అవతార్ గ్రూప్ తాజగా మహిళా భద్రతకు పెద్దపీట వేసిన నగరాల జాబితాను టాప్ సిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా(టీసీడబ్ల్యూఐ) అనే సూచిక పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. ఆ సూచీలో మహిళలకు ది బెస్ట్ సిటీగా చెన్నై నిలిచింది. దీన్ని వైవిధ్యం, సమానత్వం, భ్రదత అంశాలను పరిగణలోనికి తీసుకుని ఈ ర్యాంకులు ఇచ్చింది. అంతేగాదు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ పాలసీలు, ప్రభుత్వ డేటా తోపాటు దాదాపు 12 వందల మంది మహిళల అభిప్రాయాలనే సేకరించి మరీ అవతార్ గ్రూప్ ఈ సూచీని రూపొందించింది.
ఈ సర్వేలో రెండు కేటగిరీలలో తమిళనాడు నగరాలు అగ్రస్థానంలో నిలిచాయి. మిలియన్ ప్లస్ జనాభా విభాగంలో 49 నగరాలు, మిలయిన్‌కంటే తక్కువ జనాభా విభాగంలో 64 నగరాలు ఉన్నాయి. అయితే మిలియన్ ప్లస్ విభాగంలో చెన్నై టాప్ పొజిషన్‌లో ఉండగా, మిలియన్ కంటే తక్కువ జనాభా ఉన్న విభాగంలో తిరుచిరాపల్లి అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఈ సర్వేలో దక్షిణాది రాష్ట్రలైన చెన్నై, బెంగళూరు, పూణె, ముంబై, హైదరాబాద్, నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ముఖ్యంగా వాటిలో మన హైదరాబాద్ టాప్ 5 నగరాల్లో ఉండటం విశేషం.
ఈ సర్వేని సిటీ ఇన్‌క్లూజన్ స్కోర్ (CIS), సామాజిక చేరిక స్కోర్ (SIS), ఇండస్ట్రియల్ ఇన్‌క్లూజన్ స్కోర్ (IIS) వంటి కీలక అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంకులు ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ అంశాలే కొలమానంగా బాహ్య సామాజిక వాతావరణం, సంస్థల్లో శ్రామిక క్తిని చేర్చడం, సర్వేల ద్వారా మహిళల అనుభవాలుతీసుకోవడం, ఫోకస్ గ్రూప్ చర్చలు(FGDs) తదితర వాటితో మహిళల అనుభవాలను అంచనా వేసి మరీ వెల్లడించింది అవతార్ గ్రూప్. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..మహిళలపై నేరాలకు పేరుగాంచిన దేశ రాజధాని ఢిల్లీ 8వ ర్యాంక్‌తో మొదటి 10 స్థానాల్లో నిలవడం విశేషం.
గతేడాది ఢిల్లీ ఈ సీఐఎస్ ర్యాంక్‌లో 14వ స్థానంలో ఉంది. కానీ భద్రత పరంగా ఎస్‌ఐఎస్ ర్యాంక్ ఎనిమిది స్థానాలు దిగజారి 27వ ర్యాంక్‌కు పరిమితమైంది. ఈమేరకు అవతార్ గ్రూప్ ఫౌండర్-ప్రెసిడెంట్ డాక్టర్ సౌందర్య రాజేష్ మాట్లాడుతూ..ఈ సూచిక దేశంలోని మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని పెంచేలా సమానత్వాన్ని తీసుకొచ్చేందుకు పిలుపునిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు..2027కల్లా భారతదేశం అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం ఉంది అనేందుకు తమ డేటా నిలువెత్తు సాక్ష్యం అవుతుందన్నారు. అంతేగాదు 2025 నాటికి భారతదేశం దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి వర్క్‌ఫోర్స్‌లో మహిళ భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేస్తూ సంస్థల్లో మరింత వైవిధ్యాన్ని తీసుకొచ్చేలా సామాజిక సమానత్వంపై గణనీయమైన ప్రభావం చూపుతుందని సౌందర్య రాజేష్ అన్నారు.
(చదవండి: మురికి వాడ నుంచి రూ. 900 కోట్ల సామ్రాజ్యానికి యజమానిగా! రియల్ స్లమ్ డాగ్ మిలియనీర్!)
Comments
Please login to add a commentAdd a comment