టెహ్రాన్: ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ ఏ క్షణమైనా దాడులకు దిగే అవకాశాలున్నాయని ఇరాన్ అంచనా వేస్తోంది. ఇజ్రాయెల్‌లోని సామాన్య సైనిక స్థావరాలతో పాటు సామాన్య పౌరులు కూడా లక్ష్యంగా దాడులు చేసే అవకాశాలున్నాయి.
తమ సీనియర్ కమాండ్‌ర్ ఫాద్ షుక్ర్ ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందడంతో హెజ్బొల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ లెబనాన్ కేంద్రంగా పనిచేస్తోంది.
ఈ సంస్థకు ఇరాన్ పరోక్ష మద్దతుందన్న ప్రచారం ఉంది. ఒక పక్క హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా హత్య, మరోపక్క హెజ్బొల్లా సీనియర్ కమాండర్ మృతితో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజజ్రాయెల్‌పై ఎలాంటి దాడులు జరిగినా మద్దతిచ్చేందుకు అమెరికా ఇప్పటికే ఫైటర్‌జెట్‌లను పశ్చిమాసియాకు పంపుతుండటం ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది.
Comments
Please login to add a commentAdd a comment