ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'ముఖేష్ అంబానీ' (Mukesh Ambani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే వీరి కుటుంబం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా ఇప్పుడు ఓ కొత్త జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసి మరో సారి వార్తల్లో నిలిచింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మెర్సిడెస్ బెంజ్ S680..
భారతదేశంలోని ముఖ్యమైన వ్యక్తులలో ఒకరైన ముఖేష్ అంబానీకి ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది. ఇందులో భాగంగానే వారి సెక్యూరిటీలో కూడా అత్యంత ఖరీదైన సేఫెస్ట్ కార్లను వినియోగిస్తారు. అయితే ముకేశ్ అంబానీ మాత్రం మరింత కట్టుదిట్టమైన భద్రత కలిగిన బుల్లెట్ ప్రూఫ్ కారు వినియోగిస్తారు. దీనికి సంబంధించిన వీడియోలు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. కాగా ఇటీవల ఓ కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించారు. ఇది వారి గ్యారేజిలో చేరిన 7వ బుల్లెట్ ప్రూఫ్ మెర్సిడెస్ ఫ్లాగ్‌షిప్ సెడాన్.
ముఖేష్ అంబానీ 7వ మెర్సిడెస్ బెంజ్ ఎస్680 గార్డ్ చిత్రాలను కార్ క్రేజీ ఇండియా ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసారు. ఇందులో కొత్త కారుని చూడవచ్చు. ఈ కారుతో పాటు రేంజ్ రోవర్ వోగ్ సెక్యూరిటీ కారు కూడా ఇక్కడ కనిపిస్తుంది. బెంజ్ కారుకి 999 అనే ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ కలిగి ఉండటం కూడా ఇక్కడ గమనించవచ్చు.
ముఖేష్ అంబానీ గ్యారేజిలో చేరిన ఈ కారు ధర రూ. 10 కోట్లు వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇది చాలా సురక్షితమైన కారుగా తీర్చిదిద్దారు. కావున బాంబులు దాడి నుంచి కూడా తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ బెంజ్ కారు ట్విన్-టర్బోచార్జ్డ్ 6.0-లీటర్ V12 ఇంజన్ ద్వారా 523 Bhp పవర్ అండ్ 850 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తూ ఉత్తమ పనితీరుని అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment