Four
-
ఇరాన్లో భూకంపం.. నలుగురు మృతి
ఇరాన్‌లోని కష్మార్‌లో భూకంపం సంభవించంది. ఈ విపత్తులో నలుగురు మృతిచెందారు. 120 మంది గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.9గా నమోదయ్యింది. భూకంపం కారణంగా మృతిచెందివారి వారి సంఖ్యను కష్మార్ గవర్నర్ హజతుల్లా షరీయత్మదారి ధృవీకరించారు.భూకంపం బారినపడి తీవ్రంగా గాయపడిన 35 మంది బాధితులను ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. భూకంపం కారణంగా కష్మార్ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పలు పాత భవనాలు దెబ్బతిన్నాయి. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం భూకంపం 10 కిలోమీటర్ల (ఆరు మైళ్ళు) లోతులో సంభవించింది. ఇరాన్ టెలివిజన్ భూకంపం ఫుటేజీని ప్రసారం చేసింది. దానిలో కొన్ని భవనాలు బీటలువారడం కనిపిస్తుంది. అలాగే కార్మికులు భవన శిధిలాలను తొలగిస్తున్న దృశ్యాలను కూడా చూపించారు.ఇరాన్లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2023లో టర్కీలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించగా, ముగ్గురు మృతిచెందారు. 800 మందికి పైగా జనం గాయపడ్డారు. కాగా 2003లో ఇరాన్లో భారీ భూకంపం సంభవించింది. బామ్ నగరంలో 6.6 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపంలో 31వేల మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు. -
పూల సాగుతో నాలుగు నెలల్లో రూ. 8 లక్షలు!
ఇటీవలి కాలంలో యువత కేవలం ఉద్యోగాలపైనే ఆధారపడకుండా స్టార్టప్‌లతో పాటు వ్యవసాయరంగంలోనూ కాలుమోపి, విజయాలు సాధిస్తున్నారు. యూపీలోని లక్నోలో గల మలిహాబాద్ పరిధిలోని ధాక్వా గ్రామానికి చెందిన గౌరవ్ కుమార్ ఇలాంటి విజయాన్నే అందుకున్నాడు. ప్రస్తుతం 22 ఏళ్ల వయసు కలిగిన గౌరవ్ కుమార్ గ్లాడియోలస్ పూలు సాగు చేస్తున్నాడు. నాలుగు నెలల్లో రూ. ఎనిమిది లక్షలు సంపాదించి అందరినీ ఆశ్యర్యపరుస్తున్నాడు. గౌరవ్ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి శివకుమార్ వరి, గోధుమలు పండించి చాలాసార్లు నష్టపోయాడని, ప్రతికూల వాతావరణం కారణంగా పంట పాడైపోయేదని తెలిపాడు. అటువంటి పరిస్థితిలో తాను సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సబ్ట్రాపికల్ హార్టికల్చర్‌లో చేరానన్నాడు. అక్కడ పూల పెంపకం గురించి తెలుసుకుని, పూల సాగుకు తండ్రిని ఒప్పించానని తెలిపాడు. సెప్టెంబరు నుంచి గ్లాడియోలస్ పూల సాగు ప్రారంభమవుతుందని, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి వరకు ఈ పూలు విరివిగా లభిస్తాయని తెలిపాడు. కేవలం నాలుగు నెలల్లోనే ఈ పూల విక్రయం ద్వారా నాలుగు నుంచి ఎనిమిది లక్షల రూపాయల ఆదాయం వస్తుందని గౌరవ్ తెలిపాడు. తాను ప్రస్తుతం డీ ఫార్మా చదువుతున్నానని, వైద్య విద్యతో పాటు వ్యవసాయంపై దృష్టి సారిస్తానని తెలిపారు. -
నాలుగు కాళ్ల కోడిపిల్ల
ఏపీలోని వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం ఎర్రబల్లె పంచాయతీ పరిధిలోని మల్లికార్జునపురంలో నాలుగు కాళ్లతో జన్మించిన ఓ కోడి పిల్ల అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గ్రామానికి చెందిన దామోదర్.. తన ఇంట్లో మూడు రోజుల కిందట ఓ కోడి పెట్టిన గుడ్లను పొదిగేశారు. అందులో ఒక కోడి పిల్ల నాలుగు కాళ్లతో పుట్టింది. ఆరోగ్యంగా ఉన్న ఈ కోడి పిల్లను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు. – పులివెందుల రూరల్ -
నాలుగు సంస్థల ఏర్పాటులో అదానీ గ్రీన్ ఎనర్జీ
న్యూఢిల్లీ: అదానీ గ్రీన్ ఎనర్జీ తాజాగా నాలుగు అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసింది. అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ సిక్స్టీ, అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ సిక్స్టీ టూ, అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ సిక్స్టీ త్రీ, అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ సిక్స్టీ ఫోర్ వీటిలో ఉన్నాయి. పవన, సౌర, ఇతరత్రా పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం, పంపిణీ చేయడం, విక్రయించడం తదితర లావాదేవీల కోసం ఈ అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసినట్లు సంస్థ తెలిపింది. -
దుకాణాల్లోకి దూసుకెళ్లిన ట్రాలీ.. నలుగురు మృతి!
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాన్పూర్ నుంచి ఆగ్రా వైపు వేగంగా వెళ్తున్న ట్రాలీ అదుపు తప్పి జాతీయ రహదారిపై మాణిక్పూర్ మలుపు సమీపంలోని రెండు షాపుల్లోకి దూసుకెళ్లింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఇదే ట్రాలీ ఢీకొనడంతో బైక్‌పై వెళుతున్న వ్యక్తి కూడా గాయాలపాలయ్యాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే డీఎం, ఎస్ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే శనివారం రాత్రి 10:20 గంటల ప్రాంతంలో కాన్పూర్ నుంచి ఆగ్రా వెళ్తున్న ట్రాలీ మాణిక్పూర్ మలుపు సమీపంలో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న దుకాణాలపైకి దూసుకెళ్లింది. దీంతో అక్కడున్న పలువురు ట్రాలీ కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఇక్డిల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్, జేసీబీలను రప్పించి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే ముగ్గురు మృతిచెందగా ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు. గాయాలపాలైన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: దేశంలో తొలి ఏఐ సిటీగా లక్నో -
ఇటుక బట్టీలో భారీ పేలుడు.. నలుగురు మృతి!
పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణా జిల్లాలోని ఒక ఇటుక బట్టీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో చిమ్నీ కూలిపోయి నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో 25 మందికి పైగా కూలీలు గాయపడ్డారు. ఈ ఘటనపై ఫోరెన్సిక్ విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన బసిర్‌హత్‌లోని ధాల్టితా గ్రామంలో చోటుచేసుకున్నదని పోలీసులు తెలిపారు. ఇటుక బట్టీలో పొయ్యి మండుతుండగా పేలుడు సంభవించిందని చెబుతున్నారు. ఈ విషయమై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడిన వారంతా ఇటుక బట్టీ కార్మికులేనని తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా, శిథిలాల కింద ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోందని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం భారీ పేలుడు థాటికి ఇటుక బట్టీలోని చిమ్నీ పూర్తిగా కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. కాగా ఈ పేలుడు వెనుక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: కిడ్నీ దానంతో భర్త ప్రాణాలు కాపాడిన భార్య! -
కొత్త ఏడాదిలో నూతన ఎక్స్‌ప్రెస్‌వే.. నాలుగు రాష్ట్రాలకు నజరానా!
దేశంలోని నాలుగు రాష్ట్రాలను కలుపుతూ రాబోయే సంవత్సరంలో కొత్త ఎక్స్‌ప్రెస్‌వే నిర్మితం కానుంది. ఇది బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలను అనుసంధానం చేయనుంది. ఈ రహదారి ఏర్పాటుతో బీహార్ ప్రజలకు అత్యధిక ప్రయోజనం చేకూరనుంది. ఈ వారణాసి-రాంచీ-కోల్‌కతా ఎక్స్‌ప్రెస్ వేకు సంబంధించిన కీలక సమాచారం వెలువడింది. ఈ ఎక్స్‌ప్రెస్ వే ఏడు ప్యాకేజీలుగా నిర్మాణం కానుంది. దీనిలోని ఐదు ప్యాకేజీలలో బీహార్‌లోని పలు ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించనున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే అంచనా వ్యయం రూ.28,500 కోట్లు. ఇది 610 కిలోమీటర్ల పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే. ఇది నాలుగు రాష్ట్రాల మీదుగా వెళుతుంది. దీనిలో 159 కిలోమీటర్ల పొడవైన మార్గం బీహార్ మీదుగా వెళుతుంది. ఈ ప్రత్యేక గ్రీన్‌ఫీల్డ్ ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే కోసం బీహార్‌లో 136.7 కిలోమీటర్ల మేరకు అవసరమైన భూమిని గుర్తించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కొత్త సంవత్సరం ప్రారంభంతో దీనికి సంబంధించిన నిర్మాణ పనులు జరిగే అవకాశం ఉంది. నాలుగు, ఐదు ప్యాకేజీల డీపీఆర్ కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. వారణాసి రింగ్ రోడ్‌లోని చందౌలీలో ఉన్న బర్హులి గ్రామం నుండి ఎక్స్‌ప్రెస్‌వే రహదారి నిర్మాణం ప్రారంభం కానుంది. ఈ రహదారి బీహార్‌లోకి ప్రవేశించిన తర్వాత కైమూర్, రోహతాస్, ఔరంగాబాద్, గయ జిల్లాల మీదుగా వెళుతుంది. బీహార్‌లోని నాలుగు జిల్లాలను దాటి జార్ఖండ్‌కు చేరుకుంటుంది. ఇక్కడ ఐదు జిల్లాల గుండా వెళుతూ ఈ ఎక్స్‌ప్రెస్‌వే పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశిస్తుంది. అక్కడ నాలుగు జిల్లాల మీదుగా జాతీయ రహదారి- 19కి అనుసంధానమవుతుంది. జార్ఖండ్‌లో ఈ రహదారి పొడవు 187 కిలోమీటర్లు. పశ్చిమ బెంగాల్లో గరిష్టంగా 242 కిలోమీటర్లు. మొదటి ప్యాకేజీలో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి ప్రారంభమై బీహార్‌లోని కొన్ని ప్రాంతాలతో అనుసంధానమవుతూ ముగుస్తుంది. రెండో ప్యాకేజీలో రహదారి నిర్మాణం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లా నుండి ప్రారంభంకానుంది. ఇది ఇక్కడి చందౌలీలో ఉన్న బర్హులీ గ్రామం మీదుగా బీహార్‌లోకి ప్రవేశిస్తుంది. తరువాత ఔరంగాబాద్, గయా జిల్లాల మీదుగా జార్ఖండ్‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ఛత్రా, హజీరాబాగ్, రామ్‌ఘర్, పీటర్‌బార్, బొకారో మీదుగా ఈ ఎక్స్‌ప్రెస్‌వే పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశిస్తుంది. అక్కడ పురూలియా, బంకురా, ఆరంబాగ్ మీదుగా వెళ్లే ఈ ఎక్స్‌ప్రెస్ వే ఉలుబెరియా వద్ద జాతీయ రహదారి 19 వద్ద ముగుస్తుంది. ఇది కూడా చదవండి: ‘శ్రీరామునికి రెండు నూలు పోగులు’ ఉద్యమానికి అనూహ్య స్పందన! -
‘నాలుగు కాళ్ల’ వింత కుటుంబం.. పశువుల తరహాలో నడక!
ప్రపంచంలో రకరకాల మనుషులు కనిపిస్తారు. అలాగే చిత్రమైన కుటుంబాలను కూడా మనం చూస్తుంటాం. విచిత్రమైన అలవాట్లు లేదా భిన్న ధోరణి కారణంగా ఆయా కుటుంబాల వారు ప్రత్యేకంగా కనిపిస్తారు. అయితే వీటన్నింటికీ భిన్నంగా ఒక కుటుంబంలోని సభ్యులు జంతువుల మాదిరిగా నాలుగు కాళ్లతో నడుస్తుంటారు. వీరు తమ రెండు చేతులను రెండు కాళ్లుగా ఉపయోగిస్తుంటారు. ఈ విచ్రితమైన కుటుంబం టర్కీలోని ఒక శివారు గ్రామంలో ఉంటోంది. ఈ కుటుంబంలోని ఐదురుగురు సభ్యుల గురించి 2000లో ఒక వార్తాపత్రికలో ప్రచురితమయ్యింది. ఈ నేపధ్యంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్(ఎల్ఎస్ఈ)కి చెందిన మానసిక శాస్త్రవేత్త నికోలస్ హంఫ్రే ఈ విచిత్ర కుటుంబాన్ని కలుసుకునేందుకు టర్కీ వెళ్లారు. ఈ విచిత్ర కుటుంబంలో తల్లిదండ్రులకు 18 మంది పిల్లలు. అయితే వీరిలోని ఆరుగురు జంతువుల తరహాలో నడిచేందుకు ఇష్టపడతారు. ఆస్ట్రేలియాకు చెందిన ఒక క్రియేటర్ ఈ విచిత్ర కుటుంబంపై 60 నిముషాల డాక్యుమెంటరీ రూపొందించారు. దానిలో శాస్త్రవేత్త హంఫ్రే మాట్లాడుతూ ఇలాంటి మనుషులను తాను ఎన్నడూ చూడలేదని, ఈ ఆధునిక యుగంలో వీరు పశుఅవస్థకు తిరిగి వెళుతున్నట్లున్నదని అన్నారు. కొందరు శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఈ కుటుంబసభ్యులు అనువంశిక సమస్యల కారణంగా ఇలా ప్రవర్తిస్తుండవచ్చని అన్నారు. కాగా ఈ ఆరుగురు అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లలో ప్రస్తుతం ఐదుగురు మాత్రమే జీవించివున్నారు. వీరు 22 ఏళ్ల నుంచి 38 ఏళ్ల మధ్య వయసు కలిగినవారు. వీరి మెదడులో ఒక భాగం కుంచించుకుపోయిందని, దీనిని సెరెబెలర్ వర్మిస్ అంటారని శాస్త్రవేత్తలు తెలిపారు. సెరెబెలర్ వర్మిస్ కలిగినవారు తమ రెండు చేతులను కాళ్ల మాదిరిగా వినియోగించేందుకు ఇష్టపడతారన్నారు. ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన పిండిమర.. ఒకరిని కాపాడబోయి.. వరుసగా నలుగురు! -
అధికారికంగా విలీనం..చర్చలకు రమ్మని ఉక్రెయిన్‌కి పుతిన్ పిలుపు
మాస్కో: రష్యా వ్యూహాత్మక పథకం ఫలించింది. గత వారమే రిఫరెండమ్ నిర్వహించి ఉక్రెయిన్‌లోని నాలుగు కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు రష్యా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడూ తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆయా ప్రాంతాలను అధికారికంగా విలీనం చేసుకున్నట్లు ప్రకటించారు. తమ భూభాగాలను రక్షించుకోవడానికి రష్యా ఏమైనా చేస్తుందని, రష్యన్ ప్రజల విముక్తే తమ లక్ష్యం అని చెప్పారు. ఈ మేరకు డోనెట్స్క్, లుహాన్స్క్, ఖైరన్, జపోరిజ్జియా అధికారికంగా విలీనం చేయబడ్డాయని ప్రకటించారు. తమ బలగాలు సాధించిన విజయాన్ని పుతిన్ గ్రాండ్‌గా సెలబ్రెట్ చేసుకున్నారు. అంతేగాదు ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడంలో సహాయం చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో పుతిన్ కీవ్‌ని తక్షణమే సైనిక చర్యను ఆపేసి చర్చలకు రావాల్సిందిగా పిలుపునిచ్చారు. తాము ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని, అలాగే విముక్తి పొందిన భూభాగాల్లో ప్రజా సేకరణ విషయమై చర్చించమని స్పష్టం చేసింది. అలాగే విలీనం చేసుకున్న ప్రాంతాల్లోని ప్రజలు ఎప్పటికీ రష్యన్ పౌరులుగానే ఉంటారని అన్నారు. రష్యాను వలస రాజ్యంగా చేసేందుకు పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. నయా వలసవాద వ్యవస్థను ప్రోత్సహించేలా ప్రపంచాన్ని దోచుకుంటున్నాయన్నారు. అణ్వాయుధాల వినియోగం గురించి ప్రస్తావిస్తూ...అణ్వాయుధాలను రెండుసార్లు ఉపయోగించిన ఏకైక దేశం అమెరికానే అని అన్నారు. (చదవండి: రష్యా రక్తపిపాసి! ఉగ్రవాదులే ఇలా చేయగలరు: జెలెన్స్కీ) -
ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలు విలీనం.. రష్యా కీలక ప్రకటన
కీవ్: ఇటీవల రెఫరెండం చేపట్టిన ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను తాము కలిపేసుకుంటామని రష్యా గురువారం ప్రకటించింది. ఈ రెఫరెండంలో దక్షిణ, తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలైన జపొరిఝియాలో 93%, ఖేర్సన్లో 87%, లుహాన్స్క్లో 98%, డొనెట్స్క్లో 99% మంది రష్యాకు అనుకూలంగా ఓటేశారని క్రెమ్లిన్ అనుకూల పరిపాలనాధికారులు మంగళవారం ప్రకటించారు. శుక్రవారం క్రెమ్లిన్ కోటలోని సెయింట్ జార్జి హాల్లో జరిగే కార్యక్రమంలో విలీనం విషయాన్ని అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ప్రకటిస్తారని అధికార ప్రతినిధి పెష్కోవ్ చెప్పారు. విలీనానికి సంబంధించిన పత్రంపై ఈ నాలుగు ప్రాంతాల అధికారులు సంతకాలు చేస్తారన్నారు. రష్యా చర్యను ఉక్రెయిన్, అమెరికా, జర్మనీ ఇతర పశ్చిమ దేశాలు ఖండించాయి. రష్యా చేపట్టిన రెఫరెండంను, విలీనం చేసుకోవడాన్ని గుర్తించబోమన్నాయి. ఈ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఉక్రెయిన్ ప్రతిజ్ఞ చేసింది. ఇలా ఉండగా, ఉక్రెయిన్‌లో ద్నీప్రో ప్రాంతంపై రష్యా జరిపిన రాకెట్ దాడిలో చిన్నారి సహా 8 మంది చనిపోయినట్లు అధికారులు చెప్పారు. ఈశాన్య ప్రాంత లెమాన్ నగరంపై పట్టు కోసం ఉక్రెయిన్, రష్యా బలగాల మధ్య భీకర పోరు సాగుతోందని బ్రిటిష్ నిఘా వర్గాలు వెల్లడించాయి. -
ఉగ్రవాదులతో సంబంధాలు.. నలుగురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు
శ్రీనగర్: ఉగ్రవాదులతో సంబంధాలున్న నలుగురు ప్రభుత్వ ఉద్యోగులపై జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం వేటు వేసింది. నిషిద్ధ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు చీఫ్‌నని ప్రకటించుకున్న సయ్యద్ సలాహుద్దీన్ కుమారుడు, జైల్లో ఉన్న వేర్పాటువాద నాయకుడు బిట్టా కరాటే భార్యతో సహా నలుగురిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ శనివారం జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భారత్‌కు వ్యతిరేకంగా పని చేస్తూ, తప్పుడు ప్రచారం చేస్తున్న వారితో సంబంధాలుండడంతో వారిని ఉద్యోగుల నుంచి తీసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఉగ్రవాద సంస్థలతో లింకులుంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం ప్రభుత్వ పరమైన ఎలాంటి విచారణ చేయకుండా ఉద్యోగాలను తొలగించే అధికారం ప్రభుత్వాలకి ఉంటుంది. వాణిజ్య, పరిశ్రమల శాఖలో పని చేస్తున్న సయ్యద్ అబ్దుల్ ముయీద్, జమ్మూకశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ అసాబ్ ఉల్ అర్జామంద్ ఖాన్ (ఫరూక్ అమ్మద్ దార్ అలియాస్ బిట్టా కరాటె భార్య) , కశ్మీర్ యూనివర్సిటీలోని శాస్త్రవేత్తగా పని చేస్తున్న డాక్టర్ ముహీత్ అహ్మద్ భట్, కశ్మీర్ యూనివర్సిటీలోనే అసిస్టెంట్ ప్రొఫసర్‌గా పని చేస్తున్న మజీద్ హుస్సేన్ ఖాద్రిలు ఉద్యోగాలు కోల్పోయారు. సోంపెరాలోని జమ్మూ కశ్మీర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ (జేకేఈడీఐ) కాంప్లెక్స్‌లో జరిగిన పేలుళ్లతో అబ్దుల్ ముయీద్‌కు సంబంధం ఉంటే, అర్జామంద్‌ఖాన్‌కు పాస్‌పోర్టు కోసం తప్పుడు సమాచారం అందించారు. డాక్టర్ ముహీత్ అహ్మద్ భట్ యూనివర్సిటీల్లో విద్యార్థుల్ని భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టేలా పాఠాలు బోధిస్తూ ఉంటే, మరో ప్రొఫెసర్ మజీద్ హుస్సేన్‌కు నిషిద్ధ లష్కరేతోయిబా సహా పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయి. సయ్యద్ సలాహుద్దీన్ కుమారులు ఇద్దరు గతంలోనే ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు మూడో కుమారుడిపైన కూడా వేటు పడింది. గత ఏడాది నుంచి ఇప్పటివరకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలతో లింకులున్న దాదాపుగా 40 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. -
అంతరిక్షంలో అద్భుతం.. ఒకే వరుసలో నాలుగు గ్రహాలు
ఏలేశ్వరం(తూర్పుగోదావరి): అంతరిక్షంలో అద్భుతం చోటు చేసుకుంది. ఖగోళంలో ఒకే రేఖపై నాలుగు గ్రహాలు దర్శనమిచ్చాయి. దీనిని ప్లానెట్స్ పరేడ్ అని అంటారు. ఇది బుధవారం తెల్లవారు జామున 3.49 గంటల నుంచి 5.06 గంటల మధ్య కనువిందు చేసింది. దీనిని కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో స్పార్క్ ఫౌండేషన్ చిత్రీకరించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను ఆస్ట్రనామికల్ వింగ్ డైరెక్టర్ ఎస్.సాయి సందీప్ వెల్లడించారు. చదవండి: ఆ కోర్సులకు గిరాకీ.. ‘డిగ్రీ’ వైపు మళ్లీ చూపు.. శని, అంగారక, శుక్ర గ్రహాలు ఒకే రేఖపైకి రావడం మార్చి చివరిలో ప్రారంభమైంది. ఏప్రిల్‌లో బృహస్పతి అదే రేఖపైకి వచ్చి చేరింది. నాలుగు గ్రహాలు ఒకే రేఖపై దర్శనమివ్వడం అత్యంత అరుదైన విషయమని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 23న నాలుగు గ్రహాల చెంతకు చంద్రుడు వచ్చి చేరడంతో అంతకు మించిన అద్భుతం ఆవిష్కృతం కానుందన్నారు. ప్రస్తుతం సరళరేఖ కుడిపక్కన చంద్రుడు కనిపిస్తున్నాడు. ఐదు గ్రహాలను ఒకే వరుసగా చూడటం ప్రజలకు సువర్ణ అవకాశమని సాయిసందీప్ అన్నారు. -
నోబెల్ : నూట ఇరవై ఏళ్లలో నలుగురు
ఎలా కనిపెడతారు వీళ్లు?! ఇంటిపని చేస్తూనే రేడియో ధార్మికతల్ని పిల్లల్ని ఆడిస్తూనే పరమాణు స్వభావాల్ని వండి పెడుతూనే కాంతి ఉష్ణ కిరణాల్ని నిద్ర చాలకనే మార్మిక కృష్ణ బిలాల్ని! ఎక్కడిది వీళ్లకింత శక్తి? సూక్ష్మదృష్టి? భౌతిక శాస్త్రమే ఆవహిస్తోందా? పాలపుంతల నుంచి ప్రవహిస్తోందా? శాస్త్రం జీవితాన్ని సులభతరం చేస్తుంది. ఎలా చేస్తుందో అర్థం చేసుకోవడం మాత్రం కష్టమైన విషయం! సెల్‌ఫోన్‌ను చెవి దగ్గర పెట్టుకుని ‘హలో’ అని వేల మైళ్ల దూరంలో ఉన్నవారితో మాట్లాడినంత సులభం కాదు, ఎలా మాట అంతదూరం వెళ్లి, మళ్లీ వస్తుందో అర్థం చేసుకోవడం. అందుకే నిరంతరం శాస్త్రాన్ని అర్థం చేసుకుని, అర్థం చేయించే పనిలో ఉండే శాస్త్రవేత్తలకు.. ముఖ్యంగా ఏ ప్రయోగ అనుకూలతలూ ఉండని మహిళా శాస్త్రవేత్తలకు చేతులు జోడించి నమస్కరించాలి. ఇటు గృహ బంధనాలు, అటు శాస్త్ర శోధనలు! గ్రేట్. అణు ధార్మికత (రేడియో యాక్టివిటీ) పై చేసిన పరిశోధనలకు పొలెండ్ శాస్త్రవేత్త మేరీ క్యూరీకి నోబెల్ బహుమతి రావడం వెనుక కూడా జీవితకాల పరిశోధనలు, ప్రయోగాలు ఉన్నాయి. మరియా గోపర్ట్ మేయర్ (1906–1972) భౌతికశాస్త్రంలో తొలి నోబెల్ గెలుచుకున్న మహిళ ‘మేడమ్’ క్యూరీ. ఆ ‘రేడియో ధార్మికత’ అనే పేరు ఆమె పెట్టిందే! అంతకుముందు కూడా రేడియో ధార్మికత ఉండేది. ఫలానా అని దానికొక గుర్తింపును క్యూరీ ఇచ్చారు. అణుధార్మికత ప్రయోగాల ల్యాబ్‌కు ఆమె తన జీవితాన్నే పణంగా పెట్టారు. ఆ దుష్ప్రభాలతోనే చివరికి ఆమె చనిపోయారని అంటారు! మానవ దేహంలో కణుతులకు జరిగే రేడియం చికిత్స పరిణామాలను వైద్యులు అంచనా వేయగలగడాన్ని సాధ్యం చేయించింది క్యూరీ పరిశోధనా ఫలితాలే. ∙∙ మేరీ క్యూరీ తర్వాత భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ పొందిన మహిళ మరియా గోపర్ట్ మేయర్. జర్మనీ శాస్త్రవేత్త. ఆటమిక్ న్యూక్లియస్‌లోని ‘న్యూక్లియర్ షెల్ మోడల్’ను ప్రతిపాదించినందుకు ఆమెకు నోబెల్ లభించింది. ఆటమిక్ న్యూక్లియస్ అంటే పరమాణు కేంద్రకం. అందులోనే ప్రొటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. ఆ కేంద్రకం శక్తి స్థాయుల నిర్మాణం ఫలానా విధంగా ఉంటుందని మరియా కనిపెట్టారు. సరే, ఎవరికి ప్రయోజనం? అది పూర్తిగా శాస్త్రపరమైన అంశం. అణు స్వభావాలను తెలుసుకోడానికి పనికొచ్చే మేథమెటిక్స్. వైద్యరంగాన్నే తీసుకుంటే.. వ్యాధుల నిర్థారణ, వ్యాధి దశల గుర్తింపు, చికిత్స.. వీటికి అవసరమైన అధ్యయనానికి కూడా పరిశోధకులకు ‘న్యూక్లియర్ షెల్ మోడల్’ ఒక దారి దీపం. ∙∙ భౌతికశాస్త్రంలో నోబెల్ పొందిన మూడో మహిళా శాస్త్రవేత్త డోనా స్ట్రిక్లాండ్. ఆప్టికల్ ఫిజిసిస్ట్. ఎలక్ట్రో మ్యాగ్నటిక్ రేడియేషన్‌పై పరిశోధనలు చేస్తుంటారు. కెనడా ఆమెది. ‘పల్స్డ్ లేజర్స్’ గురించి కొత్త విషయాలు కనిపెట్టినందుకు రెండేళ్ల క్రితం డోనాను నోబెల్ వరించింది. సి.పి.ఎ. (చర్ప్‌డ్ పల్స్ ఆంప్లిఫికేషన్) ను ఆచరణాత్మకంగా ప్రయోగించి అత్యధిక తీవ్రతను కలిగిన, అతి చిన్న కాంతి ఉష్ణ కిరణాలను ఆమె సృష్టించారు. కంటికి చేసే లేజర్ చికిత్సలలో ఇది చక్కగా ఉపకరిస్తోంది. ∙∙ ఆండ్రియా గెజ్ ఈ ఏడాది నోబెల్ పొందిన మహిళా ఖగోళ శాస్త్రవేత్త. ఫిజిక్స్‌లో నాల్గవ మహిళా నోబెల్ విజేత. పాలపుంత మధ్యలో ధూళితో నిండి ఉన్న ‘ధనుర్భాగాన్ని’ (సాజిటేరియస్ –ఎ ) గెజ్ ఆధ్వర్యంలోని బృందం నిశితంగా పరిశీలించి, అక్కడి కాంతిమంతమైన నక్షత్రాల గమ్యాన్ని గుర్తించింది. గెజ్ అంచనా ప్రకారం ఆ ప్రదేశంలో బ్రహ్మరాక్షసి వంటి మార్మిక బిలం ఒకటి ఆ చుట్టుపక్కల నక్షత్రాల కక్ష్యలకు దారి చూపుతోంది! కొన్ని నక్షత్రాలను ఆధాటున మింగేస్తోంది. ఈ విశ్వవైపరీత్యాన్ని గెజ్ శక్తిమంతమైన టెలిస్కోప్‌తో కనిపెట్టారు. గెజ్ పరిశోధన మున్ముందు మనిషి ఈ విశ్వాన్ని మరింత సూక్ష్మంగా శోధించేందుకు, విశ్వ రహస్యాలను ఛేదించేందుకు తోడ్పడుతుంది. పంచుకోవడంలో సంతోషం ఉంటుంది. అయితే అవార్డుల విషయంలో అదేమంత సంతోషాన్నివ్వదు. చిన్న అవార్డు అయినా విడిగా ఒక్కరికే వస్తే ఉండే ప్రత్యేక గుర్తింపు కలివిడిగా వస్తే ఉండదు. భౌతికశాస్త్రంలో నోబెల్ పొందిన ఈ నలుగురు మహిళా శాస్త్రవేత్తలూ మరో ఇద్దరితో అవార్డును పంచుకోవలసి వచ్చినవారే. ఇది కొంచెం నిరుత్సాహం కలిగించే విషయమే అయినా, మానవ జీవితాలకు కలిగే ప్రయోజనాల ఆవిష్కరణల్లో భాగస్వామ్యం కలిగి ఉండటం కూడా శాస్త్రవేత్తగా జన్మ ధన్యం అవడమే. నోబెల్ గెలుపును మించిన సార్థక్యమది. నూట ఇరవై ఏళ్లలో నలుగురు నోబెల్ ప్రైజ్‌లు 1901లో ప్రారంభం అయ్యాక ఇప్పటì వరకు భౌతికశాస్త్రంలో 114 సార్లు నోబెల్‌ని ప్రకటించారు. 215 మంది విజేతలు అయ్యారు. వీరిలో నలుగురంటే నలుగురే మహిళలు. ఒక నోబెల్ ప్రైజ్‌ను ముగ్గురికి మించి పంచరు. ఆ ముగ్గురి మధ్య కూడా కనీసం రెండు వేర్వేరు ఆవిష్కణలకు ప్రైజ్‌ను పంచడం ఉంటుంది. ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో ఇద్దరు పురుషులతో కలిసి బ్లాక్‌హోల్స్‌పై చేసిన పరిశోధనలకు ఆండ్రియా గెజ్ నోబెల్‌ను గెలుపొందారు. 1901లో విల్హెల్మ్ రాంట్జెన్ ఎక్స్–రే కనిపెట్టినందుకు భౌతికశాస్త్రంలో తొలి నోబెల్ గెలుచుకున్న రెండేళ్లకే 1903లో మేరీ క్యూరీ రేడియో ధార్మికతకు నోబెల్ సాధించారు. తర్వాత అరవైఏళ్లకు గానీ ఒక మహిళ భౌతిక శాస్త్రంలో నోబెల్‌ను దక్కించుకోలేకపోయారు. 1963లో మరియా గోపర్ట్ మేయర్ న్యూక్లియర్ స్ట్రక్చర్‌కు నోబెల్ పొందారు. 2018లో డోనా స్ట్రిక్లాండ్ లేజర్ పల్సెస్‌కు నోబెల్ సాధించారు. అయితే ఈ నలుగురు మహిళల్లో విడిగా ఏ ఒక్కరికీ నోబెల్ రాలేదు. నలుగురూ మరో ఇద్దరు పురుషులతో నోబెల్‌ను పంచుకున్నవారే. మొత్తం మీద భౌతికశాస్త్రంలో ఏక విజేతగా 47 మంది నోబెల్‌ను గెలుపొందగా.. ఒకరితో కలిసి 32 మంది, ఇద్దరితో కలిసి 34 మంది నోబెల్‌ను పంచుకున్నారు. యుద్ధపరిస్థితుల కారణంగా 1916, 1931, 1934, 1940, 1941, 1942లలో ఆరుసార్లు నోబెల్‌ను ఇవ్వలేదు. -
యాదాద్రిలో మరో నలుగురు చిన్నారులను కాపాడిన పోలీసులు
-
నాలుగు కెమెరాల హానర్ 9 లైట్..
సాక్షి, న్యూఢిల్లీ: హానర్ కొత్త మొబైల్‌ను లాంచ చేసింది. ఆర్టీఫిషీయల్ ఇంటిలిజెన్స్ వ్యూస్ 10 స్మార్ట్‌ఫోన్‌ను అందించిన వెంటనే కంపెనీ మరో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. మిడ్ సెగ్మెంట్లో హానర్ 9 లైట్ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రెండు వేరియంట్లలో లాంచ్ చేసిన వాటి ధరలు ఇలా ఉన్నాయి. 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999గా, 64జీబీ వేరియంట్ రూ.14,999 గా నిర్ణయించింది. జనవరి 21 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రత్యేకంగా ఇది విక్రయానికి లభిస్తుంది. గ్రే, బ్లూ, బ్లాక్ రంగుల్లో ఇది లభ్యం. కాంపాక్ట్ బాడీ, డ్యుయల్ కెమెరా 0.25 సెకన్లలో అన్‌లాక్ అయ్యే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఏఐ ఆధారిత రియల్-టైమ్ సెన్స్ఆబ్జెక్ట్ రికగ్నిషన్ తమ కొత్త స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలని కంపెనీ ప్రకటించింది. హానర్ 9 లైట్ ఫీచర్లు 5.65 అంగుళాల ఫుల్ హెచ్డీ బెజెల్ లెస్ డిస్ ప్లే ఆండ్రాయిడ్ ఓరియో 8.0 కిరిన్ 695 ఆక్టా కోర్ ప్రాసెసర్ 3 జీబీ/4జీబీ ర్యామ్ 32/64జీబీ స్టోరేజ్ 13+2 ఎంపీ రియర్ కెమెరా 13+2 ఎంపీ సెల్ఫీ కెమెరా 256 జీబీ దాకా విస్తరించుకునే సౌలభ్యం 3000 ఎంఏహెచ్ బ్యాటరీ 9 Lite With Launched in India -
ఆ నలుగురికి బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) కు చెందిన నలుగురు విద్యార్థులు బంపర్ ఆఫర్ కొట్టేశారు. టాప్ కంపెనీలు పాల్గొన్న ప్లేస్మెంట్ కార్యక్రమంలో ఇన్సిస్టిట్యూట్‌కు చెందిన నలుగురు విద్యార్థులు రూ. 95 లక్షల వార్షిక ప్యాకేజీ(150,000 డాలర్లు ) సాధించారు. అలాగే ఏడుగురు విద్యార్థులకు సంవత్సరానికి 80,000 డాలర్ల ప్యాకేజీ సాధించారని వాణిజ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ సాదించారని ఐఐఎఫ్‌టీ ప్రకటించింది. దక్షిణ అమెరికా, థాయ్‌లాండ్, ఆఫ్రికా, సౌత్-ఈస్ట్ ఆసియా దేశాల్లో వీరికి భారీ వేతనంతో ఉద్యోగాలు లభించినట్టు వెల్లడించింది. ముఖ్యంగా బ్రిటీష్ టెలికాం, డిబిఎస్, గోద్రేజ్, హీరో మోటోకార్ప్, మదర్ డైరీ, షాపుర్జీ పల్లోంజి, టెట్రా పాక్, టివిఎస్ మోటార్స్ తదితర కంపెనీలు తమ అంతర్జాతీయ వ్యాపార రంగంలోని వివిధ విభాగాలకు తమ విద్యార్థులను ఎంపిక చేశారని పేర్కొంది. దేశీయంగా రూ.18.27లక్షలు, అంతర్జాతీయంగా రూ.19.23 లక్షలు సగటు వార్షిక వేతనంగా ఉందని తెలిపింది. -
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
-
వడదెబ్బకు నలుగురు బలి
ధర్మవరం: వడదెబ్బకు శనివారం మరో నలుగురు మరణించారు. ధర్మవరం మండలం తుమ్మలలో లక్ష్మమ్మ(76) వడదెబ్బకు గురై మతి చెందినట్లు బంధువులు తెలిపారు. పొలం వద్దకు వెళ్లిన ఆమె ఇంటికి తిరిగొచ్చిన కాసేపటికే ఒంట్లో నలతగా ఉందంటూ నిద్రపోయినట్లు వివరించారు. ఆ తరువాత నిద్ర లేపినా ప్రయోజనం లేదని, నిద్రలోనే ఆమె ప్రాణం విడిచినట్లు కన్నీరుమున్నీరయ్యారు. మతురాలికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మేడాపురంలో మరొకరు.. చెన్నేకొత్తపల్లి(రాప్తాడు) : చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురంలో గంగప్ప(65) అనే కూలీ వడదెబ్బతో మతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గురువారం కూలి పనికి వెళ్లిన ఆయన అస్వస్థతకు గురయ్యాడన్నారు. కుటుంబ సభ్యులు వైద్యం కోసం అనంతపురం తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మతి చెందినట్లు వివరించారు. మతునికి ఇద్దరు కుమార్తెలు, కుమారులు ఉన్నారు. యలగలవంక తండాలో ఇంకొకరు.. బెళుగుప్ప(ఉరవకొండ) : బెళుగుప్ప మండలం యలగలవంక తండాలో రామచంద్రానాయక్(56) వడదెబ్బతో మరణించినట్లు బంధువులు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలసి ఉపాధి పనులకు వెళ్లిన అతను శుక్రవారం నీరసంతో ఇంటికి వచ్చాడన్నారు. ఆ తరువాత వాంతులు చేసుకుంటూ మరింత నీరసించి పోయాడని వివరించారు. శనివారం ఉదయం స్పహ కోల్పోవడంతో వెంటనే 108కు సమాచారం తెలిపారు. అదొచ్చేలోగానే అతను మతి చెందినట్లు తెలిపారు. మతునికి భార్య దేవీబాయి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పిల్లలపల్లిలో బేల్దారి.. బ్రహ్మసముద్రం(కళ్యాణదుర్గం) : బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లిలో రామకష్ణ(38) అనే బేల్దారి వడదెబ్బతో మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఇంటి నిర్మాణ పనుల కోసం స్వగ్రామం నుంచి రాయలప్పదొడ్డి గ్రామానికి వెళ్లిన అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో పని చేయడంతో ఒక్కసారిగా కళ్లు తిరిగి కుప్పకూలి అక్కడికక్కడే మతి చెందినట్లు వివరించారు. విషయం తెలుసుకున్న వైద్యాధికారిణి డాక్టర్ నాగస్వరూప, తహసీల్దార్ సుబ్రమణ్యం, ఏఎస్ఐ వెంకటేశులు, ఆర్ఐ విజయకుమార్, వీఆర్ఓ తిప్పేస్వామి ఘటన స్థలానికి చేరుకున్నారు. మతదేహాన్ని సందర్శించారు. వివరాలడిగి తెలుసుకున్నారు. మతునికి భార్య వరలక్ష్మీ, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. -
వీసీగా నాలుగు లక్ష్యాలను ఎంచుకున్నా
మూడు పూర్తయ్యాయి అనూర్ వార్షికోత్సవ సభలో వీసీ రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన నాడే నాలుగు లక్ష్యాలను ఎంచుకున్నట్టు ఆచార్య ఎం. ముత్యాలునాయుడు తెలిపారు. వాటిని సాధించడంలో నన్నయ యూనివర్సిటీ సిబ్బంది అంతా ఒకే కుటుంబంలా త్రికరణశుద్ధితో పనిచేశారంటూ అభినందించారు. యూనివర్సిటీ ఆవిర్భావ దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఆ సందర్భంగా వీసీ మాట్లాడుతూ నాలుగు లక్ష్యాలలో మొదటిది తెలుగు రాష్ట్రాలలోనే అతిపెద్ద యూనివర్సిటీగా అనూర్ అందరికీ తెలిసేలా చేయడం, రెండోది యూనివర్సిటీకి నిధులు సమీకరించడం, మూడోది అనూర్ పరిధిలో ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ కళాశాలలను బదిలీ చేయడం అని తెలిపారు. ఈ మూడు లక్షా ్యలు పూర్తయ్యాయన్నారు. నాల్గో లక్ష్యంగా ఎంచుకున్న 12 బీ గుర్తింపు కోసం ప్రయత్నించామని, గురు, శుక్రవారాలలో యూజీసీ కమిటీ సభ్యులు కూడా ఇక్కడకు వచ్చి, యూనివర్సిటీ పరిస్థితులను, సాధించిన ప్రగతిని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారన్నారు. శ్రీకృష్ణదేవరాయులు యూనివర్సిటీ అధ్యాపకులు ఆచార్య పీఎల్ శ్రీనివాస్ మాట్లాడుతూ సమష్టి కృషితో ఏదైనా సాధించవచ్చని నన్నయ యూనివర్సిటీ సిబ్బంది నిరూపించారన్నారు. 2006 ఏప్రిల్‌లో ప్రారంభమైన నన్నయ యూనివర్సిటీ నేటి వరకు ఎదుర్కొన్న వివిధ సమస్యలు, సాధించిన విజయాలను పలువురు వక్తలు ప్రస్తావించారు. మొక్కలు నాటారు.. అనూర్ ఆవిర్భావ దినోత్సవంతోపాటు ప్రపంచ ధరిత్రీ దినోత్సవం కూడా కావడంతో ఉపకులపతి ఆచార్య ముత్యాలునాయుడు యూనివర్సిటీ ఆవరణలో మొక్కలు నాటారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎ. నరసింహరావు, డిప్యూటీ కమిషనర్ కృష్ణారెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్ ఎస్. లింగారెడ్డి, డీన్ ఆచార్య ఎస్. టేకి, ప్రిన్సిపాల్స్ ఆచార్య కేఎస్ రమేష్, ఆచార్య పి. సురేష్‌వర్మ, డాక్టర్ ఎ. మట్టారెడ్డి, డాక్టర్ వై. శ్రీనివాసరావు, డాక్టర్ పి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
తమిళ కూలీల నిర్బంధం
మైదుకూరు టౌన్ : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని పాతపాళెంలో మంగళవారం ఆ గ్రామస్తులు నలుగురు తమిళ కూలీలను నిర్బంధించి పోలీసులకు అప్పగించారు. అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు తమిళ కూలీలను స్మగ్లర్ తీసుకొచ్చి జాతీయ రహదారి పక్కన వదిలేసి వెళ్లగా, వారికి ఎటుపోవాలో అర్థం కాక సమీపంలో ఉన్న పాతపాళెం గ్రామంలో వరిచెత్తలో దాక్కొన్నారు. బ్రహ్మయ్య అనే గ్రామస్తుడు వరిచెత్త వామి వేస్తుండగా చెత్త కదులుతుండటంతో కేకలు వేసి స్థానికులను పిలిచాడు. గ్రామస్తులు గుమికూడి వరిచెత్తలో దాక్కొని ఉన్న నలుగురు తమిళ కూలీలను నిర్బంధించి పోలీసులకు అప్పగించారు. కూలీల వద్ద ఉన్న సెల్ ఫోన్ల ఆధారంగా వారిని ఇక్కడికి ఎవ్వరు తీసుకొచ్చారు అనే విషయంపై ఆరా తీస్తున్నట్లు సీఐ తెలిపారు. ఈ ప్రాంతంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. -
రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి
వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. పలువురు గాయపడ్డారు. మృతుల కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. ఆటోలోంచి పడి కూలీ.. అనంతపురం జిల్లా యల్లనూరు మండలం సింగవరం నుంచి ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో ఓబులేసు తన సొంత ఆటోలో మరో ముగ్గురు కూలీలను ఎక్కించుకొని వైఎస్సార్‌జిల్లా పెద్దకుడాల గ్రామానికి చీనీ చెట్లలో కత్తిరింపు పనులకు వస్తున్నారు. లింగాల మండల కేంద్రం దాటగానే సడన్‌బ్రేక్ వేయడంతో కూలీ పెద్దగుర్రప్ప (60) ఆటోలోంచి ఎగిరి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడి వైద్యులు తిరుపతి స్విమ్స్‌కు రెఫర్ చేశారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో ఇంటికి తీసుకొస్తుండగా సోమవారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. వైద్యం కోసం వెళుతూ కానరాని లోకాలకు... గంగవరం (చిత్తూరు) : ధర్మవరం పట్టణానికి చెందిన లింగమూర్తి (60) బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఈయనకు వైద్యం చేయించేందుకని బంధువులు కిశోర్, నారాయణస్వామి, శివమూర్తి, మంజునాథ్‌లు వేలూరు సీఎంసీ ఆస్పత్రికి ఆదివారం రాత్రి కారులో బయల్దేరారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం మల్లేరు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో కారు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో లింగమూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన నలుగురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారంతో ఎస్ఐ దిలీప్‌కుమార్ అక్కడికి చేరుకుని క్షతగాత్రులను పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. -
హత్య కేసులో నలుగురి అరెస్టు
ధర్మవరం అర్బన్: బైక్‌తో ఢీకొట్టాడనే అక్కసుతో స్కూటరిస్టును చితకబాది ఆ తరువాత హత్య చేసిన కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ధర్మవరం డీఎస్పీ వేణుగోపాల్ తెలిపారు. వాటి వివరాలను ఆయన విలేకరులకు బుధవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం... ధర్మవరంలోని మహాత్మగాంధీ కాలనీకి చెందిన సాకే నరసింహులు, వడ్డే గోగుల రమేశ్, గొల్లవాండ్లపల్లికి చెందిన గొల్ల లక్ష్మినారాయణ, మోటుమర్ల గ్రామానికి చెందిన బోయకనుమ మల్లికార్జున స్నేహితులు. ఈ నెల ఒకటిన రాత్రి మద్యం తాగి లక్ష్మీచెన్నకేశవపురం సమీపంలో తిరుగుతున్నారు. అదే ప్రాంతానికి చెందిన చిన్న కదిరప్ప టీవీఎస్‌లో వస్తూ నరసింహులు అనే వ్యక్తిని ఢీకొన్నాడు. దీంతో ఆగ్రహించిన నరసింహులు కదిరప్పను తిట్టాడు. వారి మధ్య మాటామాటా పెరగడంతో చివరకు పైన పేర్కొన్న నలుగురూ కలసి కదిరప్పను చితకబాదారు. అంతటితో ఆగక అతని టీవీఎస్‌లోనే బలవంతంగా రైల్వేట్రాక్ వద్దనున్న బీడు భూమిలోకి తీసుకెళ్లి చితకబాదారు. అనంతరం కదిరప్పను తీసుకొచ్చి లక్ష్మిచెన్నకేశవపురంలోని కరుణాకర్ జనరల్ స్టోర్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. 2వతేదిన ఆదివారం తెల్లవారుజామున జనరల్ స్టోర్ నిర్వాహకుడు కరుణాకర్ తీవ్రగాయాలతో ఉన్న కదిరప్పను గమనించి వెంటనే 108కు సమాచారం అందించారు. 108 అంబులెన్స్ వచ్చేలోపు కదిరప్ప మృతి చెందాడు. 4న నిందితులు వీఆర్ఓ రాజశేఖర్ ఎదుట హాజరై నేరం అంగీకరించారు. వారిని సీఐ ఎదుట హాజరుపరిచారు. ఆ తరువాత అరెస్టు చూపారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా, రిమాండ్‌కు ఆదేశించారు. -
సిప్లాకు యూఎస్ఎఫ్డీఏ షాక్.. షేర్ ఢమాల్
హైదరాబాద్: దేశీయ డ్రగ్ మేకర్ సిప్లా లిమిటెడ్ గోవాలోని ప్లాంట్లలో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ భారీ ఎత్తున లోపాలను గుర్తించినట్టు వచ్చిన వార్తలతో స్టాక్ మార్కెల్లో సిప్లా షేర్లు పతనమయ్యాయి. ఐదు ప్లాంట్లలో అబ్జర్వేషన్స్(483) నమోదు చేసినట్లు వార్తలు మదుపర్లు ఆందోళన లోకి నెట్టాయి దీంతో సిప్లా కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దాదాపు 7 శాతానికి పైగా పతనమైంది. అయితే గోవాలో ఉన్న మూడు తయారీ ప్లాంట్లలో యూఎస్ఎఫ్డీఏ నిర్వహించిన ఆడిట్ ముగిసిందనీ సిప్లా స్టాక్ ఎక్సేంజ్ వివరణలో తెలిపింది. ఈ తనిఖీల్లో భాగంగా నాలుగు లోపాలను గుర్తించినట్లు(అబ్జర్వేషన్స్) సిప్లా తెలియజేసింది. ఈ పరిశీలనలు స్వభావాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. కానీ ఇది సాధారణ విధానపరమైన పరిశీలన మాత్రమేనని వివరణ ఇచ్చింది. దీనిపై తమ స్పందనను తెలియ చేసినట్టు పేర్కొంది. ప్రమాణాలను పాటించడంలో విఫలమైన పక్షంలో వార్నింగ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించిందని సిప్లా వివరించింది. కేవలం మూడు ప్లాంట్లలో 483లు మాత్రమే జారీ అయినట్లు వివరణ ఇవ్వడంతో సిప్లా షేర్ నష్టాల నుంచి కొద్దిగా తెప్పరిల్లింది. -
కొనేవారేరీ!
వర్షాలతో మక్క రైతుకు కష్టం మార్కెట్లో మొలకెత్తిన మక్కలు ముఖం చాటేస్తున్న వ్యాపారులు నర్సంపేట : నాలుగు రోజులుగా కురిసిన వర్షాలు మక్క రైతులకు అపారనష్టాన్ని మిగిల్చాయి. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేసిన రైతులకు చేతికందే సమయంలో వర్షాలు కురవగా తడిసి ముద్దయి మక్కలు మొలకెత్తాయి. అయితే తడిసిన మక్కలను కూడా కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినప్పటికీ వ్యవసాయ మార్కెట్ల వద్ద వేలాది క్వింటాళ్లు విక్రయించేందుకు వచ్చిన రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. మొక్కజొన్న పంటకు ఎకరాకు రూ.7 నుంచి రూ,15 వేల వరకు పెట్టుబడులు అప్పులు చేసి పెట్టారు. కానీ గత నెలలో ఎండల తీవ్రత వల్ల 50శాతం ఎండిపోగా, నల్లరేగడి భూముల్లో మిగిలిన 30శాతం దిగుబడి రాలేదని రైతులు వాపోయారు. మిగిలిన పంట మక్కలను మార్కెట్లో విక్రయించేందుకు తీసుకురాగా ఎడతెరిపిలేని వర్షాలకు వరదలో వేలాది క్వింటాళ్లు కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మక్కల ను కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముఖం చాటేస్తున్నారని రైతులు చెబుతున్నారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో వారం రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు కన్నెత్తి చూడటంలేదు. దీంతో పెద్ద మొత్తంలో మక్కలు మార్కెట్లోనే మొలకెత్తి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పత్తికి పొంచి ఉన్న ముప్పు జిల్లాలో వరి పంట తర్వాత పత్తి పంట అధిక విస్తీర్ణంలో సాగైంది. ఇటీవల కురిసిన వర్షాలతో పత్తి చేలలో నీరునిలిచి జాలువారింది. వర్షాల వల్ల పూతదశలో ఉన్న పత్తి పంటలో 50శాతం వరకు పూత, పిందెలు రాలి రైతులకు నష్టాలను కలిగించింది. ఖరీఫ్ ప్రారంభం నుంచి అనుకూలంగా ఉన్న కాలం ఒక్కసారిగా నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు రావడంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాని దయనీయ స్థితి నెలకొంది. చెరువులు, కుంటలు తెగినచోట, అలుగుపడిన చోట వరిపంటలో ఇసుకమేటలు వేసి నష్టాన్ని కలిగించింది. దుగ్గొండి మండలంలోని పలు గ్రామాల్లో 8వేల 500 ఎకరాల్లో పత్తిపంట సాగు చేయగా 5వేల ఎకరాల్లో తుపాన్ ప్రభావంతో పంట నష్టపోయింది. అధికారులు 1600 ఎకరాల్లో నష్టపోయినట్లు నివేదికలు ఇచ్చారు. నష్టపోయిన ప్రతీరైతుకు పరిహారం అందించడంతో పాటు రబీలో వేరుశనగ, మక్కజొన్న విత్తనాలు ఉచితంగా సరఫరా చేయాలని పత్తిరైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్‌కు వచ్చి వారమైంది – నాంపెల్లి లక్ష్మి, పాతముగ్దుంపురం, నర్సంపేట ఎకరం భూమిలో మక్కజొ న్న పంట సాగు చేసిన. పం టలు చేతికి వచ్చినయి. అ మ్ముకోవడానికి మార్కెట్‌కు నేను, మా ఆయన వారం రో జుల కిందట తీసుకువచ్చి నం. మ్యాచర్ రాలేదంటే రోడ్డుపైనే ఆరబోసుకున్నం. వర్షాలు వచ్చి మక్కజొన్నలు మొత్తం తడిసిపోయినయి. అధికారులు మమ్మల్ని ఆదుకోవాలి. ఎనిమిది రోజులుగా ఇబ్బంది – భూక్య రాంసింగ్, ఈర్యతండా, చెన్నారావుపేట మార్కెట్‌కు 8 రోజుల కిందట అమ్ముకోవడానికి వచ్చాం. మ్యాచర్ తక్కువగా ఉందంటే ఆరబోసుకున్నాం. నాలుగు రోజులుగా వర్షాలు పడుతుండటంతో ఎకరంలో పండిన మక్కలు తడిసిపోయాయి. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి. -
హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు
భువనగిరి అర్బన్ హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ భువనగిరి అదనపు సెషన్స్ జడ్జి సిపి.విందేశ్వరి శుక్రవారం తీర్పు చెప్పినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పూలిమామిడి శశిధర్‌రెడ్డి తెలిపారు. వివరాలు.. భూతగాదాల నేపథ్యంలో 2012వ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో పోచంపల్లి మండలం భీమనపల్లి గ్రామానికి చెందిన గంగదేవి పర్వతాలు దారుణహత్యకు గురయ్యాడు. ఈ కేసులో అదే గ్రామానికి చెందిన ముంత మల్లయ్య, ఇడమోని నర్సింహ, ఉప్పునూతల నర్సింహ, లక్ష్మయ్య, మేకల యాదయ్య, గంగదేవి చంద్రయ్య, కంటి బుచ్చయ్య, మేకల పర్వతాలు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసుల విచారణలో తేలింది. అప్పటి పోచంపల్లి ఎస్ఐ అర్జునయ్య నిందితులపై కేసు నమోదు చేశారు. తదనంతరం చౌటుప్పల్ సీఐ తిరుపతన్న నేర అభియోగపత్రాలను కోర్టులో దాఖలు చేశారు. సాక్షులను విచారించిన అనంతరం ముంత మల్లయ్య, ఇడమోని నర్సింహ, ఉప్పునూతల నర్సింహ, లక్ష్మయ్యపై నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు, రూ.10 జరిమానా విధించినట్లు తెలిపారు. -
మన్యంలో కలవరం
టార్గెట్ ఇన్ఫార్మర్ ∙ చింతూరు: పోలీసులకు ఇన్ఫార్మర్లుగా భావిస్తున్న కొందరిని మావోయిస్టులు కిడ్నాప్ చేయడంతో మన్యంలో కలవరం నెలకొంది. చింతూరు మండలం పేగ గ్రామానికి చెందిన నలుగురు గిరిజనులను మావోయిస్టులు మంగళవారం రాత్రి కిడ్నాప్ చేశారు. చింతూరు మండలంలో పోలీసులకు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నాడంటూ గతనెల 29వ తేదీన లచ్చిగూడెం గ్రామానికి చెందిన చర్చి పాస్టర్ ఉయికా మారయ్యను మావోయిస్టులు హతమార్చిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఘటనాస్థలంలో మావోయిస్టులు ఓ లేఖను వదిలారు. చింతూరు మండలంలోని పేగ, వినాయకపురం, అల్లిగూడెం గ్రామాలకు చెందిన పలువురు గిరిజనులు పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని, వారు తమతీరు మార్చుకోకుంటే కన్నయ్యకు పట్టిన గతే పడుతుందని ఆ లేఖలో హెచ్చరించారు. ఆ లేఖలో ప్రస్తుతం కిడ్నాప్‌కు గురైన వారి పేర్లు కూడా ఉండడంతో లేఖలో పేర్లున్న మిగిలినవారు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. మావోయిస్టులు కిడ్నాప్ చేసిన వారిని ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. తమవారిని క్షేమంగా విడిచిపెట్టాలని మావోయిస్టులను బాధిత కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు. ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న శబరి ఏరియా కమిటీ ఆధ్వర్యంలోనే ఈ కిడ్నాప్ జరిగినట్టు తెలుస్తోంది. కిడ్నాప్ నేపధ్యంలో ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులు కూంబింగ్‌ను ముమ్మరం చేసే అవకాశం ఉంది. దాంతో మరోమారు మన్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తవచ్చు. -
ఎన్కౌంటర్లో నలుగురు మృతి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని నౌగామ్ సెక్టార్లో శనివారం ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్ఓసీ) వద్ద అక్రమంగా భారత్‌లోకి చొరబడటానికి ప్రయత్నించిన ఉగ్రవాదులు.. పెద్ద ఎత్తున కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చొరబాటుదారులు సైతం మృతి చెందారు. ఉగ్రవాదుల చొరబాటుని సమర్థవంతంగా తిప్పికొట్టామని భద్రతాబలగాలు ప్రకటించాయి. అయితే ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని వెల్లడించారు. -
పిల్లలను చంపిన వ్యక్తికి ఉరి శిక్ష!
హౌరాః నలుగురు చిన్నారులను హత్య చేసిన కేసులో ఓ వ్యక్తికి ఉరిశిక్ష పడింది. ఐదేళ్ళ క్రితం తన ముగ్గురు పిల్లలతోపాటు, తన మరదలి కొడుకును కూడా నిర్దాక్షణ్యంగా హత్య చేసినట్లు రుజువు కావడంతో ఉలుబెరియా అడిషనల్ సెషన్స్ జడ్జి సుభాషిష్ ఘోష్ దోషికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చారు. నలుగురు చిన్నారులను దారుణంగా హత్య చేసిన కేసులో 40 ఏళ్ళ ఖురేషీ కి పశ్చిమబెంగాల్ హౌరా జిల్లాలోని కోర్ట్ ఉరి శిక్ష విధించింది. ఐదేళ్ళ క్రితం రైష్ ఖురేషీ తన ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకుతో సహా, తన మరదలి కుమారుడ్ని కూడా నదిలోకి విసిరేసి హత్య చేశాడు. పిల్లలు తనకు పుట్టినవారు కాదన్న అనుమానంతోనే వారిని హతమార్చినట్లు నిందితుడు విచారణలో కోర్టు ముందు అంగీకరించాడు. 2011 నవంబర్ 14న కుటుంబ సభ్యులంతా ఓ పెళ్ళి హడావుడిలో ఉండగా ఖురేషీ తన ముగ్గురు పిల్లల్నీ పిక్నిక్ కు తీసికెళ్ళేందుకు సిద్ధమయ్యాడు. అదే సమయంలో తన మరదలి కొడుకు కూడా తమతో ఉండటంతో ఆ బాలుడ్ని కూడా తన బిడ్డలతో పాటు తీసుకెళ్ళాడు. దామోదర్ నదికి దగ్గరలోని మహిష్రేఖా ప్రాంతంలోకి వెళ్ళిన అనంతరం నలుగురు పిల్నల్నీ నదిలోకి విసిరేసి ఉత్తర ప్రదేశ్ కు పారిపోయాడు. ఖురేషీ కూతుళ్ళు నాలుగేళ్ళ రౌనక్, రెండున్నరేళ్ళ అలిషా, ఆరేళ్ళ కొడుకు షహీద్ తో పాటు, అతడి మరదలి కొడుకు ఆరేళ్ళ హసన్ బాడీలు రెండోరోజు నదీ ప్రవాహంలో కొట్టుకు వచ్చాయి. కొన్నాళ్ళ తర్వాత పిల్లలను నదిలో విసిరేసిన ప్రాంతానికి తిరిగి వచ్చిన ఖురేషీ తానుకూడా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అపస్మారక స్థితిలో కనిపించిన అతడిని ఆస్పత్రికి తరలించగా కుటుంబ సభ్యులు ఖురేషీగా గుర్తించారు. నిందితుడు ఖురేషీని నవంబర్ 21న పోలీసులు అరెస్ట్ చేశారు. 2012 లో కేసును స్వాధీనం చేసుకున్న సీఐడీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నాలుగు కొత్త సర్వీసులు
హిందూపురం అర్బన్ : హిందూపురం ఆర్టీసీ డిపో నుంచి నాలుగు కొత్త సర్వీసులు ప్రారంభించినట్లు ఆర్టీసీ డీఎం గోపినాథ్ ఆదివారం తెలిపారు. తెల్లవారుజాము 4.30 గంటలకు హిందూపురం–కర్నూలు, 0ఉదయం 7.30 గంటలకు హిందూపురం–తిరుపతికి సర్వీసులు నడుస్తున్నాయన్నారు. తర్వాత హిందూపురం–విజయవాడకు 4 గంటలకు హైటెక్ బస్సును నడిపిస్తున్నట్లు ∙చెప్పారు. ఈ బస్సు కదిరి, పులివెందుల మీదుగా విజయవాడకు చేరుకుంటుందన్నారు. వీటికి రిజర్వేషన్ సదుపాయం కూడా ఉందని వివరించారు. -
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. పీఏ పల్లి మండలం చినకమర్రిగేటు వద్ద బైక్‌పై వెళ్తున్న నలుగురు యువకులను వేగంగా వచ్చిన ఇన్నోవా ఢీకొంది ఈ దుర్ఘటనలోనలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా మల్లేపల్లి నుంచి మునావత్ తండాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను లక్పతి(35), నెహ్రు(25), భాస్కర్(26) శివ(22)లుగా గుర్తించారు. మృతదేహాలను దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు నార్కెట్‌పల్లి మండలం ఎల్లారెడ్డి గూడెం వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ముందు వెళుతున్న ఇన్నోవాను వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు. ఇకమృతదేహాలను నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుల వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి
-
సత్తా చాటిన నలుగురు అమ్మాయిలు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ విమెన్ కాలేజీ కి చెందిన నలుగురు విద్యార్థినులు మరోసారి తమ సత్తా చాటారు. తమ అత్యుత్తమ ప్రతిభతో ఓ విదేశీ కన్సల్టింగ్ ప్రాజెక్ట్ ఇంటర్న్ షిప్ కు ఎంపికయ్యారు. బ్రెజీలియన్ కంపెనీ ఎంబ్రాకో అందించే రెండు లక్షల ఇంటర్న్‌షిప్ ను గెల్చుకున్నారు. ఈ ఏడాది సమ్మర్ ఇంటర్న్ షిప్ పేరుతో అందించే అత్యధిక రూ 2 లక్షల పారితోషికాన్ని అందుకున్నారు. ఎల్ఎస్ఆర్ మహిళా కాలేజీ స్టూడెంట్స్ అదితి మిశ్రా(బీకామ్), దెబోలినా దత్తా (ఎకనామిక్స్),ప్రేరణా గ్రోవర్ (స్టాటస్టిక్స్ ) అయూషి సేథ్ (జర్నలిజం) ఈ ఇంటర్న్ షిప్ కు ఎంపికయ్యారు. కన్సల్టింగ్ ప్రాజెక్ట్ లో భాగంగా భారతదేశానికి చెందిన విద్యార్థులను మొదటిసారి ఎంపిక చేశామని సంస్థ ఆసియా ఫసిపిక్ రీజియన్ డైరెక్టర్ అరుప్ మజుందార్ తెలిపారు. దేశం నుంచి మరింత కొలాబరేషన్స్ కోసం చూస్తున్నామన్నారు. కాగా ఇప్పటికే ఎల్ఎస్ఆర్ కాలేజీ 97 మంది అమ్మాయిలు ఇతర సంస్థలనుంచి ఇంటర్న్‌షిప్ ను అందుకున్నారు. మరో 300 మంది ఎర్నెస్ట్ అండ్ యంగ్, జెఎస్డబ్ల్యు, కేపీఎంజీ,హాన్నోవర్ రే తదితర సంస్థల్లో ఇంటర్న్ షిప్ పూర్తి చేయడం విశేషం. -
కుప్పకూలిన విమానం..నలుగురి మృతి
హూస్టన్: అమెరికాలో ఓ చిన్నవిమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో నలుగురు మరణించారని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. నలుగురితో బయలుదేరిన సింగిల్ ఇంజీన్ పీఏ- 32 ప్రయివేట్ హూస్టన్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే జనావాసాలపై కుప్పకూలింది. శుక్రవారం సాయంత్రం వెస్ట్ హూస్టన్ విమానాశ్రయంనుంచి గాల్లోకి లేచిన కొద్ది సేపటికే నేలపై పడిపోయి పూర్తిగా ధ్వంసమైంది. అయితే మంటల్లో చిక్కుకున్న విమానంనుంచి చిన్నచిన్న పేలుళ్లను గమనించామని ప్రత్యక్ష సాక్షులు కొంతమంది చెప్పారు. మృతులను ఇంకా గుర్తించలేదని, ప్రమాదానికి కారణాలను విచారిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. దర్యాప్తు ప్రారంభించామన్నారు. -
నలుగురు రంగారెడ్డి జిల్లా కోర్టు ఉద్యోగులు సస్పెండ్
హైదరాబాద్: ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు, జడ్జిలకు ఆప్షన్లు ఇవ్వటం అనే అంశంపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో నలుగురు రంగారెడ్డి జిల్లా కోర్టు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి కోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి సహా.. కార్యదర్శి రంగారెడ్డి, మరో ఇద్దరు ఉద్యోగులను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఇప్పటికే 11 మంది జడ్జిలను సస్పెండ్ చేసిన అంశంలో భారీ ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్న టీ అడ్వకేట్స్ జేఏసీ తాజా సస్పెన్షన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద భారీ ఎత్తున ఆందోళనకు జేఏసీ పిలుపునిచ్చింది. -
ఆ నలుగురిలో గెలిచేది ఎవరు?
