అయ్యో ‘అమ్మ’ | Negligence on the Amma canteen | Sakshi
Sakshi News home page

అయ్యో ‘అమ్మ’

Published Sat, Nov 15 2014 3:27 AM | Last Updated on Thu, Oct 4 2018 5:10 PM

అయ్యో ‘అమ్మ’ - Sakshi

అయ్యో ‘అమ్మ’

* క్యాంటీన్లపై నిర్లక్ష్యం
* తగ్గిన వంటకాల తయారీ
* ధరల పెరుగుదలే కారణమా?

సాక్షి, చెన్నై: తక్కువ ధరకే పేదలకు కడుపు నింపే ఆహార కేంద్రంగా ఉన్న అమ్మ క్యాంటీన్లలో వంటకాల తయారీ తగ్గుముఖం పట్టింది. ప్రధానంగా ఇడ్లీ, పొంగల్, చపాతీ తయారీని తగ్గించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు అద్దంపట్టే రీతిలో అనేక క్యాంటీన్లలో చాలీచాలని వంటకాలను సిద్ధం చేస్తున్నారు.  రాజధాని నగరంలోని పేద, చిరుద్యోగులకు కడుపు నిండా తింటి పెట్టాలన్న సంకల్పంతో సీఎంగా ఉన్నప్పుడు జే.జయలలిత ముందుకు సాగారు. నగరంలో రెండు వందల అమ్మ క్యాంటీన్లను కార్పొరేషన్ ద్వా రా ఏర్పాటు చేయించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఈ క్యాంటీన్ల విస్తరణ సాగుతోంది. ఈ క్యాంటీన్లలో ఒక ఇడ్లి రూ.ఒకటి, ప్లేటు పొంగల్ రూ.ఐదు, సాంబారన్నం రూ.ఐదు, పెరుగన్న రూ.మూడు, సాయంత్రం వేళ్లల్లో రెండు చాపతీలు, పప్పులేదా కుర్మా రూ.మూడుకు విక్రయిస్తూ వచ్చారు. ఈ క్యాంటీన్లకు విశేష ఆదరణ లభించింది. నగరంలోని రెండు వందల వార్డుల్లో, మూడు ప్రభుత్వాస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్లు ఇతర రాష్ట్రాలకు ఆదర్శనంగా మారాయి.

ఈ పరిస్థితుల్లో ఆదాయానికి మించిన కేసు కేసును జయలలిత ఎదుర్కొని జైలు పాలయ్యారు. రాష్ట్రంలో అధికారం మారింది. సీఎంగా ఉన్న జయలలిత మాజీ అయ్యారు. ఆమె విశ్వాసి పన్నీరు సె ల్వం సీఎం కుర్చీ ఎక్కారు. జయలలిత చేతుల మీదుగా కొలువు దీరిన అమ్మ క్యాంటీన్లను పన్నీరు సెల్వం ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నట్టు కన్పిస్తోంది.
 
భారమా?: అమ్మగా క్యాంటీన్ల నిర్వహణ ప న్నీరు ప్రభుత్వానికి భారంగా మారుతోం దా..?, కార్పొరేషన్ వర్గాల నిర్లక్ష్యం క్యాం టీన్ల మీద ప్రభావం చూపుతోందా...? అన్న అనుమానాలు బయలు దేరాయి. నగరంలోని అనేక క్యాంటీన్లలో ఉదయం వేళల్లో గతంలో వలే కాకుండా, ఇడ్లీ, పొంగల్ తయారీని తగ్గిం చారు. ఇది వరకు గంటల తరబడి లభించే ఈ అల్పాహారాలు, తాజాగా పట్టుమని గంట కాకముందే అయిపోతున్నాయి.

ఇది వరకు ఒక్కో క్యాంటీన్‌లో రెండు వేల చాపతీలను సిద్ధం చేయగా, తాజాగా అనేక క్యాంటీన్లలో ఆ సం ఖ్య సగానికి తగ్గించారు. మధ్యాహ్నం వేళల్లో సాంబార న్నం తయారీని సైతం తగ్గిం చారు. దీన్నిబట్టి చూస్తే, ఈ క్యాంటీన్లకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ భారంగా మారిం దా...? అన్న ప్రశ్న తలెత్తతోంది. ఇది వరకు పన్నెండు మంది సిబ్బంది ఒక్కో క్యాంటీన్లో పనిచేస్తుంటే, ప్రస్తుతం అనేక క్యాంటీన్లలో నలుగురురికి పడిపోవడం గమనార్హం.
 
తగ్గించాం: కొన్ని క్యాంటీన్లలో అవకతవకలు జ రిగాయని, అందుకే సిబ్బంది సంఖ్య తగ్గిం చి నట్టు కార్పొరేషన్ వర్గాలు పేర్కొంటున్నా యి. అనేక క్యాంటీన్లలో ఉదయాన్నే ఇడ్లీ, సాంబా రు, మధ్యాహ్నం సాంబారన్నం, సాయంత్రం చపాతీ విక్రయాలు సరిగ్గా జరగడం లేదని, అందుకే ఆ క్యాంటీన్లలో తయారీని తగ్గించి, ఇతర క్యాంటీన్లలో పెంచినట్టు చెబుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement