పాప్స్టార్ తో హ్యాపీగా జుకర్ బర్గ్ | Facebook CEO Mark Zuckerberg gets candid with Hollywood celeb Selena Gomez! | Sakshi
Sakshi News home page

పాప్స్టార్ తో హ్యాపీగా జుకర్ బర్గ్

Published Fri, May 13 2016 12:26 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

పాప్స్టార్ తో  హ్యాపీగా   జుకర్ బర్గ్ - Sakshi

పాప్స్టార్ తో హ్యాపీగా జుకర్ బర్గ్

సోషల్ నెట్ వర్కింగ్  సైట్ దిగ్గజం ఫేస్ బుక్ సీఈవో  మార్క్‌ జూకర్‌బర్గ్‌ ఆనందంలో మునిగి  తేలుతున్నారు. అవును.. ఇన్‌స్టాగ్రామ్‌  సూపర్ స్టార్ వ్యక్తిగతంగా కలుసుకున్న సంతోషాన్ని  ఆయన  సోషల్ మీడియాలో ప్రపంచలోని తమ అభిమానులతో పంచుకున్న తీరు ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.  ఇంతకీ ఫేస్‌బుక్‌ సీఈవో కలుసుకున్నసెలబ్రిటీ మరెవ్వరో కాదు...హాలీవుడ్ స్టార్  పాప్ సింగర్ సెలీనా గోమేజ్‌.  ప్రముఖ ఫొటో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ సూపర్‌స్టార్ గోమేజ్ ను కలిసి విషయాన్ని జుకర్‌బర్గ్‌  స్వయంగా తన ఫేస్‌బుక్‌  అకౌంట్ ద్వారా   షేర్ చేశారు.  'మా  అతిచిన్న రూం లో ఇన్‌స్టాగ్రామ్‌ బిగ్గెస్ట్ స్టార్  తో భేటీ అంటూ  కమెంట్ చేశారు.  దీంతోపాటుగా  పాప్ స్టార్ గోమెజ్ కు ధన్యవాదాలు కూడా తెలిపారు.  ఆ మీనియేచర్  రూంలో  నవ్వులు చిందిస్తున్న  జుకర్ బర్గ్ , గోమెజ్  ఫోటో  ప్రత్యేక ఆకర్షణగా  నిలిచింది.

 కాగా  2012 లో ఏప్రిల్ లాంచ్ అయి  నాలుగు వందల మిలియన్ల  యూజర్లతో దూసుకుపోతున్నఇన్‌స్టాగ్రామ్‌  సెలబ్రిటీలను  మరింతగా ఆకట్టుకుంటోంది.    తమ జీవిత విశేషాలు,  ఫోటోలతో  ఫ్యాన్స్ ని ఫాలోవర్స్ ని నిరంతరం ఇన్‌స్టాగ్రామ్‌ కి బానిసలుగా  మారుస్తున్న  సెలబ్స్ లో సెలెనా గోమెజ్   ప్రముఖులు.  అయితే వీరిద్దరి  సరదా  భేటీ  వెనుక కారణాలు ఏంటి అనేది మాత్రం  ప్రస్తుతానికి సస్పెన్స్.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement