టెల్‌అవీవ్:ఇరాన్ మీద ఇటీవల జరిపిన దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు.ఇరాన్ అణు స్థావరాలపై తాము అక్టోబర్‌లోనే దాడి చేసినట్లు నెతన్యాహు తాజాగా అంగీకరించారు.ఈవిషయాన్ని ఆయన దేశ పార్లమెంట్‌లో వెల్లడించారు.
తాము వాటిని ధ్వంసం చేసినప్పటికీ ఇరాన్ అణు కార్యక్రమం మాత్రం ఆగలేదని ఆయన పేర్కొన్నారు.ఇక ఇదే ఏడాది ఏప్రిల్‌లో తాము చేసిన దాడిలో టెహ్రాన్ చుట్టూ మోహరించిన మూడు ఎస్-300 బ్యాటరీలను ధ్వంసం చేశామని నెతన్యాహు తెలిపారు. మరో మూడు బ్యాటరీలు ఆ దేశం వద్ద ఉండగా అక్టోబర్‌లో చేసిన దాడిలో అవి కూడా ధ్వంసం అయ్యాయన్నారు.
అదే సమయంలో ఇరాన్ తన క్షిపణుల్లో వాడే ఘన ఇంధన తయారీ కేంద్రాన్ని కూడా పేల్చేశామని వెల్లడించారు.ఒకవేళ వీటికి ఇరాన్ ప్రతి దాడులు చేస్తే వాటికి కూడా ఎలా స్పందించాలనే ప్రణాళిక తమ వద్ద ఉందని నెతన్యాహూ తెలపడం గమనార్హం.కాగా, ఇరాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ సైనిక స్థావరాలు ధ్వంసమైన విషయం తెలిసిందే.అయితే దాడుల సమయంలో అణుస్థావరాల విషయం ప్రస్తావనకు రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment