Peoples Liberation Guerrilla Army
-
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్
చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం హోరాహోరీగా జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజీపూర్ జిల్లా పరిధిలో జరిగిన పోలీసుల ఎదురుకాల్పుల్లో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆరీ్మ(పీఎల్జీఏ) ప్లాటూన్–10 డిప్యూటీ కమాండర్‌తో సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్రాజ్ తెలిపిన వివరాల ప్రకారం..బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్‌స్టేషన్ పరిధి పూసుబాక మార్గంలో సోమవారం హోలీ వేడుకలు జరుపుకున్న కొందరు యువకులు తాలిపేరు నదిలో స్నానానికి వెళ్లారు. వారిలో ముగ్గురిని మావోయిస్టులు చంపేశారని ఆరోపణలొచ్చాయి. దీంతో మంగళవారం ఉదయం నుంచే పూసుబాక, చీపురుబట్టి గ్రామాల సమీప అటవీ ప్రాంతంలో కోబ్రా 210, 205, సీఆర్పీఎఫ్ 229 బెటాలియన్లకు చెందిన పోలీసు బలగాలతో పాటు డీఆర్జీ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. హోరాహోరీగా కాల్పులు కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసు బలగాలకు బుధవారం తెల్లవారుజామున తాలిపేరు నదీ తీరాన మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో 4 గంటల పాటు ఎదురుకాల్పులు కొనసాగాయి. వాటిలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. దాదాపు 40 మంది మావోయిస్టుల్లో పలువురు గాయాలతో తప్పించుకున్నారనే సమాచారంతో ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్నారు. పట్టుబడ్డ మావోయిస్టును విచారిస్తున్నారు. మృతి చెందిన మావోయిస్టులను ప్లాటూన్–10 డిప్యూటీ కమాండర్ పూనెం నగే‹Ù, ఆయన భార్య వెట్టి సోని, ఆయ్తు పూనెం, సుక్కా ఓయం, నుప్పో మోకా, కొవసి గంగిగా గుర్తించారు. వారిపై రూ.14 లక్షల రివార్డుంది. ఘటనాస్థలి వద్ద మందుగుండు, ఆయుధాలు స్వా«దీనం చేసుకున్నారు. హోలీ రోజు ఇన్ఫార్మర్ల నెపంతో ముగ్గురిని హతమార్చి ఈ వైపుగా పోలీసులను రప్పించి మెరుపుదాడి చేయాలని మావోలు పథక రచన చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
అడవంతా జల్లెడ!
సాక్షి, హైదరాబాద్/ మల్హర్: తెలంగాణలో గెరిల్లా ఆర్మీ (మెరుపుదాడులకు దిగే ప్రత్యేక దళాలు)ని బలోపేతం చేయాలని మావోయిస్టులు నిర్ణయించా రనే సమాచారంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమ య్యారు. దండకారణ్యం సరిహద్దుల్లో మావోల వేటను ముమ్మరం చేశారు. అణువణువూ జల్లెడ పడు తున్నారు. గతకొంత కాలంగా తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో మావోయిస్టుల కదలికలు క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దానికి తోడు డిసెం బరు 2 నుంచి 8వ తేదీ వరకు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) వారోత్సవాలు ఉండటంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. అడవుల్లో మావోలు సభలు, సమావేశాలు నిర్వహించకుండా అడ్డుకోవాలని భావిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఓవైపు ప్రతిష్టాత్మకమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల కోసం నగరంలో 52 వేల మంది పోలీసులను బందోబస్తులో ఉంచినప్పటికీ... మరోవైపు సరిహద్దులను డేగ కళ్లతో పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఇటీవల పోలీసుశాఖలో కొత్తగా చేరిన దాదాపు 10 వేల మంది పోలీసుల్లో మెరికల్లాంటి యువకులను మావోల వేటకు వినియోగిస్తున్నారు. మావోల అన్వేషణలో తలపండిన సీనియర్లు, రిటైర్డ్ పోలీసు ఆఫీసర్ల పర్యవేక్షణలో సరిహద్దుల్లో అణువణువూ గాలిస్తున్నారు. వీరికితోడుగా సీఆర్పీఎఫ్ బలగాలు కూడా కూంబింగ్‌లో పాల్గొంటున్నాయి. రాష్ట్రాల సరిహద్దులపై నిఘా.. పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ సరిహద్దులపై పోలీసులు నిఘా పెంచారు. ముఖ్యంగా ప్రాణహిత, గోదావరి నదులపై అత్యాధునిక డ్రోన్లతో పర్యవేక్షణ జరుపుతున్నారు. రాత్రిపూట మావోయిస్టులు నదులను దాటుకుని రాకపోకలు సాగించే అవకాశాలు ఉండటంతో ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇక సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో పగలు, రాత్రి నిర్విరామంగా కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఏజెన్సీ మండలాలకు వెళ్లే అన్ని మార్గాల్లో తనిఖీలు విస్తృతం చేశారు. ఇదేవిధంగా మారుమూల గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు మైదాన ప్రాంతాలకు వెళ్లాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. పీఎల్జీఏది ప్రత్యేకస్థానం మావోయిస్టు పార్టీలో పీఎల్జీఏకు ప్రత్యేకస్థానం ఉంది. ఈ ఏడాది ఘనంగా వారోత్సవాలు నిర్వహించాలని, తెలంగాణలో ఈ విభాగాన్ని పటిష్టం చేయాలని అగ్రనాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కాల్పులు, బాంబు పేలుళ్లు, ఆంబుష్ దాడులు నిర్వహించడంలో ఈ విభాగానికి ప్రావీణ్యం ఉంది. చత్తీస్‌గఢ్, ఒడిషా అరణ్యాలలో ఎంతో పటిష్టంగా ఉన్న పీఎల్జీఏ విభాగాన్ని తెలంగాణలో బలోపేతం చేయాలని, కొత్త యువకులను ఆకర్షించాలని మావోయిస్టు కేంద్ర కమిటీ ఇటీవల ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రా, ఒడిషా, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని అడవుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు పీఎల్జీఏ వారోత్సవాల్లో పాల్గొంటారని, ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో పార్టీ బలోపేతానికి సంబంధించి ఎలాంటి పంథా అనుసరిస్తారన్న విషయంలో పోలీసులు ఉత్కంఠతో ఉన్నారు. ఈ సమావేశాలకు సంబంధించి ఇంటిలిజెన్స్ విభాగం ఇప్పటికే సమాచార సేకరణలో నిమగ్నమైంది. తృటిలో తప్పించుకున్న కంకణాల తెలంగాణలో వేళ్లూనుకునేందుకు యత్నిస్తోన్న మావోయిస్టులు గోదావరి, ప్రాణహిత పరిసరాల్లోని కొన్ని ప్రాంతాల్లో పట్టు సాధించగలిగారు. ఆదివాసీల సాయంతో ఆశ్రయం పొందగలుగుతున్నారు. ఇలాంటి వారిలో మావోయిస్టు కొత్తగూడెం డివిజన్ కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి కూడా ఒకరు. ఇతని దళం గతవారం కూంబింగ్ చేస్తోన్న పోలీసుల నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకుంది. పక్కా సమాచారంతో కూంబింగ్‌లోకి దిగిన పోలీసులకు కాటారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని సింగారం రిజర్వ్‌ఫారెస్ట్‌లో రాజిరెడ్డి దళం ఎదురుపడింది. పోలీసులను చూస్తూనే వారు కాల్పులు జరిపి తప్పించుకున్నారు. ఈ ఎన్కౌంటర్లో ఇరుపక్షాల్లో ఎవరికీ గాయాలు కాలేదు. వీరు గోదావరి నది దాటి చత్తీస్‌గఢ్‌కు వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లా, ఎర్రం, శీలంల... యాదిలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొయ్యూర్ ఎన్‌కౌంటర్‌కు బుధవారంతో 21 ఏళ్లు నిండుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మల్హర్ మండలం కొయ్యూర్ అటవీ ప్రాంతంలో 2 డిసెంబర్ 1999న జరిగిన ఎన్కౌంటర్లో అప్పటి పీపుల్స్‌వార్ కేంద్ర కమిటీ సభ్యులు నల్లా ఆదిరెడ్డి అలియాస్ శ్యాం, ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి అలియాస్ మహేష్, ఉత్తర తెలంగాణ కార్యదర్శి శీలం నరేష్ అలియాస్ మురళి నేలకొరిగారు. అప్పట్లో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో నక్సల్స్ ప్రాబల్యం బలంగా ఉండేది. అలాంటి సమయంలో ముఖ్యనేతలు మరణించడం ఉద్యమానికి పెద్ద ఎదురుదెబ్బగా పరిగణిస్తారు. ఈ ముగ్గురు నేతలు మరణించాక సరిగ్గా ఏడాదికి డిసెంబరు 2, 2000న పీఎల్జీఏను ఏర్పాటు చేశారు. వారికి నివాళిగా ఏటా డిసెంబర్ 2 నుంచి మావోయిస్టులు పీఎల్జీఏ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాగే మృతుల స్మారకంగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామంలో మావోయిస్ట్ నాయకులు 53 అడుగుల ఎత్తయిన స్థూపాన్ని నిర్మించారు. దీన్ని 2005 నవంబర్ 13న కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఆవిష్కరించారు. -
దండకారణ్యంలో దడ.. దడ
మావోయిస్టు పార్టీ ఏటా నిర్వహించే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఎ) వారోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకూ జరిగే ఈ వారోత్సవాల్లో ఉద్యమంలో అమరులకు నివాళులర్పించడమే కాకుండా భారీ విధ్వంసానికి మావోలు వ్యూహ రచన చేస్తున్నారని ఇంటిలిజెన్స్ హెచ్చరించడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమయింది. -సాక్షి, విశాఖపట్నం విశాఖ మన్యంలో మావో ఉద్యమం 1981-82 మధ్య ప్రారంభమైంది. 1885లో జర్రెల ప్రారంతో తొలి దాడి జరిగింది. అనంతరం ధారకొండలో కొందరిని హత్య చేశారు. అక్కడి నుంచి మావోల కార్యకలాపాలు విస్తరించడం ప్రారంభమైంది. 2000 సంవత్సరంలో పోలీసులు మావోల అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. తర్వాత ప్రభుత్వం శాంతి చర్చలకు పిలవడంతో రెండేళ్ల పాటు ఉద్యమం చల్లారిపోయింది. ఆ తరువాత కొద్దిగా కదలికలు ఉన్నప్పటికీ 2014 వరకూ మావోయిస్టులు స్తబ్దుగా ఉన్నారు. గతేడాది గమ్మెలి సంజీవరావు అనే వ్యక్తిని మావోయిస్టులు ఇన్ఫార్మర్ నెపంతో హత్య చేశారు. దానికి కొనసాగింపుగా చింతపల్లి మండలం కోరుకొండ సమీపంలో వీరవరంలో సింహాచలం అనే వ్యక్తిని ప్రజాకోర్టులో హతమార్చేందుకు మావోయిస్టులు ప్రయత్నించారు. వారిని గిరిజనులు అడ్డుకుని మావోయిస్టు పార్టీ దళ కమాండర్ శరత్‌తో పాటు మిలీషియా సభ్యులు గణపతి, నాగేశ్వరావులను హతమార్చడంతో మళ్లీ ఉద్యమం ఎరుపెక్కింది. అప్రమత్తమైన బలగాలు : బాక్సైట్ అంశాన్నే మావోయిస్టులు ఆయుధంగా మార్చుకుంటున్నారని పోలీసులు అంటున్నారు. మళ్లీ పార్టీని బలోపేతం చేసేదిశగా ఛత్తీస్‌గఢ్ నుంచి మావోయిస్టులు విశాఖ మన్యంలో అడుగుపెట్టారని గుర్తించారు. గతేడాది ‘పీఎల్జీఎ’లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అమర వీరులకు నివాళిగా 30 అడుగుల స్థూపాన్ని నిర్మించాలని మావోలు అనుకున్నప్పటికీ దానిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. కానీ ఈసారి బాక్సైట్ ఉద్యమం నేపధ్యంలో భారీ విధ్వంసానికి మావోలు ప్రణాళికలు రచిస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. దీంతో సాధారణ రోజుల్లో ఉపయోగించే సిబ్బందికి అదనంగా కేంద్ర, రాష్ట్ర ప్రత్యేక బలగాలను పీఎల్జీఏ వారోత్సవాలను అడ్డుకునేందుకు రప్పిస్తున్నారు. అత్యాధునిక అయుధాలు, వైర్లెస్ సెట్లు, వాహనాలను వారికి సమకూర్చుతున్నారు. కాలి నడకన కిలోమీటర్ల కొలదీ దూరాలు ప్రయాణిస్తూ ఈ బలగాలు తనిఖీలు నిర్వహించేలా ప్రణాళికలు వేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, రైల్వే ట్రాక్‌లు, సెల్ టవర్లు, ఘాట్ రోడ్లు, రద్దీ ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ బృందాలు అణువణువునూ జల్లెడపట్టనున్నాయి. మావోయిస్టులకు ఆశ్రయం కల్పించే ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అక్కడ ప్రతి ఇంటినీ సోదా చేయనున్నారు. గుర్తింపు కార్డు లేని వారిని, అనుమానితులను మన్యంలో అడుగుపెట్టనివ్వకూడదని నిర్ణయించారు. -
కొయ్యూరు అమరుల స్మృతిలో..
మంథని: పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) వారోత్సవాలకు మావోయిస్టులు సిద్ధమయ్యారు. సాయుధ పోరులో అసువులుబాసిన అమరుల త్యాగాలను స్మరించుకోనున్నారు. మంగళవారం నుంచి ఏడు రోజుల పాటు జరిగే ఈ వారోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు వారోత్సవాలను భగ్నం చేసేందుకు పోలీసులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. దీంతో కొద్ది రోజులుగా మంథని అటవీ ప్రాంతంలో అలజడి వాతావరణం కనిపిస్తోంది. నేపథ్యమిదీ.. 1999 డిసెంబర్ 2న మల్హర్ మండలం కొయ్యూర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో అప్పటి పీపుల్స్‌వార్ అగ్రనేతలైన నల్లా ఆదిరెడ్డి ఉరఫ్ శ్యామ్, ఎర్రం సంతోష్‌రెడ్డి ఉరఫ్ మహేష్, శీలం నరేష్ ఉరఫ్ మురళి మృతిచెందారు. అప్పటినుంచి వీరితో పాటు వివిధ ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయిన అమరుల త్యాగాలను స్మరిస్తూ పీఎల్జీఏ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. పీపుల్స్‌వార్ ఉద్యమానికి మూలస్తంభాలుగా ఉన్న ఈ ఆదిరెడ్డి, సంతోష్‌రెడ్డి, నరేష్‌లు ఎన్కౌంటర్ కావడం అప్పట్లో సంచలనం కలిగించింది. కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్న ముగ్గురు నేతలను కోల్పోవడంతో పీపుల్స్‌వార్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాల్చిచంపారనే ఆరోపణలు.. వీరిని కోవర్టు ఆపరేషన్‌లో భాగంగా పోలీసులు బెంగళూరులో పట్టుకుని కొయ్యూర్ అడవుల్లోకి తీసుకొచ్చి మట్టుబెట్టినట్టు ఆరోపణలున్నాయి. పలువురు హక్కుల సంఘాల నాయకులు ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌గా అభివర్ణించారు. ఎన్‌కౌంటర్‌పై సమగ్ర దర్యాప్తు చేపట్టి, నాటి సంఘటనలో పాల్గొన్న పోలీసు ఉన్నతాధికారులపై హత్యకేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసు రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు దాకా వెళ్లి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నట్టు చెబుతున్న ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులకు అప్పటి టీడీపీ ప్రభుత్వం గ్యాలంటరీ అవార్డులు బహుకరించడం వివాదాస్పదమైంది. ఈ కేసు ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. కోలుకోలేని దెబ్బ కొయ్యూర్ ఎన్కౌంటర్ పోలీసులకు పెద్ద విజయం కాగా, పీపుల్స్‌వార్ పార్టీ చరిత్రలో ఎన్నటికీ మానని నెత్తుటి గాయంగా మిగిలిపోయింది. బూటకపు ఎన్‌కౌంటర్లంటూ విమర్శలు ఎదుర్కొన్న పోలీసులు తమ పంథాను మార్చుకొని పెద్ద తలకాయలపై దృష్టి పెట్టి విజయం సాధించే దిశగా ఈ ఎన్కౌంటర్ ఆత్మస్థైర్యాన్ని అందించింది. మూడున్నర దశాబ్దాల ఉద్యమబాటలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని పీపుల్స్‌వార్ నుంచి మావోయిస్టులుగా రూపాంతరం చెందినప్పటికీ పార్టీ పూర్తిగా బలహీనపడింది. నేడు అతి తక్కువ మంది సాయుధ సభ్యులతో జిల్లాలో ఉనికి కోసం తాపత్రయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల కాలంలో తూర్పు ప్రాంతంలో మళ్లీ పట్టు సాధించేందుకు మావోయిస్టు పార్టీ ప్రయత్నిస్తోంది. భగ్నం చేసే దిశగా ఖాకీలు.. సమ సమాజ స్థాపన కోసం సైద్ధాంతిక బాటలో పయనించి అమరులైన అగ్రనేతలకు నివాళులు అర్పించడానికి సంస్మరణ వారోత్సవాలను డిసెంబర్ 2నుంచి వారం రోజుల పాటు ఘనంగా నిర్వహించి సత్తాను చాటుకోవాలని మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు. వారోత్సవాల నేపథ్యంలో ఆనవాయితీ ప్రకా రం మావోయిస్టులు విధ్వంస చర్యలకు పాల్ప డే అవకాశముందని భావిస్తున్న పోలీసులు వారి కదలికలపై గట్టి నిఘా పెట్టారు. కూబింగ్ ఆపరేషన్లతో వారోత్సవాలను అడ్డుకోవడానికి పోలీసులు తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. వారం రోజులుగా మంథని, ముత్తారం, కాటారం, మహదేవపూర్, మహాముత్తారం అటవీ ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. దీంతో అటవీ గ్రామాల్లో అలజడి వాతావరణం నెలకొంది. -
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరిన్ని దాడులు !
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఎప్పుడైన, ఎక్కడైన మావోయిస్టులు దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఇంటిలిజెన్స్ బ్యూరో (ఐబీ) రమణ్ సింగ్ సర్కార్‌ను శుక్రవారం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భద్రత దళాలు,పోలీసులు అత్యతం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 2011, నవంబర్ 24న బెంగాల్లో మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ ఎన్కౌంటర్లో హతమైయ్యారు. ఈ నేపథ్యంలో నవంబర్ 24-30వ తేదీ వరకు మావోయిస్టులు ఆయన స్మత్యర్థం వారోత్సవం జరుపుతుందని తెలిపింది. అలాగే డిసెంబర్ 2 - 8వ తేదీ వరకు మావోయిస్టుల అమరవీరుల కోసం పీపుల్స్ లిబరేషన్ గరెల్లా ఆర్మీ వారోత్సవం జరుపుతుంది. అందులోభాగంగా రాష్ట్రంలో మావోయిస్టులు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందని తెలిపింది. అదికాక ఈ నెలలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర శాసనసభకు రెండు దఫాలుగా ఎన్నికలు జరిగాయి. అక్కడకక్కడ చెదురుమదురు సంఘటనలు మినహా అంతా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి.రాష్ట్రంలో ఓటింగ్ శాతం కూడా గణనీయంగా పెరిగింది. దాంతో మావోయిస్టులు దాడులు చేసేందుకు పథకాలు రూపొందించారన్న సమాచారం ఐబీకి చేరిందని గుర్తు చేసింది. ఓ విధంగా రాష్ట్రంలో తుఫాన్ ముందు ప్రశాంతత లాగా ప్రస్తుతం వాతావరణం నెలకొందని ఐబీ ఈ సందర్బంగా గుర్తు చేసింది. ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చే నెలలో వెలువడనున్నాయి.