మధ్యధరా సముద్రంలో 26 మృతదేహాలు లభ్యం కాగా, అవన్నీ మైనర్ బాలికలవి కావడం కలకలం రేపింది. ఈ మృతదేహాలను ఇటలీ నావికాదళ అధికారులు ఆదివారం గుర్తించినట్లు తెలుస్తోంది. ఆఫ్రికా వాసులు పడవల్లో ప్రమాదకరమైన జర్నీ చేస్తూ ఎంతో మంది అమాయకులు నడి సంద్రంలో ముగినిపోవడం గతేడాది నుంచి తరచుగా చూస్తున్నాం. ఇలాంటి ఘటనల్లో ఇది ఒకటని భావించడానికి వీల్లేదని అధికారులు భావిస్తున్నారు.
దక్షిణ ఇటలీ సాలోర్నో సిటీకి చెందిన అధికారి లోరెనా సిక్కోట్టి మాట్లాడుతూ.. సాధారణంగా మృతదేహాలు లభ్యమైనప్పుడు అందులో మహిళలు, చిన్నారులు, వృద్ధులవి ఎక్కువ కాగా, పురుషుల మృతదేహాలు తక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ మాకు దొరికినవి 26 మృతదేహాలు కాగా, అవన్నీ 14-18 ఏళ్లలోపున్న మైనర్ బాలికలవి కావడంతో ఆశ్చర్యానికి లోనయ్యాం. వీరిని ఎవరైనా లైంగికంగా వేధించారా.. అత్యాచారానికి పాల్పడిన అనంతరం హత్యచేసి సముద్రంలో మృతదేహాలు పడవేశారా అన్న దానిపై విచారణ చేపట్టినట్లు వివరించారు.
గత ఆదివారం శరణార్థులకు చెందిన ఓ పడవ గల్లంతుకాగా, దాదాపు 60 మందిని ఇటలీ అధికారులు రక్షించినట్లు సమాచారం. యూఎన్‌ఓ శరణార్థుల హైకమిషనర్ మార్కో రొటున్నో మాట్లాడుతూ.. లిబియా పడవ మునక దుర్ఘటనలో 26 మంది చనిపోయి ఉండొచ్చునని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment