హైదరాబాద్: లిబియా ఉగ్రవాదుల చెర నుంచి విడుదలైన కర్ణాటక వాసి డాక్టర్ లక్ష్మీకాంత్ క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు చేరుకున్న లక్ష్మీకాంత్‌ను అతని భార్య, కుటుంబసభ్యులు రిసీవ్ చేసుకున్నారు.
తన భర్తను ఉగ్రవాదులు వదిలేయడం చాలా సంతోషంగా ఉందని లక్ష్మీకాంత్ భార్య డాక్టర్ ప్రతిమ అన్నారు. తన భర్తను విడిపించేందుకు గట్టిగా ప్రయత్నించినందుకు ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ, ఏపీకి చెందిన బలరాం, గోపీకృష్ణ ఇంకా కిడ్నాపర్ల చెరలోనే ఉన్నారు.
హైదరాబాద్ చేరుకున్న లక్ష్మీకాంత్
Published Tue, Aug 4 2015 1:03 PM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM
Advertisement
Advertisement