాగే చిల్లీ–చికెన్, చికెన్ మంచూరియా, డ్రై చికెన్ వంటివి మాత్రమే కాకుండా మరికొన్ని మాంసాహారాలనూ ఆకర్షణీయంగా ఉంచడంతో పాటు ఒక రకమైన ఫ్లేవర్ వచ్చేందుకు అడెటివ్ సోడియమ్ నైట్రేట్ అనే రంగునిచ్చే పదార్థాన్ని వాడుతారు. ఇది ఒక నైట్రేట్ సాల్ట్. ఇది కంటికి ఇంపుగా కనిపించేందుకూ, ఫ్లేవర్ కోసం మాత్రమే కాకుండా.. ఓ ప్రిజర్వేటివ్‌గా కూడా ఉపయోగిస్తారు. అయితే చికెన్... ఇతర మాంసాహారాలు ప్రోటీన్లతో కూడిన మంచి పోషకాహారాలే అయినప్పటికీ సోడియమ్ నైట్రేట్ కారణంగా అది హానికరంగా మారే అవకాశం ఎక్కువ. నిజానికి ఆ రకం సోడియమ్ సాల్ట్ ఒక క్యాన్సర్ కారకం. అది బ్లడ్క్యాన్సర్స్ (లుకేమియా), కోలోరెక్టల్ క్యాన్సర్‌ను, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్ వంటి వాటికి దారితీసే ముప్పు ఉంది. అందుకే బేకరీలలో, హోటళ్లలో ఇలాంటి ఎర్రగా ఆకర్షణీయంగా కనిపించే మాంసాహార పదార్థాలకు బదులుగా ఏ రంగూ, అడెటివ్ లేని మామూలు వాటినే తీసుకోవాలి. -
జైలు వంటలు లేనట్లేనా..?
సాక్షి, చంచల్‌గూడ: తెలంగాణ జైళ్ల శాఖ చంచల్‌గూడలో రెండు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన మై నేషన్ పేరుతో ప్రారంభించిన ఫుడ్‌కోర్టు మూతపడింది. వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు వంటకాల తయారీలో ప్రత్యేక శిక్షణ ఇప్పించి ఈ కేంద్రంలో నియమించారు. ప్రజలకు రుచికరమైన భోజనం అందించారు. మీల్స్, టిఫిన్స్‌తో పాటు చికెన్ బిర్యానీ విక్రయించారు. బహిరంగ మార్కెట్లో చికెన్ బిర్యానీ రూ.180 నుంచి రూ.220 వరకు లభించగా.. ఈ ఔట్లెట్లో కేవలం రూ.90లకే విక్రయించేవారు. ధర తక్కువగా ఉండటంతో ఈ మార్గంలో వెళ్లేవారు బిర్యానీ రుచి చూసి వెళ్లేవారు. లాక్డౌన్ కారణంగా మార్చి నుంచి మూతపడింది. సిటీ మార్కెట్లోకి ఎపిస్ కుంకుమ పువ్వు చలికాలంలో కేసర్ లేదా కుంకుమపువ్వు వినియోగం పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఎఫ్‌ఎమ్‌జీజీ బ్రాండ్.. ‘ఎపిస్’ సాఫ్రాన్(కుంకుమ పువ్వు)ని సిటీ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కుంకుమ పువ్వుని విభిన్న రూపాల్లో వినియోగించడం ద్వారా సాధారణ దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలుగుతుందని భారతీయ వైద్య విధానం చెబుతోందని వీరు వివరించారు. నగరంలోని హైపర్ స్టోర్స్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ప్లాట్‌ఫామ్స్ మీద వన్ గ్రామ్ ఎపిస్ సాఫ్రాన్ ప్యాక్‌ని అందుబాటులోకి తెచ్చామన్నారు. -
అయ్యో ‘అమ్మ’
* క్యాంటీన్లపై నిర్లక్ష్యం * తగ్గిన వంటకాల తయారీ * ధరల పెరుగుదలే కారణమా? సాక్షి, చెన్నై: తక్కువ ధరకే పేదలకు కడుపు నింపే ఆహార కేంద్రంగా ఉన్న అమ్మ క్యాంటీన్లలో వంటకాల తయారీ తగ్గుముఖం పట్టింది. ప్రధానంగా ఇడ్లీ, పొంగల్, చపాతీ తయారీని తగ్గించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు అద్దంపట్టే రీతిలో అనేక క్యాంటీన్లలో చాలీచాలని వంటకాలను సిద్ధం చేస్తున్నారు. రాజధాని నగరంలోని పేద, చిరుద్యోగులకు కడుపు నిండా తింటి పెట్టాలన్న సంకల్పంతో సీఎంగా ఉన్నప్పుడు జే.జయలలిత ముందుకు సాగారు. నగరంలో రెండు వందల అమ్మ క్యాంటీన్లను కార్పొరేషన్ ద్వా రా ఏర్పాటు చేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఈ క్యాంటీన్ల విస్తరణ సాగుతోంది. ఈ క్యాంటీన్లలో ఒక ఇడ్లి రూ.ఒకటి, ప్లేటు పొంగల్ రూ.ఐదు, సాంబారన్నం రూ.ఐదు, పెరుగన్న రూ.మూడు, సాయంత్రం వేళ్లల్లో రెండు చాపతీలు, పప్పులేదా కుర్మా రూ.మూడుకు విక్రయిస్తూ వచ్చారు. ఈ క్యాంటీన్లకు విశేష ఆదరణ లభించింది. నగరంలోని రెండు వందల వార్డుల్లో, మూడు ప్రభుత్వాస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్లు ఇతర రాష్ట్రాలకు ఆదర్శనంగా మారాయి. ఈ పరిస్థితుల్లో ఆదాయానికి మించిన కేసు కేసును జయలలిత ఎదుర్కొని జైలు పాలయ్యారు. రాష్ట్రంలో అధికారం మారింది. సీఎంగా ఉన్న జయలలిత మాజీ అయ్యారు. ఆమె విశ్వాసి పన్నీరు సె ల్వం సీఎం కుర్చీ ఎక్కారు. జయలలిత చేతుల మీదుగా కొలువు దీరిన అమ్మ క్యాంటీన్లను పన్నీరు సెల్వం ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నట్టు కన్పిస్తోంది. భారమా?: అమ్మగా క్యాంటీన్ల నిర్వహణ ప న్నీరు ప్రభుత్వానికి భారంగా మారుతోం దా..?, కార్పొరేషన్ వర్గాల నిర్లక్ష్యం క్యాం టీన్ల మీద ప్రభావం చూపుతోందా...? అన్న అనుమానాలు బయలు దేరాయి. నగరంలోని అనేక క్యాంటీన్లలో ఉదయం వేళల్లో గతంలో వలే కాకుండా, ఇడ్లీ, పొంగల్ తయారీని తగ్గిం చారు. ఇది వరకు గంటల తరబడి లభించే ఈ అల్పాహారాలు, తాజాగా పట్టుమని గంట కాకముందే అయిపోతున్నాయి. ఇది వరకు ఒక్కో క్యాంటీన్లో రెండు వేల చాపతీలను సిద్ధం చేయగా, తాజాగా అనేక క్యాంటీన్లలో ఆ సం ఖ్య సగానికి తగ్గించారు. మధ్యాహ్నం వేళల్లో సాంబార న్నం తయారీని సైతం తగ్గిం చారు. దీన్నిబట్టి చూస్తే, ఈ క్యాంటీన్లకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ భారంగా మారిం దా...? అన్న ప్రశ్న తలెత్తతోంది. ఇది వరకు పన్నెండు మంది సిబ్బంది ఒక్కో క్యాంటీన్లో పనిచేస్తుంటే, ప్రస్తుతం అనేక క్యాంటీన్లలో నలుగురురికి పడిపోవడం గమనార్హం. తగ్గించాం: కొన్ని క్యాంటీన్లలో అవకతవకలు జ రిగాయని, అందుకే సిబ్బంది సంఖ్య తగ్గిం చి నట్టు కార్పొరేషన్ వర్గాలు పేర్కొంటున్నా యి. అనేక క్యాంటీన్లలో ఉదయాన్నే ఇడ్లీ, సాంబా రు, మధ్యాహ్నం సాంబారన్నం, సాయంత్రం చపాతీ విక్రయాలు సరిగ్గా జరగడం లేదని, అందుకే ఆ క్యాంటీన్లలో తయారీని తగ్గించి, ఇతర క్యాంటీన్లలో పెంచినట్టు చెబుతున్నారు.