ఎన్ కే సింగ్ కు జపాన్ ప్రతిష్టాత్మక అవార్డు | N K Singh gets Japan's prestigious national award | Sakshi
Sakshi News home page

ఎన్ కే సింగ్ కు జపాన్ ప్రతిష్టాత్మక అవార్డు

Published Fri, Apr 29 2016 3:53 PM | Last Updated on Sun, Sep 3 2017 11:03 PM

ఎన్ కే సింగ్ కు జపాన్ ప్రతిష్టాత్మక అవార్డు

ఎన్ కే సింగ్ కు జపాన్ ప్రతిష్టాత్మక అవార్డు

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు  నందకిషోర్  సింగ్ (75) జపాన్ కు చెందిన ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. ప్రతిష్టాత్మక 'ద  ఆర్డర్ ఆఫ్ ద   రైజింగ్ సన్  గోల్డ్ అండ్ సిల్వర్ స్టార్' అవార్డు కు ఆయనను ఎంపిక చేసింది. బ్యూరోక్రాట్ టర్న్డ్  పొలిటీషియన్ ఎన్ కే సింగ్ గత కొన్ని దశాబ్దాలుగా ఇండో-జపాన్  ఆర్థిక సంబంధాల కోసం చేసిన కృషికి గాను ఆయనను  ఈ జాతీయ అవార్డుతో సత్కరించనుంది.  ప్రజపాన్ ప్రధాని అబే  ఎన్ కే సింగ్ కు   వ్యక్తిగత ఆహ్వానం పంపించారు.

ఈ  మే 10 న టోక్యోలోని ఇంపీరియల్ ప్యాలెస్లో జరిగే ఒక కార్యక్రమంలో, జపాన్ రాజు అకిహితో సమక్షంలో జపాన్ ప్రధానమంత్రి షింజే అబే చేతులు మీదుగా  ఈ అవార్డును సింగ్ అందుకోనున్నారు.  మనదేశ ప్రధాని నరేంద్ , మోదీ జపాన్ ప్రధాని  అబే నేతృత్వంలో ఇండో - జపాన్ సంబంధాల్లోచారిత్రక మార్పుల్లో భాగంగా తనకు ఈ అవార్డు దక్కిందని  సింగ్ వ్యాఖ్యానించారు. 21 వ శతాబ్దం ఆసియా పునరుజ్జీవనం ఇరుదేశాల లోతైన సంబంధాలపై ప్రధారంగా ఆధారపడి ఉందన్నారు. అత్యున్నత ప్రభుత్వ పదవులను నిర్వహాంచిన సింగ్ మంచి ఆర్థిక వేత్త. ఈ క్రమంలో ఆయన ప్లానింగ్ కమిషన్ సభ్యుడుగా తన సేవలందించారు. మారుతి సుజుకి సహా  జపనీస్ ఆటోమొబైల్ కంపెనీల  పెట్టుబడుల నిర్ణయం కాలంలో జపాన్ లో పనిచేశారు.1875 జపాన్ రాజు మియాసి ప్రవేశపెట్టిన ఈ సత్కారాన్ని1981 జపానేతరులకు అందిస్తున్నారు.


కాగా బీహార్ నుంచి జేడీయూ ఎంపీగా రాజ్యసభకు ఎంపికైన ఆయన 2014 లోబీజేపీలో  చేరారు. గతంలో భారత్ - జపాన్ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంల్లో  కృషికి గుర్తింపుగా  భారత దేశ మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌  ద గ్రాండ్ కార్డన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద పౌలోనియా ఫ్లవర్స్ జపాన్ ప్రభుత్వం సత్కరించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement