లిబియా రాజధాని ట్రిపోలిలో బర్క్ వాది షట్టి జిల్లాలోని ఆయుధ కర్మాగారంలో నిన్న పేలుళ్లు సంభవించింది. ఆ ఘటనలో10 మంది మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారని జిల్లా మిలటరీ గవర్నర్ బ్రిగేడియర్ మహ్మద్ అల్ దహబ్యా శుక్రవారం ఇక్కడ వెల్లడించారు.
ఆగంతకులు ఆయుధకర్మాగారాన్ని పేల్చేసే క్రమంలో ఆ పేలుడు సంభవించిందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆ అధికారి తెలిపారు.