safest
-
ఆ దేశంలో తుపాకీ పట్టని పోలీసులు.. కారణమిదే
మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరం ప్రారంభం కాబోతోంది. కొందరు కొత్త సంవత్సరంలో విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈ నేపధ్యంలో ఆ ప్రదేశంలో ఎన్నో ప్రత్యేకతలు ఉండాలని కోరుకుంటారు. అలాంటి ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అత్యంత సురక్షిత దేశంఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడి భద్రత గురించి మనకు ముందుగా తెలియదు. అటువంటి పరిస్థితిలో భద్రత కలిగిన ప్రాంతాల గురించి మనం అన్వేషిస్తాం. ఇటీవల అమెరికన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీ బెర్క్‌షైర్ హాత్వే ట్రావెల్ తాజాగా ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన దేశాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొదటి పేరు ఐస్లాండ్. ఈ దేశం 2025లో సందర్శించడానికి అత్యంత సురక్షితమైన ప్రదేశంగా ఆ కంపెనీ తెలిపింది.పలు అంశాలపై సర్వేఈ జాబితాను సిద్ధం చేసేందుకు బెర్క్‌షైర్ హాత్వే ట్రావెల్ కంపెనీ ఒక సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో, క్రైమ్ రేట్, మహిళల భద్రత, ఎల్‌జీబీటీఐక్యూ ప్లస్, ప్రయాణికుల అనుభవం, రవాణా వ్యవస్థ, ఆరోగ్య సేవలు తదితర వివరాలను ప్రయాణికుల నుంచి సేకరించారు. ఈ సంస్థ 2016 నుంచి ఈ విధమైన సర్వేలు నిర్వహిస్తోంది.పోలీసులు తుపాకులు పట్టుకోరుగత సంవత్సరం ఈ జాబితాలో ఐస్లాండ్ తొమ్మిదో స్థానంలో ఉంది. అయితే 2024లో ప్రయాణికులు అందించిన వివరాలు, రేటింగ్ ఆ దేశాన్ని అగ్రస్థానానికి తీసుకువెళ్లాయి. ఈ ద్వీపం చాలా చిన్నది. నాలుగు లక్షల జనాభా మాత్రమే ఇక్కడ ఉంటోంది. ఇక్కడ హింసాత్మక నేరాల రేటు చాలా తక్కువ. పోలీసులు తుపాకులను పట్టరు. ఐస్లాండ్కు సైన్యం కూడా లేదు. ఐస్లాండ్ 2024లో అనేక అగ్నిపర్వత విస్ఫోటనాలను చవిచూసింది. ఇది పర్యాటకుల తాకిడిపై ఏ మాత్రం ప్రభావం చూపకపోవడం విశేషంఐస్లాండ్లో ఏమిటి ఫేమస్?ఐస్లాండ్ రాజధాని రెక్జావిక్ పర్యాటకులలో నిత్యం అత్యంత రద్దీగా ఉంటుంది. నగరం నడిబొడ్డున ఉన్న అతిపెద్ద చర్చి పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంటుంది. ఐస్లాండ్లో వివిధ ఆకారాలు, పరిమాణాలు కలిగిన మంచుకొండలను దగ్గరి నుంచి చూడవచ్చు. దేశంలో పర్యాటకులను ఆకర్షించేలా అనేక ప్రదేశాలు ఉన్నాయి.సురక్షిత దేశాల జాబితాలో.. ఈ జాబితాలో ఆస్ట్రేలియా రెండవ స్థానంలో ఉంది. ఈ దేశాన్ని పర్యాటకులకు సురక్షితం దేశంగా భావిస్తారు. నేరాల రేటు కూడా ఇక్కడ చాలా తక్కువ. పర్యాటకులు ఈ దేశ రవాణా భద్రతను ఉత్తమంగా రేట్ చేశారు. సురక్షితమైన దేశాల జాబితాలో కెనడా మూడవ స్థానంలో నిలిచింది. ఈ దేశం మహిళలకు, ఎల్జీబీటీక్యూఐఏ ప్లస్ వర్గాలకు సురక్షితమైనదని, నేరాల రేటు తక్కువగా ఉందని సర్వే పేర్కొంది. నయాగరా జలపాతం, బాన్ఫ్ నేషనల్ పార్క్ కెనడాలో ప్రత్యేక పర్యాటక ఆకర్షణలు.ఈ జాబితాలో తర్వాతి స్థానంలో ఐర్లాండ్ ఉంది. ఈ దేశంలో నేరాల రేటు చాలా తక్కువ. ఈ దేశంలో 50 లక్షల జనాభా ఉంది. ఈ దేశం ప్రకృతి అందాలకు నిలయంగా నిలిచింది. ఈ జాబితాలో స్విట్జర్లాండ్ ఐదో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్, జర్మనీ, నార్వే, జపాన్, డెన్మార్క్, పోర్చుగల్, స్పెయిన్, యునైటెడ్ కింగ్డమ్, నెదర్లాండ్స్, స్వీడన్ తదితర దేశాలు ఈ జాబితాలో తదుపరి స్థానాల్లో ఉన్నాయి.ఇది కూడా చదవండి: నేడు సుబ్రహ్మణ్య షష్టి: ఈ 10 ఆలయాల్లో విశేష పూజలు -
మహిళా భద్రతలో టాప్.... చెన్నై!
అవతార్ గ్రూప్ తాజగా మహిళా భద్రతకు పెద్దపీట వేసిన నగరాల జాబితాను టాప్ సిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా(టీసీడబ్ల్యూఐ) అనే సూచిక పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. ఆ సూచీలో మహిళలకు ది బెస్ట్ సిటీగా చెన్నై నిలిచింది. దీన్ని వైవిధ్యం, సమానత్వం, భ్రదత అంశాలను పరిగణలోనికి తీసుకుని ఈ ర్యాంకులు ఇచ్చింది. అంతేగాదు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ పాలసీలు, ప్రభుత్వ డేటా తోపాటు దాదాపు 12 వందల మంది మహిళల అభిప్రాయాలనే సేకరించి మరీ అవతార్ గ్రూప్ ఈ సూచీని రూపొందించింది. ఈ సర్వేలో రెండు కేటగిరీలలో తమిళనాడు నగరాలు అగ్రస్థానంలో నిలిచాయి. మిలియన్ ప్లస్ జనాభా విభాగంలో 49 నగరాలు, మిలయిన్కంటే తక్కువ జనాభా విభాగంలో 64 నగరాలు ఉన్నాయి. అయితే మిలియన్ ప్లస్ విభాగంలో చెన్నై టాప్ పొజిషన్లో ఉండగా, మిలియన్ కంటే తక్కువ జనాభా ఉన్న విభాగంలో తిరుచిరాపల్లి అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఈ సర్వేలో దక్షిణాది రాష్ట్రలైన చెన్నై, బెంగళూరు, పూణె, ముంబై, హైదరాబాద్, నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ముఖ్యంగా వాటిలో మన హైదరాబాద్ టాప్ 5 నగరాల్లో ఉండటం విశేషం. ఈ సర్వేని సిటీ ఇన్‌క్లూజన్ స్కోర్ (CIS), సామాజిక చేరిక స్కోర్ (SIS), ఇండస్ట్రియల్ ఇన్‌క్లూజన్ స్కోర్ (IIS) వంటి కీలక అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంకులు ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ అంశాలే కొలమానంగా బాహ్య సామాజిక వాతావరణం, సంస్థల్లో శ్రామిక క్తిని చేర్చడం, సర్వేల ద్వారా మహిళల అనుభవాలుతీసుకోవడం, ఫోకస్ గ్రూప్ చర్చలు(FGDs) తదితర వాటితో మహిళల అనుభవాలను అంచనా వేసి మరీ వెల్లడించింది అవతార్ గ్రూప్. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..మహిళలపై నేరాలకు పేరుగాంచిన దేశ రాజధాని ఢిల్లీ 8వ ర్యాంక్‌తో మొదటి 10 స్థానాల్లో నిలవడం విశేషం. గతేడాది ఢిల్లీ ఈ సీఐఎస్ ర్యాంక్‌లో 14వ స్థానంలో ఉంది. కానీ భద్రత పరంగా ఎస్ఐఎస్ ర్యాంక్ ఎనిమిది స్థానాలు దిగజారి 27వ ర్యాంక్‌కు పరిమితమైంది. ఈమేరకు అవతార్ గ్రూప్ ఫౌండర్-ప్రెసిడెంట్ డాక్టర్ సౌందర్య రాజేష్ మాట్లాడుతూ..ఈ సూచిక దేశంలోని మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని పెంచేలా సమానత్వాన్ని తీసుకొచ్చేందుకు పిలుపునిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు..2027కల్లా భారతదేశం అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం ఉంది అనేందుకు తమ డేటా నిలువెత్తు సాక్ష్యం అవుతుందన్నారు. అంతేగాదు 2025 నాటికి భారతదేశం దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి వర్క్‌ఫోర్స్‌లో మహిళ భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేస్తూ సంస్థల్లో మరింత వైవిధ్యాన్ని తీసుకొచ్చేలా సామాజిక సమానత్వంపై గణనీయమైన ప్రభావం చూపుతుందని సౌందర్య రాజేష్ అన్నారు. (చదవండి: మురికి వాడ నుంచి రూ. 900 కోట్ల సామ్రాజ్యానికి యజమానిగా! రియల్ స్లమ్ డాగ్ మిలియనీర్!) -
బెదిరింపులు: అంబానీ కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారు, ప్రత్యేకత తెలిస్తే..!
ఆసియాలో అత్యంత ధనవంతుడు, ఇండియాలో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ఇండస్ట్రీస్ (మార్కెట్ క్యాప్ రూ. 17.69 ట్రిలియన్లు) అధినేత ముఖేష్ అంబానీ ఖరీదైన కార్ల విషయంలో కూడా తగ్గేదేలే అన్నట్టు ఉంటారు. తాజాగా మోస్ట్ సేఫెస్ట్, 'బుల్లెట్ ప్రూఫ్' మెర్సిడెస్ బెంజ్‌కారును ఆయన సొంతం చేసుకున్నారు. దీని విలువ 10 కోట్ల రూపాయలకు పైమాటే. ఈ కారుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. బిలియనీర్ అంబానీ కుటుంబ సభ్యులు లగ్జరీ ఎస్‌యూవీలు, ఖరీదైన కార్లతో పొడవైన కాన్వాయ్‌లలో ప్రయాణిస్తూ ఉంటారు. తాజాగా మెర్సిడెస్-బెంజ్-S680 గార్డ్ బుల్లెట్‌ప్రూఫ్ సెడాన్‌ను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ మోడళ్లలో ఒకటి ఎస్ 680 గార్డ్ సెడాన్. ఇటీవల అంబానీకి బెదిరింపులు ఎక్కువైన తరుణంలో ఈ కొత్త కారు ప్రత్యేకతలు విశేషంగా నిలుస్తున్నాయి. (ట్విటర్ కొత్త లోగో: ఉద్యోగులు అరెస్ట్, వీడియో వైరల్ ) CS12 Vlogs షేర్ చేసిన వీడియోలో కాన్వాయ్‌తో పాటు, కొత్త బుల్లెట్‌ప్రూఫ్ కారులో చూడవచ్చు. ఇది ఇతర మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లాగానే కనిపిస్తుంది. కానీ సాధారణ సెడాన్ కంటే దాదాపు 2 టన్నుల బరువు ఎక్కువ . అలాగే దీని బాడీ ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ షెల్‌ను కలిగి ఉంది. కారులో బుల్లెట్, బ్లాస్ట్ ప్రూఫ్, మల్టీ-లేయర్ గ్లాస్ ఉన్నాయి. మెషిన్ గన్లు కాల్పులనుంచి రక్షించే కెపాసిటీ ఉన్న కారిది. (ఐఆర్సీటీసీ డౌన్, యూజర్లు గగ్గోలు!) కేవలం తుపాకీ కాల్పుల తాకిడికి మాత్రమే తట్టుకోగలదని అనుకుంటే పొరపాటే. ఇదిగ్రెనేడ్ల దాడిని కూడా తట్టుకోగలదు. అంతేకాదు ఫైర్ యాక్సిడెంట్స్ నుంచి కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. సూపర్-ఖరీదైన కారు రీన్ఫోర్స్డ్ టైర్లతో వస్తుంది. గంటకు 80 కిమీ వేగంతో దూసుకుపోతుంది. ఈ కారు 6.0-లీటర్ V12 ఇంజన్‌తో 612 పవర్‌ను, 830 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా ముఖేష్ అంబానీ ఫ్యామిలీ కాన్వాయ్‌లో రోల్స్ రాయిస్ కల్లినన్ SUV, లంబోర్ఘిని ఉరస్, మెర్సిడెస్-AMG G63, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, మెర్సిడెస్-మేబ్యాక్ S580 లాంటి ఇతర ఖరీదైన కార్లు ఉన్నాయి. -
భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్ ఇదే..!
స్మార్ట్‌ఫోన్స్‌లో అత్యంత సురక్షితమైనా ఫోన్ ఏది అంటే ఠక్కున చెప్పే పేరు..ఆపిల్ ఐఫోన్ లేదా గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్స్ అని చెప్పేస్తాము. ఐఫోన్లకు, గూగుల్ పిక్సెల్ ఫోన్లకు ఆదరణ మామూలుగా ఉండదు.సెక్యూరిటీ విషయంలో ఇతర మొబైల్ ఫోన్లతో పోలిస్తే ఈ రెండు ఫోన్లకు సాటి లేదు. ఐఫోన్‌ను చాలా మంది వినియోగించడానికి ప్రధాన కారణం భద్రత. ఆపిల్ తన వినియోగదారుల ప్రైవసీ,భద్రత విషయంలో అసలు రాజీ పడదు. కొద్దిరోజుల క్రితం పెగాసస్ సాఫ్ట్‌వేర్‌తో ఐఫోన్లను కూడా హ్యాకింగ్ చేస్తూన్నారనే వార్తలు కూడా వచ్చాయి. అప్పట్లో తమ వినియోగదారులకోసం ఆపిల్ ఐవోఎస్‌ను మార్చుకోండి అని సూచించింది. చదవండి: Apple : సెప్టెంబర్ 14నే ఐఫోన్-13 రిలీజ్..! కారణం అదేనా..! భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్ ఇదే..! ఒకానొక సందర్భంలో ఐఫోన్లు కూడా హ్యాకింగ్ గురైతుందనే వార్తలు కొంత విస్మయాన్ని గురిచేశాయి. అసలు ప్రైవసీ విషయంలో అత్యంత సురక్షితమైన స్మార్ట్‌ఫోన్స్ లేవనుకుంటే మీరు పొరపడినట్లే..! జర్మనీకి చెందిన నైట్రోకీ కంపెనీ తయారుచేసిన నైట్రోఫోన్ 1 భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్‌గా నిలిచినట్లు 9టూ5 గూగుల్ నివేదించింది. ప్రైవసీపై ఎక్కు వ దృష్టిసారించి నైట్రోఫోన్ 1 ను తయారుచేశారు. ఈ ఫోన్ తయారుచేయడం కోసం గూగుల్ పిక్సెల్ 4ఏలోని హర్డ్‌వేర్ పార్ట్‌ను తీసివేసి ఇతర హర్డ్వేర్తో రిప్లేస్ చేశారు. ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌కు బదులు గ్రాఫ్రేనియన్ఓఎస్తో నడుస్తోంది. నైట్రోకీ కంపెనీ హర్డ్‌వేర్ సెక్యూరిటీకీలను, ల్యాప్‌టాప్‌లను, పర్సనల్ కంప్యూటర్లను జర్మనీలో విక్రయిస్తుంది. నైట్రోఫోన్ 1 స్పెషాలిటీలు నైట్రోఫోన్ 1లో గూగుల్‌కు సంబంధించిన యాప్స్ రావు, ఈ ఫోన్లో గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఫోటోస్ వంటి యాప్స్‌కు యాక్సెస్ ఉండదు. ఆన్లైన్లో సురక్షితమైన బ్రౌజింగ్ కోసం అత్యంత శక్తివంతమైన వెర్షన్ క్రోమియం బ్రౌజర్‌తో నడుస్తోంది. ఆండ్రాయిడ్ కెర్నల్, వెబ్‌వ్యూ, కంపైలర్ టూల్‌చైన్, ఫైల్ సిస్టమ్ యాక్సెస్ వంటివి అత్యంత బలమైన వెర్షన్ సహయంతో ఈ ఫోన్ పనిచేస్తుంది. ప్రైవసీని మెరుగుపరచడానికి ఇంటర్ఫేస్ మెరుగుదల కోసం ఆటోమేటెడ్ షట్డౌన్లు వస్తూంటాయి. మీ IMEI నంబర్, MAC చిరునామాను ఇతరుల డిటెక్ట్ చేయకుండా మాస్క్ చేస్తోంది. నైట్రోఫోన్ 1 ధర 630 యూరోలు(సుమారు రూ. 54,629). చదవండి: Tinder User Creates A Contract: బాయ్‌ఫ్రెండ్‌గా కొనసాగాలంటే..బాండ్ మీద సంతకం చేయాల్సిందే..! -
బ్రస్సెల్స్ లో ప్రముఖ గాయకుడి కుటుంబం
ముంబై: బ్రస్సెల్స్ విమానాశ్రయంలో పేలుళ్ల ఘటనతో ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అభిజిత్ భట్టాచార్య కుటుంబం అక్కడ చిక్కుకుంది. దీంతో అభిజిత్ ఆందోళనలో పడ్డారు. తన కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. బెల్జియం రాజధానిలోని విమానాశ్రయంలో పేలుళ్ల వార్త తనకు చాలా బాధ కలిగించిందని అభిజిత్ అన్నారు. పేలుళ్లు జరిగిన విమానాశ్రయంలో తమ వారు చిక్కుకోవడం చాలా ఆందోళన కలిగించిందని మీడియాకు తెలిపారు. అదృష్టవశాత్తూ వారు క్షేమంగా ఉండడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అటు బెల్జియన్ ప్రధాన మంత్రి చార్లెస్ మిచెల్ స్పందిస్తూ తమ దేశంలో ఇవి విషాద క్షణాలనీ, ప్రశాంతంగా , ఐక్యంగా ఉండడం అవసరమన్నారు. బ్రస్సెల్స్ పేలుళ్ల ఘటనపై ప్రపంచవ్యాప్తంగా పలువురు స్పందించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. పేలుళ్ల మృతులకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు తొందరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ బ్రెస్సెల్స్ పేలుళ్ల ఘటన తనను షాక్ కు గురిచేసిందన్నారు. తాము చేయగలిగిన సహాయాన్ని అందిస్తామంటూ ట్విట్ చేశారు. -
స్వచ్ఛమైన గాలి కోసం కొత్త యాప్..!
వాతావరణ కాలుష్యం ఇప్పుడు ప్రపంచాన్నే ఇబ్బంది పెడుతున్న పెద్ద సమస్య. అందులోనూ, పీల్చే గాలి, తాగే నీరు పొల్యూట్ అయిపోవడం జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. అందుకే లండన్ సైంటిస్లులు గాలిపీల్చేముందు జనం కాస్త జాగ్రత్త పడేందుకు ఓ కొత్త యాప్ ను సృష్టించారు. యాండ్రాయిడ్ ఫోన్లు వాడకంలోకి వచ్చిన తర్వాత ప్రతి విషయం యాప్ తోనే సాధ్యమనుకున్న పరిశోధకులు... లండన్ ప్రజలను పొల్యూషన్ నుంచి కాపాడేందుకు యాప్ ద్వారా అలర్డ్ చేస్తున్నారు. ఫ్రెంచ్ వినియోగదారుల కోసం 'ఫ్లూమ్ ఎయిర్ రిపోర్ట్' పేరున ప్రారంభించిన యాప్ ను ఇప్పుడు లండన్ లోని సుమారు మూడు వేలమంది డౌన్ లోడ్ చేసుకుని వాడుతున్నారు. లండన్ లో బయటకు వెళ్ళాల్సి వచ్చినపుడు వాతావరణంలో పరిశుభ్రమైన గాలి ఉందా లేదా అని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చునట. అధిక కాలుష్యం ఉన్న పారిస్ వాసులకు ఇది ఎంతో ఉపయోగపడుతోందట. ఫ్లూమ్ ఎయిర్ రిపోర్ట్... సెన్సర్ల ద్వారా లండన్ చుట్టు పక్కల ప్రాంతాల్లోని వాతావరణంలోని కాలుష్యాన్నిప్రతి గంటకు రికార్డు చేస్తుంది. సుమారు 30 దేశాల్లో, 11 వేల స్టేషన్లద్వారా , నైట్రోజెన్ డయాక్పైడ్, ఓజోన్, కార్బన్ మోనాక్పైడ్ వంటి గాలిలోని పలు కలుషితాలను ఇది పరీక్షిస్తుంది. ఎవరైనా ముందుగానే పొల్యూషన్ లేని సమయాలను నిర్థారించుకోవచ్చంటూ యాప్ ప్రయోజనాలను యాప్.. స్థాపకుడు రొమైన్ లాన్ కొంబే చెప్తున్నారు. లండన్ రాజధాని పారిస్ లో వాతావరణ కాలుష్యం కారణంగా అక్కడ నివసించే ప్రజల జీవిత కాలం తగ్గిపోతోందని కింగ్స్ కాలేజ్ అధ్యయనాల్లో వెల్లడైంది. కాలుష్యం ఫలితంగా సంవత్సరంలో సుమారు 9,400 మంది మరణిస్తున్నారని అధ్యయనాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా డీజిల్ వాహనాలవల్ల 40 శాతం వాయు కాలుష్యం ఏర్పడటం పెద్ద సమస్యగా మారింది. ఈ పరిస్థితుల్లో ఈ కొత్త యాప్ లండన్ ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని యాప్ స్థాపకుడు చెప్తున్నారు.