న్యూఢిల్లీ : తదుపరి ఆర్బీఐ గవర్నర్‌గా ఎవరు బాధ్యతలు చేపడతారనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. అటు ప్రభుత్వం కూడా అభ్యర్థుల జాబితాను కుదించడంతో భారీ ఉత్కంఠ నెలకొంది. రఘురామ్ రాజన్ గవర్నర్‌గా కొనసాగరని స్పష్టం కావడంతో రాజన్ వారసుడి ఎంపికపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అటు ప్రభుత్వం కూడా ఈ ఎంపికలో తన అభ్యర్థుల జాబితాను కుదించినట్టు సీనియర్ అధికారి రాయిటర్స్ కి చెప్పారు. కొత్త ద్రవ్య విధాన కమిటీ (మానిటరీ పాలసీ కమిటీ)కూడా త్వరలో గవర్నర్ ను ఎంపిక చేస్తుందని తెలిపారు. ప్రధానంగా నలుగురు అభ్యర్థుతో కూడిన జాబితాను ఎంపిక చేశామన్నారు. వీరిలో ముగ్గురు కేంద్ర బ్యాంకు మాజీ, ప్రస్తుత ఉన్నతోద్యోగులు కాగా, మరొకరు స్టేట్ బ్యాంక్ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య . ప్రస్తుత ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్, మాజీ డిప్యూటీ గవర్నర్లు రాకేష్ మోహన్, సుబీర్ గోకర్న్ గవర్నర్ రేసులో ఉన్నారు. ఒకవైపు ఎస్ బీఐ అధిపతి అరుంధతి భట్టాచార్య ఈ పదవికి ఎంపిక కావడం ఖాయమనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. అలాగే ప్రభుత్వం షార్ట్ లిస్ట్ చేసిన జాబితాలో కూడా ఈమె పేరు ప్రముఖంగా ఉండడంతో ఇవి మరింత ఊపందుకున్నాయి. మరోవైపు దేశ ఉన్నత బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధిపతిగా అరుంధతి ఎంపిక పై వస్తున్న ఊహాగానాలపై నెటిజన్లు దాదాపు నెగిటివ్ గా స్పందిస్తున్నారు. ఆమెకు అంత అర్హత లేదనీ, ప్రస్తుత అనిశ్చిత ఆర్థిక పరిస్థితులలో ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టే దక్షత, నైపుణ్యంలేవని వాదిస్తున్నారు. ఒకవేళ ఆర్ బీఐ అత్యున్నత పదివికి అరుంధతి భట్టాచార్య ఎంపిక అయితే ..అరవింద సుబ్రమణియన్, శక్తికాంత్ దాస్లపై విమర్శలు గుప్పించిన బీజేపీ ఎంపీ, సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఎలా స్పందిస్తారు? ఈ నేపథ్యంలో గవర్నర్ రేసు పై అంతకంతకూ సస్పెన్స్ పెరుగుతోంది. మరి దీనికి తెరపడాలంటే తుది నిర్ణయం కోసం వేచి చూడాల్సిందే.. కాగా ప్రస్తుత గవర్నర్ రఘురామ రాజన్ పదవీకాలం ఈ సెప్టెంబర్ లో ముగియనుండటం,అటాగే బ్రెగ్జిట్ పరిణామాల నేపథ్యంలో మార్కెట్లను బలమైన సంకేతాలను అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియ వేగవంతమైంది. అటు తను రెండవసారి ఆర్ బీఐ గవర్నర్ గా కొనసాగనని రాజన్ స్పష్టం చేయడంతో కేంద్ర బ్యాంకు ఉన్నత పదవిని అధిరోహించే అభ్యర్థుల రేస్ మొదలైంది. వీరిలో బలంగా వినిపించిన ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ పేర్లను తొలగించడం విశేషంగా మారింది. -
ట్రాక్టర్ బోల్తా.. నలుగురు మృతి
దండేపల్లి: ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామం వద్ద బుధవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. విద్యుత్ స్తంభాల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడటంతో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మృతిచెందారు. మృతులు కౌతాళం గ్రామానికి చెందినవారని తెలుస్తోంది. ప్రమాదస్థలంలో ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏపీ ఎంసెట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థుల హవా
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలలో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. టాప్ టెన్ ర్యాంకుల్లో నాలుగు తెలంగాణ విద్యార్థులకే దక్కాయి. రంగారెడ్డి జిల్లా నుంచి ముగ్గురు విద్యార్థులు టాప్‌టెన్‌లో చోటు దక్కించుకోగా.. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఓ విద్యార్థి టాప్ టెన్‌లో నిలిచాడు. టాప్‌టెన్‌లో నిలిచిన విద్యార్థులు వీరే.. మొదటి ర్యాంక్- వంశీకృష్ణారెడ్డి రెండో ర్యాంక్- లక్ష్మీనారాయణ మూడో ర్యాంక్- విఘ్నేష్ రెడ్డి నాలుగో ర్యాంక్- ప్రశాంత్ రెడ్డి ఐదో ర్యాంక్- గౌతమ్ ఆరో ర్యాంక్- చేతన్ సాయి ఏడో ర్యాంక్- సాయితేజ ఎనిమిదో ర్యాంక్- జార్జ్ తొమ్మిదో ర్యాంక్- సంజీవ్ పదో ర్యాంక్- జయకృష్ణసాయి ఫలితాల్లో టాప్‌టెన్‌లో నిలిచిన వారంతా అబ్బాయిలే కావటం గమనార్హం. గతేడాదితో పోలిస్తే ఈసారి 10 శాతం ఉత్తీర్ణత తగ్గింది. నీట్‌ను తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించిన నేపథ్యంలో మెడికల్ ఫలితాలను నిలిపేస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. -
కారు బోల్తా.. నలుగురికి తీవ్రగాయాలు
చింతపల్లి: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రం సమీపంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు చింతపల్లి సమీపంలోకి చేరుకోగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురికి తవ్రగాయాలు కాగా.. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి
తెలంగాణలో ఆదివారం జరిగిన వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. వరంగల్ జిల్లాలోని రఘునాధపల్లి మండలం గోవర్థనగిరిలో ఆర్టీసీ బస్సు, వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఘటనలో మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలం చంద్రాయణిగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. -
తీహార్ జైల్లో ఖైదీ హత్య
న్యూఢిల్లీ: అత్యంత కట్టుదిట్టమైన తీహార్ జైల్లో ఖైదీల మధ్య ఘర్షణ, హత్యలు ఆందోళన కలిగిస్తోంది. అండర్ ట్రయల్ ఖైదీని తోటి ఖైదీని హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. హై సెక్యూరిటీ వుండే జైలు నెం.8 లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సెల్లో ఉండగానే దీపక్ (29) పై నలుగురు ఖైదీలు దాడి చేసి దారుణంగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. హత్య, దొంగతనం లాంటి కేసుల్లో దోషిగా తేలిన దీపక్ 2008 సం.రం నుంచి తీహార్ జైల్లో అండర్ ట్రయిల్ ఖైదీగా ఉంటున్నాడు కిటికీ ఊచలను మారణాయుధాలు మలుచుకున్న ఖైదీలు పథకం ప్రకారం దాడికి తెగబడినట్టు తెలుస్తోంది. మన్‌ప్రీత్, జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న సత్పాల్ సహా మరో ఇద్దరికి ఈ కేసులో సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. నిందితుల్లో ఒకడైన మన్‌ప్రీత్ గతంలో ఒక ఖైదీని హత్య చేసినట్టుగా జైలు పీఆర్వో ప్రసాద్ తెలిపారు. వీరు తరచూ జైలు నిబంధనలను అతిక్రమిస్తూ గొడవలకు దిగేవారని చెప్పారు. ఈ నేపథ్యంలో వారిపై అనేక క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఈ సంఘటనపై హరినగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదుచేశాన్నారు -
ఆ నలుగురు !
బంధాలు, బంధుత్వాలు ఉన్న వారు మరణిస్తే వారి అంత్యక్రియలు బంధువులు, కుటుంబ సభ్యులు చేస్తారు. ఇది సాధారణం. మరి ఎలాంటి ఆదరణా లేకుండా.. అభాగ్యులుగా ఉండి చనిపోతే పరిస్థితి ఏమిటి ? భౌతిక కాయాన్ని ఎవరు తీసుకెళతారు..? అంత్య క్రియలు ఎవరు చేస్తారు ? అంతిమ సంస్కారాలు నిర్వహించేదెవరు ? మృతులెవరో తెలియకుండా బరువు మోసేది ఎవరు..? ఈ ప్రశ్నలకు సమాధానం ఆ నలుగురు. చిత్తూరులో ఓ మహిళ, మరో ముగ్గురు కలిసి చేస్తున్న సేవల కథాంశం ఈ ఆదివారం ప్రత్యేకం... -చిత్తూరు (అర్బన్) చనిపోయింది ఎవరో తెలియదు. ఎలాంటి బంధుత్వమూ ఉండదు. అయితేనేం.. మేమున్నామంటూ ఒకటవుతారు. చనిపోయిన అనాథలు, అభాగ్యులకు దగ్గరుండి అంత్యక్రియలు చేస్తారు. అది కూడా తమతో బాగా కలిసిమెలిసి.. పరి చయమున్న వ్యక్తే చనిపోయినట్లు భావించి వారి ఆత్మ సైతం ఆనందపడేలా చేస్తారు. వాళ్లే చిత్తూరు నగరానికి చెందిన కంద, ధనలక్ష్మి, రామభద్ర, మధుబాబు. ఈ నలుగురి వృత్తులు వేర్వేరు. వీరితో పాటు రవీంద్రారెడ్డి, శిఖామణి, మురుగ, షణ్ముగం, వినాయగం, రమేష్ తదితరులు అందరూ ఒక్క చోటుకు చేరి ‘మాతృసేవా సమితి’ పేరిట ఓ చిన్న సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అనాథగా మృతిచెందిన వారిని గుర్తించి అంత్యక్రియలు చేయడమే వీరు ప్రవృత్తిగా చేసుకున్నారు. సంతపేటలో అనాథ శవాన్ని ఉంచి సొంత బంధువులా అంతిమ వీడ్కోలు పలికి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ధనలక్ష్మి: బజారువీధిలో ఉన్న వినాయకుని గుడి పక్కనున్న సందులో పూల వ్యాపారం చేస్తుంటుంది. తొలుత కంద చేస్తున్న సేవలు విని తానూ అనాథ శవాల అంత్యక్రియల్లో పాలు పంచుకోవాలని సంకల్పించింది. అంత్యక్రియలకు, మృతదేహాన్ని తీసుకెళ్లే బండిని అలంకరించడానికి ఆమె పూలు ఇస్తున్నారు. ఇంకా అత్యక్రియలకు అవసరమైన మేరకు సాయపడుతున్నారు. రామభద్ర: చనిపోయిన వారిని కొద్ది సేపు సంతపేటలోని మాతృ సేవా సమితి కార్యాలయం వద్ద ఉంచుతారు. స్థానికులు ఇక్కడికి వచ్చి మృతదేహం వద్ద నివాళులర్పిస్తారు. వాన, ఎండలో భౌతికకాయానికి ఎలాంటి ఆటంకం కలగకుండా రామభద్ర చర్యలు తీసుకుంటారు. తాను వ్యాపారానికి ఉంచుకునే షామియానాను మాతృసేవా సమితి కార్యాలయం వద్ద కాసేపు వేసి నలుగురికీ నీడ కల్పిస్తుంటారు. మధుబాబు: మృతదేహానికి సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లలో మధుబాబు ముందుంటారు. మహిళ చనిపోతే చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ అందిస్తారు. పురుషులు చని పోతే పంచె, చొక్కా ఇతర వస్తువులు ఉచితంగా అందజేసి తోడ్పాటునిస్తున్నారు. కంద: చిత్తూరులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కరుణాకర్ అనే కంద మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. నగరంలో ఎక్కడ అనాథ శవం కనిపించినా సమాచారం కంద సెల్‌ఫోన్ (నెంబర్ -9391665281)కు వచ్చేస్తుంది. ఇలా ఫోన్ రాగానే అనాథ శవాన్ని ఓ బండిలో ఉంచుకుని పద్ధతి ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. దాదాపు దశాబ్దకాలంగా ఆయన చేస్తున్న సేవలకు స్నేహితులు, చుట్టుపక్కల వారు చేతులు కలిపారు. అనాథ శవాల అంత్యక్రియలకు తోచిన రీతిలో ఒక్కొక్కరు చేయూత అందిస్తున్నారు. -
ఇంటికి నిప్పు.. నలుగురు సజీవదహనం!
-
ఇంటికి నిప్పంటుకుని నలుగురు సజీవదహనం
భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం కొవ్వాడ అన్నవరంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటికి నిప్పంటుకుని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనమయ్యారు. మృతులు మార్తాల ప్రకాశ్ (56),రాజమణి,(45),దేవరాజు(19),వంశీ (13) ఇంటి బయట తాళాలు వేసి పెట్రోలు పోసి తగలబెట్టిన దుండగులు . ఈ ప్రమాదం పై అనేక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కంటి చూపు లేదు కానీ జీవితం మీద ఆశ
-
తెల్లారిన బతుకులు
శంషాబాద్, న్యూస్‌లైన్ : తెల్లవారకముందే వారి జీవితాలు తెల్లారిపోయాయి. రాత్రి కుటుంబీకులతో మాట్లాడి నిద్రలోకి జారుకున్న కార్మికులు అంతలోనే కానరాని లోకాలకు తరలిపోయారు. నలుగురు కార్మికుల సజీవ దహనంతో శంషాబాద్ ఉలిక్కిపడింది. ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్న చందంగా ఈ దుర్ఘటనలో కంపెనీ యాజమాన్యం, అధికారులు పాలుపంచుకున్నారు. అనుమతి లేని పరిశ్రమలపై దాడులు చేయాల్సిన అధికారులు మిన్నకుండిపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడే నేతలు మీడియా ప్రచారం కోసం ప్రగల్భాలు పలికి తర్వాత పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. గగన్‌పహాడ్, సాతంరాయి పారిశ్రామిక వాడలో అనుమతుల్లేని పరిశ్రమల కోకొల్లలు. గురువారం తెల్లవారుజామున అశ్రీత రబ్బరు పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో నలుగురు బీహారీ కార్మికులు సజీవ దహనమవడంతో శంషాబాద్‌లో ఆందోళన నెలకొంది. రసాయనాలు సరఫరా చేసే పైపులైన్ లీకేజీ అవడంతో మంటలు ఎగిసిపడి ప్రమాదం చోటుచేసుకుంది. కన్నెత్తి చూడని అధికారులు అశ్రీత పరిశ్రమలో అన్నీ నిబంధనలకు విరుద్ధమే. ఈ కంపెనీకి పీసీబీ అధికారుల అనుమతి లేదు. సకాలంలో అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకుంటే నాలుగు ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి కావు. 15 రోజుల క్రితం స్థానికంగా లియో ఫ్లైవుడ్ పరిశ్రమలో రసాయన రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో త్రుటిలో నలుగురికి ప్రాణాపాయం తప్పింది. ఆయిల్ పరిశ్రమల నుంచి వచ్చే వరిపొట్టుతో గగన్‌పహాడ్ వాసులు కూడా ఊపీరి పీల్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను ఇక్కడి నుం చి తరలించాలని రెండేళ్ల కిందటే నోటీసులు జారీ అయినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ప్రాణాలకు వెల.. ఇక్కడి పరిశ్రమల్లో ఎక్కువ మంది బీహార్, ఒడిశా కార్మికులు పనిచేస్తున్నారు. కంపెనీలో తరచూ ప్రమాదాలు జరిగి ప్రా ణాలు కోల్పోతే యాజమాన్యం ఎంతోకొంత పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. పరిశ్రమల యజమానులకు కొందరు ఖాకీలు సహకరిస్తుండటంతో ప్రమాదాలు నిత్యకృత్యం అవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కంపెనీ యజమాని అరెస్టు.. కంపెనీ యజమాని కైలాష్ అగర్వాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ ఠాణాకు తరలించే సమయంలో కార్మిక సంఘాలు అడ్డుపడ్డాయి. మృతుల కుటుంబాలకు రూ. 15 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు చెల్లిస్తానని యజమాని కైలాష్‌అగర్వాల్ ఆందోళనకారులను హామీ ఇచ్చారు. అనంతరం అతడిని పీఎస్‌కు తరలించారు. నలుగురి సజీవ దహనం సంఘటనతో కోపోద్రిక్తులైన గగన్‌పహాడ్ వాసులు స్థానికంగా ఉన్న ఆయిల్ పరిశ్రమలపై దాడులు చేశారు. కొన్ని వాహనాల అద్దాలను కూడా ధ్వంసం చేశారు. మృతుల్లో ఒకరు జైకిషన్ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్పలో ఉంటున్నాడు. ఈయనకు భార్య గీత, పిల్లలు రవికుమార్, దుర్గ ఉన్నారు. జైకిషన్ బీహార్ నుంచి పదేళ్ల క్రితం వలస వచ్చాడు. 2008లో దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేతులమీదుగా లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్పలో ఇల్లు తీసుకున్నాడు. -
నలుగురి సజీవ దహనం
శంషాబాద్, న్యూస్‌లైన్: రంగారెడ్డి జిల్లా గగన్‌పహాడ్ పారిశ్రామికవాడలో ఆశ్రీత రబ్బరు పరిశ్రమలో గురువారం బాయిలర్ లీకై మంటలు ఎగిసిపడడంతో నలుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. కార్మికులు, స్థానికుల కథనం ప్రకారం.. తెల్లవారుజామున 5.30 గంటలకు పరిశ్రమలోని బాయిలర్ నుంచి యంత్రాల వరకు రసాయనాలను తీసుకెళ్లే థెర్మో పైపులైన్ లీకైంది. కార్మికులు విశ్రాంతి తీసుకునే గదిపై నుంచే ఈ పైపులైన్ ఉండడంతో రేకులు పగిలిపోయి గదిలో రసాయనాలు పడ్డాయి. దీంతో గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో నిద్రిస్తున్న నలుగురు బీహార్ కార్మికులు సందీప్(22) నావల్యాదవ్(40), జోగిందర్ చౌదరి (42), జైకిషన్(45) సజీవ దహనమయ్యారు. కార్మికులు అగ్నిమాపక సిబ్బందికి సవూచారమివ్వగా, ఫైరింజన్లు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి. మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన అనంతరం జైకిషన్ మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. కంపెనీ యజమాని కైలాష్ అగర్వాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యంవల్లే ప్రమాదం జరిగిందని భావించిన గగన్‌పహాడ్ వాసులు ఆగ్రహంతో అక్కడి ఆయిల్ పరిశ్రమలపై దాడులు చేశారు. అంతటితో ఆగకుండా పలు వాహనాలను కూడా ధ్వంసం చేశారు. ఈ దుర్ఘటనపై జిల్లా కలెక్టర్‌ను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నివేదిక కోరినట్లు తెలిసింది.