ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరిన్ని దాడులు !
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎప్పుడైన, ఎక్కడైన మావోయిస్టులు దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఇంటిలిజెన్స్ బ్యూరో (ఐబీ) రమణ్ సింగ్ సర్కార్ను శుక్రవారం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భద్రత దళాలు,పోలీసులు అత్యతం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 2011, నవంబర్ 24న బెంగాల్లో మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ ఎన్కౌంటర్లో హతమైయ్యారు. ఈ నేపథ్యంలో నవంబర్ 24-30వ తేదీ వరకు మావోయిస్టులు ఆయన స్మత్యర్థం వారోత్సవం జరుపుతుందని తెలిపింది.
అలాగే డిసెంబర్ 2 - 8వ తేదీ వరకు మావోయిస్టుల అమరవీరుల కోసం పీపుల్స్ లిబరేషన్ గరెల్లా ఆర్మీ వారోత్సవం జరుపుతుంది. అందులోభాగంగా రాష్ట్రంలో మావోయిస్టులు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందని తెలిపింది. అదికాక ఈ నెలలో ఛత్తీస్గఢ్ రాష్ట్ర శాసనసభకు రెండు దఫాలుగా ఎన్నికలు జరిగాయి. అక్కడకక్కడ చెదురుమదురు సంఘటనలు మినహా అంతా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి.రాష్ట్రంలో ఓటింగ్ శాతం కూడా గణనీయంగా పెరిగింది.
దాంతో మావోయిస్టులు దాడులు చేసేందుకు పథకాలు రూపొందించారన్న సమాచారం ఐబీకి చేరిందని గుర్తు చేసింది. ఓ విధంగా రాష్ట్రంలో తుఫాన్ ముందు ప్రశాంతత లాగా ప్రస్తుతం వాతావరణం నెలకొందని ఐబీ ఈ సందర్బంగా గుర్తు చేసింది. ఛత్తీస్గఢ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చే నెలలో వెలువడనున్నాయి.