Tensions
-
లగచర్లలో మళ్లీ ఉద్రిక్తత
సాక్షి, వికారాబాద్ జిల్లా: దుద్యాల మండలం లగచర్లలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. పారిశ్రామిక వాడ కోసం భూసేకరణలో భాగంగా సర్వే కోసం వచ్చిన అధికారులకు రోటిబండ తండా గిరిజనులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. భారీగా తరలివచ్చిన పోలీసులు వారిని వెళ్లకుండా వారించారు. దీంతో గిరిజనులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. గిరిజనులు ప్లకార్డులు చేతబూని తమ నిరసన తెలిపారు.మా అనుమతి లేకుండా పొలాల్లో సర్వే ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అయితే పోలీస్ పహారా మధ్య అధికారులు సర్వే కొనసాగిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని లగచర్ల, హకీంపేట, పోలేపల్లి, రోటి బండ తండా, పులిచర్లకుంట తండాలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం దాదాపు 13 వందల ఎకరాలు భూసేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మూడు నెలల క్రితం ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లి కలెక్టర్‌తో పాటు పలువురు అధికారులపై గిరిజనులు, రైతులు దాడి చేశారు.ఈ ఘటన సంచలంగా మారిన విషయం తెలిసిందే. అనేక మంది రైతులు జైలు పాలయ్యారు. ప్రస్తుతం వాళ్లు బెయిల్‌పై విడుదలయ్యారు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు పెద్దఎత్తున ఆందోళన చేయటంతో ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటుపై వెనక్కి తగ్గింది. తర్వాత అక్కడే పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయాలని నిర్ణయించి భూసేకణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా గ్రామాల్లో భూసేకరణ కోసం అధికారులు సర్వే నిర్వహిస్తున్నారుఇందులో భాగంగా ఇవాళ రోటిబండ తండాకు అధికారులు సర్వే చేసేందుకు రాగా రైతులు అడ్డుకునే ప్రయత్నం చేయటంతో పోలీసులు భారీగా మోహరించి రైతులను సర్వేవైపు వెళ్లకుండా అడ్డుపడ్డారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. తమకు ఉన్న కొద్దిపాటి వ్యవసాయ పొలం పరిశ్రమల కోసం లాక్కుంటే తాము ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ఎట్టి పరిస్దితుల్లో భూములు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. పోలీసుల నిర్భందంతో సర్వేచేయటంపై మండిపడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే సర్వే నిలిపివేయించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్య మంటున్నారు గిరిజన మహిళలు. -
యూఎస్-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం.. భారత్‌కు లాభం
అమెరికా, చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు(US-China trade tensions) భారత్‌కు కొత్త అవకాశాలను చూపిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా వస్తువులపై అమెరికా సుంకాలు విధించడంతో భారతీయ ఎగుమతిదారుల ఆర్డర్లలో పెరుగుదల నమోదవుతుందని తెలియజేస్తున్నారు. అమెరికా-చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య సంఘర్షణతో భారతదేశం లబ్ధిదారుగా మారుతుందని చెబుతున్నారు.గతంలో ఇలా..గతంలో యూఎస్-చైనాల మధ్య సుంకాల పరంగా నెలకొన్న వాణిజ్య యుద్ధాల సమయంలో భారతదేశం భారీగానే లాభపడింది. ఉదాహరణకు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత హయాంలో ప్రారంభించిన వాణిజ్య యుద్ధం కాలంలో భారత్ అమెరికాకు భారీగానే వస్తువులను ఎగుమతి చేసింది. ఆ సమయంలో అమెరికాకు ఎగుమతి చేసే దేశాల్లో ఇండియా నాలుగో అతిపెద్ద లబ్ధిదారుగా అవతరించింది. ప్రస్తుతం చైనా దిగుమతులపై సుంకాలు విధించడంతో యూఎస్ ప్రత్యామ్నాయ సరఫరాదారులను అన్వేషిస్తోంది. అందులో ప్రధానంగా భారత్‌వైపు మొగ్గు చూపేందుకు అవకాశం ఉంది.ఏయే వస్తువులకు గిరాకీఎలక్ట్రానిక్స్, మెషినరీ, దుస్తులు, తోలు, పాదరక్షలు, ఫర్నిచర్, ఫార్మాస్యూటికల్స్, బొమ్మలు వంటి కీలక రంగాల్లో యూఎస్-చైనా టారిఫ్‌ల వల్ల భారత్ లబ్ధి పొందే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా దిగుమతులతో ముడిపడి ఉన్న అధిక ఖర్చులను నివారించడానికి యూఎస్ కొనుగోలుదారులు భారతీయ కంపెనీలపై దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా భారత్, చైనా రెండింటిలోనూ తయారీ కార్యకలాపాలు కలిగి ఉన్న సంస్థలకు యూఎస్ నుంచి ఆర్డర్లు పెరుగుతాయని భావిస్తున్నారు.ఇదీ చదవండి: త్వరలో జీఎస్టీ శ్లాబ్‌ల సరళీకరణఆర్డర్ల పెరుగుదలఈ పరిణామంపై ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఈఓ) ఎగుమతిదారుల్లో సానుకూల సెంటిమెంట్ ఉందని తెలిపింది. ఇప్పటికే చాలా మంది ఆర్డర్లు పెరిగినట్లు పేర్కొంది. ఈ వ్యవహారం భారత ఎగుమతులను పెంచుతుందని, ఆర్థిక వృద్ధికి, ఉద్యోగాల కల్పనకు దోహదం చేస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే భారత మౌలిక సదుపాయాలు, సులభతర వాణిజ్యం మెరుగుపడాలని తెలియజేస్తున్నారు. ఈ అంశంపై కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ ప్రస్తుత విధానాలు భారతదేశానికి ప్రపంచ వాణిజ్య ఉనికిని పెంచుకోవడానికి అవకాశాన్ని అందిస్తున్నట్లు చెబుతున్నారు. -
అనుకున్నదొకటి.. అయినదొకటి!
ప్రపంచంలోని రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతోంది. ఇటీవల అమెరికా చైనా దిగుమతులపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో చైనా కూడా అందుకు తగ్గట్టుగా ప్రతిస్పందించింది. అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై టారిఫ్‌లు విధిస్తున్నట్లు చైనా స్పష్టం చేసింది. చైనా నుంచి అమెరికా బొగ్గు, ద్రవరూపంలో ఉన్న సహజ వాయువు (ఎల్ఎన్జీ), ముడి చమురు, వ్యవసాయ యంత్రాలు, కొన్ని కంపెనీలకు చెందిన ప్రీమియం కార్లు.. వంటివాటిని బారీగానే దిగుమతి చేసుకుంటోంది. దాంతో భవిష్యత్తులో వీటిపై ప్రభావం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.ఇటీవల అమెరికా విధించిన సుంకాల పెంపునకు ప్రతిస్పందనగా చైనా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. అమెరికా అనుసరించిన సుంకాల పెంపు విధానం ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనలను ఉల్లంఘిస్తుందని, రెండు దేశాల మధ్య సాధారణ ఆర్థిక, వాణిజ్య సహకారానికి విఘాతం కలిగిస్తుందని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. వచ్చే సోమవారం నుంచి ఈ సుంకాల పెంపు అమల్లోకి వస్తుందని చైనా స్పష్టం చేసింది. కొత్త టారిఫ్‌ల్లో బొగ్గు, ఎల్ఎన్జీ ఉత్పత్తులపై 15 శాతం సుంకం, ముడిచమురు, వ్యవసాయ యంత్రాలు, ప్రీమియం కార్లపై 10 శాతం సుంకం విధిస్తున్నట్లు చైనా తెలిపింది. అమెరికాలోకి అక్రమ వలసదారులు, మాదకద్రవ్యాల ప్రవాహాన్ని నిరోధించడంలో విఫలమైన దేశాలను శిక్షించడమే లక్ష్యంగా ట్రంప్ ఇటీవల చైనా వస్తువులపై 10% సుంకం విధిస్తున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: వణికిస్తున్న బంగారం ధర! తులం ఎంతంటే..చైనా అమెరికాకు వాణిజ్య విధానానికి వ్యతిరేకంగా కౌంటర్ టారిఫ్‌లతో పాటు, యాంటీట్రస్ట్ చట్టాలను ఉల్లంఘించారనే అనుమానంతో స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్ గూగుల్‌పై దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తును అమెరికా వాణిజ్య చర్యలకు ప్రతీకార చర్యగా భావిస్తున్నారు. చైనా మార్కెట్లో గూగుల్ ఆధిపత్యానికి చెక్ పెట్టేలా పోటీదారులకు అన్యాయం చేసే ఏదైనా వ్యాపార పద్ధతులను ఉపయోగించిందా అనే దానిపై దర్యాప్తు దృష్టి సాగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాపై సుంకాలు విధిస్తే వాణిజ్యం పరంగా కొంత వెనక్కి తగ్గుతుందని భావించిన అమెరికాకు.. చైనా ఇలా తిరికి టారిఫ్‌లు విధించడం కొంత ఎదురుదెబ్బే అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువుల కోసం యూఎస్ భారత్‌వైపు చూసేలా ప్రయత్నాలు జరగాలని సూచిస్తున్నారు. -
కాంగ్రెస్ మెరుపు ధర్నా.. పటాన్చెరులో ఉద్రిక్తతలు
సంగారెడ్డి, సాక్షి: పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మెరుపు ధర్నా ఉద్రిక్తతలకు దారి తీసింది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పాత కాంగ్రెస్ క్యాడర్ గురువారం నిరసనకు పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలో కాట వర్గీయులు మహిపాల్ దిష్టిబొమ్మను తగలబెట్టాలని చూశారు. అయితే ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్రవాగ్వాదంతో తోపులాట జరిగింది.నిరసనగా.. సీఎం చిత్రపటంతో కొందరు కార్యకర్తలు పోలీసులను దాటుకుని ఎమ్మెల్యే కార్యాలయాన్ని చేరుకున్నారు. ఆఫీస్‌ను ముట్టడించి.. లోపల సీఎం ఫొటో ఉంచారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఉద్రిక్తతల నడుమ.. పటాన్చెరు చౌరస్తా వద్ద భారీగా పోలీసులు మోహరించారు.గత కొంతకాలంగా పటాన్చెరు కాంగ్రెస్‌లో పాత, కొత్త నేతల మద్య పంచాయితీ కొనసాగుతోంది. ఈ పంచాయితీని సర్దుబాటు చేయాలని కాంగ్రెస్ నేతలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అయితే రానురాను ఆ పరిస్థితులు మరింత ముదిరాయి. పార్టీ మారి వచ్చిన గూడెం తన అనుచర వర్గంతో కాంగ్రెస్ నాయకులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో..బొల్లారంలో ఓ కార్యక్రమానికి హాజరైన గూడెం పాత వర్గాన్ని బూతులు తిట్టినట్లు తెలుస్తోంది. దీంతో సేవ్ కాంగ్రెస్ .. సేవ్ పటాన్చెరు స్లోగన్‌తో కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డెక్కారు. గూడెం మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఇవాళ కాంగగ్రెస్ నేతలు మెరుపు ధర్నాకు దిగడం.. పోలీసుల జోక్యం టెన్షన్ వాతావరణం నెలకొంది. -
సిరియాలో మళ్లీ... అంతర్యుద్ధం!
సిరియా మళ్లీ భగ్గుమంటోంది. దేశంలో రెండో అతిపెద్ద నగరమైన అలెప్పో తాజాగా తిరుగుబాటుదార్ల పరమైంది. ప్రభుత్వ సైన్యం, తిరుగుబాటు సేనల మధ్య ఘర్షణ తారస్థాయికి చేరడంతో మళ్లీ అంతర్యుద్ధం రాజుకుంది. 2011 తర్వాత జరిగిన అంతర్యుద్ధంలో సిరియాలో ఏకంగా 3 లక్షల మందికిపైగా జనం మరణించారు. 60 లక్షల మంది విదేశీ బాట పట్టారు. తర్వాత కాస్త ప్రశాంతంగా ఉన్న సిరియాలో ఇలా ఉద్రిక్తతలు పెరగడం తాలూకు మూలాలు ఉక్రెయిన్–రష్యా, ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధాల్లో ఉన్నాయి.2011లో ‘అరబ్ వసంతం’ పేరిట అరబ్ దేశాల్లో ప్రజాస్వామ్య ఉద్యమం ఊపందుకుంది. రాచరికం పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలంటూ జనం వీధుల్లోకి వచ్చారు. ఈజిప్టులో ఈ పోరాటం ఉవ్వెత్తున ఎగిసి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి దారులు ఏర్పడ్డాయి. అది ఇతర అరబ్ దేశాల ప్రజలకూ స్ఫూర్తినిచ్చింది. సిరియా ప్రజలు కూడా నియంతగా అధికారం చలాయిస్తున్న అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పోరుబాట పట్టారు. వాటిని అసద్ ఉక్కుపాదంతో అణచేయడంతో జనం ఆయుధాలు చేతపట్టారు. సైన్యంలో అసద్‌ను వ్యతిరేకించే వర్గం కూడా వారితో చేతులు కలిపింది. అంతా కలిసి తిరుగుబాటుదార్లుగా మారారు. దేశమంతటా వేర్వేరు తిరుగుబాటు దళాలు ఏర్పడ్డాయి. వీటి సిద్ధాంతాలు వేరైనా అసద్‌ను తొలగించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ఉమ్మడి లక్ష్యం. అసద్ అంటే గిట్టని తుర్కియే, సౌదీ అరేబియా, యూఏఈతో పాటు అమెరికా తదితర దేశాలు తిరుగుబాటుదార్లకు అన్ని రకాలుగా మద్దతిస్తున్నాయి. దాంతో సిరియాలో ప్రభుత్వ వ్యతిరేక శక్తులు మరింత బలం పుంజుకున్నాయి. అటు అసద్‌కు మద్దతుగా సిరియా మిత్రదేశాలైన ఇరాన్, రష్యా రంగంలోకి దిగాయి. ఇరాన్ సైన్యంతో పాటు లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లా అసద్ సైన్యానికి అండగా నిలిచాయి. రష్యా ఇచ్చిన యుద్ధ విమానాలతో సిరియా వైమానిక దళానికి కొత్త బలం చేకూరింది. అసద్ సైన్యం, తిరుగుబాటు సేనల మధ్య ఏళ్ల తరబడి భీకర యుద్ధమే జరిగింది. ఉగ్ర సంస్థలకు చేదు అనుభవం సిరియా పరిణామాలను అల్‌ఖైదా, ఐసిస్ వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు తమకనుకూలంగా మార్చుకున్నాయి. తిరుగుబాటుదార్లకు సాయం చేసే నెపంతో సిరియాపై పట్టు సాధించాయి. 2014 నాటికి ఈ జిహాదీల పెత్తనం పెరిగిపోయింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఐసిస్ ప్రభావం విపరీతంగా పెరిగింది. ఉగ్రవాదులకు సిరియా శాశ్వత అడ్డాగా మారుతుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అమెరికా రంగంలోకి దిగి సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్ (ఎస్డీఎఫ్) సాయంతో విరుచుకుపడటంతో అల్‌ఖైదా, ఐసిస్ తోకముడిచి దేశం వీడాయి. కాల్పుల విరమణతో ఆగిన ఉద్రిక్తతలు సిరియాలో పలు ప్రావిన్స్‌లను తిరుగుబాటుదార్లు ఆక్రమించడం, తర్వాత వాటిని ప్రభుత్వ సైన్యం స్వా«దీనం చేసుకోవడం జరుగుతూ వచ్చింది. 2020లో ఇద్లిబ్ ప్రావిన్స్ తిరుగుబాటుదార్ల చేతుల్లోకి వచ్చింది. ఆ సమయంలో కాల్పుల విరమణ ప్రతిపాదనకు రష్యా, తుర్కియేతో పాటు తిరుగుబాటుదారులూ ఒప్పుకున్నారు. ఉమ్మడి పహారాతో సెక్యూరిటీ కారిడార్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. నాటినుంచీ కీలకమైన ప్రావిన్సులతో పాటు సిరియాలో మెజారిటీ భూభాగం తిరుగుబాటుదార్ల అ«దీనంలోనే ఉండిపోయింది.నాయకత్వం ఎవరిది? సిరియాలో తిరుగుబాటుదార్లతో ఏర్పాటైన ‘మిలటరీ ఆపరేషన్స్ కమాండ్’కు హయత్ తా హ్రీర్ అల్–షామ్ సంస్థ నాయకత్వం వహి స్తోంది. ఇది గతంలో అల్–నుస్రా ఫ్రంట్ పేరు తో అల్‌ఖైదాకు అనుబంధంగా పనిచేసింది. తర్వాత స్వతంత్రంగా వ్యవహరిస్తోంది. ఇద్లిబ్ ప్రావిన్స్‌లో అధికారం చెలాయి స్తోంది. తుర్కియే, అమెరికా మద్దతుతో సిరియాలో కార్యకలాపాలు సాగిస్తున్న కొన్ని గ్రూప్‌లు తాహ్రీర్ అల్–షామ్‌కు అండగా నిలుస్తున్నాయి. ఇప్పుడే ఎందుకీ అలజడి? అసద్ మిత్రదేశమైన రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో తలమునకలుగా ఉంది. సిరియాపై దృష్టి పెట్టే స్థితిలో లేదు. మరో మిత్రదేశం ఇరాన్ కూడా ఇజ్రాయెల్ దాడులతో ఉక్కిరిబిక్కిరవుతోంది. హెజ్బొల్లా గ్రూప్‌కూ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వాటినుంచి సైనిక సాయం అందక అసద్ నిస్సహాయ స్థితిలో ఉన్నారు. బయటి సాయం లేక ఆయన ప్రభుత్వమూ బలహీనపడింది. ఈ పరిస్థితిని వాడకుంటూ తిరుగుబాటుదార్లు క్రియాశీలకంగా మారారు. ‘మిలటరీ ఆపరేషన్స్ కమాండ్’ పేరిట కొత్త కూటమి కట్టారు. పెద్దగా ప్రతిఘటనే లేకుండా వాణిజ్య రాజధాని అలెప్పోతో పాటు శివారు ప్రాంతాలు, గ్రామాల్లోనూ పాగా వేశారు. ఇది అసద్‌కు భారీ ఎదురుదెబ్బే. అమెరికా, ఇజ్రాయెల్, పశ్చిమ దేశాల అండదండలతో వాళ్లిప్పుడు మొత్తం సిరియానే స్వాధీనం చేసుకొనే దిశగా అడుగులు వేస్తున్నారు. అలెప్పోతో పాటు పరిసర ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఆదివారం సైన్యం ఎదురుదాడి యత్నాలు మొదలు పెట్టినా పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. అసద్ నుంచి విముక్తి పొందడానికి సిరియాకు ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు. ఆ తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వమే ఏర్పడుతుందా? లేక పశ్చిమ దేశాల కీలుబొమ్మ సర్కారు గద్దెనెక్కుతుందా అన్నది మాత్రం ఆసక్తికరం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
యురేనియం వార్.. కప్పట్రాళ్ల స్టేజి వద్ద ఉద్రిక్తత
కర్నూలు, సాక్షి: కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ల స్టేజి వద్ద ఉద్రిక్తత చోటచేసుకుంది. యురేనియం తవ్వకాలపై గ్రామస్తులు నిరసనకు దిగి రోడ్డుపై బైఠాయించారు. దీంతో బళ్లారి-కర్నూలు రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.నిరసన తెలుపుతున్న ప్రజలకు మద్దతుగా ఎమ్మెల్యే విరుపాక్షి ధర్నాలో పాల్గొన్నారు. మద్దతు పలికేందుకు వస్తున్న ఎమ్మెల్యేకు పోలీసులు అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా కూడా పోలీసుల అరెస్టు తప్పించుకుని కపట్రాళ్లకు ఎమ్మెల్యే విరుపాక్షి చేరుకున్నారు. ‘యురేనియం తవ్వకాలు వద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు, సీఎం డౌన్ డౌన్ అంటూ ఆయా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.చదవండి: రాష్ట్రంలో రెండో బయోస్పియర్ పార్క్! -
భారత దౌత్యవేత్తల బహిష్కరణ కథనాలు.. స్పందించిన అమెరికా
న్యూయార్క్:భారత్, కెనడా దేశాల మధ్య పెరుగుతున్న దౌత్యపరమైన ఉద్రికత్తల నేపథ్యంలో ప్రతిస్పందనగా భారతీయ దౌత్యవేత్తలను బహిష్కరించాలని అమెరికా పరిశీలిస్తున్నట్లు ఇటీవల పలు కథనాలు వెలువడ్డాయి. అయితే వాటిపై తాజాగా అమెరికా స్పందించింది. సదరు వార్తలను అమెరికా విదేశాంగశాఖ తోసిపుచ్చింది. సిక్కు వేర్పాటువాది, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో భారతీయ హైకమిషన్ పేరును కెనడా చేర్చిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఇతర దౌత్యవేత్తల ప్రమేయం ఉన్నట్లు కెనడా ఆరోపణలు చేసిన నేపథ్యంలో అమెరికా సైతం భారత దౌత్యవేత్తలను బహిష్కరించాలని యోచిస్తున్నట్లు ఆ కథనాల సారాంశం.అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. భారత దౌత్యవేత్తలపై చర్యలు తీసుకోవాలని అమెరికా పరిశీలిస్తున్నట్లు వెలువడిన కథనాలను ఖండించారు.‘‘ మేం భారతీయ దౌత్యవేత్తలను బహిష్కరించినట్లు వెలువడ్డ నివేదికల విషయం గురించి నాకు తెలియదు. అటువంటి బహిష్కరణ గురించి మేం ఆలోచించలేదు. అంతా ఊహాగానాలు మాత్రమే’’ అని అమెరికా వైఖరిని స్పష్టం చేశారు.ఈ నెల ప్రారంభంలో భారత దౌత్యవేత్తలపై కెనడా ఆరోపణలు చేయటంతో ప్రతిస్పందనగా భారతదేశం కెనడాలో ఉన్న తన ఆరుగురు దౌత్యవేత్తలను ఉపసంహరించుకుంది. అదేవిధంగా ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను కూడా భారత్ బహిష్కరించింది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రక్తలు క్షీణించిన విషయం తెలిసిందే. ఇక.. ఈ పరిణామాలు కెనడా, భారత్ మధ్య సంబంధాలను మరింత దెబ్బతీశాయి. -
మళ్లీ డ్రోన్లు కనిపిస్తే యుద్ధమే
ప్యాంగాంగ్: ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తతలు నానాటికీ పెరుగుతున్నాయి. దక్షిణ కొరియా మిలిటరీ డ్రోన్ అవశేషాలు శనివారం తమ భూభాగంలో కనిపించాయని, మరోసారి కనిపిస్తే యుద్ధ ప్రకటన తప్పదని ఉత్తరకొరియా హెచ్చరించింది. దక్షిణ కొరియా ఈ నెలలో మూడు సార్లు ప్యాంగ్యాంగ్పై డ్రోన్లను ఎగురవేసిందని ఆరోపించిన ఉత్తర కొరియా, మరోసారి అదే జరిగితే బలప్రయోగంతో ప్రతిస్పందిస్తామంది. -
రేటు కోతకు వేళాయెనా..!
ముంబై: పశి్చమాసియాలో యుద్ధ వాతావరణంసహా భౌగోళిక ఉద్రికత్తలు, దీనితో పొంచిఉన్న ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ద్రవ్య పరపతి విధానాన్ని ఆరుగురు సభ్యుల రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) యథాతథంగా కొనసాగించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు రెపోను వరుసగా 10వ పాలసీ సమీక్షలోనూ 6.5% వద్దే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే విధాన వైఖరిని మాత్రం 2019 జూన్ నుంచి అనుసరిస్తున్న ‘సరళతర ఆర్థిక విధాన ఉపసంహరణ’ నుంచి ‘తటస్థం’ వైపునకు మార్చాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఇది సానుకూలాంశమని, సమీప భవిష్యత్తులో రెపో రేటు తగ్గింపునకు సంకేతమని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్‌సూద్ సహా పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ద్రవ్యోల్బణం దిగొస్తుందన్న భరోసాతో పాలసీ వైఖరి మార్పు నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్ప, రేటు కోతపై మాట్లాడ్డానికి ఇది తగిన సమయం కాదని ఆర్బీఐ గవర్నర్ దాస్ స్పష్టం చేశారు. పాలసీ సమీక్షలో ముఖ్యాంశాలు... → ఆర్బీఐ తాజా నిర్ణయంతో 2023 ఫిబ్రవరి నుంచి రెపో రేటు యథాతథంగా 6.5% వద్ద కొనసాగుతోంది. → 2024–25 ఆర్థిక సంవత్సరం దేశ ఎకానమీ వృద్ధి రేటు అంచనాను యథాతథంగా 7.2 శాతంగా పాలసీ కొనసాగించింది. ఇప్పటికే వెల్లడైన అధికారిక గణాంకాల ప్రకారం ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఎకానమీ 6.7 శాతం పురోగతి సాధించగా, క్యూ2, క్యూ3, క్యూ4లలో వృద్ధి రేట్లు వరుసగా 7, 7.4, 7.4 శాతాలుగా నమోదవుతాయని పాలసీ అంచనావేసింది. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుందన్న గత విధాన వైఖరిలో మార్పులేదు. క్యూ2, క్యూ3, క్యూ4లలో వరుసగా 4.1 శాతం, 4.8 శాతం, 4.2 శాతాలుగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉంటుందని, 2025–26 తొలి త్రైమాసికంలో ఈ రేటు 4.3 శాతమని పాలసీ అంచనావేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటుఇటుగా 4 శాతం వద్ద ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. అయితే 4 శాతమే లక్ష్యమని ఆర్బీఐ గవర్నర్ పలు సందర్భాల్లో పేర్కొంటున్న సంగతి తెలిసిందే. → ఫీచర్ ఫోన్ యూపీఐ123పే పరిమితిని లావాదేవీకి ప్రస్తుత రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచడం జరిగింది. → లైట్ వాలెట్ పరిమితి ప్రస్తుత రూ.2,000 నుంచి రూ.5,000కు పెరిగింది. లావాదేవీ పరిమితి రూ.500 నుంచి రూ.1,000కి ఎగసింది. → తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 4 నుంచి 6వ తేదీల మధ్య జరగనుంది.వృద్ధికి వడ్డీరేట్లు అడ్డుకాదు... ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంపై సెంట్రల్ బ్యాంక్ నిస్సందేహంగా దృష్టి సారించింది. ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న విశ్వాసంతోనే పాలసీ విధాన వైఖరిని మార్చడం జరిగింది. అయితే రేటు కోత ఇప్పుడే మాట్లాడుకోవడం తగదు. ఇక వృద్ధిపై ప్రస్తుత వడ్డీరేట్ల ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు గత 18 నెలల కాలంలో మాకు ఎటువంటి సంకేతాలు లేవు. భారత్ ఎకానమీ పటిష్ట వృద్ధి బాటలో పయనిస్తోంది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు రుణ నాణ్యతపై అత్యధిక దృష్టి సారించాలి. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ వృద్ధికి దోహదం.. ఆర్బీఐ విధాన ప్రకటన పటిష్ట వృద్ధికి, ద్రవ్యోల్బణం కట్టడికి దోహదపడే అంశం. పాలసీ వైఖరి మార్చుతూ తీసుకున్న నిర్ణయం.. ద్రవ్యోల్బణాన్ని 4% వద్ద కట్టడి చేయడానికి ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటుందన్న అంశాన్ని స్పష్టం చేస్తోంది. – సీఎస్ శెట్టి, ఎస్బీఐ చైర్మన్ రియలీ్టకి నిరాశ..హౌసింగ్ డిమాండ్‌ను పెంచే అవకాశాన్ని ఆర్బీఐ కోల్పోయింది. రియలీ్టకి ఊపునివ్వడానికి రేటు తగ్గింపు కీలకం. వచ్చే పాలసీ సమీక్షలోనైనా రేటు తగ్గింపు నిర్ణయం తీసుకోవాలని ఈ రంగం విజ్ఞప్తి చేస్తోంది. – బొమన్ ఇరానీ, క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ వైఖరి మార్పు హర్షణీయం.. ఆర్బీఐ పాలసీ వైఖరి మార్పు హర్షణీయం. రానున్న సమీక్షలో రేటు కోత ఉంటుందన్న అంశాన్ని ఇది సూచిస్తోంది. ఎకానమీ పురోగతికి తగిన పాలసీ నిర్ణయాలను ఆర్బీఐ తగిన సమయాల్లో తీసుకుంటుందని పరిశ్రమ విశ్వసిస్తోంది. – దీపక్‌సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ -
యుద్ధ భయాలు.. ఊరించే స్టాక్‌లు
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో అస్తవ్యస్తంగా మారిన ఆరి్థక వ్యవస్థలకు... చినికి చినికి ‘మిసైళ్ల’వానగా మారిన పశ్చిమాసియా ఉద్రిక్తతలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇజ్రాయెల్–హమాస్ మధ్య పోరు లెబనాన్‌కు పాకడం.. తాజాగా ఇరాన్ కూడా రణరంగంలోకి దూకి ఇజ్రాయెల్‌పై మిసైళ్ల వర్షం కురిపించడంతో ఈ ప్రాంతంలో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ప్రపంచ స్టాక్ మార్కెట్లను వణికిస్తోంది. క్రూడ్ ధరలు భగ్గుమనడం (10% పైగా జంప్) మనలాంటి వర్ధమాన దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ పరిణామాలతో సెన్సెక్స్ 4,422 పాయింట్లు, నిఫ్టీ 1,383 పాయింట్లు, అంటే 5.3% చొప్పున పతనమయ్యాయి. గడిచిన రెండేళ్లలో వారం రోజుల్లో మార్కెట్లు ఇంతలా పడిపోవడం ఇదే తొలిసారి. అయితే, ఈ పతనాలను చూసి రిటైల్ ఇన్వెస్టర్లు మరీ అందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు మార్కెట్ నిపుణులు. గత యుద్ధాల సమయంలో పడిపోయిన మార్కెట్లు చాలా త్వరగా కోలుకున్నాయని, అందుకే ఈ క్రాష్‌ను సదవకాశంగా మలచుకోవాలనేది విశ్లేషకుల మాట!! నాన్‌స్టాప్‌గా దౌడు తీస్తున్న బుల్‌కు పశి్చమాసియా యుద్ధ ప్రకంపనలు బ్రేకులేశాయి. రోజుకో కొత్త ఆల్‌టైమ్ రికార్డులతో చెలరేగిన దేశీ స్టాక్ మార్కెట్లో ఎట్టకేలకు కరెక్షన్ మొదలైంది. సూచీలు 5 శాతం పైగా క్షీణించగా.. ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.26 లక్షల కోట్లు ఆవిరైంది. టాప్–10 కంపెనీల మార్కెట్ విలువ సుమారు రూ.7 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పటిదాకా మార్కెట్‌ను పరుగులు పెట్టించిన విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో రివర్స్‌గేర్ వేశారు. మరోపక్క, చైనా ఉద్దీపక ప్యాకేజీ ప్రభావంతో మన మార్కెట్ నుంచి వైదొలగి అక్కడికి క్యూ కడుతున్నారు. గత 4 ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌పీఐలు దాదాపు రూ.40 వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించడం గమనార్హం. ఈ నేపథ్యంలో దీర్ఘకాల లక్ష్యంతో ఇన్వెస్ట్ చేసే మదుపరులకు ఇది మంచి చాన్సని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. చారిత్రకంగా చూస్తే, ఇలాంటి ఉద్రిక్తతలు, యుద్ధాల సమయంలో మార్కెట్లు స్వల్పకాలానికి భారీగా పడటం లేదంటే దిద్దుబాటుకు లోనైనప్పటికీ... మళ్లీ కొద్ది వారాలు, నెలల్లోనే పుంజుకున్నాయని, భారీగా లాభాలను పంచాయని గణాంకాలతో సహా వారు ఉటంకిస్తున్నారు.క్వాలిటీ స్టాక్స్.. మంచి చాయిస్! స్వల్పకాలిక తీవ్ర ఒడిదుడుకుల ఆధారంగా ఇన్వెస్టర్లు హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోకూడదని.. గతంలో మంచి పనితీరు కనబరిచి తక్కువ ధరల్లో (వేల్యుయేషన్లు) దొరుకుతున్న నాణ్యమైన షేర్లను ఎంచుకోవడం ద్వారా లాంగ్ టర్మ్ పెట్టుబడులకు పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే, మంచి డివిడెండ్ రాబడులను అందించే స్టాక్స్ కూడా ఈ పతనంలో కొనుగోలుకు మరింత ఆకర్షణీయమైన ఆప్షన్ అనేది వారి అభిప్రాయం. ఊరించే వేల్యుయేషన్లు... ‘పటిష్టమైన పోర్ట్‌ఫోలియోను నిరి్మంచుకోవాలనుకునే ఇన్వెస్టర్లకు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి’ అని రైట్ రీసెర్చ్ ఫౌండర్ సోనమ్ శ్రీవాస్తవ చెప్పారు. భారీ పీఈ (ప్రైస్ టు ఎరి్నంగ్స్) నిష్పత్తితో కూడిన అధిక వేల్యుయేషన్ స్టాక్స్.. ఈ కరెక్షన్లో మరింతగా దిగొచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలో చేతిలో క్యాష్ పుష్కలంగా ఉన్న మదుపరులు... తక్కువ ధరల్లో ఇలాంటి ఊరించే షేర్లను కొనుగోలు చేయడం బెటర్ అంటున్నారు మార్కెట్ పరిశీలకులు.‘మార్కెట్లో ఈ కుదుపులు సద్దుమణిగి, పరుగులంకించుకున్నప్పుడు కొత్త పెట్టుబడులు భారీ లాభాలను అందించే అవకాశం ఉంటుంది’ అని వీఎస్ఆర్కే క్యాపిటల్ డైరెక్టర్ స్వాప్నిల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇటీవలి బుల్ రన్‌కు మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు దన్నుగా నిలిచాయి, తాజా కరెక్షన్లో ఇవే భారీగా పతనమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాలిక దృష్టితో లార్జ్ క్యాప్ స్టాక్స్‌ను ఎంచుకోవడం తెలివైన ఆప్షన్ అనేది నిపుణుల సలహా!ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల బాట పట్టారు. తమ లాంగ్ పొజిషన్లను తగ్గించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిఫ్టీ మరో 5 శాతం క్షీణించే అవకాశం ఉంది. – రాజేశ్ పలి్వయా, వైస్ ప్రెసిడెంట్, యాక్సిస్ సెక్యూరిటీస్– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఇరాన్ భూగర్భ అణుపరీక్షలు?
టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను ఇరాన్ మరింత పరాకాష్టకు తీసుకెళ్తోందా? అందులో భాగంగా తాజాగా అణు పరీక్షలు నిర్వహించిందా? అక్టోబర్ 5న శనివారం రాత్రి ఇరాన్, ఇజ్రాయెల్ భూభాగాల్లో దాదాపుగా ఒకే సమయంలో సంభవించిన భూకంపం ఈ అనుమానాలకు తావిస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10:45 ప్రాంతంలో ఇరాన్‌లోని అరదాన్ నగర సమీపంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. అక్కడికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు అమెరికా భూ¿ౌతిక సర్వే విభాగం ధ్రువీకరించింది. తర్వాత కొద్ది నిమిషాలకే ఇజ్రాయెల్‌లోనూ ప్రకంపనలు కన్పించాయి.యి. ఇది భూకంపం కాదని, కచి్చతంగా భూగర్భ అణు పరీక్షల పర్యవసానమేనని విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. భూకంపం సంభవించింది అణు ప్లాంట్‌కు అతి సమీపంలోనే అంటూ వస్తున్న వార్తలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. భూ కంప కేంద్రం ఉపరితలానికి కేవలం 10 కి.మీ. లోపల ఉండటం చూస్తుంటే భూగర్భ అణు పరీక్షలు జరిగి ఉంటాయని అంటున్నారు. -
మా జోలికి రావొద్దు.. మేం ఖాళీచేయం
జనగామ, సాక్షి: పాలకుర్తి మండలం తొర్రూరు(జే) గ్రామంలో బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అక్రమంగా చొరబడి ఉంటున్న కొన్ని కుటుంబాలను ఖాళీ చేయించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే.. వాళ్లు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. తమను ఖాళీ చేయించొద్దని పాలకుర్తి రెవెన్యూ సిబ్బందిని వాళ్లు వేడుకున్నారు. అయినా అధికారులు బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. దీంతో.. పెట్రోల్ బాటిల్‌తో ఆత్మహత్యాయత్నం చేస్తామని బెదిరింపులకు దిగారు. తమలోనూ అర్హులైన వాళ్లం ఉన్నామని, తక్షణమే గుర్తించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని కొందరు మహిళలు డిమాండ్ చేస్తున్నారు. అయినా అధికారులు పోలీసుల సాయంతో వాళ్లను అడ్డుకుని ఖాళీ చేయించాలని యత్నిస్తున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ 20 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించినట్లు తెలుస్తోంది. -
మధ్యప్రాచ్యంలో అలజడి...
వాషింగ్టన్: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ బలగాల మోహరింపును అమెరికా మరింతగా పెంచుతోంది. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధ నౌక తాజాగా మధ్యదరా సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. దాంతోపాటు ఓ గైడెడ్ మిసైల్ సామర్థ్యంతో కూడిన జలాంతర్గామి యూఎస్ఎస్ జార్జియాను కూడా అగ్రరాజ్యం హుటాహుటిన మధ్యప్రాచ్యానికి పంపిస్తోంది. హమాస్, హెజ్బొల్లా అగ్ర నేతలను ఇజ్రాయెల్ ఇటీవల వరుసబెట్టి మట్టుపెట్టడంతో ఇరాన్‌తో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరడం తెలిసిందే. ఇజ్రాయెల్‌పై పూర్తిస్థాయి యుద్ధానికి ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ ఆదేశాలు కూడా జారీ చేశారు. దాంతో ఇజ్రాయెల్‌ను రక్షించేందుకు మిత్రదేశమైన అమెరికా అన్ని చర్యలూ తీసుకుంటోంది. ఇరు దేశాలూ ఇరాన్ ప్రతి చర్య మీదా నిశితంగా కన్నేసి ఉంచాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో పలు దేశాలు ఇరాన్, ఇజ్రాయెల్‌కు విమాన సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నాయి. ఇజ్రాయెల్‌తో శాంతి చర్చలకు సిద్ధమేనంటూ హమాస్ ఆదివారం మరోసారి సంకేతాలిచి్చంది. ముందుగా పూర్తి యుద్ధ విరామానికి ఇజ్రాయెల్ ఒప్పుకోవాలంటూ షరతు విధించింది. -
సియోల్పైకి మళ్లీ చెత్త బెలూన్లు
సియోల్: కొరియా ద్వీపకల్పంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దక్షిణ కొరియా రాజధాని సియోల్పైకి ఆదివారం(జులై 21) ఉదయం నార్త్‌కొరియా మళ్లీ చెత్త బెలూన్లు ప్రయోగించింది. సియోల్పై చెత్త బెలూన్లు దర్శనమివ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చెత్త బెలూన్లకు ప్రతీకారంగా సరిహద్దులో లౌడ్‌స్పీకర్లతో ఉత్తరకొరియా నియంత కిమ్‌కు వ్యతిరేక ప్రసారాలు చేస్తామని సియోల్ హెచ్చరించింది. చెత్త బెలూన్ల ప్రయోగంపై నార్త్ కొరియా స్పందించింది. కొంత మంది సౌత్ కొరియా పౌరులు బెలూన్ల ద్వారా నార్త్ కొరియాపైకి రాజకీయ కరపత్రాలు పంపడం వల్లే తాము చెత్త బెలూన్లు ప్రయోగించామని తెలిపింది. ఇది కొనసాగితే రానున్న రోజుల్లో సౌత్‌కొరియా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉత్తరకొరియా నియంత కిమ్ చెల్లెలు కిమ్ యో జాంగ్ హెచ్చరించారు. గతంలోనూ సౌత్కొరియాపైకి నార్త్‌కొరియా చెత్త బెలూన్లను ప్రయోగించింది. -
మాచర్లలో మరో టెన్షన్.. సీఈవో కీలక ప్రకటన
ఎన్నికల పోలింగ్ హింసాత్మక ఘటనల నుంచి తేరుకోవడానికి.. ప్రశాంతత నెలకొనేందుకు పల్నాట నాలుగురోజుల సమయం పట్టింది. అలాంటి చోట మళ్లీ అల్లర్లకు తెలుగు దేశం పార్టీ కుట్రలు చేస్తోందా?. వద్దని పోలీసులు వారిస్తున్నా చలో మాచర్ల చేపట్టం వెనుక ఆంతర్యం ఏమిటి?. 👉మాచర్లకు టీడీపీ నేతలు.. మంచిది కాదు: సీఈవో ముకేష్ కుమార్ మీనాపిన్నెల్లి వీడియోపై సీ ఈవో సంచలన ప్రకటనఆ వీడియోను మేము విడుదల చేయలేదుఎన్నికల కమిషన్ నుండి బయటకు వెళ్లలేదుఅది ఎలా బయటకు వెళ్లిందో తెలుసుకుంటాందర్యాప్తు సమయంలో ఎక్కడో, ఎవరి చేతినుండో బయటకు వెళ్లిందిపాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ పీ ఓ, ఏపీ ఓలను సస్పెండ్ చేశాంమాచర్లకు టీడీపీ నేతలు వెళ్లడం మంచిది కాదుఇప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వచ్చిందిటీడీపీ నాయకులకు అనుమతి లేదని చెప్పాంవాళ్లు వెళితే వైఎస్సార్సీపీ నేతలు కూడా వెళతామంటారుమళ్లీ పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందిబయట నాయకులు ఎవ్వరూ మాచర్లకు వెళ్లకూడదుఎవ్వరినీ ఆ గ్రామాల్లోకి వెళ్లనీయొద్దని ఆదేశించాను 👉టీడీపీ రిగ్గింగ్ చేస్తోందని పోలీసులకు చెప్పిన స్పందించలేదు: అనిల్ కుమార్ యాదవ్ఓటమి భయంతోనే టీడీపీ దాడులకు పాల్పడింది 8 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయితే ఒక్కటే ఎందుకు బయటకు వచ్చింది ఈవీఎంల ధ్వంసం దృశ్యాలను ఎవరు బయటపెట్టారు ఈసీ తీరు పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన కుమారుడి పై కూడా దాడులు చేశారు ఈవీఎంల ధ్వంసం దృశ్యాలను ఎవరు బయటపెట్టారు ఈసీ తీరు పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన కుమారుడి పై కూడా దాడులు చేశారు పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఈవీఎంలు పగలగొట్టారు తుమ్మురుకోట, వబుచెర్లలో ఈవీఎంలు ధ్వంసం చేశారు చింతపల్లిలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు పాల్వాయిగేటు ప్రాంతంలో టీడీపీ నేతల విధ్వంసం చేశారు టీడీపీ నేతల అరాచక వీడియోలు ఎందుకు బయటకు రాలేదు? ఎస్సీ, ఎస్టీలను కొడుతున్న వీడియోలు ఈసీకి కనపడలేదా? టీడీపీ రిగ్గింగ్ చేసిన చోట్ల రీపోలింగ్ పెట్టాలి ఈసీ తీరుపై న్యాయ పోరాటం చేస్తాం 👉టీడీపీ కీలక నేతల గృహనిర్బంధంమాచర్లలో టీడీపీ ‘చలో మాచర్ల’కు అనుమతి లేదని పోలీసుల స్పష్టీకరణఉద్రిక్తతలు తలెత్తకుండా సహకరించాలని జిల్లా ఎస్పీ మలికా గార్గ్ విజ్ఞప్తిమాచర్ల వెళ్లకుండా టీడీపీ నేతల గృహ నిర్బంధం గొల్లపూడిలో దేవినేని ఉమ, విజయవాడలో వర్ల రామయ్య, గుంటూరులో నక్కా ఆనంద్, కనపర్తిలో శ్రీనివాసరావు ఇళ్ల వద్ద పోలీసులుఅయినా మాచర్ల వెళ్లితీరతామంటూ టీడీపీ నేతల మొండిపట్టు.. ఉద్రిక్తత 👉మాచర్లలో భారీ పోలీసు బందోబస్తుపల్నాడు జిల్లాలో మరొక భారీ కుట్రకు ప్లాన్ చేసిన తెలుగుదేశం పార్టీ?పల్నాడు జిల్లాలో శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు చలో పల్నాడు.. మాచర్ల పేరుతో తెలుగుదేశం నేతలు మరొక డ్రామాఉమ్మడి గుంటూరు ,కృష్ణా జిల్లాల నేతలతో చలో మాచర్ల కార్యక్రమానికి పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీజిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంది అని చెబుతున్న పోలీసులునిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్న పోలీసులుపోలీసుల హెచ్చరికలను పట్టించుకోని తెలుగుదేశం పార్టీచలో మాచర్ల పేరుతో పల్నాడులో మరోసారి విధ్వంసం సృష్టించడానికి తెలుగుదేశం రెడీ అవుతున్న తెలుగుదేశం నేతలు 👉 పల్నాడులో టీడీపీ చలో మాచర్ల పిలుపుతో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు👉 మాచర్ల వెళ్లకుండా టీడీపీ నేత దేవినేని ఉమా గృహ దిగ్భంధం.. మరికొందరు నేతల్ని సైతం అడ్డుకున్న పోలీసులు👉 మాచర్లలో ఎలాంటి రాజకీయ పర్యటనలకు అనుమతి లేదు: పోలీసులు👉 మాచర్లలో ఎలాగైనా పర్యటన చేపడతాం: టీడీపీ నేతలు తెలుగు దేశం పార్టీ ఇవాళ చలో మాచర్లకు పిలుపు ఇచ్చింది. ఈ ఉదయం మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటి నుంచి ర్యాలీగా నేతలు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ నేతలు దేవినేని ఉమా, వర్ల రామయ్య, నక్క , ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, జీవీ ప్రకాష్ లాంటి కీలక నేతలు పాల్గొనేందుకు ప్రణాళిక రూపొందించారు. పోలింగ్ సందర్భంగా ఇక్కడ జరిగిన అల్లర్లపై ఈసీ సీరియస్ అయ్యింది. దీంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మాచర్లలోఎలాంటి పర్యటనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారు. అయినా కూడా టీడీపీ సానుభూతిపరులకు పరామర్శ పేరిట చలో మాచర్ల నిర్వహించి తీరతామని టీడీపీ అంటోంది. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండగా.. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం నెలకొందక్కడ. -
దాడులు చేస్తే తీవ్రంగా స్పందిస్తాం: ఇజ్రాయెల్‌కు ఇరాన్ వార్నింగ్
టెహ్రాన్: ఇరాన్,ఇజ్రాయెల్ మధ్య రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ తమ దేశంపై ఎలాంటి దాడికి దిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. ప్రతి చర్యలకు తమ ఎయిర్‌ఫోర్స్ సిద్ధంగా ఉందని తెలిపింది. ఇరాన్‌పై ఎలాంటి దాడులు చేయాలన్న దానిపై చర్చించేందుకు ఇజ్రాయెల్ వార్ క్యాబినెట్ బుధవారం(ఏప్రిల్17)న భేటీ కానుంది. ఈ నేపథ్యంలో దాడులను ఎదుర్కొనడానికి తాము సిద్ధమని ఇరాన్ ప్రకటించడం గమనార్హం. ‘ ఇజ్రాయెల్ దాడులకు పాల్పడితే మా స్పందన తీవ్రంగా ఉంటుంది’ అని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రెయిసీ చెప్పారు. తమ సుఖోయ్-24ఎస్ విమానాలు సిద్ధంగా ఉన్నాయని ఇరాన్ ఎయిర్‌ఫోర్స్ కమాండర్ హెచ్చరించారు. అయితే ఇజ్రాయెల్ ఇరాన్‌లోని లక్ష్యాలపై దాడి చేస్తుందా లేదంటే ఇరాన్ వెలుపల దాడులు చేస్తుందా అనేదానిపై స్పష్టత లేదు. ఇరాన్‌కు చెందిన వాణిజ్య నౌకలకు ఎర్ర సముద్రంలో రక్షణ కల్పిస్తున్నట్లు ఇరాన్ నేవీ అడ్మిరల్ షారమ్ ఇరానీ తెలిపారు. కాగా, ఇటీవల సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఆ దేశానికి చెందిన 13 మంది ఆర్మీ ఉన్నతాధికారులు మరణించారు. దీనికి ప్రతీకారంగా ఏప్రిల్ 1న ఇరాన్ వందలాది డ్రోన్లు, మిసైళ్లతో ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. వీటిలో 99 శాతం మిసైళ్లను ఇజ్రాయెల్ తన ఐరన్ డోమ్ వ్యవస్థ సహకారంతో కూల్చి వేసింది. ఇదీ చదవండి.. ఇరాన్‌కు భారీ షాక్ ఇచ్చిన అమెరికా -
ఇజ్రాయెల్‌తో యుద్ధం: ఇరాన్ సంచలన ప్రకటన
టెహ్రాన్: ఇరాన్,ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు తొలగిపోయినట్లేనా..ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారినట్లేనా..ఇజ్రాయెల్‌పై డ్రోన్లు,మిసైళ్లతో దాడులు జరిపిన తర్వాత ఇరాన్ మెత్తబడిందా.. అంటే ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి చేసిన ప్రకటన అవుననే చెబుతోంది. ‘ఇజ్రాయెల్‌పై మేం జరిపిన దాడుల గురించి అమెరికాకు సమాచారమిచ్చాం. ఈ దాడులు పరిమితమైనవి. కేవలం మా ఆత్మరక్షణ కోసం చేసినవేనని తెలిపాం. మిడిల్ ఈస్ట్ ప్రాంత, ప్రపంచ శాంతి కోసం ఇరాన్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగించే ఉద్దేశమేమీ మాకు లేదు. ఇజ్రాయెల్ కవ్విస్తే మాత్రం మా ఆత్మరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడం’అని ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రి అమీర్ అబ్దుల్లాహియాన్ చెప్పారు. ఆదివారం(ఏప్రిల్14) ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అబ్దుల్లాహియాన్ మాట్లాడారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేసిన డ్రోన్,మిసైల్ దాడులను అమెరికా సహా పశ్చిమ దేశాలన్నీ ఖండించిన నేపథ్యంలో దాడులు కొనసాగించే ఉద్దేశం లేదని ఇరాన్ ప్రకటించడం గమనార్హం. కాగా, శనివారం(ఏప్రిల్ 13) అర్ధరాత్రి ఇజ్రాయెల్‌పై ఇరాన్ వందల కొద్ది డ్రోన్లు, మిసైళ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ మిసైళ్లలో చాలా వాటిని ఇజ్రాయెల్ అడ్డుకుని కూల్చివేసింది. ఈ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తునేదానిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఇటీవల సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఆ దేశానికి చెందిన 13 మంది ఆర్మీ అధికారులు మరణించారు. దీనికి ప్రతీకారంగానే ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేసింది. ఇదీ చదవండి.. ఇరాన్ మిసైల్ దాడులు.. తొలిసారి స్పందించిన నెతన్యాహు -
కేంద్రం అలర్ట్.. ఎయిరిండియా కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ ఎయిరిండియా విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ గగనతలం మీదుగా విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. తాజా సమాచారం ప్రకారం.. యూరప్‌కు వెళ్లే విమానాలు ఇరాన్ గగనతలం నుంచి కాకుండా మరో మార్గంలో వెళ్లనున్నాయి. దీంతో ప్రయాణ సమయం మరింత పెరగనుంది. ఇదిలా ఉంటే.. ఇండియా, ఫ్రాన్స్, రష్యా దేశాలు ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్‌కు ప్రయాణాలు మానుకోవాలని మార్గదర్శకాలు జారీ చేశాయి. అలాగే వీలైనంత వరకు ప్రయాణాల్ని తగ్గించుకోవాలని ఆయా దేశాల్లో ఉన్న భారతీయులకు విదేశాంగ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లో భారతీయ రాయబార కార్యాలయం సాయం తీసుకోవాలని సూచించింది. Travel advisory for Iran and Israel:https://t.co/OuHPVQfyVp pic.twitter.com/eDMRM771dC — Randhir Jaiswal (@MEAIndia) April 12, 2024 గాజాపై ఇజ్రాయెల్ దాడుల జరిగిన ఏడు నెలల తర్వాత.. పశ్చిమాసియా ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా మారింది. టెల్‌అవీవ్‌పై క్షిపణులతో విరుచుకుపడేందుకు టెహ్రాన్ సమాయత్తమైందన్న అమెరికా నిఘా వర్గాల సమాచారం ప్రపంచవ్యాప్తంగా అలజడిని రేపింది. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయొచ్చన్న సంకేతాలతో పలు దేశాలు తమ తమ పౌరుల్ని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి. మరోవైపు యూఎస్ వార్‌షిప్‌లు ఇజ్రాయెల్‌కు చేరుకుంటుండడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఇరాన్‌తో ఉద్రిక్తతల వేళ.. గాజాపై ఇజ్రాయెల్ దాడులు
గాజా: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనాలోని సెంట్రల్ గాజాలో దాడులు చేసింది. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంలో కాల్పుల విరమణ చర్చలు ప్రారంభమవుతున్న వేళ ఇజ్రాయెల్ గాజాలో భీకర కాల్పులకు దిగడం చర్చనీయాంశంగా మారింది. సెంట్రల్ గాజాలోని నో సైరాట్ ప్రాంతంలో శుక్రవారం వైమానిక దాడులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వైమానిక దాడుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా 25 మంది దాకా తీవ్ర గాయపడినట్లు తెలిపారు. మొత్తంగా గాజాలోని వివిధ ప్రాంతాల్లో కలిపి సుమారు పదుల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. ఇదీ చదవండి.. ఇరాన్, ఇజ్రాయెల్ హైటెన్షన్.. భారతీయులకు కేంద్రం అలర్ట్ -
హర్యానా సీఎం రాజీనామా.. కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం
హర్యానా సీఎం మనోహర్ లాల్ తన పదవికి రాజీనామా చేశారు. శాసనసభా పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో హర్యానాలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మనోహర్ లాల్‌తో పాటు మంత్రివర్గమంతా రాజీనామా చేసింది. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం ఉదయం 11 గంటలకు బీజేపీ శాసనసభా పక్షంతో సమావేశమై, హర్యానా గవర్నర్‌ను కలిశారని సమాచారం. హర్యానాలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ), దుష్యంత్ చౌతాలాకు చెందిన జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) విబేధాలు చోటుచేసుకున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై కూటమిలో ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. దీంతో జేజేపీతో పొత్తును బీజేపీ తెగతెంపులు చేసుకుంది. ఈ నేపధ్యంలోనే హర్యానాలోని బీజేపీ ప్రభుత్వ మంత్రివర్గం సమిష్టిగా రాజీనామా చేసి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యింది. ఈ మేరకు.. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధికార బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వానికి మద్దతు కోరుతూ స్వతంత్ర ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఫార్ములాపై బీజేపీ కసరత్తు చేసింది. మరోవైపు.. హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. వీళ్ల భేటీలో సీట్ల పంపకంపై ఇరు పార్టీల మధ్య ఎటువంటి ఒప్పందం కుదరలేదు. ఈ నేపథ్యంలో దుష్యంత్ చౌతాలా ఢిల్లీలో పార్టీ ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీకి 41, జేజేపీకి 10, కాంగ్రెస్‌కు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనితో పాటు బీజేపీకి ఆరుగురు స్వతంత్రులు, ఒక హర్యానా లోఖిత్ పార్టీ ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు ఉంది. ఈ లెక్కన.. జేజేపీ విడిపోయిన తర్వాత కూడా బీజేపీకి 48 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందని లెక్క తేలుతోంది. అయితే.. హర్యానా కేబినెట్ నుంచి జననాయక్ జనతా పార్టీని తప్పించేందుకే బీజేపీ ఈ వ్యూహం పన్నిందని మరికొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
Manipur: వినూత్న నిరసనకు దిగిన పోలీసులు
ఇంఫాల్: మణిపుర్లో ఓ పోలీసాధికారి కిడ్నాప్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఏఎస్పీ స్థాయి అధికారి నివాసంపై దాడి జరిపి.. ఆయన్ని, ఆయన సిబ్బందిని గుర్తు తెలియని ఆగంతకులు అపహరించుకుని పోయారు. ఈ ఘటనను ఖండిస్తూ.. ఆ అధికారికి సంఘీభావంగా పోలీసు కమాండోలు వినూత్న నిరసనకు దిగారు. బుధవారం ఉదయం కొద్దిసేపు ఆయుధాలను విడిచిపెట్టి విధులకు హాజరయ్యారు. అయితే.. ఏఎస్పీ అపహరణకు గురయ్యారనే సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టి గంటల వ్యవధిలోనే ఆయన్ను విడిపించినట్లు మణిపుర్ పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం పశ్చిమ ఇంఫాల్‌లోని అదనపు ఎస్పీ అమిత్‌సింగ్ ఇంటిపై సుమారు 200 మంది సాయుధులు దాడి చేశారు. ఆయనతోపాటు మరొకరిని అపహరించుకుపోయారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. JUST IN | #Manipur Police commandos lay down arms in protest against attack and abduction of a police officer on Tuesday. Around 200 armed miscreants had stormed the house of a police officer in Imphal East. ASP Moirangthem Amit and his escort were abducted, @vijaita reports. pic.twitter.com/3B1kTTh5mt — The Hindu (@the_hindu) February 28, 2024 అంతకుముందు వాహనం దొంగిలించారనే ఆరోపణలతో అరంబై టెంగోల్ గ్రూప్‌నకు చెందిన ఆరుగురు వ్యక్తులను ఏఎస్పీ అమిత్ అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆగ్రహించిన ఆ వర్గం వాళ్లే.. విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పరిస్థితులు అదుపులో ఉన్నట్లు తెలిపారు. మరోవైపు.. ఈ ఘటన నేపథ్యంలో శాంతి భద్రతలు అదుపు తప్పకుండా ఆ రాష్ట్ర హోంశాఖ అప్రమత్తమైంది. మెయితీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలించాలని కిందటి ఏడాది మార్చి 27న కేంద్ర గిరిజన శాఖకు హైకోర్టు ప్రతిపాదన చేసింది. అయితే, వారికి రిజర్వేషన్లు ఇవ్వొద్దంటూ నాగా, కుకీజొమీ తెగలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో.. మణిపూర్‌లో ఘర్షణలు.. హింస చెలరేగాయి. అయితే.. రాష్ట్రంలో కుకీలు, మెయితీల మధ్య వైరానికి కారణమైన పేరాను మణిపుర్ హైకోర్టు తాజాగా తొలగించింది. -
ఇరాన్, పాకిస్తాన్ మధ్య మళ్లీ హై టెన్షన్ !
టెహ్రాన్: ఇరాన్,పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. జైష్ అల్ అదిల్ ఉగ్రవాద సంస్థకు చెందిన సీనియర్ మిలిటెంట్ కమాండర్‌తో పాటు అతడి అనుచరులపై పాకిస్తాన్ భూ భాగంలో ఇరాన్ ఆర్మీ దాడిచేసి హతమార్చింది. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. దక్షిణ ఇరాన్‌లోని సిస్తాన్ బలూచిస్థాన్ ప్రావిన్స్ కేంద్రంగా 2012లో జైష్ అల్ అదిల్ కార్యకలాపాలు మొదలయ్యాయి. కొన్నేళ్ల తర్వాత ఈ సంస్థ ఉగ్రవాదులు ఇరాన్ భద్రతాబలగాలపైనే దాడులు చేయడం ప్రారంభించారు. గతేడాది డిసెంబర్లో సిస్తాన్ బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌పై జరిగిన దాడిలో 11 మంది పోలీసులు చనిపోయారు. ఈ దాడి చేసింది తామేనని జైష్ అల్ అదిల్ ప్రకటించుకుంది. గత నెలలో పరస్పరం మిసైల్ దాడులకు దిగడంతో ఇరాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య భద్రతా సహకారం విషయమై ఒప్పందం కూడా జరిగింది. ఈ విషయమై రెండు దేశాల విదేశాంగ మంత్రులు సంయుక్త మీడియా సమావేశం కూడా నిర్వహించారు. వెనక్కి పిలిచిన ఇరు దేశాల రాయబారులను తిరిగి వారి స్థానాల్లో నియమించారు. ఈ నేపథ్యంలో జైష్ అల్ అదిల్ టెర్రరిస్టులపై పాకిస్తాన్ భూభాగంలో ఇరాన్ బలగాల దాడి మళ్లీ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇదీ చదవండి.. రష్యాపై భారీ ఆంక్షలు -
సిరియా, ఇరాక్‌పై ఇరాన్ క్షిపణి దాడులు
టెహ్రరాన్: సిరియా, ఇరాక్ ప్రాంతాలపై ఇరాన్ దాడులకు తెగబడింది. సిరియా, ఇరాక్ ఆధీనంలోని స్వయంప్రతిపత్తి కలిగిన కుర్దిస్థాన్ ప్రాంతంలో ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు జరిపింది. ఇజ్రాయెల్ గూఢచార బృందాల సమావేశంపై దాడి జరిపినట్లు ఇరాన్ పేర్కొంది. ఈ దాడుల్లో ఉగ్రవాదుల ప్రధాన కార్యాలయం ధ్వంసమైనట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ గ్రూప్స్ తెలిపింది. ఇందులో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించాయి. మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలైనట్లు పేర్కొన్నాయి. మరణించిన పలువురు పౌరుల్లో ప్రముఖ వ్యాపారవేత్త పెష్రా డిజాయీ కూడా ఉన్నారని కుర్దిస్థాన్ డెమోక్రటిక్ పార్టీ తెలిపింది. బాలిస్టిక్ క్షిపణులతో సిరియాలోని పలు ప్రాంతాలపై కూడా ఇరాన్ దాడులు చేసింది. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్స్ కమాండర్లకు చెందిన స్థలాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఇరాన్‌లోని కెర్మాన్, రాస్క్లలో ఇటీవల ఉగ్రవాదులు దాడులు జరిపి పలువురు ఇరాన్ దేశస్థులను హతమార్చారు. ఆ దాడులకు ప్రతిస్పందనగా సిరియాపై ఇరాన్ క్షిపణులతో రెచ్చిపోయింది. సిరియాకు చెందిన అలెప్పో గ్రామీణ ప్రాంతాల్లో పేలుళ్లు వినిపించాయి. మధ్యధరా సముద్రం వైపు నుంచి 4 క్షిపణులు వచ్చినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వార్ మానిటర్ తెలిపింది. సిరియా, ఇరాక్ ఆధీనంలోని కుర్దిస్థాన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ గూఢచారి బృందాలు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఇరాన్ ఆరోపిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తున్న ఇరాన్ ఈ మేరకు దాడులు జరిపింది. ఇదీ చదవండి: పుతిన్, మోదీ కీలక చర్చలు.. రష్యాకు విషెస్ చెప్పిన ప్రధాని -
మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస
ఇంఫాల్: మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. తౌబల్ జిల్లా లిలాంగ్ చింగ్జావో ప్రాంతంలో సోమవారం సాయంత్రం పోలీసు దుస్తుల్లో వచ్చిన దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో తౌబల్‌తోపాటు ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, కాక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. దాంతో ఆగ్రహించిన ఒక వర్గం వారు నాలుగు కార్లకు నిప్పుపెట్టారు. కార్లు ఎవరివనే విషయం తెలియాల్సి ఉంది. కాల్పుల ఘటనను సీఎం బీరేన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదన్నారు. పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. దోషులను పట్టుకుని, చట్టం ముందు నిలబెడతామని ఆయన స్పష్టం చేశారు. మణిపూర్‌లో గత ఏడాది మే 3వ తేదీన ట్రైబల్ సాలిడారిటీ మార్చ్ అనంతరం కొనసాగుతున్న జాతుల మధ్య వైరంతో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మొయితీలున్నారు. కొండ ప్రాంత జిల్లాల్లో నివసించే నాగాలు, కుకీలు కలిపి 40 శాతం వరకు ఉంటారు. -
కెనడాలో ఉద్రిక్తతలు.. యూదు పాఠశాలపై మళ్లీ కాల్పులు
మాంట్రియల్, కెనడా: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో కెనడాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మాంట్రియల్‌లోని ఒక యూదు పాఠశాలపై కాల్పులు జరిగినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. ఈ యూదు పాఠశాలపై కాల్పులు జరగడం వారం రోజుల్లో ఇది రెండోసారి. ఆదివారం (నవంబర్ 12) అక్కడి కాలమాణం ప్రకారం తెల్లవారుజామున 5 గంటలకు కాల్పుల శబ్దాలు వినిపించాయని, కాల్పులు జరిగినప్పుడు పాఠశాలలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని పోలీసులు తెలిపారు. బుల్లెట్ల ధాటికి పాఠశాల భవనం గోడలు దెబ్బతిన్నాయని, నేలపై గుంతలు ఏర్పడ్డాయని వివరించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికే ఇలా ఒకే స్కూల్‌పై పదేపదే దాడులు చేస్తున్నారని ఆ పాఠశాల ప్రతినిధి లియోనెల్ పెరెజ్ విలేకరుల సమావేశంలో చెప్పారు. తరగతులు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. వారం ప్రారంభంలో మాంట్రియల్ నగరంలోని కాంకోర్డియా విశ్వవిద్యాలయంలో పాలస్తీనియన్, ఇజ్రాయెల్ అనుకూల సమూహాలు ఘర్షణ పడినప్పుడు మాంట్రియల్ ప్రార్థనా మందిరం అగ్నిబాంబు దాడిలో స్వల్పంగా దెబ్బతింది. ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. -
5 రోజులు.. 15 లక్షల కోట్లు!
ముంబై: మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో దేశీయంగా కీలక సూచీల పతనం కొనసాగుతోంది. స్టాక్స్ అధిక వేల్యుయేషన్స్‌తో ట్రేడవుతుండటం కూడా దీనికి తోడు కావడంతో బుధవారం మార్కెట్లు మరింత క్షీణించి, ఇన్వెస్టర్ల సంపద ఇంకాస్త కరిగిపోయింది. మొత్తంమీద అయిదు రోజుల్లో రూ. 14.60 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. బుధవారం సెన్సెక్స్ మరో 523 పాయింట్లు తగ్గి 64,049 పాయింట్ల వద్ద, నిఫ్టీ 160 పాయింట్లు క్షీణించి 19,122 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. గత అయిదు సెషన్లలో సెన్సెక్స్ 2,379 పాయింట్లు, నిఫ్టీ 690 పాయింట్లు పతనమయ్యాయి. బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 309,22,136 కోట్లకు తగ్గింది. ‘అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్లు వరుసగా అయిదో సెషన్లోనూ క్షీణించాయి. బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్ దీనికి సారథ్యం వహించాయి. దేశీ స్టాక్స్ అధిక వేల్యుయేషన్స్‌లో ట్రేడవుతుండటం, అంతర్జాతీయంగా సంక్షోభం నెలకొనడం తదితర పరిణామాల కారణంగా ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో తమ పెట్టుబడులను తగ్గించుకుంటున్నారు‘ అని కోటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ విభాగం (రిటైల్) హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. లాభాల స్వీకరణ కోసం ఎదురుచూస్తున్న ఇన్వెస్టర్లకు తగిన పరిస్థితులు ఏర్పడటంతో మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తుతున్నట్లు ఈక్విట్రీ సహ వ్యవస్థాపకుడు పవన్ భరాదియా వివరించారు. ఇన్ఫీ 3 శాతం డౌన్.. సెన్సెక్స్‌లో ఇన్ఫీ షేర్లు అత్యధికంగా 2.76 శాతం మేర క్షీణించాయి. భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ మొదలైనవి కూడా నష్టపోయాయి. టాటా స్టీల్, ఎస్బీఐ మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ తదితర స్టాక్స్ లాభపడ్డాయి. టెక్ సూచీ 1.39 శాతం, టెలికం 1.29 శాతం, యుటిలిటీస్ 1.25 శాతం మేర క్షీణించగా మెటల్స్ సూచీ మాత్రమే లాభపడింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) నికరంగా రూ. 4,237 కోట్లు విక్రయించగా, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ) రూ. 3,569 కోట్ల మేర కొనుగోళ్లు జరిపారు. అటు అంతర్జాతీయంగా చూస్తే ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై, హాంకాంగ్ లాభపడగా, సియోల్ సూచీలు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు నెగటివ్‌లో ట్రేడయ్యాయి. -
కెనడా పౌరులకు వీసా సేవల పునరుద్ధరణ
న్యూఢిల్లీ: దౌత్యపరమైన ఉద్రిక్తతల నడుమ వీసా సేవల్ని నిలిపివేసిన భారత్.. తిరిగి కెనడా పౌరుల కోసం ఆ సేవల్ని పునరుద్ధరించింది. ఈ మేరకు ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయం(Indian High Commission) బుధవారం ప్రకటనల విడుదల చేసింది. ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, మెడికల్ వీసా, కాన్ఫరెన్స్ వీసాలను జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 26 నుంచి తాత్కాలికంగా ఈ వీసా సేవల్ని అందించనున్నట్లు ఆ ప్రకటనలో భారత హైకమిషన్ స్పష్టం చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇంతకాలం వీటిని నిలిపివేయాల్సి వచ్చిందని.. సమీక్ష అనంతరం తిరిగి ఈ సేవల్ని ప్రారంభిస్తున్నట్లు భారత హైకమిషన్ ప్రెస్ రిలీజ్లో పేర్కొంది. ఖలీస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ప్రమేయంలో భారత ఏజెంట్ల జోక్యం ఉందంటూ ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రత్యక్షంగా ఆరోపణలు ఇరు దేశాల మధ్య గ్యాప్ నెలకొంది. భారత్‌కు కెనడాకు మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరగుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ చివరి వారం నుంచి వీసా సేవల్ని నిలిపివేసుకున్నాయి ఇరు దేశాలు. -
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. ఢిల్లీలో హై అలర్ట్
ఢిల్లీ: ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన ఆందోళనలు చెలరేగనున్నాయనే ముందస్తు సమాచారం అందడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం, యూదు సంస్థల దగ్గర భద్రతను పెంచారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో నివసిస్తున్న ఇజ్రాయెలీల భద్రతను కాపాడాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఇజ్రాయెల్ పర్యాటకు, దౌత్యవేత్తలు సహా సిబ్బందికి భద్రత పెంచాలని కోరింది. అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ సహా పలు దేశాలు ఇప్పటికే యూదుల భద్రతకు హామీ ఇస్తూ సెక్యూరిటీని కట్టుదిట్టం చేసిన అనంతరం భారత్ కూడా ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ఇప్పటికే కేంద్రం ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభించింది. మొదటి విమానంలో 212 మంది భారతీయులు ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ల దాడితో భగ్గుమన్న పశ్చిమాసియాలో ఉద్రిక్తత రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇప్పటికే గాజాను అష్ట దిగ్బంధం చేసిన ఇజ్రాయెల్.. వైమానిక దాడులతో ఆ నగరంపై విరుచుకుపడుతోంది. ఇటు హమాస్‌కూడా ఇజ్రాయెల్ సైన్యంపై రాకెట్లతో ఎదురుదాడికి దిగుతోంది. హమాస్‌కు బెబనాన్, సిరియాలు చేతులు కలపడంతో ఇజ్రాయెల్ మూడు వైపుల నుంచి దాడులను ఎదుర్కొంటోంది. ఈ ప్రతీకార పోరులో ఇరువైపులా 2800 మంది మృత్యువాతపడ్డారు. ఇజ్రాయెల్‌లో 1,300, గాజాలో 1,355 మందికిపైగా బలయ్యారు. ఇదీ చదవండి: ఆపరేషన్ అజయ్: ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరిన మొదటి విమానం -
భారత్-కెనడా ఉద్రిక్తతలు: ఆనంద్ మహీంద్ర సంచలన నిర్ణయం
భారతదేశం-కెనడా ఉద్రిక్తతల నేపథ్యంలో ఎంఅండ్ ఎం ఆనంద్ మహీంద్రా అధినేత తీసుకున్న సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. కెనడాలోని మహీంద్రా అండ్ మహీంద్రా అనుబంధ సంస్థ, రెస్సన్ ఏరోస్పేస్ కార్పొరేషన్ కార్యకలాపాలను మూసివేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఎంఅండ్ఎం గురువారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ప్రకటించింది. ఇది మార్కెట్ వర్గాల్లోనూ, ఇటు బిజినెస్ వర్గాల్లో కలకలం రేపింది. ఈ నిర్ణయం రూ. 7200 కోట్ల ఆర్థిక సంక్షోభానికి దారితీయడం గమనార్హం. రెస్సన్ ఏరోస్పేస్ కోసం కార్యకలాపాలు నిలిపివేత.. వివరాలను పరిశీలిస్తే భారతదేశం కెనడాల మధ్య పెరుగుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తతల మధ్య, కెనడాలోని మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) అనుబంధ సంస్థ 'రెస్సన్ ఏరోస్పేస్ కార్పొరేషన్' స్వచ్ఛందంగా తమ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు పేర్కొంటూ కెనడా కార్పొరేషన్స్‌కు దరఖాస్తు చేసింది. దీనికి సెప్టెంబర్ 20న ఆమోదం లభించింది. ఈ నిర్ణయంతో ఎంఅండ్ఎం స్టాక్‌ను భారీగా ప్రభావితం చేసింది. అంతేకాదు మహీంద్రా కీలక నిర్ణయం ద్వారా బహుళజాతి సంస్థలు, పెట్టుబడుల ప్రభావంతోపాటు విస్తృత ఆర్థిక రంగం మీద దౌత్యపరమైన ఒత్తిళ్లను చెప్పకనే చెప్పింది. (రూపాయి హై జంప్: కారణం ఇదే!) రూ. 7200 కోట్టు ఆవిరి ఈ డిక్లరేషన్ మహీంద్రా & మహీంద్రా షేర్లు 3 శాతం కుప్పకూలాయి. బీఎస్ఈ రూ. 1583.80 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సెషన్లో షేర్లు రూ. 1575.75 వద్ద రోజు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇటీవలి నష్టపోయినప్పటికీ కంపెనీ షేర్లు ఈ సంవత్సరం నిఫ్టీపై దాదాపు 26శాతం రాబడిని సాధించాయి. ఒక సంవత్సరం రాబడి 21% మించిపోయింది. తాజా నష్టాల ఫలితంగా రూ. 7200 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ప్రారంభ మార్కెట్ క్యాప్ రూ. 2 లక్షల కోట్ల నుండి, కంపెనీ మార్కెట్ విలువ కనిష్టంగా రూ. 1,95,782.18 కోట్లకు క్షీణించి, మార్కెట్ ముగిసే సమయానికి రూ. 1,96,950.10 కోట్ల వద్ద స్థిరపడింది. రెసన్ ఏరోస్పేస్ కార్పొరేషన్లో మహీంద్రా & మహీంద్రా వాటా 11.18 శాతం.(క్యాబ్ డ్రైవర్ ఖాతాలో ఏకంగా రూ. 9 వేల కోట్లు..ఏం చేశాడంటే?) -
India-Canada Relations: కెనడా పౌరులకు ‘నో’ వీసా
న్యూఢిల్లీ: భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ రాజుకుంటున్నాయి. గత జూన్‌లో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో ఇరు దేశాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇరు దేశాలు దౌత్య ప్రతినిధుల్ని వెనక్కి తీసుకునే వరకు వెళ్లిన ఈ వ్యవహారంలో కెనడాకు షాకిస్తూ భారత్ మరో నిర్ణయం తీసుకుంది. కెనడా పౌరులకు వీసాల మంజూరును భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. భద్రతా కారణాల రీత్యా ఈ వీసాలను ఆపేసినట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కెనడాలో భారత హైకమిషన్లు, కాన్సులేట్లకు రక్షణ లేదని, వాటికి బెదిరింపులు వస్తున్నాయని అందుకే తాత్కాలికంగా వీసాలను నిలిపివేసినట్టుగా తెలిపింది. అంతే కాకుండా భారత్‌లో ఉన్న కెనడా దౌత్యసిబ్బంది సంఖ్య తగ్గించుకోవాలని చెప్పింది. మరోవైపు కెనడాలో భారత్ పౌరులు అప్రమత్తంగా ఉండాలన్న కేంద్రం సూచనల్ని కెనడా ప్రభుత్వం తిరస్కరించించి. ప్రపంచంలో కెనడా అత్యంత సురక్షితమైన దేశమని పేర్కొంది. తమ దేశంలో భారత పౌరులకు వచ్చే ఇబ్బందేమీ లేదని పేర్కొంది. వీసాలు జారీ చేసే పరిస్థితి లేదు వీసా దరఖాస్తులను పరిశీలించడానికి ఏర్పాటైన ఒక ప్రైవేటు ఏజెన్సీ బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ గురువారం నాడు తాత్కాలికంగా వీసాల పరిశీలన నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. నిర్వహణ కారణాలతోనే ఆపేస్తున్నట్టు వెల్లడించింది. ఆ తర్వాత కాసేపటికే విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి విలేకరులతో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య భద్రతా పరమైన ఉద్రిక్తతల కారణంగా వీసా దరఖాస్తుల ప్రక్రియ ముందుకు సాగడం లేదని తెలిపారు. ఇతర దేశాల నుంచి దరఖాస్తులు చేసుకునే కెనడియన్లకు కూడా వీసాలివ్వలేమని చెప్పారు. ‘‘కెనడా ప్రజలు భారత్ రాకుండా అడ్డుకోవాలన్నది మా విధానం కాదు. సరైన వీసాలు ఉన్న వారు (గతంలో వీసాలు మంజూరైన వారు) యధావిధిగా రాకపోకలు సాగించవచ్చు. వారు ఎప్పుడైనా మన దేశానికి రావొచ్చు. కానీ ఆ దేశంలోని పరిస్థితులు మన హైకమిషన్ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నాయి’’ అని బాగ్చి వివరించారు. ఇరు దేశాల మధ్య పరిస్థితుల్ని సమీక్షిస్తామని, భారత హైకమిషన్లు, దౌత్య కార్యాలయాలకు రక్షణ ఉందని తేలితే వీసాల జారీ పునరుద్ధరిస్తామని బాగ్చి స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు అడ్డాగా కెనడా కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి బాగ్చి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కెనడా ప్రభుత్వం ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తోందని విమర్శించారు. కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాదుల అరాచకాల ఆధారాలన్నింటినీ ఆ ప్రభుత్వానికి ఇచ్చామని, 20–25 మందిని మన దేశానికి అప్పగించాలని కోరినప్పటికీ స్పందన లేదన్నారు. ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని ట్రూడో చేసిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని మండిపడ్డారు. నిజ్జర్ హత్య గురించి ఎలాంటి సమాచారం కెనడా పంచుకోలేదన్నారు. అంతర్గత వ్యవహారాల్లో కెనడా జోక్యం భారత అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యవేత్తల జోక్యం పెరిగిపోతోందని బాగ్చి చెప్పారు. ఇరు దేశాల్లో దౌత్యవేత్తల విషయంలో సమానత్వం లేదన్నారు. ‘‘కెనడాలో ఉన్న భారతీయ దౌత్య వేత్తల కంటే, మన దేశంలో కెనడా దౌత్యవేత్తలు ఎక్కువ మంది ఉన్నారు. వారి సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు. ఈ విషయాన్ని కెనడా దృష్టికి తీసుకువెళ్లినట్టు వివరించారు. ఇక భారత్‌లో ఉన్న కెనడా దౌత్య సిబ్బంది ఎంత మంది ఉన్నారో అంచనాలు వేస్తున్నామని కెనడా హైకమిషన్ వెల్లడించింది. భారత్‌లో కెనడా దౌత్యవేత్తలకి బెదిరింపులు వస్తున్నాయని వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపైనే ఉందన్నారు. కెనడాలో మరో ఖలిస్తాన్ ఉగ్రవాది హత్య చండీగఢ్: భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కెనడాలో మరో ఖలిస్తానీ మద్దతుదారు హత్య జరిగింది. పంజాబ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్లో ఒకరైన సుఖ్దుల్ సింగ్ అలియాస్ సుఖ దునెకె మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దీనిపై కెనడా ప్రభుత్వం స్పందించలేదు. కెనడాలోని విన్నిపెగ్‌లో బుధవారం రాత్రి సుఖ్దుల్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి చంపేశారు. గ్యాంగ్ వార్‌లో భాగంగానే ఘటన జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుఖ్దుల్ సింగ్‌పై మన దేశంలో హత్య, హత్యాయత్నం, దోపిడీకి సంబంధించిన 18 కేసులు ఉన్నాయి. సుఖ్దుల్ హత్య తమ పనేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించింది. పంజాబ్‌లోని మోగా జిల్లా దునెకె కలాన్ గ్రామానికి చెందిన సుఖ్దుల్ 2017 డిసెంబర్లో నకిలీ ధ్రువపత్రాలతో కెనడాకు పరారయ్యాడు. -
భారత్‌పై కెనడా ఆరోపణలు తీవ్రమైనవి: అమెరికా
కెనడా, భారత్‌కు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కెనడాలో భారత్ వ్యతిరేక కార్యక్రమాలు పెరిగిపోతున్నాయి. ఖలీస్థానీ సానుభూతిపరుడు హర్దిప్ సింగ్ నిజ్జార్ హత్యతో భారత ప్రభుత్వం ప్రమేయం ఉండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం సంచలనంగా మారింది. దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతవాతావరణం నెలకొంది. ట్రూడో వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. నిజ్జార్ హత్యతో రాజుకున్న చిచ్చు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అన్న టెన్షన్ మొదలైంది. తాజాగా కెనడా భారత్ వివాదంపై ప్రపంచ దేశాల నేతలు దృష్టి పెడుతున్నాయి. కెనడా ఆరోపణలను అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తీవ్రంగా పరిగణించాయి. ఈ మేరకు అమెరికా ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. నిజ్జర్ హత్య అంశంపై దర్యాప్తు చేసేందుకు ఒట్టావాకు తాము మద్దతిస్తున్నామని అదే విధంగా దీనికి సహకరించడానికి భారత్‌ను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. చదవండి: కెనడా-భారత్ వివాదం: ప్రముఖ సింగర్ సంగీత కచేరి రద్దు భారత్‌పై కెనడా చేసిన ఆరోపణలు తీవ్రమైనవని యూఎస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ కోఆర్డినేటర్ జాన్ కిర్బీ అన్నారు. దీనిపై కెనడా ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా సమగ్రంగా దర్యాప్తు చేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ విషయాన్ని పూర్తిగా కెనడాకే వదిలేస్తున్నామని తాము ఈ విచారణలో భాగం కావాలనునుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ దర్యాప్తులో సహకరించాలని భారత్‌ను కోరుతున్నామని చెప్పారు. తాను దౌత్యపరమైన సంబంధాలను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కిర్బీ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కెనడా ఆరోపణలను పరిశీలిస్తున్నారని, అవి చాలా తీవ్రమైనవని పేర్కొన్నారు. ట్రూడో ఆరోపణలపై పారదర్శకంగా వ్యవహరించాలని అమెరికా కోరుతోందన్నారు. తాము ఇరు భాగస్వామ్య దేశాలతో తాము టచ్‌లో ఉంటామని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు కెనడా చేస్తున్న ప్రయత్నాలకు తాము మద్దతిస్తున్నామని చెప్పారు. పూర్తి పారదర్శకమైన సమగ్ర దర్యాప్తు సరైన పద్దతి అని తాము విశ్వసిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల వాస్తవంగా ఏం జరిగిందో అందరికీ తెలుస్తుందన్నారు. మరోవైపు కెనడాలో ఉంటున్న భారత పౌరులు, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ప్రయాణాలపై ఆచితూచి వ్యవహరించాలని సూచించింది. ఆందోళన జరిగే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండాలని కోరింది. కెనడా వెళ్లాలనుకునే వారు కూడా వాయిదా వేసుకోవాలని సూచించింది.ఈ మేరకు ప్రత్యేక గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ఎవరీ నిజ్జర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(45) పంజాబ్‌లోని జలంధర్ సమీపంలోని భార్ సింగ్‌పుర గ్రామానికి చెందిన వ్యక్తి. అతడు 1997లో కెనడాకు ప్లంబర్‌గా వలస వెళ్లాడు. నాటి నుంచి ఖలిస్థానీ వేర్పాటువాదులతో బలమైన సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. తరువాత ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ ఏర్పాటు చేశాడు. ఈ సంస్థను భారత్ నిషేధించింది. 2020లో నిజ్జర్‌ను భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది. మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. 2007లో లుథియానాలో జరిగిన బాంబుపేలుడు కేసులో నిజ్జర్ మోస్ట్ వాంటెడ్. ఈ దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా 40 మంది గాయపడ్డారు. అంతేగాక గతేడాది ఓ హత్యకేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ నిజ్జర్‌ను పట్టించిన వారికి రూ.10లక్షల రివార్డును ప్రకటించింది. అయితే ఈ ఏడాది జూన్ 18న కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రేవద్ద గురుద్వారా వద్ద ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కాల్చి చంపారు. -
తైవాన్ చుట్టూ చైనా సైనిక విన్యాసాలు
బీజింగ్: చైనా, తైవాన్‌ల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తైవాన్ ఉపాధ్యక్షుడు విలియం లాయ్ చెంగ్–తె ఇటీవల పరాగ్వే పర్యటకు వెళ్లి తిరిగి వస్తూ శాన్ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ నగరాల్లో ఆగారు. దీంతో డ్రాగన్ దేశం తైవాన్‌కు తీవ్ర హెచ్చరికలు పంపింది. ద్వీపం చుట్టూ శనివారం సైనిక విన్యాసాలకు దిగింది. వేర్పాటువాదులు, విదేశీ శక్తుల కవి్వంపు చర్యలకు ప్రతిగానే తాము ఈ మిలటరీ డ్రిల్స్ చేపట్టినట్టుగా చైనా రక్షణ శాఖ వెల్లడించింది. యుద్ధ విమానాలు, నౌకల్ని కూడా మోహరించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా విడుదల చేసింది. తైవాన్ను శాశ్వతంగా స్వతంత్ర దేశంగా ప్రకటించుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఉపాధ్యక్షుడు విలియం అమెరికాలోని న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కోల్లో పర్యటించారు. తైవాన్ తమ దేశంలో భాగమని అంటున్న చైనా విలియం లాయ్ పర్యటనకి హెచ్చరికగా ఇదంతా చేస్తోంది. మరోవైపు చైనా యుద్ధ విమానాలు తమ గగనతలంలోకి రావడంపై తైవాన్ మండిపడింది. శనివారం ఉదయం నుంచి పదుల సంఖ్యలో యుద్ధ విమానాలు రావడం కవి్వంపు చర్యలకి దిగడమేనని తైవాన్ రక్షణ శాఖ పేర్కొంది. తమ దేశ స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తామని స్పష్టం చేసింది. -
హరియాణాలో మళ్లీ ఉద్రిక్తత
గురుగ్రామ్: మత ఘర్షణలతో అట్టుడికిన హరియాణాలోని నూహ్ జిల్లాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బుధవారం రాత్రి 11.30 గంటలకు ఓ వర్గానికి చెందిన రెండు ప్రార్థనా మందిరాలు స్వల్పంగా దగ్ధమయ్యాయి. ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే, ఒక ప్రార్థనా మందిరం కరెంటు షార్ట్ సర్క్యూట్‌తో, మరొకటి గుర్తుతెలియని కారణాలతో మంటలు అంటుకోవడంతో దగ్ధమైనట్లు పోలీసులు చెప్పారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని చెదరగొట్టారు. గురుగ్రామ్‌లోనూ ఉద్రిక్తత కొనసాగుతోంది. కాగా, హరియాణాలో మత ఘర్షణలకు సంబంధించి ఇప్పటిదాకా 93 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి(హోం) ప్రసాద్ చెప్పారు. 176 మందిని అరెస్టు చేశామని, వీరిలో 78 మందిని పీడీ చట్టం కింద అదుపులోకి తీసుకున్నామని తెలియజేశారు. నూహ్ అల్లర్లలో అరెస్టయిన యువకులు -
మణిపూర్‌లో మళ్లీ హింస
ఇంఫాల్: మణిపూర్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. 150–200 మంది ఉన్న అల్లరి మూక కంగ్లా ఫోర్ట్ సమీపంలో మహాబలి రోడ్డుపై పార్క్ చేసి ఉన్న వాహనాలకు శనివారం నిప్పు పెట్టారు. పోలీసుల ఆయుధాలను తీసుకువెళ్లాలని ప్రయత్నించారు. అల్లరిమూకను అదుపు చేయడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. ఆ తర్వాత ఆర్మీ రంగంలోకి దిగి అల్లరి మూకల్ని చెదరగొట్టింది. పలు జిల్లాల్లో అల్లరిమూకలకి, భద్రతా బలగాలకి మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. గత రెండు రోజుల్లో బిష్ణాపూర్ జిల్లాలో జరిగిన జాతుల మధ్య ఘర్షణల్లో ఒక టీనేజర్, ఒక పోలీసు కమెండో సహా నలుగురు మృతి చెందారు. మెయిటీ వర్గం తమకు ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శన నిర్వహించిన దగ్గర్నుంచి మణిపూర్‌లో హింస భగ్గుమంటోంది. -
ఫ్రాన్స్‌లో ఆగని నిరసనలు
పారిస్: ఫ్రాన్స్‌లో పోలీసు కాల్పుల్లో యువకుడి మృతి ఘటన అనంతరం మొదలైన ఉద్రిక్తతలు మూడో రోజు రాత్రి కూడా కొనసాగాయి. నిరసనకారులు వీధుల్లో అడ్డంకులు ఏర్పాటు చేసి, కార్లు, దుకాణాలు, ప్రభుత్వ భవనాలకు నిప్పుపెడుతున్నారు. పోలీసులపై రాళ్లతో దాడులు చేస్తున్నారు. బాణసంచా కాల్చి పోలీసుల పైకి వదులుతున్నారు. పారిస్ శివారుల్లో ఆందోళనకారులు ఒక బస్‌డిపోకు, రోడ్లపై కార్లకు నిప్పుపెట్టారు. పారిస్‌లోని 12వ డిస్ట్రిక్ట్ పోలీస్‌స్టేషన్‌పై దాడి జరిగింది. రివోలీ వీధిలోని కొన్ని దుకాణాలను, నగరంలోని అతిపెద్ద షాపింగ్ మాల్ ఫోరం డెస్ హాలెస్‌ను దోచుకున్నారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు అధికారులు 40వేల మంది పోలీసులను రంగంలోకి దించారు. టియర్ గ్యాస్, వాటర్ కెనన్లను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొడ్తున్నారు. శివారు ప్రాంతాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పారిస్‌లో బస్సు, ట్రామ్ సర్వీసులను నిలిపివేశారు. ఆందోళనకారుల దాడుల్లో 200 మంది పోలీసులు గాయపడ్డారు. అదుపులోకి తీసుకున్న 667 మంది ఆందోళనకారుల్లో 307 మంది పారిస్ రీజియన్‌కు చెందినవారేనని అధికారులు తెలిపారు. ప్రశాంత పరిస్థితులను నెలకొల్పేందుకు కఠినంగా వ్యవహరిస్తామని అంతరంగిక శాఖ మంత్రి గెరాల్డ్ ప్రకటించారు. ఇలా ఉండగా, పారిస్ శివారు నాంటెర్రె వద్ద మంగళవారం యువకుడిపై కాల్పులు జరిపిన పోలీసు అధికారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన 17 ఏళ్ల నహేల్ కుటుంబం ఆఫ్రికా దేశం అల్జీరియా నుంచి వలస వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనతో మరోసారి ఫ్రాన్స్ పోలీసుల జాతి దురహంకార వైఖరిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాదిలో మరో ఇద్దరిని కూడా పోలీసులు తనిఖీల సమయంలోనే కాల్చి చంపినట్లు చెబుతున్నారు. ఫ్రాన్స్ అల్లర్లు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్కు కూడా పాకాయి. బాహాబాహీకి దిగిన 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు చోట్ల ఆందోళనకారులు భవంతులకు, వాహనాలకు నిప్పుపెట్టారని ప్రభుత్వం తెలిపింది. టీనేజర్లను బయటకు రానివ్వకండి: తల్లిదండ్రులకు మాక్రాన్ వినతి దేశమంతటా వ్యాపిస్తున్న అల్లర్లను అణచివేసే క్రమంలో టీనేజీ యువకులను ఇంట్లోనే ఉంచి తోడ్పడాలని అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మాక్రాన్ తల్లిదండ్రులను కోరారు. దేశంలో అల్లర్లకు సోషల్ మీడియానే హింసను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. శుక్రవారం ఆయన సీనియర్ మంత్రులతో అత్యవసరంగా సమావేశమై శాంతి భద్రతలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడి మృతి అనంతరం అశాంతిని వ్యాపింపజేయడంలో సోషల్ మీడియానే ప్రముఖంగా ఉందన్నారు. హింసాత్మక ఘటనలకు ప్రేరణ కలిగిస్తున్న సామాజిక మాధ్యమ వేదికలైన స్నాప్ చాట్, టిక్‌టాక్ వంటివి సున్నిత అంశాలకు సంబంధించిన కంటెంట్‌ను తొలగించాలని కోరారు. వీడియో గేమ్‌లు యువత మెదళ్లను విషతుల్యం చేస్తున్నాయని, దీంతో కొందరు అస్తమానం వీధుల్లోనే గడుపుతున్నారని వ్యాఖ్యానించారు. -
స్మార్ట్‌గా ఫోబియా.. నలుగురు భారతీయుల్లో ముగ్గురికి నోమో ఫోబియా
న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోనే మీ ప్రపంచమా ? అది లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారా ? ఫోన్ కనిపించకపోయినా, బ్యాటరీ అయిపోయినా వెంటనే మీలో టెన్షన్ పెరిగిపోతోందా ? అయితే మీరు ఒక రకమైన ఫోబియాతో బాధపడుతున్నట్టు లెక్క. మీరు ఒక్కరే కాదు భారత్‌లో స్మార్ట్ ఫోన్ వాడుతున్నవారిలో 75 శాతం మందికి ఇదే ఫోబియా పట్టుకుందని ఒప్పొ, కౌంటర్‌పాయింట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ ఫోబియాని నోమో ఫోబియా అని పిలుస్తారు. అంటే నో మొబైల్ ఫోబియా అని అర్థం. స్మార్ట్ ఫోన్ పని చేయకపోయినా, సిగ్నల్స్ లేకపోయినా, కనిపించకపోయినా, బ్యాటరీ అయిపోయినా విపరీతమైన ఆందోళనకి గురికావడం, ఏదో కోల్పోయినట్టుగా ఉండడం, నిస్సహాయంగా మారిపోవడం, అభద్రతా భావానికి లోనవడం వంటివి దీని లక్షణాలు. భారతీయులు ప్రతీ నలుగురిలో ముగ్గురికి ఈ ఫోబియా ఉందని ఆ అధ్యయనం తేల్చింది. దేశంలోని టైర్ 1, టైర్ 2 నగరాల్లో 1,500 మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులపై ఒప్పొ ఈ అధ్యయనం నిర్వహించింది. బ్యాటరీ లైఫ్ కోసం స్మార్ట్ ఫోన్లని మార్చే వారు చాలా మంది ఉన్నారని, ఒకరకంగా ఈ సర్వే తమ ఉత్పత్తులకి కూడా కీలకంగా మారిందని ఒప్పొ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ దమయంత్ సింగ్ ఖనోరియా చెప్పారు. ► బ్యాటరీ సరిగా పనిచేయడం లేదని 60% మంది ఏకంగా తమ స్మార్ట్ ఫోన్లు మార్చుకున్నారు ► ఫోన్ దగ్గర లేకపోతే మహిళల్లో 74 శాతం మంది ఆందోళనకు లోనవుతారు. పురుషులు మరింత అధికంగా 82% మంది ఒత్తిడికి లోనవుతారు ► బ్యాటరీ ఎక్కడ అయిపోతుందోనని 92% మంది వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పవర్ సేవింగ్ మోడ్‌ని వినియోగిస్తున్నారు ► చార్జింగ్‌లో ఉండగా కూడా ఫోన్ వాడే వారు 87% మంది ఉన్నారు ► వినోద కార్యక్రమాలు చూడడానికే 42% స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. అందులో సోషల్ మీడియాదే అగ్రస్థానం. ► స్మార్ట్ ఫోన్ మన జీవితాలు మార్చేసిందనడంలో ఎలాంటి సందేహం లేకపోయినప్పటికీ దాని వల్ల ఏర్పడుతున్న దుష్ప్రభావాల నుంచి బయట పడడానికి అందరూ ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
మణిపూర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
ఇంఫాల్: మణిపూర్‌లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా మైతీలు, గిరిజనులకు మధ్య నెలకొన్న ఘర్షణలతో అట్టుడికిపోయిన ఇంఫాల్‌లో ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. దీంతో ప్రభుత్వం ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి అదనపు బలగాలను రంగంలోకి దింపింది. కొన్ని జిల్లాల్లో నిరసనకారులకి, భద్రతా దళాలకు మధ్య కాల్పులు ఘటనలు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాల్లో నిరసనకారుల్ని అదుపు చేయడానికి కాల్పులు జరపాల్సిన పరిస్థితి వచ్చిందని పోలీసులు తెలిపారు. శుక్రవారం కేంద్రం మరో 20 కంపెనీల సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ దళాల్ని పంపింది. మరోవైపు రైల్వే శాఖ ముందు జాగ్రత్త చర్యగా ఈశాన్య రాష్ట్రాల్లో తిరిగే పలు రైళ్లను రద్దు చేసింది. -
రెజ్లర్ల దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో రెజ్లర్లు ఆందోళన చేస్తున్న దీక్షా స్థలి ఒక్కసారిగా ఉద్రిక్తతకు కేంద్ర బిందువైంది. రెజ్లర్లు, వారికి మద్దతుగా వచ్చిన ఆప్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగడం, చివరకు తోపులాట, ఘర్షణకు దారితీసింది. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. దీక్షా శిబిరం వద్ద వర్షాలతో రెజ్లర్లు వినియోగిస్తున్న పరుపులు తడిసి ముద్దయ్యాయి. వారికి సాయపడేందుకు కొన్ని చెక్క మంచాలను ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతి తన కార్యకర్తలతో తెప్పించారు. వాటిని రెజ్లర్లకు ఇచ్చేందుకు అనుమతించేది లేదని, జంతర్‌మంతర్‌ను శాశ్వత దీక్షాశిబిరంగా మార్చేందుకు అనుమతులు లేవని అక్కడే మొహరించిన పోలీసులు తెగేసి చెప్పారు. అయినా సరే కొన్ని మంచాలను రెజ్లర్లకు కార్యకర్తలు ఇవ్వడం, వాటిని రెజ్లర్లు శిబిరంలోకి తీసుకెళ్తుండటంతో పోలీసులు, ఆప్ కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది. తమకు సాయపడేందుకు వచ్చిన ఆప్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో రెజ్లర్లు వారితో వాదనకు దిగారు. దీంతో రెజ్లర్లు, కార్యకర్తలను నిలువరించేందుకు పెద్ద ఎత్తున పోలీసులు బలప్రయోగం చేశారు. ఇరువర్గాల వాదనలు చివరకు తోపులాటలు, ఘర్షణకు దారితీశాయి. ఈ ఘటనలో రాహుల్ యాదవ్, దుష్యంత్ ఫొగాట్‌సహా పలువురు రెజ్లర్లకు గాయాలయ్యాయి. వినేశ్ ఫొగాట్ కంటతడి నన్ను తిట్టారు. నేలకు పడేశారు. పురుష పోలీసులు తమతో అనుచితంగా ప్రవర్తించారు. ఒక్క మహిళా పోలీసు అయినా ఉన్నారా ఇక్కడ?. మమ్మల్ని చంపేద్దామనుకుంటున్నారా? చంపేయండి. ఇలాంటి రోజు కోసమేనా మేం దేశం కోసం పతకాలు సాధించింది? అంటూ ప్రముఖ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ కన్నీరు పెట్టుకున్నారు. తాము సాధించిన పతకాలు, కేంద్రం ఇచ్చిన అవార్డులు, పద్మశ్రీ అన్నీ వెనక్కి ఇస్తామని రెజ్లర్లు హెచ్చరించారు. విపక్షాల తీవ్ర ఆగ్రహం రెజ్లర్లపై పోలీసుల దాడి దారుణమని విపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ‘ఆటగాళ్లపై పోలీసుల దాడి సిగ్గు చేటు. సమాఖ్య చీఫ్ శరణ్‌ను ఆ పదవి నుంచి మోదీ తొలగించాలి’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘కోర్టు పర్యవేక్షణలో ఘటనపై దర్యాప్తు జరగాలి. కనీసం ఘటనాస్థలికి వెళ్లి మోదీ రెజ్లర్లకు సంఘీభావం ప్రకటించాలి’ అని కాంగ్రెస్ డిమాండ్చేసింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదితర నేతలూ పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. -
North Korea: మరింత ‘అణు’ దూకుడు
సియోల్: అణు పాటవాన్ని మరింతగా పెంచుకుంటామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. కొరియా ద్వీపకల్పంలో నానాటికీ పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ అత్యున్నత సైనికాధికారులతో ఆయన సమావేశమయ్యారు. అమెరికా–దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు దీటుగా రక్షణ సామర్థ్యాన్ని, యుద్ధ సన్నద్ధతను పెంచుకోవడంపై భేటీలో లోతుగా చర్చ జరిగినట్టు అధికార కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) తెలిపింది. అణ్వాయుధ సామర్థ్యాన్ని భారీగా పెంచాలని ఈ సందర్భంగా అధికారులను కిమ్ ఆదేశించారు. దక్షిణ కొరియాతో మిలిటరీ హాట్‌లైన్ చర్చలకు కూడా ఐదు రోజులుగా ఉత్తర కొరియా ముందుకు రాకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. బహుశా ప్రస్తుత ఉద్రిక్తతలను బూచిగా చూపుతూ దూకుడు చర్యలకు దిగేందుకు ఉత్తర కొరియా యోచిస్తుండవచ్చని దక్షిణ కొరియా అనుమానిస్తోంది. 2023లో ఉత్తర కొరియా ఇప్పటికే 30కి పైగా క్షిపణి పరీక్షలు నిర్వహించింది. వీటిలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉన్నాయి. 2022లో కూడా రికార్డు స్థాయిలో 70కి పైగా క్షిపణి పరీక్షలు జరిపింది. తమను అణ్వాయుధ దేశంగా అంగీకరించేలా, ఆర్థిక ఆంక్షలను సడలించేలా అమెరికాపై ఒత్తిడి పెంచడమే వీటి ఉద్దేశమని భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య అణు చర్చల్లో 2019 నుంచీ ప్రతిష్టంభన నెలకొంది. ఉత్తర కొరియా 2017లో తొలిసారి అణుపరీక్షలు నిర్వహించింది. -
అమెరికా విమానాన్ని ఢీ కొట్టబోయిన చైనా యుద్ధ విమానం
బీజింగ్: దక్షిణ చైనా సముద్రంపై అమెరికా, చైనా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. అమెరికా నిఘా విమానాన్ని చైనాకు చెందిన యుద్ధ విమానం దక్షిణ చైనా సముద్ర జలాలపై దాదాపుగా ఢీ కొట్టబోయింది. చైనా జెట్ అత్యంత ప్రమాదకరంగా దూసుకు రావడంతో అమెరికా నిఘా విమానం పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ముప్పుని తప్పించారు. ఇది డిసెంబర్ 21న జరిగిందని అమెరికా ఇండో ఫసిఫిక్ కమాండ్ వెల్లడించింది. ‘‘అమెరికా వైమానిక దళానికి చెందిన ఆర్సీ–135 దక్షిణ చైనా సముద్రంపై ప్రయాణిస్తుండగా చైనా జే–11 ఫైటర్ జెట్ కేవలం 6 మీటర్ల (20 అడుగులు) దూరంలోకి వచ్చింది. దాదాపుగా ఢీకొట్టినంత పనయింది. దక్షిణ చైనా సముద్రంపై అంతర్జాతీయ గగనతలంలో మేం యథావిధిగా చట్టబద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటే చైనా ఇలా యుద్ధ విమానాలతో సవాల్ విసురుతోంది’’ అంటూ నిందించింది. 2001లో చైనా చేసిన ఇలాంటి పని వల్ల ఆ దేశ విమానం కుప్పకూలి పైలట్ దుర్మరణం పాలయ్యాడని గుర్తు చేసింది. దక్షిణ చైనా సముద్రంపై చైనాకు ఎలాంటి హక్కు లేదని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇచ్చినా డ్రాగన్ దేశం వెనక్కి తగ్గడం లేదు. అక్కడ అమెరికా యుద్ధ విమానాలను, నౌకలను మోహరిస్తూ విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహించడం దానికి మింగుడు పడడం లేదు. అమెరికా తన నిఘా కార్యకలాపాలతో చైనాకు పెనుముప్పుగా మారిందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ ఆరోపించారు. దక్షిణ చైనా సముద్రం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి చర్యలైనా చేపడతామని స్పష్టం చేశారు. -
2,00,000 బలగాలతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడేందుకు రష్యా ప్లాన్!
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై 10 నెలలు కావస్తున్నా ఇంకా ఉద్రిక్తతలు తగ్గడం లేదు. డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ ఉన్నప్పటికీ కాల్పులను తాత్కాలికంగా కూడా విరమించే ప్రసక్తే లేదని రష్యా తేల్చి చెప్పింది. కీవ్‌పై మరోసారి భీకర దాడులకు సిద్ధమవుతోంది. రానున్న రోజుల్లో 2,00,000 బలగాలతో తమపై విరుచుకుపడేందుకు రష్యా వ్యూహం పన్నుతోందని ఉక్రెయిన్ ఆర్మీ చీఫ్ జనరల్ వలేరియ్ జులుజ్నీ తెలిపారు. ది ఎకానమిస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు మాట్లాడారు. తమకు మరిన్ని ఆయుధాలు, క్షిపణి వ్యవస్థలు కావాలన్నారు. రిజర్వ్ బలగాలను, అవసరమైతే పౌరులను కదన రంగంలోకి దించి రష్యా దాడులను తిప్పికొడతామని చెప్పారు. రష్యాపై ఆంక్షలు.. మరోవైపు రష్యా వెనక్కి తగ్గకపోవడంతో ఐరోపా సమాఖ్య మరోమారు ఆ దేశంపై ఆంక్షలు విధించింది. ఇలా చేయడం ఇది 9వ సారి కావడం గమనార్హం. అలాగే రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు 18 బిలియన్ యూరోల ప్యాకేజీని సాయంగా అందించనున్నట్లు ప్రకటించింది. అమెరికా అండ.. ఉక్రెయిన్‌కు యుద్ధంలో సాయం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని అమెరికాను రష్యా హెచ్చిరింది. అయితే అగ్రరాజ్యం మాత్రం మాస్కో వార్నింగ్‌ను లైట్ తీసుకుంది. ఉక్రెయిన్‌కు సాయం చేసి తీరతామని స్పష్టం చేసింది. యుద్ధంలో ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్న రష్యాకు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ వెనుకడుగు వేయడం లేదు. గురువారం కూడా కీవ్‌పై క్షిపణులతో భీకర దాడులు చేసింది. చదవండి: బ్రిటన్ కోర్టులో నీరవ్ మోదీకి షాక్.. త్వరలోనే భారత్‌కు అప్పగింత! -
జిన్‌పింగ్ సౌదీ పర్యటనతో..టెన్షన్లో పడిన అమెరికా
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బుధవారం నుంచి సౌదీ అరేబియాలో మూడు రోజుల అధికారిక పర్యటన చేయనున్నారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్ సౌదీలోని చైనా గల్ఫ్ సహకార మండలి(జీసీసీ) సమావేశంలో పాల్గొంటారు. ఈ మేరకు జిన్‌పింగ్ తన మూడు రోజుల అధికారిక పర్యటన కోసం అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు గల్ఫ్ కింగ్డమ్కి చేరుకుంటారని సౌదీ మీడియా పేర్కొంది. ఈ పర్యటనలో సౌదీ రాజు సల్మాన్ అధ్యక్షతన ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం ఉంటుంది. దీనికి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్‌సల్మాన్ హాజరవుతారని సౌదీ ప్రభుత్వ మీడియా నివేదికలో పేర్కొంది. అలాగే ఆరుగురు సభ్యులతో కూడిన జీసీసీకి చెందిన పాలకుల శిఖరాగ్ర సమావేశానికి జిన్ పింగ్ హాజరవుతారని, పైగా మధ్యప్రాచ్యంలోని ఇతర ప్రాంతాల నాయకులతో కూడా సమావేశమై చర్చలు జరుపుతారని నివేదికలో వెల్లడించింది. జీసీసీ అనేది బహ్రెయిన్ , కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్లతో కూడిన ప్రాంతీయ అంతర్ ప్రభుత్వ రాజకీయ ఆర్థిక సంఘం. ఐతే ప్రస్తుతం జిన్‌పింగ్ సౌదీ రాక అమెరికాను కాస్త కలవరపాటుకు గురిచేస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చమురు అభ్యర్థనను తిరస్కరించిన నేపథ్యంలో సౌదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కి రెడ్‌కార్పెట్ పరిచి ఆహ్వానించటం అనేది యూఎస్‌ని టెన్షన్‌కి గురి చేసే అంశమే. అదీగాక అమెరికా అధ్యక్షుడు వాషింగ్టన్ మధ్య ప్రాచ్యాన్ని బీజింగ్‌కి అప్పగించదు అని తేల్చిన నేపథ్యంలో జరుగుతున్న జిన్‌పింగ్ పర్యటనే కావడం. అంతేగాక వాషంగ్టన్ని ప్రభావితం చేసే దేశాలతో లింక్ అప్ పెంచుకోవాలనే చైనా కోరికను తేటతెల్లం చేస్తోంది ఈ పర్యటన. మరోవైపు సౌదీ ముడి చమురుకి సంబంధించి చైనా ఏ అతిపెద్ద కస్టమర్ కూడా. ఐతే ఈ పర్యటనలో సౌదీ ఆర్థిక వ్యవస్థను చమురు నుంచి వైవిధ్యపరచాలనే ప్రిన్స్ మహ్మద్ ఆలోచనకు అనుగుణంగా మెగాప్రాజెక్టులలో చైనా సంస్థలు మరింతగా భాగస్వామ్యమయ్యేలా ఒప్పందాలపై ఇరు దేశాల నాయకులు చర్చిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. జిన్‌పింగ్ చివరిసారిగా 2016లో సౌదీ అరేబియాను సందర్శించారు. (చదవండి: సినీఫక్కీలో దోపిడీ: జస్ట్ 60 సెకన్లలో 7 కోట్ల విలువైన కార్లను కొట్టేశారు: వీడియో వైరల్) -
COP 27: కాప్ 27లో కాక!
షెర్మెల్ షేక్ (ఈజిప్ట్): ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ పర్యావరణ సదస్సు కాప్ 27 దేశాల మధ్య ఉద్రిక్తతలకు వేదికగా మారింది. విషయం వాడివేడి చర్చల స్థాయిని దాటి ఏకంగా గొడవల దాకా వెళ్లింది. పలు కీలకాంశాలపై ఏకాభిప్రాయం మృగ్యమైంది. దాంతో శుక్రవారం ముగియాల్సిన ఈ 12 రోజుల సదస్సు శనివారమూ కొనసాగింది. అయినా పలు విషయాలపై పీటముడి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఆతిథ్య దేశం ఈజిప్ట్ రూపొందించిన సంప్రదింపుల పత్రం పూర్తిగా నిస్సారమంటూ చాలా దేశాలు పెదవి విరిచాయి. అందులోని పలు అంశాలపై తీవ్ర అసంతృప్తి, అభ్యంతరాలు వెలిబుచ్చాయి. ఇలాగైతే గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమేనంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ‘1.5 డిగ్రీల లక్ష్యం’తో పాటు యూరోపియన్ యూనియన్ తాజాగా చేసిన చాలా ప్రతిపాదనలను సదరు పత్రంలో బుట్టదాఖలు చేయడంపై యూరప్ దేశాలు గుర్రుగా ఉన్నాయి. ఒక దశలో అవి వాకౌట్ చేస్తామని ముక్త కంఠంతో హెచ్చరించే దాకా వెళ్లింది! ఇలాగైతే పత్రంపై యూరప్ దేశాలేవీ సంతకం చేయబోవని ఈయూ కుండబద్దలు కొట్టింది. వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టాలు ప్రమాదకరంగా పెరిగిపోతే భారీగా ముంపు తదితర ముప్పును ఎదుర్కోవాల్సి వచ్చే ద్వీప దేశాల భద్రతను పత్రంలో అసలే పట్టించుకోలేదన్నది మరో అభ్యంతరం. మరోవైపు ఈజిప్ట్ ఈ ఆరోపణలన్నింటినీ ఖండించమే గాక ఆయా దేశాలపై ప్రత్యారోపణలకు దిగుతోంది. ఈ నేపథ్యంలో సదస్సుకు హాజరైన 40 వేల పై చిలుకు ప్రతినిధుల్లో చాలామంది వెనుదిరుగుతుండటంతో ప్రాంగణమంతా బోసిపోయి కన్పిస్తోంది. మరోవైపు, విచ్చలవిడి పోకడలతో పర్యావరణ విపత్తులకు ప్రధాన కారకులైన సంపన్న దేశాలు వాటివల్ల తీవ్రంగా నష్టపోయిన పేద, వర్ధమాన దేశాలను ఆదుకునేందుకు భారీ పరిహార నిధి ఏర్పాటు చేయాలంటూ భారత్ సహా పలు దేశాలు చేసిన డిమాండ్‌పైనా చివరిదాకా ప్రతిష్టంభనే కొనసాగింది. ఎట్టకేలకు నిధి ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడినట్టు మధ్యవర్తులు శనివారం సాయంత్రం ప్రకటించారు. అయితే దానిపైనా ఏకాభిప్రాయం ఇంకా కుదరాల్సే ఉంది! ఇందుకోసం ఏటా ఏకంగా 100 బిలియన్ డాలర్లు వెచ్చస్తామంటూ 2009లో చేసిన వాగ్దానాన్ని సంపన్న దేశాలు ఇప్పటికీ నిలుపుకోకపోవడం గమనార్హం. మరోవైపు, ‘‘శిలాజ ఇంధనాల వాడకాన్ని వీలైనంత త్వరలో పూర్తిగా నిలిపేయాలన్నది గత సదస్సులోనే చేసిన ఏకగ్రీవ తీర్మానం. కానీ ఇప్పటికీ వాటి వాడకం పెరిగిపోతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. నిజానికి శిలాజ ఇంధన పరిశ్రమే సదస్సులో ప్రతి చర్చాంశాన్నీ తన కనుసన్నల్లో నియంత్రిస్తోంది’’ అంటూ వర్ధమాన దేశాలు ఆరోపణలు దుమ్మెత్తి పోస్తున్నాయి. -
ఉభయ కొరియాల మధ్య...ఉద్రిక్తతలు మరింత తీవ్రం
సియోల్: ఉభయకొరియాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఉత్తరకొరియా శనివారం సరిహద్దు ప్రాంతాల్లోకి 180 యుద్ధ విమానాలను తరలించింది. దక్షిణ కొరియా కూడా దీటుగా అత్యాధునిక ఎఫ్–35 ఫైటర్ జెట్లు సహా 80 మిలటరీ ఎయిర్ క్రాఫ్టులను మోహరించింది. ఉత్తర కొరియా బుధవారం రికార్డు స్థాయిలో 20కిపైగా క్షిపణులను ప్రయోగించడం, వాటిలో ఒకటి దక్షిణకొరియా సరిహద్దుల్లో పడటం తెలిసిందే. ప్రతిగా దక్షిణ కొరియా కూడా మూడు గైడెడ్ మిస్సైళ్లను ప్రయోగించింది. గురువారం కూడా ఉత్తరకొరియా ఆరు క్షిపణులు ప్రయోగించడంతో జపాన్ అప్రమత్తమైంది. అమెరికా, దక్షిణ కొరియా 240 యుద్ధ విమానాలతో చేస్తున్న సంయుక్త విన్యాసాలు శుక్రవారంతో ముగియాల్సి ఉంది. తాజా పరిణామాలతో వాటిని శనివారమూ కొనసాగించనున్నారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఉత్తరకొరియా ప్రకటించింది. ఈ తప్పిదానికి పశ్చాత్తాప పడతాయంటూ బెదిరించింది. కానీ, ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వెల్లడించలేదు. అణ్వస్త్ర దేశంగా గుర్తింపు పొందడంతోపాటు ఆంక్షలను ఎత్తివేసేలా అమెరికాపై ఒత్తిడి పెంచేందుకే ఉత్తరకొరియా ఇటువంటి తెగింపు చర్యలకు పాల్పడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. -
స్వాతంత్య్ర వేడుకుల నడుమ ఉద్రిక్తతలు
శివమొగ్గ: స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా శివమొగ్గ నగరంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. సమరయోధుడు సావర్కర్ ఫ్లెక్సీ విషయంలో ఇద్దరు యువకులు కత్తిపోట్లకు గురయ్యారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేశారు. సోమవారం ఇక్కడి హమీద్ అహ్మద్ సర్కిల్ వద్ద వీర సావర్కర్ ఫ్లెక్సీతో సావర్కర్ మద్దతుదారులు ర్యాలీ నిర్వహించగా కొందరు వ్యతిరేకంగా ర్యాలీ చేశారు. ఇదే సమయంలో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు అక్కడికి చేరుకుని సావర్కర్ ఫ్లెక్సీని తొలగించాలని యత్నించారు. దాని స్థానంలో టిప్పు సుల్తాన్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడానికి యత్నిస్తుండగా పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఇదే సమయంలో హిందూ పోరాట సంఘాలు అక్కడి చేరుకోవడంతో గొడవ మరింత పెరిగింది. సర్కిల్‌కు సమీపంలో ప్రేమ్‌సింగ్, ప్రవీణ్ అనే ఇద్దరు యువకులపై గుర్తు తెలియని వ్యక్తులు చాకుతో దాడి చేశారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమించింది. దీంతో నగర వ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు. (చదవండి: జెండా పండుగలో విషాదం) -
ఇరాక్‌లో ఉద్రిక్తతలు.. 3 రోజులుగా పార్లమెంట్‌లోనే నిరసనకారులు
బాగ్దాద్: ఇరాక్‌లో ఉద్రిక్తతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇరాన్ అనుకూల పార్టీలు, షియా గురువు ముఖ్తదా అల్–సదర్ వర్గాల మధ్య రాజధాని బాగ్దాద్‌లో ఘర్షణ వాతావరణం నెలకొంది. అల్–సదర్ అనుచరులు మూడు రోజులుగా పార్లమెంట్లో బైఠాయించారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటవలేదు. ఇరాన్ అండతో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. షియా గురువు అల్–సదర్ అనుచర వర్గం ఆ ప్రయత్నాలను అడ్డుకుంటోంది. ఇరాన్ అనుకూల శక్తుల వైఖరిని వ్యతిరేకిస్తూ సోమవారం బాగ్దాద్‌లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. సంక్షోభం మరింత ముదిరేలా కనిపిస్తోంది. -
Taiwan News: అమెరికా చైనా మధ్య... తైవాన్ తకరారు.. ఏమిటీ వివాదం?
