డా.రెడ్డీస్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ షాక్‌ | DRL Slips Sfter Plant Gets 11 Observation | Sakshi
Sakshi News home page

డా.రెడ్డీస్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ షాక్‌

Published Mon, Feb 11 2019 1:20 PM | Last Updated on Mon, Feb 11 2019 1:21 PM

DRL Slips Sfter Plant Gets 11 Observation - Sakshi

సాక్షి, ముంబై : దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌కు మరోసారి అమెరికా ప్రాతిపాధిక ఆహార నియంత్రణ సంస్థ(యూఎస్‌ఎఫ్‌డీఏ) షాక్‌ తగిలింది. ఇటీవల హైదరాబాద్‌ బాచుపల్లి యూనిట్‌-3లో తనిఖీలు నిర్వహించిన సంస్థ యూనిట్‌లో 11 ( అబ్జర్వేషన్లను) లోపాలను గుర్తించింది. ఈ మేరకు 483-ఫామ్‌ను జారీ చేసినట్లు డా. రెడ్డీస్‌ యాజమాన్యం శుక్రవారం స్టాక్‌ ఎక్చ్చేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. దీంతో సోమవారం ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీశారు. ఒక దశలో షేరు 8శాతానికిపైగా కుప్పకూలింది. అనంతరం కోలుకుని 3శాతం నష్టాలకు పరిమితమైనా...మిడ్‌ సెషనన్‌ తరువాత మళ్లీ ​6శాతం పతనమైంది. కాగా.. నియమిత కాలంలోగా ఎఫ్‌డీఏ గుర్తించిన లోపాలను సవరించనున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement