observations
-
మంచి మాట: ఉత్తమ వ్యక్తిత్వం ఎలా రూపు దిద్దుకుంటుంది?
కొంతమంది దృష్టిలో వ్యక్తిత్వమంటే... ప్రవర్తన, దార్శనికత, ఉద్వేగ భరితం, చక్కని ఆలోచనా విధానం, సంభాషించే పద్దతి, కుటుంబంతో, ఇతరులతో మసలుకునే విధానం.. విశ్వాసాలు. మరికొంతమందికది సాహసం.. నియమబద్ధత.. ఖచ్చితత్వం.. క్రమశిక్షణ.. సృజనశీలత. ఇలా ఒక వ్యక్తిలోని అనేక గుణాల సమాహారమే వ్యక్తిత్వమంటే. ఈ లక్షణాలలో ఏ ఒక్కటైనా అభిలషణీయమైన నిష్పత్తిలోకాక హెచ్చు స్థాయి లో ఉన్నప్పుడు అది ఆ వ్యక్తిత్వం ఒక విశిష్ఠతను సంతరించు కుంటుంది. అది మంచిగా.. లేదా చెడుగా పరిణమించవచ్చు. ఇక్కడ అప్రమత్తత కావాలి. ఒక మహాభవనం నిర్మించాలంటే దానికి పటిష్టమైన పునాది అవసరం. ఇటుక మీద ఇటుక పెడుతూ సిమెంట్ పూస్తూ తాపీతో చదును చేసి.. గోడలు కట్టి.. ఆకర్షణీయమైన.. ఆహ్లాదకరమైన రంగులు వేసి ఇతర సర్వ హంగులు సమకూర్చిన తరువాత కాని తయారు కాదు ఏ మహా భవంతి అయినా. ఉన్నత వ్యక్తిత్వ సౌధానికి అంతే. తపన.. కోరిక.. పట్టుదలనే ఇటుకలకు సంకల్పం, ధృతి అనే సిమెంట్‌ను జోడించి నిర్మించాలి. ఇంత దృఢమైన, సుందరమైన భవన స్థాపన అనేక సంవత్సరాల కృషి.. తపన. కోరిక ..పట్టుదల వల్ల మాత్రమే సాకారమవుతుంది. దీనిని ఒకసారి నిర్మించి వదిలేస్తే సరిపోదు. నిరంతర పరిశీలన కావాలి. దీనిలోని లోపాలను గమనించి అవసరమైతే పునర్నిర్మించుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే ఒక గొప్ప వ్యక్తిత్వ సౌధం ఏర్పడి మరింతగా శక్తిమంతమైనదిగా రూపొందుతుంది. అలా తమ జీవితకాలమంతా ఎవరైతే తపిస్తారో ఆ వ్యక్తిత్వం ఒక పారిజాత పుష్పమవుతుంది. ఎన్నటికీ ఇగిరిపోని గంధ మవుతుంది. దాని ప్రభావం ఆ తరం వారి మీదే కాక, అనేక తరాలవారి మీద ఉంటుంది. శాశ్వత ముద్ర వేస్తుంది. వారే చిరంజీవులవుతారు. ఏకాగ్రత సాధనకు ఏకలవ్యుడు.. జ్ఞానాన్వేషణలో గురువునే ప్రశ్నించిన నరేంద్రుడు.. ఆకలితో మలమల మాడుతూ శలభాల్లా పడిపోతున్న గోదావరి వాసులకు పాశ్చాత్యుడైనా అపర భగీరధుడై గోదావరీ జలాలను పారించి వారికి అన్నపూర్ణనే ఇచ్చిన సర్ అర్థర్ కాటన్ మానవత్వం, ఆకలితో అలమటించే వారికి డొక్కా సీతమ్మ నిరతాన్నదానం .. ఇలా ఎందరివో ఉత్తమ వ్యక్తిత్వాలు. ఈ వ్యక్తిత్వ రూపకల్పన ఎలా జరుగుతుంది, దీనికి ప్రేరణ ఎలా వస్తుంది, దీని దిశ –దశ లు ఏమిటి.. అన్న జిజ్ఞాస మనలో కలగాలి. అన్వేషణ చేయాలి. దీనికి మంచి పుస్తకాలు చదవాలి. సారాన్ని గ్రహించాలి. దానిని మదిలో నిలుపుకోవాలి. మన జీవితానికి ఎంత వరకు.. ఎలా అన్వయించుకోవాలో తెలియగల వివేచన కావాలి. ఒక సాధారణ కరమ్ చంద్ గాంధీ అనే గుజరాతీయుడు జాన్ రస్కిన్.. టాల్‌స్టాయ్.. హెన్రీ డేవిడ్ థోరో ల రచనల ఆలంబనగా తన జీవితాన్ని.. దాని పథాన్ని మార్చుకుని ఎంతటి ఉన్నత దశకు చేరుకున్నాడో మన కందరకు తెలుసు. ఆయన మీద భగవద్గీత ఎంత ప్రభావాన్ని చూపిందో... బైబిల్ కూడ అంతే. వాటిని చక్కని వ్యక్తిత్వ సాధనకు గొప్పగా ఉపయోగించుకున్నాడు. అంతేకాదు. ప్రపంచంలో అత్యంత ప్రభావం చూపిన.. చూపగలిగే వ్యక్తులలో నాటి నుండి నేటి వరకు ఉన్నారు. పుస్తక పఠనం చక్కని వ్యక్తిత్వానికి ఎలా దారితీస్తుందో చెప్పేందుకు ఈ ఉదాహరణ చాలదు. ఈ రకమైన ప్రభావం పరోక్షంగా ఉంటుంది. దీనికన్నా సులువైన, గొప్పదైన మార్గమూ ఉంది. అదే పరిశీలన. అది చాలా అద్భుతమైనది. మన చుట్టూ వుండే మనుష్యులు.. వారి ప్రవర్తన ను పరిశీలించటం వల్ల కూడ చక్కని వ్యక్తిత్వం ఒనగూరుతుంది. వ్యక్తులే కాదు, గ్రహించగలిగే శక్తే ఉండాలే కాని, ఈ అనంతమైన సృష్టిలో మనకు స్ఫూర్తినివ్వనిది.. ఇవ్వలేనిదేముంది..? తుఫానులో విపరీతమైన గాలి వానకు, కూకటి వేళ్ళతో కూలిపోయే మహావృక్షాలు ఉంటాయి. ఆ పక్కనే భూమి మీద ఒరిగి పోయి.. గాలివాన తరువాత మళ్ళీ నిటారుగా నిలబడి తమ ఉనికి చాటుకునే గడ్డిపరకలూ ఉంటాయి. అక్కడివరకూ మన పరిశీలనా దృష్టిని సారించగలగాలి. కష్టాలు, బాధల తుఫానులతో అతలాకుతలమయ్యే వేళ గడ్డిసరకని ఆదర్శంగా తీసుకుంటే ధైర్య స్థైర్యాలు అలవడతాయి. ఇవి గొప్ప వ్యక్తిత్వపు లక్షణాలే కదూ! మనం పుట్టిన ప్రదేశం.. దాని శీతోష్ణ స్థితులు.. కుటుంబ నేపథ్యం.. ఆర్థిక స్థితి.. ఇవన్నీ మన ఆలోచన రీతిని ప్రభావితం చేసేవే. ఆ ప్రభావిత ఆలోచనలు మన మాట తీరును.. ప్రవర్తనను నిర్దేశిస్తాయి. వీటి సారమే కదా మన వ్యక్తిత్వం. ఇదే మన జీవనశైలి అనే రథానికి సారథి. కొందరి మనసు వజ్ర దృఢ సమానమైన కఠినం. ఇంకొందరిది వెన్నంత మృదుత్వం. మరికొందరిది ఈ రెండిటి కలవోత. ఈ రెండిటికి చెందక పాదరసంతో పోల్చతగ్గ వ్యక్తిత్వం కలవాళ్ళుంటారు. ఒక స్థిరమైన ఆలోచన.. వైఖరి.. లేక వారి ప్రవర్తన.. మాట.. అనూహ్యంగా క్షణ క్షణానికి మారిపోతుంటాయి. అభిప్రాయాలూ అంతే. ‘ఎప్పటి కెయ్యది ప్రస్తుతమప్పటి కా మాటలాడి.. ‘ అన్న సుమతీకారుడి మాటలకు ప్రత్యక్షరూపమే కొందరి వ్యక్తిత్వం. మాటలు తూచి తూచి మాట్లాడతారు. ఎవరి మనస్సు నొప్పించరు. మృదుస్వభావులు. వివాద రహితులు. జనప్రియులు. తన వారన్నవారందరిని కోల్పోయి, అనాథలై, అభాగ్యులై జీవన సమరంలో అతి చిన్నవయసులో ప్రవేశించే వారి ఆలోచన, వారి సమాజపు ఆకళింపు పూలపాన్పు జీవిత నేపథ్యం ఉన్నవారి కన్నా భిన్నంగా ఉంటుంది. పలుకు పదునుగా, కరకుగా ఉంటుంది. జీవన పద్మవ్యూహంలో ప్రవేశించిన అభిమన్యులకు ఈ మనస్తత్వమున్నవారు చేరువవుతారు. దానిని అక్కున చేర్చుకుంటారు. వ్యక్తిత్వాలలో ఎన్నిరకాలుంటాయి అని ఎవరైనా ప్రశ్నిస్తే చెప్పలేనన్ని.. గణించలేనన్ని– అని సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతివ్యకి ఒకరకమైన వ్యక్తిత్వానికి నమూనా. ప్రతివ్యక్తిలోనూ వుండే విభిన్నత..ౖ వెవిధ్యమే ఇందుకు హేతువు. మంచి వ్యక్తిత్వ వర్గీకరణకు.. నిర్వచనానికి మనం కొన్ని ప్రమాణాలు పెట్టుకుంటాం. ఏ వ్యక్తి పేరు తలచుకోగానే మన మనసుకు ఒక రకమైన హాయి.. ఆనందం కలిగి మన ముఖంపై చిరునవ్వు చిందుతుందో, ఎవరి ప్రవర్తన మన మనస్సును నొప్పించదో అతడు మంచివాడని.. అతనిది మంచి వ్యక్తిత్వమని భావిస్తాం. వారి గురించి ఆలోచన మన మదిలో మెదలగానే మనసంతా పరిమళ భరితమవుతుంది. ఇది ఒక అవగాహన. ఏ వ్యక్తుల పేర్లు తలచుకోగానే మనకు భక్తి, ప్రపత్తులు కలుగుతాయో... దేశభక్తి మనలో ఉప్పొంగుతుందో.. త్యాగనిరతి జ్ఞప్తికి వస్తుందో.. వారి ఉన్నతమైన మానవీయ లక్షణాలు తడతాయో.. నిర్భయత్వం.. ప్రేమ, కరుణ మనకు స్ఫురిస్తుందో .. ఆ వ్యక్తులందరూ గొప్పవారే... వారి వ్యక్తిత్వాలన్నీ గొప్పవే .. స్ఫూర్తిదాయకమైనవే. మనం ఏ వ్యక్తిత్వానికి చేరువవుతామన్నది మన స్వభావాన్ని బట్టి ఉంటుంది. మన జీవిత నేపథ్యం కూడ ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఉత్తమ వ్యక్తిత్వం దేశాన్ని ఉత్తమమైనదిగా చేస్తుంది కాబట్టి అటువంటి వ్యక్తిత్వాన్ని పిల్లల్లో రూపు దిద్దటానికి తల్లిదండ్రులు, విద్యాసంస్థలు ప్రయత్నించాలి. కొందరు మనస్సులో ఏదైనా ఆలోచన తట్టిన క్షణమే పని చేసేస్తారు. లేడికి లేచిందే పరుగులా వాళ్ళనుకున్నది చేయటమే వారి తత్వం. ముందు వెనుకలు చూడరు. లోతుగా తరచి చూడరు. సాధ్యాసాధ్యాల గురించి యోచన చేయరు. పర్యవసానాలు దర్శించగలిగే శక్తే ఉండదు. ఈ వ్యక్తిత్వం కలిగినవారు వారు ముప్పును తెచ్చుకోవటమే కాదు. ఇతరులకూ తెస్తారు. – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
సిటీ పొల్యూషన్‌కి మంచి సొల్యూషన్ ‘లివింగ్ ల్యాబ్’
సాక్షి, రాయదుర్గం(హైదరాబాద్): హైదరాబాద్ మహానగరమైంది. అభివృద్ధి మంచిదే. కానీ అభివృద్ధితోపాటు వృద్ధి చెం దుతున్న కాలుష్యం నగర జీవితాలను ఆందోళనలోకి నెట్టేస్తుంది. నగరాల్లోని గాలి నాణ్యత అక్కడి ప్రజల జీవన నాణ్యతను తెలియజేస్తుందంటారు. ఢిల్లీ లాంటి మహా నగరాలలాగా కాదు.. హైదరాబాద్ గాలిలో విషపూరిత వాయువులు అధికమయ్యాయి. వీటి నంచి బయటపడేందుకు గాలితోపాటు నీరు, విద్యుత్‌ను కాపాడుకోవడాకి హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఓ వినూత్న ఆలోచన చేసింది. అదే క్యాంపస్ లో స్మార్ట్ సిటీ లివింగ్ ల్యాబ్ ఏర్పాటు. 2019 నుంచి ఈ లివింగ్ ల్యాబ్ పర్యవేక్షణలో ఉన్నది ట్రిపుల్ ఐటీ క్యాంపస్. యూరోపియన్ బిజినెస్ అండ్ టెక్నాలజీ సెంటర్(ఈబీటీసీ), ఆమ్స్టర్డామ్ ఇన్నోవేషన్ ఎరీనా (ఏఐఏ), అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, తెలం గాణ ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ ప్రయోగాలు అద్భుతమైన ఫలితాలిస్తున్నవి. లివింగ్ ల్యాబ్ ఎలా పనిచేస్తుందంటే.. ► గాలి నాణ్యత మాత్రమే కాదు... నీటి నిర్వహణ, విద్యుత్ వినియోగం ఎలా ఉంది? వాతావరణ పరిస్థితులు ఎలా మారుతున్నాయనే అన్ని అంశాలను ఈ లివింగ్ ల్యాబ్ పర్యవేక్షిస్తున్నది. ప్రతి 15 సెకన్లకు గాలి నాణ్యత అంచనా... ► ప్రతి పదిహేను సెకన్లకు ఓసారి గాలి నాణ్యతను లెక్కించి సర్వర్కి పంపిస్తుంది ట్రిపుల్ ఐటీలోని ల్యాబ్. వాయి వేగాన్ని, దిశను, గాలిలోని ఉష్ణోగ్రతలు, తేమను సైతం తెలుపుతుంది. నీరు వృథా కాకుండా... ► ప్రతి 4 గంటలకోసారి నీటిలోని లవణాలు, గాఢత స్థాయిలను లెక్కిస్తుంది. నీటి వృథాని నివారించడం కోసం, దుర్వినియోగం చేయకుం డా ఉండటం కోసం ఏర్పాటు చేసిన నియత్రణ పరికరాలు నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. వాతావరణంలో వస్తున్న మార్పులను, వర్షపా తం సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంది. విద్యుత్ వినియోగంపైనా ఓ కన్ను... ► మానవ జీవితంలో మరో నిత్యావసరం విద్యుత్. ఎంత కాపాడుకుంటే అంత మంచిది. బల్బులు, ఫ్యానులు, ఇతర పరికరాల విద్యుత్ వినియోగాన్ని, సోలార్ విద్యుత్ వినియోగ డాటాని ల్యాబ్‌లోని నోడ్స్ ప్రతి పదిహేను నిమిషాలకోసారి అందిస్తుంది. దీని ద్వారా విద్యుత్‌ను ఆదా చేయడానికి వీలవుతుంది. ఉల్లంఘనలను పసిగడుతుంది... ► సహజవనరులను కాపాడుకోవడమే కాదు... మహమ్మారుల నుంచి రక్షించడానికీ కొన్ని పద్ధతులున్నాయి. కరోనా పాండమిక్ పరిస్థితుల్లో మాస్కు లేకుండా తిరిగినా, ఎక్కువమంది గుమిగూడినా, భౌతికదూరం పాటించకపోయినా.. ఎక్కడెక్కడ ఉల్లంఘనలు జరుగుతున్నాయో సెక్యూరిటీ కెమెరాల ద్వారా ఈ లివింగ్ ల్యాబ్ కనిపెట్టేస్తోంది. ఇలా అన్ని విభాగాల నుంచి సమాచారం ఒకే దగ్గరకు రావడంతో... అన్ని సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ చెక్ పెడుతున్నది. హైదరాబాద్‌ను రక్షించడానికి, నగర మౌలిక సదుపాయాలు, సేవలను మెరుగుపర్చుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. శక్తి వినియోగంపై నిరంతర పర్యవేక్షణ అవసరం: లీడ్ ఆర్కిటెక్ట్ అనురాధ ఈ లివింగ్ ల్యాబ్ ఏర్పాటు వల్ల గాలి, నీరు నాణ్యత, విద్యుత్ వినియోగం మాత్రమే కాదు... కోవిడ్ నిబంధలను ఉల్లంఘించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవడం ద్వారా క్యాంపస్‌లో కోవిడ్–19 వ్యాప్తిని అదుపులో ఉంచగలిగాం. లివింగ్ ల్యాబ్ ప్రాజెక్టులో అంతర్జాతీయ విలువలు కలిగిన ఓఎం2ఎం ప్లాట్‌ఫామ్‌ను వినియోగిస్తున్నాం. ఐయూడీఎక్స్తో కలిసి బలమైన ప్లాట్‌ఫామ్ ఏర్పాటు: పరిశోధక విద్యార్థులు ఇది జాతీయ, ప్రపంచవ్యాప్త వినియోగంలో ఉన్న ప్లాట్పామ్. ఒక్క క్యాంపస్‌లోనే కాదు.. నగరపాలన, పౌరుల రోజువారీ సమస్యలకు ఓ చక్కని పరిష్కారం ఇది. -
డా.రెడ్డీస్‌కు యూఎస్ఎఫ్డీఏ షాక్
సాక్షి, ముంబై : దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్‌కు మరోసారి అమెరికా ప్రాతిపాధిక ఆహార నియంత్రణ సంస్థ(యూఎస్ఎఫ్డీఏ) షాక్ తగిలింది. ఇటీవల హైదరాబాద్ బాచుపల్లి యూనిట్-3లో తనిఖీలు నిర్వహించిన సంస్థ యూనిట్లో 11 ( అబ్జర్వేషన్లను) లోపాలను గుర్తించింది. ఈ మేరకు 483-ఫామ్‌ను జారీ చేసినట్లు డా. రెడ్డీస్ యాజమాన్యం శుక్రవారం స్టాక్ ఎక్చ్చేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. దీంతో సోమవారం ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీశారు. ఒక దశలో షేరు 8శాతానికిపైగా కుప్పకూలింది. అనంతరం కోలుకుని 3శాతం నష్టాలకు పరిమితమైనా...మిడ్ సెషనన్ తరువాత మళ్లీ 6శాతం పతనమైంది. కాగా.. నియమిత కాలంలోగా ఎఫ్‌డీఏ గుర్తించిన లోపాలను సవరించనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ఒక ప్రకటనలో తెలిపింది. -
స్ట్రాంగ్ రూంలో ఈవీఎంలు: తకలెక్టర్ రామ్మోహన్ రావు
సాక్షి, (నిజామాబాద్ అర్బన్): జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో ఉపయోగించిన వీవీప్యాట్లు, ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లను జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ బాలుర, బాలికల కళాశాలలో, ఇండోర్ స్టేడియంలోని స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరిచారు. బాలుర కళాశాలలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాలికల కళాశాలలో బోధన్, బాన్సువాడ, ఇండోర్ స్టేడియం భవనంలో ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్లకు ప్రజాప్రతినిధుల సమక్షంలో అధికారులు సీల్ వేశారు. జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు, సాధారణ ఎన్నికల పరిశీలకులు ధీరజ్ కుమార్, సౌరబ్‌రాజ్, దేవేశ్ దేవల్, పోలీస్ కమిషనర్ కా ర్తికేయ, రిటర్నింగ్ అధికారి వీటిని శనివారం పర్యవేక్షించారు. ఇదే భవనాల్లో అన్ని నియోజక వర్గాలకు ఈ నెల 11న కౌటింగ్ నిర్వహించనున్నారు. మీడియా కేంద్రాన్ని పరిశీలించిన అధికా రులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సమాచా ర శాఖ డీడీ మూర్తుజాను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో అంజయ్య, రిటర్నింగ్ అధికారు లు జాన్ సాంసన్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
తాత్కాలిక హైకోర్టుకు వసతుల పరిశీలన
ఏఎన్‌యూ (పొన్నూరు)/తుళ్లూరు రూరల్/ ఇబ్రహీంపట్నం (మైలవరం) : తాత్కాలిక హైకోర్టు ఏర్పాటుకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల బృందం శనివారం గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలోని నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల భవనాలను పరిశీలించింది.ఈ బృందంలో న్యాయమూర్తులు జస్టిస్ రామసుబ్రహ్మణ్యన్, జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ సునీల్‌చౌదరి, జస్టిస్ సత్యనారాయణమూర్తి ఉన్నారు. -
ఉన్నత నియామకాల’కు ఐబీ పరిశీలన
న్యూఢిల్లీ: సెబీ, ట్రాయ్ తదితర ప్రభుత్వ నియంత్రణ సంస్థలు, ట్రిబ్యునళ్లలో ఉన్నత స్థాయి పదవుల్లో నియమితులయ్యే వ్యక్తులు ముందుగా ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) పరిశీలనను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మేరకు సిబ్బంది మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నియంత్రణ సంస్థలు, ట్రిబ్యునళ్లలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ సహా అన్ని ఇతర కీలక, ఉన్నత స్థాయి పదవుల్లో నియామకాలకు ఐబీ పరిశీలన తప్పనిసరని సిబ్బంది మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. -
అరకొర కౌంటర్లు.. ఆన్‌లైన్‌కు బ్రేకులు
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ ఖాతాదారుల బాండ్ల పరిశీలన తొలిరోజైన అయోమయం, గందరగోళం నడుమ మొదలైంది. రాష్ట్రంలో 19,43,120 మంది డిపాజిటర్ల పూర్తి వివరాలు పరిశీలించి ఆన్లైన్ చేసేలా చేపట్టిన ప్రక్రియ సీఐడీ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభమైంది. పలు జిల్లాల్లో ఆన్లైన్ సర్వర్లు పనిచేయక డిపాజిటర్లు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ప్రతీ మండలానికి ఒక కౌంటర్ పెడతామన్న అధికారులు ఒక్కో జిల్లాకు కేవలం 10 నుంచి 17 కౌంటర్లు మాత్రమే ఏర్పాటు చేశారు. అయితే డిపాజిటర్ల రద్దీ పెరిగితే కౌంటర్లు పెంచుతామని సీఐడీ అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సహా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, అండమాన్ నికోబార్ దీవులు, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ బాధితులు సుమారు 32,02,607 మంది ఉన్నారు. -
సిప్లాకు యూఎస్ఎఫ్డీఏ షాక్.. షేర్ ఢమాల్
హైదరాబాద్: దేశీయ డ్రగ్ మేకర్ సిప్లా లిమిటెడ్ గోవాలోని ప్లాంట్లలో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ భారీ ఎత్తున లోపాలను గుర్తించినట్టు వచ్చిన వార్తలతో స్టాక్ మార్కెల్లో సిప్లా షేర్లు పతనమయ్యాయి. ఐదు ప్లాంట్లలో అబ్జర్వేషన్స్(483) నమోదు చేసినట్లు వార్తలు మదుపర్లు ఆందోళన లోకి నెట్టాయి దీంతో సిప్లా కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దాదాపు 7 శాతానికి పైగా పతనమైంది. అయితే గోవాలో ఉన్న మూడు తయారీ ప్లాంట్లలో యూఎస్ఎఫ్డీఏ నిర్వహించిన ఆడిట్ ముగిసిందనీ సిప్లా స్టాక్ ఎక్సేంజ్ వివరణలో తెలిపింది. ఈ తనిఖీల్లో భాగంగా నాలుగు లోపాలను గుర్తించినట్లు(అబ్జర్వేషన్స్) సిప్లా తెలియజేసింది. ఈ పరిశీలనలు స్వభావాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. కానీ ఇది సాధారణ విధానపరమైన పరిశీలన మాత్రమేనని వివరణ ఇచ్చింది. దీనిపై తమ స్పందనను తెలియ చేసినట్టు పేర్కొంది. ప్రమాణాలను పాటించడంలో విఫలమైన పక్షంలో వార్నింగ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించిందని సిప్లా వివరించింది. కేవలం మూడు ప్లాంట్లలో 483లు మాత్రమే జారీ అయినట్లు వివరణ ఇవ్వడంతో సిప్లా షేర్ నష్టాల నుంచి కొద్దిగా తెప్పరిల్లింది. -
‘పర్యవేక్షణ విషయంలో రాజీ లేదు’
అనంతపురం ఎడ్యుకేషన్ : తాను ఏ క్యాడర్లో ఉన్నా పర్యవేక్షణ విషయంలో రాజీ ప్రసక్తే లేదని ఇంటర్ విద్య ఆర్జేడీ వెంకటరమణ అన్నారు. లేపాక్షి జూనియర్ కళౠశాల ప్రిన్సిపల్‌గా ఉంటున్న ఆయనకు జిల్లా వత్తి విద్యాశాఖ అధికారిగా, రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో పర్యవేక్షణ ఇబ్బందిగా మారుతోందంటూ ‘సాక్షి’లో వచ్చిన కథనంపై ఆయన మంగళవారం స్పందించారు. తాను ఎంత బిజీగా ఉన్న వారానికోసారి కళాశాలకు వెళ్తున్నానని, ఇన్‌చార్జ్‌తో తరచూ సమన్వయం చేసుకుంటూ కళాశాలను ఆదర్శంగా నిలిపేలా ప్రయత్నిస్తున్నట్లు వివరణ ఇచ్చారు. -
పత్రం సమర్పయామి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండు లోక్‌సభ, పది శాసనసభ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ఘట్టం బుధవారం ముగిసింది. ఈనెల 2వ తేదీన ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ రెండు మూడు రోజులు మందకొడిగా సాగింది. అనంతరం పుంజుకుంది. ఇక చివరి రోజైన బుధవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు మొత్తం 30 నామినేషన్లు దాఖలు కాగా, ఇందులో ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి 14, పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి 16 నామినేషన్లు వచ్చాయి. చివరి రోజైన బుధవారం ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి ఏడు నామినేషన్లు వచ్చాయి. టీఆర్ఎస్ నుంచి గోడం నగేష్, కాంగ్రెస్ నుంచి నరేష్ జాదవ్, టీడీపీ నుంచి రాథోడ్ రమేష్ తరఫున ఆయన భార్య సుమన్ రాథోడ్, బీఎస్పీ నుంచి సదాశివ్నాయక్, స్వ తంత్ర అభ్యర్థులు బంక సహదేవ్, పవర్ కిషన్, రాథో డ్ శ్యామ్రావులు లోక్‌సభ స్థానాలకు నామినేషన్లు వే శారు. ఈ స్థానాలకు ఒక్కో అభ్యర్థి మూడు సెట్ల చొ ప్పున దాఖలు చేశారు. గురువారం నామినేషన్లను అ ధికారులు పరిశీలించనున్నారు. 12న నామినేషన్ల ఉప సంహరణ ఉంటుంది. ఈనెల 30న ఎన్నికలు నిర్వ హించి మే 16న ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇక జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు మొత్తం 307నామినేషన్లు వచ్చాయి. ఒక్కో అభ్యర్థి నాలుగైదు సెట్ల చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గానికి 25, బెల్లంపల్లికి 45, ఖానాపూర్‌కు 34, ఆసిఫాబాద్‌కి 21, ముథోల్‌కు 19, మంచిర్యాలకు46, సిర్పూర్‌కు40, నిర్మల్‌కు25, చెన్నూర్‌కు41, బోథ్‌కు 11 చొప్పున నామినేషన్లు వచ్చాయి. అత్యధికంగా మంచిర్యాల నుంచి.. అత్యల్పంగా బోథ్ నుంచి నామినేషన్లు దాఖలు అయ్యాయి.