మంటల్లో పోలీసు వాహనం | Police bullet proof Vehicle catches fire in Hyderabad | Sakshi
Sakshi News home page

మంటల్లో పోలీసు వాహనం

Published Mon, Jul 25 2016 11:18 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

Police bullet proof Vehicle catches fire in Hyderabad

హైదరాబాద్: నిఘా విభాగానికి చెందిన ఓ వాహనం రోడ్డుపైనే మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటన సికింద్రాబాద్ ప్యారడైస్ పంప్‌హౌస్ వద్ద చోటు చేసుకుంది. సోమవారం ఉదయం రోడ్డుపై వెళ్తున్న ఇంటలిజెన్స్ విభాగానికి చెందిన బుల్లెట్ ప్రూఫ్  స్కార్పియో వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అందులోని సిబ్బంది వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేసి, కిందకు దిగిపోయారు. ఈ ఘటనతో సమీపంలోని బస్టాప్‌లోని ప్రయాణికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement