ప్రపంచంలోనే అత్యుత్తమ ఆహారం నగరం జాబితాలో వాణిజ్య రాజధాని టాప్ -5లో చోటు దక్కించుకుంది.ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్, టేస్ట్ అట్లాస్ 2024-25 సంవత్సరానికి సంబంధించిన తాజా లిస్టును ప్రకటించింది. వాటిలో అనేక స్థానాల్లో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది. అయితే గత ఏడాదితో పోలిస్తే ముంబై నగరం టాప్‌ప్లేస్‌కి ఎగబాకగా హైదరాబాద్, 50వ స్థానానికి పడిపోయింది.
ముంబై ప్రపంచంలో 5వ అత్యుత్తమ ఆహార నగరంగా నిలిచింది. టేస్ట్ అట్లాస్ అవార్డ్స్ 2024-25లో భాగంగా, ఫుడ్ గైడ్ వివిధ వర్గాలలో ర్యాంకింగ్‌లను విడుదల చేసింది.
"ప్రపంచంలోని 100 ఉత్తమ ఆహార నగరాల" జాబితాలో ముంబై 5వ స్థానంలో నిలిచింది.తొలి నాలుగు స్థానాలకు ఇటలీలోని నగరాలు చోటు సంపాదించాయి. నేపుల్స్, మిలన్, బోలోగ్నా, ఫ్లోరెన్స్. ముంబై తర్వాత రోమ్, పారిస్, వియన్నా, టురిన్ , ఒసాకా టాప్ 10లో ఉన్న నగరాలుగా ఉన్నాయి. అయితే ఈ జాబితాలో ఇతర భారతీయ నగరాలు కూడా చోటు దక్కించుకున్నాయి, వాటిలో మూడు ముంబైతో పాటు టాప్ 50లోకి వచ్చాయి. అమృత్‌సర్ 43వ స్థానంలో, న్యూఢిల్లీ 45వ స్థానంలో, హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా 50వ స్థానంలో నిలిచాయి. కోల్‌కతా 71వ స్థానంలో ఉండగా, చెన్నై 75వ స్థానంలో నిలిచింది.
అలాగే టేస్ట్ అట్లాస్ అవార్డ్స్ 2024-25లో భాగంగా, ప్రపంచంలోని అత్యుత్తమ వంటకాల ర్యాంకింగ్‌ను కూడా ప్రకటించింది. భారత్ టాప్ 10లో చోటు దక్కించుకోలేకపోయినప్పటికీ మెరుగ్గానే ఉందని తెలిపింది. కాగా గత ఏడాది ఈ జాబితాలో ముంబై35, హైదరాబాద్ 39వ స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీ 56వ స్థానంలోనూ, చెన్నై, లక్నో 65, 92 స్థానాల్లోనూ నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment