ఆ భూకంపం వాటి ఫలితమేనా?
టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను ఇరాన్ మరింత పరాకాష్టకు తీసుకెళ్తోందా? అందులో భాగంగా తాజాగా అణు పరీక్షలు నిర్వహించిందా? అక్టోబర్ 5న శనివారం రాత్రి ఇరాన్, ఇజ్రాయెల్ భూభాగాల్లో దాదాపుగా ఒకే సమయంలో సంభవించిన భూకంపం ఈ అనుమానాలకు తావిస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10:45 ప్రాంతంలో ఇరాన్‌లోని అరదాన్ నగర సమీపంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత 4.5గా నమోదైంది.
అక్కడికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు అమెరికా భూ¿ౌతిక సర్వే విభాగం ధ్రువీకరించింది. తర్వాత కొద్ది నిమిషాలకే ఇజ్రాయెల్‌లోనూ ప్రకంపనలు కన్పించాయి.యి. ఇది భూకంపం కాదని, కచి్చతంగా భూగర్భ అణు పరీక్షల పర్యవసానమేనని విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. భూకంపం సంభవించింది అణు ప్లాంట్‌కు అతి సమీపంలోనే అంటూ వస్తున్న వార్తలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. భూ కంప కేంద్రం ఉపరితలానికి కేవలం 10 కి.మీ. లోపల ఉండటం చూస్తుంటే భూగర్భ అణు పరీక్షలు జరిగి ఉంటాయని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment