ఆసియాలో అత్యంత ధనవంతుడు, ఇండియాలో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ఇండస్ట్రీస్ (మార్కెట్ క్యాప్ రూ. 17.69 ట్రిలియన్లు) అధినేత ముఖేష్ అంబానీ ఖరీదైన కార్ల విషయంలో కూడా తగ్గేదేలే అన్నట్టు ఉంటారు. తాజాగా మోస్ట్ సేఫెస్ట్, 'బుల్లెట్ ప్రూఫ్' మెర్సిడెస్ బెంజ్‌కారును ఆయన సొంతం చేసుకున్నారు. దీని విలువ 10 కోట్ల రూపాయలకు పైమాటే. ఈ కారుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.
బిలియనీర్ అంబానీ కుటుంబ సభ్యులు లగ్జరీ ఎస్‌యూవీలు, ఖరీదైన కార్లతో పొడవైన కాన్వాయ్‌లలో ప్రయాణిస్తూ ఉంటారు. తాజాగా మెర్సిడెస్-బెంజ్-S680 గార్డ్ బుల్లెట్‌ప్రూఫ్ సెడాన్‌ను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ మోడళ్లలో ఒకటి ఎస్ 680 గార్డ్ సెడాన్. ఇటీవల అంబానీకి బెదిరింపులు ఎక్కువైన తరుణంలో ఈ కొత్త కారు ప్రత్యేకతలు విశేషంగా నిలుస్తున్నాయి. (ట్విటర్ కొత్త లోగో: ఉద్యోగులు అరెస్ట్, వీడియో వైరల్ )
CS12 Vlogs షేర్ చేసిన వీడియోలో కాన్వాయ్‌తో పాటు, కొత్త బుల్లెట్‌ప్రూఫ్ కారులో చూడవచ్చు. ఇది ఇతర మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లాగానే కనిపిస్తుంది. కానీ సాధారణ సెడాన్ కంటే దాదాపు 2 టన్నుల బరువు ఎక్కువ . అలాగే దీని బాడీ ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ షెల్‌ను కలిగి ఉంది. కారులో బుల్లెట్, బ్లాస్ట్ ప్రూఫ్, మల్టీ-లేయర్ గ్లాస్ ఉన్నాయి. మెషిన్ గన్‌లు కాల్పులనుంచి రక్షించే కెపాసిటీ ఉన్న కారిది. (ఐఆర్‌సీటీసీ డౌన్, యూజర్లు గగ్గోలు!)
కేవలం తుపాకీ కాల్పుల తాకిడికి మాత్రమే తట్టుకోగలదని అనుకుంటే పొరపాటే. ఇదిగ్రెనేడ్ల దాడిని కూడా తట్టుకోగలదు. అంతేకాదు ఫైర్ యాక్సిడెంట్స్ నుంచి కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. సూపర్-ఖరీదైన కారు రీన్‌ఫోర్స్డ్ టైర్‌లతో వస్తుంది. గంటకు 80 కిమీ వేగంతో దూసుకుపోతుంది. ఈ కారు 6.0-లీటర్ V12 ఇంజన్‌తో 612 పవర్‌ను, 830 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా ముఖేష్ అంబానీ ఫ్యామిలీ కాన్వాయ్‌లో రోల్స్ రాయిస్ కల్లినన్ SUV, లంబోర్ఘిని ఉరస్, మెర్సిడెస్-AMG G63, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, మెర్సిడెస్-మేబ్యాక్ S580 లాంటి ఇతర ఖరీదైన కార్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment