కొరింతియా లగ్జరీ హోటల్ (ఫైల్)
ట్రిపోలి: లిబియా రాజధాని ట్రిపోలీలో ఉగ్రవాదులు 26/11 తరహా దాడికి పాల్పడ్డారు. విదేశీయులు ఎక్కువగా విడిది చేసే కొరింతియా లగ్జరీ హోటల్ ను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారు. హోటల్ కు కాపాలా ఉన్న ముగ్గురు గార్డులను కాల్చిచంపారు. పలువురు పర్యాటకులను బందీలుగా పట్టుకున్నారు.
ముసుగు ధరించిన ఐదుగురు దుండగులు కాల్పులు జరుపుతూ హోటల్ లోకి ప్రవేశించినట్టు అక్కడి సిబ్బంది తెలిపారు. కారు పార్కింగ్ ప్రదేశంలో ఉగ్రవాదులు బాంబు పేల్చారని కూడా వెల్లడించారు. ఉగ్రవాదుల బారి నుంచి బందీల విడిపించేందుకు భద్రతా దళాలు రంగంలోకి దిగాయి.