
సాక్షి, అమరావతి : వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబుకు రాష్ట్ర ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది. భద్రతా కారణాలరీత్యా ఇంటెలిజెన్స్ నివేదిక మేరకు హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పది రోజుల క్రితం మంత్రి కన్నబాబుకు బీపీ (బుల్లెట్ ప్రూఫ్) వాహనం కేటాయించాలని ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక ఇచ్చాయి. ఇక నుంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే ప్రయాణాలు, పర్యటనలు చేపట్టాలని మంత్రికి ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించాయి.


Comments
Please login to add a commentAdd a comment