
ఈటెల రాజేందర్(ఫైల్)
కరీంనగర్: తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కు ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ లోని బుల్లెట్ ప్రూఫ్ కారు మెట్ పల్లి వద్ద చెట్టును ఢీకొంది. వాహనశ్రేణి హుజురాబాద్ నుంచి వెంకట్రావ్ పల్లి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు ధ్వంసమైంది.
సాధారణంగా ఈ కారులో మంత్రి ప్రయాణిస్తుంటారు. ప్రమాద సమయంలో ఆయన కారులో లేకపోవడంతో ముప్పు తప్పింది. ప్రమాదానికి గల కారణాలు వెంటనే తెలియరాలేదు.