Tripoli
-
Libya: లిబియాలో పెను విపత్తు.. 2000 మందికిపైగా మృతి
ట్రిపోలీ: మొరాకోలో తీవ్ర భూకంపం మిగిల్చిన విషాదాన్ని మరువక ముందే ఆఫ్రికా దేశమైన లిబియాలో పెనువిషాదం చోటు చేసుకుంది. లిబియాలో డానియల్ తుఫాను ప్రభావంతో డెర్నా నగరాన్ని వరదలు ముంచెత్తగా వరద ప్రవాహానికి సుమారు 2000 మంది చనిపోయి ఉంటారని ఐదారు వేల మంది గల్లంతయి ఉంటారని అంచనా వేస్తున్నారు అక్కడి అధికారులు. ఒకపక్క సాయుధ దళాల తిరుగుబాటుతో అట్టుడుకుతున్న లిబియాను వరదలు ముంచెత్తాయి. తూర్పు లిబియాలోని డెర్నా నగరంలో డానియెల్ తుఫాను ప్రభావంతో కుండపోతగా వాన కురిసింది. దీంతో ఒక్కసారిగా వరదలు పోటెత్తడంతో సుమారు 2 వేల మంది మృతిచెందగా ఐదారు వేల మంది వరదల్లో గల్లంతయ్యారని మొరాకో దేశ ప్రధాని ఒసామా హమద్ తెలిపారు. డ్యామ్‌లన్నీ నిండి ఉప్పొంగడంతో నీటిప్రవాహానికి డెర్నా నగరం మునిగిపోయిందని పెద్ద పెద్ద వంతెనలు, ఎత్తయిన భవనాలన్నీ నేలమట్టమయ్యాయని తెలిపారు. డేనియల్ తుఫాను మరింత ఉధృతం కావడంతో డెర్నా, జబల్ అల్ అఖ్దర్, అల్-మార్జ్ తదితర నగరాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయని వందలాది మంది లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయారని, వారిని కాపాడేందుకు సైన్యం, సహాయక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయన్నారు. ఇదిలా ఉండగా డెర్నా నగరంలోని నదిపై ఉన్న ఆనకట్ట కూలిపోవడంతోనే విపత్తు మరింత తీవ్రమైందని లిబియా నేషనల్ ఆర్మీ ప్రతినిధి అహ్మద్ మిస్మారీ చెప్పారు. తీర ప్రాంతాల్లో భారీగా ఆస్తినష్టం జరిగిందని అన్నారు. After devastating Greece in the country’s worst ever flood disaster, #medicane Daniel submerges East Libya under water. First estimate of 2,000 dead, many missing thought to have been washed out to sea. Apocalyptic. #ClimateCrisis #ClimateActionNow pic.twitter.com/HTxgiTQbaz — George Tsakraklides (@99blackbaloons) September 11, 2023 Everyone in this part of the city of #Darna in eastern #Libya was taken by surprise as a #tsunami -like rushed down the valley. Police, using megaphones, rushed to warn them as flood was approaching shouting: "Guys get out of the valley..." But it was too late. pic.twitter.com/5sYiEabFz4 — Said Laswad سعيد الأسود (@LaswadSaid) September 11, 2023 Rabbimiz sen kardeşlerimizin yardımcısı ol.. #Libya pic.twitter.com/1wXiHwm9rs — ᎬbᏒu..🦋 (@EbruZengnn) September 12, 2023 Thread of videos of the torrents and floods that occurred and are still occurring today in the eastern region of #Libya The situation is catastrophic in the city of Al-Bayda in eastern Libya pic.twitter.com/ieLO3Idx7h — Mahmud Mohammed (@MahmudM27830556) September 10, 2023 ఇది కూడా చదవండి: సమావేశాలు విజయవంతం.. ఆ క్రెడిట్ మొత్తం భారత్‌దే -
ఈ సబ్బు ఖరీదు తెలిస్తే మూర్చపోతారు!.. రూ. 2.7 లక్షలట!!
సాధారణంగా స్నానం చేసే సబ్బు ఖరీదు ఎంత ఉంటుంది. మహా అయితే రూ. 30, 40 ఉంటుంది. మరీ ఖరీదైంది ఐతే వంద రూపాయలు ఉంటుంది. ఐతే ఈ సబ్బు ఖరీదు వందలు కాదు వేలు అస్సలే కాదు ఏకంగా లక్షల్లో ఉంటుందట. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సబ్బట కూడా! స్నానం చేసే సబ్బే కదా.. ఏమైనా బంగారంతో తయారు చేశారా? ఎందుకంత ఖరీదని అనుకుంటున్నారా! అవును.. ఇది మామూలు సబ్బు కాదు.. నిజంగానే బంగారంతో తయారు చేస్తారు. ఆ విశేషాలు తెలుసుకుందాం.. ఎక్కడా తయారు చేస్తారంటే.. లెబానోన్లోని ట్రిపోలీకి చెందిన ఒక కుటుంబం నడిపే సబ్బుల ఫ్యాక్టరీలో ఈ విధమైన సబ్బులు తయారవుతున్నాయి. 15వ శతాబ్ధం నుంచి ఈ విధమైన సబ్బులు వడకంలో ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ఐతే 2013 లో ఈ ఖరీదైన సబ్బులను మొదట తయారు చేశారు. దీనిని ఖతార్ అధ్యక్షుడి భార్యకు బహుమతిగా ఇచ్చినట్లు మీడియా నివేదికలు తెలుపుతున్నాయి. ఈ లగ్జరీ సబ్బు పేరు ‘ఖాన్ అల్ సబౌన్’ సోస్. బాడర్ హసీన్ అండ్ సన్స్ కంపెనీ కేవలం చేతులతోనే ఈ సబ్బులను తయారు చేస్తుందట. ప్రత్యేకమైన నూనెలు, సహజ సువాసనలతో కూడిన చర్మ సంరక్షణ ఉత్పత్తులను తయారు చేయడంలో ఈ కంపెనీ ప్రసిద్ధి. ఈ కంపెనీ ఉత్పత్తులు కేవలం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని కొన్ని ప్రత్యేక షాపుల్లో మాత్రమే అమ్ముతారు. చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట! బంగారం, వజ్రాల పొడితో తయారీ.. ఈ ఖరీదైన సబ్బుకు మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఒక ఖాన్ అల్ సబౌన్ సబ్బు తయారీకి 17 గ్రాముల 24 క్యారెట్ల బంగారం, 3 గ్రాముల వజ్రాల పౌడర్‌లో సహజమైన నూనెలు, సహజసిద్ధమైన తేనె, ఖర్జూరం కలిపి తయారు చేస్తారట. చూడ్డానికి అచ్చం జున్ను ముక్కలా ఉంటుందీ లగ్జరీ సబ్బు. దీని ధర కూడా చుక్కల్లో ఉంటుంది. ఒక సబ్బు ఖరీదు అక్షరాల 2 లక్షల 7 వేల రూపాయలు. ఈ సబ్బు ప్రత్యేకత అదే.. ఈ సబ్బు వాడిన వారికి ఆధ్యాత్మిక, మానసిక ప్రశాంతత కలుగుతుందనే నమ్మకం ప్రచారంలో ఉంది. ఐతే దీనిని రుజువుచేసే ఆధారాలేవీ లేవు. అంత ఖరీదైన సబ్బు వాడేవారు కూడా ఉంటారా? అని అనుకుంటే పొరపాటే. ముఖ్యమైన విఐపీలు, సెలబ్రెటీలు మాత్రమే వీటిని వాడుతారట. ముఖ్యంగా దుబాయ్‌లో నివసించే సంపన్న కుటుంబాలు ఎక్కువగా ఈ సబ్బులను వాడుతారు. ఆ మధ్య ఖరీదైన వాటర్ బాటిల్ ధర రూ. 45 లక్షల రూపాయలని విన్నాం. ఇప్పుడు రెండున్నర లక్షల స్నానం సబ్బు.. రోజూ వాడే మామూలు వస్తువులకు కూడా ఇంత ధర పలుకుతుందంటే నమ్మలేకపోతున్నాం కదా! చదవండి: Viral Video: కొ.. కొ.. కోబ్రా! లగెత్తండ్రోయ్!!.. ఆగండి..! -
లిబియాలో ఘోరం; 28 మంది సైనికుల మృతి
ట్రిపోలి : లిబియాలో శనివారం ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. లిబియా రాజధాని ట్రిపోలీలోని సైనిక పాఠశాలపై జరిగిన వైమానిక దాడుల్లో 28 మంది సైనికులు మృతి చెందగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇదే విషయాన్ని జిఎన్ఎ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అమిన్ అల్-హషేమి మీడియా సమావేశంలో ధృవీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ట్రిపోలిలోని సైనిక పాఠశాలపై శనివారం వైమానిక దాడులు జరిగాయని తెలిపారు. ఈ దాడిలో 28 మంది మృతి చెందగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారన్నారు. అయితే వైమానిక దాడులకు ముందు సైనికులంతా పెరేడ్ గ్రౌండ్లో సమావేశంలో పాల్గొన్నారని తెలిపారు. సమావేశం ముగిసిన తర్వాత వీరంతా తమ గూడారాల్లోకి వెళుతుండగా ఒక్కసారిగా దాడులు జరిగాయని అమిన్ పేర్కొన్నారు. ఈ మిలటరీ స్కూల్ ట్రిపోలి కేంద్రంగా అల్-హద్బా అల్-ఖాద్రాలో ఉంది. కాగా దాడిలో తీవ్రంగా గాయపడిన సైనికులకు రక్తం ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని జిఎన్ఎ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. 2011లో నాటో సహాయంతో అప్పటి దీర్ఘకాల నియంత మోమెర్ ఖడాఫీని జిఎన్ఏ దళాలు మట్టుబెట్టడంతో లిబియాలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటి నుంచి జీఎన్ఎ, దాని ప్రత్యర్థుల మధ్య వైమానిక దాడులు జరుగుతూనే ఉన్నాయి.దీంతో పాటు గత ఎప్రిల్లో లిబియా దక్షిణభాగానికి నేతృత్వం వహిస్తున్న మిలటరీ కమాండర్ ఖలీఫా హప్తర్ జిఎన్‌ఎకు వ్యతిరేకంగా మారడంతో లిబియా దేశం నిత్యం వైమానిక దాడులతో అట్టుడుకుతుందని సమాచారం.(ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక) -
ఓడ మునిగి 90 మంది గల్లంతు
ట్రిపోలి(లిబియా): శరణార్థులతో వస్తున్న ఓడ లిబియా తీర పట్టణం సభ్రతా సమీపంలో మునిగి వందమందికి పైగా జాడ తెలియకుండా పోయారు. ఏడుగురిని మాత్రం కాపాడగలిగామని లిబియా నావికా సిబ్బంది తెలిపారు. అయితే, ఆ ఓడ మునిగి అప్పటికే మూడు రోజులయిందని తాము రక్షించిన వారంతా ఓడకు చెందిన ఒక భాగాన్ని పట్టుకుని ప్రాణాలు నిలుపుకున్నారని లిబియా అధికార ప్రతినిధి అయూబ్ కసీమ్ తెలిపారు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నామని చెప్పారు. గత వారం రోజుల్లో మధ్యధరా సముద్రం మీదుగా యూరప్ చేరుకునేందుకు యత్నించిన సుమారు మూడు వేల మందిని లిబియా తీరం సమీపంలో కాపాడామని ఆయన వివరించారు. -
బీచ్‌కు కొట్టుకొచ్చిన 104 మృతదేహాలు
ట్రిపోలీ: లిబియాలోని జ్వారాలో సముద్రతీరానికి సుమారు 104 మంది శరణార్థుల మృతదేహాలు కొట్టుకువచ్చాయి. గురువారం సాయంత్రం తీర ప్రాంతానికి చాలా మృతదేహాలు కొట్టుకువచ్చాయని .. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని నావికాదళ అధికారులు శుక్రవారం తెలిపారు. ఇతర దేశాలకు వెళ్తోన్న 700 మంది శరణార్థులు ప్రయాణిస్తున్న బోటు మునిగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు దాదాపు 340 మంది కాపాడామని గ్రీక్ కోస్ట్ గార్డ్ అధికార ప్రతినిధి నికోస్ లగాడియానోస్ తెలిపారు. మిగతా శరణార్థులు మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. -
గడువు ముగిసినా.. వీడని చెర
ట్రిపోలిలో ఉగ్రవాదుల చెరలోనే తెలుగు ప్రొఫెసర్లు * ఆదివారం విడుదల చేస్తారని ఆశగా చూసిన బంధువులు * ప్రాణాలు కాపాడమంటూ దత్తాత్రేయకు వేడుకోలు సాక్షి, హైదరాబాద్: లిబియా దేశంలో కిడ్నాప్‌నకు గురైన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్లు తిరువీధుల గోపీకృష్ణ, చిలువేరు బలరాం కిషన్‌లు తీవ్రవాదుల చెర వీడలేదు. దీంతో ఇరు కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి. వీరితోపాటే కిడ్నాప్‌నకు గురై విడుదలైన కర్ణాటకకు చెందిన ప్రొఫెసర్లు లక్ష్మీకాంతం, విజయ్‌కుమార్‌లు విదేశాంగ శాఖ అధికారులతో చెప్పిన మాటల ప్రకారం ఆదివారం సాయంత్రానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు విడుదల కావాల్సి ఉంది. దీంతో గోపీకృష్ణ, బలరాం కిషన్ల కుటుంబసభ్యులు ఆదివారం రాత్రి వరకు ఎప్పుడు తీపి కబురు వస్తుందోనని ఎదురుచూస్తూ కాలం గడిపారు. తీరా సాయంత్రానికి సైతం ఎలాంటి సమాచారం లేకపోవటంతో బలరాం కిషన్ భార్య శ్రీదేవి ఇతర కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని దిల్కుష అతిథి గృహంలో కేంద్రమంత్రి దత్తాత్రేయను కలుసుకుని తమ వారి ప్రాణాలు ఎలాగైనా కాపాడమంటూ ప్రాధేయపడ్డారు. ఈ విషయమై దత్తాత్రేయ ప్రతిస్పందిస్తూ ఇద్దరు తెలుగు ప్రొఫెసర్ల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, సోమవారం మరోసారి తానే స్వయంగా విదేశాంగశాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతానని హామీ ఇచ్చారు. ఆ ఇద్దరినీ వదిలేస్తారు..: తీవ్రవాదుల చెరలో ఉన్న ఇద్దరు తెలుగువారిని తప్పకుండా విడుదల చేస్తారంటూ కిడ్నాప్ చెర నుండి విడుదలైన కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంతం, విజయ్‌కుమార్‌లు గోపీకృష్ణ, బలరాం కిషన్ల కుటుంబసభ్యులకు బరోసానిచ్చారు. వారిద్దరు లిబియా నుండి ఆదివారం స్వస్థలాలకు బయలుదేరే ముందు గోపీకృష్ణ, బలరాంకిషన్ల కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. తమ వద్ద ఉన్న ధృవపత్రాలన్నీ తీవ్రవాదులు క్షుణ్ణంగా పరిశీలించారని, గోపీకృష్ణ, బలరాంకిషన్‌లకు సంబంధించిన మరిన్ని ధృవపత్రాలను ట్రిపోలి యూనివర్సిటీ ప్రతినిధులు ఉగ్రవాదులకు పంపారని చెప్పారు. ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయంలోగా ఖచ్చితంగా విడుదలవుతారని, ఇదే విషయమై ఆదివారం కూడా తీవ్రవాదులతో సంప్రదింపులు జరిపిన యూనివర్సిటీ ప్రతినిధులు తమతో చెప్పారని లక్ష్మీకాంతం, విజయ్‌కుమార్‌లు పేర్కొన్నారు. -
కాన్సులేట్ అధికారుల అపహరణ
ట్యూనిస్: అంతర్యుద్ధంతో అట్టుడుకుతోన్న లిబియాలో మరో సంచలనం చోటుచేసుకుంది. రాజధాని ట్రిపోలీలోని ట్యునీషియా రాయబార కార్యాలయంపై సాయుధ ఉగ్రవాదులు దాడి జరిపి 10 మంది అధికారులను అపహరించుకు వెళ్లారు. దీంతో ఆందోళనకు గురైన ట్యునీషియా ప్రభుత్వం.. బందీలను విడిపించే దిశగా చర్యలు చేపట్టాల్సిందిగా లిబియా ఉన్నతాధికారులను కోరారు. అయితే లిబియా అధికారులు మాత్రం ఇప్పటివరకు స్పందించలేదని, ఇలాంటి అపహరణలు మరిన్ని జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజధాని ట్రిపోలీ సహా లిబియాలో ఉన్న తమ దేశస్తులందూ వెంటనే వెనక్కు రావాలని ఆదేశించినట్లు ట్యునీషియా ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. 2011లో గడాఫీ మరణానంతరం తలెత్తిన ఆధిపత్య పోరు లిబియాను అతలాకుతలం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ఆసుపత్రులు, స్కూలు భవనాలను నేలకూల్చిన తిరుగుబాటుదారులు తాజాగా రాయబార కార్యాలయాలను టార్గెట్ చేసుకున్నట్లు తెలిసింది. -
లిబియా హోటల్‌పై ఉగ్రపంజా
ట్రిపోలీ: లిబియా రాజధాని ట్రిపోలీలో విదేశీయులు ఎక్కువగా బస చేసే కోరింథియా హోటల్‌పై మంగళవారం ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఐదుగురు విదేశీయులు, ముగ్గురు సెక్యూరిటీ గార్డులు సహా 9 మంది మృతిచెందారు. తొలుత హోటల్లోకి చొరబడిన ముగ్గురు సాయుధ ఉగ్రవాదులు ముగ్గురు గార్డులతోపాటు ఐదుగురు విదేశీయులను కాల్చి చంపారు. అనంతరం ఒకరిని బందీగా పట్టుకున్నారు. 24వ అంతస్తులోని ముష్కరులను భద్రత బలగాలు చుట్టుముట్టగా వారు తమను తాము పేల్చేసుకున్నారు. పేలుడుతో బందీ కూడా మృతి చెందారు. మృతిచెందిన విదేశీయుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ హోటల్లోని 24వ అంతస్తును కొంతకాలంగా లిబియాలోని ఖతర్ ఎంబసీ వాడుకుంటోంది. దాడి సమయంలో ఎంబసీ ఉద్యోగులెవరూ లేరని అధికారులు తెలిపారు. దాడి మొదట్లో హోటల్లో బసచేసిన వారు పారిపోతుండగా హోటల్ ఆవరణలో కారు బాంబు పేలింది. తనను తాను లిబియా ప్రధానిగా ప్రకటించుకున్న ఒమర్ అల్ హసీ దాడి సమయంలో ఈ హోటల్లోనే ఉన్నారు. ఆయనను సురక్షితంగా బయటకు తరలించారు. ఈ దాడి తమ పనేనని ఐఎస్ఐఎస్ విభాగం ప్రకటించుకుంది. -
లిబియాలో '26/11' తరహా దాడి
-
లిబియాలో '26/11' తరహా దాడి
ట్రిపోలి: లిబియా రాజధాని ట్రిపోలీలో ఉగ్రవాదులు 26/11 తరహా దాడికి పాల్పడ్డారు. విదేశీయులు ఎక్కువగా విడిది చేసే కొరింతియా లగ్జరీ హోటల్ ను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారు. హోటల్ కు కాపాలా ఉన్న ముగ్గురు గార్డులను కాల్చిచంపారు. పలువురు పర్యాటకులను బందీలుగా పట్టుకున్నారు. ముసుగు ధరించిన ఐదుగురు దుండగులు కాల్పులు జరుపుతూ హోటల్ లోకి ప్రవేశించినట్టు అక్కడి సిబ్బంది తెలిపారు. కారు పార్కింగ్ ప్రదేశంలో ఉగ్రవాదులు బాంబు పేల్చారని కూడా వెల్లడించారు. ఉగ్రవాదుల బారి నుంచి బందీల విడిపించేందుకు భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. -
పడవ బోల్తా: 234 మంది గల్లంతు
లిబియా: లిబియా రాజధాని ట్రిపోలీ సమీపంలో పడవ బోల్తా పడింది. ఆ దుర్ఘటనలో పడవలో ప్రయాణిస్తున్న 250 మంది నీట మునిగారని కోస్ట్‌గార్డ్ ఉన్నతాధికారి వెల్లడించారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న రక్షణ దళం వెంటనే రంగంలోకి దిగి 16 మందిని రక్షించిందని తెలిపారు. 234 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. పడవలో ప్రయాణిస్తున్నవారంతా యూరప్ దేశానికి వలస వెళ్తున్న ఆఫ్రికావాసులను ఉన్నతాధికారి పేర్కొన్నారు. -
లిబియాలో అగ్ని కీలలు
ట్రిపోలి: లిబియా రాజధాని ట్రిపోలీ సమీపంలో ఓ చమురు డిపోలో లేచిన మంటలు అదుపులోకి రాలేదు. వీటిని ఆర్పడానికి అగ్నిమాపక దళాలు నిరంతరాయంగా కృషి చేసిన ఫలితం దక్కలేదు. నీటి నిల్వలు కూడా అడుగంటాయి. దీంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలను రోడ్డు, వాయు మార్గంలో తరలించేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతంలో గత రెండు వారాలుగా తీవ్రవాదులు పరస్పరం దాడులు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ట్రిపోలీకి 10 కిలోమీటర్ల దూరం లో ఉన్న చమురు డిపోపై ఆదివారం రాకెట్ పడడంతో మంటలు తలెత్తాయి. 60లక్షల లీటర్ల చమురు ఇక్కడ నిల్వ ఉండడంతో మంటలు ఎగసి పడుతున్నాయి. ఈ ఆవరణలోనే ఉన్న 9 కోట్ల లీటర్ల సహజవాయువు కేంద్రానికి కూడా మంటలు వ్యాపిస్తాయేమోననే ఆందోళనలో అధికారులు ఉన్నారు. లిబియాలో జరుగుతున్న హింసలో 97 మంది మృతి చెందారు. భారతీయులకు హెచ్చరిక: హింస నేపథ్యంలో లిబియా నుంచి వెళ్లిపోవాలని భారతీయులకు అక్కడి ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. లిబియా నుంచి వెళ్లిపోవడానికి అన్ని మార్గాలను వినియోగించుకోవాలని... ఘర్షణాత్మక ప్రాంతా ల నుంచి సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని కోరింది. -
ట్రిపోలీ ఆయుధగారంలో పేలుడు: 10 మంది మృతి
లిబియా రాజధాని ట్రిపోలిలో బర్క్ వాది షట్టి జిల్లాలోని ఆయుధ కర్మాగారంలో నిన్న పేలుళ్లు సంభవించింది. ఆ ఘటనలో10 మంది మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారని జిల్లా మిలటరీ గవర్నర్ బ్రిగేడియర్ మహ్మద్ అల్ దహబ్యా శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. ఆగంతకులు ఆయుధకర్మాగారాన్ని పేల్చేసే క్రమంలో ఆ పేలుడు సంభవించిందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆ అధికారి తెలిపారు. -
కిడ్నాప్‌నకు గురైన లిబియా ప్రధాని విడుదల
లిబియా ప్రధాని అలీ జియాదన్ కిడ్నాప్ కథ సుఖాంతమైంది. తిరుగుబాటు దారులు అపహరించిన జియాదన్ విడుదలయ్యారు. ఈ విషయాన్ని లిబియా ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరించాయి. ఈ సంఘటనకు ఎవరు పాల్పడ్డారన్న విషయం తెలియరాలేదు. ట్రిపోలోని ఓ హోటల్లోఉన్న ప్రధాని అలీ జియాదన్ను గురువారం ఉదయం తిరుగుబాటుదారులు అపహించారు. ఈ వార్త తెలిసిన వెంటనే లిబియా ప్రజలు ఉలిక్కిపడ్డారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, అనుక్షణం నిఘా నీడలో ఉండే ప్రధానిని.....తిరుగుబాటుదారులు అపహరించడం నివ్వెరపరిచింది. -
లిబియా ప్రధాని అలీ జియాదన్ కిడ్నాప్
-
లిబియా ప్రధాని అలీ జియాదన్ కిడ్నాప్
లిబియా : లిబియాలో తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. ఏకంగా దేశ ప్రధానినే కిడ్నాప్ చేశారు. ట్రిపోలోని ఓ హోటల్లోఉన్న ప్రధాని అలీ జియాదన్ను తిరుగుబాటుదారులు అపహించారు. ప్రధాని కిడ్నాప్ అయ్యారన్న వార్తతో లిబియా ప్రజలు ఉలిక్కిపడ్డారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, అనుక్షణం నిఘా నీడలో ఉండే ప్రధానిని.....తిరుగుబాటుదారులు ఎలా అపహరించారనేది సస్పెన్స్‌గా మారింది. దేశప్రధానిని కిడ్నాప్ చేయటం లిబియాలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది.