ఇరాన్‌లోని కష్మార్‌లో భూకంపం సంభవించంది. ఈ విపత్తులో నలుగురు మృతిచెందారు. 120 మంది గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.9గా నమోదయ్యింది. భూకంపం కారణంగా మృతిచెందివారి వారి సంఖ్యను కష్మార్ గవర్నర్ హజతుల్లా షరీయత్మదారి ధృవీకరించారు.
భూకంపం బారినపడి తీవ్రంగా గాయపడిన 35 మంది బాధితులను ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. భూకంపం కారణంగా కష్మార్ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పలు పాత భవనాలు దెబ్బతిన్నాయి. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం భూకంపం 10 కిలోమీటర్ల (ఆరు మైళ్ళు) లోతులో సంభవించింది. ఇరాన్ టెలివిజన్ భూకంపం ఫుటేజీని ప్రసారం చేసింది. దానిలో కొన్ని భవనాలు బీటలువారడం కనిపిస్తుంది. అలాగే కార్మికులు భవన శిధిలాలను తొలగిస్తున్న దృశ్యాలను కూడా చూపించారు.
ఇరాన్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2023లో టర్కీలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించగా, ముగ్గురు మృతిచెందారు. 800 మందికి పైగా జనం గాయపడ్డారు. కాగా 2003లో ఇరాన్‌లో భారీ భూకంపం సంభవించింది. బామ్ నగరంలో 6.6 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపంలో 31వేల మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment