mediterranean sea
-
ఎయిర్‌షోలో అపశృతి.. సముద్రంలో కుప్పకూలిన విమానం
ప్యారిస్: ఫ్రాన్స్‌లో ఓ ఎయిర్‌షోలో అపశృతి దొర్లింది. 65 ఏళ్ల పైలట్ ఓ ట్రైనింగ్ విమానంలో ఆకాశంలో విన్యాసాలు చేస్తుండగా మధ్యదరా సముద్రంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ మృతిచెందారు. ప్రమాదానికి గురైన ఫోగా మ్యాగిస్టర్ జెట్ విమానం వరల్డ్‌వార్ 2 తర్వాత తయారైంది కావడం గమనార్హం. ఈ విమానాన్నిఫ్రాన్స్ ఆర్మీ శిక్షణ కోసం వాడుతోంది. విమానంలో ఎజెక్షన్ సీటు లేకపోవడమే పైలట్ మృతికి కారణమని చెబుతున్నారు. -
మధ్యప్రాచ్యంలో అలజడి...
వాషింగ్టన్: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ బలగాల మోహరింపును అమెరికా మరింతగా పెంచుతోంది. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధ నౌక తాజాగా మధ్యదరా సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. దాంతోపాటు ఓ గైడెడ్ మిసైల్ సామర్థ్యంతో కూడిన జలాంతర్గామి యూఎస్ఎస్ జార్జియాను కూడా అగ్రరాజ్యం హుటాహుటిన మధ్యప్రాచ్యానికి పంపిస్తోంది. హమాస్, హెజ్బొల్లా అగ్ర నేతలను ఇజ్రాయెల్ ఇటీవల వరుసబెట్టి మట్టుపెట్టడంతో ఇరాన్‌తో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరడం తెలిసిందే. ఇజ్రాయెల్‌పై పూర్తిస్థాయి యుద్ధానికి ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ ఆదేశాలు కూడా జారీ చేశారు. దాంతో ఇజ్రాయెల్‌ను రక్షించేందుకు మిత్రదేశమైన అమెరికా అన్ని చర్యలూ తీసుకుంటోంది. ఇరు దేశాలూ ఇరాన్ ప్రతి చర్య మీదా నిశితంగా కన్నేసి ఉంచాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో పలు దేశాలు ఇరాన్, ఇజ్రాయెల్‌కు విమాన సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నాయి. ఇజ్రాయెల్‌తో శాంతి చర్చలకు సిద్ధమేనంటూ హమాస్ ఆదివారం మరోసారి సంకేతాలిచి్చంది. ముందుగా పూర్తి యుద్ధ విరామానికి ఇజ్రాయెల్ ఒప్పుకోవాలంటూ షరతు విధించింది. -
‘మధ్యధరా’లో పడవ మునిగి 60 మంది మృతి
కైరో: మధ్యధరా సముద్రంలో పడవ మునిగి 60 మందికి పైగా వలసదారులు దుర్మరణం పాలయ్యారు. యూరప్‌కు బయల్దేరిన ఈ పడవ లిబియా తీర ప్రాంతంలో బోల్తాపడింది. మృతుల్లో చిన్నారులు, మహిళలే ఎక్కువని ఐరాస వలసల విభాగం ఆదివారం వెల్లడించింది. ఈ మార్గంలో కిక్కిరిసిన అక్రమ పడవల్లో ప్రయాణిస్తూ వేలాది మంది నిర్భాగ్యులు పడవ ప్రమాదాలకు బలయ్యారు. ఈ ఏడాదే 2,250 మంది మరణించారని ఐరాస తెలిపింది. -
గ్రీస్ సమీపంలో సరకు నౌక మునక
ఏథెన్స్: గ్రీస్ పరిధిలోని లెస్బోస్ ద్వీపం సమీప మధ్యదరా సముద్ర జలాల్లో ఒక సరకు రవాణా నౌక మునిగిన ఘటనలో నలుగురు భారతీయుల ఆచూకీ గల్లంతైంది. సిబ్బందిలో ఒక్కరిని మాత్రమే కాపాడగలిగామని గ్రీస్ తీర గస్తీ దళాలు వెల్లడించాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో గాలింపు కష్టంగా మారింది. దాదాపు 6,000 టన్నుల ఉప్పుతో ఈజిప్ట్‌లోని అలెగ్జాండ్రియా నుంచి బయల్దేరిన నౌక తుర్కియేలోని ఇస్తాంబుల్‌కు వెళ్తోంది. మార్గమధ్యంలో గ్రీస్‌కు చెందిన లెస్బోస్ వద్ద మునిగిపోయింది. నౌకలోని 14 మంది సిబ్బందిలో నలుగురు భారతీయలు, ఎనిమిది మంది ఈజిప్ట్‌పౌరులు, ఇద్దరు సిరియన్లు ఉన్నారు. ఆదివారం ఉదయం ఏడింటపుడు మెకానికల్ సమస్య తలెత్తిందంటూ ఎమర్జెన్సీ సిగ్నల్ పంపిన నౌక తర్వాత కనిపించకుండా పోయింది. ఒక ఈజిప్ట్ పౌరుడిని మాత్రం రక్షించగలిగారు. ఎనిమిది వాణిజ్య నౌకలు, రెండు హెలికాప్టర్లు, ఒక గ్రీస్ నావికా యుద్ద నౌక గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. ఘటన జరిగన చోట్ల గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. -
Libya Floods: లిబియాలో వరద బీభత్సం
ట్రిపోలీ: లిబియాలో భీకర వరదలు పెను విధ్వంసం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా తూర్పు లిబియాలోని డెర్నా నగరం, పరిసర ప్రాంతాల్లో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా నమోదైంది. కూలిపోయిన ఇళ్ల శిథిలాలను మంగళవారం తొలగిస్తుండగా, వందలాది మృతదేహాలు బయటపడ్డాయి. ఎటు చూసినా శవాల దిబ్బలే కనిపించాయి. లిబియా అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం వరదల్లో దాదాపు 2,800 మందికిపైగా మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మరో 10,000 మంది గల్లంతయినట్లు తెలియజేశాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. కానీ, ఇప్పటిదాకా 1,500 మంది మాత్రమే మరణించారని, 2,000 మంది గల్లంతయ్యారని విమానయాన శాఖ మంత్రి హిషామ్ చికియోత్ ప్రకటించారు. చాలా ఏళ్లుగా నిర్వహణ సరిగ్గా లేని డ్యామ్ కూలిపోవడం వల్ల ఈ ఘోరం జరిగిందని అన్నారు. బీభత్సానికి కారణమేంటి? మధ్యధరా సముద్రంలో ఏర్పడిన డేనియల్ తుపాను కారణంగా లిబియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పై నుంచి వచ్చిన వర్షంనీరు కారణంగా ఆదివారం రాత్రి డెర్నా నగర శివార్లలోని రెండు డ్యామ్‌లు, ధ్వంసం కావడం వల్ల వరద ముంచెత్తినట్లు స్థానికులు చెప్పారు. నగరంలో నాలుగింట మూడొంతుల మేర వరద ప్రభావానికి గురి కావడం గమనార్హం. వరద ధాటికి చాలా ఇళ్లు కూలిపోయాయి. బురద కొట్టుకురావడంతో రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వ అధికారులు సహా యక చర్యల్లో నిమగ్నమయ్యారు. తూర్పు లిబియాలోని అల్–బైదా, అల్–మర్జ్, సౌస, తోబ్రుక్, తాకెనిస్, అల్–బయాదా, బత్తాహ్, బెంఘాజీ తదితర నగరాలు, పట్టణాల్లో సైతం విధ్వంసం జరిగింది. లోతట్టు ప్రాంతాల్లో బురద మేటలు వేసింది. చాలా ఇళ్లు బురదలో కూరుకుపోయాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన లిబియాకు అండగా నిలుస్తామని అమెరికా, ట్యునీషియా, అల్జీరియా, తుర్కియే, యూఏఈ తదితర దేశాలు ప్రకటించాయి. Heartbreaking to see the havoc caused by flash floods in Libya. Its yet another stark reminder of the urgent need for global action on climate resilience and preparedness. #LibyaFloods #ClimateAction #Libya #Libye #LibyaFlood pic.twitter.com/dmu8Gs87iV — مزمل حسین (@Muxammilhusain) September 12, 2023 For a second you will think this street have been bombed, but actually this what the storm #Daniel caused to the city of Darna Just watch the disaster closely#pray4libya #saveLibya#LibyaFloods pic.twitter.com/GwQv2g8oip — Ahmed Mussa (@AhmedMussa218) September 12, 2023 NDABANEWS: BREAKING - #LibyaFlood|#LibyaFloods - Over 5000 people presumed dead and more than ten thousand are still missing in the widespread heavy flooding caused by Storm Daniel. Twenty-five percent of Libya’s eastern city of Derna was wiped out after dams burst in a storm.… pic.twitter.com/08L03rMAZo — Thulani Ndaba (@tndaba) September 13, 2023 Another natural disaster strikes in North Africa, violent storms destroy dams causing mass flooding in Libya 🇱🇾 💔 Some 2000 people feared drowned. Thoughts and prayers for this great people and their damaged nation. #Libya #LibyaFloods pic.twitter.com/GnXnz730fx — Robert Carter (@Bob_cart124) September 12, 2023 ఇది కూడా చదవండి: అమెరికాకు వ్యతిరేకంగా చేతులు కలిపిన రష్యా, ఉత్తర కొరియా -
ప్రమాదకరంగా పైపైకి.. శరవేగంగా పెరుగుతున్న సముద్ర మట్టాలు
వాతావరణ మార్పులు, తద్వారా నానాటికీ పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ ప్రపంచాన్ని నానాటికీ ప్రమాదపుటంచులకు నెడుతున్నాయి. వీటి దుష్పరిణామాలను 2022 పొడవునా ప్రపంచమంతా చవిచూసింది. ఆస్ట్రేలియా మొదలుకుని అమెరికా దాకా పలు దేశాల్లో ఒకవైపు కార్చిచ్చులు, మరోవైపు కనీవినీ ఎరగని వరదలు, ఇంకోవైపు తీవ్ర కరువు పరిస్థితులు, భరించలేని వేడి గాలుల వంటివి జనానికి చుక్కలు చూపాయి. ఆర్కిటిక్ బ్లాస్ట్ దెబ్బకు ఇంగ్లండ్‌తో పాటు పలు యూరప్ దేశాలు గత 40 ఏళ్లలో ఎన్నడూ కనీవినీ ఎరగనంతటి చలి, మంచు వణికించాయి. ఆ వెంటనే అమెరికాపై విరుచుకుపడ్డ బాంబ్ సైక్లోన్ ‘శతాబ్ది మంచు తుపాను’గా మారి దేశమంతటినీ అతలాకుతలం చేసి వదిలింది. 2023లో కూడా ఇలాంటి కల్లోలాలు, ఉత్పాతాలు తప్పవని పర్యావరణ నిపుణులు ఇప్పటినుంచే హెచ్చరిస్తుండటం మరింత కలవరపెడుతోంది. వీటికి తోడు మరో పెను సమస్య చడీచప్పుడూ లేకుండా ప్రపంచంపైకి వచ్చిపడుతోంది. అదే... సముద్ర మట్టాల్లో అనూహ్య పెరుగుదల! ప్రపంచవ్యాప్తంగా అన్ని తీర ప్రాంతాల్లోనూ ఈ ప్రమాదకర పరిణామం చోటు చేసుకుంటోంది. ముఖ్యంగా మధ్యదరా ప్రాంతంలో సముద్ర మట్టాలు మరీ ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న వైనాన్ని తాజా అధ్యయనం ఒకటి వెలుగులోకి తెచ్చింది. ఇదిప్పుడు పర్యావరణవేత్తలందరినీ కలవరపెడుతోంది! 20 ఏళ్లలో 8 సెంటీమీటర్లు! సముద్ర మట్టాల్లో పెరుగుదల తాలూకు దుష్పరిణామాలు మధ్యదరా తీర ప్రాంతాల్లో కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా గత రెండు దశాబ్దాల్లో ఇటలీలోని అమ్లాఫీ తీరం వద్ద సముద్ర మట్టం స్పెయిన్‌లోని కోస్టా డెల్‌సోల్‌తో పోలిస్తే రెండింతలు పెరిగినట్టు పరిశోధకులు తేల్చారు. ‘‘మధ్యదరా పరిధిలో కూడా ఇతర ప్రాంతాలతో పోలిస్తే అడ్రియాటిక్, ఎజియన్, లెవంటైన్ సముద్రాల తీర ప్రాంతాల్లో నీటి మట్టం 20 ఏళ్లలో ఏకంగా 8 సెంటీమీటర్లకు పైగా పెరిగింది. పైగా ఈ పెరుగుదల రేటు ఇటీవలి కాలంలో బాగా వేగం పుంజుకుంటుండటం మరింత ప్రమాదకర పరిణామం’’ అని వారు వెల్లడించారు! తమ అధ్యయనంలో భాగంగా అలలు, ఆటుపోట్ల గణాంకాలతో పాటు మంచు కరిగే రేటుకు సంబంధించి ఉపగ్రహ ఛాయాచిత్రాలు తదితరాలను లోతుగా విశ్లేషించారు. 1989 తర్వాత నుంచీ మధ్యదరా సముద్ర మట్టం శరవేగంగా పెరుగుతోందని తేల్చారు. పరిశోధన ఫలితాలు అడ్వాన్సింగ్ అర్త్ స్పేస్ సైన్సెస్ జర్నల్ తాజాగా ప్రచురితమయ్యాయి. అతి సున్నిత ప్రాంతం నిజానికి మధ్యదరా ప్రాంతం వాతావరణ మార్పులపరంగా ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఒకటి. వరదలు, క్రమక్షయం వంటివాటి దెబ్బకు ఇప్పటికే ఈ ప్రాంతంలోని ప్రపంచ వారసత్వ కట్టడాల్లో ఏకంగా 86 శాతం దాకా లుప్తమయ్యే ముప్పును ఎదుర్కొంటున్నాయి. 2022 మొదట్లో జరిగిన మరో అధ్యయనం కూడా ఇలాంటి ప్రమాదకరణ పరిణామాలనే కళ్లకు కట్టింది. మధ్యదరాతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా సముద్రమట్టాలు గతంలో భావించిన దానికంటే చాలా వేగంగా పెరుగుతున్నాయన్న చేదు వాస్తవాన్ని వెల్లడించింది. గ్రీన్లాండ్ బేసిన్లో పరుచుకున్న అపారమైన మంచు నిల్వలు గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఊహాతీత వేగంతో కరిగిపోతుండటం ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది. దానివల్ల అపారమైన పరిమాణంలో నీరు సముద్రాల్లోకి వచ్చి చేరుతోందని వివరించింది. అంతేకాదు, గ్రీన్లాండ్ మంచు ఇదే వేగంతో కరగడం కొనసాగితే 2100 కల్లా ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు ప్రస్తుతం ఊహిస్తున్న దానికంటే ఏకంగా ఆరు రెట్లు ఎక్కువగా పెరిగిపోతాయని కూడా హెచ్చరించింది. పెను ప్రమాదమే...! సముద్ర మట్టాలు పెరిగితే సంభవించే దుష్పరిణామాలు అన్నీ ఇన్నీ కావు... ► తీర ప్రాంతాలు ముంపుకు గురవుతాయి ► చిన్న చిన్న ద్వీప దేశాలు ఆనవాళ్లు కూడా మిగలకుండా సముద్రంలో కలిసిపోతాయి ► షికాగో మొదలుకుని ముంబై దాకా ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీరాల్లో అలరారుతున్న అతి పెద్ద నగరాలు నీట మునుగుతాయి ► వందలాది కోట్ల మంది నిర్వాసితులవుతారు. ► ఇది ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద ఆర్థిక, సామాజిక సమస్యగా పరిణమిస్తుంది ► సముద్రపు తాకిడి నుంచి ప్రధాన భూభాగాలకు రక్షణ కవచంగా ఉండే చిత్తడి నేలలతో కూడిన మడ అడవులు అంతరిస్తాయి ► వాటిలో నివసించే పలు జీవ జాతులు అంతరించిపోయే ప్రమాదముంది ► నేల క్రమక్షయానికి లోనవుతుంది. సాగు భూమి పరిమాణమూ తగ్గుతుంది ► భారీ వర్షాలు, అతి భారీ తుఫాన్ల వంటివి పరిపాటిగా మారతాయి – సాక్షి, నేషనల్ డెస్క్ -
షాకింగ్: సిగరెట్ వల్లే ఆ ఘోర విమాన ప్రమాదం!
EgyptAir Flight 804 Mishap Details: ఆరేళ్ల కిందట జరిగిన ఓ విమాన ప్రమాదం గురించి దిగ్భ్రాంతి కలిగించే విషయం ఒకటి తెలిసింది. అనేక అనుమానాల నడుమ దాదాపుగా చిక్కుముడి వీడింది. మొత్తం 66 మంది ప్రయాణికులతో 37వేల అడుగులో వెళ్తూ.. సముద్రంలో కూలిన ఈజిప్ట్ ఎయిర్ విమాన ప్రమాదానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈజిప్ట్ విమాన ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన ఫ్రెంచ్ ఏవియేషన్ నిపుణులు.. ప్రమాదానికి ఒక సిగరెట్ కారణమని తేల్చారు. పైలట్ సిగరెట్ అంటించడం వల్ల కాక్‌పిట్‌లో మంటలు చెలరేగాయని, ఫలితంగా విమానం కుప్పకూలిందని నిర్ధారించారు. దర్యాప్తునకు సంబంధించి 134 పేజీల నివేదికను పారిస్‌లోని అప్పీల్ కోర్టులో గత నెల సమర్పించారు. ఇందుకు సంబంధించిన వివరాలతో ‘న్యూయార్క్ పోస్ట్’ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించడంతో ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. తొలుత ఈ విమాన ప్రమాదాన్ని ఉగ్రవాద దాడిగా ఈజిప్ట్ ప్రకటించింది. కానీ, ఏ ఉగ్రసంస్థ కూడా దానిని తామే చేసినట్లు నిర్ధారించలేదు. ఈ తరుణంలో విమానంలోని లోపమే కారణమని ఇంతకాలం అనుకున్నారు. అయితే.. ఆ విమానం 2003 నుంచే సర్వీసుల్లోకి అడుగుపెట్టింది. అంటే కేవలం 13 ఏళ్ల సర్వీసు మాత్రమే పూర్తి చేసుకుంది. సాధారణంగా ఆ విమానం లైఫ్ 30 నుంచి 40 ఏళ్ల ఉంటుంది. ఈ నేపథ్యంలో అనుమానాలు.. విస్తృతస్థాయి దర్యాప్తు వైపు అడుగులు వేయించాయి. కాక్‌పిట్‌లో పైలట్ సిగరెట్ వెలిగించగానే అత్యవసర మాస్క్ నుంచి ఆక్సిజన్ లీకై కాక్‌పిట్‌లో మంటలు చెలరేగాయి. ఫలితంగా విమానం కుప్పకూలిందని దర్యాప్తు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. కాక్‌పిట్‌లో మంటలు అంటుకున్న సమయంలో సిబ్బంది భయంతో అరుస్తున్న శబ్దాలు మాస్క్‌కు ఉన్న మైక్రోఫోన్లో రికార్డయ్యాయి. ఇక పైలెట్ సిగరెట్ పొగ పీల్చినట్లు రికార్డయిన శబ్దాల గురించి ఇటాలియన్ పత్రిక కార్రియర్ డెల్లా సెరా కూడా ఓ కథనం ప్రచురించింది. ప్రమాదానికి గురైన ఈజిప్ట్ ఎయిర్ విమానయాన సంస్థకు చెందిన ఎయిర్‌బస్-ఎ320, 2016 మే 19న తేదీన పారిస్ నుంచి ఈజిప్ట్ రాజధాని కైరోకు బయలుదేరింది. గ్రీక్ ద్వీపాలకు 130 నాటికల్ మైళ్ల దూరలో రాడార్ నుంచి విమానం అదృశ్యమైంది. ఆ తర్వాత కాసేపటికే క్రెటె ద్వీపం సమీపంలో తూర్పు మధ్యధరా సముద్రంలో కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో 40 మంది ఈజిఫ్ట్ పౌరులు, 15 మంది ఫ్రెంచ్ పౌరులు సిబ్బంది సహా మొత్తం 66 మంది ఉండగా, అంతా ప్రాణాలు కోల్పోయారు. చదవండి: పాక్-అఫ్గన్.. డామిట్ కథ అడ్డం తిరిగింది! -
స్కూల్ బస్సు హైజాక్.. ఆపై నిప్పు
రోమ్: ఇటలీలో ఓ పాఠశాల బస్సు డ్రైవర్ 51 మంది పిల్లలున్న బస్సును హైజాక్ చేసి బస్సుతోపాటు వాళ్లందరినీ తగులబెట్టాలని చూశాడు. అదృష్టవశాత్తూ పోలీసులకు సమాచారం అంది వారు వచ్చి మంటల్లో చిక్కుకున్న పిల్లలందర్నీ రక్షించగలిగారు. డ్రైవర్‌ను అరెస్టు చేశారు. ఆఫ్రికా నుంచి మధ్యధరా సముద్రం మీదుగా ఇటలీలోకి వలస వస్తున్న వారిపై ఇటలీ ఉప ప్రధానుల వైఖరికి నిరసనగా ఈ పని చేసినట్లు ఆ డ్రైవర్ చెప్పాడు. ‘మధ్యధరా సముద్రంలో ఎంతో మంది చనిపోతున్నారనీ, ఈ రోజు మీరు∙చావబోతున్నారు’ అని అతను విద్యార్థులతో అన్నాడు. 51 మంది విద్యార్థులు, ముగ్గురు సిబ్బంది ఓ క్రీడా వేదికకు వెళ్లొస్తుండగా డ్రైవర్ ఈ హైజాక్‌కు పాల్పడ్డాడు. 30 నిమిషాలపాటు వారిని తన బందీలుగా ఉంచుకున్నాడు. వెంట తెచ్చిన పెట్రోల్‌ను బస్‌పై పోసి నిప్పంటించాడు. ఓ విద్యార్థి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి హైజాక్ విషయం చెప్పడం, వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సత్వరమే పోలీసులు అక్కడకు చేరుకుని, బస్సు అద్దాలు పగులగొట్టి అందరినీ రక్షించారు. -
మధ్యదరాలో 170 మంది జలసమాధి!
ట్రిపోలి: ఉత్తర ఆఫ్రికా నుంచి యూరప్ బయల్దేరిన రెండు పడవలు మధ్యదరా సముద్రంలో మునిగిపోయిన ప్రమాదాల్లో కనీసం 170 మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. అందులో ఒకటి లిబియా తీరంలో మునిగిపోగా, మరొకటి మొరాకో సమీపంలో మరో పడవను ఢీకొట్టి గల్లంతైనట్లు తెలిసింది. లిబియా తీరంలో ప్రమాదానికి గురైన పడవలో 120 మంది ప్రయాణిస్తున్నారని, అందులో ముగ్గురిని ప్రాణాలతో కాపాడినట్లు ఇటలీ నేవీ ప్రకటించింది. మిగతా వారి జాడ తెలియాల్సి ఉందని తెలిపింది. మొరాకో సమీపంలో వేరే పడవ మరో పడవను ఢీకొనడంతో 53 మంది వలసదారులు గల్లంతైనట్లు స్పెయిన్ సహాయక బృందాలు వెల్లడించాయి. ఈ రెండు ప్రమాదాల్లో ఎందరు మృతిచెందారో ఐక్యరాజ్య సమితి శరణార్థుల సంస్థ ధ్రువీకరించాల్సి ఉంది. ఇదిలా ఉండగా, లిబియాకు ఉత్తరంగా ఉన్న జువారా పట్టణంలో ప్రమాదంలో చిక్కుకున్న పడవ నుంచి 47 మందిని కాపాడినట్లు జర్మనీ సహాయక బృందాలు తెలిపాయి. గత ఏడాది మధ్యదరాలో 2 వేల మందికి పైగా వలసదారులు మృతి చెందడమో, గల్లంతవడమో జరిగింది. -
మధ్యదరా సముద్రంలో మునిగిన వలసదారుల పడవ
-
లిబియాలో శరణార్థులు గల్లంతు!
పారిస్: లిబియా నుంచి యూరోప్‌కు అక్రమ వలసదారులతో వెళ్తున్న ఓ పడవ మధ్యధరా సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 90 మంది శరణార్థులు గల్లంతైనట్లు సమాచారం. గల్లంతైన వారిలో 10 మంది మృతదేహాలు లిబియా తీర పట్టణమైన జవారా ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. వీరిలో 8 మంది పాకిస్తానీయులు, ఇద్దరు లిబియాకు చెందిన వారు ఉన్నట్లు భావిస్తున్నారు. పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కటం వల్లే పడవ మునిగిపోయిందని ప్రాథమికంగా నిర్ధారించినట్లు అంతర్జాతీయ వలస సంస్థకు చెందిన ప్రతినిధి ఒలివియా హెడన్ తెలిపారు. గల్లంతైన వారిలో ఎక్కువ మంది పాక్‌కు చెందిన వారే ఉన్నారని ఆమె పేర్కొన్నారు. -
33 వేల మంది జల సమాధి
వాషింగ్టన్ : యూరోపియన్ యూనియన్ను చేరుకునేందుకు మధ్యదరా సముద్రంలో సాహస ప్రయాణం చేస్తూ ఇప్పటివరకూ 33 వేల మంది జల సమాధి అయినట్లు ఐక్యరాజ్యసమితి ఓ ప్రకటనలో విడుదల చేసింది. ప్రపంచంలోని సరిహద్దుల్లో అత్యంత ప్రమాదకర, ప్రాణాంతక సరిహద్దుగా మధ్యదరా తీరాన్ని గుర్తించినట్లు చెప్పింది. 2000 నుంచి 2016 వరకూ మధ్యదరా మరణించిన శరణార్థుల వివరాలను శుక్రవారం వెల్లడించింది. లిబియా నుంచి వచ్చే శరణార్థులను అడ్డుకునేందుకు టర్కీతో యూరోపియన్ యూనియన్ ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల కొంతమేర మరణాలను తగ్గించినట్లయిందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్(ఐఓఎమ్) పేర్కొంది. అయితే, ఐక్యరాజ్యసమితి వెల్లడించిన మృతుల సంఖ్య వాస్తవానికి దూరంగా ఉందని యూరోపియన్ యూనివర్సిటీ అధ్యాపకుడు ఫిలిప్ అభిప్రాయపడ్డారు. మధ్యదరా పొట్టనబెట్టుకున్న వారి సంఖ్య 33 వేలకు పైమాటేనని తెలిపారు. 2017లో దాదాపు లక్షా 61 వేల మంది శరణార్థులు యూరోపియన్ యూనియన్‌కు వచ్చినట్లు ఐఓఎమ్ వెల్లడించింది. -
26 మంది బాలికల మృతదేహాల కలకలం
మధ్యధరా సముద్రంలో 26 మృతదేహాలు లభ్యం కాగా, అవన్నీ మైనర్ బాలికలవి కావడం కలకలం రేపింది. ఈ మృతదేహాలను ఇటలీ నావికాదళ అధికారులు ఆదివారం గుర్తించినట్లు తెలుస్తోంది. ఆఫ్రికా వాసులు పడవల్లో ప్రమాదకరమైన జర్నీ చేస్తూ ఎంతో మంది అమాయకులు నడి సంద్రంలో ముగినిపోవడం గతేడాది నుంచి తరచుగా చూస్తున్నాం. ఇలాంటి ఘటనల్లో ఇది ఒకటని భావించడానికి వీల్లేదని అధికారులు భావిస్తున్నారు. దక్షిణ ఇటలీ సాలోర్నో సిటీకి చెందిన అధికారి లోరెనా సిక్కోట్టి మాట్లాడుతూ.. సాధారణంగా మృతదేహాలు లభ్యమైనప్పుడు అందులో మహిళలు, చిన్నారులు, వృద్ధులవి ఎక్కువ కాగా, పురుషుల మృతదేహాలు తక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ మాకు దొరికినవి 26 మృతదేహాలు కాగా, అవన్నీ 14-18 ఏళ్లలోపున్న మైనర్ బాలికలవి కావడంతో ఆశ్చర్యానికి లోనయ్యాం. వీరిని ఎవరైనా లైంగికంగా వేధించారా.. అత్యాచారానికి పాల్పడిన అనంతరం హత్యచేసి సముద్రంలో మృతదేహాలు పడవేశారా అన్న దానిపై విచారణ చేపట్టినట్లు వివరించారు. గత ఆదివారం శరణార్థులకు చెందిన ఓ పడవ గల్లంతుకాగా, దాదాపు 60 మందిని ఇటలీ అధికారులు రక్షించినట్లు సమాచారం. యూఎన్ఓ శరణార్థుల హైకమిషనర్ మార్కో రొటున్నో మాట్లాడుతూ.. లిబియా పడవ మునక దుర్ఘటనలో 26 మంది చనిపోయి ఉండొచ్చునని చెప్పారు. -
మధ్యధరాలో పడవల మునక..250 మంది మృతి!
-
మధ్యధరాలో పడవల మునక..250 మంది మృతి!
రోమ్: మధ్యధరా సముద్రంలో 250 మంది ఆఫ్రికన్ శరణార్థులు మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. లిబియా తీరానికి 15 కి.మి. దూరంలో సగం మునిగి, సగం తేలుతున్న రెండు రబ్బరు బోట్లను సహాయక సిబ్బంది గుర్తించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మునిగిపోయిన బోట్ల సమీపంలో ఐదు మృతదేహాల్ని స్పెయిన్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ సహాయక బోటు వెలికితీసింది. ఆ పడవల్లో భారీగా శరణార్థులు ఉండొచ్చని స్వచ్ఛంద సంస్థకు చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు. ఒక్కో పడవకు 120 నుంచి 140 మందిని తీసుకెళ్లే సామర్థ్యం ఉంటుందని చెప్పారు. మొత్తంగా 250 మంది శరణార్థులు మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. లభ్యమైన మృతదేహాలు ఆఫ్రికన్లవని, వారి వయసు 16–25 మధ్య ఉండొచ్చని వెల్లడించారు. -
4,700 మంది వలసదారులు మృతి
జెనీవా: బతుకును వెతుకుతూ యూరప్‌కు వలస వెళ్తున్న వారి జీవితాలు మధ్యలోనే మధ్యధరా సముద్రం పాలవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటిరకు యూరప్‌కు వలస వెళ్లడానికి ప్రయత్నించిన 4,700 మంది మధ్యధరా సముద్రంలో మృతి చెందారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్(ఐఓఎమ్) తాజాగా వెల్లడించింది. అంతకు ముందు సంవత్సరాలతో పోల్చినప్పుడు యూరప్ వలసదారుల సంఖ్య తగ్గినప్పటికీ.. మధ్యధరా సముద్రంలో మృతి చెందిన వారి సంఖ్య మాత్రం పెరిగింది. 2015లో నవంబర్ 30 నాటికి మధ్యధరా సముద్రంలో మృతి చెందిన వలసదారుల సంఖ్య 3,565గా ఉంది. ఐఓఎమ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత ఏడాది సముద్రమార్గం గుండా యూరప్ చేరుకున్న వలసదారుల సంఖ్య 8,83,393 గా ఉండగా.. 2016లో ఈ సంఖ్య 3,48,664కు తగ్గింది. అయినప్పటికీ మధ్యధరా సముద్రంలో మృతుల సంఖ్య మాత్రం పెరగడం గమనార్హం. పశ్చిమ ఆఫ్రికా నుంచి ఇటలీకి చేరుకునే క్రమంలో ఎక్కువమంది వలసదారులు మృతి చెందినట్లు ఐఓఎమ్ వెల్లడించింది. -
పడవ ప్రమాదం: 25 మంది మృతి
రోమ్: మధ్యధరా సముద్రంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. లిబియా తీర ప్రాంతంలో వలసదారులతో వెళ్తున్న పడవ ప్రమాదానికి గురికావడంతో సుమారు 25 మంది మృతి చెందారు. ఫ్రెంచ్ సహాయక బృందం 'డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్' ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ప్రమాదంలో 107 మందిని సహాయక బృందాలు రక్షించాయి. రబ్బర్ బోట్లో రసాయనాల మూలంగా కాలిన గాయాలతో కొందరు క్షతగాత్రులు ఉన్నారని, వీరిని ఇటలీకి తరలించడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బోట్ ఇంధనం లీక్ కావడం మూలంగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఉత్తర ఆఫ్రికా నుంచి మధ్యధరా సముద్రాన్ని దాటడానికి ప్రయత్నించిన సుమారు 3,500 మంది ఈ ఏడాది మృత్యువాత పడ్డారు. కిక్కిరిసిన బోట్లు సముద్రంలో తరుచుగా ప్రమాదానికి గురవుతున్నాయి. -
మధ్యధరా సముద్రంలో పడవ మునిగి 700 మంది మృతి?
రోమ్: మధ్యధరా సముద్రంలో ఘోర ప్రమాదం! వలసదారులతో కిక్కిరిసిన పడవ శనివారం రాత్రి లిబియా ఉత్తర జలాల్లో మునిగిపోయింది. పడవలోని 700 మందికిపైగా మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు. ఇటలీ తీర గస్తీ సిబ్బంది ఆదివారం సాయంత్రానికి 24 మృతదేహాలను వెలికితీసి, 28 మంది ప్రయాణికులను రక్షించారు. గల్లంతైన వారంతా మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు. 20 మీటర్ల పొడవున్న ఈ పడవలోని ప్రయాణికులు.. పోర్చుగీసు వాణిజ్యనౌక దగ్గరగా వస్తుండడంతో దాని దృష్టిని ఆకర్షించేందుకు ఒక పక్కకు ఒరిగారని, దీంతో పడవ బోల్తాపడి ఉంటుందని ఇటలీ కోస్ట్ గార్డ్ ఓ ప్రకటనలో తెలిపింది. ‘పడవ కిక్కిరిసి ఉండడంతో ప్రయాణికులు సాయం కోసం ఎదురు చూశారు. పోర్చుగీసు నౌకకు కనిపించాలనుకున్నారు’ అని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి బార్బరా మోలినారియో చెప్పారు. మధ్యధరా సముద్రంలో వలసదారుల పడవలు మునగడం ఈ వారంలో ఇది మూడోసారి.