లిబియా తీర పట్టణం సభ్రతా సమీపంలో మునిగి వందమందికి పైగా జాడ తెలియకుండా పోయారు.
ట్రిపోలి(లిబియా): శరణార్థులతో వస్తున్న ఓడ లిబియా తీర పట్టణం సభ్రతా సమీపంలో మునిగి వందమందికి పైగా జాడ తెలియకుండా పోయారు. ఏడుగురిని మాత్రం కాపాడగలిగామని లిబియా నావికా సిబ్బంది తెలిపారు. అయితే, ఆ ఓడ మునిగి అప్పటికే మూడు రోజులయిందని తాము రక్షించిన వారంతా ఓడకు చెందిన ఒక భాగాన్ని పట్టుకుని ప్రాణాలు నిలుపుకున్నారని లిబియా అధికార ప్రతినిధి అయూబ్ కసీమ్ తెలిపారు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నామని చెప్పారు.
గత వారం రోజుల్లో మధ్యధరా సముద్రం మీదుగా యూరప్ చేరుకునేందుకు యత్నించిన సుమారు మూడు వేల మందిని లిబియా తీరం సమీపంలో కాపాడామని ఆయన వివరించారు.