రంగంలోకి యూఎస్ జలాంతర్గామి యుద్ధనౌక తరలింపు వేగవంతం
వాషింగ్టన్: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ బలగాల మోహరింపును అమెరికా మరింతగా పెంచుతోంది. యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్ యుద్ధ నౌక తాజాగా మధ్యదరా సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. దాంతోపాటు ఓ గైడెడ్ మిసైల్ సామర్థ్యంతో కూడిన జలాంతర్గామి యూఎస్‌ఎస్ జార్జియాను కూడా అగ్రరాజ్యం హుటాహుటిన మధ్యప్రాచ్యానికి పంపిస్తోంది. హమాస్, హెజ్బొల్లా అగ్ర నేతలను ఇజ్రాయెల్ ఇటీవల వరుసబెట్టి మట్టుపెట్టడంతో ఇరాన్‌తో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరడం తెలిసిందే.
ఇజ్రాయెల్‌పై పూర్తిస్థాయి యుద్ధానికి ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ ఆదేశాలు కూడా జారీ చేశారు. దాంతో ఇజ్రాయెల్‌ను రక్షించేందుకు మిత్రదేశమైన అమెరికా అన్ని చర్యలూ తీసుకుంటోంది. ఇరు దేశాలూ ఇరాన్ ప్రతి చర్య మీదా నిశితంగా కన్నేసి ఉంచాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో పలు దేశాలు ఇరాన్, ఇజ్రాయెల్‌కు విమాన సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నాయి. ఇజ్రాయెల్‌తో శాంతి చర్చలకు సిద్ధమేనంటూ హమాస్ ఆదివారం మరోసారి సంకేతాలిచి్చంది. ముందుగా పూర్తి యుద్ధ విరామానికి ఇజ్రాయెల్ ఒప్పుకోవాలంటూ షరతు విధించింది.
Comments
Please login to add a commentAdd a comment