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో ఓవైపు ప్రపంచమంతా అతలాకుతలమవుతున్న నేపథ్యంలో చైనా, తైవాన్ మధ్య తారస్థాయికి చేరుతున్న ఉద్రిక్తతలు కలవరపరుస్తున్నాయి. ఇది చివరికి చైనా–అమెరికా ఘర్షణగా మారుతుందేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తైవాన్ ద్వీపం పూర్తిగా తనదేనని ముందునుంచీ చెబుతూ వస్తున్న చైనా ఈ మధ్య దూకుడు పెంచుతోంది. దాన్ని తనలో కలిపేసుకునేందుకు అవసరమైతే బలప్రయోగానికీ వెనకాడేది లేదని హెచ్చరికలు చేస్తోంది. అదే జరిగితే తైవాన్‌కు రక్షణగా నిలుస్తామన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన ఉద్రిక్తతలను మరింతగా పెంచింది. ఏమిటీ వివాదం? చైనా, తైవాన్ మధ్య వివాదం ఇప్పటిది కాదు. 1949లో చైనాలో అంతర్యుద్ధం ముగిసి మావో నేతృత్వంలో కమ్యూనిస్టులు విజయం సాధించారు. దాంతో నాటి దేశ పాలకుడు, మావో ప్రత్యర్థి చియాంగ్‌కై షేక్ దేశం విడిచి తైవాన్‌లో తలదాచుకున్నాడు. అప్పటి నుంచీ తైవాన్ దాదాపుగా స్వతంత్రంగానే కొనసాగుతూ వస్తోంది. దాదాపు 2.3 కోట్ల జనాభా ఉన్న తైవాన్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వ పాలనలో ఉంది. చైనా మాత్రం 70 ఏళ్లుగా తైవాన్ను మాతృదేశానికి ద్రోహం తలపెట్టిన భూభాగంగా పరిగణిస్తూ వస్తోంది. దాన్ని చైనాలో భాగంగానే గుర్తించాలంటూ ప్రపంచ దేశాలన్నింటిపైనా నిత్యం ఒత్తిడి తెస్తుంటుంది. తైవాన్ దౌత్య కార్యాలయానికి అనుమతిచ్చినందుకు యూరోపియన్ యూనియన్ సభ్య దేశమైన లిథువేనియాతో వాణిజ్య సంబంధాలను చైనా పూర్తిగా తెంచేసుకుంది! కేవలం 16 దేశాలు మాత్రమే తైవాన్‌తో అధికారికంగా దౌత్య సంబంధాలు నెరుపుతున్నాయి. అత్యధిక దేశాలు అనధికారికంగా సంబంధాలు కొనసాగిస్తున్నాయి. తైవాన్ అంతర్జాతీయ హోదాపై ఒక స్పష్టతంటూ లేదనే చెప్పాలి. అమెరికాకేం సంబంధం? చైనాలో విప్లవం నేపథ్యంలో 1970ల దాకా 30 ఏళ్ల పాటు తైవాన్ ప్రభుత్వాన్నే చైనా మొత్తానికీ ప్రతినిధిగా అమెరికా గుర్తిస్తూ వచ్చింది. కానీ 1979లో చైనాతో అమెరికాకు దౌత్య తదితర సంబంధాలు ఏర్పాటయ్యాయి. దాంతో తైవాన్‌తో దౌత్య తదితర బంధాలకు, రక్షణ ఒప్పందాలకు అమెరికా అధికారికంగా స్వస్తి పలికింది. కానీ అనధికారంగా మాత్రం తైవాన్‌తో సంబంధాలను విస్తృతంగా కొనసాగిస్తూనే వస్తోంది. చైనా హెచ్చరికలను పట్టించుకోకుండా ఆత్మరక్షణ కోసం తైవాన్‌కు ఆయుధ విక్రయాలను కూడా కొనసాగిస్తోంది. ఈ ప్రాంతంపై ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు అమెరికా యుద్ధ నౌకలు తైవాన్ జలసంధి గుండా తరచూ రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను కాపాడటమే తమ లక్ష్యమని అమెరికా పైకి చెబుతూ ఉంటుంది. అందుకోసం చైనా, తైవాన్ మధ్య యథాతథ స్థితి కొనసాగాలన్నది అమెరికా వాదన. డొనాల్డ్ ట్రంప్ హయాంలో తైవాన్‌తో సైనిక బంధాన్ని అమెరికా మరింతగా పెంచుకుంది. ఏకంగా 1,800 కోట్ల డాలర్లకు పైగా విలువైన ఆయుధాలను విక్రయించింది. బైడెన్ కూడా ఈ ధోరణిని మరింతగా కొనసాగిస్తున్నారు. చైనా దాడికి దిగేనా? తైవాన్ను విలీనం చేసుకునేందుకు బలప్రయోగానికి వెనకాడేది లేదని చైనా పదేపదే చెబుతూనే ఉంది. 2049కల్లా ‘అత్యంత శక్తిమంతమైన చైనా’ కలను నిజం చేసేందుకు తైవాన్ విలీనం తప్పనిసరని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రకటించారు కూడా. చైనా ఫైటర్ జెట్లు, బాంబర్లు, నిఘా విమానాలు నిత్యం తైవాన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. ఇవన్నీ త్వరలోనే సైనిక ఘర్షణకు దారి తీయొచ్చంటున్నారు. పెరుగుతున్న ‘స్వాతంత్య్రాభిలాష’ మరోవైపు తైవాన్‌లో పూర్తి ‘స్వాంతంత్య్రాభిలాష’ నానాటికీ పెరిగిపోతోంది. 2016లో సై ఇంగ్ వెన్ అధ్యక్షుడయ్యాక ఈ ధోరణి మరింత వేగం పుంజుకుంది. చైనా, తైవాన్ మధ్య 1992లో కుదిరిన ‘ఒకే చైనా’ రాజకీయ ఒప్పందాన్ని అర్థం లేనిదిగా వెన్ కొట్టిపారేస్తుంటారు. తాజాగా యుద్ధ నౌకలో పర్యటించి ఉద్రిక్తతలను మరింతగా పెంచారామె. స్వీయ రక్షణకు ఎంత దూరమైనా వెళ్తామనే ప్రకటనలతో వేడి పెంచారు కూడా. అసలు ఒకే చైనా నిర్వచనంపైనే ఇరు వర్గాలు భిన్న వాదన విన్పిస్తుంటాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Russia-Ukraine war: యూరప్ ఆర్థికం.. అస్తవ్యస్తం
బ్రసెల్స్: ఉక్రెయిన్–రష్యాల మధ్య ఉద్రిక్తతలతో యూరప్ దేశాలు నానా తంటాలు పడుతున్నాయి. యుద్ధ ప్రభావాలతో ఇంధనాల రేట్లు ఎగిసిన నేపథ్యంలో.. ఉమ్మడి కరెన్సీగా యూరోను ఉపయోగించే 19 దేశాల్లో ధరల పెరుగుదల ఏప్రిల్‌లో మరో రికార్డు స్థాయికి చేరింది. మార్చిలో ద్రవ్యోల్బణం 7.4 శాతంగా ఉండగా.. తాజాగా ఏప్రిల్‌లో ఇది 7.5 శాతానికి చేరింది. దీంతో యూరోజోన్‌లో వరుసగా ఆరో నెలా కొత్త రికార్డు స్థాయి నమోదైనట్లయింది. ఫలితంగా కరోనావైరస్ మహమ్మారి నుంచి బైటపడే అవకాశాలపై తీవ్ర ప్రభావాలు పడతాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. యూరోజోన్ దేశాల్లో 34.3 కోట్ల మంది పైగా ప్రజలు ఉన్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని రికార్డు స్థాయికి ఎగదోసిన అంశాలే ప్రస్తుతం యూరోజోన్‌లో ధరల పెరుగుదలకు కారణమని పరిశీలకులు తెలిపారు. ఇంధన ధరలు 38 శాతం అప్.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో ఇంధన ధరలు 38 శాతం పెరిగాయని యూరోస్టాట్ వెల్లడించింది. యుద్ధ ప్రభావంతో ప్రపంచంలోనే అతి పెద్ద చమురు ఎగుమతి దేశాల్లో ఒకటైన రష్యా నుంచి చమురు, గ్యాస్ సరఫరాల్లో ఆటంకాలు ఏర్పడతాయన్న ఆందోళనల కారణంగా ఈ రెండు ఉత్పత్తుల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. చమురు ఎగుమతి దేశాలు, రష్యా సహా వాటి అనుబంధ దేశాలు.. ఉత్పత్తిని పెంచే విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తుండటంతో సమస్య మరింత జటిలం అవుతోంది. ఇక ముడి సరుకులు, విడిభాగాల సరఫరాలో అవరోధాలు దీన్ని ఇంకా తీవ్రం చేస్తున్నాయి. ప్రజలు, ప్రభుత్వాలకు ద్రవ్యోల్బణం సెగ గట్టిగానే తగులుతోంది. భవిష్యత్తుపై దీనిపై తీవ్ర ఆందోళన నెలకొంది. ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. ఇంధన అవసరాల కోసం రష్యా మీద ఆధారపడిన యూరప్ దేశాల పరిస్థితి ప్రస్తుతం ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా తయారైంది. ఉక్రెయిన్ మీద దాడికి దిగిన రష్యా మీద రాజకీయ అవసరాల రీత్యా పోటాపోటీగా ఆంక్షలు ప్రకటించక తప్పడం లేదు. కానీ వాటిని పాటించే పరిస్థి తి లేదు. తమ తమ దేశాల్లో హీటింగ్, విద్యు త్, ఇంధన అవసరాల రీత్యా రష్యా నుంచి ఇంధన దిగుమతులను రద్దు చేసుకునే పరిస్థితుల్లో అవి లేవు. ఇలా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొత్తం మీద యూరోజోన్ ఆర్థిక రికవరీకి తీవ్ర విఘాతం కలిగించేదిగా మారిందని ఫిచ్ రేటింగ్స్ ఎకనమిక్స్ టీమ్ డైరెక్టర్ తేజ్ పారిఖ్ అభిప్రాయపడ్డారు. అటు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వడ్డీ రేట్లను పెంచాలని యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్‌పై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. కానీ ధరలను అదుపు చేసేందుకు రేట్లు పెంచితే .. కోవిడ్, ఇంధన కొరత, యుద్ధం వంటి దెబ్బల నుంచి ఎకానమీలు కోలుకోవడానికి విఘాతం కలుగుతుందనే అభిప్రాయాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఒమిక్రాన్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు విధించిన ఆంక్షలతో 2021 తొలి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి 0.3% నుంచి 0.2%కి మందగించడం వీటికి మరింత ఊతమిస్తున్నాయి. తొలి త్రైమాసికం మధ్యలో మొదలైన యుద్ధ (ఫిబ్రవరి 24) ప్రభావాలు రానున్న నెలల్లో కూడా కనిపిస్తాయని విశ్లేషకులు తెలిపారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఉక్రెయిన్ యుద్ధ ఫలితాలతో రెండో త్రైమాసికంలో యూరోజోన్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మంద గించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం ఎగియడాన్ని చూస్తే జూలైలో ఈసీబీ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయని వివరించారు. -
జేపీ మోర్గాన్ లాభం 42% డౌన్..
న్యూయార్క్: ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ జేపీ మోర్గాన్ చేజ్ నికర లాభం 42 శాతం క్షీణించింది. 8.3 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతలు, భారీ ద్రవ్యోల్బణ ప్రభావాలతో దాదాపు 1.5 బిలియన్ డాలర్ల రష్యన్ అసెట్స్‌ను రైటాఫ్ చేయడం ఇందుకు కారణం. గతేడాది తొలి త్రైమాసికంలో జేపీమోర్గాన్ చేజ్ లాభం 14.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. కరోనా వైరస్ పరిణామాలతో తలెత్తే మొండి బాకీల ప్రొవిజనింగ్ కోసం ముందుజాగ్రత్తగా పక్కన పెట్టిన నిధులను చేజ్ క్రమంగా బైటికి తీస్తుండటంతో గతేడాది లాభాలు భారీ స్థాయిలో నమోదయ్యాయి. ప్రస్తుతం, అందుకు భిన్నంగా రష్యన్ అసెట్స్‌ను రైటాఫ్ చేయాల్సి రావడం, బేస్ ఎఫెక్ట్ వంటి అంశాల కారణంగా బ్యాంక్ లాభాలు తగ్గాయి. రైటాఫ్ చేసిన నిధులు .. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ విభాగం, అసెట్ మేనేజ్మెంట్ వ్యాపారాలకు సంబంధించినవని జేపీ మోర్గాన్ చేజ్ వెల్లడించింది. తొలి త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన వాల్ స్ట్రీట్ దిగ్గజాల్లో మొదటి సంస్థ జేపీ మోర్గాన్ చేజ్. ఈ సంస్థకు రష్యాలో ఒక మోస్తరు స్థాయిలో వ్యాపారం ఉంది. మరోవైపు, రష్యాలో గణనీయంగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, కన్జూమర్ బ్యాంకింగ్ కార్యకలాపాలున్న సిటీగ్రూప్... గురువారం ఆర్థిక ఫలితాలు ప్రకటించనుంది. -
అమెరికా మాట విని ఏకాకి అయిన ఉక్రెయిన్
-
ఇంకా యుద్ధ మేఘాలే
వాషింగ్టన్: రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధం తప్పదన్న వార్తల నడుమ నాటో ఆయుధాలు ఉక్రెయిన్‌కు భారీ సంఖ్యలో చేరుకుంటున్నాయి. రాజధాని కీవ్‌కు నాటో దేశాల నుంచి ఆయుధాల రాక ఆదివారం నుంచీ జోరందుకుంది. వైమానిక దాడులను తిప్పికొట్టడంతో కీలకమైన యూఎస్ తయారీ స్టింగర్ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిసైల్స్, సంబంధిత సామగ్రి కూడా నాటో సభ్య దేశం లిథువేనియా నుంచి కీవ్ చేరింది. రష్యా దూకుడును సమర్థంగా అడ్డుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ సోమవారం అన్నారు. రష్యా ఆక్రమిత క్రిమియా సరిహద్దుల సమీపంలో ఉక్రెయిన్ దళాల కవాతులో ఆయన సోమవారం సైనిక దుస్తుల్లో పాల్గొన్నారు. తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఆయన గంటపాటు ఫోన్లో మాట్లాడారు. మరోవైపు రష్యా దళాలు ఉక్రెయిన్ను ఉత్తర, తూర్పు, దక్షిణ దిశల నుంచి చుట్టుముడుతున్నాయి. సరిహద్దుల్లో సైన్యం సంఖ్య కూడా లక్షన్నరను దాటిందని అమెరికా రక్షణ వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం ఉక్రెయిన్ తలపెట్టిన సైనిక కవాతును లక్ష్యం చేసుకుని దాడికి రష్యా శ్రీకారం చుట్టొచ్చని అమెరికా, యూరప్ నిఘా వర్గాలంటున్నాయి. అయితే ‘‘దాడికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిర్ణయించుకున్నదీ లేనిదీ ఇప్పుడప్పుడే చెప్పలేం. యుద్ధమా, శాంతా, లేక ప్రతిష్టంభన ఇంకొంత కాలం ఇలాగే కొనసాగుతుందా అన్నది ఈ వారంలో తేలిపోతుంది’’ అని రక్షణ నిపుణులు అంటున్నారు. మిత్ర దేశమైన బెలారుస్‌లో రష్యా మోహరించిన భారీ సైన్యం పెద్ద ఎత్తున కవాతులు చేస్తోంది. ఈ దళాల కదలికలను బట్టి పుతిన్ ఉద్దేశాలు స్పష్టమవుతాయని అభిప్రాయపడుతున్నారు. అయితే, సంక్షోభ నివారణకు అమెరికా, యూరప్ దేశాలతో మరిన్ని చర్చలు జరపడం మేలని పుతిన్‌కు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ తాజాగా సూచించడం విశేషం! రష్యా ఉద్దేశాలకు ఇది ఒకరకంగా అద్దం పడుతోందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. యూఎస్ సంకేతాలు రష్యా బుధవారమే యుద్ధానికి దిగవచ్చని నిఘా సమాచారాన్ని ఉటంకిస్తూ బైడెన్ జాతీయ భద్రతా సలహాదారు సలివన్ జోస్యం చెప్పడం తెలిసిందే. దీన్ని నివారించేందుకు యూరప్ దేశాలు మరిన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ పుతిన్‌తో గత సోమవారం ఐదారు గంటలపాటు చర్చలు జరిపారు. సోమవారం ఉక్రెయిన్ అధ్యక్షునితో చర్చించిన జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ స్కుల్జ్ మంగళవారం పుతిన్‌తోనూ భేటీ కానున్నారు. యూరప్‌లో శాంతికి పెను ప్రమాదంలో పడిందని కీవ్ నుంచి ఆయన ట్వీట్ చేశారు. ఉక్రెయిన్ నుంచి అమెరికా, పలు యూరప్ దేశాల దౌత్య సిబ్బంది ఉపసంహరణ ముమ్మరంగా సాగుతోంది. ఉక్రెయిన్, మాజీ సోవియట్ సభ్య దేశాలకు నాటో సభ్యత్వం ఇవ్వొద్దని రష్యా పట్టుబడుతుండటం తెలిసిందే. ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాను ఆపేయాలని, తూర్పు యూరప్ నుంచి నాటో దళాలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తోంది. ఇందుకు యూఎస్ ససేమిరా అనడమే గాక యుద్ధానికి దిగితే ఆర్థిక ఆంక్షలతో పాటు తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని రష్యాను హెచ్చరిస్తోంది. అయితే యూరప్‌లో క్షిపణుల మోహరింపును, సైనిక కవాతును తగ్గించడం వంటి విశ్వాస కల్పన చర్యలకు సిద్ధమని యూఎస్ తాజాగా సంకేతాలిస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షునికి ఇంటిపోరు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఇంటి పోరు ఎక్కువవుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయనకు ప్రజాదరణ బాగా తగ్గిపోతోంది. మరోవైపు విపక్షాలు కూడా కత్తులు నూరుతున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకుని ఆయనను తొలగించి ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీలను గద్దెనెక్కించాలని రష్యా ప్రయత్నిస్తున్నట్టు ఇంగ్లండ్ నిఘా వర్గాలు చెబుతున్నాయి. -
అజర్‌బైజాన్‌పై ఆర్మేనియా క్షిపణి దాడులు!
బాకూ(అజర్బైజాన్): ఇరుగు పొరుగు దేశాలైన అజర్బైజాన్, ఆర్మేనియా మధ్య ఉద్రిక్తతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. రష్యా చొరవతో ఇరు దేశాల మధ్య అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం గంటల వ్యవధిలోనే ఉల్లంఘనకు గురైంది. ఆర్మేనియా సైనిక దళాలు తమ దేశంపై క్షిపణి దాడులకు పాల్పడ్డాయని అజర్బైజాన్ ఆదివారం ఆరోపించింది. తమ దేశంలోనే రెండో అతిపెద్ద నగరం గాంజాలో ఆర్మేనియా జరిపిన క్షిపణి దాడుల్లో 9 మంది పౌరులు మరణించారని, మరో 30 మంది గాయపడ్డారని, ఒక నివాస భవనం ధ్వంసమైందని వెల్లడించింది. మింగచెవిర్ నగరంలోనూ క్షిపణి దాడులు జరిగాయని తెలిపింది. నగొర్నో–కరాబాఖ్ అనే ప్రాంతంపై పట్టుకోసం అజర్బైజాన్, ఆర్మేనియా కత్తులు దూసుకుంటున్నాయి. శతాబ్దాలుగా ఈ వివాదం కొనసాగుతోంది. ఈ ప్రాంతం భౌగోళికంగా అజర్బైజాన్లో ఉన్నప్పటికీ.. దానిపై ఆర్మేనియా ఆధిపత్యం వహిస్తోంది. -
గోల్డ్ రేస్ : రూ 41,000కు చేరిన పసిడి
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలతో పసిడి పరుగులు పెడుతోంది. రెండు రోజుల్లోనే రూ 1800 పెరిగిన పదిగ్రాముల బంగారం సోమవారం ఎంసీఎక్స్‌లో ఏకంగా రూ 41,000 ఆల్‌టైం హైకి ఎగబాకింది. అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధ మేఘాలు ముసురుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా షేర్ మార్కెట్లు పతనమవుతుంటే ముడిచమురు, బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో సోమవారం ఔన్స్ బంగారం ఏడేళ్ల గరిష్టస్ధాయికి చేరింది. అమెరికా డ్రోన్ దాడిలో ఇరాక్ కమాండర్ మృతితో ఇరు దేశ నేతల మధ్య పరస్పర సవాళ్ల నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలుతుంటే మెరుగైన పెట్టుబడిసాధనంగా బంగారంవైపు మదుపుదారులు మొగ్గుచూపడంతో పసిడి ధర పైపైకి వెళుతోంది. బంగారం ధరలు మున్ముందు మరింత భారమవుతాయని త్వరలోనే పదిగ్రాముల బంగారం రూ 42,000కు చేరుతుందని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి : బంగారం.. చమురు భగ్గు! -
రూపాయిని భయపెట్టిన వాణిజ్య ఉద్రిక్తతలు
ముంబై: అమెరికా – చైనా మధ్య తాజా ఉద్రిక్తతలు డాలర్ మారకంలో రూపాయి విలువను బలహీనపరిచాయి. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ గత శుక్రవారంతో పోల్చితే 18 పైసలు తగ్గి, 69.40కి చేరింది. చైనా దిగుమతులపై సుంకాలు పెంచుతామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు ఈక్విటీ మార్కెట్లకు కూడా ప్రతికూలం కావడం రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. క్యాపిటల్ మార్కెట్లలో ఫారెన్ ఇన్వెస్టర్లు నికర అమ్మకాలు జరిపారు. సోమవారం ట్రేడింగ్ మొదట్లోనే రూపాయి బలహీనంగా 69.38 వద్ద ప్రారంభమైంది. క్రూడ్ ధరలు, ఎన్నికల ఫలితంపై అనిశ్చితి వంటి అంశాల నేపథ్యంలో మే నెల మొత్తం రూపాయి తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యే అవకాశం ఉందని నిపుణుల అంచనా. సమీప కాలంలో 70–68 శ్రేణిలో స్థిరీకరణ పొందే అవకాశాలు ఉన్నాయన్నది విశ్లేషణ. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే క్రూడ్ ధరల పతనం భారీ పతనం, ఎన్నికల అనంతరం మోదీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాల నేపథ్యంలో రూపాయి రెండు నెలల క్రితం 68 స్థాయినీ చూసింది. -
ముగిసిన కిసాన్ యాత్ర
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని హరిద్వార్ నుంచి దేశరాజధాని ఢిల్లీ వరకూ తమ సమస్యల పరిష్కారానికి రైతులు చేపట్టిన ‘కిసాన్ క్రాంతి యాత్ర’ బుధవారం ముగిసింది. ఈ యాత్రను యూపీ–ఢిల్లీ సరిహద్దులో పోలీసులు మంగళవారం అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులు బారికేడ్లను ధ్వంసం చేసి ట్రాక్టర్లతో ముందుకు వెళ్లేందుకు యత్నించగా, పోలీసులు లాఠీచార్జి చేయడంతో పాటు వాటర్ కేనన్లు, భాష్పవాయువును ప్రయోగించారు. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున 12.30 గంటలకు రైతులను ఢిల్లీలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. దీంతో దాదాపు 70 వేల మంది రైతన్నలు తమ ట్రాక్టర్లతో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ స్మృతివనమైన ‘కిసాన్ ఘాట్’కు చేరుకున్నారు. అక్కడ చరణ్ సింగ్‌కు నివాళులు అర్పించిన అనంతరం తమ స్వస్థలాలకు తిరుగు ప్రయాణమయ్యారు. -
రష్యా.. మా క్షిపణులు వస్తున్నాయి: ట్రంప్
వాషింగ్టన్/ఐరాస: సిరియా వివాదం అమెరికా, రష్యాల మధ్య ఉద్రిక్తతలను పెంచుతోంది. సిరియాలో ఇటీవల జరిగిన విష రసాయన దాడిని తీవ్రంగా తీసుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఆ దేశంలో క్షిపణి దాడికి వెనుకాడబోమని హెచ్చరించారు. ‘సిరియా వైపు వచ్చే ప్రతీ క్షిపణినీ కూల్చేస్తామని రష్యా అంటోంది. రష్యా.. సిద్ధంగా ఉండు. మా క్షిపణులు వస్తున్నాయి. అవి మామూలువి కావు.. అత్యంత ఆధునిక క్షిపణులవి. సొంతదేశ పౌరులను విషవాయువుతో చంపే జంతువుకు నువ్వు మద్దతివ్వకుండా ఉండాల్సింది’ అంటూ ఒక ట్వీట్ చేశారు. -
రష్యా–బ్రిటన్ మధ్య ముదిరిన దౌత్య యుద్ధం
మాస్కో: రష్యా మాజీ గూఢచారిపై హత్యాయత్నం నేపథ్యంలో బ్రిటన్, రష్యాల మధ్య నెలకొన్న దౌత్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. తమ సిబ్బందిని బహిష్కరించినందుకు ప్రతిగా మరో 50 మంది దౌత్య ప్రతినిధుల్ని తగ్గించుకోవాలని బ్రిటన్‌కు రష్యా స్పష్టం చేసింది. బ్రిటన్‌లో నివసిస్తున్న రష్యా మాజీ ఏజెంట్ సెర్గె స్క్రిపాల్, అతని కుమార్తె యులియాపై విష ప్రయోగం తర్వాత బ్రిటన్, దాని మిత్రదేశాలు తమ దేశాల్లోని రష్యా దౌత్య సిబ్బందిని పెద్ద ఎత్తున బహిష్కరించిన సంగతి తెల్సిందే. ప్రతిగా రష్యా ఇప్పటికే 23 మంది బ్రిటన్ ప్రతినిధుల్ని దేశం విడిచి వెళ్లాలని ఆదేశించగా.. తాజాగా మరో 50 మంది సిబ్బందిని వెనక్కి పిలిపించాలని కోరింది. మాస్కోలోని బ్రిటిష్ రాయబారిని తన కార్యాలయానికి పిలిపించుకున్న రష్యా విదేశాంగ శాఖ ఎంతమంది రష్యా ప్రతినిధుల్ని బహిష్కరించారో అంతే సంఖ్యలో బ్రిటన్ తన సిబ్బందిని తగ్గించుకోవాలని తేల్చిచెప్పింది. 23 దేశాల రాయబారులకు ఆ దేశాల దౌత్య సిబ్బంది రష్యా విడిచి వెళ్లాలని ఆదేశించింది. -
హై టెన్షన్ : 282 విమానాలు రద్దు
బీజింగ్ : చైనా-తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విమానాల ప్రయాణమార్గంపై ఇరుదేశాల మధ్య వివాదం చెలరేగింది. న్యూ ఇయర్ హాలీడే ట్రిప్‌కు తైవాన్ వెళ్లేందుకు ప్రయాణీకులు క్యూ కట్టారు. దీంతో ప్రస్తుతం నడుస్తున్న సర్వీసుల టికెట్లు అన్ని అమ్ముడుపోయాయి. అయినా, తైవాన్ వెళ్లేందుకు రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రత్యేక సర్వీసులను నడపాలని చైనా నిర్ణయించింది. చైనాకు చెందిన చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్, గ్జియామెన్ ఎయిర్‌లైన్స్‌లు 282 ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు సిద్ధమయ్యాయి. ప్రత్యేక సర్వీసులను అనుమతించబోమని తైవాన్ ప్రకటించింది. తైవాన్ చర్యతో చేసేదేమీ లేక చైనా విమానయాన సంస్థలు ప్రత్యేక సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో లూనార్ న్యూ ఇయర్‌ను జాలీగా ఎంజాయ్ చేద్దామనుకున్న వారి ఆశలన్నీ ఆవిరయ్యాయి. కొత్త మార్గాలల్లో విమాన రాకపోకలపై చైనా తమతో చర్చించలేదని వెల్లడించింది. అంతేకాకుండా ఇరుదేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్న ఎమ్503 అనే మార్గం గుండా కూడా సర్వీసు నడుపుతామని చైనా తనంతట తనే ప్రకటించడంపై తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్ వెన్ మండిపడ్డారు. చైనా మరోసారి ఇలాంటి దుందుడుకు చర్యకు దిగితే ఇరు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడతాయని హెచ్చరించారు. -
కాస్గంజ్లో పెరిగిన ఉద్రిక్తత
కాస్గంజ్: పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్ పట్టణంలో గణతంత్ర దినోత్సవ ర్యాలీ సందర్భంగా రేగిన ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. శనివారం కూడా కొందరు ఆగంతకులు విధ్వంసానికి పాల్పడ్డారు. ఓ బస్సు, మూడు దుకాణాలను, ఇతర వాణిజ్య సముదాయాలను తగలబెట్టారు. దీంతో పట్టణంలో శాంతిభద్రతల పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు 144 సెక్షన్ (కర్ఫ్యూ) కొనసాగిస్తున్నారు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి 49 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నగరంలో ఓ విద్యార్థి సంఘం చేపట్టిన తిరంగా ర్యాలీపై మరో వర్గం రాళ్లు రువ్వటంతో చందన్‌గుప్తా ఓ యువకుడు చనిపోగా మరో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. దీంతో వివాదం రేగింది. శనివారం గుప్తా అంత్యక్రియల అనంతరం ఓ వర్గం బస్సును తగులబెట్టగా.. ప్రత్యర్థి వర్గం దుకాణ సముదాయాలపై దాడులు చేసిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని.. ముందు జాగ్రత్త చర్యగా నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నామని యూపీ పోలీసు అదనపు డీజీ ఆనంద్ తెలిపారు. ఈ అల్లర్ల ఘటన దురదృష్టకరమని యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులను వదిలిపెట్టబోమన్నారు. -
పశ్చిమగోదావరి జన్మ భూమి సభలో ఉద్రిక్తత
-
మరిన్ని డోక్లామ్‌లకు సిద్ధమవ్వాల్సిందే
జమ్మూ: భారత్–చైనా సరిహద్దులో భవిష్యత్‌లో డోక్లామ్ లాంటి ఉద్రిక్తతలు తలెత్తితే ఎదుర్కొనడానికి సైన్యం సర్వసన్నద్ధంగా ఉండాలని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పిలుపునిచ్చారు. పర్వత ప్రాంతాల్లో శత్రువుల్ని నిలువరించేందుకు, ఎదురుదాడి చేసేందుకు మోహరించే ‘17 కోర్’ను ప్రబల నిరోధక శక్తిగా మార్చే ప్రక్రియను చేపట్టినట్లు వెల్లడించారు. శనివారం నాడిక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో దేశానికి అందించిన సేవలకు గుర్తింపుగా 47వ ఆర్మర్డ్ రెజిమెంట్‌కు ‘ప్రెసిడెంట్ స్టాండర్డ్’ విశిష్ట గౌరవాన్ని అందజేశారు. అనంతరం విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు రావత్ సమాధానాలిచ్చారు. 17 కోర్‌ను చైనాను దృష్టిలో ఉంచుకునే ఏర్పాటు చేస్తున్నారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ..‘అలా అని ఎందుకు అనుకోవాలి? శత్రువుల చొరబాటును అడ్డుకోవడానికి, దేశ రక్షణకు ప్రమాదకరంగా మారే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి వీటిని ఏర్పాటు చేస్తున్నాం’ అని జవాబిచ్చారు. 2014 జనవరిలో ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ కమిటీ(రక్షణ) ‘17 కోర్’ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 90,274 సైనికులతో 2021 నాటికి ఈ విభాగం పూర్తిస్థాయిలో సిద్ధం కానుంది. కాగా, కశ్మీర్‌లోని యువతలో తీవ్రవాద భావజాలం పెంపొందడానికి సామాజిక మాధ్యమాలే కారణమని రావత్ అన్నారు. దీన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నియంత్రణా రేఖ(ఎల్వోసీ) వెంట పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఇప్పటికీ ఉగ్రవాద శిక్షణా కేంద్రాలు కొనసాగుతున్నాయన్నారు. -
గణతంత్ర వేడుకలో ఉద్రిక్తత
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో గణతంత్ర వేడుకల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా కేంద్రంలోని చారిత్రాత్మక ఖిల్లాలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా అధికారులు ఓ వర్గానికి శకటాల ప్రదర్శనకు అనుమతి ఇవ్వ డం.. అందులో సదరు వర్గానికి చెందిన యువకులు చేసిన నినాదాలు మరో వర్గాన్ని రెచ్చగొట్టినట్లు ఉండడంతో వివాదానికి దారితీసింది. ప్రజాప్రతినిధుల సమక్షంలోనే తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరో పిస్తూ మరో వర్గం యువకులు ఆందోళనకు దిగారు. అన్నివర్గాల ప్రజలు పాల్గొనే జాతీయ పండుగ వేడుకలో ఒక వర్గానికి అనుమతి ఇచ్చిన అధికారులు.. తమకూ అనుమతి ఇవ్వాలంటూ ఆ వర్గానికి చెందిన యువకులు జెండాలతో ఖిల్లాలోకి ప్రవేశించేందుకు ప్రయ త్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఓ పోలీస్ అధికారి కొంత అత్యుత్సాహం ప్రదర్శించడం.. అదే సమయంలో శకటాల ప్రదర్శన నిర్వహించిన యువకులు నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. స్పందనగా మరోవర్గ యువకులూ పరస్పర నినాదాలతో ఖిల్లా ప్రాంగణంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో శకటాల ప్రదర్శన నిర్వహించిన యువకుల తోపాటు, ఆందోళనకు దిగిన మరోవర్గ యువకులనూ పోలీసులు ఖిల్లా నుంచి బయటికి పంపించేశారు. ఖిల్లా బయట ధర్నాకు దిగిన ఆందోళనకారులు ప్రభుత్వా నికి, అధికారులకు వ్యతి రేకంగా నినాదాలు చేశారు. చివరకు ఎస్పీ అనంతశర్మ వచ్చి ముందుగా వ్యతిరేక నినా దాలు చేసిన వారిపై కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. నిష్క్రమించిన ప్రజాప్రతినిధులు..! శకటాల ప్రదర్శన జరిగిన వెంటనే ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వేడుకల మధ్యలో నుంచే వెళ్లిపోయారు. స్థానిక ఎస్సారెస్పీ అతిథిగృహంలో జిల్లా అభివృద్ధిపై విలేకరుల తో మాట్లాడారు. ఈ సందర్భంగా గొడవకు కారణమైన బాధ్యులపై పీడీ యాక్ట్ పెట్టాలని ఎంపీ కవిత అధికారులను ఆదేశించినట్లు టీఆర్ఎస్ జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ సంజయ్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. దీనిSపై ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తీవ్రంగా స్పందిం చారు. ‘ఇది ప్రజాసామ్య దేశం.. ఓ వర్గానికి శకటాల ప్రదర్శనకు అను మతి ఎలా ఇచ్చా రు? అనుమతి ఇస్తే రెండు వర్గాలకు ఇవ్వండి. లేకుంటే ఎవరికీ ఇవ్వొద్దు’ అంటూ కలెక్టర్ శరత్, ఎస్పీ అనంతశర్మలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ.. వేడుకల మధ్యలో నుంచి ఆయన కాలినడక ద్వారా తన ఇంటికి (3 కి.మీ) చేరుకున్నారు. -
ఉద్రిక్తతలు తొలగించుకోవాలి: కిర్బీ
వాషింగ్టన్: కశ్మీర్ వివాదం పరిష్కారానికి భారత్, పాకిస్తాన్ రెండు వైపుల నుంచి చొరవచూపాలని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ అభిప్రాయపడ్డారు. ఇరుదేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తపరిస్థితిని తొలగించుకోవాలని తాము కోరుకుంటున్నామని శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. సమస్య పరిష్కారానికి దేశాల మధ్య అర్థవంతమైన చర్చలు జరగాల్సి ఉందని అన్నారు. యూఎస్ కాంగ్రెస్‌లో పాకస్తాన్ను టెర్రరిస్టు దేశంగా ప్రకటించే బిల్లు ప్రస్తావన గురించి మాట్లాడుతూ.. అలాంటి ప్రత్యేకమైన బిల్లు ఏదీ తాన దృష్టికి రాలేదని కిర్బీ తెలిపారు. అదేసమయంలో చట్టసభల్లో తీసుకోబోయే నిర్ణయాలపై తాను కామెంట్ చేయబోనని అన్నారు. పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతికి చిక్కే అవకాశాలపై పాత్రికేయుల ప్రశ్నకు సమాధానంగా.. పాక్ ఆయుధసంపత్తికి సంబంధించిన భద్రతా వ్యవహారంపై తాను నమ్మకంగా ఉన్నానని కిర్బీ అన్నారు. -
ఒత్తిడిలో వ్యవసాయశాఖ
– మొన్న ఇన్పుట్, రుణమాఫీ, నిన్న ఎరువులు, నేడు రెయిన్గన్లు – సొంతం చేసుకునేందుకు తమ్ముళ్ల పోటీ – టెన్షన్ భరించలేక ఆసుపత్రిపాలైన జేడీఏ, డీడీఏ – అనుమతిస్తే సెలవులో వెళ్లేందుకు ఏడీఏ, ఏవోలు రెడీ అనంతపురం అగ్రికల్చర్: మునుపెన్నడూ లేనివిధంగా వ్యవసాయశాఖ అధికారులు ఒత్తిళ్ల మధ్య నలిగిపోతున్నారు. రైతు ప్రభుత్వమని గొప్పలు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆచరణకు వచ్చే సరికి రైతులకు అరకొర పథకాలు అమలు చేస్తుండటం, వాటిని దక్కించుకునేందుకు అధికార పార్టీ నేతలు అర్రులు చాస్తుండటంతో అధికారులకు దిక్కుతోచడం లేదు. మరో వైపు పథకాల పురోగతిపై క్షేత్రస్థాయికు వెళ్లే అవకాశం ఇవ్వకుండా సమయం సందర్భం లేకుండా సభలు, సమావేశాలు, సమీక్షలు ఏర్పాటు చేస్తుండటంతో జేడీఏ స్థాయి నుంచి ఎంపీఈఓ వరకు సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో పొలంబాట, పొలంపిలుస్తోంది లాంటి కార్యక్రమాలు చేపట్టి రైతులతో మమేకం కావాల్సిన వ్యవసాయశాఖ అధికారులు జిల్లా కేంద్రం, కార్యాలయాలకే పరిమితమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సాధ్యమైనంత ఎక్కువగా కైవసం చేసుకునేందుకు తెలుగు తమ్ముళ్లు ఆరాటపడుతుండటంతో వ్యవసాయశాఖ అధికారుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా తయారైంది. ఈ క్రమంలో ఆ శాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి ఆస్పత్రిపాలవగా డీడీఏ డి.జయచంద్ర కూడా అనారోగ్యం వల్ల సెలవు పెట్టారు. పై అధికారులు అనుమతిస్తే సెలవులో వెళ్లేందుకు సగం మంది ఏడీఏలు, ఏవోలు సిద్దంగా ఉన్నట్లు ఆ శాఖలో చర్చ జరుగుతోంది. సమస్యల వలయంలో అధికారులు 2014 ఖరీఫ్‌కు సంబంధించి మంజూరైన రూ.559 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ పరిహారాన్ని ఇప్పటికీ రైతులకు సరిగా పంపిణీ చేయలేదు. ప్రభుత్వం రుణమాఫీ కూడా సరిగా చేయకపోవడంతో వ్యవసాయశాఖ అధికారులు బుక్ అయ్యారు. ఇపుడు రెయిన్గన్లు, స్ప్రింక్లర్లు, డీజిల్ ఇంజిన్లు, హెచ్డీ పైపుల ద్వారా వేరుశనగ ఎండిపోకుండా రక్షకతడులు ఇస్తున్న కార్యక్రమం ఆ శాఖ అధికారులను మరింత వేధిస్తోంది. ఏపీఎంఐపీతో పాటు ఇరిగేషన్ కంపెనీలు కేవలం పరికరాలు సరఫరా చేసి చేతులు దులిపేసుకోవడంతో పూర్తీ బాధ్యత తమకు అప్పగించడంపై ఏవోలు మండిపడుతున్నారు. ఒక్కో రెయిన్‌గన్ రూ.25 వేలు, ఒక్కో స్ప్రింక్లర్ సెట్ రూ.19 వేలు, ఒక్కో డీజిల్ ఇంజన్ రూ.35 వేలు, ఒక్కో హెచ్డీ పైపు రూ.725 విలువ చేస్తుండటంతో వాటిని ఎలాగైనా వశం చేసుకునేందుకు గ్రామ, మండల స్థాయి నాయకులు ఎత్తులు వేస్తుండటంతో వాటిని ఎలా కాపాడుకోవాలో అర్థంకాని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక నెల రోజుల కిందట వ్యవసాయశాఖకు ఓ కుదుపు కుదిపిన ఎరువుల కుంభకోణం ఏకంగా ఇరువురు ఏడీఏలపై వేటు పడటంతో ఆ శాఖపై మరింత ఒత్తిడి పెరిగింది. ఎవరో చేసిన తప్పిదాలకు తమను బాధ్యులను చేస్తూ ఒత్తిడికి గురి చేస్తుండటంతో మానసికంగా కృంగిపోతున్నారు. -
పరీక్ష రద్దు చేస్తే కోర్టును ఆశ్రయిస్తాం
-
హెచ్‌సీయూలో మళ్లీ ఉద్రిక్తత..!
గచ్చిబౌలి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఓ విద్యార్థి సంఘం షాపింగ్ కాప్లెక్స్ వద్ద సమావేశమైంది. ప్రతిగా మరో విద్యార్థి సంఘం సౌత్ క్యాంపస్ నుంచి ర్యాలీ నిర్వహించింది. ఈ క్రమంలో ఎన్‌హెచ్ హాస్టల్ వద్ద రెండు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో రెండు సంఘాలకు చెందిన ఇద్దరు విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి. ఇటీవల షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న అంబేద్కర్ కాంస్య విగ్రహం మాయం కావడంతో మరో విగ్రహాన్ని తీసుకొచ్చేందుకు ఆదివారం తెల్లవారుజామున ఏఎస్ఏ ప్రయత్నించింది. సెక్యూరిటీ సిబ్బంది విగ్రహాన్ని లోపలికి తీసుకురావద్దని అడ్డుకోవడంతో వెనుదిరిగారు. మళ్లీ ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో క్యాంపస్‌లో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులకు ఫిర్యాదు హెచ్‌సీయూలో జరిగిన ఘర్షణలపై పోలీసులకు ఫిర్యాదు అందింది. మియాపూర్ ఎస్ఐ మహిపాల్‌రెడ్డి తెలిపిన మేరకు.. హెచ్‌సీయూలో జరిగిన ఘర్షణలో కైలాసం అనే విద్యార్థికి గాయాలయ్యాయి. అతన్ని మియాపూర్‌లోని ఓ ఆస్పత్రికి వైద్యం కోసం తీసుకువచ్చారు. ఆ తర్వాత మరోవిద్యార్థి అన్‌మోల్‌సింగ్‌ను సైతం అంబులెన్స్‌లో తీసుకువచ్చారు. ఆ సమయంలో ఏబీవీపీ నాయకుడు సుశీల్ కుమార్ ఆస్పత్రి వద్ద ఉన్నాడు. అన్‌మోల్‌సింగ్‌ను చూపిస్తూ తనపై ఇతనే దాడి చేశాడని కైలాసం..సుశీల్‌కు చెప్పాడు. దీంతో వారి మధ్య చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ మేరకు సుశీల్‌కుమార్ మియాపూర్ పోలీసులకు ఫిర్యాదుచేయగా...అన్మోల్సింగ్పై ఆదివారం కేసు నమోదు చేశారు. కాగా ఈ అంశంపై హెచ్‌సీయూ జేఏసీ నాయకుడు ప్రశాంత్ ‘సాక్షి’తో మాట్లాడుతూ తమ విద్యార్థిపై అక్రమంగా కేసు పెట్టారని ఆరోపించారు. అన్‌మోల్‌సింగ్ కూడా తనపై దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్నారు. కొవ్వొత్తుల ప్రదర్శన.. పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ బలవన్మరణానికి పాల్పడి ఆరునెలలు పూర్తికావడంతోపాటు, కారంచేడు ఘటన జరిగి 31 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వర్సిటీ విద్యార్థులు ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. రోహిత్ చట్టం తీసుకురావాలని నినాదాలుచేశారు. -
బెజవాడ ప్రభుత్వాస్పత్రి వద్ద కలకలం
విజయవాడ : విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రి వద్ద శుక్రవారం కలకలం చోటు చేసుకుంది. ఏలూరు కాల్వలో మగ శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గురువారం పాత ఆసుపత్రిలో గల్లంతైన శిశువుదే సదరు మృతదేహం అని ప్రచారం జరిగింది. దీంతో ఆసుపత్రి వద్ద కలకలం బయలుదేరింది. ఆ మృతదేహన్ని గల్లంతైన బాలుడి తల్లిదండ్రులు పరిశీలించారు. కాలువలో దొరికిన మృతదేహం తమ బాబుది కాదని వారు స్పష్టం చేశారు. -
దాద్రీలో మళ్లీ ఉద్రిక్తత
నిషేధాజ్ఞలు విధించిన జిల్లా కలెక్టర్ గ్రేటర్ నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీలో 9 నెలల తరువాత మళ్లీ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. గోవధకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహ్మద్ అఖ్లాక్ కుటంబంపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలనే డిమాండ్‌తో దాద్రీ తాలూకాలోని బిషాదా గ్రామస్తులు సోమవారం నిరసన సమావేశం నిర్వహించారు. గత ఏడాది సెప్టెంబర్ 28న మహ్మద్ అఖ్లాక్ కుటుంబంపై దాడి జరిగిన సమయంలో స్వాధీనం చేసుకున్నేది గోమాంసమేనని ఇటీవల ఫోరెన్సిక్ నివేదికలో బహిర్గతం కావడం తాజా డిమాండ్‌కు తెరతీసింది. అఖ్లాక్ కుటుంబంపై ఎఫ్ఐఆర్ నమోదు కోసం ఒత్తిడి పెంచడానికి తొలుత గ్రామస్తులు మహాపంచాయతీ నిర్వహించాలని అనుకున్నారు. అయితే పోలీసులు నిషేధాజ్ఞలు, గట్టి భద్రతా చర్యల కారణంగా ఆ ప్రయత్నం విరమించుకున్నారు. నిరసన కార్యక్రమానికి పలువురు స్థానిక శివసేన పార్టీ నాయకులు హాజరైనట్లు తెలిసింది. ఉద్రిక్తత నివారించడానికి గౌతం బుద్ధ్‌నగర్ జిల్లా మెజిస్ట్రేట్ ఎన్పీ సింగ్ సెక్షన్ 144 విధించారు. న లుగురు లేదా ఐదుగురికి మించి గుమిగూడకుండా నిషేధాజ్ఞలు జారీచేశారు. -
‘తుమ్మపాల’లో ఉద్రిక్తత
తలుపులు వేసిసుగర్స్ కర్మాగారం ఎండీ నిర్బంధం పోలీసులు వచ్చి బలవంతంగా తలుపులు తీయించిన వైనం పోలీస్‌స్టేషన్‌కు నాయకుల తరలింపు అనకాపల్లి: తుమ్మపాల చక్కెర కర్మాగారంలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. తమకు జీతాలు చెల్లించేవరకు కదిలేది లేదని కార్మికులు ఎండీ చాంబర్లోకి వెళ్లి తలుపులు వేశారు. ఎండీని గదిలోనే నిర్బంధించారు. మరో వైపు తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన విరమించేదిలేదని రైతులు భీష్మించడంతో కర్మాగారంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. డీఎస్పీ పురుషోత్తం, పట్టణ సీఐ చంద్ర, గ్రామీణ సీఐ ప్రసాద్, అనకాపల్లి పట్టణ, గ్రామీణ, మునగపాకలకు చెందిన ఎస్‌ఐలతోపాటు సుమారు 40 మంది పోలీస్ సిబ్బంది కర్మాగారం వద్దకు వెళ్లి తలుపులను బలవంతంగా తీయించారు. ఈ సమయంలో కొద్దిసేపు ప్రతిఘటన వాతావరణం ఏర్పడింది. ఎండీని పోలీసుల సమక్షంలో బయటకు తీసుకెళ్లారు. ఈ నిరసన కార్యక్రమానికి నేతృత్వం వహించిన సీపీఎం నేత ఎ.బాలకృష్ణ, ఆమ్ఆద్మీపార్టీ నేత ఫణిరాజుతోపాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా యాజమాన్యానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. ఆందోళనకారులపై కేసులు తుమ్మపాల చక్కెర కర్మాగారంలో ఎండీ సత్యప్రసాద్ విధులకు ఆటంకం కలిగిం చిన ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ జి.చంద్ర తెలిపారు. తుమ్మపాల చక్కెర కర్మాగారంలో మంగళవారం విధులు నిర్వహిం చేందుకు ఎండీ సత్యప్రసాద్ చేరుకున్నారు. ఈ సమయంలో అఖిలపక్ష నాయకులు ఎండీ చాంబర్లోకి వెళ్లి, విధులకు ఆటంకం కలిగించడంతో పాటు నిర్బం దించారు. ఈ సమాచారం తెలుసుకున్న పట్టణ సీఐ చంద్ర సంఘటక స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన పోలీసుల విధులకు కూడా ఆటంకం కలిగించడంతో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఫణిరాజు, కొణతాల హరనాథబాబు, ఎ.బాలకృష్ణ, పెంటకోట జగన్నాథం, వై.ఎన్.భద్రం, వి.వి.నర్సింగరావులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. -
మహబూబ్‌నగర్ ఎన్నికల్లో ఉద్రిక్తత
-
కృష్ణాజిల్లాలో క్షుద్రపూజల కలకలం
-
అమెరికాలో వడ్డీ రేట్లపై తర్జన భర్జన
-
పో‘బడు’లెన్నో
ఓ వైపు బదిలీల కౌన్సెలింగ్.. మరోవైపు రెషనలైజేషన్తో టీచర్లలో టెన్షన్ వెయ్యికి పైగా పోస్టులు సర్దుబాటే..! జనరల్ టీచర్లకు మొండిచేరుు ‘పది’ ఫలితాలతో పారుుంట్లు ముడి ఖమ్మం: గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్, పదోన్నతులు, రేషనలైజేషన్ ప్రక్రియకు ఎట్టకేలకు తెరలేచింది. ఈనెల 22 నుంచి వచ్చేనెల 16 వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయూలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. జిల్లాలోని ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలతో ఎన్ని పాఠశాలలు విలీనం చేయూలి? ఎంతమంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేయూలి? ఏ పాఠశాలలో ఎంత మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. పదోన్నతుల ప్రక్రియను చేపట్టేదెలా..? మొదలైన అంశాలపై జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాథ్‌రెడ్డి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. తాము పనిచేస్తున్న పాఠశాల పరిస్థితి ఏమిటి? పోస్టు ఉంటుందా? రేషలైజేషన్‌లో పోతుందా? ఎనిమిది సంవత్సరాలు నిండిన ఉపాధ్యాయులు, ఐదు సంత్సరాలు నిండిన ప్రధానోపాధ్యాయులు ఎక్కడికి వెళ్లాలి? ఖాళీల వివరాలు ఏమిటనే విషయమై ఆరా తీస్తున్నారు. సర్దుబాటు చేయూల్సిందే.. జిల్లాలో తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో వణుకు మొదలైంది. రేషలైజేషన్ ప్రక్రియ కోసం ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో 30 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు ఒక్క ఉపాధ్యాయున్నే ఉంచాలని ప్రకటించడంతో విద్యార్థులు లేని 17 పాఠశాలలు, 10 మంది విద్యార్థులు ఉన్న 91 పాఠశాలలు, 10 నుండి 20 మందిలోపే విద్యార్థులు ఉన్న 336 పాఠశాలలు మొత్తం 444 స్కూల్స్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. గతంలో 20 మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉన్న పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేవారు. కానీ ఇప్పుడు 30 మంది విద్యార్థుల వరకు ఒక్క ఉపాధ్యాయుడే ఉండేలా మార్గదర్శకాలు వెలువడ్డారుు. ఈ లెక్కన జిల్లాలో 850 పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సి వస్తుందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. నూతన మార్గదర్శకాల ప్రకారం 817 పోస్టులు ఏజెన్సీ ప్రాంతం, 477 పోస్టులు మైదాన ప్రాంతంలో సర్దుబాటు చేయాల్సి ఉంటుందని విద్యాశాఖ అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నప్పుడే పాఠశాల సక్రమంగా నడిచేది కాదని, ఇప్పుడు ఒక్కరే ఉంటే ఉపాధ్యాయుడు సెలవుపెట్టినా, వివిధ పనులు నిమిత్తం కార్యాలయాలకు వెళ్లినా, సకాలంలో పాఠశాలకు రాలేకపోయినా బడిమూత పడే ప్రమాదం ఉంటుంది. జిల్లాలో 195 సక్సెస్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధిస్తున్నారు. 50 మంది విద్యార్థులకంటే తక్కువగా ఉన్న సక్సెస్ పాఠశాలలను సమీప పాఠశాలల్లో విలీనం చేస్తే 59 సక్సెస్ స్కూల్స్ విలీనం అయ్యే అవకాశం ఉంది. ఆయా పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం చదివిన విద్యార్థులు పక్క గ్రామాలకు వెళ్లలేక తిరిగి తెలుగు మీడియంలో చేరే పరిస్థితి వస్తోంది. జనరల్ టీచర్స్ ఎక్కడివారు అక్కడే.. నియమితులైనప్పటి నుంచి ఏజెన్సీలోనే పనిచేస్తున్న గిరిజనేతర ఉపాధ్యాయులు తిరిగి అదే ప్రాంతంలో ఉండాల్సి వస్తోంది. నూతన మార్గదర్శకాల్లో ఏజెన్సీ టూ ఏజెన్సీ, ప్లేన్ టూ ప్లేన్ అనే నిబంధ పెట్టడంతో జనరల్ టీచర్స్‌కు మళ్లీ మొండిచేయే ఎదురైంది. 2000 సంవత్సరం డీఎస్సీ కంటే ముందు జిల్లా యూనిట్‌గా నియామకాలు జరిగాయి. ఆ తర్వాత జీవో నంబర్ 3 రావడంతో ఏజెన్సీలోని ఉపాధ్యాయ పోస్టులను అక్కడి నిరుద్యోగులతోనే భర్తీ చేయాలనే ఉత్తర్వులు వచ్చాయి. అయితే అక్కడ పనిచేస్తున్న సుమారు 2000 మందికి పైగా గిరిజనేతర ఉపాధ్యాయులు ఇటు ప్లేన్ ఏరియాకు రాలేకపోవడం, అక్కడ పదోన్నతులకు నోచుకోకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని జనరల్ టీచర్స్ ఫోరంగా ఏర్పడి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. పది ఫలితాలను బట్టి పాయింట్లు పదో తరగతి ఫలితాలే ప్రామాణికంగా ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రత్యేక స్థానం కల్పించారు. అధిక ఉత్తీర్ణత శాతం సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అదనపు పాయింట్లు ఇచ్చారు. 25 శాతానికి లోబడి ఉత్తీర్ణత సాధించిన ఉపాధ్యాయులకు పనిష్మెంట్ ఇచ్చే విధంగా మార్గదర్శకాలు విడుదల చేశారు. జిల్లాలోని పలువురు ఉపాధ్యాయులను మారుమూల ప్రాంతాలకు బదిలీ చేసే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు లెక్కలు వేస్తున్నారు. -
'ఉద్రిక్తతలతో ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు'
వాషింగ్టన్: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పుగా పరిణమిస్తుందని, ఇది ఆఫ్ఘానిస్థాన్కు సంబంధించి పాక్ విధానాలపై ప్రభావం చూపుతుందని అమెరికా కాంగ్రెస్ కమిటీకి ఆ దేశ మిలిటరీ అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు యూఎస్ కాంగ్రెస్ హౌస్ ఆర్మ్ సర్వీస్ కమిటీకి తెలిపారు. ఆఫ్ఘాన్ నుంచి సేనలను ఉపసంహరించడంతో పాక్, ఆఫ్ఘాన్‌లతో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి అమెరికాకు అవకాశం దక్కిందని, తద్వారా రెండు దేశాల సరిహద్దుల్లో హింసకు పాల్పడుతున్న ఉగ్ర సంస్థల కట్టడి చేసేందుకు అవకాశం వచ్చిందన్నారు. -
భారీ మూల్యం !
పూసపాటిరేగ : పోలీసుల దాష్టీకానికి ఓ యువకుడు బలైపోయాడు. తమతోనే వాదిస్తావా అంటూ వారు విచక్షణారహితంగా కొట్టడంతో దెబ్బలు భరించలేక ఏకంగా ప్రాణాలే వదిలాడు. కొప్పెర్ల పార్వతమ్మ జాతరలో జరిగిన ఓ చిన్నగొడవ ఓ వ్యక్తి ప్రాణాలు బలిగొన్న విషయం తెలిసిందే. పిక్కలాట వద్ద జరిగిన వాగ్వాదాన్ని సామరస్యంగా పరిష్కరించవలసిన పోలీసులు తీవ్రంగా కొట్టారని, దీంతో మల్లేశ్వరరావు మృతి చెందాడని అతని బంధువులు ఆందోళనకు దిగడంతో పూసపాటిరేగ పోలీస్‌స్టేషన్‌వద్ద గురువారం రాత్రి ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడ్డాయి. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తెల్లవారుజాము వరకూ వారు ధర్నా చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి... మండలంలోని పాతకొప్పెర్లకు చెందిన పైడి మల్లేశ్వర్రావు(30) కొత్తకొప్పెర్లలో జరుగుతున్న పార్వతమ్మ జాతరకు వెళ్లాడు. జాతరలో పిక్కలు ఆట ఆడుతుండగా నిర్వాహకుడు, పైడి మల్లేశ్వర్రావుల మధ్య స్వల్ప వివాదం జరిగింది.దీంతో నిర్వాహకుడు జాతరలో బందోబస్తు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌కు ఫిర్యాదు చేశాడు. కానిస్టేబుల్ అక్కడకు రావడంతో కానిస్టేబుల్,మల్లేశ్వరరావుకు మధ్య మాటామాటా పెరిగింది. కొంత దూరంలో ఉన్న మిగతా పోలీసులు అక్కడకు చేరుకొని మల్లేశ్వరరావుపై మూకుమ్మడిగా దాడి చేశారు. అక్కడ నుంచి ఇంటికి వెళ్లిన మల్లేశ్వరరావు అపస్మారక స్థితిలోకి చేరుకొన్నాడు. దీంతో బంధువులు చికిత్స కోసం అతనిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పోలీసుల దెబ్బల వల్లే మల్లేశ్వరరావు మృతి చెందాడని, ఘటనకు బాధ్యులైన ముగ్గురు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ మృతదేహాన్ని పోలీస్‌స్టేషన్‌లో ఉంచి ధర్నా చేశారు. సుమారు నాలుగు గంటల పాటు జాతీయరహదారిపై బైఠాయించడంతో సుమారు ఎనిమిది కిలో మీటర్లు మేర రెండు వైపులు వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే భోగాపురం సీఐ వైకుంఠరావు, ఎస్ఐ షేక్ ఫకృద్దీన్లు అక్కడకు చేరుకొని, జెడ్పీటీసీ ఆకిరి ప్రసాదరావు సమక్షంలో మృతుని బంధువులతో చర్చలు జరిపి, న్యాయం చేస్తామని, బాధ్యులైన కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. మృతుడు మల్లేశ్వరరావుకు భార్య, కుమార్తె ఉన్నారు. తహశీల్దార్ జి.జయదేవి సమక్షంలో మృత దేహానికి పంచనామా నిర్వహించారు. పూసపాటిరేగ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఎస్ఐ ఫకృద్దీన్ మాట్లాడుతూ పోలీసులు కొట్టడం వల్ల మల్లేశ్వరరావు మృతి చెందాడా ? లేదా అఘాయిత్యానికి పాల్పడి మృతి చెందాడా ? అనేది పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత తేలుతుందని చెప్పారు. మిన్నంటిన రోదనలు : సరదాగా జాతరకు వెళ్లిన తన బిడ్డ శవంగా మారడంతో మల్లేశ్వరరావు తల్లి కమల రోదిస్తున్న తీరు స్థానికులకు కంటతడిపెట్టించింది. గర్భిణి అయిన మల్లేశ్వరరావు భార్య నాకు దిక్కెవరని రోదించడంతో అక్కడున్న వారందర్నీ కలిచివేసింది. కానిస్టేబుల్ రమేష్ సస్పెన్షన్ విజయనగరం క్రైం: పూసపాటిరేగమండలం పాత కొప్పెర్ల గ్రామంలో పైడి మల్లేశ్వరరావు అనేయువకుడు మృతిచెందిన కేసులో కానిస్టేబుల్ రమేష్‌ను సస్పెండ్ చేసినట్లు విజయనగరం డీఎస్పీ పి.వి.రత్నం తెలిపారు. ఇదే కేసులో అభియోగం ఎదుర్కొంటున్న రాజు, సలీమ్‌లను ఆర్మ్డ్ రిజర్వు విభాగానికి అటాచ్ చేసినట్టు చెప్పారు. ఈ కేసుపై ఎస్సీఎస్టీ సెల్ డీఎస్పీ సయ్యద్ ఇషాక్ మహ్మద్ శుక్రవారం విచారణ జరిపారు. పాత కొప్పెర్ల గ్రామంలోని జాతర సందర్భంగా పోలీసులు కొట్డడం వల్లే యువకుడు మృతిచెందాడని మృతుని బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు డీఎస్పీ సయ్యద్ ఇషాక్మహ్మద్ మృతుని బంధువుల నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం గదిలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు. -
ఉద్రిక్తం
సిటీబ్యూరో: ఇళ్ల కోసం నగరంలోని బస్తీ వాసుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. తాము దరఖాస్తులు స్వీకరించబోమని అధికారులు చెబుతున్నా ఎవరూ వినిపించుకోవడం లేదు. కలెక్టరేట్‌కు జనం పోటెత్తుతున్నారు. ఇలా వచ్చిన వారితో హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద సోమవారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు సంయమనం పాటించడంతో చివరకు ప్రశాంతత నెలకొంది. నగరంలోని వివిధ బస్తీల నుంచి వందలాదిగా జనం కలెక్టరేట్‌కు తరలివచ్చారు. ఉదయం నాలుగు గంటల నుంచే మహిళలు కలెక్టరేట్‌కు వస్తున్నారన్న విషయం గమనించిన జిల్లా గృహ నిర్మాణ సంస్థ సిబ్బంది 7 గంటలకే కార్యాలయానికి చేరుకున్నారు.అప్పటికే లోపలికి ప్రవేశించిన 200 మంది మహిళలను బయటకుపంపించి రెండు ప్రధాన గేట్లకు తాళాలు వేశారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేలోగా పెద్ద సంఖ్యలో మహిళలు అక్కడికి చేరుకున్నారు. గేట్లు మూసివేయడంతో ఆగ్రహించిన మహిళలు... ‘ఇళ్ల దరఖాస్తులు తీసుకోవడం లేద’ంటూ కలెక్టరేట్ వద్ద అధికారులు ఏర్పాటు చేసిన నాలుగు బ్యానర్లను చించేశారు. ఇదే విషయమై ముద్రించిన కరపత్రాలను సిబ్బంది పంచిపెట్టబోగా...వాటినీ చించేశారు. మహిళలు లోనికి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా 50 మందికిపైగా మహిళలు గేటు దూకి లోపలికి చేరుకున్నారు. కలెక్టర్ వాహనం వద్ద బైఠాయించారు. దరఖాస్తులు తీసుకోవాలని పట్టుబట్టారు. అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సుదూర ప్రాంతాల నుంచి వస్తే ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఇళ్లు ఇస్తామంటూ వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలలో ప్రకటిస్తుంటే... మీరు మాత్రం అడ్డుకుంటున్నార’ని శాపనార్ధాలు పెట్టారు. ఒక దశలో సిబ్బందిపై రాళ్లు రువ్వారు. దుమ్ము పోసే ప్రయత్నం చేశారు. ఇంత జరిగినా పోలీసులు, కలెక్టరేట్ సిబ్బంది సంయమనంతో వ్యవహరించారు. ఎట్టకేలకు వారిని శాంతింపజేసి, మధ్యాహ్నానికి అక్కడి నుంచి పంపించేశారు. దండుకుంటున్న దళారులు ఇళ్ల విషయమై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలను దళారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. నగరంలోని వివిధ బస్తీల్లో ఇళ్ల కోసం దరఖాస్తులు పెట్టుకుంటున్నారన్న విషయాన్ని గ్రహించిన దళారులు నాలుగు రాళ్లు కూడబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది ఇళ్లు ఇప్పిస్తామంటూ భారీ మొత్తాలకు బేరాలు పెడుతుంటే... మరికొంతమంది చిన్న చిన్న పనుల పేరుతో దండుకుంటున్నట్టు తెలుస్తోంది. వీరు బస్తీలకు ఫోటోగ్రాఫర్లను రప్పించి రూ.50 వంతున వసూలు చేస్తూ రెండేసి ఫోటోలు ఇప్పిస్తున్నారు. ఒక్కో దరఖాస్తును రూ.20కు విక్రయిస్తున్నారని... దానిని పూర్తి చేయడానికి రూ.10 నుంచి రూ.15 వంతున తీసుకుంటున్నారని పలువురు మహిళలు ఆరోపిస్తున్నారు. అధికారులు దరఖాస్తులు తీసుకోకపోవడంతోవాహన చార్జీలు సహా రూ.100 నుంచి రూ.500 వరకు నష్టపోతున్నామని ఒక మహిళ కలెక్టరేట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. దీన్నిబట్టి దళారుల హవా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వెనుక నుంచి వచ్చిన సిబ్బంది ఇళ్ల కోసం దరఖాస్తులు ఇచ్చేందుకు వందలాది మంది మహిళలు రావడంతో కలెక్టరేట్లో విధులకు హాజరు కావలసిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పక్కనున్న సీసీఎల్ఏ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వెనుక భాగంలో ఉన్న దారి గుండా లోపలికి చేరుకున్నారు. కలెక్టర్ నిర్మల, ఇన్చార్జి జేసీ, డీఆర్‌ఓతో పాటు జిల్లా అధికారులు , ఉద్యోగులు, సిబ్బంది అంతా వెనుక దారి నుంచే కార్యాలయానికి చేరుకున్నారు. దళారులను నమ్మెద్దు.. ఇళ్ల దరఖాస్తులతో రావద్దు: కలెక్టర్ నిర్మల ఇళ్లు ఇప్పిస్తామంటూ డబ్బు వసూలు చేసే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని కలెక్టర్ కె.నిర్మల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇళ్ల కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉందని పేర్కొన్నారు. మార్గదర్శకాలు వచ్చిన వెంటనే ప్రజలకు వాటిపై అవగాహన కల్పించి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అప్పటి వరకు కార్యాలయాల వద్దకు రావద్దని కోరారు. -
యూరియా కోసం యుద్ధం
ఆత్మకూరురూరల్ : తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో సాగు ఆలస్యమై ఆవేదన చెందుతున్న రైతును యూరియా కృత్రిమ కొరత వేధిస్తుంది. బ్లాక్ మార్కెట్లో యూరియాను అధిక ధరలు విక్రయిస్తుండటం, వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా ఎమ్మార్పీకే యూరియా లభిస్తుండటంతో రైతులు ఎగబడుతున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆత్మకూరులోని గ్రోమోర్ ఎరువుల దుకాణం, సిండికేట్ ఫార్మర్స్ సొసైటీల ఆధ్వర్యంలో ఎమ్మార్పీ ధరలకే యూరియా లభ్యమవుతోంది. ఈక్రమంలో వారం రోజు లుగా రైతులు ఈ రెండు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. శుక్రవారం మూడు లోడ్ల యూరియా గ్రోమోర్ దుకాణానికి చేరడంతో రైతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో కార్యాలయ సిబ్బందికి, రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఒక కార్యాలయ ఉద్యోగి యూరియా కావాల్సిన రైతుల పేర్లు ఓ జాబితాలో నమోదు చేశాడు. గ్రోమోర్ కేంద్ర కార్యాలయం నుంచి యూరియా పంపిణీ చేయాలని సకాలంలో ఉత్తర్వులు రాకపోవడంతో మధ్యాహ్నం ఒంటి గంట వరకు సరఫరా చేయలేదు. ఓ తరుణంలో మేనేజరు ఈశ్వర్‌రెడ్డితో రైతులు తగాదాకు దిగారు. దీంతో రైతులకు సమాధానం చెప్పలేక సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. ఆత్మకూరు ఎస్సై వేణుగోపాల్‌రెడ్డి తన సిబ్బందితో గ్రోమోర్ కార్యాలయానికి చేరుకుని జాబితాలో ఉన్న ప్రకారం ప్రతి రైతుకు నాలుగు బస్తాల వంతన స్టాకు ఉన్నంత వరకు అందజేస్తారని క్యూలో నిలబడాలని సర్దుబాటు చేసి చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
ఏపీ రాజధాని గ్రామాల్లో ఉద్రిక్తత
-
మంగళూరులో కొనసాగుతున్న ఉద్రిక్తత
బెంగళూరు: ఇరు వర్గాల మధ్య ఏర్పడిన వైషమ్యాలతో మంగళూరులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం నగరంలోని ఓ వర్గం వారిని బంధించాలని.. మరో వర్గం వారు రోడ్డుకెక్కడంతో వారిని నియంత్రించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. నియంత్రణ కోల్పోయిన ఓ పోలీసు అధికారి ఓ వర్గ పీఠాధిపతిపై చేయి చేసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టి నగరంలో 144 సెక్షన్‌ను విధించారు. -
భారత్, పాక్ సరిహద్దులో ఉద్రిక్తత
జమ్మూ: భారత్, పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జమ్మూకాశ్మీర్‌లోని సరిహద్దు రేఖ వద్ద భారత్, పాక్ భద్రత దళాల మధ్య మంగళవారం మరోసారి కాల్పులు జరిగాయి. దీంతో సరిహద్దు గ్రామాల్లోని వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పాక్ సైన్యం పూంచ్ జిల్లా బల్నోయ్ సెక్టార్‌లోని భారత స్థావరాలపై కాల్పులు జరిపినట్టు రక్షణ శాఖ ప్రతినిధి కల్నల్ మనీష్ మెహతా చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కాల్పులకు దిగినట్టు తెలిపారు. భారత సైన్యం పాక్ దాడులను దీటుగా తిప్పికొడుతున్నట్టు చెప్పారు.