gets
-
పూజా కన్నన్ పెళ్లిలో సాయిపల్లవి ఎమోషనల్ మూమెంట్స్ (ఫోటోలు)
-
తొలి మీడియా సమావేశంలో భావోద్వేగానికి గురైన సీఎం
చండీగఢ్: పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చరణ్‌జిత్ సింగ్ చన్నీ తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఒక సామాన్య వ్యక్తిని సీఎంగా చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందున్నారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు. రాష్ట్రానికి మొదటి దళిత సీఎంగా చన్నీ నిలిచిన సంగతి తెలిసిందే. పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అమరీందర్‌మధ్య నెలరోజుల పాటు సాగిన సంకక్షోభం నేపథ్యంలో కెప్టెన్ పదవినుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అనూహ్యంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని కొత్త సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. దీంతో చన్నీ సోమవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తక్షణమే సాండ్ మాఫియాపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంతేకాదు రైతు పోరాటానికి పూర్తిగా మద్దతు ప్రకటించారు. స్వయంగా రిక్షా పుల్లర్‌ని అయిన తాను వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే నల్ల చట్టాలను రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తానన్నారు. అటు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరైన ఈ వేడుకకు మాజీ సీఎం అమరీందర్ సింగ్ కాకపోవడం గమనార్హం. సీఎంగా బాధ్యతలు చేపట్టిన చన్నీకి కాంగ్రెస్ పెద్దలు, పలువురు నేతలతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకూడా శుభాకాంక్షలు అందజేశారు. #WATCH Punjab CM Charanjit Singh Channi gets emotional while addressing his first press conference in Chandigarh says "Congress has made a common man the chief minister." pic.twitter.com/4QNV990OR7 — ANI (@ANI) September 20, 2021 Congratulations to Shri Charanjit Singh Channi Ji on being sworn-in as Punjab’s Chief Minister. Will continue to work with the Punjab government for the betterment of the people of Punjab. — Narendra Modi (@narendramodi) September 20, 2021 -
రైతుబంధుకు యూఎన్వో గుర్తింపు
సాక్షి,బాన్సువాడ: రైతుల అభివృద్ధి కోసం ప్రపంచంలో అమలు చేస్తున్న 20 వినూత్న పథకాలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతుబంధు, రైతుబీమా పథకాలను ఐక్యరాజ్య సమితి గుర్తించడం గర్వకారణమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇది తెలంగాణకు, రాష్ట్ర రైతాంగానికి దక్కిన గొప్ప గౌరవమన్నారు. శనివారం పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతు సంక్షేమం అనే గొప్ప ఆశయంతో ఈ రెండు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రపంచానికి ఆదర్శమని అన్నారు. రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడి తలెత్తుకొని తిరగాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. అందుకే వ్యవసాయానికి అవసరమైన కరెంట్‌ను 24 గంటలు ఉచితంగా, నాణ్యతతో సరఫరా చేస్తున్నామన్నారు. ఎరువులు, విత్తనాలకు కొరత లేకుండా చేశామని చెప్పారు. పెట్టుబడికి రైతుబంధు ద్వారా ఆర్థిక వెన్నుదన్ను ఇస్తున్నామన్నారు. రైతులకు సలహాలు ఇవ్వడానికి ప్రతి 5000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తీర్ణ అధికారిని నియమించామని అన్నారు. మద్దతు ధరతో పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతుల కోసం భారీగా గోదాములు నిర్మించామన్నారు. దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5లక్షల బీమాతో ధీమా కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, అమలు చేస్తున్న పథకాలతో ఇప్పటికే రాష్ట్రంలోని రైతులకు భరోసా వచ్చిందని పోచారం అన్నారు. తమ వెనక ప్రభుత్వం ఉంది అనే బలం వచ్చిందని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర రైతులకు ఇంకా మంచి రోజులు రాబోతున్నాయన్నారు. -
విస్తారాకు రూ. 2వేల కోట్ల నిధులు
సాక్షి,ముంబై: విస్తరణ ప్రణాళికల్లో విస్తారా ఎయిర్‌లైన్స్ భారీ ఆఫర్ దక్కించుకుంది. టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ నుంచి రూ.2వేల కోట్ల నిధులను ఆర్జించింది. రెగ్యులేటరీ ఫైలింగ్‌అందించిన సమాచారం ప్రకారం 200కోట్ల రూపాయల విలువవైన ఈ క్విటీ షేర్లను (షేరు రూ.10) టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు కేటాయించేందుకు అక్టోబరు 12న విస్టారా బోర్డు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం టాటా సన్స్‌కు 101.99 కోట్ల షేర్లను, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 98 కోట్ల షేర్లను విక్రయించనుంది. ఈ మేరకు రూ. 2వేలకోట్ల నిధులు విస్తారాకు అందనున్నాయి. అయితే ఈ ఫండ్ ఇన్ఫ్యూషన్ గురించి విస్తారా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కాగా విస్తారా ఎయిర్‌లైన్స్ టాటా సన్స్ 51 శాతం వాటాను కలిగి వుండగా మిగతా 49 శాతం సింగపూర్ ఎయిర్‌లైన్స్ సొంతం. టాటాలకు మెజారిటీ వాటా ఉన్న విస్తారా ఎయిర్‌లైన్స్ మూడేళ్ల క్రితం కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రస్తుతం 22 విమానాలను కలిగి ఉంది. తాజాగా విదేశాలకు కూడా సర్వీసులను విస్తరించాలనే వ్యూహంలో ఉంది. -
సిప్లాకు యూఎస్ఎఫ్డీఏ షాక్.. షేర్ ఢమాల్
హైదరాబాద్: దేశీయ డ్రగ్ మేకర్ సిప్లా లిమిటెడ్ గోవాలోని ప్లాంట్లలో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ భారీ ఎత్తున లోపాలను గుర్తించినట్టు వచ్చిన వార్తలతో స్టాక్ మార్కెల్లో సిప్లా షేర్లు పతనమయ్యాయి. ఐదు ప్లాంట్లలో అబ్జర్వేషన్స్(483) నమోదు చేసినట్లు వార్తలు మదుపర్లు ఆందోళన లోకి నెట్టాయి దీంతో సిప్లా కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దాదాపు 7 శాతానికి పైగా పతనమైంది. అయితే గోవాలో ఉన్న మూడు తయారీ ప్లాంట్లలో యూఎస్ఎఫ్డీఏ నిర్వహించిన ఆడిట్ ముగిసిందనీ సిప్లా స్టాక్ ఎక్సేంజ్ వివరణలో తెలిపింది. ఈ తనిఖీల్లో భాగంగా నాలుగు లోపాలను గుర్తించినట్లు(అబ్జర్వేషన్స్) సిప్లా తెలియజేసింది. ఈ పరిశీలనలు స్వభావాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. కానీ ఇది సాధారణ విధానపరమైన పరిశీలన మాత్రమేనని వివరణ ఇచ్చింది. దీనిపై తమ స్పందనను తెలియ చేసినట్టు పేర్కొంది. ప్రమాణాలను పాటించడంలో విఫలమైన పక్షంలో వార్నింగ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించిందని సిప్లా వివరించింది. కేవలం మూడు ప్లాంట్లలో 483లు మాత్రమే జారీ అయినట్లు వివరణ ఇవ్వడంతో సిప్లా షేర్ నష్టాల నుంచి కొద్దిగా తెప్పరిల్లింది. -
పిల్లలను చంపిన వ్యక్తికి ఉరి శిక్ష!
హౌరాః నలుగురు చిన్నారులను హత్య చేసిన కేసులో ఓ వ్యక్తికి ఉరిశిక్ష పడింది. ఐదేళ్ళ క్రితం తన ముగ్గురు పిల్లలతోపాటు, తన మరదలి కొడుకును కూడా నిర్దాక్షణ్యంగా హత్య చేసినట్లు రుజువు కావడంతో ఉలుబెరియా అడిషనల్ సెషన్స్ జడ్జి సుభాషిష్ ఘోష్ దోషికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చారు. నలుగురు చిన్నారులను దారుణంగా హత్య చేసిన కేసులో 40 ఏళ్ళ ఖురేషీ కి పశ్చిమబెంగాల్ హౌరా జిల్లాలోని కోర్ట్ ఉరి శిక్ష విధించింది. ఐదేళ్ళ క్రితం రైష్ ఖురేషీ తన ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకుతో సహా, తన మరదలి కుమారుడ్ని కూడా నదిలోకి విసిరేసి హత్య చేశాడు. పిల్లలు తనకు పుట్టినవారు కాదన్న అనుమానంతోనే వారిని హతమార్చినట్లు నిందితుడు విచారణలో కోర్టు ముందు అంగీకరించాడు. 2011 నవంబర్ 14న కుటుంబ సభ్యులంతా ఓ పెళ్ళి హడావుడిలో ఉండగా ఖురేషీ తన ముగ్గురు పిల్లల్నీ పిక్నిక్ కు తీసికెళ్ళేందుకు సిద్ధమయ్యాడు. అదే సమయంలో తన మరదలి కొడుకు కూడా తమతో ఉండటంతో ఆ బాలుడ్ని కూడా తన బిడ్డలతో పాటు తీసుకెళ్ళాడు. దామోదర్ నదికి దగ్గరలోని మహిష్రేఖా ప్రాంతంలోకి వెళ్ళిన అనంతరం నలుగురు పిల్నల్నీ నదిలోకి విసిరేసి ఉత్తర ప్రదేశ్ కు పారిపోయాడు. ఖురేషీ కూతుళ్ళు నాలుగేళ్ళ రౌనక్, రెండున్నరేళ్ళ అలిషా, ఆరేళ్ళ కొడుకు షహీద్ తో పాటు, అతడి మరదలి కొడుకు ఆరేళ్ళ హసన్ బాడీలు రెండోరోజు నదీ ప్రవాహంలో కొట్టుకు వచ్చాయి. కొన్నాళ్ళ తర్వాత పిల్లలను నదిలో విసిరేసిన ప్రాంతానికి తిరిగి వచ్చిన ఖురేషీ తానుకూడా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అపస్మారక స్థితిలో కనిపించిన అతడిని ఆస్పత్రికి తరలించగా కుటుంబ సభ్యులు ఖురేషీగా గుర్తించారు. నిందితుడు ఖురేషీని నవంబర్ 21న పోలీసులు అరెస్ట్ చేశారు. 2012 లో కేసును స్వాధీనం చేసుకున్న సీఐడీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
గూగుల్ కి షాకిచ్చిన కోర్టు
అలహాబాద్: గ్లోబల్ సెర్చి ఇంజీన్ కంపెనీ గూగుల్ సీఈవో, భారత్ లోని గూగుల్ ఇతర ప్రధాన అధికారులు ఇబ్బందుల్లో పడ్డారు. మంగళవారం అలహాబాద్ స్థానిక కోర్టు వారికి నోటీసులు జారీ చేసింది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరును టాప్ టెన్ క్రిమినల్స్ లిస్టులో చేర్చడంపై దాఖలైన పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. సీఈవో సహా ఇతర భారత్ కు చెందిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది. న్యాయవాది సుశీల్ కుమార్ మిశ్రా ఫిర్యాదుపై విచారించిన కోర్టు తదుపరి విచారణను ఆగస్టు 31 కి వాయిదా వేసింది. గత ఏడాది గూగుల్ ప్రకటించిన ప్రపంచంలోని టాప్ టెన్ నేరస్థుల జాబితాలో మోదీ ఫోటో ప్రత్యక్షంకావడంతో వివాదం రేగింది. దావూద్, అబ్బాస్ నఖ్వీ లాంటి కరడుకట్టిన క్రిమినల్స్ పక్కన ప్రధాని నరేంద్ర మోదీ పేరు జతచేరడంపై న్యాయవాది సుశీల్ కుమార్ మిశ్రా 2015 నవంబరులో చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు ఫిర్యాదు చేశారు. అయితే ఇది క్రిమినల్ కేసు కిందికి వస్తుందని దీన్ని సీజెఎం తిరస్కరించారు. దీన్ని సవాల్ చేస్తూ సుశీల్ కమార్ రివిజన్ పిటిషన్ దాఖలుచేశారు. దీంతో తాజా ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా టాప్ టెన్ క్రిమినల్ లిస్ట్ లో మోదీ పోటోపై గూగుల్ క్షమాపణ చెప్పింది. ఎక్కడో పొరపాటు జరిగిందని వివరణ యిచ్చిన సంగతి తెలిసిందే. -
కంపెనీ సీఈవోకు ఉద్యోగుల గిఫ్ట్!
-
కంపెనీ సీఈవోకు ఉద్యోగుల గిఫ్ట్!
ఏ కంపెనీలోనైనా ఉద్యోగులకు యాజమాన్యం జీతాలు పెంచే పద్ధతి చూస్తాం. ఓ కంపెనీ సీఈవో మాత్రం తన ఉద్యోగులకు స్వంత జీతంలో కొంత భాగాన్ని ఉద్యోగులకు జీతం పెంచేందుకు వెచ్చించాడు. దాంతో సీఈవో తమపై చూపిస్తున్న అభిమానానికి ఉద్యోగులు ఫిదా అయిపోయారు. తమను ఉద్యోగులుగా కాక స్వంత మనుషులుగా గుర్తిస్తున్న సీఈవోను సైతం సంతోషపెట్టాలనుకున్నారు. అందుకే సదరు సంస్థలో పనిచేసే ఉద్యోగులు వారి జీతాలనుంచీ సేకరించిన డబ్బుతో ఆయనకిష్టమైన బహుమతిని ఇచ్చి.. సర్ ప్రైజ్ చేశారు. తన కంపెనీలో పనిచేస్తున్న 120 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి ఏడాదికి 70 వేల డాలర్ల జీతాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్న గ్రేవిటీ కంపెనీ సీఈవో డాన్ ప్రైస్ పై ఉద్యోగులూ ప్రత్యేకాభిమానం ప్రదర్శించారు. తమ జీతాల్లో కొంత డబ్బు సేకరించి ఆయనకిష్టమైన, అత్యంత ఖరీదైన టెల్సా కారును కొని, బహుమతిగా ఇచ్చారు. ఈ అనుకోని సందర్భానికి ఆనందంలో మునిగిపోయిన సదరు సీఈవో.. తన సంతోషాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. తనకు ఉద్యోగులు బహుమతిగా ఇచ్చిన కారు ఫోటోతో పాటు.. ఈ విషయాన్ని నేను నమ్మలేకపోతున్నానని, నిజంగా షాక్ తిన్నానని, ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదంటూ పోస్ట్ చేశాడు. గ్రేవిటీ కంపెనీ సీఈవోగా ఉన్న డాన్ ప్రైస్ వేతనం 11 లక్షల డాలర్లు. అయితే దాన్ని 70 వేలకు తగ్గించుకున్న ఆయన.. మిగిలిన మొత్తాన్ని సంస్థలోని ఉద్యోగుల వేతనాలను పెంచేందుకు వినియోగించాడు. కంపెనీలో ఉద్యోగులందరికీ కనీసం ఏడాదికి 70 వేల డాలర్లు ఉండాలంటూ ఆయన తీసుకున్న నిర్ణయం అప్పట్లో ప్రపంచం మొత్తాన్నే ఆకట్టుకుంది. అయితే ఉద్యోగుల మనసులో అంతటి స్థానాన్ని సంపాదించిన డాన్ ప్రైస్ స్వంత సోదరుడి నుంచి ఓ కేసును ఎదుర్కొంటున్నాడు. గ్రేవిటీ కంపెనీలో వాటాదారుడుగా సోదరుడు.. ప్రైస్ అత్యధిక జీతం పొందుతున్నాడని అతనిపై కేసు వేశాడు. అయితే మూడు వారాల విచారణను ఎదుర్కొన్న డాన్... సోదరుడి కేసులో ప్రతి విషయాన్నీ ఆధారాలు సమర్పిస్తూ దీటుగా ఎదుర్కొంటూ వచ్చాడు. కేసు చివరి దశలో ఉండగా సంస్థ ఉద్యోగులకు భారీగా వేతనాలను పెంచేశాడు. -
భర్తను చంపిన భార్యకు జీవితఖైదు
అహ్మదాబాద్: తనతో శృంగారానికి ఒప్పుకోలేదని భర్తను క్రూరంగా చంపిన భార్యకు మంగళవారం అహ్మదాబాద్ సెషన్స్ కోర్టు జీవితఖైదు విధించింది. శారదానగర్ ప్రాంతంలోని నోబెల్ నగర్ లో నర్సింగ్, విమల(54) దంపతులు నివసించేవారు. 2013లో నవంబర్ 2 న భర్త తనతో శృంగారంలో పాల్గొనలేదని విమల తీవ్రంగా కొట్టింది. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావంటూ ఆయన్ను దూషించింది. కర్రతో భర్త తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటికి తాళం వేసి శారదానగర్ పోలీసు స్టేషన్ కు వెళ్లిన ఆమె భర్త చనిపోయాడంటూ ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని విమలను విచారించగా తానే భర్తను చంపినట్లు తెలిపింది. ఆమెను అరెస్టు చేసిన పోలీసులు చార్జ్ షీటును దాఖలు చేశారు. దాదాపు రెండున్నరేళ్ల పాటు సాగిన విచారణ అనంతరం సెషన్స్ కోర్టు విమలకు జీవితఖైదు, రెండు వేల రూపాయల జరిమానాను విధిస్తూ తీర్పునిచ్చింది. -
పాప్‌స్టార్ తో హ్యాపీగా జుకర్ బర్గ్
సోషల్ నెట్ వర్కింగ్ సైట్ దిగ్గజం ఫేస్ బుక్ సీఈవో మార్క్ జూకర్బర్గ్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. అవును.. ఇన్స్టాగ్రామ్ సూపర్ స్టార్ వ్యక్తిగతంగా కలుసుకున్న సంతోషాన్ని ఆయన సోషల్ మీడియాలో ప్రపంచలోని తమ అభిమానులతో పంచుకున్న తీరు ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇంతకీ ఫేస్బుక్ సీఈవో కలుసుకున్నసెలబ్రిటీ మరెవ్వరో కాదు...హాలీవుడ్ స్టార్ పాప్ సింగర్ సెలీనా గోమేజ్. ప్రముఖ ఫొటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ సూపర్‌స్టార్ గోమేజ్ ను కలిసి విషయాన్ని జుకర్‌బర్గ్ స్వయంగా తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. 'మా అతిచిన్న రూం లో ఇన్స్టాగ్రామ్ బిగ్గెస్ట్ స్టార్ తో భేటీ అంటూ కమెంట్ చేశారు. దీంతోపాటుగా పాప్ స్టార్ గోమెజ్ కు ధన్యవాదాలు కూడా తెలిపారు. ఆ మీనియేచర్ రూంలో నవ్వులు చిందిస్తున్న జుకర్ బర్గ్ , గోమెజ్ ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాగా 2012 లో ఏప్రిల్ లాంచ్ అయి నాలుగు వందల మిలియన్ల యూజర్లతో దూసుకుపోతున్నఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీలను మరింతగా ఆకట్టుకుంటోంది. తమ జీవిత విశేషాలు, ఫోటోలతో ఫ్యాన్స్ ని ఫాలోవర్స్ ని నిరంతరం ఇన్స్టాగ్రామ్ కి బానిసలుగా మారుస్తున్న సెలబ్స్ లో సెలెనా గోమెజ్ ప్రముఖులు. అయితే వీరిద్దరి సరదా భేటీ వెనుక కారణాలు ఏంటి అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. -
ఎన్ కే సింగ్ కు జపాన్ ప్రతిష్టాత్మక అవార్డు
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు నందకిషోర్ సింగ్ (75) జపాన్ కు చెందిన ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. ప్రతిష్టాత్మక 'ద ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్ గోల్డ్ అండ్ సిల్వర్ స్టార్' అవార్డు కు ఆయనను ఎంపిక చేసింది. బ్యూరోక్రాట్ టర్న్డ్ పొలిటీషియన్ ఎన్ కే సింగ్ గత కొన్ని దశాబ్దాలుగా ఇండో-జపాన్ ఆర్థిక సంబంధాల కోసం చేసిన కృషికి గాను ఆయనను ఈ జాతీయ అవార్డుతో సత్కరించనుంది. ప్రజపాన్ ప్రధాని అబే ఎన్ కే సింగ్ కు వ్యక్తిగత ఆహ్వానం పంపించారు. ఈ మే 10 న టోక్యోలోని ఇంపీరియల్ ప్యాలెస్‌లో జరిగే ఒక కార్యక్రమంలో, జపాన్ రాజు అకిహితో సమక్షంలో జపాన్ ప్రధానమంత్రి షింజే అబే చేతులు మీదుగా ఈ అవార్డును సింగ్ అందుకోనున్నారు. మనదేశ ప్రధాని నరేంద్ , మోదీ జపాన్ ప్రధాని అబే నేతృత్వంలో ఇండో - జపాన్ సంబంధాల్లోచారిత్రక మార్పుల్లో భాగంగా తనకు ఈ అవార్డు దక్కిందని సింగ్ వ్యాఖ్యానించారు. 21 వ శతాబ్దం ఆసియా పునరుజ్జీవనం ఇరుదేశాల లోతైన సంబంధాలపై ప్రధారంగా ఆధారపడి ఉందన్నారు. అత్యున్నత ప్రభుత్వ పదవులను నిర్వహాంచిన సింగ్ మంచి ఆర్థిక వేత్త. ఈ క్రమంలో ఆయన ప్లానింగ్ కమిషన్ సభ్యుడుగా తన సేవలందించారు. మారుతి సుజుకి సహా జపనీస్ ఆటోమొబైల్ కంపెనీల పెట్టుబడుల నిర్ణయం కాలంలో జపాన్ లో పనిచేశారు.1875 జపాన్ రాజు మియాసి ప్రవేశపెట్టిన ఈ సత్కారాన్ని1981 జపానేతరులకు అందిస్తున్నారు. కాగా బీహార్ నుంచి జేడీయూ ఎంపీగా రాజ్యసభకు ఎంపికైన ఆయన 2014 లోబీజేపీలో చేరారు. గతంలో భారత్ - జపాన్ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంల్లో కృషికి గుర్తింపుగా భారత దేశ మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ద గ్రాండ్ కార్డన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద పౌలోనియా ఫ్లవర్స్ జపాన్ ప్రభుత్వం సత్కరించింది. -
కన్నకూతురి పై తండ్రి అకృత్యం
-
26 ఏళ్ల యువకుడిగా మార్చేశారు..
న్యూయార్క్ : వైద్యో నారాయణ హరిః అన్నమాటను న్యూయార్క్‌లోని వైద్యులు మరోసారి నిజం చేశారు. సుమారు 26 గంటలు కష్టపడి అతి క్లిష్టమైన ఆపరేషన్ నిర్వహించి సృష్టికి ప్రతిసృష్టి చేశారు. 41ఏళ్ల మధ్యవయస్కుడికి అరుదైన శస్త్ర చికిత్స చేసి 26 ఏళ్ల యువకుడిగా మార్చేశారు. న్యూయార్క్ యూనివర్శిటీకి చెందిన లాంగోన్ మెడికల్ సెంటర్ ప్రపంచంలోనే అరుదైన, అతి పెద్ద ఫేస్ లిఫ్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. వివరాల్లోకి వెళితే... మిస్సిసిపికి చెందిన పాట్రిక్ హార్డ్సన్ , అగ్నిమాపక దళంలో వాలంటీర్‌గా పని చేసేవాడు. ఈ క్రమంలో 2001 సంవత్సరంలో జరిగిన ఓ ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. పాట్రిక్ హార్డ్సన్ గుర్తు పట్టలేనంతగా మొహం కాలిపోయింది. కనీసం కళ్లను కదిలించలేనంతగా చర్మం దెబ్బతింది. పెదాలు, ముక్కు, కనుబొమ్మలు, చివరికి పెదాలు చెవులు కూడా పూర్తిగా కాలింది. సుమారు 150 మంది వైద్యుల బృందం... 26 గంటల కష్టపడి ఫేస్ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ నిర్వహించారు. తల మీద చర్మం, మొహం సహా కళ్లు, కనుబొమలు, ముక్కు, చెవులు, పెదాలు అమర్చి కొత్త రూపును తీసుకొచ్చారు. దీంతో పాట్రిక్ హార్డ్సన్ కంటి పాపల కదలికలతో పాటు, చూపు, వినికిడి శక్తి సాధారణ స్థితికి వచ్చాయి. అంతేకాదు మధ్యవయస్సుడు కాస్త యువకుడిలా మారిపోయాడు. కాగా ఓ రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన 26 ఏళ్ల యువకుడి శరీర భాగాలను స్వీకరించిన వైద్యులు ఈ శస్త్రచికిత్స నిర్వహించారు. అసాధ్యం అనుకున్న... పాట్రిక్ హార్డ్సన్ కంటి చూపును వెనక్కి రప్పించడం తాము సాధించిన పెద్ద విజయమని ప్లాస్టిక్ సర్జన్ ఎడ్యుర్డో రోడ్రిగ్యూజ్ తెలిపారు. తమ బృందం అత్యంత చాకచక్యంగా, అతి సున్నితంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు చెప్పారు. ప్రపంచంలో ఇదే అతి పెద్ద ట్రాన్స్‌ప్లాంటేషన్ అని ఆయన పేర్కొన్నారు. ఇక పాట్రిక్ కూడా తన ముఖానికి కొత్త రూపు తీసుకొచ్చిన వైద్యులకు, అవయవదానం చేసిన యువకుని తల్లికి కృతజ్ఙతలు తెలిపారు. ఆ కుటుంబం మంచితనానికి, మానవత్వానికి ప్రతిఫలం తన కొత్త రూపమన్నాడు. అలాగే ఒకప్పుడు పాట్రిక్ మొహం చూడ్డానికి భయపడిన పిల్లలు కూడా శస్త్రచికిత్స అనంతరం సంతోషం వ్యక్తం చేశారు. -
జలవివాదాల పరిష్కారానికి శాశ్వత ట్రిబ్యునల్