
PhotoCredit:AFP
గాజా: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనాలోని సెంట్రల్ గాజాలో దాడులు చేసింది. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంలో కాల్పుల విరమణ చర్చలు ప్రారంభమవుతున్న వేళ ఇజ్రాయెల్ గాజాలో భీకర కాల్పులకు దిగడం చర్చనీయాంశంగా మారింది.
సెంట్రల్ గాజాలోని నో సైరాట్ ప్రాంతంలో శుక్రవారం వైమానిక దాడులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వైమానిక దాడుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా 25 మంది దాకా తీవ్ర గాయపడినట్లు తెలిపారు. మొత్తంగా గాజాలోని వివిధ ప్రాంతాల్లో కలిపి సుమారు పదుల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది.
ఇదీ చదవండి.. ఇరాన్, ఇజ్రాయెల్ హైటెన్షన్.. భారతీయులకు కేంద్రం అలర్ట్
Comments
Please login to add a commentAdd a comment