సాక్షి, ఖమ్మం: తెలంగాణ-ఛత్తీస్‌గడ్ సరిహద్దు ప్రాంతం దంతెవాడ జిల్లా మరోసారి కాల్పులతో ప్రతిధ్వనించింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటుచేసుకోగా.. ఈ ఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. గొండెరాస్ అటవీప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు.
ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని గొండెరాస్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, డీఆర్‌జీ జవాన్ల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. సెర్చ్ ఆపరేషన్‌లో ఘటనా స్థలం నుంచి ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన మావోయిస్టు హిద్మే కొహ్రామే ఏరియా కమిటీ సభ్యురాలు మల్లంజర్ ఏరియా కమిటీ, దర్భా డివిజన్. ఆమపై రూ. 5లక్షల రివార్డు ఉంది.
పొజ్జె, సీఎన్‌ఎం ఇన్‌ఛార్జ్ మల్లెంజర్ ఏరియా కమిటీకి చెందిన నీల్లవాయ ఏరియా, దర్భ డివిజన్. ఈమెపై లక్ష రూపాయల రివార్డు ఉంది. సంఘటనా స్థలం నుంచ రైఫిళ్లు, మందుగుండు సామాగ్రి, కమ్యూనికేషన్ పరికరాలు, పేలుడు పదార్థాలు, క్యాంపింగ్ మెటీరియల్స్ మొదలైనవి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది. తప్పించుకున్నవారిలో మావోయిస్టు అగ్రనేతలున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment