Libya
-
లిబియా మరణాలు..11 వేలకు పైనే
డెర్నా: లిబియాలోని డెర్నాలో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య శుక్రవారానికి 11 వేలు దాటింది. జాడ తెలియకుండా పోయిన మరో 10 వేల మంది కోసం అన్వేషణ ముమ్మరంగా సాగుతోంది. నివాస ప్రాంతాలను తుడిచిపెట్టిన మట్టి, బురద తొలగింపు పనులు సాగుతున్నాయి. సోమవారం సంభవించిన భారీ వర్షాలు, వరదలతో ఎగువనున్న రెండు జలాశయాలు బద్దలై ఒక్కసారిగా డెర్నా నగరాన్ని నీటి ప్రవాహం ముంచెత్తిన విషయం తెలిసిందే. -
డెర్నా సిటీ మేయర్ అనుమానం
డెర్నా: వరదలు, రెండు డ్యామ్‌ల నేలమట్టంతో జనావాసాలపైకి జల ఖడ్గం దూసుకొచ్చి వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన లిబియాలో పరిస్థితి కుదుటపడలేదు. డేనియల్ తుపాను మిగిలి్చన విషాదం నుంచి డెర్నా నగరం తేరుకోలేదు. అక్కడ ఇంకా వేలాది మంది ఆచూకీ గల్లంతైంది. 5,500 మందికిపైగా చనిపోయారని అధికారులు ప్రకటించగా మృతుల సంఖ్య 20,000కు చేరుకోవచ్చని సిటీ మేయర్ అబ్దెల్ మోనియమ్ అల్ ఘైతీ అనుమానం వ్యక్తంచేశారు. -
లిబియాలో కనివిని ఎరగని జలప్రళయం
-
Libya Floods: లిబియాలో ఊహకందని మహా విషాదం
డెర్నా: అస్థిర ప్రభుత్వాలు, సంక్షోభం, ఎవరికీ పట్టని ప్రజా సంక్షేమంతో సమస్యల వలయంలో చిక్కిన లిబియాపై ప్రకృతి కత్తి గట్టింది. ఊహించని వరదలు, వరద నీటి ధాటికి పేకమేడల్లా కుప్పకూలిన రెండు డ్యామ్‌లు.. వరద విలయాన్ని మరింత పెంచాయి. డ్యామ్‌ల నుంచి దూసుకొచ్చిన నీటిలో కొట్టుకుపోయి జలసమాధి అయిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం నాటి గణాంకాల ప్రకారం డెర్నా సిటీలో వరద మృతుల సంఖ్య ఏకంగా 5,100 దాటింది. ఇంకా వేలాది మంది జాడ గల్లంతయిందన్న కథనాలు చూస్తుంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వరద ఉధృతికి ఇళ్లుసహా సర్వం కోల్పోయి నిరాశ్రయులైన వారు వేలాదిగా ఉన్నారు. డెర్నా సిటీ తీరప్రాంతంలోని పర్వతాలు, లోయలతో నిండిన నగరం. వరదల కారణంగా చాలా రోడ్లు దెబ్బతిని సహాయక బృందాలు వరద ముంపు ప్రాంతాలకు చేరుకోలేని పరిస్థితి. దీంతో చాలా చోట్ల సహాయక చర్యలు మొదలేకాలేదు. అతికష్టం మీద కొన్ని బృందాలు చేరుకుని జలమయమైన ఇళ్లలో బాధితుల కోసం అన్వేషణ మొదలుపెట్టాయి. నేలమట్టమైన భవనాలు, శిథిలాల కింద వెతికే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. 30 వేలు దాటిన వలసలు వరద ధాటికి సర్వం కోల్పోవడంతో దాదాపు 30 వేల మంది స్థానికులు పొట్టచేత పట్టుకుని వేరే ప్రాంతాలకు వలసవెళ్లారని ఐక్యరాజ్యసమితికి చెందిన మైగ్రేషన్ ఏజెన్సీ తెలిపింది. అయితే ఈ సంఖ్య 40,000కుపైనే ఉంటుందని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్ సొసైటీ లిబియా ప్రతినిధి తమెర్ రమదాన్ అంచనావేశారు. రెండు ప్రభుత్వాల మధ్య నలిగి.. తూర్పు ప్రాంతంలో ఒక ప్రభుత్వం, మరో దిశలో ఇంకో ప్రభుత్వాల నిర్లక్ష్య ఏలుబడిలో ఉన్న లిబియాలో మౌలిక వసతుల కల్పన అరణ్యరోదనే అయ్యింది. ‘నగరంలో ఉన్న ఏకైక శ్మశానానికి తరలించేందుకు మృతదేహాలను ఒక దగ్గరకు చేరుస్తాం. ఈ జల విలయంలో 11 మంది కుటుంబసభ్యులను కోల్పోయి గుండెలవిసేలా రోది స్తున్న ఒకాయనను ఓదార్చడం ఎవరి తరం కావట్లేదు’ అని సహాయక బృంద సభ్యుడొకరు చెప్పారు. ‘ నా కుటుంబం మొత్తాన్నీ కోల్పోయా. వరదల్లో మా వాళ్ల మృతదేహాలు సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చాయి’ అని అబ్దల్లా అనే వ్యక్తి వాపోయారు. రోడ్లలో పేరుకుపోయిన బురదను తొలగించేందుకు బుల్డోజర్లుతో రెండు రోజులుగా నిరంతరంగా పనిచేయిస్తున్నారు. అప్పుడుగానీ అత్యవసర సరుకుల్ని తరలించలేని దుస్థితి. వేరే పట్టణాలకు మృతదేహాల తరలింపు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపించే పరిస్థితు లు డెర్నీ సిటీలో కరువవడంతో వందలాది మృతదేహా లను సమీపంలోని పట్టణాలకు తరలిస్తున్నారు. మరణించిన వారిలో 84 మంది ఈజిప్టువాసులూ ఉన్నారు. దక్షిణాన ఉన్న బెనీ సుయెఫ్ రాష్ట్రంలో ఎల్–షరీఫ్ గ్రామంలో డజన్లకొద్దీ ఈజిప్షియన్లు జలసమాధి అయ్యారు. డెర్నాలో భీతావహ దృశ్యం నగరంలో చాలా చోట్ల మృతదేహాలు కనపడుతు న్నాయి. బురదనీటిలో కూరుకుపోయి, వీధుల్లోకి కొట్టుకొచ్చి, సముద్ర తీరం వెంట.. ఇలా చాలా ప్రాంతాల్లో స్థానికులు విగతజీవులై కనిపించారు. ఒక్కసారిగా నీరు రావడంతో ఎటూ తప్పించుకోలేని నిస్సహాయక స్థితి. ‘నగరంలో ఏ ప్రాంతంలో సహాయం చేసేందుకు వెళ్లినా అక్కడ మాకు చిన్నారులు, మహిళల మృతదేహాలే కనిపిస్తున్నాయి’ అని బెంఘాజీకి చెందిన ఒక సహాయకుడు ఫోన్లో మీడియా సంస్థకు చెప్పారు. ‘సిటీ శివార్లలోని డ్యామ్ బద్దలైన శబ్దాలు మాకు వినిపించాయి. నగరం గుండా ప్రవహించే వాదీ డెర్నీ నదిలో ప్రవాహ ఉధృతి అమాంతం ఊహించనంతగా ఎగసి జనావాసాలను ముంచేసింది. ‘ డ్యామ్ బద్దలవడంతో ఏకంగా ఏడు మీటర్ల ఎత్తులో దూసుకొచ్చిన ప్రవాహం తన మార్గంలో అడ్డొచ్చిన అన్నింటినీ కూల్చేసింది’ అని లిబియాలో రెడ్ క్రాస్ కమిటీ ప్రతినిధి బృంద సారథి యాన్ ప్రైడెజ్ చెప్పారు. మధ్యధరా ప్రాంతంలో సన్నని తీరప్రాంతంలో పర్వత పాదాల చెంత ఈ నగరం ఉంది. పర్వతాల నుంచి వచ్చిన వరద నీరు నగరాన్ని ముంచేస్తూ తీరం వైపు కిందకు ఉరకలెత్తడంతో వరద తీవ్రత భయంకరంగా ఉంది. వరద ధాటికి దక్షిణం వైపు కేవలం రెండు రోడ్లు మాత్రమే మిగిలిపోయాయి. కూలిన వంతెనలు నగరం మధ్య భాగాన్ని రెండుగా చీల్చాయి. దీంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గాయపడిన ఏడు వేలకుపైగా స్థానికులను మైదానాల్లోని తాత్కాలిక వైద్యశాలల్లో చికిత్సనందిస్తున్నారని తూర్పు లిబియాలోని అంబులెన్స్, అత్యవసర కేంద్రం అధికార ప్రతినిధి ఒసామా అలీ చెప్పారు. -
Libya Floods: లిబియాలో వరద బీభత్సం
ట్రిపోలీ: లిబియాలో భీకర వరదలు పెను విధ్వంసం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా తూర్పు లిబియాలోని డెర్నా నగరం, పరిసర ప్రాంతాల్లో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా నమోదైంది. కూలిపోయిన ఇళ్ల శిథిలాలను మంగళవారం తొలగిస్తుండగా, వందలాది మృతదేహాలు బయటపడ్డాయి. ఎటు చూసినా శవాల దిబ్బలే కనిపించాయి. లిబియా అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం వరదల్లో దాదాపు 2,800 మందికిపైగా మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మరో 10,000 మంది గల్లంతయినట్లు తెలియజేశాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. కానీ, ఇప్పటిదాకా 1,500 మంది మాత్రమే మరణించారని, 2,000 మంది గల్లంతయ్యారని విమానయాన శాఖ మంత్రి హిషామ్ చికియోత్ ప్రకటించారు. చాలా ఏళ్లుగా నిర్వహణ సరిగ్గా లేని డ్యామ్ కూలిపోవడం వల్ల ఈ ఘోరం జరిగిందని అన్నారు. బీభత్సానికి కారణమేంటి? మధ్యధరా సముద్రంలో ఏర్పడిన డేనియల్ తుపాను కారణంగా లిబియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పై నుంచి వచ్చిన వర్షంనీరు కారణంగా ఆదివారం రాత్రి డెర్నా నగర శివార్లలోని రెండు డ్యామ్‌లు, ధ్వంసం కావడం వల్ల వరద ముంచెత్తినట్లు స్థానికులు చెప్పారు. నగరంలో నాలుగింట మూడొంతుల మేర వరద ప్రభావానికి గురి కావడం గమనార్హం. వరద ధాటికి చాలా ఇళ్లు కూలిపోయాయి. బురద కొట్టుకురావడంతో రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వ అధికారులు సహా యక చర్యల్లో నిమగ్నమయ్యారు. తూర్పు లిబియాలోని అల్–బైదా, అల్–మర్జ్, సౌస, తోబ్రుక్, తాకెనిస్, అల్–బయాదా, బత్తాహ్, బెంఘాజీ తదితర నగరాలు, పట్టణాల్లో సైతం విధ్వంసం జరిగింది. లోతట్టు ప్రాంతాల్లో బురద మేటలు వేసింది. చాలా ఇళ్లు బురదలో కూరుకుపోయాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన లిబియాకు అండగా నిలుస్తామని అమెరికా, ట్యునీషియా, అల్జీరియా, తుర్కియే, యూఏఈ తదితర దేశాలు ప్రకటించాయి. Heartbreaking to see the havoc caused by flash floods in Libya. Its yet another stark reminder of the urgent need for global action on climate resilience and preparedness. #LibyaFloods #ClimateAction #Libya #Libye #LibyaFlood pic.twitter.com/dmu8Gs87iV — مزمل حسین (@Muxammilhusain) September 12, 2023 For a second you will think this street have been bombed, but actually this what the storm #Daniel caused to the city of Darna Just watch the disaster closely#pray4libya #saveLibya#LibyaFloods pic.twitter.com/GwQv2g8oip — Ahmed Mussa (@AhmedMussa218) September 12, 2023 NDABANEWS: BREAKING - #LibyaFlood|#LibyaFloods - Over 5000 people presumed dead and more than ten thousand are still missing in the widespread heavy flooding caused by Storm Daniel. Twenty-five percent of Libya’s eastern city of Derna was wiped out after dams burst in a storm.… pic.twitter.com/08L03rMAZo — Thulani Ndaba (@tndaba) September 13, 2023 Another natural disaster strikes in North Africa, violent storms destroy dams causing mass flooding in Libya 🇱🇾 💔 Some 2000 people feared drowned. Thoughts and prayers for this great people and their damaged nation. #Libya #LibyaFloods pic.twitter.com/GnXnz730fx — Robert Carter (@Bob_cart124) September 12, 2023 ఇది కూడా చదవండి: అమెరికాకు వ్యతిరేకంగా చేతులు కలిపిన రష్యా, ఉత్తర కొరియా -
నాలుగు రోజుల గ్యాప్‌లో 6వేల మంది మృతి!
రెండూ ఆఫ్రికన్ దేశాలే. కానీ, ప్రకృతి ప్రకోపానికి తీరని నష్టంతో తల్లడిల్లిపోతున్నాయి. కేవలం నాలుగే రోజుల వ్యవధిలో.. ఈ రెండు దేశాల్లో ఆరు వేలమంది ప్రాణాలు పోయాయి. ఒకవైపు మొరాకోలో సంభవించిన భూ విలయం.. మరోవైపు లిబియాలో పోటెత్తిన జల విలయం.. వేల మందిని బలిగొనడమే కాకుండా.. ఊహించని స్థాయిలో ఇరు దేశాలకు నష్టం కలగజేశాయి. ఆఫ్రికా దేశం లిబియాలోని దెర్నా నగరాన్ని వరదలు ఒక్కసారిగా ముంచెత్తాయి. ఒక్క ఆ నగరంలో వరదల ధాటికి 2 వేల మందికిపైగా మృతి చెందారు. మిగతా అన్నిచోట్లా కలిపి మృతుల సంఖ్య వెయ్యికి పైనే ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ మరణాలు కాకుండా.. కొన్ని వేల మంది గల్లంతయ్యారు. 48 గంటలు గడిచినా వాళ్ల జాడపై ఇంకా స్పష్టత రాలేదు. జాడ లేకుండా పోయిన వాళ్ల సంఖ్య పదివేలకు పైనే ఉండొచ్చని అధికారిక వర్గాల అంచనా. అంటే.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయని లిబియా ప్రధాని ఒసామా హమద్ చెబుతున్నారు. మధ్యధరా సముద్రంలో సంభవించిన డేనియల్ తుపాను.. లిబియాను అతలాకుతలం చేస్తోంది. తుపాను ధాటికి వారం రోజులుగా ఆ దేశంలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. దెర్నా సహా ప్రధాన నగరాలను డిజాస్టర్ జోన్‌గా ప్రకటించారు. ఒక్కసారిగా డ్యామ్‌లు తెగిపోయి ఉప్పెన.. ఊళ్లను ముంచెత్తింది. జనాలు ఎటూ తప్పించుకోలేని పరిస్థితుల్లో ప్రాణాలు పొగొట్టుకున్నారు. దెర్నాలో అయితే వరద పెను విలయం సృష్టించింది. మరోవైపు విద్యుత్ లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపింది. తాగు నీరు, ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నట్లు వెల్లడించింది. దేశంలో మరికొన్ని రోజులపాటు భారీ వర్షాలు పడనున్నట్లు అక్కడి వాతావరణ శాఖ ప్రకటించడంతో.. జనం బిక్కుబిక్కమంటూ గడుపుతున్నారు. మొరాకోలో మృత్యుఘోష శుక్రవారం రాత్రి మొరాకోలో సంభవించిన భూకంపం.. 3 వేల మందికిపైగా ప్రజల ప్రాణాల్ని బలితీసుకుంది. సహయాక చర్యల్లో ఇంకా మృత దేహాలు బయటపడుతూనే ఉన్నాయి. దీంతో ప్రకృతి విలయం దాటిచ మృతుల సంఖ్య ఇంకా పెరిగేలా కనిపిస్తోంది. భూకంపం వచ్చి నాలుగు రోజులు గడుస్తుండడంతో.. బాధితులు సజీవంగా బయటపడతారన్న ఆశలు కనుమరుగైపోయాయని అధికారులు అంటున్నారు. మొరాకోలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మర్రాకేశ్‌కు నైరుతి దిశగా 71 కిలోమీటర్ల దూరంలో శుక్రవారం రాత్రి ఈ పెను విపత్తు సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రత నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం ధాటికి అల్ హౌజ్, మర్రాకేశ్, క్వార్జాజేట్, అజిలాల్ సహా పలు ప్రాంతాలు వణికిపోయాయని తెలిపింది. దీంతో చాలా భవనాలు నేలమట్టం అయ్యాయి. -
లిబియా అధ్యక్ష బరిలో గడాఫీ కుమారుడు
కైరో: లిబియా నియంత, దివంగత గడాఫీ కుమారుడు సయీఫ్ అల్ ఇస్లాం అదేశ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. పలు నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సయీఫ్ అల్ ఇస్లాం వచ్చే నెల 24న జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ వేసినట్లు లిబియా ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. దాదాపు 40 ఏళ్లపాటు లిబియాను పాలించిన గడాఫీ 2011లో తలెత్తిన తిరుగుబాటులో హతమైన విషయం తెలిసిందే. అనంతరం ఆ దేశం ప్రత్యర్థి వర్గాల హింసాత్మక చర్యలతో అట్టుడుకుతోంది. రాజధాని ట్రిపోలీలో ఒక ప్రభుత్వం, తూర్పు ప్రాంతంలో మరో ప్రభుత్వం కొనసాగుతోంది. గఢాఫీ ప్రభుత్వంలో ఆయన 8 మంది కుమారులు కీలకంగా వ్యవహరించారు. వారిలో ముగ్గురు వివిధ ఘటనల్లో చనిపోయారు. -
లిబియాలో ఘోర పడవ ప్రమాదం
-
ఎన్నాళ్లో వేచిన ఉదయం!
సంతబొమ్మాళి: దేశంకాని దేశంలో చిక్కుకున్న తమ వాళ్లు ఎప్పుడొస్తారో అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని లిబియా బాధితుల కుటుంబాల కల ఎట్టకేలకు ఫలించింది. రాష్ట్ర ప్రభుత్వం కృషి, చొరవతో ఆఫ్రికా దేశం లిబియాలో చిక్కుకున్న ముగ్గురు జిల్లా యువకులకు విముక్తి కలిగింది. గురువారం స్వగ్రామమైన సీతానగరంలో అడుగుపెట్టిన బాధితులు తీవ్ర భావోద్వేగానికి లోనై తమ కుటుంబ సభ్యులను హత్తుకొని ఆనందభాష్పాలు కార్చారు. వివరాల్లోకి వెళ్తే.. సంతబొమ్మాళి మండలం నౌపడ పంచాయతీ సీతానగరం గ్రామానికి చెందిన బత్సల వెంకటరావు, బత్సల జోగారావు, బొడ్డు దానయ్య ఉపాధి కోసం గతేడాది అక్టోబర్ 30న లిబియా వెళ్లారు. అక్కడ కంపెనీలో 11 నెలలపాటు పనిచేశారు. తిరిగి భారత్ వచ్చేందుకు సెపె్టంబర్ 14న లిబియా రాజధాని ట్రిపోలి ఎయిర్‌పోర్టుకు కారులో వస్తుండగా మార్గమధ్యంలో దుండగులు కిడ్నాప్ చేశారు. బాధితుల కుటుంబసభ్యులు ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రి సీదిరి అప్పలరాజు, జిల్లా కలెక్టర్, ఎస్పీ దృష్టికి తెచ్చారు. వారు వెంటనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి సమాచారాన్ని చేరవేశారు. సీఎం చొరవ, కృషితో లిబియాలోని భారత రాయబార కార్యాలయం.. కంపెనీ ప్రతినిధులతో చర్చించి కిడ్నాపర్ల నుంచి వారిని విడుదల చేసేందుకు అన్ని విధాలా ప్రయతి్నంచింది. దీంతో 28 రోజుల తర్వాత కిడ్నాపర్ల చెర నుంచి యువకులు బయటపడ్డారు. బుధవారం స్వదేశానికి ప్రత్యేక విమానంలో చేరిన యువకులు గురువారం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కి విశాఖపట్నం చేరారు. అక్కడి నుంచి కారులో స్వగ్రామమైన సీతానగరం చేరుకున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యుల ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. మార్గమధ్యంలో యువకులు ఎస్పీ అమిత్ బర్దార్‌ను కలిసి జరిగిన ఘటనను వివరించారు. మళ్లీ చూస్తామనుకోలేదు.. బతుకుతెరువుకు లిబియా వెళ్లి కిడ్నాప్‌కు గురయ్యాం. ఎన్నో అవస్థలు పడ్డాం. మళ్లీ మావారిని చూస్తామనుకోలేదు. సీఎం వైఎస్ జగన్ చొరవతో మళ్లీ స్వగ్రామంలో అడుగుపెట్టాం. – బత్సల జోగారావు, బొడ్డు దానయ్య, బత్సల వెంకటరావు, లిబియా బాధితులు సీఎం వైఎస్ జగన్‌కు మా కృతజ్ఞతలు దేశం కాని దేశం వెళ్లి తిరిగి వస్తుండగా కిడ్నాప్ కావడంతో చాలా భయపడ్డాం. ఏమైందో అని ఆందోళన చెందాం. వెంటనే ప్రభుత్వం స్పందించి విముక్తికి సహకరించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి సీదిరి అప్పలరాజుకు రుణపడి ఉంటాం. – బొడ్డు దానయ్య, కుటుంబ సభ్యులు, సీతానగరం -
ఆ దేశాలపై అమెరికా ఆంక్షలు
వాషింగ్టన్: గతంలో చెప్పినట్టుగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతా నిబంధనలను పాటించడంలో విఫలమైన దేశాల పౌరుల వీసా అనుమతులపై ఆంక్షలు విధించే పత్రంపై సంతకం చేశారు. ఇవి అమెరికా భద్రతకు ప్రమాదకరంగా మారాయని ఆయన వైట్ హౌస్ వెల్లడించింది. ఇరాన్, లిబియా, ఉత్తర కొరియా, సిరియా, వెనెజులా, యెమన్, సోమాలియా పౌరుల అమెరికా ప్రవేశంపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తూ ప్రకటన విడుదల చేసింది. మయన్మార్, ఎరిట్రియా, కిర్గిజిస్తాన్, నైజీరియా వలసదారులకు వీసాల అనుమతిపై నిషేధం విధించింది. సూడాన్, టాంజానియా దేశాలు వీసా లాటరీలో పాల్గొనే అవకాశాన్ని రద్దు చేస్తూ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ స్టెఫానియా గ్రెషమ్ ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ ఆంక్షలేవీ పర్యాటకులకు, వ్యాపారస్తులకు, వలసేతర ప్రయాణికులకు వర్తించవనిన్నారు. అంతర్జాతీయ భద్రతా నిబంధనలను పాటించకుంటే ఎలా ఉంటుందో ఆయా దేశాలకు అర్థమయ్యేందుకే ఈ నిషేధమని యాక్టింగ్ సెక్రటరీ చాడ్ ఎఫ్ వోల్ఫ్ వెల్లడించారు. ‘దేశ భద్రత, ప్రజల రక్షణే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రథమ బాధ్యత అనీ, ఈ ఆంక్షలు ఆ లక్ష్యాన్ని చేరుకుంటాయని’ వోల్ఫ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
లిబియాలో ఘోరం; 28 మంది సైనికుల మృతి
ట్రిపోలి : లిబియాలో శనివారం ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. లిబియా రాజధాని ట్రిపోలీలోని సైనిక పాఠశాలపై జరిగిన వైమానిక దాడుల్లో 28 మంది సైనికులు మృతి చెందగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇదే విషయాన్ని జిఎన్ఎ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అమిన్ అల్-హషేమి మీడియా సమావేశంలో ధృవీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ట్రిపోలిలోని సైనిక పాఠశాలపై శనివారం వైమానిక దాడులు జరిగాయని తెలిపారు. ఈ దాడిలో 28 మంది మృతి చెందగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారన్నారు. అయితే వైమానిక దాడులకు ముందు సైనికులంతా పెరేడ్ గ్రౌండ్లో సమావేశంలో పాల్గొన్నారని తెలిపారు. సమావేశం ముగిసిన తర్వాత వీరంతా తమ గూడారాల్లోకి వెళుతుండగా ఒక్కసారిగా దాడులు జరిగాయని అమిన్ పేర్కొన్నారు. ఈ మిలటరీ స్కూల్ ట్రిపోలి కేంద్రంగా అల్-హద్బా అల్-ఖాద్రాలో ఉంది. కాగా దాడిలో తీవ్రంగా గాయపడిన సైనికులకు రక్తం ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని జిఎన్ఎ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. 2011లో నాటో సహాయంతో అప్పటి దీర్ఘకాల నియంత మోమెర్ ఖడాఫీని జిఎన్ఏ దళాలు మట్టుబెట్టడంతో లిబియాలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటి నుంచి జీఎన్ఎ, దాని ప్రత్యర్థుల మధ్య వైమానిక దాడులు జరుగుతూనే ఉన్నాయి.దీంతో పాటు గత ఎప్రిల్లో లిబియా దక్షిణభాగానికి నేతృత్వం వహిస్తున్న మిలటరీ కమాండర్ ఖలీఫా హప్తర్ జిఎన్‌ఎకు వ్యతిరేకంగా మారడంతో లిబియా దేశం నిత్యం వైమానిక దాడులతో అట్టుడుకుతుందని సమాచారం.(ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక) -
లిబియాలో సంక్షోభం
ట్రిపోలి: అంతర్యుద్ధంతో అతలాకుతలమైన లిబియాలో సాయుధ ఘర్షణ చెలరేగింది. లిబియా కమాండర్ ఖలీఫా హఫ్తార్‌కు చెందిన తిరుగుబాటు దళాలు రాజధాని ట్రిపోలివైపు బయలుదేరాయి. అంతర్జాతీయ సమాజం గుర్తింపుపొందిన జీఎన్ఏ ప్రభుత్వ దళాలు వారిని రాజధానికి 50 కి.మీ దూరంలో నిలువరించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా జీఎన్ఏ దళాలు హఫ్తార్ బలగాలపై వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. హఫ్తార్ దళాలు వెంటనే హింసను విడనాడి వెనక్కు వెళ్లాలని ఐక్యరాజ్యసమితి, ఫ్రాన్స్, జర్మనీ సూచించాయి. 2011లో లిబియా పాలకుడు గడాఫీని అమెరికా హతమార్చడంతో ఆ దేశంలో అంతర్యుద్ధం చెలరేగింది. -
లిబియాలో శరణార్థులు గల్లంతు!
పారిస్: లిబియా నుంచి యూరోప్‌కు అక్రమ వలసదారులతో వెళ్తున్న ఓ పడవ మధ్యధరా సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 90 మంది శరణార్థులు గల్లంతైనట్లు సమాచారం. గల్లంతైన వారిలో 10 మంది మృతదేహాలు లిబియా తీర పట్టణమైన జవారా ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. వీరిలో 8 మంది పాకిస్తానీయులు, ఇద్దరు లిబియాకు చెందిన వారు ఉన్నట్లు భావిస్తున్నారు. పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కటం వల్లే పడవ మునిగిపోయిందని ప్రాథమికంగా నిర్ధారించినట్లు అంతర్జాతీయ వలస సంస్థకు చెందిన ప్రతినిధి ఒలివియా హెడన్ తెలిపారు. గల్లంతైన వారిలో ఎక్కువ మంది పాక్‌కు చెందిన వారే ఉన్నారని ఆమె పేర్కొన్నారు. -
విమానాశ్రయంలో కాల్పుల కలకలం
ట్రిపోలి: లిబియా రాజధాని ట్రిపోలిలో ఉన్న మిటిగ ఎయిర్‌పోర్టులో విమానాశ్రయ బలగాలైన స్పెషల్ డిటరెంట్ ఫోర్స్, స్థానిక బషిర్ అల్-బక్వర దళం మధ్య జరిగిన కాల్పుల్లో 20 మంది మృతి చెందగా మరో 63 మంది గాయపడ్డారు. దీంతో అధికారులు విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసేశారు. ఘర్షణలో తమ సైనికులు నలుగురు మృతిచెందారని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని స్పెషల్ డిటరెంట్ ఫోర్స్ ప్రతినిధి అహ్మద్ బిన్ సలీమ్ చెప్పారు. మృతి చెందినవారిలో ప్రజలు, విమానాశ్రయ సిబ్బంది కూడా ఉన్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఘర్షణ నేపథ్యంలో ఉద్యోగులందరినీ బయటకు పంపించామని, 5 విమాన సర్వీసులు రద్దు చేశామని విమానాశ్రయ సిబ్బంది వెల్లడించారు. విమానాశ్రయానికి దగ్గరలోని జైలులో ఉన్న అల్-కాయిదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను విడిపించడానికి అల్-బక్వర ప్రయత్నిస్తోందని, అందులో భాగంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని ట్రిపోలి పాలక సంస్థ ప్రెసిడెన్సీ కౌన్సిల్ పేర్కొంది. -
ఏం మనుషులో..?
-
అంగట్లో అమ్మేస్తున్నారు!
మనుషుల వేలం... మీరు చదివింది నిజమే. మధ్యయుగాలను గుర్తుకుతెస్తూ... 2017లో లిబియా రాజధాని ట్రిపోలీలో సాగుతున్న అమానవీయ వేలం. బానిసలుగా మనుషులను అమ్ముతున్న దారుణం. వేలాది మంది ఆఫ్రికన్లను అమ్ముతూ అక్రమ రవాణా ముఠాలు సాగిస్తున్న దందా. ఈ ఉదంతాలను ప్రముఖ అంతర్జాతీయ వార్తాసంస్థ సీఎన్ఎన్ రహస్యంగా చిత్రీకరించి ప్రపంచం ముందుంచింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ ఎవరు వీరు... పశ్చిమాఫ్రికా, మధ్య ఆఫ్రికా దేశాల్లో పేదరికం, అంతర్గత కలహాలు, అస్థిరత కారణంగా... బంగారు భవిష్యత్తును వెతుక్కుంటూ యూరప్‌కు పయనమవుతుంటారు శరణార్థులు. బంగ్లాదేశీలు కూడా ఎక్కువే ఉంటారు. వారు రోడ్డు మార్గం ద్వారా దేశాల సరిహద్దులను అక్రమంగా దాటుతూ లిబియాకు చేరుకుంటారు. లిబియా నుంచి ఇటలీ, ఇతర యూరప్ దేశాలకు చేరుకొని కొత్త జీవితం గడపాలనేది వారి ఆశ. దీనికోసం మనుషులను అక్రమంగా రవాణా చేసే ముఠాలకు భారీ మొత్తంలో సొమ్ము చెల్లిస్తుంటారు. లిబియా చేరుకున్నాక చిన్నచిన్న పడవల్లో కిక్కిరిసి ప్రయాణిస్తూ ప్రాణాలకు తెగించి మధ్యధరా సముద్రం దాటే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో వేల మంది సముద్రంలో మునిగి చనిపోతుంటారు. స్వచ్ఛంద సంస్థలు నడిపే బోట్లు కొందరిని కాపాడుతున్నాయి. అక్రమ వలసదారులు, శరణార్థుల తాకిడి ఎక్కువై... యూరప్ దేశాలు తమ తీర ప్రాంతాల్లో గస్తీ పెంచాయి. దీంతో అదృష్టంకొద్దీ యూరప్ తీరానికి చేరినా... అక్కడ పట్టుబడి తిరిగి స్వదేశానికి వస్తుంటారు. ఎక్కడెక్కడ... మధ్యధరా తీరానికి సమీపంలో ఉన్న జువారా, సబ్రాత్, కాసిల్‌వెర్డే, గర్యాన్, అల్‌రుజ్బాన్, అల్‌జింటాన్, కబావ్, గడామిస్... తదితర పట్టణాల్లో ఈ ముఠాలు ప్రైవేటు నిర్బంధ కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. యూరప్‌కు చేర్చుతామని ఒప్పందం కుదుర్చుకొని తెచ్చిన వారిని నిర్బంధిస్తున్నాయి. ఇచ్చిన మొత్తం ప్రయాణానికి సరిపోవడం లేదని, మధ్యవర్తులు వారి తాలూకు మొత్తం డబ్బును తమకు చెల్లించలేదని... సాకులు చూపుతారు. గాలి, వెలుతురు సరిగాలేని గోదాముల్లో ఆఫ్రికన్లను కుక్కుతారు. వాటిల్లో కనీస సదుపాయాలుండవు. సరిగా తిండి కూడా పెట్టరు. ఎదురుతిరిగితే చిత్రహింసలే. ఇలా నిర్బంధించిన వారి ఇళ్లకు ఫోన్లు చేస్తూ... తాము చెప్పినంత డబ్బు చెల్లిస్తే మీ వాడిని విడిచిపెడతామని బేరం పెడతారు. అలా డబ్బు గుంజుతారు. అప్పటికే ఉన్నదంతా ఊడ్చి వాళ్ల చేతిలో పెట్టిన నిర్భాగ్యులు ఏమీ చెల్లించకపోతే... వారిని బానిసల వేలం మార్కెట్లలో అమ్మేస్తారు. పులులను బోన్లలో పెట్టినట్లు... వారిని ప్రదర్శనకు పెట్టి వేలం వేస్తారు. నియమిత కాలానికి వేలం వేసి... ఆ సమయం ముగిశాక మళ్లీ వెనక్కితెస్తారు. వేలంలో వచ్చిన దానితో బాకీ తీరలేదని చెప్పి మళ్లీ వేలానికి పెడతారు. ఎంత మంది... ప్రస్తుతం లిబియాలో 7 లక్షల నుంచి 10 లక్షల మంది శరణార్థులు ఉంటారని ఐక్యరాజ్యసమితి అంచనా. మొత్తం 25,000 మంది లిబియా ప్రభుత్వం నిర్వహిస్తున్న శరణార్థి కేంద్రాల్లో ఉన్నారు. వారిని స్వదేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నా... వారి మాతృదేశాలు సహకరించడం లేదని లిబియా ఆరోపణ. లిబియాలోని దుర్భర పరిస్థితులను చూశాక... స్వదేశానికి తిరిగి వెళ్లడానికి 8,800(ఈ ఏడాది ఇప్పటివరకు) మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సంస్థ తెలిపింది. సీఎన్ఎన్ చిత్రీకరించి ప్రసారం చేసిన వీడియోతో ప్రపంచ దేశాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో బానిసల వేలంపై దర్యాప్తు జరుపుతామని లిబియా ప్రభుత్వం ప్రకటించింది. మానవత్వానికే మచ్చ శరణార్థులకు బానిసలుగా అమ్ముతున్నారనే విషయం భీతిగొల్పుతోంది. ఇది మానవత్వానికే మచ్చ. అంతర్జాతీయ సమాజం దీన్ని అడ్డుకోవాలి. చట్టపరమైన వలసలను ప్రోత్సహించాలి. – అంటోనియో గుటెరస్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ నన్ను అమ్మారు... నైజీరియాలో పెచ్చరిల్చిన అవినీతి, పేదరికంతో యూరప్‌కు వలస వెళ్లాలని ఇంటిని వీడాను. లక్షా 80 వేల రూపాయలు స్మగ్లర్ల చేతుల్లో పోశాను. లిబియాలో నరకం చూపించారు. నన్ను పలుమార్లు వేలం వేశారు. మా ఇంటికి ఫోన్ చేసి డబ్బు చెల్లించాల న్నారు. చివరకు నన్ను వదిలేశారు. – 21 ఏళ్ల విక్టరీ, నైజీరియన్ 900 దినార్లు... నా పాట 1,000 1,100 మరొక బిడ్డర్ 1,200 లిబియా దినార్లు... ఓకే...డీల్ డన్ ఇది ఏ పాత కారో, ఫర్నిచరో, కొద్ది గజాల స్థలానికో జరిగిన వేలంపాట కాదు... ఇద్దరు నల్లజాతీయులను బానిసలుగా కొనుక్కోవడానికి వారి కొత్త యజమాని 1,200 లిబియా దినార్లు (రూ.52 వేలు) చెల్లించేందుకు పాడిన పాట ఇది. ‘కందకాలు తవ్వడానికి మనిషి కావాలా? ఇదిగో బలిష్టుడు, ఆజానుబావుడు... బాగా పనికొస్తాడు.’వేలం వేస్తున్న వ్యక్తి తాను అమ్ముతున్న ‘సరుకు’ గురించి చేస్తున్న వర్ణనిది. లిబియానే ఎందుకు? 2011లో లిబియాలో ప్రజా తిరుగుబాటుతో నియంత గడాఫీ హతమయ్యాక ఆ దేశంలో అస్థిరత నెలకొంది. ఐక్యరాజ్యసమితి అండతో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్నా... దేశమంతటా దీని పాలన లేదు. దీంతో మనుషులను అక్రమ రవాణా చేసే ముఠాలు లిబియాను కేంద్రంగా చేసుకొని దందా సాగిస్తున్నాయి. యూరో కలలుగంటున్న పేద ఆఫ్రికన్ల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. -
దారుణం: మనుషుల అమ్మకం
900 దినార్లు... నా పాట 1,000 1,100.. మరొక బిడ్డర్ 1,200 లిబియా దినార్లు... ఓకే...డీల్ డన్ 1,200 దినార్లు అంటే రూపాయల్లో 52 వేలు ఇది ఏ పాత కారో, ఫర్నిచరో, కొద్ది గజాల స్థలానికో జరిగిన వేలంపాట కాదు... మధ్యయుగాలను గుర్తుకుతెస్తూ... 2017లో లిబియాలో జరుగుతున్న అమానవీయ వేలం మనుషుల వేలం... మీరు చదివింది నిజమే బానిసలుగా మనుషులను అమ్ముతున్న దారుణం పైన పేర్కొన్న 52 వేల రూపాయలు... ఇద్దరు నల్లజాతీయులను బానిసలుగా కొనుక్కోవడానికి వారి కొత్త యజమాని పాడిన పాట. అంటే ఒక్కరి ధర 26 వేల రూపాయలు. ‘కందకాలు తవ్వడానికి మనిషి కావాలా? ఇదిగో బలిష్టుడు, ఆజానుబావుడు... బాగా పనికొస్తాడు’ ఇదీ వేలం వేస్తున్న వ్యక్తి తను అమ్ముతున్న ‘సరుకు’ గురించి చేస్తున్న అభివర్ణన. లిబియా రాజధాని ట్రిపోలి శివార్లలో సీఎన్ఎన్ వార్తా సంస్థ రహస్య కెమేరాలతో దీన్ని రికార్డు చేసింది. జరుగుతున్న ఘోరాన్ని ప్రపంచానికి చాటింది. ఎవరు వీరు... పశ్చిమాఫ్రికా, మధ్య ఆఫ్రికా దేశాల్లో పేదరికం, అంతర్గత కలహాలు, అస్థిరత కారణంగా... బంగారు భవిష్యత్తును వెతుక్కుంటూ యూరోప్‌కు పయనమవుతుంటారు శరణార్థులు. బంగ్లాదేశీలు కూడా ఎక్కువే ఉంటారు. వీరు రోడ్డు మార్గం ద్వారా అక్రమంగా దేశాల సరిహద్దులు దాటుతూ లిబియాకు చేరుకుంటారు. లిబియా నుంచి మధ్యధరా సముద్రం మీదుగా ఇటలీ, ఇతర యూరోప్ దేశాలకు చేరుకొని కొత్త జీవితం గడపాలనేది వీరి ఆశ. దీనికోసం మనుషులను అక్రమంగా రవాణా చేసే ముఠాలకు భారీ మొత్తంలో ఫీజులు చెల్లిస్తుంటారు. లిబియా చేరుకొన్న వీరు ప్రాణాలకు తెగించి చిన్నచిన్న పడవల్లో కిక్కిరిసి ప్రయాణిస్తూ ప్రాణాలకు తెగించి మధ్యధరా సముద్రం దాటే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో వేలమంది సముద్రంలో మునిగి చనిపోతుంటారు. స్వచ్ఛంద సంస్థలు నడిపే బోట్లు కొందరిని కాపాడుతున్నాయి. అక్రమ వలసదారులు, శరణార్థుల తాకిడి ఎక్కువై... యూరోప్ దేశాలు తమ తీర ప్రాంతాల్లో గస్తీ పెంచాయి. దాంతో అదృష్టం కొద్దీ యూరోప్ తీరానికి చేరినా... అక్కడ పట్టుబడి తిరిగి స్వదేశానికి తిరిగి వస్తుంటారు. లిబియానే ఎందుకు? 2011లో లిబియాలో ప్రజా తిరుగుబాటుతో గడాఫీ హతమయ్యాక ఆ దేశంలో అస్థిరత నెలకొంది. ఐక్యరాజ్యసమితి అండతో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్నా... దేశమంతటా దీని పాలన లేదు. దీంతో మనుషులను అక్రమ రవాణా చేసే ముఠాలు లిబియాను కేంద్రంగా చేసుకొని తమ దందా కొనసాగిస్తున్నాయి. యూరో కలలుగంటున్న పేద ఆఫ్రికన్ల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఎక్కడెక్కడ... మధ్యధరా తీరానికి సమీపంలో ఉన్న జువారా, సబ్రాత్, కాసిల్‌వెర్డే, గర్యాన్, అల్‌రుజ్బాన్, అల్‌జింటాన్, కబావ్, గడామిస్... తదితర పట్టణాల్లో ఈ ముఠాలు ప్రైవేటు నిర్భంద కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. యూరోప్‌కు చేర్చుతామని ఒప్పందం కుదుర్చుకొని తెచ్చిన వారిని ఏదో ఒక కారణంగా నిర్భందిస్తున్నాయి. ఇచ్చిన మొత్తం ప్రయాణానికి సరిపోవడం లేదని, మధ్యవర్తులు వీరి తాలూకు మొత్తం డబ్బును తమకు చెల్లించలేదని... సాకులు చూపుతారు. గాలి, వెలుతురు సరిగాలేని గోదాముల్లో వీరిని కుక్కుతారు. కనీస సదుపాయాలుండవు. సరిగా తిండి పెట్టరు. ఎదురుతిరిగితే చిత్రహింసలే. ఇలా నిర్భందించిన వారి ఇళ్లకు ఫోన్లు చేస్తూ... తాము చెప్పినంత డబ్బు చెల్లిస్తే మీవాడిని విడిచిపెడతామని బేరం పెడతారు. అలా డబ్బు గుంజుతారు. అప్పటికే ఉన్నదంతా ఊడ్చి వీరి చేతిలో పెట్టిన నిర్భాగ్యులు ఏమీ చెల్లించకపోతే... వారిని బానిసల వేలం మార్కెట్లకు తరలించి అమ్మేస్తారు. పులలను బోనులో పెట్టినట్లు... వీరిని ప్రదర్శనకు పెట్టి వేలం వేస్తారు. నియమిత కాలానికి వీరిని వేలం వేసి... ఆ సమయం ముగిసిన తర్వాత మళ్లీ వెనక్కితెస్తారు. కిందటిసారి వేలంలో వచ్చిన దానితో బాకీ తీరలేదని చెప్పి మళ్లీ వేలానికి పెడతారు. ఎంతమంది... ప్రస్తుతం లిబియాలో ఏడు నుంచి పది లక్షల మంది శరణార్థులు ఉంటారని ఐక్యరాజ్యసమితి అంచనా. తగిన పత్రాలు లేకుండా దొరికిన వారు, ముఠాల నిర్భందం నుంచి కాపాడిన వారు కలిపి మొత్తం 25,000 మంది ఇప్పుడు లిబియా ప్రభుత్వం నిర్వహిస్తున్న శరణార్థి నిర్భంద కేంద్రాల్లో ఉన్నారు. వీరిని స్వదేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నా... వారి మాతృదేశాలు సహకరించడం లేదని, జాతీయతను నిరూపించే ఆధారాలు చూపాలని అంటున్నాయనేది లిబియా ఆరోపణ. లిబియాలోని దుర్భర పరిస్థితులను చూశాక... స్వదేశానికి తిరిగి వెళ్లడానికి 8,800 (ఈ ఏడాది ఇప్పటివరకు) స్వచ్చంధంగా ముందుకు వచ్చారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఒఎం) సంస్థ తెలిపింది. వీరిని విమానాల్లో స్వదేశాలకు పంపింది. అక్రమ రవాణాల ముఠాల నిర్భంధంలో బానిసలుగా మగ్గుతున్న వారు వేలల్లోనే ఉంటారని అంచనా. సీఎన్ఎన్ చిత్రీకరించి ప్రసారం చేసిన వీడియోతో ప్రపంచ దేశాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో బానిసల వేలంపై దర్యాప్తు జరుపుతామని లిబియా ప్రభుత్వం ప్రకటించింది. మానవత్వానికే మచ్చ శరణార్థులకు బానిసలుగా అమ్ముతున్నారనే విషయం భీతిగొల్పుతోంది. ఇది మానవత్వానికే తీరని మచ్చ. అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా దీన్ని అడ్డుకోవాలి. చట్టపరమైన వలసలను ప్రొత్సహించాలి. – అంటోనియో గుటెరస్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ నన్ను అమ్మారు... నైజీరియాలో పెచ్చరిల్చిన అవినీతి, పేదరికంతో యూరోప్‌కు వలస వెళ్లాలని ఇంటిని వీడాను. ఉన్నదంతా ఊడ్చి లక్షా 80 వేల రూపాయలు స్మగ్లర్ల చేతుల్లో పోశాను. లిబియాకు చేరుకున్నాక నరకం చూపించారు. వారి నిర్భందంలో ఉన్నవారి శరీరాలను ఒకసారి పరిశీలించి చూస్తే గాయాల తాలూకు మచ్చలు కనిపిస్తాయి. సరైన తిండి పెట్టరు. చిత్రహింసలకు గురిచేస్తారు. డబ్బు బాకీపడ్డానని నన్ను పలుమార్లు వేలం వేశారు. మా ఇంటికి ఫోన్ చేసి డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశారు. చివరకు నన్ను వదిలేశారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా తిరిగి స్వదేశానికి వెళ్లి జీవితాన్ని మళ్లీ మొదటి నుంచి ఆరంభించాలి. నాకింతే రాసి ఉంది. – 21 ఏళ్ల విక్టరీ, నైజీరియన్ – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఇక్కడ మనుషులు అమ్మబడును
-
26 మంది బాలికల మృతదేహాల కలకలం
మధ్యధరా సముద్రంలో 26 మృతదేహాలు లభ్యం కాగా, అవన్నీ మైనర్ బాలికలవి కావడం కలకలం రేపింది. ఈ మృతదేహాలను ఇటలీ నావికాదళ అధికారులు ఆదివారం గుర్తించినట్లు తెలుస్తోంది. ఆఫ్రికా వాసులు పడవల్లో ప్రమాదకరమైన జర్నీ చేస్తూ ఎంతో మంది అమాయకులు నడి సంద్రంలో ముగినిపోవడం గతేడాది నుంచి తరచుగా చూస్తున్నాం. ఇలాంటి ఘటనల్లో ఇది ఒకటని భావించడానికి వీల్లేదని అధికారులు భావిస్తున్నారు. దక్షిణ ఇటలీ సాలోర్నో సిటీకి చెందిన అధికారి లోరెనా సిక్కోట్టి మాట్లాడుతూ.. సాధారణంగా మృతదేహాలు లభ్యమైనప్పుడు అందులో మహిళలు, చిన్నారులు, వృద్ధులవి ఎక్కువ కాగా, పురుషుల మృతదేహాలు తక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ మాకు దొరికినవి 26 మృతదేహాలు కాగా, అవన్నీ 14-18 ఏళ్లలోపున్న మైనర్ బాలికలవి కావడంతో ఆశ్చర్యానికి లోనయ్యాం. వీరిని ఎవరైనా లైంగికంగా వేధించారా.. అత్యాచారానికి పాల్పడిన అనంతరం హత్యచేసి సముద్రంలో మృతదేహాలు పడవేశారా అన్న దానిపై విచారణ చేపట్టినట్లు వివరించారు. గత ఆదివారం శరణార్థులకు చెందిన ఓ పడవ గల్లంతుకాగా, దాదాపు 60 మందిని ఇటలీ అధికారులు రక్షించినట్లు సమాచారం. యూఎన్ఓ శరణార్థుల హైకమిషనర్ మార్కో రొటున్నో మాట్లాడుతూ.. లిబియా పడవ మునక దుర్ఘటనలో 26 మంది చనిపోయి ఉండొచ్చునని చెప్పారు. -
ఓడ మునిగి 90 మంది గల్లంతు
ట్రిపోలి(లిబియా): శరణార్థులతో వస్తున్న ఓడ లిబియా తీర పట్టణం సభ్రతా సమీపంలో మునిగి వందమందికి పైగా జాడ తెలియకుండా పోయారు. ఏడుగురిని మాత్రం కాపాడగలిగామని లిబియా నావికా సిబ్బంది తెలిపారు. అయితే, ఆ ఓడ మునిగి అప్పటికే మూడు రోజులయిందని తాము రక్షించిన వారంతా ఓడకు చెందిన ఒక భాగాన్ని పట్టుకుని ప్రాణాలు నిలుపుకున్నారని లిబియా అధికార ప్రతినిధి అయూబ్ కసీమ్ తెలిపారు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నామని చెప్పారు. గత వారం రోజుల్లో మధ్యధరా సముద్రం మీదుగా యూరప్ చేరుకునేందుకు యత్నించిన సుమారు మూడు వేల మందిని లిబియా తీరం సమీపంలో కాపాడామని ఆయన వివరించారు. -
పడవ మునిగి 97 మంది గల్లంతు
-
పడవ మునిగి 97 మంది గల్లంతు
ట్రిపోలి: లిబియా రాజధాని ట్రిపోలి సమీపంలో సముద్రంలో పడవ మునిగిపోవడంతో 97 మంది శరణార్థులు గల్లంతయ్యారు. ఈ పడవలో మొత్తం 120 మంది ఉన్నారు. లిబియా కోస్ట్ గార్డ్ సిబ్బంది వెంటనే రంగంలోకి 23 మందిని రక్షించారు. మిగిలిన వారి జాఢ తెలియ రావడం లేదు. గల్లంతైన వారిలో 15 మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. శరణార్థులు ఎక్కువగా లిబియా నుంచి సముద్ర మార్గం ద్వారా యూరప్ బయల్దేరివెళ్తారు. గత మూడేళ్లలో లక్షా 50 వేల మంది వలస వెళ్లారు. కాగా సామర్థ్యానికి మించి పడవల్లో ప్రయాణించడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. -
బానిసలుగా అమ్మేస్తున్నారు!
జెనీవా: యూరప్‌కు వలసపోతున్న ఆఫ్రికా వాసులను స్మగ్లర్లు లిబియాలో బానిసలుగా అమ్ముతున్న విషయం వెలుగుచూసింది. ఒక్కొక్కరిని 200 డాలర్లు(దాదాపు రూ.13వేలు) నుంచి 500 డాలర్లకు విక్రయిస్తున్నారని, కొందరిని లైంగిక అవసరాలు తీర్చే సరుకుల్లా అమ్మేస్తున్నారని బాధితుల కథనాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ వలస సంస్థ(ఐఎంఓ) తెలిపింది. మంచి భవిష్యత్తు కోసం యూరప్ వెళ్లడానికి ఆఫ్రికన్ వాసులు మానవ అక్రమరవాణా ముఠాలకు డబ్బులు చెల్లిస్తున్నారని, అయితే వారు గమ్యానికి చేరుకోకుండా స్మగ్లర్ల చేతిలో బందీలవుతున్నారని లిబియాలోని ఐఎంఓ విభాగాధిపతి వెల్లడించారు. బందీలను స్మగ్లర్ల చెర నుంచి తప్పించుకోవడానికి బాధిత కుటుంబాలు భారీగా డబ్బులు చెల్లిస్తున్నాయన్నారు. తనతోపాటు 25 మందిని లిబియాలో నిర్బంధించారని, తొమ్మిది నెలల చిత్రహింసల తర్వాత తన తండ్రి ఇంటి అమ్మేసి తనను విడిపించాడని గాంబియా వాసి ఒకరు చెప్పారు. -
బెంఘాజీలో ఉగ్రవాదులను ఊడ్చేశారు
లిబియా: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లిబియాలోని కీలకమైన బెంఘాజీ ప్రాంతంపై పూర్తిగా పట్టునుకోల్పోయారు. ఉగ్రవాదులపై తీవ్ర పోరాటం చేస్తున్న అధికారిక సైన్యానికి సానుభూతిగా పనిచేస్తున్న ఫీల్డ్ మార్షల్ ఖలిఫా హఫ్తార్ సేన బెంఘాజిలోని గన్ఫౌడా నుంచి ఆ ఉగ్రవాదులను తరిమికొట్టింది. ఈ విషయాన్ని ఆ సైన్యం మార్షల్ హప్తార్ గురువారం ప్రకటించారు. గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంపై ఉగ్రవాదుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. దీంతో వారిని సమూలంగా నాశనం చేసేందుకు జరుగుతున్న యుద్ధాల్లో ఆ ప్రాంతం అస్తవ్యస్థంగా మారింది. అక్కడ ఉన్న ఉగ్రవాదులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులుగానీ, అల్ కాయిదా ఉగ్రవాదులుగానీ అయ్యుండొచ్చని మిలిటరీ అధికారులు చెబుతున్నారు. దాదాపు చాలామంది అధికారిక సైన్యమే మట్టుపెట్టగా మిగిలిన వారిని హప్తార్ సైన్యం తరిమికొట్టింది. అయితే, కొందరు ఉగ్రవాదులు సమీపంలోని 12 బ్లాక్స్ అనే ప్రాంతంలోకి వెళ్లి తలదాచుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. హప్తార్ సేనకు ఇప్పటి వరకు ఐక్య రాజ్యసమితి నుంచి గానీ లిబియా నుంచి గానీ గుర్తింపు లేదు. ఈ సైన్యాన్ని లిబియన్ నేషనల్ ఆర్మీగా చెబుతుంటారు. -
సముద్ర తీరంలో 180 మంది జలసమాధి!
-
180 మంది జలసమాధి!
లిబియాలో సముద్ర తీరంలో ప్రమాదం రోమ్: ఐరోపా దేశాల్లో వలసల బతుకులు అర్ధంతరంగా ముగిసిపోతున్నాయి. మరుభూమిగా మారిన తమ దేశంలో బతుక లేక... మర పడవల్లో పొరుగు దేశాలకు పయనమవుతున్న శరణార్థులు మధ్యధరా సముద్రంలో జలసమాధి అవుతున్నారు. తాజాగా లిబియా నుంచి ఇటలీకి వెళుతున్న శరణార్థుల్లో 180 మంది మధ్యధరా సముద్రంలో గల్లంతయ్యారు. తూర్పు ఆఫ్రికాకు చెందిన వీరంతా మరణించారని భావిస్తున్నారు. ఏడాది ఆరంభంలో ఇది అతిపెద్ద విషాదం. శనివారం లిబియా తీరంలో బయలుదేరిన టూటైర్ పడవ... సముద్రంలో ఐదు గంటలు ప్రయాణించింది. ఆ సమయంలో మోటారు చెడిపోయింది. క్రమంగా పడవలోకి నీళ్లు రావడం మొదలుపెట్టాయి. ఒక్కొక్కరుగా ప్రయాణికులు నీటిలో మునిగిపోయారని ప్రత్యక్ష సాక్షుల కథనం ఆధారంగా అధికారులు తెలిపారు. కాగా, ప్రమాదం నుంచి తప్పించుకున్న 38 మంది వలసదారులు మంగళవారం ట్రపానిలోని సిసిలియాన్ నౌకాశ్రయానికి చేరుకున్నారు. గత ఏడాది వేలాది మంది వలస బాటలో ప్రాణాలు కోల్పోయారు. అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం), ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ (యూఎన్‌హెచ్‌సీఆర్) ప్రతినిధులు, రెస్క్యూ బృందాలు మృతదేహాల కోసం గాలిస్తున్నాయి. 2016లో దాదాపు 1.81 లక్షల మంది శరణార్థులు ఇటలీ తీరానికి చేరినట్టు లెక్కలు చెబుతున్నాయి. -
విమానం హైజాక్ సుఖాంతం
లిబియాలో హైజాక్.. మాల్టాలో ప్రత్యక్షం మాల్టా ఆర్మీ చొరవతో ప్రయాణికులు సురక్షితంగా విడుదల.. అనంతరం లొంగిపోయిన హైజాకర్లు వలెటా: లిబియాలోని సభా నుంచి రాజధాని ట్రిపోలీకి అఫ్రికియా ఎయిర్వేస్ విమానం (ఎయిర్‌బస్ ఏ 320) శుక్రవారం ఉదయం బయలుదేరింది.. షెడ్యూల్ ప్రకారం కాసేపట్లో ట్రిపోలీ చేరుకోవాల్సిన విమానం.. దారి మళ్లిందనే సమాచారం కలకలం రేపింది. విమానంలో 118 మంది ప్రయాణికులతోపాటు సిబ్బంది ఉన్నారు. కాసేపటికి విమానం హైజాక్ అయిందనే సమాచారం లిబియా ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురిచేసింది. అయితే హైజాకర్లు విమానాన్ని మధ్యదరాసముద్ర ద్వీప దేశమైన మాల్టాలోని వలెటా విమానాశ్రయంలో ల్యాండ్ చేయటం.. అక్కడి మిలటరీ రంగంలోకి దిగి ప్రయాణికులను రక్షించటంతో కథ సుఖాంతమైంది. అనంతరం ఇద్దరు హైజాకర్లూ లొంగిపోయారు. వారు దివంగత లిబియా నేత గఢాఫీ అనుచరులని.. వారిద్దరూ మాల్టాలో రాజకీయ ఆశ్రయం కావాలని కోరినట్లు తెలిసింది. అసలేం జరిగింది?.. సభా నుంచి విమానం బయలుదేరిన కాసేపటికే ఇద్దరు అగంతకులు విమానంలోకి కాక్‌పిట్‌లోకి చొరబడ్డారు. చేతిలో గ్రనేడ్లు పట్టుకుని.. విమానాన్ని పేల్చేస్తామని బెదిరించారు. దీంతో పైలెట్లతోపాటు విమానంలో ఉన్నవారిలోనూ ఆందోళన నెలకొంది. ఏం జరుగుతుందో ప్రయాణికులకు అర్థమయ్యేలోపునే విమానం దారి మళ్లింది. ఈ సమయంలో విమానంలో 28 మహిళలు, ఓ చిన్నారితో సహా 118 మంది ప్రయాణికులున్నారు. దీంతో లిబియా ప్రభుత్వం అప్రమత్తమైంది. హైజాకర్లు విమానాన్ని మాల్టాకు దారి మళ్లించారు. రన్‌వేపైనే గంటసేపు విమానాన్ని నిలిపి ఉంచారు. దీంతో ఆందోళన చెందిన విమానాశ్రయాధికారులు.. పలు విమానాలను ఇటలీకి దారిమళ్లించారు. మరికొన్ని మొదట వాయిదా పడ్డా.. తర్వాత మొదటి రన్‌వే ద్వారా ల్యాండ్ అయ్యాయి. అటు విమానాశ్రయాధికారుల సూచనతో రంగంలోకి దిగిన మాల్టా ఆర్మీ ఎయిర్‌బస్‌ను చుట్టుముట్టింది. బందీలను వదిలిపెట్టాలని హైజాకర్లకు సూచించింది. రెండున్నర గంటల చర్చల తర్వాత.. ప్రయాణికులను క్షేమంగా హైజాకర్లు వదిలిపెట్టేందుకు అంగీకరించారు. ‘విమాన సిబ్బంది కూడా క్షేమంగా బయటకు వచ్చేశారు. హైజాకర్లు లొంగిపోయారు. వారిని అదుపులోకి తీసుకున్నాం’ అని మాల్టా ప్రధాని జోసెఫ్ మస్కట్ ట్వీట్ చేశారు. దీంతో కథ సుఖాంతమైనట్లు అధికారిక సమాచారం అందింది. కాగా, ఇద్దరు హైజాకర్లు గఢాఫీ అనుకూల పార్టీ పెట్టనున్నట్లు తెలిపారని లిబియా విదేశాంగ మంత్రి వెల్లడించారు. -
కోతి రగిల్చిన రణం.. 20 మంది మృతి
లిబియాలోని సాభా నగరంలో ఒక వ్యక్తి కోతులు పెంచుతుంటాడు. ఆడపిల్లలు స్కూలు నుండి ఇంటికి వెళుతున్నపుడు వారిపై ఆ కోతులను ఉసిగొల్పి ఏడిపిస్తుంటాడు. అలా కొద్ది రోజుల కింద అతడి కోతి ఒకటి ఒక బాలిక చేతిని కొరికి ఆమె స్కార్ఫ్‌ను లాక్కెళ్లింది. దీంతో అక్కడ రెండు గిరిజన తెగల మధ్య పరువు యుద్ధం మొదలైంది. బాలిక కుటుంబం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. కానీ.. కోతి యజమాని నిరాకరించాడు. అతడికి అతడి తెగ మొత్తం అండగా నిలిచింది. దీంతో బాలికకు చెందిన తెగ వారు కూడా ఆమె కుటుంబానికి అండగా నిలిచారు. ఇప్పుడు ఈ రెండు తెగల మధ్య పూర్తి స్థాయి యుద్ధం సాగుతోంది. సాభా నగరం నడి వీధుల్లో రాత్రీ పగలూ తేడా లేకుండా కాల్పులు జరుపుకుంటున్నారు. హోవిడ్జర్ ఫిరంగులు, మోర్టారులు కూడా వినియోగిస్తున్నారు. అర్థరాత్రిళ్లు సైతం రోడ్లపై యుద్ధ ట్యాంకులు సంచరిస్తున్నాయి. ఇప్పటివరకూ 20 మంది చనిపోగా, 60 మంది వరకూ క్షతగాత్రులయ్యారు. దీనిని కోతి యుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ యుద్ధానికి కారణమైన కోతి చనిపోయినట్లు చెప్తున్నారు. -
ఇంటికి చేరిన తెలుగు ప్రొఫెసర్లు
-
ఇంటికి చేరిన తెలుగు ప్రొఫెసర్లు
హైదరాబాద్: గతేడాది లిబియాలో ఉగ్రవాదుల చేతుల్లో కిడ్నాప్‌కు గురై వారి చెర నుంచి బంధీలుగా విడుదలయిన తెలుగు ప్రొఫెసర్లు బలరామ కిషన్, తిరువీధుల గోపీకృష్ణలు శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ఏడాదిపాటూ ఐసిస్ కిడ్నాపర్ల చెరలో ఉన్న ప్రొఫెసర్ల విడుదలలో కేంద్ర విదేశీవ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ కీలకంగా వ్యవహరించారు. విదేశాంగశాఖ అధికారులు బలరామ కిషన్, తిరువీధుల గోపీకృష్ణలను వారి వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. 2015 జూలై 29న లిబియా నుంచి ట్యునీషియా మార్గంలో ఐసిస్ ఉగ్రవాదులు నలుగురు భారత ప్రొఫెసర్లను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. నార్త్ లిబియాలోని సిర్టే యూనివర్శిటీ నుంచి నలుగురు భారతీయ ప్రొఫెసర్లు వస్తుండగా ట్రిపోలి ఎయిర్ పోర్ట్ సమీపంలో వారు కిడ్నాప్ కు గురయ్యారు. వారిలోని కర్నాటకకు చెందిన విజయ్ కుమార్, రామకృష్ణలను రెండురోజుల్లోనే వదిలేసిన ఉగ్రవాదులు.. కరీంనగర్ జిల్లా శనిగరం గ్రామానికి చెందిన ప్రొఫెసర్ బలరామ కిషన్, శ్రీకాకుళం టెక్కలికి చెందిన తిరువీధుల గోపీకృష్ణలను మాత్రం చెరలోనే ఉంచారు. వారి విడుదలకోసం లిబియా దేశ రాయబారితో అప్పట్నుంచీ కేంద్రం చర్చలు జరిపి సఫలమయ్యింది. -
రేపు రానున్న తెలుగు ప్రొఫెసర్లు
న్యూఢిల్లీ: గతేడాది లిబియాలో ఉగ్రవాదులు చేతుల్లో కిడ్నాప్ కు గురై వారి చెర నుంచి బంధీలుగా విడుదలయిన తెలుగు ప్రొఫెసర్లు శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకోనున్నారు. అనంతరం వారు తమ స్వగ్రామానికి చేరుకుంటారని విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ఓ ప్రకటనలో తెలిపారు. 2015 జూలై 29న లిబియా నుంచి ట్యునీషియా మార్గంలో ఐసిస్ ఉగ్రవాదులు నలుగురు భారత ప్రొఫెసర్లను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. నార్త్ లిబియాలోని సిర్టే యూనివర్శిటీ నుంచి నలుగురు భారతీయ ప్రొఫెసర్లు వస్తుండగా ట్రిపోలి ఎయిర్ పోర్ట్ సమీపంలో వారు కిడ్నాప్ కు గురయ్యారు. వారిలోని కర్నాటకకు చెందిన విజయ్ కుమార్, రామకృష్ణలను రెండురోజుల్లోనే వదిలేసిన ఉగ్రవాదులు.. కరీంనగర్ జిల్లా శనిగరం గ్రామానికి చెందిన ప్రొఫెసర్ బలరామ కిషన్, శ్రీకాకుళం టెక్కలికి చెందిన తిరువీధుల గోపీకృష్ణలను మాత్రం చెరలోనే ఉంచారు. వారి విడుదలకోసం లిబియా దేశ రాయబారితో అప్పట్నుంచీ కేంద్రం చర్చలు జరుపుతూనే ఉంది. వారి విడుదలలో కేంద్ర విదేశీవ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ కీలకంగా వ్యవహరించారు. -
తెలుగు ప్రొఫెసర్లకు ఎట్టకేలకు విముక్తి
గత ఏడాది లిబియాలో కిడ్నాప్ అయిన తెలుగు ప్రొఫెసర్లకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన టి.గోపాలకృష్ణ, తెలంగాణకు చెందిన సి.బలరాం కిషన్ సురక్షితంగా విడుదల కావడంపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హర్షం వ్యక్తం చేశారు. కిడ్నాపర్లు ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లను విడుదల చేసినట్లు ఆమె తెలిపారు. సుమారు ఏడాదికిపైగా బందీలుగా ఉన్నవారు సురక్షితంగా విడుదలైనట్లు తెలపడానికి ఎంతో సంతోషిస్తున్నట్లు సుష్మ గురువారం ట్విట్ చేశారు. 2015 జూలై 29న లిబియా నుంచి ట్యునీషియా మార్గంలో ఐసిస్ ఉగ్రవాదులు నలుగురు భారత ప్రొఫెసర్లను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. నార్త్ లిబియాలోని సిర్టే యూనివర్శిటీ నుంచి నలుగురు భారతీయ ప్రొఫెసర్లు వస్తుండగా ట్రిపోలి ఎయిర్ పోర్ట్ సమీపంలో వారు కిడ్నాప్ కు గురయ్యారు. వారిలోని కర్నాటకకు చెందిన విజయ్ కుమార్, రామకృష్ణలను రెండురోజుల్లోనే వదిలేసిన ఉగ్రవాదులు.. కరీంనగర్ జిల్లా శనిగరం గ్రామానికి చెందిన ప్రొఫెసర్ బలరామ కిషన్, శ్రీకాకుళం టెక్కలికి చెందిన తిరువీధుల గోపీకృష్ణలను మాత్రం చెరలోనే ఉంచారు. వారి విడుదలకోసం లిబియా దేశ రాయబారితో అప్పట్నుంచీ కేంద్రం చర్చలు జరుపుతూనే ఉంది. తమవారి జాడకోసం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. సుమారు ఏడాదికాలం చూసిన వారి ఎదురు చూపులు ఫలించాయి. ఎట్టకేలకు బందీలుగా ఉన్నగోపీకృష్ణ, బలరామకిషన్ లు సురక్షితంగా విడుదలవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వారి కుటుంబాల్లో సంబరాలు చేసుకున్నారు. ప్రొఫెసర్ల విడుదలపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సుష్మాస్వరాజ్ కు తన ట్వీట్ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. I am happy to inform that T Gopalakrishna (AP) & C BalaramKishan (Telangana) who were captive in Libya since 29 July 2015 have been rescued. — Sushma Swaraj (@SushmaSwaraj) 15 September 2016 -
పాఠశాలలు ధ్వంసం.. చదువు చట్టుబండలు!
అంతర్యుద్ధంతో రగలిపోతున్న లిబియాలో పిల్లల చదువు చట్టుబండలవుతోందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తంచేసింది. అంతర్యుద్ధ దాడుల్లో పాక్షికంగా లేదా పూర్తిగా పాఠశాలలు ధ్వంసమై మూతపడడం లేదా పాఠశాలలు శరణార్థుల కేంద్రాలుగా మారిపోవడం వల్ల పిల్లలు చదువుకు దూరం అయ్యారని ఆవేదన వ్యక్తంచేసింది. అలా చదువుకు దూరమైన బడిపిల్లల సంఖ్య 2,79,000 ఉంటుందని ఐక్యరాజ్య సమితి మానవీయ వ్యవహారాల సమన్వయ కార్యాలయం తాజాగా విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా దాదాపు 558 పాఠశాలలు పనిచేయడం లేదని పేర్కొంది. 2014 నుంచి లిబియాలో అంతర్యుద్ధం తీవ్రమైంది. ఐక్యరాజ్యసమితి మద్దతుతో నడుస్తున్న లిబియా సంకీర్ణ ప్రభుత్వం బలగాలకు, తిరుగుబాటు వర్గాలకు మధ్య ఈ పోరాటం కొనసాగుతోంది. తిరుగుబాటు వర్గాల్లో ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు కూడా ఉన్నారు. ఐఎస్ టెర్రరిస్టుల దాడుల కారణంగా సిర్తీ నగరంలో మూడో వంతు జనాభా మరణించింది. 35 వేల మంది ప్రజలు వలసపోయారు. ఇస్లామిక్ టెర్రరిస్టుల బారి నుంచి సిర్తీ నగరాన్ని ప్రభుత్వ దళాలు తిరిగి స్వాధీనం చేసుకున్నా.. అక్కడ కనీస వసతులు లేవని ప్రజలెవరూ నగరానికి తిరిగి రావడానికి ఇష్టపడడం లేదు. అంతర్యుద్ధంలో తీవ్రంగా దెబ్బతిన్న సిర్తీ నగరంతోపాటు బెంఘాజి నగరంలో కూడా దారుణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రజలకు కనీసం మంచినీళ్లు కూడా అందుబాటులో లేవు. క్షతగాత్రులతో ఆస్పత్రులు నిండిపోయాయి. వారికి సరైన మందులు కూడా అందడం లేదు. ఈ అంతర్యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందో తెలియక ప్రజలు దినదిన గండంగా బతుకుతున్నారు. 2011లో మహ్మద్ గఢాఫీ ప్రభుత్వాన్ని కూలదోసినప్పటి నుంచి లిబియాలో కల్లోల పరిస్థితులు కొనసాగుతున్నాయి. -
శరణార్థుల పడవ మునక
-117 మంది మృతి - వందలాది మంది గల్లంతు - గ్రీస్ తీరంలో ఘటన ఎథెన్స్: మధ్యధరా సముద్రంలో మరణ ఘోష వినిపిస్తూనే ఉంది. స్వదేశాల్లో యుద్ధంతో భీతిల్లి పొట్ట చేతపట్టుకొని యూరప్ దేశాలకు పయనమవుతున్న శరణార్థులు ఆటుపోట్లకు బలవుతున్న విషాద ‘సాగర’గాథ కొనసాగుతూనే ఉంది. తాజాగా మధ్యధరా సముద్రాన్ని దాటే క్రమంలో గ్రీస్ తీరంలో బోటు బోల్తా పడి వందలాది గల్లంతయ్యారు. వారిలో 117 మంది మృతదేహాలు లిబియాలోని జువారా తీరానికి గురువారం కొట్టుకువచ్చాయి. క్రీట్ ద్వీపం దగ్గర్లో పడవ మునిగిందని, కిక్కిరిసిన పడవలో సామర్థ్యానికి మించి 125 మంది వరకు ఉండవచ్చని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని లిబియా నేవీ ప్రతినిధి కల్నల్ అయూబ్ ఖాసీం తెలిపారు. ఎవరెవరు ఏఏ దేశాలకు చెందినవారో ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు. బోటు ఎప్పుడు మునిగిందన్నదీ చెప్పలేకపోతున్నారు. కొన్ని శవాలు కుళ్లిపోయున్నాయి. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. గ్రీస్ కోస్ట్ గార్డ్స్ 340 మందిని రక్షించారు. నాలుగు మృతదేహాలను గుర్తించినట్టు అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం) ప్రకటించింది. ఆఫ్రికా నుంచి బయలుదేరినట్టుగా భావిస్తున్న ఈ బోట్లో దాదాపు 700 మంది ప్రయాణిస్తున్నట్టు అంచనా. ఇటీవల కాలంలో సుమారు వెయ్యి మంది ఇలా బలయ్యారు. జనవరి నుంచి 2.04 లక్షల మంది మధ్యధరా సముద్రం మీదుగా ఐరోపా దేశాలకు వలస వెళ్లారు. ఈ భయానక ప్రయాణంలో 2,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది లిబియా నుంచి ఇటలీకి వెళుతున్న క్రమంలో మృత్యువాత పడ్డవారే. -
వారంలో 700 మంది శరణార్థులు గల్లంతు!
రోమ్: యూరప్‌కు సముద్ర మార్గంలో అక్రమంగా పడవల్లో తరలివస్తూ ప్రమాదవశాత్తు మరణించిన వారి సంఖ్య తాజాగా 700కు చేరింది. శుక్రవారం సముద్రంలో శరణార్థులతో ఇటలీ తీరానికి వస్తున్న పడవ మునిగిన ఘటనలో 45 మంది మరణించారు. బుధవారం మరో పడవ మునిగిన ఘటనలో 100 మంది జాడ గల్లంతైందని ఐరాస శరణార్థుల హైకమిషనర్ అధికారప్రతినిధి కార్లొటా సమీ తెలిపారు. బుధవారం లిబియా నుంచి చెరో 500 మంది ప్రయాణికులతో రెండు పడవలు ఇటలీకి బయల్దేరాయి. రెండింటినీ తాడుతో కట్టారు. అయితే, మార్గమధ్యంలో వెనక వైపు పడవ మునగడం ప్రారంభమవడంతో ముందు పడవ కెప్టెన్ తాడును కట్‌చేశాడు. దీంతో కిక్కిరిసిన శరణార్థులతో ఉన్న రెండో పడవ మునిగిపోయింది. -
బోటు ప్రమాదం: వలస వెళ్తున్న 8మంది మృతి
లిబియా : బోటు ప్రమాదంలో వలస వెళ్తున్న 8 మంది ఆఫ్రికా వాసులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన లిబియా తీరంలో ఆదివారం జరిగిందని శోధన, రెస్క్యూ సంస్థ సోమవారం తెలిపింది. ప్రమాదం నుంచి రెస్క్యూ బోటు ద్వారా 108 మందిని సురక్షితంగా కాపాడినట్లు మధ్యధరా ప్రాంత ఫ్రెంచ్ చారిటీ తెలిపింది. లిబియన్ పోర్టులోని సబ్రత నుంచి బయల్దేరిన ఈ నౌకలో మొత్తం 135 మంది ప్రయాణిస్తున్నారని, జనం ఎక్కువ కావడంతో ప్రమాదం సంభవించిందని సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికుడొకరు తెలిపారు. వీరిలో 8 మంది మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆరుగురి మృతదేహాలు వెలికితీశారు. మరో రెండు మృతదేహాలు గల్లంతయ్యాయి. -
అది నా అతిపెద్ద తప్పిదం: ఒబామా
వాషింగ్టన్: లిబియా నియంత పాలకుడు గడాఫీని 2011లో గద్దె దించాక ఆ దేశంలో తలెత్తిన అనిశ్చితిని అంచనా వేయడంలో విఫలమవడం తన అతిపెద్ద తప్పిదమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. ఈ పరిణామాలను ముందే ఊహించి అందుకు తగిన చర్యలు చేపట్టి ఉండాల్సిందన్నారు. గడాఫీ హత్యానంతరం లిబియాలో మిలీషియా దళాలు సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఐసిస్ ఉగ్రవాద సంస్థ పట్టుబిగించిన నేపథ్యంలో ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు. వార్తాచానల్ ఫాక్స్‌న్యూస్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. -
కేరళ సాఫ్ట్వేర్ ఇంజినీర్ కిడ్నాప్
న్యూఢిల్లీ: కేరళకు చెందిన ఓ ఐటీ ఉద్యోగి లిబియాలో అపహరణకు గురయ్యాడు. కాజీకోడ్ జల్లాకు చెందిన రేగి జోసెఫ్ (43) ను లిబియా రాజధాని ట్రిపోలి లో అక్కడ తిరుగుబాటు దళాలు గతనెల 31న కిడ్నాప్ చేశారు. రాజధానికి సమీపంలో సోక్ అల్ జముయా కార్యాలయంలో విధులు నిర్వర్తిసుండగా దాడిచేసిన ప్రభుత్వ వ్యతిరేక దళాలు జోసెఫ్ తో పాటు మరో ముగ్గుర్ని అపహరించారు. జోసెఫ్ ఆల్ దివాన్ కంపెనీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. భార్య షినుజ, ముగ్గురు కుమార్తెలుతో గత రెండు సంవత్సరాలుగా ఆయన లిబియా నివసిస్తుండగా, భార్య స్థానిక టిఎంసి హాస్పిటల్ లో నర్సుగా పని చేస్తున్నారు. కాగా తన కుమారుడు కిడ్నాప్ వ్యవహారంపై తన కోడలు భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించినట్టు జోసెఫ్ తండ్రి పుల్లు వెలిల్ తెలిపారు. మరోవైపు కాజీకోడ్ ఎంపీ ఎంకె రాఘవన్ స్పందిస్తూ జోసెఫ్ కుటుంబానికి తగిన సహాయం చేస్తామన్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. -
బాంబుల వర్షం.. 40 మంది ఉగ్రవాదులు హతం
ట్రిపోలి: లిబియాలో వైమానిక దాడులు తీవ్ర రూపం దాల్చాయి. శుక్రవారం గుర్తుతెలియని ఓ యుద్ధ విమానం గగనతలం నుంచి జరిపిన బాంబు దాడుల్లో సుమారు 40 మంది ఇస్లామిక్ మిలిటెంట్లు హతమై ఉంటారని లిబియా అధికారులు భావిస్తున్నారు. లిబియా రాజధాని ట్రిపోలి సమీపంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు సబ్రతా అనే ప్రాంతంలో ఓ ఇంట్లో సమావేశమయ్యారు. ట్యూనీషియా సరిహద్దులో ఉన్న ఐఎస్ఐఎస్ సభ్యలను లక్ష్యంగా చేసుకుని యుద్ధ విమానం బాంబులతో దాడిచేయగా 40 మందికి పైగా తిరుగుబాటుదారులు మృతిచెందారు. ఈ దాడుల్లో ఉగ్రవాదులు సమావేశమైన ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ట్రిపోలికి సరిహద్దుగా ఉన్న ట్యూనీషియా సమీపంలో ఈ దాడులు జరిగాయని హుస్సేన్ అల్ దవాదీ అనే అధికారి వెల్లడించారు. ట్యూనీషియాలో గతేడాది జరిగిన ఉగ్రదాడులకు ప్రతీకారంగా తామే ఈ దాడులు చేశామని అమెరికా మీడియాకు అక్కడి అధికారులు వెల్లడించినట్లు సమాచారం. -
తుపాకులతో బెదిరిస్తూ తెలుగు ప్రొఫెసర్లతో పాఠాలు?
న్యూఢిల్లీ: ఇంట్లో ఆర్థిక సమస్యలు. మాతృదేశంలో ఉద్యోగాలు కరువు.. కళ్లముందు బోలెడు సమస్యలు వెరసి ఎలాగైనా ఓ ఉద్యోగం చేయాలనే తపన వారిని ప్రమాదభరిత ప్రాంతాల్లో సైతం ఉద్యోగాలకు వెళ్లేలా చేసింది. విదేశాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకోగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రభావం ఎక్కువగా ఉండే లిబియాలో ఉద్యోగం వచ్చింది. సిర్తీ విశ్వవిద్యాలయంలో విధుల్లో చేరారు. సెలవుల్లో భాగంగా తిరుగు ప్రయాణం అయినవారిని దురదృష్టం వెంటాడింది. దాదాపు రెండు నెలలుగా వారి గురించి ఇసుమంత జాడకూడా తెలియకుండా పోయింది. ఇది లిబియాలో కిడ్నాప్ కు గురైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు బలరాం, గోపీకృష్ణల కథ. బలరాం, గోపికృష్ణలు గత ఏడాది జూలై చివరి వారంలో భారత్ కు తిరిగి వచ్చేందుకు ట్యునిషియా ఎయిర్ పోర్టుకు వస్తుండగా వారిని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అప్పటి నుంచి వారి జాడ కరువైంది. కానీ, విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు వెళ్లిన వారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఉగ్రవాదులు తమకు పాఠాలు చెప్పించుకుంటున్నారని తాజాగా తెలిసింది. వారి ప్రాణానికి ఎలాంటి హాని తలపెట్టకుండా బెదిరింపులకు మాత్రమే దిగుతూ పాఠాలు చెప్పించుకుంటున్నారని, ఈ కృతజ్ఞతాభావంతోనైనా ఆ ఉగ్రవాదులు తమవారిని విడిచిపెడతారని ఆశిస్తున్నట్లు వారి కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. వీరితోపాటు ఎంతోమందిని ఇలాగే ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లి పాఠాలు చెప్పించుకుంటున్నారట. బలరాం భార్య శ్రీదేవీ ఈ విషయంపైనే ఓ మీడియాతో మాట్లాడుతూ 'ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తమవారితో బలవంతంగా పాఠాలు చెప్పించుకుంటున్నారని నాకు మూడు నెలల కిందట భారత దౌత్య కార్యాలయం, స్థానికుల సమాచారం ద్వారా తెలిసింది. నేను ప్రతి రోజు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పీఏకు ఫోన్ చేస్తున్నాను. వారు సురక్షితంగా ఉన్నారని చెప్తున్నారు. దీంతో వారు క్షేమంగా తిరిగొస్తారన్న భరోసాతో ఉంటున్నాను. ఈ సమయంలో నా కుటుంబం నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నా కొంత గుబులుగానే ఉంది' అని చెప్పింది. ఇక గోపి కృష్ణ సోదరుడు మురళీ కృష్ణ మాట్లాడుతూ.. తమ సోదరుడిని సెప్టెంబర్ 2014లో చూశామని, ఫిబ్రవరి 29 తన పుట్టినరోజని ఆ నాటికైనా తాను వస్తాడని తాము ఆశిస్తున్నట్లు తెలిపాడు. తమ కుటుంబ పరిస్థితి దయనీయంగా మారిందన్నాడు. వీరితోపాటు కర్ణాటకకు చెందిన ఎస్ విజయ్ కుమార్, లక్ష్మీ కాంత్ రామకృష్ణ అనే ఇద్దరిని కూడా ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినా అనంతరం విడిచిపెట్టారు. -
లిబియాలో ఘర్షణలు..16మంది మృతి
ట్రిపోలి: లిబియాలో సైనికులకు ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రేరేపిత ఉగ్రవాదులకు మధ్య పోరాటం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 16మంది ప్రాణాలు కోల్పోయారు. బెంగాజీ వద్ద చోటు చేసుకున్న ఇరు వర్గాల మధ్య ఘర్షణల్లో ఈ ప్రాణనష్టం చోటుచేసుకున్నట్లు అక్కడి హక్కుల సంస్థ ఒకటి తెలిపింది. బెంగాజీ ఎయిర్ బేస్ క్యాంపును గత ఏడాది ఉగ్రవాదులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దానిని తిరిగి తమ అదుపులోకి తెచ్చుకునేందుకు లిబియా సైన్యాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో జరిగిన దాడిలో ఏడుగురు ఉగ్రవాదులు చనిపోగా మరో తొమ్మిదిమంది అమాయకలు ప్రాణాలు విడిచారు. -
ఎడతెగని నిరీక్షణ...
నాచారం(హైదరాబాద్): లిబియాలో పని చేస్తున్న ప్రొఫెసర్ గోపీకృష్ణ కిడ్నాప్‌నకు గురై 100 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు వారిని విడిపించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి బాధితులు ఎలా ఉన్నారు? ఎప్పుడు వస్తారో కనీస సమాచారం కూడా అందించడం లేదన్నారు. మూడు నెలలుగా తన భర్త యోగక్షేమాలు తెలియక నరకం అనుభవిస్తున్నామని, పిల్లలు డాడీ ఎప్పుడు వస్తారని అడుగుతున్నారని గోపీకృష్ణ భార్య కల్యాణి కన్నీరుమున్నీరయ్యారు. మూడు కుటుంబా లు ఆయనపైనే ఆధారపడి ఉన్నాయని, ప్రస్తుతం తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సోదరుడు మురళీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. తమ వారిని విడిపిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ, విదేశాంగమంత్రి సుష్మస్వరాజ్ హామీ ఇచ్చినా ఎలాంటి ఫలితం కనిపించడం లేదన్నారు. ఇప్పటికైనా తన సోదరుడిని విడిపించేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులను కలువనున్నట్లు తెలిపారు. -
గోపికృష్ణ కిడ్నాపై 100 రోజులు..
హైదరాబాద్: లిబియాలో ఐఎస్ మిలిటెంట్ల చేతుల్లో తెలుగు ప్రొఫెసర్ గోపీకృష్ణ అపహరణకు గురై 100 రోజులు అవుతున్నా ఇప్పటికీ విడుదల కాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని నగరంలోని నాచారం ప్రాంతంలో ఉంటున్న అతడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిడ్నాప్‌కు గురై 100 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి కనీస సమాచారం లేదని గోపీకృష్ణ భార్య కళ్యాణి సోమవారం మీడియా ముందు ఆవేదన చెందారు. మూడు నెలలుగా తన భర్త యోగక్షేమాలు తెలియక నరకం అనుభవిస్తున్నామని, పిల్లలు డాడి ఎప్పుడు వస్తారని అడుగుతున్నారని కన్నీరుమున్నీరవుతున్నారు. గోపీకృష్ణ మీద మూడు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, ఈ కుటుంబాలు గత మూడు నెలలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురౌతున్నట్లు సోదరుడు మురళి కృష్ణ చెప్పారు. అపహరణకు గురైన వారిని విడిపిస్తామని ప్రధాని నరెంద్రమోదీ, విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ హామీ ఇచ్చారని, కానీ విడుదలలో ఎలాంటి పురోగతి లేదన్నారు. తమ్ముడు గోపికృష్ణ విడుదలకు కృషి చేయాలని కోరుతూ తెలంగాణ, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులను కూడా మరోసారి కలుస్తామన్నారు. -
అయిల్ పోర్ట్‌పై ఐఎస్ తీవ్రవాదుల దాడి
ట్రిపోలి: లిబియాలో ఐఎస్ తీవ్రవాదులు రెచ్చిపోయారు. దేశంలోని అతిపెద్ద అయిల్ పోర్ట్ సిడ్రాపై దాడి చేశారు. ఈ దాడిలో ఓ సైనికుడు మరణించాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ మేరకు మిలటరీ ఉన్నతాధికారి శనివారం వెల్లడించారు. ఐఎస్ తీవ్రవాదుల దాడితో వెంటనే స్పందించిన పోర్ట్ వద్ద భద్రత ఇబ్బంది కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మరణించారని చెప్పారు. ఈ దాడి ముందు తీవ్రవాదులు ట్రక్ బాంబును పేల్చారు. అయితే 2014 డిసెంబర్ నుంచి ఈ పోర్ట్ మూసి వేసినట్లు ఉన్నతాధికారి వెల్లడించారు. -
21 సెప్టెంబర్ 1964 మాల్టా విముక్తి
ఆ నేడు దక్షిణ ఐరోపాలోని ద్వీప దేశం మాల్టా. ఇటలీకి దక్షిణం వైపు 80 కి. మీ దూరంలో, తునీషియాకు తూర్పున 284 కి.మీ దూరంలో, లిబియాకు ఉత్తరం వైపున 333 కి.మీ దూరంలో ఉంటుంది. విస్తీర్ణం 316 చ.కి.మీ. ప్రపంచంలోని అతి చిన్నదేశాలలో, అత్యంత జనసాంద్రత కలిగిన దేశాలలో మాల్టా ఒకటి. రాజధాని వెల్లెట్టా. ఈ దేశ ప్రజలు మాల్టీస్, ఇంగ్లిషు భాషలు మాట్లాడతారు. మాల్టాకు క్రీ.పూ.5200 నాటి నుంచి చరిత్ర ఉంది. -
సీఎం ను కలిసిన రామ్మూర్తి కుటుంబం
-
సీఎం ను కలిసిన రామ్మూర్తి కుటుంబం
లిబియాలో కిడ్నాప్ కు గురైన డాక్టర్ రామ్మూర్తి కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబు నాయుడుని కలిశారు. రామ్మూర్తి విడుదలకు కృషి చేస్తానని సీఎం చంద్రబాబునాయుడు వారికి హామీ ఇచ్చారు. -
లిబియాలో మరో ఇద్దరు భారతీయుల కిడ్నాప్
లిబియాలో మరో ఇద్దరు భారతీయులు కిడ్నాప్ కు గురయ్యారు. ఇప్పటికీ ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లను తమ చెరలో ఉంచుకున్న ఐఎస్ తీవ్రవాదులు.. సిర్తే పట్టణానికి సమీపంలో మరో ఇద్దరు భారతీయులను బందీలుగా చేసుకున్నట్లు భారత విదేశాంగ శాఖ బుధవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. కిడ్నాపైన ఇద్దరిలో ఒకరు ఏపీకి చెందిన కొసనం రామ్మూర్తి కాగా, మరొకరు ఒడిశాకు చెందిన రంజన్ సమాల్ లుగా గుర్తించామని, వీరిని చెర నుంచి విడిపించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. గత జులై 31న ఇదే సిర్తే పట్టణంలో నలుగురు భారతీయులను ఐసిస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. వారిలో కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్ కుమార్ లు క్షేమంగా తిరిగిరాగా, తెలుగువారైన ప్రొఫెసర్లు గోపీకృష్ణ, బలరామ్ లు ఇంకా బందీలుగానే ఉన్నారు. వారిని విడిపించేందుకు విదేశాంగ శాఖ చేసిన ప్రయత్నాలు చేస్తున్నది. -
ఉగ్రవాదుల చెరలోనే తెలుగు ప్రొఫెసర్లు
-
మీ వాళ్లు క్షేమమే.. త్వరలోనే విడుదలవుతారు
‘లిబియా’ బందీల కుటుంబాలతో ప్రధాని మోదీ, సుష్మాస్వరాజ్ * ఉత్తరప్రత్యుత్తరాల్లో ఆలస్యం వల్లే సందిగ్ధం సాక్షి, హైదరాబాద్: ‘మీ వాళ్లు పూర్తి క్షేమంగా ఉన్నట్లు సమాచారం ఉంది. వారి విడుదలకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. త్వరలో మీకు శుభవార్త అందుతుంది’ అని లిబియాలో కిడ్నాప్‌నకు గురైన ప్రొఫెసర్లు గోపీకృష్ణ, బలరాం కిషన్ కుటుంభసభ్యులకు ప్రధాని నరేంద్ర మోదీ, మంత్రులు సుష్మాస్వరాజ్, వెంకయ్యనాయుడు భరోసానిచ్చారు. మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో గోపీకృష్ణ భార్య కల్యాణి, బలరాం భార్య శ్రీదేవీ, బంధువులు మురళీకృష్ణ, రంగాచారి ప్రధానితో పాటు కేంద్రమంత్రులను కలిశారు. తమవారిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. బందీల విడుదలకు విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ప్రధాని వారితో పేర్కొన్నారు. అనంతరం బందీల కుటుంబసభ్యులతో సుష్మాస్వరాజ్ దాదాపు 20 నిమిషాల పాటు గడిపారు. బందీలు కిడ్నాప్‌నకు గురైన ప్రాంతం నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ఉత్తరప్రత్యుత్తరాలకు ఆలస్యం అవుతోందని, వారు క్షేమంగానే ఉన్నట్లు తమ వద్ద సమాచారం ఉందని ఆమె తెలిపారు. తమ వారిని విడిపించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను తమకు వివరించారని మోదీ, సుష్మా స్వరాజ్‌ను కలిసిన అనంతరం కుటుంబసభ్యులు తెలిపారు. సోమవారం రాత్రి వారు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. -
లిబియాలో బందీల విడుదలపై అయోమయం
హైదరాబాద్: లిబియాలో బందీల విడుదలపై అయోమయం వీడలేదు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్లు తిరువీధుల గోపీకృష్ణ, చిలువేరు బలరాం కిషన్‌లు జూలై 29న ట్రిపోలి మీదుగా స్వస్థలానికి తిరిగి వస్తున్న సమయంలో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు అపహరించిన విషయం తెలిసిందే. ఇద్దరు ప్రొఫెసర్లను శుక్రవారం రాత్రి ఏడు గంటలకు విడిచిపెడతారని విదేశాంగశాఖ ప్రకటించటంతో ఇరుకుటుంబాల సభ్యులు ఆశగా ఎదురుచూశారు. శనివారం రాత్రి వరకూ విడుదలకు సంబంధించి పురోగతి లేకపోవటంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. శనివారం మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి ఇరు కుటంబాల సభ్యులను పరామర్శించిన సందర్భంలోనూ గోపీకృష్ణ భార్య కల్యాణి, బలరాం కిషన్ భార్య శ్రీదేవి కన్నీళ్ల పర్యంతమయ్యారు. తమ భర్తల విడుదలపై ఎవరూ కిమ్మనటం లేదంటూ ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. రేపు ఢిల్లీ వెళ్లనున్న బందీల కుటుంబాలు కాగా సోమవారం ఉదయం ఎంపీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఇరు కుటుంబాల సభ్యులు ఢిల్లీ బయలుదేరి వెళ్లి ప్రధాని మోదీ, మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలవనున్నారు.ఈ మేరకు వారి అపాయింట్మెంట్ను కోరారు. ప్రొఫెసర్ల కుటుంబాలను ఓదార్చిన బాబు కిడ్నాప్‌కు గురైన తెలుగు ప్రొఫెసర్ల కుటుంబసభ్యులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఓదార్చారు. మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి ప్రొఫెసర్ల కుటుంబసభ్యులను సీఎం క్యాంప్ కార్యాలయానికి తీసుకొచ్చారు. కిడ్నాప్‌కు గురై చాలా రోజులు గడిచినా ఇంకా విడుదల కాకపోవటంపై వారు ఆందోళన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం మాట్లాడుతూ ప్రొఫెసర్ల విడుదలకు ప్రభుత్వం తమ వంతు ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోదీ, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు వీరిద్దరి కిడ్నాప్‌పై ఎప్పటికపుడు సమాచారం తెలుసుకుంటున్నారని, ఇద్దరూ తిరిగి వస్తారని వారికి ధైర్యం చెప్పారు. -
ఇంకా విడుదలకాని ప్రొఫెసర్లు
-
ఆ జడ్జిని చంపేశారు
త్రిపోలి: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఓ న్యాయమూర్తిని చంపేశారు. గతవారం బందీలోకి తీసుకున్న వారు చివరకు ఆయన్ను విగత జీవుడ్ని చేశారు. ఈ విషయం ఇస్లామిక్ స్టేట్ సంస్థే స్పష్టం చేసింది. మహ్మద్ అల్ నమ్లి అనే న్యాయవాది లిబియాలో అల్ కోమ్స్ అపీల్ కోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సిర్టి అనే నగరంలో అతడ్ని కొందరు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సాయుధులుగా వచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ప్రభుత్వం తరుపున ప్రయత్నాలు చేసినా ఉగ్రవాదులు విడిచిపెట్టలేదు. చివరికి చిత్రహింసలు చేసి, నిప్పుపెట్టి కాల్చిన అతడి మృతదేహం అల్ హరవా అనే పట్టణంలో లభించింది. దీంతో లిబియన్ జ్యుడిషియల్ ఆర్గనైజేషన్ కూడా ఆయన మృతి విషయాన్ని ధృవీకరించింది. ఉగ్రవాద నేరాలకు పాల్పడిన కొందరు వ్యక్తులకు కఠిన శిక్షలు విధించారనే అక్కసుతోనే ఆయనను హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం. -
ప్రొఫెసర్ల విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
-
ప్రొఫెసర్ల విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
న్యూఢిల్లీ: లిబియాలో కిడ్నాపైన తెలుగు ప్రొఫెసర్లు తిరువీధుల గోపీకృష్ణ, చిలువేరు బలరాం కిషన్ విడుదలపై స్పష్టత కొరవడింది. వీరిద్దరినీ ఉగ్రవాదులు విడిచిపెట్టారని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు ప్రకటించారు. వీరిద్దరూ లిబియాలోని భారత రాయబార కార్యాలయానికి చేరుకున్నారని చెప్పారు. అయితే బలరాం, గోపీకృష్ణలను వదిలేశారన్న సమచారం తమకు లేదని లిబియాలోని భారత రాయబారి ఎస్ డి శర్మ తెలిపారు. వీరిద్దరూ ఇంకా సురక్షిత ప్రాంతానికి రాలేదని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ చెప్పారు. ప్రభుత్వ ప్రతినిధుల గందరగోళ ప్రకటనలతో బలరాం, గోపీకృష్ణ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. -
తెలుగు ప్రొఫెసర్ల కిడ్నాప్ సుఖాంతం
-
'తెలుగు ప్రొఫెసర్ల కిడ్నాప్ సుఖాంతం'
న్యూఢిల్లీ: లిబియాలో కిడ్నాపైన తెలుగు ప్రొఫెసర్లు తిరువీధుల గోపీకృష్ణ, చిలువేరు బలరాం కిషన్ సురక్షితంగా బయటపడ్డారని ఢిల్లీలోని ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు తెలిపారు. వీరిని లిబియాలోని భారత దౌత్య కార్యాలయానికి తరలించారని వెల్లడించారు. ఈ విషయాన్ని ఎంబసీ అధికారులు ధ్రువీకరిస్తారని చెప్పారు. గురువారం సాయంత్రానికి వీరిని ఇండియాకు తీసుకొస్తామన్నారు. గోపీకృష్ణ, బలరాం విడుదలయ్యారన్న సమాచారంతో వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. గోపీకృష్ణ, బలరాంతో పాటు కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్ కుమార్ లను లిబియాలో ఐఎస్ఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. లక్ష్మీకాంత్, విజయ్ కుమార్ లను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. వీరు నలుగురు యూనివర్సిటీ ఆఫ్ సిర్త్ లో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. లక్ష్మీకాంత్ మంగళవారం హైదరాబాద్ చేరుకుని తర్వాత కర్ణాటక వెళ్లారు. -
బందీలుక్షేమమే.. త్వరలోనే విముక్తి
ఉగ్రవాదుల చెర నుంచి బయటపడిన కర్ణాటక ప్రొ. లక్ష్మీకాంతం వెల్లడి తెలుగు ప్రొఫెసర్ల కుటుంబాలను పరామర్శించిన ప్రొఫెసర్ హైదరాబాద్: లిబియా దేశంలో వారం రోజులుగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చెరలో బందీలుగా ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్లు తిరువీధుల గోపీకృష్ణ, చిలువేరు బల రాం కిషన్ క్షేమంగానే ఉన్నారని, వారిద్దరూ త్వరలోనే విడుదల అవుతారని ఉగ్రవాదుల చెర నుంచి బయటపడిన కర్ణాటకకు చెందిన ప్రొఫెసర్ లక్ష్మీకాంతం చెప్పారు. గోపీకృష్ణ, బలరాం కిషన్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆయన మంగళవారం హైదరాబాద్ వచ్చారు. దౌత్య అధికారులతో కలసి ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్న లక్ష్మీకాంతం ఓల్డ్ అల్వాల్‌లోని బలరాం కిషన్ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా జూలై 29న రెండు కార్లలో బయల్దేరిన తమ బృందాలను ఉగ్రవాదులు అపహరించిన తీరు, ఆ తర్వాత పరిణామాలను వివరించారు. ఉగ్రవాదులు తమను మర్యాదపూర్వకంగా చూసుకున్నారని, వారి అధీనంలో ఉన్న గోపీకృష్ణ, బలరాంకిషన్‌లకు ఎలాంటి ఇబ్బందీ లేదని, త్వరలో వారు క్షేమంగా ఇళ్లకు చేరుకుంటారని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. బందీల విడుదలకు భారత విదేశాంగ శాఖ అధికారులతో పాటు లిబియాలోని విద్యార్థి బృందాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయని లక్ష్మీకాంతం చెప్పారు. ఇబ్బంది పెట్టొద్దు.. ప్రస్తుతం లిబియాలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, బందీలు విడుదలయ్యేంత వరకూ మీడియా కూడా తమకు సహకరించాలని ప్రొఫెసర్ లక్ష్మీకాంతం విజ్ఞప్తి చేశారు. అంతా మంచే జరుగుతుందని తాము భావిస్తున్నామని, అంతకు మించి ఏమీ మాట్లాడలేమని, మీడియా కూడా సహకరించాలని కోరారు. ఇదిలాఉండగా ఉగ్రవాదుల చెర నుండి విడుదలైన కర్ణాటక ప్రొఫెసర్లు లక్ష్మీకాంతం, విజయ్‌కుమార్ మంగళవారం అరబ్ న్యూస్ చానళ్లతో మాట్లాడుతూ తమను ఉగ్రవాదులు ఏ ఇబ్బంది పెట్టలేదని, మిగిలిన ఇద్దరు బందీలను సహృదయంతో విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. -
హైదరాబాద్ చేరుకున్న లక్ష్మీకాంత్
-
హైదరాబాద్ చేరుకున్న లక్ష్మీకాంత్
హైదరాబాద్: లిబియా ఉగ్రవాదుల చెర నుంచి విడుదలైన కర్ణాటక వాసి డాక్టర్ లక్ష్మీకాంత్ క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు చేరుకున్న లక్ష్మీకాంత్‌ను అతని భార్య, కుటుంబసభ్యులు రిసీవ్ చేసుకున్నారు. తన భర్తను ఉగ్రవాదులు వదిలేయడం చాలా సంతోషంగా ఉందని లక్ష్మీకాంత్ భార్య డాక్టర్ ప్రతిమ అన్నారు. తన భర్తను విడిపించేందుకు గట్టిగా ప్రయత్నించినందుకు ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ, ఏపీకి చెందిన బలరాం, గోపీకృష్ణ ఇంకా కిడ్నాపర్ల చెరలోనే ఉన్నారు. -
ఇంకా చెరలోనే ప్రొఫెసర్లు
రెండు రోజులైనా తెలియని ఆచూకీ సాక్షి, హైదరాబాద్: లిబియాలో కిడ్నాప్‌నకు గురైన తెలంగాణ, ఏపీకి చెందిన బలరాం, గోపీకృష్ణ ఆచూకీ ఇంకా లభించలేదు. వీరితో పాటు కిడ్నాప్ అయిన కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్‌కుమార్‌ను శుక్రవారమే విడుదల చేశారు. అయితే బలరాం, గోపీకృష్ణ ఇప్పటికీ విడుదల కాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు వారి పరిస్థితిపై కుటుంబసభ్యులకు సమాచారం అందజేస్తున్నారు. వారు క్షేమంగానే ఉన్నారని, వీలైనంత త్వరగా విముక్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కుటుంబసభ్యులకు విదేశాంగ శాఖ అధికారులు ధైర్యం చెప్పారు. కాగా, శనివారం నాచారంలోని గోపీకృష్ణ, అల్వాల్ సాయినగర్‌లోని కుటుంబసభ్యులు మీడియా సభ్యులను కలిసేందుకు ఇష్టపడలేదు. విడుదలకు కృషి చేస్తున్నాం: వెంకయ్య నాచారంలోని గోపీకృష్ణ కుటుంబసభ్యులను ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో వారిని ఫోన్లో మాట్లాడించారు. దౌత్యపరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నామని, వారు క్షేమంగానే తిరిగొస్తారన్న నమ్మకముందని భరోసా ఇచ్చారు. కిడ్నాపర్ల చెర నుంచి విడుదలైన కేరళకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్‌కుమార్‌లు లిబియాలోని భారత దౌత్య కార్యాలయానికి క్షేమంగా చేరుకున్నారని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు.ప్రభుత్వం నుంచి సమాచారం లేదు. బలరాంకు సంబంధించిన వివరాలు ప్రభుత్వం కాని, లిబియాలోని సిర్త్‌యూనివర్సిటీ నుంచి కానీ ఎలాంటి సమాచారం రావడం లేదని బలరాం కుటుంబసభ్యులు తెలిపారు. మీడియాలో వస్తున్న వార్తల ద్వారానే తమకు సమాచారం తెలుస్తోందని వాపోయారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మల్కాజిగిరి తహసీల్దార్ శ్రీనివాస్, స్థానిక పోలీసులు బలరాం నివాసానికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. వారినీ కాపాడండి: సుష్మాకు దత్తన్న ఫోన్ సాక్షి, హైదరాబాద్: ఉగ్రసంస్థ ఐఎస్ఐఎస్ చెరలో బందీలుగా ఉన్న తెలుగువారిని కాపాడాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను కోరారు. ఇప్పటికే ఇద్దరిని కాపాడిన తీరు అభినందనీయమని, మిగిలిన ఇద్దరినీ కాపాడాలని దత్తాత్రేయ శనివారం ఫోన్లో విజ్ఞప్తి చేశారు. సుష్మ సానుకూలంగా స్పందించారని, బందీలుగా ఉన్నవారు క్షేమంగా విడుదల అవుతారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. బలరాం, గోపీకృష్ణ విడుదలయ్యేలా చూడండి * కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ లిబియాలో కిడ్నాప్‌నకు గురైన రాష్ట్రానికి చెందిన బలరాం విడుదల విషయంలో చొరవ చూపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖను కోరింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శికి లేఖరాశారు. లిబియా కిడ్నాప్ ఉదంతంపై సీఎం కేసీఆర్, ఆయన కార్యాలయం ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తోంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు సైతం విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా లిబియా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. కిడ్నాప్‌నకు గురైన బలరాంతో పాటు ఏపీకి చెందిన గోపీకృష్ణ సైతం క్షేమంగా విడుదలయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. వారు క్షేమంగా తిరిగి రావాలని సీఎం ఆకాంక్షించారు. -
ఇంకా కిడ్నాపర్ల చెరలోనే ఆ ఇద్దరు
హైదరాబాద్: లిబియాలో కిడ్నాప్‌కు గురైన భారతీయుల్లో ఇద్దరి జాడ ఇంకా తెలియరాలేదు. లిబియాలోని సిర్తేలో గత బుధవారం నలుగురు భారతీయులను బందీలుగా తీసుకెళ్లిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు.. శుక్రవారం రాత్రి ఇద్దరిని విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ ఉగ్ర చెరలోఉన్న తెలుగు పౌరులు గోపీకృష్ణ, బలరామ్ కిషన్‌లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఎప్పుడు విడుదలవుతారు? అనే విషయాలపై ఉత్కంఠ కొనసాగుతున్నది. కిడ్నాపర్ల చెరనుంచి ఇద్దరి విడుదల సందర్భంగా విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనలో మిగిలిన ఇద్దరిని కూడా విడిపించేందుకు కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ ఆ దిశగా ఎలాంటి ప్రయాత్నాలు సాగాయి? ఫలితమేమిటి? అనే విషయాలపై స్పష్టత రాలేదు. దీంతో హైదరాబాద్ లోని చిలువేరు బలరామ్ కిషన్ నివాసంతోపాటు తిరువీధుల గోపీకృష్ణ కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది. కిడ్నాపైన నలుగురూ బుధవారం ట్రిపోలి మీదుగా భారత్‌కు వస్తుండగా వర్సిటీకి 50 కి.మీ. దూరంలోని ఓ చెక్‌పాయింట్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఇస్లామిక్ రాజ్యస్థాపన కోసం ఇరాక్, సిరియాలలో నెత్తుటేర్లు పారిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్‌కుమార్ శుక్రవారం విడుదలయ్యారని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. మిగతా ఇద్దరినీ విడిపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా కిడ్నాప్ ఉదంతంపై కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటనలను కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. 'ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో ఇండియా వ్యాపారం చేస్తోందా? ఇద్దరిమధ్యా ఎప్పుడంటే అప్పుడు ఏదంటే అది చర్చించుకునేందత దగ్గరితనం ఉందా?' అంటూ సుష్మా స్వరాజ్ చేసిన ట్వీట్ ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. బందీలను విడిపించడం సుష్మా స్వరాజ్ చేతిలో వ్యవహారమైతే గతంలో కిడ్నాప్ కు గురై ఇప్పటికీ ఆచూకీ లేకుండా పోయిన 39 మంది పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. -
ఆనందంలో మునిగి పోయిన కుటుంబ సభ్యులు
-
ఎంత కష్టం... ఎంతకష్టం...
లిబియాలో టెక్కలి వాసి కిడ్నాప్ ఇద్దరిని వదిలినా... ఈయనకు దక్కని విముక్తి ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు ఫోన్లో వివరాలు తెలుసుకున్న ఎంపీ, కలెక్టర్ బతుకు తెరువుకు... పొట్టపోషణకు... పరాయి దేశానికి వెళ్లిన ఆ యువకునికి ఎంతకష్టం ఎంతకష్టం... కన్నకొడుకు కసాయిచేతిలో చిక్కుకున్నాడని తెలుసుకున్న ఆ తల్లిదండ్రుల్లో ఎంత కలవరం. టెక్కలికి చెందిన గోపీకృష్ణ అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇప్పుడు ముష్కరుల చేతుల్లో బందీ అయ్యారు. ఆయన్ను విడిపించాలని వారి కుటుంబ సభ్యులు సర్కారును వేడుకుంటున్నారు. టెక్కలి : లిబియా దేశంలో టెక్కలికి చెందిన యువకుడ్ని ముష్కరులు కిడ్నాప్ చేశారని తెలుసుకున్న పట్టణవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రెండు రోజుల క్రితం లిబియా దేశంలో ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన నలుగురు వ్యక్తుల్లో టెక్కలి గొల్లవీధికిచెందిన తిరువీధుల గోపీకృష్ణ అనే వ్యక్తి ఉన్నట్టు శుక్రవారం ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న ఆయన తల్లిదండ్రులు, స్నేహితులతోపాటు, పట్టణవాసులు సైతం కలవరపడ్డారు. ప్రభుత్వం తక్షణమే చొరవ చూపించి గోపీకృష్ణతో పాటు మిగిలిన వారిని విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని బాధిత తల్లిదండ్రులతో పాటు స్థానికులు కోరుతున్నారు. ఏడేళ్లుగా లిబియాలో ఉద్యోగం గొల్లవీధికి చెందిన విశ్రాంత కో-ఆపరేటివ్ ఉద్యోగి తిరువీధుల వల్లభనారాయణరావు, సరస్వతిల రెండో కుమారుడు గోపీకృష్ణ సుమారు 7 సంవత్సరాలుగా లిబియాలోని స్రిట్ యూనివర్శిటీలో కంప్యూటర్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈయన భార్య కల్యాణితో పాటు ఇద్దరు పిల్లలు జాహ్నవి, సాయిశ్వర్ , సోదరుడు మురళీకృష్ణ ఆయన కుటుంబ సభ్యులంతా హైదరాబాద్ నాచారం ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులు, అమ్మమ్మ టెక్కలిలో ఉంటున్నారు. ప్రతీ ఏడాది జూలై చివరి వారంలో లిబియాలో సెలవులు ప్రకటిస్తారు. ఆ సమయంలో గోపీకృష్ణ హైదరాబాదు వస్తూంటారు. ఈ ఏడాదికూడా వచ్చాక తల్లిదండ్రులను కలిసేందుకు టెక్కలివస్తానంటూ సమాచారం అందించారు. రంజాన్ పురస్కరించుకుని లిబియాలో సెలవులు ప్రకటించడంతో బుధవారం లిబియా నుంచి హైదరాబాద్ రావడానికి ఎయిర్‌పోర్ట్‌కు కారులో వెళ్తుండగా ఉగ్రవాదులు కారును అడ్డగించి డ్రైవర్‌ను పక్కకు నెట్టేసి గోపీకృష్ణతో పాటు కర్ణాటకకు చెందిన ఇద్దరిని, హైదరాబాదుకు చెందిన ఒకరిని కిడ్నాప్ చేసినట్లు అతని తల్లిదండ్రులు తెలిపారు. కిడ్నాప్ సమాచారం తమ పెద్దకుమారుడు మురళీకృష్ణకు తెలియడంతో ఆయన తమకు ఫోన్ చేసి విషయం చెప్పాడని పేర్కొన్నారు. దేశం కాని దేశంలో తమ కుమారుడు కిడ్నాప్‌కు గురైన సంగతి తెలియగానే ఆయన తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనతో ఆందోళన చెందారు. సాయంత్రానికి కిడ్నాప్ అయినవారిలో ఇద్దరిని విడిచిపెట్టినా.. తమ కుమారుడిని విడుదల చేయకపోవడంతో వారు మరింత ఖిన్నులవుతున్నారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ ఎమ్.వెంకటేశ్వరరావు, తహశీల్దార్ ఆర్.అప్పలరాజు టెక్కలిలోని వల్లభనారాయణరావు నివాసానికి వెళ్లి వారిని ఓదార్చి గోపీకృష్ణకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. కిడ్నాప్ విషయంలో కేంద్రప్రభుత్వం స్పందించినట్లు తమకు సమాచారం అందిందని ఎటువంటి ఆందోళన చెందవద్దని వారు తెలియజేసారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గోపికృష్ణ విడుదలకు చర్యలు చేపట్టాలని ఆయన స్నేహితులు విన్నవిస్తున్నారు. ఫోన్లో వివరాలు తెలుసుకున్న ఎంపీ, కలెక్టర్ ఎంపీ కె.రామ్మోహన్నాయుడు బాధిత తల్లిదండ్రులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఉగ్రవాదుల చెరలో ఉన్న గోపీకృష్ణ విడుదలయ్యేలా చర్యలు చేపడతానంటూ ఆయన వారికి హామీ ఇచ్చారు. అలాగే జిల్లా కలెక్టర్ లక్ష్మీనరసింహం బాధిత తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడారు. ఎస్పీ ఏఎస్.ఖాన్ కూడా ఫోన్లో వివరాలు తెలుసుకున్నారు. రోజూ భయాందోళనే: లిబియా దేశంలో గఢాఫీ సంఘటనతో రోజూ భయాందోళనతో జీవించాల్సి వచ్చేదని లిబియాలో కొంతకాలంపాటు నివసించి తిరిగి టెక్కలి వచ్చేసిన లండ మోహనరావు తెలిపారు. లిబియాలోని పుంజులేటి కంపెనీలో పైప్ లైనింగ్ పనుల కోసం 2011 సంవత్సరంలో ఆ దేశానికి వెళ్లాననీ, అక్కడ గోపీకృష్ణ పరిచయం అయ్యారని తెలిపారు. గోపికృష్ణ ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు తలపెట్టని మంచి వ్యక్తని చెప్పారు. లిబియాలో దాడులు జరుగుతున్న నేపధ్యంలో 2012 సంవత్సరంలో అక్కడి తాను నుంచి వచ్చేశానన్నారు. గోపీకృష్ణను కూడా వచ్చేయమని పలుమార్లు సూచించాననీ తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఉగ్రవాదుల చెరలో ఉన్న వ్యక్తుల్ని విడుదల చేయించాలని కోరారు. -
ఏం జరుగుతుందో... భయం భయం
నగర వాసుల కిడ్నాప్‌తో మళ్లీ తెరపైకి ఐఎస్ఐఎస్ సిటీబ్యూరో: ఉగ్రవాద చర్యలతో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) పేరు మరోసారి నగరంలో చర్చనీయాంశమైంది. ఆ ఉగ్రవాద సంస్థకు పట్టున్న లిబియాలోని సిర్టియో ప్రాంతంలో హైదరాబాద్‌కు చెందిన చిలువేరు బలరామ్ కిషన్, గోపీ కృష్ణతో పాటు మరో ఇద్దరు కిడ్నాప్‌నకు గురవడంతో ఇది ఐఎస్ఐఎస్ పనేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిడ్నాపర్ల చెర నుంచి వారు క్షేమంగా విడుదలయ్యారన్న సమాచారం లేకపోవడంతో... నగరవాసులు ఆందోళనకు గురయ్యారు. ఇదిలా ఉండగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు సామాజిక మాధ్యమాల్లో చాటింగ్‌తో సిటీ యువతను ఆకర్షిస్తున్నారు. జీహాద్ (పవిత్ర యుద్ధం) పేరిట తమ సంస్థల్లో సభ్యులుగా చేర్చుకునేందుకు పన్నిన పన్నాగాలను పోలీసులు ఎప్పటికప్పుడు చిత్తు చేస్తూనే ఉన్నారు. అయినా వారి ప్రయత్నాలు విరమించుకోవడం లేదు. తాజాగా కిడ్నాప్ ఉదంతంతో నగరవాసులు ఉలిక్కిపడ్డారు. సిటీ యువతపై కన్ను... ఐఎస్ఐఎస్ వైపు మొగ్గు చూపుతున్న వారిలో ఇంజినీరింగ్, మెడిసిన్ అభ్యసించే విద్యార్థులతో పాటు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు సైతం ఉంటున్నారు. ఫేస్బుక్ ద్వారా ముందు చాటింగ్‌లోకి దింపుతారు. యువకుల మనోభావాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, నెమ్మదిగా వారిని రెచ్చగొడుతూ ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యేలా చేస్తున్నారు. హుమయూన్‌నగర్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ఒకరు గత ఏడాది ‘పవిత్ర యుద్ధం కోసం ఇరాక్ వెళ్తున్నాను. నా కోసం వెతకొద్దు. అదృష్టం ఉంటే స్వర్గంలో కలుసుకుంటా’నని తన తండ్రికి లేఖ రాసి వెళ్లిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో బంగ్లాదేశ్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఆ యువకుడిని కొద్ది రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు కరీంనగర్‌కు చెందిన మరో ఇంజినీరింగ్ విద్యార్థి, చాంద్రాయణ గుట్టకు చెందిన ఇంజినీరింగ్, మెడికల్ విద్యార్థులు కూడా ఉన్నారు. ఇలా ఆరునెలల కాలంలోనే ఐఎస్ఐఎస్లో చేరాలనుకున్న వారి సంఖ్య 84 వరకు ఉన్నట్లు సమాచారం. వీరిని నగర పోలీసులు విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. వెంటనే వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ చేశారు. వీరిలో కొందరిని ముందుజాగ్రత్త చర్యగా మెజిస్ట్రేట్ ముందు బైండోవర్ చేశారు. ఇటువంటి ఘటనలపై ఇప్పటికే సిటీ పోలీసులు నిఘా వేసి ఉంచారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా పిలిపించి కౌన్సెలింగ్ చేస్తున్నారు. -
లిబియాలో కిడ్నాపైన భారతీయులు క్షేమం
హైదరాబాద్: లిబియా ముఖ్యపట్టణం సిర్తేలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన నలుగురు తెలుగువారు క్షేమంగా ఉన్నారు. బందీలు నలుగురిని ఉగ్రవాదులు ఈరోజు సాయంత్రం విడుదల చేశారు. విడుదలైన లక్ష్మీకాంత్, విజయ్ కుమార్ లలో ఒకరు రాయ్‌చూర్ కు చెందినవారుకాగా, మరొకరు బెంగళూరుకు చెందిన వ్యక్తి. వీరిద్దరూ విడుదలైనట్టు విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. కాగా, తాము కూడా కిడ్నాపర్ల చెర నుంచి విడుదలైయ్యామని, క్షేమంగా ఉన్నామని ఏపీ, హైదరాబాద్ లకు చెందిన గోపీకృష్ణ, బలరామ్ తమ కుటుంబ సభ్యులకు మెసేజ్ పెట్టారు. అయితే వీరిద్దరూ విడుదలైనట్టు విదేశాంగ శాఖ ఇంకా ధ్రువీకరించలేదు. వీరిని కిడ్నాప్ చేసింది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కాదని, స్థానిక ముఠా అని వార్తలు వస్తున్నాయి. కిడ్నాపైన వారిలో వీరిలో ముగ్గురు సిర్తేలోని యూనివర్సిటీలో లెక్చరర్లుగా పనిచేస్తుండగా, మరో వ్యక్తి వేరే వృత్తిలో ఉన్నాడు. కిడ్నాప్ ఉదంతంపై స్పందించిన విదేశీ వ్యవహారాల శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. నలుగురు భారతీయులు కిడ్నాప్ కు గురైనట్లు జులై 29నే తెలిసిందని, అప్పటినుంచి వారి విడుదల కోసం అవిశ్రాంతంగా కృషి చేశామని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. బందీల విడుదలపై విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. -
లిబియాలో నలుగురు భారతీయుల కిడ్నాప్
-
నా భర్తను విడిపించండి: కల్యాణి
హైదరాబాద్ : లిబియాలో కిడ్నాప్‌కు గురైన తన భర్తను క్షేమంగా విడిపించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని గోపీకృష్ణ భార్య కల్యాణి కోరారు. గత ఏడేళ్లుగా తన భర్త లిబియాలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారని ఆమె తెలిపారు. కిడ్నాప్ విషయం తనకు నిన్న తెలిసిందని, తన భర్తతో పాటు మరో ముగ్గురు విధులకు వెళ్తుండగా కారు ఆపి డ్రైవర్‌ను దించేసి అపహరించి తీసుకు వెళ్లారన్నారు. బుధవారం సాయంత్రం తన భర్తతో చివరిసారిగా మాట్లాడినట్లు చెప్పారు. గోపికృష్ణ కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్‌లోని నాచారంలో నివాసం ఉంటోంది. బలరాం శ్రీకాకుళం జిల్లా వాసి. కాగా గోపీకృష్ణ కిడ్నాప్ అయ్యాడా, మరొకటా అనేది తమకు ఇంకా స్పష్టత రాలేదని ఆయన సోదరుడు మురళీ అన్నారు. తాము లిబియా ఎంబసీతో మాట్లాడామని, అయితే ఐఎస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేశారా, లేదా అనేది తమకు తెలియాల్సి ఉందన్నారు. లిబియా రాజధాని ట్రిపోలిలో నలుగురు భారతీయులు కిడ్నాప్‌కు గురైన విషయం విదితమే. కాగా, ఇందులో ఇద్దరు కర్ణాటక వారు, ఒకరు తెలంగాణ, మరొకరు ఆంధ్రప్రదేశ్ వాసి అని సమాచారం. -
లిబియాలో నలుగురు భారతీయుల కిడ్నాప్
న్యూఢిల్లీ : లిబియాలో నలుగురు భారతీయులు కిడ్నాప్‌కు గురయ్యారు. ట్రిపోలీ సమీపంలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న వీరంతా బుధవారం సాయంత్రం అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. కాగా కిడ్నాప్‌కు గురైన వారిలో ఇద్దరు తెలుగువారు కాగా, మరో ఇద్దరు కర్ణాటకకు చెందినవారు. తెలుగువారిలో హైదరాబాద్ కు చెందిన గోపీకృష్ణ, బలరామ్ గా గుర్తించారు. అయితే కిడ్నాపర్ల నుంచి ఎలాంటి డిమాండ్లు రాలేదని ఎంబసీ అధికారులు పేర్కొన్నారు. కాగా ఐఎస్ఐఎస్ తీవ్రవాదులే ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కాగా తమవారు కిడ్నాప్ అయిన వార్త తెలుసుకున్న బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. తమవారిని క్షేమంగా విడిపించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కారు బాంబు పేలి... ఐదుగురు మృతి
ట్రిపోలి: పశ్చిమ లిబియాలోని డెరనా నగరంలో కారు బాంబు పేలి... ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని స్థానిక మీడియా శనివారం వెల్లడించింది. క్షతగాత్రుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారని పేర్కొంది. ఈ పేలుడు ఆత్మాహుతి దాడిగా భావిస్తున్నట్లు ఉన్నతాధికారులు భావిస్తున్నారని చెప్పింది. స్థానిక మిలటరీ దళం సభ్యులకు... ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులకు మధ్య పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ దాడి జరిగిందని ఉన్నతాధికారులు పేర్కొన్నారని వెల్లడించింది. -
స్పానిష్ రాయబార కార్యాలయం వద్ద బాంబు పేలుడు
ట్రిపోలీ: లిబియా రాజధాని ట్రిపోలీలోని స్పానిష్ రాయబార కార్యాలయం వద్ద మంగళవారం శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు... కానీ కార్యాలయంలోని సామాగ్రి ధ్వంసమైందని భద్రతాధికారులు వెల్లడించారు. రాయబార కార్యాలయాన్ని నెల క్రితమే ఖాళీ చేశామని తెలిపారు. గత వారం ట్రిపోలీలోని మొరాకో రాయబార కార్యాలయం వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో రాయబార కార్యాలయం గోడ ధ్వంసమైంది. అలాగే ఈ బాంబు పేలుడుకు కొన్ని గంటల ముందు ట్రిపోలిలోని దక్షిణ కొరియా రాయబార కార్యాలయంపై తీవ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు భద్రత సిబ్బంది మాతి చెందగా... ఒకరు తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. -
బోటు మునక: 700 మంది గల్లంతు
పట్టెడన్నం కోసం పక్కదేశానికి వలస వెళ్లాలనుకున్న వెతజీవులు సముద్రంలో గల్లంతయ్యారు. ఒకరుకాదు ఇద్దరు కాదు దాదాపు 700 మంది నీటమునిగారు. వలసల చరిత్రలో అత్యంత విషాదంగా భావిస్తోన్న ఈ ఘటన మద్యదరా సముద్రంలో ఆదివారం జరిగింది. గడాఫీ మరణం తర్వాత కల్లోలితంగా మారిన లిబియా నుంచి చేపలు పట్టే బోట్ల ద్వారా ఇటలీకి బయలుదేరిన 700 మంది కూలీలు మధ్యదరా సముద్రంలో నీట మునిగారని ఇటలీ నౌకాదళం భావిస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న నౌకా దళం.. 28 మందిని కాపాడగలిగింది. మిగిలిన వారు ప్రాణాలతో బయటపడగలిగే అవకాశాలు తక్కువేనని మెరైన్ అధికారులు చెబుతున్నారు. ' లిబియా తీరం నుంచి ఇటలీలో భాగంగా ఉన్న లంపేడుసా ద్వీపానికి బయలుదేరిన శరణార్థులు.. చేపలు పట్టే బోటులో పరిమితికి మించి ప్రయాణించారు. ఓ వ్యాపారనౌక వీరు ప్రయాణిస్తోన్న బోటుకు దగ్గరగా రావడంతో ప్రమాదం సంభవించింది. దీంతో బోటు తలకిందులై 700 మంది గల్లంతయ్యారు' అని ఐక్యరాజ్యసమితి సహాయ పునరావాస సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు. ప్రమాద స్థలం నుంచి 28 మందిని కాపాడగలిగామని, మిగతావారి కోసం గాలింపుచర్యలు చేపట్టామని, అయితే దాదాపు వారు చనిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తోన్న ఇటాలియన్ కోస్ట గార్డ్ ఆఫీసర్ వివరించారు. ఆఫ్రికా, పశ్చిమాసియా నుంచి యూరప్ కు వలసవెళుతూ ఇలా మధ్యధరా సముద్రంలో మరణించిన శరణార్థుల సంఖ్య ఇప్పటికే 1500 కు చేరుకోవడం శోచనీయం. గత ఫిబ్రవరిలో రబ్బరు బోట్లు ప్రమాదానికి గురికావడంతో ఇటలీవైపు వెళుతోన్న 300 మంది వలసదారులు జలసమాధి అయ్యారు. గతేడాది సెప్టెంబర్ లో ఇదేవిధంగా 500 మంది నీటమునిగారు. -
ఆత్మాహుతి దాడి.. ఏడుగురు మృతి
బెంగాజీ: లిబియాలో ఆత్మాహుతి దాడి జరిగి ఏడుగురు సైనికులు మృతి చెందారు. మరో పన్నెండు మంది గాయాలపాలయ్యారు. సైనిక స్థావరాలే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. లిబియాలోని బెంఘాజీ విమానాశ్రయానికి వెళ్లే రోడ్డు మార్గంలో ఓ సైనికుల తనిఖీ కేంద్రం ఉందని, దానిని లక్ష్యంగా చేసుకొని వారు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది దాడికి పాల్పడ్డాడని ఆర్మీ అధికారులు తెలియజేశారు. దాడికోసం ఐఎస్ తీవ్రవాది ఆయుధాలతో నింపిన కారును ఉపయోగించడంతోపాటు తనను తాను పేల్చుకోవడం వల్ల భారీ పేలుడు చోటుచేసుకొని ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందన్నారు. దాడికి ముందే ఐఎస్ ఉగ్రవాదులు లిబియాలో సైనికులే లక్ష్యంగా దాడులకు పాల్పడతాం అంటూ ట్విట్టర్లో ప్రకటించారు. -
లిబియాలో '26/11' తరహా దాడి
-
లిబియాలో '26/11' తరహా దాడి
ట్రిపోలి: లిబియా రాజధాని ట్రిపోలీలో ఉగ్రవాదులు 26/11 తరహా దాడికి పాల్పడ్డారు. విదేశీయులు ఎక్కువగా విడిది చేసే కొరింతియా లగ్జరీ హోటల్ ను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారు. హోటల్ కు కాపాలా ఉన్న ముగ్గురు గార్డులను కాల్చిచంపారు. పలువురు పర్యాటకులను బందీలుగా పట్టుకున్నారు. ముసుగు ధరించిన ఐదుగురు దుండగులు కాల్పులు జరుపుతూ హోటల్ లోకి ప్రవేశించినట్టు అక్కడి సిబ్బంది తెలిపారు. కారు పార్కింగ్ ప్రదేశంలో ఉగ్రవాదులు బాంబు పేల్చారని కూడా వెల్లడించారు. ఉగ్రవాదుల బారి నుంచి బందీల విడిపించేందుకు భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. -
చెక్‌పోస్టుపై దాడి : 17 మంది మృతి
ట్రిపోలి: లిబియాలోని సుక్నా పట్టణంలో సెక్యూరిటీ చెక్ పోస్టుపై ఉగ్రవాదులు దాడి చేసి విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 17 మంది మరణించారు. మృతుల్లో 14 మంది భద్రత సిబ్బందితోపాటు ముగ్గురు పౌరులు ఉన్నారని ఉన్నతాధికారులు వెల్లడించారు. భద్రత సిబ్బంది అంతా 168వ ఆర్మీ బెటాలియన్‌కు చెందిన వారని తెలిపారు. ఈ దాడికి తామే బాధ్యులమంటూ ఎవరు ప్రకటించలేదని చెప్పారు. లిబియా రాజధాని ట్రిపోలికి దాదాపు 165 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.ఇటీవల కాలంలో లిబియాలో ఉగ్రవాదులు మరింతగా పేట్రేగిపోతున్నారు.గత వారం ట్రిపోలికి 150 కిలోమీటర్ల దూరంలోని సిర్తే పట్టణంలో పవర్ ప్లాంట్ వద్ద పహారా కాస్తున్న భద్రత సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో 19 మంది మరణించిన సంగతి తెలిసిందే. -
పడవ బోల్తా: 234 మంది గల్లంతు
లిబియా: లిబియా రాజధాని ట్రిపోలీ సమీపంలో పడవ బోల్తా పడింది. ఆ దుర్ఘటనలో పడవలో ప్రయాణిస్తున్న 250 మంది నీట మునిగారని కోస్ట్‌గార్డ్ ఉన్నతాధికారి వెల్లడించారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న రక్షణ దళం వెంటనే రంగంలోకి దిగి 16 మందిని రక్షించిందని తెలిపారు. 234 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. పడవలో ప్రయాణిస్తున్నవారంతా యూరప్ దేశానికి వలస వెళ్తున్న ఆఫ్రికావాసులను ఉన్నతాధికారి పేర్కొన్నారు. -
లిబియాలో తెలు ’గోడు’
-
అంతర్యుద్ధంతో బయటికి రాలేకపోతున్న వైనం
-
లిబియాలోని తెలుగువారిని రక్షించాలి
విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు వైఎస్ జగన్ లేఖ హైదరాబాద్: లిబియా దేశానికి ఉపాధి కోసం వెళ్లి అక్కడి అంతర్యుద్ధంలో చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌కు విజ్ఞప్తిచేశారు. లిబియాలో ఏర్పడిన సంక్షోభం అంతర్యుద్ధంగా మారుతున్నందున అక్కడకు ఇతర దేశాల నుంచి వెళ్లిన వారి జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. వారిని సురక్షితంగా వెనక్కు తీసుకురావాలని కోరుతూ మంగళవారం ఆయన సుష్మా స్వరాజ్‌కు లేఖ రాశారు. లిబియాలో చిక్కుకుపోయిన వారిలో దాదాపు వేయి మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారేనని పేర్కొన్నారు. వీరు స్వదేశాలకు వచ్చే మార్గం లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి పనుల కోసం ఒక్క కర్నూలు జిల్లా నుంచే వందమంది లిబియాకు వె ళ్లారన్నారు. విదేశాలకు ఉపాధి కోసం వెళ్లిన వారి యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నందున ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుంచి లిబియాకు ఉపాధికి వెళ్లిన వారంతా అత్యంత పేద కుటుంబాలకు చెందిన వారని, ఆయా కుటుంబాలకు వారే పెద్దదిక్కని వివరించారు. తమ వారు లిబియాలో చిక్కుకుపోవడంతో ఆయా కుటుంబాలు తీవ్ర ఆందోళనతో ఉన్నాయన్నారు. భారతీయుల తరలింపు! న్యూఢిల్లీ: లిబియాలో హింస ప్రజ్వరిల్లుతున్న నేపథ్యంలో.. అక్కడి భారతీయులను క్షేమంగా స్వదేశానికి రప్పించేందుకు భారతప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. 750 మంది నర్సులు సహా 4,500 మంది భారతీయులను రప్పించే విషయమై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. సుష్మా ఆదేశాల మేరకు అక్కడి భారతీయులను క్షేమంగా తీసుకువచ్చేందుకు లిబియా రాజధాని ట్రిపోలీలోని భారత దౌత్య కార్యాలయానికి మరింత మంది సిబ్బందిని పంపిస్తున్నారు. -
క్షణ..క్షణం.. భయం.. భయం
ప్రమాదంలో వలస బతుకులు ►ఉపాధి కోసం లిబియా వెళ్లిన సిమెంట్‌నగర్ వాసులు ►అంతర్యుద్ధంతో బయటికి రాలేకపోతున్న వైనం ►సిమెంట్ ప్లాంట్లలో విద్యుత్ సరఫరా నిలిపివేత ►చీకట్లో అన్నం లేక అలమటిస్తున్న కార్మికులు ►ఆందోళన చెందుతున్న బాధిత కుటుంబ సభ్యులు ►ఆదుకోవాలని అధికారులకు విన్నపం సాక్షి, కర్నూలు/బేతంచెర్ల : ఉన్న ఊరిలో ఉపాధి కరువై.. రెండేళ్ల కిందట బతుకుదెరువు వెతుక్కుని ఆఫ్రికా ఖండంలోని లిబియా దేశానికి వలస వె ళ్లిన జిల్లాలోని సిమెంట్‌నగర్‌కు చెందిన సుమారు 35 మంది యువకులు ప్రస్తుతం ప్రమాదంలో చిక్కుకున్నారు. అక్కడ ప్రభుత్వానికి, ప్రభుత్వ వ్యతిరేక దళాలకు మధ్య కొనసాగుతున్న అంతర్యుద్ధం వల్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. రెండేళ్లుగా ఫోన్లలోనే ఆత్మీయులను పలకరిస్తూ.. క్షేమ సమాచారాలను తెలుసుకుంటూ.. ఇక ఊరికి రావడానికి సిద్ధమవుతున్న వేళ.. యుద్ధం మబ్బులు కమ్ముకున్నాయి. బయటికి రాలేని పరిస్థితి నెలకొనడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కన్నవారి గుండెల్లో ఆందోళన మొదలైంది. తమను సొంతూరికి చేర్చడానికి పాలకులు చర్యలు తీసుకోవాలని ఆశగా ఎదురుచూస్తున్నారు సిమెంట్‌నగర్ వాసులు. సిమెంట్ రంగంలో నిపుణులైన బేతంచెర్ల మండలం సిమెంట్‌నగర్‌కు చెందిన 50 మంది యువకులు లిబియాలోని సిమెంట్ పరిశ్రమల్లో పనిచేయడానికి రెండేళ్ల ఒప్పందం మీద 2012లో వెళ్లారు. ఇటీవలే 15 మంది కార్మికులు ఒప్పందం ముగియడంతో తిరిగి సిమెంట్‌నగర్‌కు వచ్చారు. మరికొందరి ఒప్పందం ఇటీవలే ముగిసింది. ఇక త్వరలో స్వస్థలానికి వెళతామనే ఆనందంలో ఉన్న వారికి ఆటంకం ఎదురైంది. అంతర్యుద్ధం వల్ల బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందని తెలుసుకున్న కార్మికుల్లో ఆందోళన నెలకొంది. రోజురోజుకు యుద్ధం తీవ్రం కావడంతో ఇటీవలే వారుంటున్న ఓ ప్లాంట్‌లో విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. దీంతో వారు చీకటిలో మగ్గుతున్నారు. రెండు రోజులుగా ఆహారం కూడా అందుబాటులో లేకపోవడంతో వారు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ విషయాలను ఫోన్ల ద్వారా తెలుసుకున్న బాధిత యువకుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలు క్షేమంగా తిరిగి రావాలని వేడుకొంటున్నారు. భయానక వాతావరణంలో చిక్కుకున్న తమ వారిని రక్షించి, సురక్షితంగా రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విషయం తెలుసుకున్న బేతంచెర్ల తహశీల్దారు రామకృష్ణుడు, సీఐ సుబ్రమణ్యం సిమెంట్‌నగర్‌కు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి.. వారి ద్వారా వారి పిల్లలతో ఫోన్లో మాట్లాడి వారి క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అక్కడ మీ వారు క్షేమంగా ఉన్నారని.. వారి విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. వారికి తెలిసిన పని అదొక్కటే.. జిల్లాలో ఒకప్పుడు సిమెంట్‌నగర్ అంటే పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీనే గుర్తొచ్చేది. ఆ ప్రాంతంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వందలాది మంది ఆ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. అయితే ఆ ఫ్యాక్టరీ నిర్వహణలో స్థిరత్వం లేకపోవడంతో పలుమార్లు మూసివేయడం.. మళ్లీ ప్రారంభించడం జరుగుతోంది. ఇలా మూసివేసిన ప్రతిసారి ఉపాధి కరువై అనేక మంది కార్మికులు రోడ్డున పడ్డారు. వారికి తెలిసిన వృత్తి అదొక్కటే కావడంతో వారు పొట్టచేత పట్టుకుని దేశ సరిహద్దులు దాటారు. గత ఎనిమిది నెలలుగా మూతపడ్డ పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీని ఐదు రోజుల క్రితం మళ్లీ ప్రారంభించారు. అందరూ యువకులే.. లిబియాలోని ఏసీసీ, ఏయూసీసీ కంపెనీల్లో పనిచేసేందుకు సిమెంట్‌నగర్ నుంచి వెళ్లిన వారంతా 20 నుంచి 32 ఏళ్ల మధ్య యువకులే. ఢిల్లీకి చెందిన ఎస్ఎస్బీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కన్సల్టెన్సీ సహకారంతో వీరు జూనియర్ ఇంజనీర్లు, ఎలక్ట్రిషియన్లు, ఫిట్టర్లు, వెల్డర్లు, మిల్లర్ ఆపరేటర్లుగా పనిచేయడానికి రెండేళ్ల ఒప్పందం మీద 2012 జూలై, ఆగస్టు నెలల్లో లిబియాకు వెళ్లారు. ప్రస్తుతం వారున్న ప్రాంతానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలోనే యుద్ధం జరుగుతోంది. ప్లాంట్లను వదిలి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో గత కొన్ని రోజులుగా వారు అక్కడే ఉంటున్నారు. ఆకాశమా, సముద్ర మార్గమా..? లిబియాలో చిక్కుకున్న సిమెంట్‌నగర్ వాసులు సురక్షితంగా స్వదేశానికి పంపేందుకు అక్కడి యాజమాన్యాలు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని తెలిసింది. అక్కడ నెలకొన్న యుద్ధ వాతావరణమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. అక్కడికి సమీపంలో ఎయిర్‌పోర్టు లేకపోవడం.. ఒకవేళ రహదారి మార్గంలో ఎయిర్‌పోర్టుకు వెళ్లాలన్నా సాధ్యమయ్యే పరిస్థితులు లేకపోవడంతో కార్మికులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకవేళ వారు సముద్రమార్గం ద్వారా ప్రయాణిస్తే కేరళ రాష్ట్రంలోని కొచ్చికి చేరుకునే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం 14 రోజులపాటు సముద్రంలో ప్రయాణించాల్సి ఉంటుంది. కాగా, వీరుంటున్న ప్రాంతానికి సముద్రం కూడా చాలా దూరంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒప్పందం ముగిసి 9 రోజులైంది.. లిబియాలోని ఓ సిమెంట్ కంపెనీలో ఎలక్ట్రిషియన్ పనికి వెళ్లిన గంగారం రాజేష్ ఒప్పందం ఈ నెల 20వ తేదీతో ముగిసిందని అతని తల్లి లక్ష్మీదేవి పేర్కొంది. ప్రతి రెండు నెలలకోసారి జీతం డబ్బులు (చెక్కులు) పంపేవాడని. కానీ అక్కడ జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా సంబంధిత యాజమాన్యం స్వదేశానికి పంపుతుందా లేదా అన్న సందేహం వ్యక్తం చేశాడని ఆమె ఆవేదన చెందుతోంది. తమ పిల్లల్ని సురక్షితంగా ఇక్కడి రప్పించే ఏర్పాట్లను ప్రభుత్వం చేపట్టాలని కోరుతోంది. ప్లాంట్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేశారు తన కుమారుడు యశ్వంత్ 2012 ఆగస్టు 6వ తేదీన జూనియర్ ఇంజినీర్‌గా లిబియా సిమెంట్ కంపెనీలో చేరాడని అతని తల్లి సుశీల తెలిపింది. ప్రస్తుతం అక్కడున్న పరిస్థితులను చూస్తుంటే భయం వేస్తోందని.. ప్రస్తుతం తన కుమారుడు పనిచేసే ప్లాంట్‌కు విద్యుత్ సరఫరా నిలిపి వేసినట్లు ఫోన్లో తెలిపాడని వివరించింది. కొన్ని రోజులుగా వేతనాలకు చెందిన చెక్కులు కూడా రావడం లేదని, అక్కడ మా పిల్లలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని కోరింది. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.. లిబియా వెళ్లిన తమ పిల్లలు ఏం కష్టాలు పడుతున్నారో తెలియదని, కనుక ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలు చేపట్టి ఆదుకోవాలని సుధీర్ తల్లి కళావతి కోరుతోంది. సిమెంట్‌నగర్ వాసుల వివరాలు ప్రభుత్వానికి నివేదించాం లిబియాలో చిక్కుకున్న సిమెంట్‌నగర్ వాసుల వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. లిబియాలో ఉన్న కార్మికులతో మాట్లాడాం. వారంతా క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. రెండేళ్ల ఒప్పందపై 50 మంది అక్కడి వెళ్లినట్లు తెలిసింది. వారిలో 15 మంది ఇటీవలే తిరిగొచ్చారు. మిగిలిన వారిలో వివరాలు, ఫోన్ నంబర్లను సేకరించి సీఎం కార్యాలయానికి పంపాం. అలాగే ఢిల్లీలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావుకు, విపత్తుల కమిషనర్‌కు ఓ సమగ్ర నివేదిక పంపి వారి రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరాం. - సీహెచ్ విజయమోహన్, కలెక్టర్ -
లిబియాలో అగ్ని కీలలు
ట్రిపోలి: లిబియా రాజధాని ట్రిపోలీ సమీపంలో ఓ చమురు డిపోలో లేచిన మంటలు అదుపులోకి రాలేదు. వీటిని ఆర్పడానికి అగ్నిమాపక దళాలు నిరంతరాయంగా కృషి చేసిన ఫలితం దక్కలేదు. నీటి నిల్వలు కూడా అడుగంటాయి. దీంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలను రోడ్డు, వాయు మార్గంలో తరలించేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతంలో గత రెండు వారాలుగా తీవ్రవాదులు పరస్పరం దాడులు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ట్రిపోలీకి 10 కిలోమీటర్ల దూరం లో ఉన్న చమురు డిపోపై ఆదివారం రాకెట్ పడడంతో మంటలు తలెత్తాయి. 60లక్షల లీటర్ల చమురు ఇక్కడ నిల్వ ఉండడంతో మంటలు ఎగసి పడుతున్నాయి. ఈ ఆవరణలోనే ఉన్న 9 కోట్ల లీటర్ల సహజవాయువు కేంద్రానికి కూడా మంటలు వ్యాపిస్తాయేమోననే ఆందోళనలో అధికారులు ఉన్నారు. లిబియాలో జరుగుతున్న హింసలో 97 మంది మృతి చెందారు. భారతీయులకు హెచ్చరిక: హింస నేపథ్యంలో లిబియా నుంచి వెళ్లిపోవాలని భారతీయులకు అక్కడి ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. లిబియా నుంచి వెళ్లిపోవడానికి అన్ని మార్గాలను వినియోగించుకోవాలని... ఘర్షణాత్మక ప్రాంతా ల నుంచి సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని కోరింది. -
లిబియాలో చిక్కుకున్న భారతీయులు
న్యూఢిల్లీ : ఉపాధి కోసం లిబియాకు వెళ్లిన భారతీయులు అక్కడ కష్టాలు పడుతున్నారు. గత రెండు రోజులుగా వారు భోజనం లేక ఇబ్బందులు పడుతున్నారు. సిమెంట్ కంపెనీలో పనిచేసేందుకు వీరంతా లిబియాకు వెళ్లారు. రెండేళ్ల కాంట్రాక్ట్ తో వెళ్లిన భారతీయుల్లో ఎక్కువమంది తెలుగువారే ఉన్నారు. వీరిలో కర్నూలు జిల్లా బేతంచర్లకు చెందినవారే ఎక్కువమంది ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో తమ కుటుంబ సభ్యులను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబసభ్యులు కోరుతున్నారు. -
జైలు నుంచి 40 మంది ఖైదీలు పరారీ
లిబియాలోని సభ నగరంలోని జైలు నుంచి దాదాపు 40 మంది ఖైదీలు పరారయ్యారని జైలు ఉన్నతాధికారి నాసర్ సబ్బాన్ వెల్లడించారు. ఆగంతకులు జైలుపై ముకుమ్మడిగా దాడి చేసి, విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. అనంతరం జైలులో ఉన్న ఖైదీలను విడిపించుకు పోయారని తెలిపారు. అయితే భద్రత సిబ్బంది తెరుకునేలోపే ఆ ఘటన చోటు చేసుకుందని వివరించారు. తప్పించుకు పారిపోయిన ఖైదీలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు తీవ్రతరం చేసినట్లు తెలిపారు. ఆ ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుందని వివరించారు. -
లిబియా ప్రధాని అలీ జియాదన్ కిడ్నాప్
-
లిబియా ప్రధాని అలీ జియాదన్ కిడ్నాప్
లిబియా : లిబియాలో తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. ఏకంగా దేశ ప్రధానినే కిడ్నాప్ చేశారు. ట్రిపోలోని ఓ హోటల్లోఉన్న ప్రధాని అలీ జియాదన్ను తిరుగుబాటుదారులు అపహించారు. ప్రధాని కిడ్నాప్ అయ్యారన్న వార్తతో లిబియా ప్రజలు ఉలిక్కిపడ్డారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, అనుక్షణం నిఘా నీడలో ఉండే ప్రధానిని.....తిరుగుబాటుదారులు ఎలా అపహరించారనేది సస్పెన్స్‌గా మారింది. దేశప్రధానిని కిడ్నాప్ చేయటం లిబియాలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది.