సిప్లాకు యూఎస్‌ఎఫ్‌డీఏ షాక్.. షేర్ ఢమాల్ | Cipla gets four USFDA observations for three Goa facilities | Sakshi
Sakshi News home page

సిప్లాకు యూఎస్‌ఎఫ్‌డీఏ షాక్.. షేర్ ఢమాల్

Published Fri, Sep 30 2016 3:15 PM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM

సిప్లాకు యూఎస్‌ఎఫ్‌డీఏ షాక్.. షేర్ ఢమాల్

సిప్లాకు యూఎస్‌ఎఫ్‌డీఏ షాక్.. షేర్ ఢమాల్

హైదరాబాద్: దేశీయ డ్రగ్ మేకర్  సిప్లా లిమిటెడ్  గోవాలోని ప్లాంట్లలో అమెరికా  ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్  భారీ ఎత్తున లోపాలను గుర్తించినట్టు వచ్చిన వార్తలతో  స్టాక్ మార్కెల్లో  సిప్లా షేర్లు పతనమయ్యాయి. ఐదు ప్లాంట్లలో అబ్జర్వేషన్స్(‌483) నమోదు చేసినట్లు వార్తలు మదుపర్లు ఆందోళన లోకి నెట్టాయి దీంతో సిప్లా కౌంటర్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి.  దాదాపు  7 శాతానికి పైగా పతనమైంది.
అయితే గోవాలో ఉన్న మూడు  తయారీ ప్లాంట్లలో  యూఎస్‌ఎఫ్‌డీఏ నిర్వహించిన  ఆడిట్ ముగిసిందనీ సిప్లా  స్టాక్ ఎక్సేంజ్   వివరణలో తెలిపింది. ఈ తనిఖీల్లో భాగంగా నాలుగు లోపాలను గుర్తించినట్లు(అబ్జర్వేషన్స్‌) సిప్లా తెలియజేసింది.  ఈ పరిశీలనలు  స్వభావాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. కానీ  ఇది సాధారణ విధానపరమైన పరిశీలన మాత్రమేనని వివరణ ఇచ్చింది.  దీనిపై తమ స్పందనను తెలియ చేసినట్టు పేర్కొంది. ప్రమాణాలను పాటించడంలో విఫలమైన పక్షంలో   వార్నింగ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించిందని సిప్లా వివరించింది.  కేవలం  మూడు ప్లాంట్లలో  483లు మాత్రమే జారీ అయినట్లు  వివరణ ఇవ్వడంతో సిప్లా షేర్ నష్టాల నుంచి కొద్దిగా  తెప్పరిల్లింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement