జెరూసలెం: పశ్చిమాసియాలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. లెబనాన్ కేంద్రంగా ఇరాన్ మద్దతుతో పనిచేసే హిబ్బుల్లా మిలిటెంట్ గ్రూపు ఇజ్రాయెల్‌పై దాడులకు సిద్ధమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్‌పై మరోసారి బాంబుల వర్షం కురిపించింది.
ఆదివారం(ఆగస్టు4) తెల్లవారుజామున ఉత్తరగాజాలోని టెంట్ క్యాంప్‌పై జరిగిన దాడుల్లో మొత్తం 18 మంది చనిపోయారు. మరోవైపు ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్ శివార్లలో పాలస్తీనా మిలిటెంట్ ఒకరు జరిపిన కత్తిదాడిలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మరోవైపు ఇజ్రాయెల్‌లోని జనావాసాలపై హిజ్బుల్లా ఏ క్షణమైనా దాడులకు దిగవచ్చని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment