న్యూఢిల్లీ: సెబీ, ట్రాయ్ తదితర ప్రభుత్వ నియంత్రణ సంస్థలు, ట్రిబ్యునళ్లలో ఉన్నత స్థాయి పదవుల్లో నియమితులయ్యే వ్యక్తులు ముందుగా ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) పరిశీలనను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మేరకు సిబ్బంది మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నియంత్రణ సంస్థలు, ట్రిబ్యునళ్లలో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ సహా అన్ని ఇతర కీలక, ఉన్నత స్థాయి పదవుల్లో నియామకాలకు ఐబీ పరిశీలన తప్పనిసరని సిబ్బంది మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment