Regulatory actions
-
‘స్టాక్ మార్కెట్ల’పై సుప్రీంకోర్టు కమిటీ
న్యూఢిల్లీ: స్టాక్ట్ మార్కెట్లపై నియంత్రణ చర్యలను బలోపేతం చేయడానికి నిపుణుల కమిటీ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనలను సీల్డ్ కవర్లో స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మదుపరుల ప్రయోజనాలను కాపాడే విషయంలో పూర్తి పారదర్శకత కావాలని తాము కోరుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రతిపాదిత నిపుణుల కమిటీ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి సిట్టింగ్ జడ్జిని నియమించడం సాధ్యం కాదని పేర్కొంది. అదానీ గ్రూప్ కంపెనీలపై హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత మదుపరులు భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లపై నియంత్రణ చర్యలను బలోపేతం చేయాలని, ఇందుకోసం సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని, మదుపరుల ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, ఎంఎల్ శర్మతోపాటు పలువురు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు(పిల్స్) దాఖలు చేశారు. వీటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస జేబీ పార్దివాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. నియంత్రణ చర్యలను బలోపేతం చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని గత విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. కమిటీ సభ్యుల పేర్లు, విధివిధానాలను శుక్రవారం సీల్డ్ కవర్లో అందజేయగా, ధర్మాసనం స్వీకరించలేదు. ప్రభుత్వం సూచించిన సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తే అది పూర్తిగా ప్రభుత్వ కమిటీ అవుతుందని అభిప్రాయపడింది. పారదర్శకత కావాలి కాబట్టి తామే ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని, తద్వారా న్యాయస్థానంపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందని వెల్లడించింది. ఇకపై సిట్టింగ్ న్యాయమూర్తులు ఈ అంశాన్ని విచారిస్తారని, కమిటీలో మాత్రం వారు సభ్యులుగా ఉండబోరని తెలిపింది. -
ఉన్నత నియామకాల’కు ఐబీ పరిశీలన
న్యూఢిల్లీ: సెబీ, ట్రాయ్ తదితర ప్రభుత్వ నియంత్రణ సంస్థలు, ట్రిబ్యునళ్లలో ఉన్నత స్థాయి పదవుల్లో నియమితులయ్యే వ్యక్తులు ముందుగా ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) పరిశీలనను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మేరకు సిబ్బంది మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నియంత్రణ సంస్థలు, ట్రిబ్యునళ్లలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ సహా అన్ని ఇతర కీలక, ఉన్నత స్థాయి పదవుల్లో నియామకాలకు ఐబీ పరిశీలన తప్పనిసరని సిబ్బంది మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. -
దళితుల నోటికాడ ముద్ద లాక్కుంటారా?
రాజధాని అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ చర్యలపై వాసిరెడ్డి పద్మ ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణం పేరుతో పచ్చటి పొలాలు లాక్కుని రైతుల పొట్టకొట్టిన తరహాలోనే దళిత పేదరైతుల నోటికాడ ముద్దను సీఎం చంద్రబాబు లాక్కుంటున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. దళిత పేద రైతుల నుంచి తక్కువ ధరకే తన బినామీలు, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలతో అసైన్డు భూములు కొనిపించి సీఎం చంద్రబాబు క్రమబద్ధీకరించుకొంటున్నారని, దీంట్లో కోట్లాది రూపాయల భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. బృహత్తరమైన రాజధాని నిర్మాణంలో కొందరు రైతులు, దళితులు నష్టపోక తప్పదనే రీతిలో మాట్లాడటం దుర్మార్గమన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు వారి గ్రామంలోనే ప్లాట్లు కేటాయిస్తామంటూ మాయమాటలు చెప్పినబాబు, మంత్రులు ఇప్పుడు మాట మారుస్తున్నారని విమర్శించారు. ‘‘గత 18 నెలల్లో ఎన్ని ఎకరాల అసైన్డు భూములు ఎవరు కొనుగోలు చేశారు.. ఎక్కడెక్కడ కొనుగోలు చేశారు’’ వంటి వివరాలను వెల్లడించాలని పద్మ డిమాండ్ చేశారు. దళితులకు న్యాయం చేసే ఉద్దేశం చంద్రబాబుకుంటే తక్షణమే అసైన్డు భూముల క్రయవిక్రయాల క్రమబద్ధీకరణను విరమించుకోవాలన్నారు. రాజధాని ప్రాంతంలో అసైన్డు భూముల లబ్ధిదారులకే పరిహారం చెల్లించాలని కోరారు.