intelligence bureau
-
ఖైదీ కాదు, గూఢచారి!
డమాస్కస్: అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ తీవ్ర భంగపాటుకు గురైంది. అమాయకుడని చెబుతూ సిరియా జైలు నుంచి ఇటీవల ఆ సంస్థ చొరవ తీసుకుని మరీ విడుదల చేసిన ఓ ఖైదీ నిజమైన ఖైదీ కాదని తేలింది. తాజా మాజీ అధ్యక్షుడు అసద్ పాలనలో నిఘా విభాగంలో పని చేసిన అధికారి అని నిజ నిర్ధారణలో వెల్లడైంది. అతని పేరు సలామా మహమ్మద్ సలామా అని, చిత్రహింసలకు, దోపిడీలకే గాక యుద్ధ నేరాలకు కూడా పాల్పడ్డాడని స్థానిక నిజ నిర్ధారణ సంస్థ వెరిఫై–సై తెలిపింది. దాంతో సీఎన్ఎన్ తన తప్పును కప్పిపుచ్చుకునే పనిలో పడింది. ఎందుకంటే సీఎన్ఎన్ చీఫ్ ఇంటర్నేషనల్ కరస్పాండెంట్ క్లారిస్సా వార్డ్, అమె బృందం తిరుగుబాటు బృందంతో పాటు ఇటీవల సిరియా ఇంటలిజెన్స్ కార్యాలయంలోకి వెళ్లింది. అక్కడి ఓ జైలు గదిని తిరుగుబాటుదారులు తెరిచారు. అందులో ఒక వ్యక్తి వణుకుతూ కన్పించాడు. తన పేరు అదెల్ గుర్బల్ అని, మూడు నెలలుగా బందీగా దుర్భర పరిస్థితుల్లో నరకం అనుభవిస్తున్నానని చెప్పుకున్నాడు. అతన్ని వార్డ్ బృందం చొరవ తీసుకుని బయటకు తీసుకొచ్చింది. ఈ దృశ్యాలను సీఎన్ఎన్ ప్రముఖంగా ప్రసారం చేసుకుంది. ఇది తన జీవితంలోనే అత్యంత దారుణమైన ఘటన అని వార్డ్ చెప్పుకొచ్చారు. అసద్ క్రూరమైన పాలన తాలూకు బాధితుల్లో అతనొకడని సీఎన్ఎన్ అభిర్ణించింది. అతనికి ఆహారం అందించి అత్యవసర సేవల విభాగంలో చేర్చినట్టు కథనం ప్రసారం చేసింది. దాంతో పలువురు నెటిజన్లు సీఎన్ఎన్ను అభినందించారు. కానీ ఈ వ్యవహారంపై వెరిఫై–సై అనుమానాలు వ్యక్తం చేసింది. 90 రోజులు ఏకాంతంలో, వెలుతురు కూడా లేని గదిలో తీవ్ర నిర్బంధంలో ఉన్న వ్యక్తి అంత ఆరోగ్యంగా ఎలా కన్పిస్తారని ప్రశ్నించింది. అసలతను స్థానికుడేనని చెప్పడానికి ఎలాంటి ఆధారాలూ లేవని చెప్పింది. అనంతరం కూపీ లాగి, అతను సలామా అని, అసద్ వైమానిక దళం నిఘా విభాగంలో ఫస్ట్ లెఫ్టినెంట్‌గా చేశాడని వెల్లడించింది. వసూళ్ల తాలూకు అక్రమ సంపాదనను పంచుకునే విషయంలో పై అధికారితో పేచీ రావడంతో నెల రోజులుగా జైల్లో ఉన్నట్టు వివరించింది. అతను సైనిక దుస్తుల్లో ఉన్న ఫొటోలను కూడా బయట పెట్టింది. దాంతో సీఎన్ఎన్ కంగుతిన్నది. ఆ వ్యక్తి తమకు తప్పుడు వివరాలు చెప్పి ఉంటాడని అప్పుడే అనుకున్నామంటూ మాట మార్చింది. అతని నేపథ్యం గురించి తామూ లోతుగా విచారణ చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. సీఎన్ఎన్ వివాదాస్పద రిపోర్టింగ్ శైలితో అభాసుపాలు కావడం ఇది తొలిసారేమీ కాదు. గతేడాది ఇజ్రాయెల్, గాజా సరిహద్దు వద్ద రిపోర్టింగ్‌కు సంబంధించి కూడా క్లారిస్సా వార్డ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. -
ఉగ్రవాదుల కట్టడికి యువరక్తం!
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదులపై నిఘా పెట్టడంలో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) పాత్ర అత్యంత కీలకం. దేశంలోని అనేక నగరాలతోపాటు హైదరాబాద్‌లోనూ ముష్కర మూకల కుట్రలను తిప్పికొట్టడంలో ఐబీ తన మార్కు చూపించింది. ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, ‘ఆన్లైన్ ఉగ్రవాదం’ నేపథ్యంలో ఈ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. తాజాగా ఢిల్లీలో జరిగిన మల్టీ ఏజెన్సీ కమిటీ (మ్యాక్) సమావేశంలో దీనికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కీలక ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర పరిధిలో ఉన్న వివిధ ఏజెన్సీల అధినేతలు ఈ ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఐబీ వంటి నిఘా విభాగాల్లో అనుభవానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. కొన్ని ఆపరేషన్లు సక్సెస్ కావడం అనేది అందులో పనిచేసిన వారి అనుభవం మీదే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న అనుభవజ్ఞులకు తోడు సాంకేతిక సవాళ్లను ఎదుర్కోవడానికి యువ అధికారులను ఎంపిక చేయాలని నిర్ణయించారు.టెర్రర్ రిక్రూట్మెంట్లో పంథా మారిందిపుష్కరకాలంగా ఉగ్రవాదుల పంథా పూర్తిగా మారింది. ఒకప్పుడు దేశంలో విధ్వంసాలు సృష్టించడానికి అవసరమైన వారిని రిక్రూట్ చేసుకోవడానికి పాకిస్తాన్ నుంచి ఏజెంట్లు వచ్చేవారు. 1998లో హైదరాబాద్ పాతబస్తీలో పట్టుబడిన మహ్మద్ సలీం జునైద్ ఆ కోవకు చెందినవాడే. ఇలా అనేకమంది ఏజెంట్లు పట్టుబడ్డారు. యువతను ఆకర్షించి, సరిహద్దులు దాటించి, శిక్షణ ఇచ్చి, తిప్పి పంపడంతో పాటు పేలుడు పదార్థాలు సైతం సరిహద్దు ఆవలి నుంచే పంపడంలో ఈ ఏజెంట్లు కీలకంగా వ్యహరించేవారు. అయితే దశాబ్దకాలంగా ఉగ్రమూకలు అప్డేట్ అయ్యాయి. యవతను ఆకర్షించి రిక్రూట్ చేసుకోవడం, వారిని ప్రేరేపించడం, శిక్షణ ఇవ్వడం, స్థానికంగా పేలుడు పదార్థాలు సమీకరించుకునే మార్గాలు సూచించడం... ఇవన్నీ ఆన్లైన్లోనే సాగుతున్నాయి. ప్రధానంగా ఐసిస్ ప్రాబల్యం పెరిగిన తర్వాత ఈ ధోరణి మరింత పెరిగింది. దీనికోసం ముష్కరమూకలు వివిధ రకాలైన సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌తో పాటు డార్క్ వెబ్ వాడుతున్నాయి. హైదరాబాద్‌లో పట్టుబడిన అనేక మంది ఉగ్రవాదులు ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతోనే వారికి చెక్ చెప్పేలా...హైటెక్ ఉగ్రవాదులకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం ద్వారానే చెక్ చెప్పవచ్చని కేంద్రం నిర్ణయించింది. ఇదే అంశాన్ని శుక్రవారంనాటి మ్యాక్ సమావేశంలో అమిత్‌షా స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోపాటు మిషన్ లెర్నింగ్ టూల్స్ వినియోగించడం ద్వారా ఉగ్రవాదులు, వారి కార్యకలాపాలపై పటిష్ట నిఘా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికోసం ఆ విభాగంలో ప్రస్తుతం ఉన్న అధికారులకు తోడు సాంకేతిక పరిజ్ఞానంపై పట్టున్న యువకులను ఎంపిక చేసుకొని బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉగ్రవాదుల కంటే ఒక అడుగు ముందు ఉండటానికి ఇది అవసరమని అమిత్‌షా అభిప్రాయపడ్డారు. ఏ మాత్రం కాలయాపనకు ఆస్కారం ఇవ్వకుండా వీలైనంత త్వరగా ఈ సంస్కరణలను అమలులోకి తీసుకురావాలని అమిత్‌షా స్పష్టం చేశారు. ఈ నిర్ణయాలు నిత్యం ముష్కరుల టార్గెట్‌లో ఉండే హైదరాబాద్ సహా అనేక మెట్రో నగరాలకు కలిసి వచ్చే అంశమని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో అన్నారు. -
Phone-tapping case: అసలు కథ ఇంకా ఉంది!
సాక్షి, హైదరాబాద్: రెడ్ కార్నర్ నోటీసుల జారీ ప్రక్రియలో భాగంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావుపై పంజగుట్ట పోలీసులు ఇటీవల అరెస్టు వారెంట్ తీసుకున్నారు. దీనికోసం నాంపల్లి కోర్టులో అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ప్రభాకర్‌రావు ఓ అఫిడవిట్ వేశారు. అందులో ఉన్న అంశాలు ఆయన వాంగ్మూలంతో సమానం కావడం కొత్త ట్విస్ట్‌కు కారణ మైంది. తాను కేవలం కీలక పాత్రధారిని మాత్రమే అని, ట్యాపింగ్ వ్యవహారం మొత్తం అప్పటి డీజీపీలు, నిఘా విభాగాధిపతిగా ఉండే అదనపు డీజీపీ పర్యవేక్షణలో జరిగినట్లు తన వాంగ్మూలంలో ప్రభాకర్‌రావు పేర్కొనడమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.ఆ అధికారులకూ నోటీసులు ఇస్తారా?అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం ప్రభాకర్‌రావు అ«దీనంలోనే జరిగింది. ఇప్పటివరకు అరెస్టయిన డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు, అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న, మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావులు సైతం ఇదే విషయాన్ని తమ వాంగ్మూలాల్లో స్పష్టం చేశారు. ఎస్ఐబీకి ఓఎస్డీ హోదాలో ప్రభాకర్‌రావే నేతృత్వం వహించినప్పటికీ... ఈ విభాగం కూడా ప్రధాన ఇంటెలిజెన్స్‌లో అంతర్భాగమే. దీనికి అదనపు డీజీపీ లేదా ఐజీ స్థాయి అధికారులు బాస్‌లుగా ఉంటారు. మరోపక్క ఎస్ఐబీలో ప్రణీత్‌రావు వార్‌రూమ్‌గా వినియోగించిన రెండు గదులూ ఇంటెలిజెన్స్ చీఫ్ కోసం అధికారికంగా కేటా యించనవే. ఎలాంటి నిఘా ఉపకరణాలు ఖరీదు చేయాలన్నా కచి్చతంగా నిఘా విభా గాధిపతితో పాటు డీజీపీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఇవన్నీ నిబంధనల్లో పొందుపరిచిన అంశాలే. అయితే ఇప్పటివరకు ఈ విషయాలను ఎవరూ తమ వాంగ్మూలాల్లో స్పష్టం చేయలేదు. నాంపల్లి కోర్టులో ప్రభాకర్‌రావు తరఫున ఆయన న్యాయవాదులు దాఖలు చేసిన అఫిడవిట్‌తో మాత్రం డీజీపీ, అదనపు డీజీల వ్యవహారం ప్రస్తావనకు వచి్చంది. తాను పూర్తిగా వారి పర్యవేక్షణలోనే పని చేశానంటూ ప్రభాకర్‌రావు చెప్పడంతో పరోక్షంగా వారి పాత్రనూ ఆయన ఉటంకించినట్లు అయింది. న్యాయ స్థానంలో దాఖలైన అఫిడవిట్‌ను ప్రభాకర్‌రావు వాంగ్మూలంగా పరిగణించాల్సి వస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో ఇద్దరు మాజీ డీజీపీలు, నిఘా విభాగం మాజీ అదనపు డీజీకి నోటీసులు జారీ చేసి వాంగ్మూలం నమోదు చేయడం తప్పనిసరి కానుందని తెలుస్తోంది.ఆ మాజీ సీపీల నుంచి కూడా వాంగ్మూలం?మరోపక్క టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు నేరాంగీకార వాంగ్మూలం నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్లుగా పని చేసిన సీనియర్ ఐపీఎస్‌ల నుంచి వాంగ్మూలం సేకరించడం తప్పనిసరిగా మారింది. ‘ఎన్నికల టాస్్క’లకు సంబం ధించి తనకు అప్పటి పోలీసు కమిషనర్ ద్వారానే ఆదేశాలు ఇప్పించాలని కోరానని, ప్రభాకర్‌రావు ఆ ప్రకారమే చేశారని రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్, నిఘా అనేది ఎస్ఐబీ అ«దీనంలో స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) చేసింది. అయితే టార్గెట్ చేసిన వారిని పట్టుకోవడం, నగదు స్వాధనం చేసుకోవడం, వసూళ్లకు పాల్పడటం ఫీల్డ్ ఆపరేషన్లు మాత్రం టాస్‌్కఫోర్స్ నిర్వర్తించింది. ఈ విభాగం పోలీసు కమిషనర్ అ«దీనంలో, ఆయన పర్యవేక్షణలో పని చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు మాజీ పోలీసు కమిషనర్ల నుంచి వాంగ్మూలాలు తీసుకోవడమూ అనివార్యంగా మారనుంది.ఎన్నికల ఫలితాల తర్వాత అరెస్టులు? అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు పంజగుట్ట పోలీసుస్టేషన్లో నమోదైంది. అయితే దీన్ని దర్యాప్తు చేయడం కోసం అనధికారికంగా ఓ సిట్ ఏర్పాటైంది. ఇప్పటివరకు ఈ బృందం బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌లోని మొదటి అంతస్తు కేంద్రంగా పని చేసింది. అయితే తాజాగా దీన్ని జూబ్లీహిల్స్ ఠాణాకు తరలించారు. అక్కడ అధికారులు కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. నోటీసుల జారీ, విచారణ, వాంగ్మూలాల నమోదుతో పాటు కొందరు పోలీసులు, ప్రైవేట్ వ్యక్తుల అరెస్టులు చోటు చేసుకుంటాయని సమాచారం. -
Phone tapping Case: రాధాకిషన్‌రావుకు జ్యుడీషియల్ రిమాండ్
సాక్షి, హైదరాబాద్: టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు శుక్రవారం కొంపల్లిలోని న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరుపరచగా, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. పోలీసులు గురువారం ఉదయం రాధాకిషన్ రావును అదుపులోకి తీసుకున్న విషయం తెలి సిందే. అప్పటి నుంచి రాత్రి వరకు ఆయన్ను బంజారాహిల్స్ ఠాణాలో సిట్ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలను శుక్రవారం ఉదయం వీరిని చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న పంజగుట్ట పోలీ సులు వైద్యపరీక్షల అనంతరం బంజారాహిల్స్ ఠాణాకు తరలించారు. అప్పటి నుంచి సాయంత్రం వరకు పోలీసులు ఈ ముగ్గురినీ కలిపి, విడివిడిగా విచారించారు. రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్‌తో పాటు అక్రమ వసూళ్ల కోణంలోనూ ప్రశ్నించారు. ఆపై రాధాకిషన్ రావును గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం కొంపల్లికి తీసుకు వెళ్లారు. తదుపరి విచారణ నిమిత్తం రాధాకిషన్ రావును పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని సిట్ నిర్ణయించింది. దీనికోసం అనుమతి కోరుతూ శనివారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. ప్రభాకర్‌రావుతో లింకులు, వసూళ్ల కోణంలో... సిట్ అధికారులు రాధాకిషన్‌రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్నలను ప్రధానంగా రెండు కోణాల్లో ప్రశ్నించారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావుతో వీరికి ఉన్న సంబంధాలు, ఆయన ఆదేశాల మేరకు చేసిన ఫోన్ ట్యాపింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టారు. డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు నేతృత్వంలోని బృందం సహాయంతో వీరు ప్రతిపక్ష నేతలు, కీలక వ్యక్తులతో పాటు వ్యాపారుల ఫోన్లూ ట్యాప్ చేసి వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నారు. ఈ రకమైన ఆదేశాలు ఎవరు ఇచ్చారు? గుర్తించిన వివరా లను తొలుత ఆ వ్యక్తులకు చెప్పేవారా? అనే కోణాల్లో సిట్ ప్రశ్నించింది. వీరి వేధింపుల నేపథ్యంలో ఓ పార్టీకి వివిధ రూపాల్లో విరా ళాలు ఇవ్వడంతో పాటు ప్రభాకర్‌రావు, రాధా కిషన్‌రావు తదితరులకు కప్పం కట్టిన వాళ్లల్లో బడా బిల్డర్లు, జ్యువెలరీ దుకాణాల యజమా నులు, రియల్టర్లతో పాటు హవాలా వ్యాపా రులూ ఉన్నట్టు సిట్ అనుమానిస్తోంది. ఈ ముగ్గురినీ ప్రశ్నించిన సిట్ అధికారులు దీనికి సంబంధించి కీలక సమాచారం సేకరించారని తెలిసింది. రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లును శుక్రవారం తెల్లవారు జామున విడిచిపెట్టారు. దాదాపు ఆరుగంటల పాటు రాధాకిషన్‌రావుతో కలిపి గట్టుమల్లును ప్రశ్నించిన సిట్ ఆయన నుంచి వాంగ్మూలం నమోదు చేసింది. ఎస్ఐబీ, టాస్క్‌ఫోర్స్‌ల్లో పనిచేసిన అనేక మంది అధికారులు, సిబ్బందినీ సిట్ విచారిస్తూ వారి నుంచి వాంగ్మూలాలు సేకరిస్తోంది. ఇప్పటి వరకు 47మంది నుంచి స్టేట్మెంట్స్ రికార్డు చేశారని సమాచారం. ఏసీబీ కేసుకు రంగం సిద్ధం రాధాకిషన్‌రావు, నాయిని భుజంగరావు, మేక ల తిరుపతన్నలు అక్రమ ఆస్తులు కూడబెట్టా రని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రాథమిక ఆధారా లు సేకరించారు. ఈ అంశాలను క్రోడీకరిస్తూ అవినీతి నిరోధక శాఖకు సమాచారమివ్వాలని సిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వివరాలు అందిన తర్వాత ఏసీబీ అధికారులు ఆదాయా నికి మించిన ఆస్తుల కేసు నమోదు చేయనున్న ట్లు సమాచారం. మరోపక్క అక్ర మ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉండి, అరెస్టు అయిన అధికారుల పూర్వాపరాల ను ఉన్నతా ధికారులు పరిశీలిస్తున్నారు.వీరు గతంలో ఎక్క డెక్కడ పనిచేశారు? ఆయాచోట్ల వీరిపై ఉన్న వివాదాలు ఏంటి? కేసులు ఉన్నా యా? అని ఆరా తీస్తున్నారు. తిరుపతన్నపై పెద్దగా వివా దాల్లేనప్పటికీ.. భుజంగ రావు సర్వీసు మొత్తం అక్రమ దందాలతోనే సాగిందని అధికారులు గుర్తించినట్టు తెలుస్తో ంది. రాధాకిషన్‌రావు ఉప్ప ల్ ఏసీపీగా ఉండగా 2013లో చోటు చేసుకున్న యాంజాల్ శ్రీధర్‌రెడ్డి అలియాస్ ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య కేసును అధికా రులు తవ్వుతున్నారు. అప్పటి రామంతాపూర్ కార్పొరేటర్ పరమేశ్వర్‌రెడ్డితోపాటు రాధా కిషన్‌రావు వేధింపులతోనే ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదైంది. 2007లో జరి గిన పరమేశ్వర్‌రెడ్డి సోదరుడు జగదీశ్వర్‌రెడ్డి హత్య కేసులో ఉప్పల్ వైఎస్సార్ నిందితుడు. ఇతడు మరికొందరితో కలిసి పరమేశ్వర్‌రెడ్డికి హత్యకు కుట్ర పన్నిన ఆరోప ణలపై ఉప్పల్ వైఎస్సార్ తదితరులను పోలీ సులు 2013 జూన్‌లో అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాధా కిషన్ రావు రూ.10 లక్షల లంచం డిమాండ్ చేసి వేధించడంతోనే ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య చేసుకున్నట్టు అభియో గాలు నమోదయ్యాయి. ఈ కేసు ఇప్పటికీ ట్రయల్ పూర్తి కాకపోవడానికి కార ణాలను ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. నగదు రవాణా చేసినట్టూ అంగీకరించారు.. పంజగుట్ట ఠాణాలో నమోదైన ఈ కేసు దర్యాప్తులో భాగంగా టాస్‌్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావును బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు పిలిచి విచారించాం. ఆయన తాను చేసిన నేరాలను అంగీకరించారు. చట్టవిరుద్ధంగా, తమ అధికారాలను దుర్వినియోగం చేస్తూ ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్స్‌ను అభివృద్ధి చేయడం, కుట్రపూరితంగా అనధికారికంగా ఆ వ్యక్తులపై నిఘా ఉంచడం చేసినట్టు బయటపెట్టారు. రాజకీయంగా పక్షపాతంతో వ్యవహరించడంతోపాటు ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్న సమయంలో తాము అక్రమంగా డబ్బు రవాణా చేయడానికి అధికారిక వనరులను వినియోగించామని అంగీకరించారు. ఇతర నిందితులతో కుమ్మక్కై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం మరియు సాక్ష్యాలను తారుమారు చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడినట్టు ఒప్పుకున్నారు. – ఎస్ఎం.విజయ్‌కుమార్, వెస్ట్‌జోన్ డీసీపీ -
ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో కొత్త కోణం..
సాక్షి, హైదరాబాద్: ప్రణీత్ రావుఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూసింది. రియల్ ఎస్టేట్, ఫార్మా, సాఫ్ట్వేర్ కంపెనీ యజమానుల ఫోన్లను ప్రణీత్ ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రతిపక్ష నేతలతో టచ్‌లోకి వెళ్లిన రాజకీయ, వ్యాపారులను ప్రణీత్‌రావు గ్యాంగ్ బెదిరించినట్లు తెలిసింది. వ్యాపార వేత్తల వాయిస్‌ను వారికే వినిపించి బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఆడియోలు బయటకు రావొద్దంటే బీఆర్ఎస్ నేతలకు డబ్బులు ఇవ్వాలని ప్రణీత్ రావు డిమాండ్ చేసినట్లు వెల్లడైంది. బెదిరింపు ఆడియోలను వ్యాపారుల ముందు పెట్టి వారిచేత ప్రణీత్ గ్యాంగ్ ఎలక్టోరల్ బాండ్స్ కొనిపించినట్లు గుర్తించారు. కొన్ని సంవత్సరాలుగా వ్యాపారులు అత్యధికంగా బీర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్లు కొన్నట్లు తేలింది. చదవండి: ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనాలు మరోవైపు ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో రవిపాల్ కీలకంగా మారారు. ఎస్ఐబీ టెక్నికల్ కన్సల్టెంట్‌గా ఉన్న రవిపాల్ నేతృత్యంలోనే ట్యాపింగ్ డివైజ్‌లు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా డివైజ్‌ను తీసుకొచ్చిన రవిపాల్, ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయిల్ నుంచి ట్యాపింగ్ డివైజ్‌లు దిగుమతి చేసినట్లు సమాచారం. ఇందుకు రవిపాల్‌కు ఎస్ఐబీ కోట్లలో డబ్లులు చెల్లించినట్లు తెలిసింది. రవిపాల్, ప్రభాకర్ కలిసి ఆధునాతన డివైజ్‌లను దిగుమతి చేసుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. 300 మీటర్ల పరిధిలో మాటలను వినే వీలున్న డివైజ్‌లు తెచ్చిన రవిపాల్ ..రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఆఫీస్ తీసుకొని డివైజ్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. రేవంత్ ఇంట్లో జరిగే ప్రతి విషయన్ని ఎప్పటికప్పుడు ప్రణీత్‌రావు, రవిపాల్ విన్నారు. ఈ క్రమంలో రవిపాల్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. చదవండి: ట్యాపింగ్ కేసులో ముగ్గురికి రిమాండ్ -
ట్యాపింగ్ కేసులో ముగ్గురికి రిమాండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో శనివారం అరెస్టు చేసిన అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలతోపాటు కస్టడీ ముగిసిన మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావులను సిట్ అధికారులు ఆదివారం నాంపల్లి క్రిమినల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ప్రణీత్‌రావుకు బుధవారం వరకు, భుజంగరావు, తిరుపతన్నలకు ఏప్రిల్ 6 వరకు న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో.. వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. భుజంగరావు, తిరుపతన్నలను తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ సిట్ అధికారులు కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకు తొమ్మిది మందికి సిట్ నోటీసులు జారీ చేసి, విచారణకు పిలిచింది. ఈ కేసులో ప్రధానాంశం ఫోన్ ట్యాపింగ్ కావడంతో ‘టెలిగ్రాఫిక్ యాక్ట్’ను కూడా జోడించాలని అధికారులు నిర్ణయించారు. ముగ్గురి కోసం ఔట్లుక్ సర్క్యులర్ పంజగుట్టలో నమోదైన ఈ ట్యాపింగ్ కేసులో శనివారం వరకు ప్రణీత్‌రావు మాత్రమే నిందితుడిగా ఉండేవారు. సిట్ దర్యాప్తు, ప్రణీత్‌రావు వెల్లడించిన అంశాల ఆధారంగా భుజంగరావు, తిరుపతన్నలను కూడా నిందితులుగా చేర్చినట్టు సిట్ కోర్టుకు తెలిపింది. వీరితోపాటు ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు, ఓ మీడియా సంస్థ అధిపతిని కూడా నిందితులుగా చేర్చినా.. విదేశాల్లో తలదాచుకున్నారు. దీంతో ఆ ముగ్గురి కోసం అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులకు అధికారులు లుక్ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేశారు. వ్యక్తిగత జీవితాలూ ‘ట్యాప్’.. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఉపరకణాలు, సాఫ్ట్వేర్లతో ల్యాండ్లైన్లు, సెల్‌ఫోన్ కాల్స్‌తోపాటు సోషల్‌మీడియాను ట్యాప్ చేసిన ‘ప్రభాకర్‌రావు టీమ్’.. బెదిరింపు వసూళ్లకు పాల్పడటంతోపాటు కొందరి వ్యక్తిగత జీవితాలపైనా నిఘా పెట్టినట్టు తెలిసింది. హైప్రొఫైల్ వ్యక్తుల అంతర్గత వ్యవహారాలను ట్యాపింగ్ ద్వారా తెలుసుకుని.. వారికి ఆ వాయిస్‌లు, సందేశాలు చూపి, భారీ డిమాండ్లు నెరవేర్చుకున్నట్టు సమాచారం. అప్పటి ప్రతిపక్షనేత రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబీకులతోపాటు కొందరు పోలీసు ఉన్నతాధికారులు, బీఆర్ఎస్కు చెందిన కొందరు నేతలు, కీలక వ్యక్తులపైనా ట్యాపింగ్ నిఘా పెట్టినట్టు తెలిసింది. ప్రభాకర్‌రావుకు ఊహించిన షాక్.. ప్రస్తుతం అమెరికాలో తలదాచుకున్న ప్రభాకర్‌రావు నుంచి ఇక్కడి ఓ పోలీసు ఉన్నతాధికారికి కాల్ వచ్చినట్టు తెలిసింది. ఇప్పటి ప్రభుత్వ ఆదేశాల మేరకు మీరు ఎలా ట్యాపింగ్ కేసులో దూకుడుగా వెళ్తున్నారో.. అప్పటి ప్రభుత్వ ఒత్తిడితోనే తాను ట్యాపింగ్‌లో జోక్యం చేసుకున్నానని ఆయన చెప్పినట్టు సమాచారం. మనం మనం పోలీసులమేనని, కేసు దర్యాప్తు పేరుతో ఇళ్లలో సోదాలు చేయడమేంటని కూడా ప్రభాకర్‌రావు పేర్కొన్నట్టు తెలిసింది. తాను వైద్యం కోసమే అమెరికా వచ్చానని, జూన్ లేదా జూలైలో తిరిగి వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పినట్టు సమాచారం. ఇదంతా విన్న సదరు ఉన్నతాధికారి.. ‘‘మీరు ఏం చెప్పాలనుకున్నా, ప్రశ్నించాలనుకున్నా నా అధికారిక మెయిల్ ఐడీకి ఈ–మెయిల్ పంపండి. అప్పుడే నేను ఎలాంటి సమాధానం ఇవ్వాలో అలాంటి సమాధానం ఇస్తా..’’ అని స్పష్టం చేసినట్టు తెలిసింది. దీనితో ప్రభాకర్‌రావు మౌనంగా ఫోన్ కట్ చేసినట్టు సమాచారం. సిట్ దర్యాప్తునకు కొన్ని ఆటంకాలు! అక్రమ ట్యాపింగ్ వ్యవహారం మూలాలు బయటపడాలన్నా, సూత్రధారులను తేల్చాలన్నా సాంకేతిక ఆధారాలు కీలకం. అందుకే వాటిని సేకరించడానికి సిట్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఓ నిఘా విభాగం నుంచి నగర పోలీసులకు సరైన సహకారం అందట్లేదని తెలిసింది. అందుకే దర్యాప్తు జాప్యం అవుతోందని సమాచారం. కేసు దర్యాప్తు కోసం అధికారులు అడిగిన పలు సున్నిత అంశాలు తెలపడానికి, ఉపకరణాల విశ్లేషణ కోసం సదరు నిఘా విభాగం అధికారి అనుమతించట్లేదని తెలిసింది. పోలీసులు వచ్చి తమ విభాగంలో అంశాలన్నీ పరిశీలిస్తే.. బయటి ప్రపంచానికి తెలిసిపోతాయని, తద్వారా వ్యూహాలు దెబ్బతింటాయని చెప్తున్నట్టు సమాచారం. భవిష్యత్తులో జాతీయ భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం తాము కీలక ఆపరేషన్లు చేపట్టలేమని సదరు అధికారి పేర్కొంటున్నట్టు తెలిసింది. దీంతో సిట్ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ట్యాపింగ్ కేసులో ఇద్దరు కీలక నేతలు? భుజంగరావును శనివారం అరెస్టు చేసిన సిట్ అధికారులు.. ఆయన నుంచి ఫోన్, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆయనను విచారించిన సమయంలో, ఉపకరణాల విశ్లేషణలో సిట్ అధికారులకు కీలక సమాచారం లభించినట్టు తెలిసింది. ట్యాపింగ్ చేయాల్సిన టార్గెట్ల వివరాలు ఆయనకు నేరుగా ఓ ముఖ్య నేత నుంచి వచ్చినట్టు తేలింది. డీఎస్పీ ప్రణీత్‌రావుకు మరో కీలక నేత నుంచి ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. ఆ నేతల పాత్రకు సంబంధించి పలు ఆధారాలు లభించిన నేపథ్యంలో.. కేసులో వారి పేర్లను చేర్చాలని సిట్ నిర్ణయించినట్టు తెలిసింది. తొలుత సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేయాలని, వారి స్పందన ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. -
భద్రతా సవాళ్ల సమీక్ష లేనందునే...
పదిహేనేళ్ల క్రితం, 2008 నవంబరు 26న దేశ ఆర్థిక రాజధానిపై జరిగిన ఉగ్రదాడి తొలిదశలో భారత భద్రతా వ్యవస్థ దాదాపుగా అచేతనమైందంటే అతిశ యోక్తి కాబోదు. నిస్సహాయులైన, నిరాయుధులైన జన సామాన్యంపై పేట్రేగిన ఉగ్రమూక వందల ప్రాణాలను బలితీసుకున్న దుర్ఘటన అది. భారతదేశ సార్వభౌమత్వం, భద్రతపై ఇంత స్థాయిలో ఎన్నడూ దాడి జరగలేదని చెప్పాలి. ఈ ఘటన జాతీయ భద్రత అంశంలోని సంస్థా గత లోపాలను ఎత్తి చూపింది. దేశం మరోసారి 26/11 లాంటి ఘటనను ఎదుర్కోరాదంటే... అంతర్గత భద్రత సవాళ్లపై సమీక్షించుకోవడం మన తక్షణ అవసరం కావాలి. ముంబై దాడుల్లో ఉగ్రవాదులు అనుసరించిన పద్ధతులు... సరిహద్దులకు అవతలి నుంచి వారికి అందిన సూచనల వంటివన్నీ మనకు అనూహ్యమైనవే. అదే సమ యంలో ఢిల్లీ, ముంబైల్లోని జాతీయ స్థాయి భద్రత వ్యవస్థలు సంపూర్ణంగా విఫలమయ్యాయి. 1999 నాటి కార్గిల్ యుద్ధంలోనూ సంస్థాగతమైన నిఘా లోపాలు బయటపడ్డాయి. దివంగత కె. సుబ్రమణ్యం నేతృత్వంలోని కార్గిల్ రివ్యూ కమిటీ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ‘‘ఏజెన్సీల మధ్య సమన్వయానికి, నిర్దిష్ట లక్ష్యానికి అనుగుణంగా కలిసి పనిచేసేందుకు తగిన వ్యవస్థ లేకుండా పోయింది. అలాగే ఏజెన్సీ లకు పనులు చెప్పేందుకు, వాటిని పర్యవేక్షించేందుకు, సామర్థ్యాలను పరీక్షించేందుకు, నాణ్యత ప్రమాణాలను సమీక్షించేందుకు కూడా తగిన వ్యవస్థలు లేవు. అన్ని నిఘా సంస్థలు ఎలా పనిచేస్తున్నాయో చూసే ఏర్పాట్లు కూడా లేవు’’ అని విస్పష్టంగా పేర్కొందీ కమిటీ. ఈ రకమైన లోపాల కారణంగా భారత్ నివారించ దగ్గ ఎదురుదెబ్బలు ఎన్నో చవిచూడాల్సి వస్తోంది. గల్వాన్ లోయ సంఘటన ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక అంశం. 2020లో జరిగిన ఈ ఘటనలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు భారతీయ సైనికులను ఒకరకంగా ‘ఆశ్చర్యానికి’ గురిచేస్తూ తీవ్రస్థాయి దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. మిలిటరీ సంస్కరణల ఫలితం? భద్రత వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీకి ప్రాతినిధ్యం వహించే ‘ద నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్’ మిలిటరీ సంస్కరణలను అమలు చేసే విషయంలో దశాబ్దాల సమయం తీసుకుంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పోస్ట్‌ను సృష్టించేందుకు 1990లలో పీవీ నర సింహారావు ప్రధానిగా ఉన్నప్పుడే ప్రయత్నాలు మొదల య్యాయి. ఆఖరికి ఇది 2019లో నరేంద్ర మోదీ ప్రధానిగా ఉండగా సాకారమైంది. ఈ జాప్యం చెప్పే విషయం ఏమిటి? జాతీయ భద్రత అంశాల విషయంలో సంస్క రణలు, సంస్థాగత సమీక్షలకు కొంత నిరోధం ఉందీ అని. అది కూడా స్వప్రయోజనాల కోసం పాకులాడే వారి వల్ల అని అర్థమవుతుంది. భారతీయ నిఘా ఏజెన్సీల్లో... ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (ఆర్ అండ్ ఏడబ్ల్యూ– క్లుప్తంగా ‘రా’), నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్ఓ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ ఐఏ)లు ఉన్నాయి. ప్రధానమంత్రి కార్యాలయం,కేంద్ర హోంశాఖల కింద ఈ ఏజెన్సీలన్నీ పనిచేస్తాయి. వీటికి డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ప్రతి సాయుధ దళంలోనూ తమదైన ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్లు అదనం. అంతేకాదు... రెవెన్యూ, ఆర్థిక రంగాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు, నిఘా పెట్టేందుకు ప్రత్యే కమైన విభాగాలు కూడా ఉన్నాయి. సమాచార రంగంలో వచ్చిన సరికొత్త మార్పులను పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వాలు రోజంతా తమ నిఘా కార్యక్రమాలను కొన సాగించాల్సిందే అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవస రమే లేదు. చాలా ఏజెన్సీలను ఐపీఎస్‌ల నుంచి ఎంపిక చేసిన సీనియర్ స్థాయి అధికారులు నడుపుతూంటారు. సంస్కరణలు కష్టం అవుతూండేందుకు ఇది కూడా ఒక కారణం. పాతికేళ్ల నివేదికలు... మిలిటరీ సంస్కరణల విషయంలో దాదాపు 24 ఏళ్లుగా చాలా నివేదికలు వెలువడ్డాయి. నిశితంగా శ్రద్ధ పెట్టి సమీక్షిస్తే ఉన్నత స్థాయిలోని పోలీసు వర్గాలు, రాజ కీయ నాయకులు ఇప్పుడున్న పరిస్థితినే కొనసాగించాలనే స్వార్థంతో పనిచేస్తున్నట్లు స్పష్టమవుతుంది. 2024 ఎన్నికల సమయం దగ్గరపడింది. కాబట్టి వ్యవస్థాగతమైన సంస్కరణలకు ఇదేమంత మంచి సమయం కాదు. కానీ వచ్చే ప్రభుత్వం ఏదైనా ఈ విష యాన్ని కచ్చితంగా చేపట్టాల్సిందే. ఇప్పటివరకూ ఈ అంశంపై వెలువడ్డ నివేదికలన్నింటినీ కూలంకుషంగా సమీక్షించి ఒక టాస్క్‌ఫోర్స్ ద్వారా ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రకమైన చర్యలు తీసుకోవాలో నిర్ధారించుకుని ముందడుగు వేయాలి. ఈ సంస్కరణలకు పునాదులుగా నిలిచే అంశాలు ఇరవై ఏళ్లుగా నిఘా వర్గాల్లో నైపుణ్యం సాధించిన వారి నివేదికల ఆధారంగా ఉంటాయని నమ్ము తున్నాను. వృత్తిపరమైన నిబద్ధత, వ్యక్తిగతంగా నైతిక నియ మాలున్న వారు నిఘా వ్యవస్థల్లో ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ప్రజా పరిశీలనకు దూరంగా, పారదర్శకం కాని తెర వెనకాల ఈ వ్యవస్థలు పనిచేస్తూంటాయి మరి. కాబట్టి వీరి పనితీరును బహిరంగంగా సమీక్షించడం అసాధ్యమే కాదు, వాంఛనీయం కూడా కాదు. కెనడా ఇటీవలే భారతీయ నిఘా వ్యవస్థలపై కొన్ని ఆరోపణలు గుప్పించింది. అమెరికా కూడా ఈ అంశంలో తన ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదంపై పోరులో భారత్, అమెరికా కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో ఈ రకమైన ఆరోపణలు ఏమంత మంచివి కాదు. 26/11 ఉగ్రదాడి మనలోని లోపాలు ఎన్నింటినో ఎత్తి చూపింది. వాటిని పరిష్కరించే విషయంలో ఇప్పటికే జరిగిన జాప్యం చాలు. ఈ విషయంలో వీలైనంత తొంద రగా సంస్కరణల ప్రక్రియ ప్రారంభం కావడం దేశ హితం దృష్ట్యా అవసరం. సి. ఉదయ్ భాస్కర్ వ్యాసకర్త డైరెక్టర్, సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
కొలీజియం తీర్మానం తీవ్ర ఆందోళనకరం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా)కు చెందిన రహస్య పత్రాల్లో కొన్ని భాగాలను బహిర్గతం చేయాలని కొలీజియం తీర్మానించడం తీవ్ర ఆందోళనకర అంశమని అన్నారు. నిఘా విభాగాల సిబ్బంది దేశ హితం కోసం రహస్యంగా కార్యకలాపాలు సాగిస్తుంటారని, వారి రిపోర్టులను బయటపెడితే భవిష్యత్తులో కార్యాచరణపై ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి వస్తుందని చెప్పారు. తద్వారా కొన్ని చిక్కులు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. మద్రాసు హైకోర్టు, ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఐబీ, ‘రా’ ఇచ్చిన నివేదికల్లోని కొన్ని భాగాలను ప్రజా సమూహంలోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవలే తీర్మానించింది. దీనిపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తొలిసారిగా మంగళవారం మాట్లాడారు. కొలీజియం వ్యవహారంపై సరైన సమయంలో పూర్తిస్థాయిలో స్పందిస్తానని, ఇది తగిన సమయం కాదని అన్నారు. -
గుజరాత్లో ఆప్ విజయం ఖాయం.. కానీ!
అహ్మదాబాద్: ఈ ఏడాది చివర్లో జరగనున్నగుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై కీలకవ్యాఖ్యలు చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. రాష్ట్రంలో తామే అధికారంలోకి రాబోతున్నట్లు చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గుజరాత్లో ఆప్ ప్రభుత్వమే ఏర్పాటు అవుతుందని ఐబీ నివేదికలో తేలిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆ విషయాన్ని తనకు ఐబీ వర్గాల్లో తెలిసిన వారు చెప్పారని వెల్లడించారు. అయితే కొద్ది తేడాతోనే ఆప్ గెలుస్తుందని, నివేదిక చెబుతోందని కేజ్రీవాల్ అన్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున గుజరాత్ ప్రజలు ఆప్ మెజార్టీని మరింత పెంచాలని కోరారు. ఆప్ విజయం సాధిస్తుందని తెలిసి బీజేపీ నేతలకు ఏం చేయాలో తెలియడం లేదని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. ఎలాగైనా తమను ఓడించాలని కమలం పార్టీ, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. రెండు పార్టీలు ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చి కాంగ్రెస్‌కు ప్రయోజనం చేకూర్చేందుకు ఆ పార్టీ ప్రణాళికలు రచిస్తోందని తెలిపారు. ఆప్ గెలవకుండా కాంగ్రెస్‌ను గెలిపించేలా కుట్రలు జరుగుతున్నాయన్నారు. గుజరాత్లో బీజేపీ పాలనను వ్యతిరేకిస్తున్నవారు ఆప్కే ఓటు వేయాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఆ పార్టీ పని అయిపోయిందని, 10 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. ఢిల్లీ, పంజాబ్ కంటే గుజరాత్లో తమను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న ఆయన మాట్లాడిన వీడియోను ఆప్ ట్విట్టర్లో షేర్ చేసింది. Congress के कुछ नेता BJP में जाना चाहते थे। BJP ने कहा 'हम कांग्रेस को और कमजोर नहीं करना चाहते। अभी वहीं रहो, आपका ख़्याल रखेंगे' कांग्रेस को VOTE देकर BJP को जीता मत देना। कांग्रेस ख़त्म है। इनकी 10 Seat नहीं आ रही। ये चुनाव बाद BJP में शामिल हो जाएंगे। -CM @ArvindKejriwal pic.twitter.com/sNSFOOAhdW — AAP (@AamAadmiParty) October 2, 2022 గోవుకు రూ.40 గుజరాత్లో ఆప్‌ను గెలిపిస్తే గోవులు ఉన్నవారికి ఒక్కో ఆవుకు నెలకు రూ.40 ఇస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఢిల్లీలోనూ ప్రస్తుతం ఈ పథకం అమలు అవుతోందని చెప్పారు. దేశ రాజధానిలో ఆవులున్న వారికి ఒక్కో ఆవుకు రూ.40చొప్పున ప్రతినెల చెల్లిస్తున్నామని వివరించారు. రూ.20 ఢిల్లీ ప్రభుత్వం నుంచి మరో రూ.20 మున్సిపల్ కార్పోరేషన్ నుంచి అందుతుందని పేర్కొన్నారు. అలాగే గోవుల కోసం ప్రతి జిల్లాలో షెల్టర్ హోమ్స్ నిర్మిస్తామన్నారు. ఢిల్లీలో బీజేపీకి బలంగా హిందూ ఓట్లను తనవైపు తిప్పుకునేందుకు కేజ్రీవాల్ ఈ హామీని ప్రకటించినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ లేదా డిసెంబర్లో జరగనున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్.. ఎలాగైనా గుజరాత్లో పాగా వేయాలని చూస్తోంది. అందుకే ఆ పార్టీ జాతీయ కన్వీనర్ తరచూ గుజరాత్ పర్యటనకు వెళ్తున్నారు. అక్కడి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు. 10 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగత భృతి, ఉచిత కరెంట్, విద్యారంగంలో సంస్కరణలు వంటి హామీలను ఇప్పటికే ప్రకటించారు. చదవండి: అందుకే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచా -
రాజకీయ విమర్శలు-ఎబి వెంకటేశ్వరరావు చేసిన తప్పేమిటి!
ఆంద్ర ప్రదేశ్ సీనియర్ పోలీసు అధికారి, గత టిడిపి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ విభాగం డిజిగా ఉన్న ఎబి వెంకటేశ్వరరావు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకటన మాదిరిగానే ఉన్నాయి. ఆయనను ఇప్పటికే రెండోసారి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ సస్పెన్షన్ అన్యాయమైనదని ఆయన వాదించవచ్చు. అంతవరకు తప్పు లేదు. కాని మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైన, ఇతర సీనియర్ అధికారులపైన ఆయన అనుచితంగా మాట్లాడినట్లు అనిపిస్తోంది. మీడియాతో మాట్లాడడానికి ముందు ఆయన ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా? తన సస్పెన్షన్ సరికాదని ఛీఫ్ సెక్రటరికి వాదన తెలియచేయకుండా ఇలా మాట్లాడవచ్చా? బహుశా ఆయన కూడా ప్రస్టేషన్ కు లోనవుతుండవచ్చు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదని ఆయన అనుభవపూర్వకంగా చెబుతుండవచ్చు. ఇజ్రాయిల్ నుంచి ఫోన్ టాపింగ్ పరికరాలు తెప్పించడానికి , ఆయన కుమారుడి కంపెనీకి సంబంధిత కాంట్రాక్టు అప్పగించడానికి ప్రయత్నించారన్నది అభియోగం. ఆయన వాటిలో అవినీతి జరగలేదని అంటున్నారు. కాని అసలు ఆ పరికరాలు కొనవలసిన అవసరం ఏమి వచ్చింది. నిజంగానే తీవ్రవాదులపై నిఘా కోసమే అయితే వైసిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డి తో సహా పలువురు నేతల ఫోన్ లు టాప్ చేయించారన్న అభియోగాలు ఎందుకు వచ్చాయి? ఆయనపై విచారణ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆదేశాలు ఇచ్చింది? వీటన్నిటికి ఆయన వివరణ పరిమితం అయి ఉంటే బాగుండేది. నిజానికి చంద్రబాబు ప్రభుత్వంలో కీలక పోస్టింగ్ లోకి వచ్చేంతవరకు ఎబి వెంకటేశ్వరరావు పెద్దగా వివాదాస్పదుడు అయినట్లు వార్తలు రాలేదు. కాని చంద్రబాబు జత పట్టగానే ఎందుకు ఇలా అయ్యారో తెలియదు. ఆయనపై పలు రాజకీయ ఆరోపణలు కూడా వచ్చేవి. గతంలో అనేక మంది ఇంటెలెజెన్స్ డిజిలు పనిచేసినా ఒకరిద్దరు తప్ప ఎవరూ వివాదాలలో లేరు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీనియర్ అధికారి అరవిందరావు నిఘా విభాగం అధిపతిగా ఉండేవారు. ఆయన ఎప్పుడూ రాజకీయ జోక్యం చేసుకున్నట్లు విమర్శలు రాలేదు. ఆ తర్వాత కూడా పలువురు ఇంటెలిజెన్స్ లో పనిచేసినా అసలు ప్రజలకు తెలిసేవారే కారు. అంతదాకా ఎందుకు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నిఘా విభాగం అధినేతలు ఎవరైనా పబ్లిక్ లో కనిపించారా? వారెవరో ప్రజలకు తెలుసా? వారు తమ పనిని సైలెంట్ గా చేసుకుపోతుంటారు. అలా అని పోలీసు ఉన్నతాధికారులంతా రాజకీయాలకు అతీతంగా ఉంటారన్న గ్యారంటీ లేదు. గతంలో ఎమ్.వి.భాస్కరరావు డిజిపి గా ఉన్నప్పుడు ఆయన తమ్ముడికి కాంగ్రెస్ టిక్కెట్ కోసం గాంధీ భవన్ కు వెళ్లారన్న విమర్శలు వచ్చాయి. ఐఎఎస్, ఐపిఎస్ వంటి అఖిలభారత సర్వీసులో ఉన్నవారు సాధ్యమైనంతవరకు వివాదాలకు దూరంగా ఉండాలి. వారిది కూడా కత్తిమీద సామె. ప్రభుత్వంలో ఉన్నవారు ఎవరైనా తమకు సానుకూలంగా ఉండే అధికారులనే ఆయా బాధ్యతలలో నియమిస్తారు.అదేమీ కొత్త విషయం కాదు. మరో ఉదాహరణ కూడా చెప్పాలి. సీనియర్ ఐఎఎస్ అధికారిగా పనిచేసిన ఎవిఎస్ రెడ్డికి టిడిపి హయాంలో ప్రభుత్వంతో విబేధాలు వచ్చాయి. దాంతో ఆయన అసంతృప్తికి గురై భరతసేన అనే పేరుతో కొంతకాలం ఒక సంస్థను నడిపారు. చదవండి👉రాష్ట్రపతి ఎన్నికలు.. బాబును పట్టించుకోని ప్రధాని మోదీ తదుపరి కొంతకాలానికి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆయన తిరిగి ప్రభుత్వంలో చేరిపోయారు. హర్యానాలో నిబంధనల ప్రకారమే విధులు నిర్వహిస్తారన్న పేరు ఉన్న అశోక్ ఖేమ్కే అనే అధికారి డెబ్బై సార్లకు పైగా బదిలీ అయ్యారని గతంలో వార్తలు వచ్చాయి. దాదాపు అన్ని రాష్ట్రాలలో అఖిలభారత సర్వీసుల వారు కొందరు వివాదాస్పదులవడం, మరికొందరు ప్రభుత్వంలోని రాజకీయ పెద్దల ఆగ్రహానికి గురి కావడం వంటివి జరుగుతూనే ఉంటాయి. కొందరు ఐఎఎస్ , ఐపిఎస్ అధికారులు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ కోసం కాండిడేట్లను కూడా సిఫారస్ చేస్తుంటారని చెబుతారు. ఇంకో విషయం గుర్తు చేసుకోవాలి. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ లో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే యత్నంలో ఓటుకు నోటు కేసులో చిక్కుకున్నారు. ఆ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం పెట్టిన నిఘా విషయం పసికట్టలేకపోయారని అప్పటి ఎపి నిఘా విభాగం అదికారిని బదిలీ చేశారన్నది వాస్తవం కాదా? ఆ తర్వాత ఎబి వెంకటేశ్వరరావును ఆ పదవిలోకి తీసుకు వచ్చారు. దురదృష్టవశాత్తు ఎబి వెంకటేశ్వరరావు టిడిపి ప్రభుత్వ హయాంలో ఏదో రూపంలో నిత్యం వార్తలలో ఉండేవారు. దాని ఫలితమే ఇప్పుడు ఆయన ఈ చిక్కులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి ఎవరు సలహా ఇచ్చారో అంటూ చేసిన వ్యాఖ్యలు ఆయనకూ వర్తిస్తాయి. ఎవరి సలహా మేర ఎబి ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి జగన్ పైన రాజకీయ విమర్శలు చేశారో తెలియదు. ఇవి పూర్తిగా అనుచితం అవుతాయి. సీనియర్ అధికారిగా ఉన్న ఆయనకు ఈ విషయం తెలియదా? తెలిసినా, ఇంతకన్నా పోయేది ఏముందని మాట్లాడారా? తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలనే ఆయన చేసినట్లుగా ఉందన్న భావానికి ఆస్కారం ఇవ్వకుండా ఉండాల్సింది. అన్నిటికి మించి కోడికత్తి కేసు అంటూ , గతంలో వైఎస్ జగన్ పై జరిగిన దాడి ఘటనలో రాష్ట్రాన్ని తగులబెట్టాలని చూశారని, తాను అడ్డుకున్నానని ఆయన అంటున్నారు. ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. ఆ ఘటన జరిగినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కాని, టిడిపి నేతలు కాని ఇలాంటి ఆరోపణ చేయలేదు. కాని ఇప్పుడు ఎబి చేస్తున్నారంటే దాని మతలబు ఏమిటి? అది నిజమే అయితే ఆయన తన బాధ్యతను సరిగా నిర్వహించి సంబంధిత వ్యక్తులపై కేసులు పెట్టి ఉండాల్సింది కదా? ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించారన్నదానికి జవాబు చెప్పవలసి ఉంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సిబిఐ , ఈడి చార్జీషీట్లు ఉన్నాయని ఆయన అన్నారు. ఇది ఎబి కొత్తగా కనిపెట్టిన విషయం కాదు. ఆ కేసులు ఎలా వచ్చాయో అందరికి తెలిసిందే. కేసుల పేరుతో ఆయనను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఆ తరువాత ఆయన ప్రజాక్షేత్రంలోకి వచ్చి, ప్రజానీకాన్ని ఒప్పించి ముఖ్యమంత్రి అయ్యారు. ఎబి కూడా అలాగే ప్రజల వద్దకు వస్తారేమో తెలియదు. ప్రభుత్వాన్ని పగడొడతానంటూ తానేమీ కామెంట్ చేయలేదని చెబుతున్న ఆయన టిడిపి హయాంలో 23 మంది వైసిపి ఎమ్మెల్యేల కొనుగోలు లావాదేవీలలో ప్రమేయం కలిగి ఉన్నారని వైసిపి పలుమార్లు ఆరోపించింది. కొందరు ఎమ్మెల్యేలు కూడా ఆ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. తనకు సంబందం లేదని ఆయన చెబుతుండవచ్చు. చదవండి👉‘కుప్పంలో సత్తా చూపిస్తాం.. రాజీనామా చెయ్యి’.. చంద్రబాబుకు మంత్రి నాగార్జున సవాల్ వాస్తవం ఏమిటో ప్రజలకు తెలుసు. ఆయన అంతరాత్మకు తెలియకుండా ఉంటుందా? దుర్మార్గుడైన రాజు పాలనలో పనిచేయడం కన్నా అడవిలో వ్యవసాయం చేసుకోవడం మంచిదన్న కవి మాటలను ఆయన అసందర్భంగా చెప్పినట్లు అనిపిస్తుంది. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆయనకు కోపం ఉండవచ్చు. కాని ద్వేషపూరితంగా మాట్లాడకూడదు. నిజంగానే అలా వ్యవసాయం చేయదలిస్తే షంషేర్ గా చేసుకోవచ్చు. అలాకాకుండా తన ఉద్యోగం కోసమే ఆయన ఎందుకు పాకులాడుతున్నట్లు? ఎన్నో వెధవ పనులు అడ్డుకోవడం వల్లే తాను టార్గెట్ అయ్యానని ఆయన చెప్పారు. మంచిదే. మరి తుని రైలు దగ్దం ఘటనను, టిడిపి లో చేరిన అప్పటి వైసిపి ఎమ్మెల్యే , అలాగే మాజీ ఎమ్మెల్యే లు నక్సల్స్ చేతిలో హత్యకు గురికాకుండా అడ్డుకోగలిగి ఉంటే మంచి పేరు వచ్చేదికదా? ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు రాజమండ్రి వద్ద పుష్కర ఘాట్ లో స్నానం చేస్తున్న సందర్భంలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించిన ఘటనను ఎబి ముందుగా నివారించగలిగి ఉంటే చాలా మంది ప్రాణాలు నిలబడేవి కదా? తిరుపతిలో ఇరవై మంది ఎన్ కౌంటర్ కాకుండా వారిని చట్టపరంగా శిక్షించేలా ఎబి ప్రయత్నించి ఉంటే అప్పుడు ఏ వెధవ పనులనైనా అడ్డుకున్నారన్న మంచి పేరు వచ్చేది కదా? తెలుగుదేశం యువత అధ్యక్ష పదవికి సంబంధించి ఎబి తో సంప్రదించినట్లు టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చెప్పినట్లు వచ్చిన వీడియో సంగతి ఏమిటి? తనపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా తప్పని నిరూపిస్తానని ఆయన అనవచ్చు. అలా చేయగలిగితే ఆయనకు గుర్తింపు కూడా వస్తుంది. కాని ఆ పని మీద ఉండకుండా రాజకీయంగా మాట్లాడడంలోని ఆంతర్యం ఏమిటన్నదానిపై ఎవరికి వారు ఊహించుకోవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
మరియమ్మ లాకప్‌డెత్‌పై సీబీఐ దర్యాప్తు వద్దు.. ‘ఆదేశిస్తే మేము సిద్ధం'
సాక్షి, హైదరాబాద్: మరియమ్మ లాకప్‌డెత్ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించొద్దని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. రాష్ట్రంలో సమర్థంగా దర్యాప్తు చేసే సీఐడీ లాంటి దర్యాప్తు సంస్థలున్నాయని, సీబీఐకి ఈ కేసు దర్యాప్తు అప్పగిస్తే రాష్ట్ర పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బ తింటుందని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాలకు లోబడి దర్యాప్తు జరుగుతోందని, లాకప్‌డెత్‌కు బాధ్యులైన ఎస్సై, కానిస్టేబుల్‌ను విధుల నుంచి తొలగించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు ఇతర కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. లాకప్‌డెత్ ఘటనపై న్యాయ విచారణతో పాటు, బాధిత కుటుంబానికి రూ.5 కోట్ల పరిహారం ఇచ్చేలా ఆదేశించాలంటూ పౌర హక్కుల సంఘం నేత జయవింధ్యాల దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఆదేశిస్తే మేము సిద్ధం: సీబీఐ న్యాయస్థానం ఆదేశిస్తే దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామని హైకోర్టుకు సీబీఐ నివేదించింది. మరియమ్మ గతంలో ధర్మాసనం ఆదేశాల మేరకు సీబీఐ ఎస్పీ కల్యాణ్ ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. కేసుల దర్యాప్తు విషయంలో సీబీఐపై పనిభారం ఉందా అని ధర్మాసనం కల్యాణ్‌ను ప్రశ్నించగా.. ధర్మాసనం ఆదేశిస్తే దర్యాప్తు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్ర పోలీసులు కూడా దర్యాప్తును సమర్థంగా చేస్తారని, సీఐడీ దర్యాప్తునకు ఆదేశించాలని రాష్ట్ర ఏజీ అభ్యర్థించారు. మరియమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం చేశామని, ఇంట్లో ఒకరికి ఉపాధి కల్పించామని నివేదించారు. దర్యాప్తులో ఎవరైనా బాధ్యులని తేలితే వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్‌భగవత్, ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్పీ సంబంధన్ కూడా ప్రత్యక్షంగా కోర్టు విచారణకు హాజరయ్యారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. -
రాజ్ కుంద్రా అరాచకాలు: ఐబీ అధికారి భార్య పేరు మీద యాప్
ముంబయి: రాజ్ కుంద్రా ప్రధాన నిందితుడిగా ఉన్న పోర్నోగ్రఫీ కేసు విచారణలో విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పోర్న్ చిత్రాల ప్రసారానికి ఏర్పాటు చేసిన హాట్ షాట్స్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించడంతో కుంద్రా ప్లాన్-బీని అమలు చేసినట్లు తెలుస్తోంది. బాలీఫేమ్ పేరుతో మరో యాప్‌ను ఏర్పాటు చేసి వ్యాపారం కొనసాగించారని పోలీసులు పేర్కొంటున్నారు. ఇందుకుగాను రాజ్ కుంద్రా ఏకంగా ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)కి చెందిన ఓ అధికారిని అతడికి తెలియకుండానే ఇందులో భాగస్వామిని చేసినట్లు వెల్లడైంది. ప్రస్తుతం పరారీలో ఉన్న కుంద్రా సన్నిహితుడు యష్ ఠాకుర్ ముందస్తు ప్రణాళికతో ఆ అధికారితో పరిచయం పెంచుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో అవార్డులు గెలుచుకున్న షార్ట్ ఫిలిమ్స్‌ను ప్రసారం చేసేందుకు యాప్‌ను ఏర్పాటు చేద్దామని యష్ ఠాకూర్.. సదరు ఐబీ అధికారి వద్ద ప్రతిపాదించాడు. అందుకు అంగీకరించిన ఆ అధికారి తన భార్య పేరు మీద బాలీఫేమ్ యాప్‌ను రిజిస్టర్ చేశాడు. అయితే ఆ యాప్‌లో అశ్లీల చిత్రాలను అప్లోడ్ చేయడంతో అతడు అభ్యంతరం తెలిపినట్లు తెలిసింది. కుంద్రా అరెస్టైన మరుసటి రోజు ఆ యాప్ నుంచి పోర్న్ చిత్రాలను తొలగించమని తమకు చెప్పినట్లు ఈ కేసులో సాక్షులుగా మారిన కుంద్రా సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులు తెలిపారని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఈ కేసులో మంగళవారం విచారణకు రావాలంటూ నటి షెర్లిన్ చోప్రాకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. -
మంత్రి కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం
సాక్షి, అమరావతి : వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబుకు రాష్ట్ర ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది. భద్రతా కారణాలరీత్యా ఇంటెలిజెన్స్ నివేదిక మేరకు హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పది రోజుల క్రితం మంత్రి కన్నబాబుకు బీపీ (బుల్లెట్ ప్రూఫ్) వాహనం కేటాయించాలని ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక ఇచ్చాయి. ఇక నుంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే ప్రయాణాలు, పర్యటనలు చేపట్టాలని మంత్రికి ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించాయి. -
అయోధ్యలో ఉగ్ర కుట్రలకు పాక్ పన్నాగం!
న్యూఢిల్లీ: అయోధ్యలో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులు చేసే ప్రణాళికలు రచిస్తున్నట్టు భారత నిఘా విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఆగస్టు 15న పాకిస్తాన్ ఐఎస్ఐ ట్రైనింగ్ ఇచ్చిన లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ టెర్రరిస్టులు దాడులు చేసే అవకాశం ఉందని తెలిపింది. భారత్‌లో ఉగ్రదాడులు చేసి అంతర్గతంగా కల్లోలం సృష్టించాలని ఐఎస్ఐ కుట్రలు పన్నుతోందని పరిశోధన మరియు విశ్లేషణ విభాగం (రా) అధికారులు వెల్లడించారు. మూడు నుంచి ఐదు టెర్రరిస్టు గ్రూపులు మన దేశంలోకి చొరబడేందుకు చూస్తున్నాయని, పాక్ ఐఎస్ఐ వారికి సాయం చేస్తోందని తెలిపారు. 20 నుంచి 25 మంది నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంట, 5 నుంచి 6 మంది ఇండో నేపాల్ సరిహద్దుల నుంచి దేశంలోకి చొరబడేందుకు అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అయోధ్యతోపాటు కశ్మీర్‌లోనూ దాడులు చేసేందుకు పాకిస్తాన్‌లోని జలాల్‌బాద్‌లో ఐఎస్ఐ వారికి శిక్షణ ఇచ్చిందని తెలిపారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రతా అధికారులు సరిహద్దుల వెంబడి గస్తీని పెంచారు. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన సమయం దగ్గరపడుతున్న వేళ ఇంటిలిజెన్స్ వర్గాల హెచ్చరికలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఆగస్టు 5 న ప్రధాని మోదీ భవ్య రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు అదే రోజు ఏడాది పూర్తవుతుండటం విశేషం. -
కోవిడ్‌పై రంగంలోకి ఐబీ!
సాక్షి, హైదరాబాద్ : కోవిడ్ నియంత్రణకు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) రంగంలోకి దిగింది. విదేశాల నుంచి వచ్చినవారిని వెతికి పట్టుకోవడం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. కొందరు విదేశాల నుంచి వచ్చి కూడా తమ వివరాలు బయటకు వెల్లడి కాకుండా చూసుకోవడం.. వైద్య, ఆరోగ్యశాఖకు వెల్లడించకపోవడంతో ప్రభుత్వం ఐబీ సహకారం తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాలతో ప్రజా రోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిం చారు. అయితే ఆ సమావేశ వివరాలను ప్రభుత్వం గోప్యంగా ఉంచింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ఇంటెలి జెన్స్ బృందాలు విదేశాల నుంచి వచ్చిన 18 వేల మంది వివరాలను సేకరించాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన వారందరి అడ్రస్‌లను గుర్తించాయి. ఇంకా ఎవరెవరు అందుబాటులో లేకుండా ఉన్నారన్న దాని పైనా ఇంటెలిజెన్స్ వర్గాలు జల్లెడ పడుతున్నాయి. ఎయిర్‌పోర్టు నుంచి జాబితా తీసుకొని వారిని గుర్తిస్తున్నాయి. గత 3 రోజుల్లోనే యూకే నుంచి ఏకంగా 100 మంది వచ్చారని ఒక ఇంటెలిజెన్స్ అధికారి తెలిపారు. సెక్రటేరియట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఇప్పటివరకు వైద్య, ఆరోగ్యశాఖ కోఠిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనరేట్‌లో కమాండ్ కం ట్రోల్ రూంను ఏర్పాటు చేసి ఆ శాఖ అధికారులతో పర్యవేక్షణ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచే మంత్రి ఈటల రాజేందర్ వైద్యాధికారులతో పర్యవేక్షణ, సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కోవిడ్ కేసుల సంఖ్య పెరగడం, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం దీనిపైనే దృష్టిసారించడం, రాష్ట్రాన్ని లాక్‌డౌన్‌గా ప్రకటించడంతో ఇక అన్ని శాఖలను పర్యవేక్షించేందుకు సచివాలయంలో సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. దీన్ని జీఏడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఇక్కడి నుంచే కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా వైద్యాధికారులు, ఇతర శాఖల జిల్లా అధికారులతో పర్యవేక్షణ చేస్తారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. దీనికోసం వైద్య ఆరోగ్యశాఖ తరఫున కొందరు అధికారులతోపాటు నలుగురు వైద్యులను నియమిస్తారు. అన్ని శాఖల తరఫున షిఫ్టుల ప్రకారం అధికారులు విధులు నిర్వహిస్తారు. అయితే ఇది సాధారణ బాధితులకు అందుబాటులో ఉండదు. కోవిడ్ బాధితులు తమ వివరాలు, సందేహాలు, సమాచారం కోసం ‘104’నంబర్‌కు ఫోన్ చేయాల్సి ఉంటుంది. వైద్య, ఆరోగ్యశాఖ ఇప్పుడు నిర్వహిస్తున్న కమాండ్ కంట్రోల్ రూం యథావిధిగా తన కార్యకలాపాలను నిర్వహిస్తుందని అధికారులు తెలిపారు. ‘తెలంగాణ కోవిడ్ యాప్’ప్రారంభం... రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ అనుమానిత కేసులను గుర్తించి, నమోదు చేసేందుకు ప్రత్యేక యాప్‌ను వైద్య, ఆరోగ్యశాఖ ప్రారంభించింది. ఈ యాప్‌ను ఎలా వినియోగించాలన్న దానిపై కలెక్టర్లకు ప్రజారోగ్య సంచాలకులు లేఖ రాశారు. ఎలాంటి సమాచారం పంపాలన్న దానిపైనా వారికి మార్గదర్శకాలిచ్చారు. గ్రామాలవారీగా ఉండే ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి విదేశాల నుంచి వచ్చినవారు, అనుమానిత కేసులు, కోవిడ్ లక్షణాలున్న వారిని గుర్తిస్తారు. రాష్ట్రంలో 25 వేల మంది ఆశ కార్యకర్తలు, 8 వేల మంది, 31 వేల మంది అంగన్వాడీ కార్యకర్తలుంటారు. వారిలో చాలామంది వద్ద ట్యాబ్‌లున్నాయి. ట్యాబ్‌లలో ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేస్తారు. వారంతా ప్రతీ గ్రామంలో ఇంటింటి సర్వే చేపడతారు. ఆ సర్వే వివరాలను ప్రతీ రోజూ వారు తమ యాప్‌లో అప్లోడ్ చేస్తారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది విదేశాల నుంచి వచ్చారు? ఎందరు హోం క్వారంటైన్లో ఉన్నారు? ఎందరు అనుమానిత లక్షణాలతో బాధపడుతున్నారన్న సమాచారాన్ని వారు సేకరిస్తారు. అంతేగాక ఎంతమంది రిస్క్‌లో ఉన్నారు? ఎంతమందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు? వంటి వివరాలను సేకరిస్తారు. ఆయా వివరాలను యాప్‌లో అప్లోడ్ చేశాక దాన్ని గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రస్థాయిలో సమీక్షించి తగు చర్యలు తీసుకుంటారు. అవసరమైన వారిని క్వారంటైన్‌కు తరలిస్తారు. మున్ముందు ఈ యాప్‌ను మరింత విస్తరించి ప్రజలకు అందుబాటులోకి తెస్తారు. ఎవరైనా కోవిడ్ బాధితులు తమ వివరాలను ఈ యాప్‌లో అప్లోడ్ చేస్తే వారి వద్దకు వైద్య సిబ్బందిని పంపిస్తారు. అవసరమైతే ఆసుపత్రికి తరలిస్తారు. ఇదిలావుండగా హైదరాబాద్‌లో పాజిటివ్ వచ్చిన వ్యక్తుల ఇళ్ల సమీపంలో 150 వైద్య బృందాలు ఇంటింటి సర్వే చేపట్టాయి. 300మందితో ఇండోనేసియన్ల బృందం కాంటాక్ట్... మత ప్రచారం కోసం ఇండోనేసియా నుంచి వచ్చిన 10 మంది బృందం కరీంనగర్ వెళ్లిన విషయం తెలిసిందే. వారందరికీ కోవిడ్ పాజిటివ్ వచ్చిన విషయమూ విదితమే. వారు ఈ రాష్ట్రంలో దాదాపు 300 మందితో కాంటాక్ట్ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే అత్యంత సన్నిహితంగా 37 మందితో మెలిగారు. వీరందరినీ వైద్య పర్యవేక్షణలోనూ, క్వారంటైన్‌లోనూ ఉంచారు. పోలీసుశాఖ, వైద్య ఆరోగ్యశాఖ మధ్య సమన్వయం... విదేశాల నుంచి వచ్చేవారు తమకు అందకుండా తిరుగుతున్నారని భావించిన వైద్య, ఆరోగ్యశాఖ పోలీసుశాఖ సాయం కోరింది. సోమవారం పోలీసుశాఖ ఉన్నతాధికారులతో వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పలుమార్లు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కూడా అన్ని శాఖలతోనూ సమన్వయం కోసం సుదీర్ఘంగా ఫోన్లో చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా హోం క్వారంటైన్లో ఉన్న వారి సంఖ్య : 12,486 కోవిడ్ ఉన్నవారితో కాంటాక్ట్ అయినట్లు నిర్దారణ అయినవారు : 456 రాష్ట్రంలో రెడీగా ఉన్న ఐసోలేషన్ సెంటర్లు : 130 వీటిలో మొత్తం పడకల సంఖ్య : 32,500 -
తీరంపై డేగకన్ను
తీరం అప్రమత్తమైంది. ఉగ్రమూకల చొరబాట్లను అడ్డుకునేందుకు.. ఎగిసి పడుతున్న అలల మధ్య డేగ కళ్లతో పహారా కొనసాగుతోంది. కేంద్ర నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులను అలర్ట్ చేసింది. ఈ క్రమంలో పోర్టులు, హార్బర్లకు పడవల రాకపోకలపై ప్రత్యేక దృష్టి సారించారు. నిర్జన ప్రదేశాల్లో సైతం పటిష్ట నిఘాను ఏర్పాటు చేశారు. మెరైన్ పోలీసులు సముద్ర వేటకు వెళ్లే జాలర్లకు అవగాహన కల్పిస్తూ నిరంతరం గస్తీ కాస్తున్నారు. సాక్షి, గుంటూరు : రాష్ట్రంలోకి ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర ప్రాంత జిల్లాల కోస్ట్‌గార్డ్, పోలీస్ ఉన్నతాధికారులను నిఘా వర్గాల సూచనల మేరకు తీర ప్రాంతంపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించింది. ఇంటెలిజెన్స్ హెచ్చరికల మేరకు రేంజ్ పరిధిలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సముద్రతీర ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న మెరైన్ పోలీసులను ఎప్పటికప్పుడు సమాచారం పంపించాలని రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ ఆదేశించారు. ఎటువంటి అనుమానం వచ్చినా వెంటనే విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేసి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరంతర పహారా.. తీర ప్రాంతలో నిరంతరం గస్తీ కొనసాగించడంతో పాటు చొరబాట్లుకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి వివరాలు సేకరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో మరింత నిఘా ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. నిర్జీవన ప్రదేశాలపై కూడా నిఘా ఉంచారు. ఆధునిక మరబోట్లపై సముద్రంలో గస్తీ నిర్వహిస్తూ జాలర్లను అప్రమత్తం చేసి వారికి అవగాహన కల్పించే మెరైన్ పోలీసులు నిమగ్నమయ్యారు. రాకపోకలపై ప్రత్యేక దృష్టి.. పోర్టులు, హార్బర్లకు రాకపోకలు కొనసాగించే పడవలు, బోట్లు, సముద్రంలో లంగరు వేసి ఉంచిన నౌకలపై కూడా దృష్టి సారించారు. ప్రసుత్తం ఉన్న బలగాలతో పాటుగా ఉగ్రవాదుల సమాచారం సేకరించే కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం రంగంలోకిదిగింది. మెరైన్ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బంది విధిగా వారికి కేటాయించిన పరిధిలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా సమాచారం సేకరించుకోవాలని నిఘా వర్గాలు సూచనల మేరకు ఆయా జిల్లాల ఎస్పీలు ముందస్తు చర్యల గురించి ఆరా తీశారు. జాలర్లకు అవగాహన.. గతంలో మన జాలర్ల ఇచ్చిన సమాచారం మేరకు ఇతర రాష్ట్రాలకు చెందిన జాలర్లు అక్రమంగా దేశ సరిహద్దుల్లోకి ప్రవేశించినట్లు గుర్తించిన కోస్ట్‌గార్డ్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదుల చొరబాటుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లోని జాలర్లకు అవగాహన కల్పిస్తున్నారు. అనుమానాస్పదంగా ఎలాంటి ఆనవాళ్లు గుర్తించినా వెంటనే తమకు సమాచారం అదించాలని సూచిస్తున్నారు. గుంటూరు రేంజ్ పరిధిలో సుమార్ 190 కిలో మీటర్ల మేర తీర ప్రాంతం ఉండగా జిల్లాలో 43 కిలోమీటర్లు ఉంది. సూర్యలకం, నిజాంపట్నంలో మెరైన్ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. ఒక్క నిజాంపట్నం హార్బర్లో 218 బోట్లు ఉంటే దాదాపు 200 బోట్లు నిత్యం చేపల వేటలో ఉంటాయి. ఇందులో 20 నుంచి 25 బోట్లు డైలీ సముద్రంలో వేట ముగించుకుని హార్బర్‌కు వస్తుంటాయి. -
భారత్‌లో దాడులకు పాక్ కుట్రలు !
శ్రీనగర్ : భారత్‌లో దాడులు చేసేందుకు పాకిస్తాన్ పథక రచన చేస్తోంది. ఈ క్రమంలోనే పాక్ ఉగ్రమూకల సంస్థలతో కలిసి సెస్టెంబర్ చివరి వారంలో లేక అక్టోబర్ మొదటి వారంలో పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు కుట్రలు పన్నుతున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. తాజాగా పాకిస్తాన్ బిగ్రేడ్‌కు చెందిన 2000 మందితో కూడిన బలగాలను పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని పూంచ్ ఏరియాకు చెందిన బాగ్, కోట్లీ సెక్టార్‌కు తరలించినట్లు సమాచారం అందింది. నియంత్రణ రేఖ (ఎల్వోసీ) నుంచి భారత భూభాగంలోకి చొరబడేజైష్-ఎ-ముహమ్మద్ (జెఎమ్), లష్కర్-ఎ-తొయిబా తీవ్రవాదులకు ఈ బలగాలు సహకరించనున్నాయి. ప్రస్తుతం ఈ బలగాలు నియంత్రణ రేఖకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిసింది. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఎస్ఎస్జి కమాండోలతో కలిసి ఎల్ఇటి, జైషే ఉగ్రవాదులు ఇప్పటికే ఫార్వర్డ్ లాంచ్ ప్యాడ్లలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పిఒకె)లో ఈ ఉగ్రవాద గ్రూపుల కోసం శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేశారు. జమాత్-ఎ-ఇస్లామి ఈ శిబిరాలకు నాయకత్వం వహిస్తుండగా, జైష్-ఎ-ముహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్, ఎల్ఈటీ తమ వంతు సహకారం అందించనున్నట్లు తెలిసింది. వజీరాస్తాన్ నుంచి పెద్ద మొత్తంలో ఉగ్రవాదులను చేర్చుకునేందుకు ఐఎస్ఐ పెద్ద మొత్తంలో జాబితాను తయారు చేసినట్లు, దీనికంతటికి హిజ్బుల్ కమాండర్ షంషేర్‌ఖాన్ నాయకత్వం వహించనున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. -
మత్స్యకారులే సైనికులు..
సాక్షి, అమరావతి: తమిళనాడు సముద్ర తీరం నుంచి ఉగ్రవాదులు చొరబడ్డారన్న కేంద్ర నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి అప్రమత్తత పెరిగింది. రాష్ట్రంలోని 974 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరంలో చొరబాటుకు అవకాశం ఉన్న దాదాపు 380 బ్లాక్ స్పాట్లలో భద్రత చర్యలు ముమ్మరమయ్యాయి. మెరైన్ పోలీస్స్టేషన్ల పరిధిలో హై అలర్ట్ ప్రకటించారు. విశాఖపట్నం కేంద్రంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు కోస్తా తీరం వరకు ఆంధ్రప్రదేశ్ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ (ఏపీసీఎస్‌పీ), కోస్ట్ గార్డ్స్, నేవీ బృందాలు గస్తీ కట్టుదిట్టం చేశాయి. ఐబీతో పాటు రాష్ట్రానికి చెందిన కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్‌లు కూడా కోస్తా తీరంలో అపరిచితుల కదలికలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో డేగ కళ్లతో కాపు కాస్తున్నాయి. మత్స్యకారులే సైనికులు.. ఆంధ్రప్రదేశ్‌లో సువిశాల కోస్తా తీరంలో మత్స్యకారులే పౌర సైనికులని చెప్పక తప్పదు. సముద్ర తీరంలో ఏపీసీఎస్‌పీ, కోస్ట్‌గార్డ్స్‌కు కూడా తెలియని ప్రాంతాలపై మత్స్యకారులకు అవగాహన ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తీరంలో అపరిచితులు ఎవరైనా చొరబడితే తమకు సమాచారం అందించేలా ఏపీసీఎస్‌పీ, నేవీ సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. రాష్ట్ర తీరం వెంబడి దాదాపు 541 గ్రామాల్లో 3.04 లక్షల మంది మత్స్యకారులున్నారు. మొత్తం 70 వేలకు పైగా బోట్లు నిత్యం తిరుగుతుంటాయి. మత్స్యకారులకు తగిన సౌకర్యాలు సమకూర్చి మరింత ప్రాధాన్యత ఇస్తే దేశ అంతర్గత భద్రతకు మేము సైతం అంటూ ముందు నిలుస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ముంబై దాడుల తర్వాత తీరం పటిష్టం దశాబ్ధం కిందట ముంబైలో టెర్రరిస్ట్ దాడులు దేశంలోని సముద్ర తీరం భద్రతను సవాలు చేశాయి. ఈ ఘటన నుంచి పాఠాలు నేర్చిన కేంద్ర హోంశాఖ 2017లో సముద్ర తీర రాష్ట్రాలకు 183 మెరైన్ పోలీస్స్టేషన్లను మంజూరు చేసింది. ఏపీలో కళింగపట్నం (శ్రీకాకుళం జిల్లా), రుషికొండ (విశాఖపట్నం), వాకలపూడి (తూర్పుగోదావరి), గిలకలదిండి (కృష్ణా), సూర్యలంక (గుంటూరు), దుగరాజపట్నం (నెల్లూరు) ప్రాంతాల్లో మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉండగా.. మరో 15 కొత్తగా ఏర్పాటయ్యాయి. వాటికి తగిన పోలీస్ సిబ్బంది నియామకంతోపాటు, మరబోట్లు, జెట్టీలు, అధునాతన ఆయుధాలు సమకూర్చాల్సి ఉంది. -
భారీ ఉగ్రకుట్ర: దేశ వ్యాప్తంగా హైఅలర్ట్
గాంధీనగర్: భారీ ఉగ్రకుట్రకు పాల్పడేందుకు దేశంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారని ఇంటిలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. గుజరాత్ సరిహద్దుల నుంచి అఫ్గనిస్తాన్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించారని ఐబీ గుర్తించింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా గుజరాత్ వ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.అఫ్గనిస్తాన్ చెందిన నలుగురు ఉగ్రవాదులు ఆ దేశ పాస్‌పోర్టుల ద్వారా దేశంలోకి ప్రవేశించారని నిఘా వర్గాలు ధృవీకరించాయి. ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న నలుగురు వ్యక్తుల ఛాయా చిత్రాలను కూడా నిఘా వర్గాలు విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ, గుజరాత్, రాజస్తాన్‌తో పాటు ఉత్తర భారతంలోని మరిన్ని ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. భారీ ఉగ్రకుట్రకు వారు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశాయి. -
అభినందన్ ఈ పరీక్షలు... పాసైతేనే...
ఎట్టకేలకు అభినందన్ భారత్‌లో అడుగుపెట్టారు. అన్ని ప్రక్రియలు ముగిసినా 2 రోజులపాటు పాక్ ఆర్మీకి చిక్కడంతో అభినందన్‌కు కొన్ని పరీక్షలైతే తప్పనిసరిగా నిర్వహించాలి. పరాయిదేశానికి చిక్కిన వారు తిరిగి మాతృభూమికి చేరుకున్నప్పుడు కచ్చితంగా కొన్ని నియమ నిబంధనలైతే పాటిస్తారు. అవేంటంటే.. ► అభినందన్‌ను నేరుగా భారత వాయుసేన ఇంటెలిజెన్స్ యూనిట్‌కు అప్పగిస్తారు. ► అభినందన్ శారీరకంగా ఎంత ఫిట్నెస్తో ఉన్నారో కొన్ని వైద్య పరీక్షలు చేస్తారు. ► శత్రు దేశం ఆయన దుస్తుల్లో కానీ, శరీర భాగాల్లో కానీ ఏమైనా బగ్‌లు.. అంటే గూఢచర్యానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు అమర్చిందేమోనన్న అనుమానం తీర్చకోవడానికి శరీరం మొత్తం బగ్ స్కాన్ చేస్తారు. ► వింగ్ కమాండర్ మానసిక స్థితి ఎలా ఉందో కూడా పరీక్షలు చేసి తెలుసుకుంటారు. శత్రు దేశానికి చిక్కిన తర్వాత వాళ్లేమీ అతిథి మర్యాదలు చేయరు. ప్రత్యర్థి దేశ రక్షణ రహస్యాలను తెలుసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తారు. ఎవరైనా పెదవి విప్పకపోతే చిత్రహింసలు పెడతారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక దేశ రహస్యాలేమైనా చెప్పారేమోనన్న దిశగా అభినందన్‌ను విచారిస్తారు. ► ఆ తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అనాలసిస్ వింగ్ (రా) అధికారులు కూడా అభినందన్‌ను క్షుణ్నంగా విచారిస్తారు. ► సాధారణ యుద్ధ ఖైదీలైతే ఈ రెండు సంస్థల విచారణ చేయనక్కర్లేదు. కానీ అభినందన్‌ను యుద్ధఖైదీగా పరిగణించాలో అక్కర్లేదో అన్న సందేహాలు ఉండటంతో ఐబీ, రా అధికారులు కూడా ప్రశ్నలు వేస్తారు. సందేహాల నివృత్తి తర్వాతే ఇంటికి.. మొత్తం వ్యవహారంలో ఐఏఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారుల విచారణే అత్యంత క్లిష్టమైన ప్రక్రియని పేరు చెప్పడానికి ఇష్టపడని ఐఏఎఫ్ అధికారి ఒకరు వెల్లడించారు. అభినందన్ పాక్ ఆర్మీకి బందీగా ఉన్న సమయంలో ఎంత ధీరత్వాన్ని ప్రదర్శించినప్పటికీ, భారతీయ అధికారులకు ఆయనంటే ఎంత గౌరవం ఉన్నప్పటికీ ఇంటెలిజెన్స్‌కి ఉండే అనుమానాలు ఉంటాయి. పాక్‌లో బందీగా ఉన్నప్పుడు వాళ్లు ఏ ప్రశ్నలు వేశారు? ఎలాంటి సమాచారం రాబట్టడానికి ప్రయత్నించారు? వాళ్లు పెట్టే టార్చర్ భరించలేక లొంగిపోయి వారి గూఢచారిగా తిరిగి మన దేశానికి వచ్చారా? ఇలాంటి సందేహాలన్నీ పూర్తిస్థాయిలో నివృత్తి అయ్యాకే అభినందన్‌ను ఇంటికి వెళ్లనిస్తారు. ఆ తర్వాతే విధుల్లోకి తీసుకుంటారని వివరించారు. చదవండి...(అభినందన్ ఆగయా..) కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు పాక్‌కి చిక్కి భారత్‌కు తిరిగి వచ్చిన పైలట్ కె.నచికేతను విచారించిన సమయంలో దగ్గరుండి ఈ వ్యవహారాలన్నీ చూశానన్నారు. ఫీల్డ్ మార్షల్ కరియప్ప కుమారుడు కేసీ నంద కరియప్పను 1965 యుద్ధ సమయంలో బంధించి తిరిగి వచ్చాక జరిగిన ఘటనలపై ఆ అధికారి పూర్తిస్థాయిలో అధ్యయనం చేశారు. పాక్ వారిని ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినా భారత్ రహస్యాలు వాళ్లు బయటపెట్టలేదని చెప్పారు. అభినందన్ విషయంలో కూడా తమకు ఆ నమ్మకం ఉందని, కానీ తప్పనిసరిగా చేయాల్సిన పరీక్షలు, విచారణలు చేయాల్సిందేనని చెప్పారు. అభినందన్ అయినా, మరో యుద్ధ ఖైదీ అయినా ఈ విధివిధానాలు పూర్తి చేసినప్పుడు ఎంతో గౌరవం ఇస్తామని చెప్పారు. -
ఐబీ ఆదేశాలు: దేశవ్యాప్తంగా హై అలర్ట్
న్యూఢిల్లీ: పాక్ అక్రమిత కశ్మీర్లో భారత్ వైమానిక దళం జరిపిన ముప్పేట దాడి అనంతరం కేంద్రం నిఘా సంస్థలు దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ను ప్రకటించాయి. ఉగ్రవాదుల టార్గెట్‌లో ఉన్న అన్ని ప్రధాన నగరాల్లో అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ బ్యూరో ఆదేశాలు జారీచేసింది. మంగళవారం జైషే మహమ్మద్ స్థావరాలపై మెరుపు దాడులు జరిగిన నేపథ్యంలో ఉగ్రమూకలు విరుచుకుపడే అవకాశం ఉందని నిఘూ సంస్థలు రాష్ట్రాలకు సూచించాయి. ఈ మేరకు సెంట్రల్ ఐబీ నుంచి అన్ని రాష్ట్రాల డీజేపీలకు వర్తమానం అందింది. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సంఘ విద్రోహ శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందని.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించింది. -
కశ్మీర్ లోయలో హైఅలర్ట్
శ్రీనగర్ : పుల్వామా తరహా ఉగ్రదాడికి ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో జమ్మూతో పాటు పలు ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు. జమ్మూలోని అన్ని ప్రాంతాల్లో వాహనాల తనిఖీలను ముమ్మరంగా చేపట్టారు. తనిఖీల్లో భాగంగా బారాముల్లా జిల్లా సోపోర్‌లో భద్రత బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. అప్రమత్తమైన సిబ్బంది వారిని నిలువరించారు. దీంతో భద్రతా బలగాలకు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. (‘పుల్వామా కంటే పెద్ద ఉగ్రదాడి జరగొచ్చు’) ఈ నెల 16, 17 తేదీల్లో పాకిస్థాన్ దేశంలోని జైషే మహ్మద్ నాయకులు, కశ్మీర్ లోయలో ఉన్న ఉగ్రవాదులతో సంభాషించారని, ఆ సంభాషణలో జమ్మూ నగరం లేదా జమ్మూ కశ్మీర్ బయటి ప్రాంతంలో ఒకచోట మన జవాన్లపై భారీ దాడి చేయాలని వ్యూహం పన్నినట్లు ఇంటలిజెన్స్ కు సమాచారం అందింది. దీంతో ఇంటలిజెన్స్ అధికారులు మన భద్రతా బలగాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. (పాక్‌పై నిషేధం వద్దంటున్న డయానా) -
ఒక్క చెంప దెబ్బతో అన్నీ కక్కేశాడు
జమ్ముకశ్మీర్‌లో 40 మంది జవాన్ల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న పుల్వామా దాడి సూత్రధారి, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజర్పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది.భారత్‌పై ఎన్నో భీకర దాడులకు పాల్పడిన అజర్ గతంలో ఒకే ఒక్కసారి అరెస్ట్ అయ్యాడు. 1994–99 మధ్య కాలంలో జమ్ములోని కోట్ భల్వాల్ జైలులో అయిదేళ్లు ఊచలు లెక్కపెట్టాడు. ఆ సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధికారి అవినాశ్ మోహననే అజర్‌ను ప్రతీరోజూ విచారించేవారు. ఆ విచారణలో అజర్ మనస్తత్వాన్ని బాగా పసిగట్టారు. అజర్‌ను విచారించడం అత్యంత సులభమని, ఆర్మీ అధికారి ఒక్క చెంప దెబ్బకొట్టగానే, పాక్‌లో టెర్రరిస్టు గ్రూపుల గురించి, ఐఎస్ఐ గుట్టుమట్లు గురించి పూసగుచ్చినట్టు చెప్పేశాడని అవినాశ్ వెల్లడించారు. గొప్పలు ఎక్కువ మసూద్ అజర్‌కి గొప్పలు ఎక్కువ. తన గురించే ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. పాకిస్తాన్, ఐఎస్ఐ తనకెంత ప్రాధాన్యత ఇస్తుందో కథలు కథలుగా చెప్పేవాడు, తనని ఎక్కువ కాలం ఎవరూ కస్డడీలో ఉంచలేరని ధీమాగా గడిపేసేవాడు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టడంలో మసూద్‌కి మించిన వాడు లేడని పేరుంది.. కశ్మీర్లో జిహాదీని ప్రోత్సహించే సామర్థ్యం ఉన్న వాడు కనుకే అతనికి ఐఎస్ఐ అండదండలు పుష్కలంగా ఉన్నాయని అవినాశ్ అభిప్రాయపడ్డారు. తీగలాగితే చాలు.. కాస్త కదిలిస్తే చాలు అజర్ అనర్గళంగా మాట్లాడేవాడు. ఒక చిన్న ప్రశ్న వేస్తే చాలు..ఎన్నో విషయాలను వివరించేవాడు.పాక్ గడ్డపై ఉగ్రవాద మూకలు ఎలా పనిచేస్తాయి ? వారి నియామకం ఎలా జరుగుతుంది ? పాక్ గూఢచర్య ఐఎస్ఐ ఎలాంటి కుట్రలు పన్నుతుంది.. ఇలాంటి విషయాలన్నీ సమగ్రంగా వివరించేవాడు. ఆప్ఘన్ టెర్రరిస్టులు కశ్మీర్ లోయలోకి ఎలా ప్రవేశిస్తారో, హర్కత్ ఉల్ ముజాహిదీన్, హర్కత్ ఉల్ జిహాదీ ఇస్లామిలను విలీనం చేసి హర్కల్ ఉల్ అన్సర్ సంస్థ ఎలా ఏర్పడిందో వంటి విషయాలన్నీ వివరించాడు. తన స్వార్థం కోసం ఎంతదూరమైనా వెళతాడు అజర్. అనూహ్యంగా అరెస్ట్ అసలు అతను అరెస్ట్ కావడమే చాలా అనూహ్యంగా జరిగింది. హర్కత్ ఉల్ అన్సర్ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యదర్శిగా ఉండే అజర్ తమ సంస్థ కమాండర్ ఇన్ చీఫ్ సజ్జాద్ అప్ఘనీని కలుసుకోవడానికి 1994లో ఫిబ్రవరి 11న అనంతనాగ్ జిల్లాలోని కప్రాన్ అటవీ ప్రాంతానికి వెళ్లాడు. వాళ్లిద్దరూ కలిసి ఒక ఆటోలో తప్పించుకోబోయారు. గస్తీ పోలీసులు ఆటోని ఆప్పినప్పుడు ఇద్దరూ కలిసి పరుగులు తీశారు9. దగ్గరలో ఉన్న ఆర్మీ పికెట్‌కు చెందిన సైనికులు వీరిద్దరినీ అరెస్ట్ చేశారు. అటు సజ్జాద్ అప్ఘని తాను పట్టబడడానికి అజర్ కారణమని భావించాడు. జైల్లో ఉన్నన్నాళ్లూ వారిద్దరికి ఒకరి పొడ అంటే మరొకరికి గిట్టేది కాదు. సొంత సంస్థపైనే విమర్శలు అజర్ తన సొంత సంస్థపైనే విమర్శలు గుప్పించేవాడు. కశ్మీర్లో పరిస్థితులపై తన సంస్థ తప్పుదారి పట్టించడం వల్లే తాను అరెస్ట్ అయ్యానని విచారణలో వెల్లడించాడు. ‘అప్ఘనిస్తాన్ తరహా పరిస్థితుల్ని నేను కశ్మీర్లో ఊహించుకున్నాను. ముజాహిదీన్ గ్రూపులు హాయిగా స్వేచ్ఛగా ఆప్ఘన్, పాక్ మధ్య ఎలా ప్రయాణం చేస్తాయో, కశ్మీర్ నుంచి పాక్‌కు అలాగే రావచ్చునని అనుకున్నాను. కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. భారత భద్రతా దళాల నుంచి తప్పించుకోవడానికి ముజాహిదీన్లు పరుగులంకించుకునే దృశ్యాలే కనిపించాయి. నా సొంత ఉగ్రవాద సంస్థ నన్ను తప్పుదోవ పట్టించడం వల్లే అరెస్ట్ అయ్యాను‘‘ అని అజర్ ఆ విచారణలో వివరించాడు. అహం ఎక్కువ అరెస్టయిన తనని బయటకు రప్పించడంలో జాప్యం జరగడం, అయిదేళ్లు జైలు నాలుగు గోడల మధ్య మగ్గిపోవడంతో అజర్ అహం దెబ్బ తింది. దీంతో తనను ప్రోత్సహించిన మాతృ సంస్థ హర్కత్ ఉల్పైనే కక్ష గట్టాడు. 1999లో ఖాట్మండు నుంచి న్యూఢిల్లీకి రావాల్సిన ఐసీ–814 విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి ఆప్ఘన్లో కాందహార్‌కు తీసుకువెళ్లారు. అందులో ప్రయాణికుల్ని సురక్షితంగా విడిపించుకోవడం కోసం అప్పట్లో అధికారంలో ఉన్న ఎన్టీయే సర్కార్ మసూర్ అజర్, ఒమర్ షేక్, ముస్తాక్ అహ్మద్ జర్గార్ వంటి వారిని జైలు నుంచి విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత తాను సొంతంగా జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. పాక్ ఐఎస్ఐ కూడా ఉగ్రవాద సంస్థలన్నింటిపైనే అతనికి అధికారాలు ఇచ్చింది. దీంతో ఇన్నాళ్లూ తనకు అన్నం పెట్టిన హర్కత్ ఉల్‌పై ఎలాంటి కృతజ్ఞతాభావం లేకుండా ఎక్కువ మంది కేడర్‌ను తనవైపు లాగేశాడు. భారత్‌పై విజేతగా నిలిచించి తానక్కొడినేనని విర్రవీగేవాడు. ప్రస్తుతం ఐఎస్ఐ రక్షణలో మసూద్ అజర్ భారత్‌పై ఎన్నో దాడులకు తెగబడ్డాడు. పార్లమెంటు, పథాన్‌కోట్ ఎయిర్‌బేస్, జమ్ము, ఉరీలో సైనిక శిబిరాలపై దాడుల వెనుక అతని హస్తం ఉంది. కరాచి నుంచి వెలువడే టాబ్లాయిడ్ సజాదే ముజాహిద్ జర్నలిస్టుగా 1993లోనే అతను ఇతర విలేకరుల బృందంతో కలిసి ఎన్నో దేశాలు తిరిగి కశ్మీర్ అంశంలో మద్దతు ఇవ్వాల్సిందిగా కూడా కోరాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో బహవాయిపూర్లోని ఒక కలుగులోఎలుకలా దాక్కున్న అజర్‌ని అనుక్షణం పాక్ ఐఎస్ఐ కంటికి రెప్పలా కాపలా కాస్తూ ఉంటుంది. ఏదో విధంగా అజర్‌ను పట్టుకొని భారత్‌కు తీసుకువచ్చి విచారణ జరపాలన్న కృతనిశ్చయంతో భారత్ ఉంది. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
భద్రత సాకుతో నిఘా!
‘పాలకులు ప్రజా సేవకులు గనుక వారి గురించి మనకు ప్రతీదీ తెలియాల్సిందే. మనం ప్రైవేటు వ్యక్తులం గనుక మన గురించి వారికి తెలియకూడదు. వారు తెలుసుకోకూడదు’ అని పులిట్జర్ గ్రహీత, పాత్రికేయుడు గ్లెన్ గ్రీన్వాల్డ్ ఒక సందర్భంలో అన్నారు. అమెరికా, బ్రిటన్లు స్వదేశాల్లోని పౌరులపైనేగాక ప్రపంచవ్యాపితంగా ఎన్నో దేశాల్లో సాగించిన నిఘా వ్యవహారాలను స్నోడెన్తో పాటు ఆయన బట్టబయలు చేశారు. గ్రీన్వాల్డ్ ఏం చెప్పినా జనంపై నిఘా పెట్టడం పాలకులకు నిత్యకృత్యంమవుతోంది. సాంకేతికత పెరిగే కొద్దీ ఇది మరింత సులభంగా మారుతోంది. వ్యక్తిగత గోప్యత అనేది పౌరుల ప్రాథమిక హక్కని సుప్రీంకోర్టు నిరుడు తీర్పునిచ్చింది. దాన్ని మూణ్ణెల్ల క్రితం ఇచ్చిన ఆధార్ తీర్పులో సైతం ధ్రువీకరించింది. కానీ కేంద్రం మాత్రం తన దోవన తాను పౌరులపై నిఘాకు వీలుకల్పించే నోటిఫికేషన్‌ను గురువారం అర్థరాత్రి విడుదల చేసింది. ఆ విష యంలో విమర్శలు వెల్లువెత్తుతుండగానే కొత్తగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) చట్టంలోని సెక్షన్ 79ని సవరించాలని సంకల్పించింది. అందుకు సంబంధించిన ప్రతిపాదనల్ని వివిధ సామాజిక మాధ్యమాలకు పంపింది. వాటిపై వచ్చే నెల 7లోగా స్పందించాలని కోరింది. నోటిఫికేషన్ అయినా, ఆ తర్వాత ప్రతిపాదించిన ఐటీ చట్ట ముసాయిదా సవరణలైనా ఆశ్చర్యం కలిగిస్తాయి. దేశ భద్రతకూ, సార్వభౌమాధికారానికి ముప్పు కలిగే పరిస్థితులపై బహి రంగ చర్చ జరిపితే, వివరాలన్నీ వెల్లడిస్తే ప్రజలు సంతోషిస్తారు. దేశ భద్రతకు తమ వంతు సహ కారం అందిస్తారు. కానీ హఠాత్తుగా ఒక నోటిఫికేషన్ విడుదల చేసి, ఐటీ చట్టానికి సవరణ ప్రతిపా దించి ఇదంతా దేశం కోసమే అంటే ఎవరూ విశ్వసించలేరు. లోగడ ఇందిరాగాంధీ కూడా ఇలాంటి కారణాలే చెప్పి అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ప్రస్తుత బీజేపీ నేతలు అనేకులు జైళ్లకు వెళ్లాల్సి వచ్చింది. దానికి వ్యతిరేకంగా పోరాడినవారే ఇప్పుడు అధికారంలోకొచ్చి ఆ ధోరణుల్నే ప్రదర్శిం చడం విస్మయం కలిగిస్తుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో మొదలుకొని మొత్తం పది సంస్థలు ఎవరి కంప్యూటర్లలో భద్రపరిచిన సమాచారాన్నయినా రాబట్టడానికి... పౌరులు ఒకరికొకరు పంపుకునే అన్ని రకాల సమాచారాన్ని అడ్డగించి డీక్రిప్ట్ చేయడానికి గురువారం అర్ధరాత్రి వెలువడిన నోటిఫికేషన్ అవకాశమిస్తోంది. ఈ అధికారాలను వినియోగించుకోవడానికి ముందు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనుమతి తీసుకోవా లన్న నిబంధనొకటి విధించారు. ఆ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందట. నిఘా అధికారాలు దుర్వినియోగం కాకుండా చేసిన ఏర్పా ట్లలో ఇవన్నీ భాగమని ప్రభుత్వం చేస్తున్న వాదన నిలబడదు. అధికారంలో ఉన్నవారు ఎవరిపైన అయినా చర్య తీసుకోదల్చుకుంటే అధికారులు దానికి అడ్డు చెబుతారని ఎవరూ అనుకోరు. సీబీఐ మొదలుకొని అనేక సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని స్వయానా బీజేపీయే విపక్షంలో ఉండగా ఆరోపణలు చేసింది. ఆఖరికి సర్వోన్నత న్యాయస్థానమే పాలకులు చెప్పినట్టల్లా ఆడుతు న్నారని సీబీఐని విమర్శించింది. ఇక అవి స్వతంత్రంగా వ్యవహరించగలవని నమ్మేదెవరు? ఏదో ఒక సాకుతో ఇలా విశేషాధికారాలు సంక్రమింపజేసుకోవడం ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టించడమే అవుతుంది. నోటిఫికేషన్ పర్యవసానంగా గూగుల్, ఫేస్బుక్, వాట్సాప్, అమెజాన్, ట్వీటర్, షేర్ చాట్ తదితర సామాజిక మాధ్యమాలన్నీ ప్రభుత్వ సంస్థలు అడిగిన ఎలాంటి సమాచారాన్నయినా 72 గంటల్లో అందజేయాలి. ఆఖరికి ఎన్క్రిప్షన్(సంకేత భాష) సదుపాయం ఉన్న వాట్సాప్వంటివి కూడా వారడిగే సమాచారం మూలాలెక్కడివో చెప్పడానికి దాన్ని డీక్రిప్ట్ చేయాల్సిందే. వాట్సాప్‌లో ఒకరినుంచి ఒకరికెళ్లే సమాచారం ఇవ్వాలని ఆమధ్య కేంద్రం కోరినప్పుడు అది తమకు సైతం తెలియదని ఆ సంస్థ నిర్వాహకులు జవాబిచ్చారు. ఇప్పుడు దాన్ని దారికి తెచ్చుకోవడమే ధ్యేయంగా నోటిఫికేషన్ విడుదలచేసినట్టు కనబడుతోంది. ఆవుల్ని కబేళాలకు తరలిస్తున్నారని, గోమాంసం తింటున్నారని ఆరోపణలుచేస్తూ గత మూడు న్నరేళ్లుగా పలు ముఠాలు చెలరేగి ఎందరినో కొట్టి చంపాయి. పిల్లల్ని అపహరించుకుపోతున్నారని వదంతులు సృష్టించి హత్యలు చేసిన సందర్భాలున్నాయి. వీటిని అరికట్టేందుకు సమగ్రమైన చట్టం తీసుకురావాలని చాలామంది కోరారు. మూక దాడులకు వర్తింపజేయగల అనేక సెక్షన్లు మన భార తీయ శిక్షాస్మృతిలో ఇప్పటికే ఉన్నాయని కూడా చెప్పారు. దీని గురించి కేంద్రం ఏం ఆలోచిస్తున్నదో ఎవరికీ తెలియదు. కానీ వదంతుల వ్యాప్తికి వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాలు కారణ మంటూ వాటిని అదుపు చేయడానికి మాత్రం చర్యలు మొదలయ్యాయి. అసలు నోటిఫికేషన్ 2009లో యూపీఏ ప్రభుత్వం విడుదల చేసిందని, తాము చేసిందల్లా దాన్ని పొడిగించడమేనని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అంటున్నమాట నిజమే కావొచ్చు. కాంగ్రెస్ పాలనలోని అవకతవ కలను నిశితంగా విమర్శిస్తున్న బీజేపీ నేతలకు ఈ నోటిఫికేషన్ తప్పుగా కనబడకపోవడం విచిత్రం. ఎవరెవరి ఫోన్ సంభాషణలు ప్రభుత్వం వింటున్నదో వివరాలివ్వాలని కొన్నేళ్లకిత్రం ఆర్టీఐ చట్టం కింద అడిగినప్పుడు నెలకు 10,000 కాల్స్‌పై నిఘాకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనుమతిచ్చారని వెల్లడైంది. అంటే రోజూ దాదాపు కొత్తగా 300మంది అదనంగా నిఘా పరిధిలో కొస్తున్నట్టు లెక్క. ఇంత విచక్షణారహితంగా నిఘా అమలవుతున్న తీరును గుర్తించి సరిచేయా ల్సింది పోగా, తాజాగా సామాజిక మాధ్యమాలను కూడా అందులో చేర్చాలనుకోవడంలోని ఔచిత్యం ఏమిటో అర్ధంకాదు. దేశ భద్రత విషయంలో రాజీ పడాలని ఎవరూ చెప్పరు. కానీ తమ కిచ్చిన అధికారాలను దుర్వినియోగపరిచే అధికారులపై బాధిత పౌరులు ఎలాంటి చర్యలు తీసుకో వచ్చునో కూడా నోటిఫికేషన్ చెప్పాలి. చట్టంలో సైతం దానికి సంబంధించిన నిబంధనలుండాలి. అంతేతప్ప ఏదో ఒక సాకుతో ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు. -
అలోక్ వర్మ ఇంటిపై ఇంటెలిజెన్స్ నిఘా
న్యూఢిల్లీ: ప్రభుత్వం సెలవుపై పంపిన సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ నివాసం బయట నలుగురు ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) అధికారులు తచ్చాడుతూ కనిపించడం గురువారం సంచలనం సృష్టించింది. అయితే వారక్కడ రోజువారీ రహస్య విధులు నిర్వర్తిస్తున్నారని కేంద్ర హోం శాఖ పేర్కొంది. రెండు కార్లలో వచ్చిన వ్యక్తులు అలోక్ వర్మ ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా, అది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారు తమ సిబ్బందే అని ఐబీ ధ్రువీకరించింది. సున్నిత ప్రాంతాల్లో ఐబీ బృందాలు రహస్యంగా నిఘా విధులు నిర్వర్తించడం సాధారణ విషయమేనని హోం శాఖ అధికారి ఒకరు తెలిపారు. కొన్నిసార్లు స్థానిక పోలీసుల సహకారంతోనే ఇలా చేస్తామని, కొన్ని సందర్భాల్లో మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే చేపడతామని చెప్పారు. ‘ఐడీ కార్డులు, ఇతర సరంజామా లేకుండా జరిపే సాధారణ నిఘాకు ఇది పూర్తిగా భిన్నమైనది. అలోక్ వర్మతో పాటు పలువురు ప్రముఖులు నివాసముండే జన్‌పథ్ రోడ్డులో కొందరు అసాధారణంగా గుమిగూడి ఉండటాన్ని గమనించి, ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఐబీ సిబ్బంది అక్కడికి వెళ్లారు. కానీ దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు’ అని సదరు అధికారి వివరణ ఇచ్చారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్లు కూడా అలోక్ వర్మ నివాసం సమీపంలోనే నివసిస్తున్నారు. ఐబీ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పగా, అలాంటిదేం లేదని స్థానిక డీసీపీ మాధుర్ వర్మ తెలిపారు. సీబీఐ డైరెక్టర్ నివాసం వద్ద ఏదో గొడవ జరిగినట్లు సమాచారం అందిందని, ఆ నలుగురి గుర్తింపును ధ్రువీకరించుకున్న తరువాత వారిని వదిలిపెట్టినట్లు చెప్పారు. భయాందోళనలో ప్రధాని: రాహుల్ ఫ్రాన్స్‌తో కుదిరిన రఫేల్ ఒప్పందంపై విచారణ చేపట్టేందుకు సీబీఐ సన్నద్ధమవుతున్నందనే, భయంతో మోదీ రాత్రికి రాత్రే అలోక్ ను విధుల నుంచి తప్పించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు. అవినీతికి వ్యతిరేకంగా వాచ్‌మన్‌గా ఉంటానని మోదీ చేసిన వ్యాఖ్యల్ని హేళనచేశారు. ‘రెండు రోజుల క్రితం వాచ్‌మన్ ఓ కొత్త పనిచేశారు. అది మధ్యాహ్నం కాదు. ప్రజలంతా నిద్రిస్తుండగా అర్ధరాత్రి జరిగింది’ అని సీబీఐలో చోటుచేసుకున్న పరిణామాల్ని ప్రస్తావించారు. ఇదిలా ఉండగా, అలోక్ వర్మ అధికారాలను పునరుద్ధరించాలని, ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా అన్ని సీబీఐ కార్యాలయాల ముందు ధర్నా ఆందోళన చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. సీబీఐ జగడంపై విచారణ నేడే సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రభుత్వం తన అధికారాలు తొలగిస్తూ, సెలవుపై పంపడాన్ని సవాలుచేస్తూ సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించనుంది. జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావుకు తాత్కాలికంగా డైరెక్టర్ పదవి కల్పించడంపై స్టే ఇవ్వాలని కూడా ఆయన పిటిషన్లో కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల బెంచ్ ముందుకు ఈ పిటిషన్ రానుంది. రాజకీయంగా కూడా కీలకం.. సీబీఐ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట కోర్టు నిర్ణయం సీబీఐకే కాకుండా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌లకు కూడా కీలకం కానుంది. ‘సీబీఐ పంజరంలోని చిలక’ అని లోగడ వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు ఈసారి ఎలాంటి తీర్పు ఇస్తుందో అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సీబీఐ డైరెక్టర్ పదవికి చట్టం నిర్దేశించిన రెండేళ్ల పదవీకాలాన్ని కేంద్రం ఏకపక్షంగా తగ్గించిందని, కాబట్టి కేసు తమ వైపే నిలుస్తుందని అలోక్ వర్మ లాయర్ల బృందం గట్టి విశ్వాసంతో ఉంది. రఫేల్ యుద్ధవిమానాల కుంభకోణంపై విచారణకు ఆసక్తి చూపుతున్నందుకే కాకుండా, ప్రధాని మోదీకి సన్నిహితుడైన రాకేశ్ అస్థానాను కాపాడటానికే వర్మను కేంద్రం విధుల నుంచి తప్పించిందని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రచారం చేస్తోంది. సీబీఐ అధికార వర్గంలో మార్పుపై బీజేపీ వాదన మరోలా ఉంది. అవినీతిని అసలు సహించబోమనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విధానానికి తాజా నిర్ణయం ఒక ఉదాహరణగా ఆ పార్టీ సమర్థించుకుంది. అలోక్ వర్మనే డైరెక్టర్..అస్థానానే స్పెషల్ డైరెక్టర్ అవినీతి ఆరోపణలతో అధికారాలు కోల్పోయిన అలోక్ వర్మ, రాకేశ్ అస్థానాలు ఇంకా తమ డైరెక్టర్, ప్రత్యేక డైరెక్టర్లుగా కొనసాగుతున్నారని సీబీఐ స్పష్టం చేసింది. నాగేశ్వరరావుకు అప్పగించిన డైరెక్టర్ బాధ్యతలు తాత్కాలికమేనని తెలిపింది. కేంద్ర విజిలెన్స్ కమిషన్ సిఫార్సుల మేరకే వర్మ, అస్థానాలను సెలవుపై పంపి, నాగేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొంది. అవినీతి ఆరోపణలు, ప్రత్యారోపణలపై సీవీసీ విచారణ ముగిసే వరకు సీబీఐ బాధ్యతల్ని నాగేశ్వరరావు చూస్తారని వెల్లడించింది. సీబీఐకి సంబంధించిన ఏడు దస్త్రాలను తొలగించినట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఆ సంస్థ అధికార ప్రతినిధి కొట్టిపారేశారు. సీబీఐలో ప్రతి దశలోని అన్ని కీలక పత్రాలు భద్రంగా ఉన్నాయని, ఇలాంటి బూటకపు వార్తలు సీబీఐ విశ్వసనీయతను దెబ్బతీస్తాయని అన్నారు. అలోక్ వర్మను విధుల నుంచి తప్పించిన సమయంలో రఫేల్ ఒప్పందం సహా పలు కీలక కేసులు ఆయన పరిశీలనలో ఉన్నట్లు మీడియాలో వచ్చిన వార్తల్ని తోసిపుచ్చారు.