bullet proof vehicle
-
జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి లోపాలు నిజమే
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్రెడ్డికి భద్రతలో భాగంగా ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం లోపభూయిష్టమైనదన్న వాస్తవాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఎదుట పరోక్షంగా అంగీకరించింది. ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి మరమ్మతులు చేయించి పాడైపోయిన భాగాలను మార్చి తిరిగి వైఎస్ జగన్‌కు కేటాయిస్తామని హైకోర్టుకు నివేదించింది. ఈలోపు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఆయనకు కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయినందున ఆయనకు మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. తనకు గతంలో ఉన్న భద్రతను భారీగా కుదించడంపై వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై పూర్తి వివరాలతో రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని, కేంద్ర హోంశాఖను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం వారంలోపు ఆ కౌంటర్‌కు సమాధానం దాఖలు చేయాలని వైఎస్ జగన్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 28వతేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.మాజీ ప్రధానుల్లా ఎందుకు భద్రత కల్పించకూడదు...?వైఎస్ జగన్ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ మాజీ సీఎంకు జెడ్ ప్లస్ కేటగిరీ అలాగే ఉన్నా భద్రతను మాత్రం భారీగా కుదించి వేశారని నివేదించారు. గతంలో 10 మంది పీఎస్ఓలు ఉంటే ఇప్పుడు ఇద్దరినే కేటాయించారన్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా భద్రతను కుదించిందన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ మాజీ ముఖ్యమంత్రికి భద్రత విషయంలో ఓ నిర్దిష్ట విధానపరమైన నిర్ణయం ఎందుకు తీసుకోకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాజీ ప్రధానులకు కల్పిస్తున్న రీతిలోనే మాజీ ముఖ్యమంత్రులకు కూడా భద్రత కల్పించడం సబబుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. గత మాజీ ముఖ్యమంత్రికి ఎలాంటి భద్రత కల్పించారని ప్రశ్నించారు. దీనికి దమ్మాలపాటి బదులిస్తూ తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో ఆయనకు ఎస్పీజీ భద్రత కల్పించారని చెప్పారు. మరి మిగిలిన మాజీ ముఖ్యమంత్రుల సంగతి ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించడంతో వారికి ‘వై’ కేటగిరీ భద్రతను ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఎలాంటి భద్రత కల్పించాలన్నది వారికి ఉన్న ప్రాణహానిని బట్టి ఉంటుందని దమ్మాలపాటి చెప్పారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని, ఆ తరువాత పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కోర్టును కోరారు.మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వకుంటే ఎలా..?ఈ సమయంలో శ్రీరామ్ స్పందిస్తూ అందుకు అభ్యంతరం లేదని, అప్పటి వరకు 3.6.24 నాటికి జగన్‌కున్న భద్రతను కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే దీనిని దమ్మాలపాటి వ్యతిరేకించారు. చట్ట ప్రకారం ముఖ్యమంత్రికే ఆ స్థాయి భద్రత ఉంటుందన్నారు. ఈ సమయంలో శ్రీరామ్ జోక్యం చేసుకుంటూ జగన్‌కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం పూర్తి లోపభూయిష్టంగా ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. కారు అద్దాలపై పగుళ్లు ఉన్నాయని, వెనుక డోరు తెరుచుకోవడం లేదని, అత్యవసర పరిస్థితుల్లో కారు నుంచి బయటకు వచ్చే అవకాశం ఏమాత్రం లేదని నివేదించారు. జామర్ సదుపాయం కూడా తొలగించారన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ మాజీ ముఖ్యమంత్రికి మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వకుంటే ఎలా? ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు. దీనిపై ఏం చేయబోతున్నారో తెలుసుకుని చెప్పాలని దమ్మాలపాటిని ఆదేశిస్తూ విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేశారు.ప్రాణహాని లేదనేందుకు ప్రభుత్వం వద్ద ఆధారాలు లేవు...తిరిగి మధ్యాహ్నం విచారణ మొదలు కాగానే దమ్మాలపాటి స్పందిస్తూ వైఎస్ జగన్‌కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం అద్దాలకు పగుళ్లు ఉన్నాయని అంగీకరించారు. ఆ అద్దాన్ని మారుస్తామని, ఆ వాహనం మొత్తానికి మరమ్మతులు చేయిస్తామన్నారు. అప్పటి వరకు వైఎస్ జగన్‌కు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయిస్తామని చెప్పారు. మరి జామర్ సంగతి ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించగా.. జగన్ ఏదైనా ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ రిమోట్ కంట్రోల్డ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఆర్‌సీఐఈడీ) ఉపయోగించే అవకాశాలు ఉంటే ఆ విషయాన్ని ఆయన భద్రతా సిబ్బందికి తెలియచేసి అప్పుడు మాత్రమే జామర్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. మిగిలిన అన్ని సమయాల్లో జామర్ ఇవ్వడం సాధ్యం కాదన్నారు. దీనిపై శ్రీరామ్ స్పందిస్తూ వైఎస్ జగన్‌కున్న ప్రాణహానిని ప్రభుత్వం సరిగా మదింపు చేయలేదని చెప్పారు. ప్రాణహాని లేదని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలను కోర్టు ముందుంచలేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ చెప్పిన వివరాలను న్యాయమూర్తి నమోదు చేశారు. -
ఆ వాహనం కాలం చెల్లిందే
సాక్షి, అమరావతి: అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబైతే.. దు ష్ప్రచారానికి మారుపేరు టీడీపీ అనేది మరోసారి నిరూపితమైంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రభుత్వం కలి్పంచిన భద్రతలో బహిర్గతమైన డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి పచ్చి అబద్ధాలను అస్త్రాలుగా చేసుకుని, దు్రష్ఫచారం చేసే యత్నంలో టీడీపీ అడ్డంగా దొరికిపోయింది. వైఎస్ జగన్‌కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం(ఏపీ 39పీ 0014) పాతదేనని అంగీకరించడం ద్వారా తన నకిలీ బతుకును బయపెట్టుకుంది. ఆ వాహనంలో పదేళ్లు చంద్రబాబు ప్రయాణించారని.. రాష్ట్ర వ్యాప్తంగా వేల కిలోమీటర్లు తిరిగారని ‘ఎక్స్’ (ట్విట్టర్)లో ఆ పార్టీ అధికారికంగా వెల్లడించింది.కాలం చెల్లిన ఆ వాహనానికి కనీసం మరమ్మతులు చేయకుండా వైఎస్ జగన్‌కు కేటాయించింది. వినుకొండలో నడిరోడ్డుపై ప్రజలందరూ చూస్తుండగానే వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్‌ను టీడీపీ కార్యకర్త జిలానీ కత్తితో అత్యంత పాశవికంగా నరికి నరికి చంపారు. ఈ నేపథ్యంలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు శుక్రవారం ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే తాడేపల్లి నుంచి వినుకొండకు వైఎస్ జగన్ బయలుదేరారు. అత్యంత పాతది.. పైగా మరమ్మతులు చేయకపోవడంతో ఆ వాహనం పదే పదే మొరాయించింది. దాంతో మరో వాహనంలో వైఎస్ జగన్ వినుకొండ చేరుకున్నారు.మాజీ సీఎం వైఎస్ జగన్‌కు జడ్ ప్లస్ భద్రత ఉంది. జడ్ ప్లస్ భద్రత ఉన్న వారికి ఎవరికైనా కండీషన్లో ఉండే బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలన్నది నిబంధన. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. జడ్ ప్లస్ భద్రత ఉన్న అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కండీషన్లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం తద్భిన్నంగా వైఎస్ జగన్‌కు కాలం చెల్లిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. పదేళ్లపాటు లక్షల కిలో మీటర్లు తిరిగిన ఆ వాహనానికి టీడీపీ సర్కార్ కనీసం మరమ్మతులు కూడా చేయించలేదు. వైఎస్ జగన్‌పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే టీడీపీ ప్రభుత్వం ఇలా వ్యవహరించిందని స్పష్టమవుతోంది. -
ముఖేష్ అంబానీ కొత్త కారు.. ధర తెలిస్తే షాకవుతారు!
ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'ముఖేష్ అంబానీ' (Mukesh Ambani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే వీరి కుటుంబం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా ఇప్పుడు ఓ కొత్త జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసి మరో సారి వార్తల్లో నిలిచింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మెర్సిడెస్ బెంజ్ S680.. భారతదేశంలోని ముఖ్యమైన వ్యక్తులలో ఒకరైన ముఖేష్ అంబానీకి ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది. ఇందులో భాగంగానే వారి సెక్యూరిటీలో కూడా అత్యంత ఖరీదైన సేఫెస్ట్ కార్లను వినియోగిస్తారు. అయితే ముకేశ్ అంబానీ మాత్రం మరింత కట్టుదిట్టమైన భద్రత కలిగిన బుల్లెట్ ప్రూఫ్ కారు వినియోగిస్తారు. దీనికి సంబంధించిన వీడియోలు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. కాగా ఇటీవల ఓ కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించారు. ఇది వారి గ్యారేజిలో చేరిన 7వ బుల్లెట్ ప్రూఫ్ మెర్సిడెస్ ఫ్లాగ్షిప్ సెడాన్. ముఖేష్ అంబానీ 7వ మెర్సిడెస్ బెంజ్ ఎస్680 గార్డ్ చిత్రాలను కార్ క్రేజీ ఇండియా ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసారు. ఇందులో కొత్త కారుని చూడవచ్చు. ఈ కారుతో పాటు రేంజ్ రోవర్ వోగ్ సెక్యూరిటీ కారు కూడా ఇక్కడ కనిపిస్తుంది. బెంజ్ కారుకి 999 అనే ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ కలిగి ఉండటం కూడా ఇక్కడ గమనించవచ్చు. ముఖేష్ అంబానీ గ్యారేజిలో చేరిన ఈ కారు ధర రూ. 10 కోట్లు వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇది చాలా సురక్షితమైన కారుగా తీర్చిదిద్దారు. కావున బాంబులు దాడి నుంచి కూడా తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ బెంజ్ కారు ట్విన్-టర్బోచార్జ్డ్ 6.0-లీటర్ V12 ఇంజన్ ద్వారా 523 Bhp పవర్ అండ్ 850 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తూ ఉత్తమ పనితీరుని అందిస్తుంది. -
బెదిరింపులు: అంబానీ కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారు, ప్రత్యేకత తెలిస్తే..!
ఆసియాలో అత్యంత ధనవంతుడు, ఇండియాలో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ఇండస్ట్రీస్ (మార్కెట్ క్యాప్ రూ. 17.69 ట్రిలియన్లు) అధినేత ముఖేష్ అంబానీ ఖరీదైన కార్ల విషయంలో కూడా తగ్గేదేలే అన్నట్టు ఉంటారు. తాజాగా మోస్ట్ సేఫెస్ట్, 'బుల్లెట్ ప్రూఫ్' మెర్సిడెస్ బెంజ్‌కారును ఆయన సొంతం చేసుకున్నారు. దీని విలువ 10 కోట్ల రూపాయలకు పైమాటే. ఈ కారుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. బిలియనీర్ అంబానీ కుటుంబ సభ్యులు లగ్జరీ ఎస్‌యూవీలు, ఖరీదైన కార్లతో పొడవైన కాన్వాయ్‌లలో ప్రయాణిస్తూ ఉంటారు. తాజాగా మెర్సిడెస్-బెంజ్-S680 గార్డ్ బుల్లెట్‌ప్రూఫ్ సెడాన్‌ను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ మోడళ్లలో ఒకటి ఎస్ 680 గార్డ్ సెడాన్. ఇటీవల అంబానీకి బెదిరింపులు ఎక్కువైన తరుణంలో ఈ కొత్త కారు ప్రత్యేకతలు విశేషంగా నిలుస్తున్నాయి. (ట్విటర్ కొత్త లోగో: ఉద్యోగులు అరెస్ట్, వీడియో వైరల్ ) CS12 Vlogs షేర్ చేసిన వీడియోలో కాన్వాయ్‌తో పాటు, కొత్త బుల్లెట్‌ప్రూఫ్ కారులో చూడవచ్చు. ఇది ఇతర మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లాగానే కనిపిస్తుంది. కానీ సాధారణ సెడాన్ కంటే దాదాపు 2 టన్నుల బరువు ఎక్కువ . అలాగే దీని బాడీ ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ షెల్‌ను కలిగి ఉంది. కారులో బుల్లెట్, బ్లాస్ట్ ప్రూఫ్, మల్టీ-లేయర్ గ్లాస్ ఉన్నాయి. మెషిన్ గన్లు కాల్పులనుంచి రక్షించే కెపాసిటీ ఉన్న కారిది. (ఐఆర్సీటీసీ డౌన్, యూజర్లు గగ్గోలు!) కేవలం తుపాకీ కాల్పుల తాకిడికి మాత్రమే తట్టుకోగలదని అనుకుంటే పొరపాటే. ఇదిగ్రెనేడ్ల దాడిని కూడా తట్టుకోగలదు. అంతేకాదు ఫైర్ యాక్సిడెంట్స్ నుంచి కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. సూపర్-ఖరీదైన కారు రీన్ఫోర్స్డ్ టైర్లతో వస్తుంది. గంటకు 80 కిమీ వేగంతో దూసుకుపోతుంది. ఈ కారు 6.0-లీటర్ V12 ఇంజన్‌తో 612 పవర్‌ను, 830 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా ముఖేష్ అంబానీ ఫ్యామిలీ కాన్వాయ్‌లో రోల్స్ రాయిస్ కల్లినన్ SUV, లంబోర్ఘిని ఉరస్, మెర్సిడెస్-AMG G63, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, మెర్సిడెస్-మేబ్యాక్ S580 లాంటి ఇతర ఖరీదైన కార్లు ఉన్నాయి. -
ప్రగతిభవన్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్.. అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే, రాజాసింగ్ మళ్లీ అరెస్ట్ అయ్యారు. సీఎం కేసీఆర్ క్యాంపు ఆఫీస్ ప్రగతిభవన్ వద్ద ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెడిపోయిన తన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని తీసుకొని ఎమ్మెల్యే శుక్రవారం ప్రగతి భవన్ వద్దకు వెళ్లారు. తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ మార్చాలని, లేదంటే ఆ వాహనం మీరు తీసుకోవాలంటూ ప్రగతిభవన్ వద్ద వదిలేసి రాజాసింగ్ వెళుతున్నారు. ఇది గమనించిన పోలీసులు.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌ను మీడియా కంట పడకుండా పూర్తిగా మూసేసిన పోలీస్ డీసీఎంలో అసెంబ్లీకి తీసుకొచ్చారు. కాగా గతంలో రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఆయనను అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మొరాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ కారు కాగా రాజాసింగ్ బుల్లెట్‌ప్రూఫ్ వాహనం మరోసారి మొరాయించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ నుంచి గురువారం బుల్లెట్‌ప్రూఫ్ వాహనంలో ఇంటికి వెళ్తుండగా ముందుభాగం టైరు ఊడిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ధూల్‌పేట ప్రాంతంలో వాహనం నుంచి భారీ శబ్దం వచ్చి ముందువైపు టైరు బయటకు రావడంతో డ్రైవర్ చాకచక్యంగా కారును నిలిపాడు. దీంతో రాజాసింగ్ ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. వాహనం నెమ్మదిగా వెళ్లడం వల్ల ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూజజ ఈ ఘటన చూసైనా హోంమంత్రి మహమూద్ అలీ, పోలీసు ఉన్నతాధికారులు సిగ్గుపడాలన్నారు. వెంటనే తనకు వాహనం మార్చాలని డిమాండ్ చేశారు. -
బుల్లెట్ ప్రూఫ్ వెహికల్తో ఎమ్మెల్యే రాజాసింగ్‌కు అవస్థలు
-
ఏపీ: మంత్రి గుడివాడకు బులెట్ ప్రూఫ్ వాహనం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్కు బులెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది ప్రభుత్వం. ఏజెన్సీ ప్రాంతాల్లో గుడివాడ ఎక్కువగా పర్యటించాల్సి ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది. -
మంత్రి కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం
సాక్షి, అమరావతి : వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబుకు రాష్ట్ర ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది. భద్రతా కారణాలరీత్యా ఇంటెలిజెన్స్ నివేదిక మేరకు హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పది రోజుల క్రితం మంత్రి కన్నబాబుకు బీపీ (బుల్లెట్ ప్రూఫ్) వాహనం కేటాయించాలని ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక ఇచ్చాయి. ఇక నుంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే ప్రయాణాలు, పర్యటనలు చేపట్టాలని మంత్రికి ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించాయి. -
మంటల్లో పోలీసు వాహనం
హైదరాబాద్: నిఘా విభాగానికి చెందిన ఓ వాహనం రోడ్డుపైనే మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటన సికింద్రాబాద్ ప్యారడైస్ పంప్‌హౌస్ వద్ద చోటు చేసుకుంది. సోమవారం ఉదయం రోడ్డుపై వెళ్తున్న ఇంటలిజెన్స్ విభాగానికి చెందిన బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అందులోని సిబ్బంది వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేసి, కిందకు దిగిపోయారు. ఈ ఘటనతో సమీపంలోని బస్టాప్‌లోని ప్రయాణికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. -
టీబీజేపీ అధ్యక్షుడికి బుల్లెట్‌ప్రూఫ్ వాహనం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ముషీరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్‌కు ప్రభుత్వం భద్రత పెంచింది. ఇటీవల ఉగ్రవాదుల కదలికలు పెరగటం, పాతబస్తీలో ఎన్ఐఏ అరెస్ట్ చేసిన సందర్భంగా వారి లిస్టులో పలు రాజకీయ నాయకుల పేర్లు కూడా ఉండటంతో ఈ భద్రతను పెంచారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఈ భద్రతను గతంలో కంటే మరింత కట్టుదిట్టం చేశారు. అందులో భాగంగా రెండు రోజుల క్రితం బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని లక్ష్మణ్‌కు కేటాయించారు. -
మంత్రి ఈటెలకు తప్పిన ముప్పు
కరీంనగర్: తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కు ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ లోని బుల్లెట్ ప్రూఫ్ కారు మెట్ పల్లి వద్ద చెట్టును ఢీకొంది. వాహనశ్రేణి హుజురాబాద్ నుంచి వెంకట్రావ్ పల్లి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు ధ్వంసమైంది. సాధారణంగా ఈ కారులో మంత్రి ప్రయాణిస్తుంటారు. ప్రమాద సమయంలో ఆయన కారులో లేకపోవడంతో ముప్పు తప్పింది. ప్రమాదానికి గల కారణాలు వెంటనే తెలియరాలేదు.