Laxmikant
-
నక్క మొహం చూశాడు.. జైలు కెళ్లాడు!
తానొకటి తలిస్తే... మరొకటి జరిగింది. నిద్రలేవగానే నక్క ముఖం చూడటం లక్ అని అతను భావిస్తే... పోలీసులు అతనికి జలక్ ఇచ్చారు. నక్కను బంధించాడని అతడ్ని పోలీసులు జైలుకు పంపించారు. ఈ సంఘటన కర్ణాటకలోని తుమకూరు రూరల్ పరిధిలోని నాగవల్లి గ్రామంలో జరిగింది. నాగవల్లి గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్ మూఢనమ్మకాలు అనుసరిస్తాడు. ఎవరికైనా డబ్బులు వస్తే నక్క తోక తొక్కాడు... నక్క ముఖం చూశాడు... అనే సామెతలను బాగా నమ్మేవాడు. ఈ క్రమంలో అతను తన ఇంట్లో రెండు నక్క ఫొటోలను పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా అడవిలో ఉన్న ఒక నక్కను పట్టుకొచ్చి తన కోళ్లఫారం వద్ద బోనులో పెట్టాడు. ప్రతి రోజు ఉదయం దాని ముఖం చూసేవాడు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది పోలీసులకు చెప్పడంతో వారు వచ్చి నక్కను స్వాధీనం చేసుకున్నారు. అడవిలో ఉండాల్సిన నక్కను బోనులో పెట్టడం నేరమని లక్ష్మీకాంత్‌ను అరెస్ట్ చేశారు. నక్కను అటవీ సిబ్బందికి అప్పగించారు. – తుమకూరు -
హైదరాబాద్ చేరుకున్న లక్ష్మీకాంత్
-
హైదరాబాద్ చేరుకున్న లక్ష్మీకాంత్
హైదరాబాద్: లిబియా ఉగ్రవాదుల చెర నుంచి విడుదలైన కర్ణాటక వాసి డాక్టర్ లక్ష్మీకాంత్ క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు చేరుకున్న లక్ష్మీకాంత్‌ను అతని భార్య, కుటుంబసభ్యులు రిసీవ్ చేసుకున్నారు. తన భర్తను ఉగ్రవాదులు వదిలేయడం చాలా సంతోషంగా ఉందని లక్ష్మీకాంత్ భార్య డాక్టర్ ప్రతిమ అన్నారు. తన భర్తను విడిపించేందుకు గట్టిగా ప్రయత్నించినందుకు ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ, ఏపీకి చెందిన బలరాం, గోపీకృష్ణ ఇంకా కిడ్నాపర్ల చెరలోనే ఉన్నారు. -
ఉద్యోగ నియామకాలపై నిషేధం ఎత్తివేయాలి
కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: తపాలా శాఖలో ఉద్యోగ నియామకాలపై నిషేధాన్ని ఎత్తివేయాలని పీ3 డివిజన్ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలు హెడ్ పోస్టాఫీసు వద్ద బుధవారం తపాలా ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోస్టల్ శాఖలో ఏళ్ల తరబడి ఉద్యోగ నియామకాలు లేవన్నారు. ఇది చాలదని ప్రభుత్వం కొత్తగా నియామకాలపై నిషేధం విధించే నిర్ణయం తీసుకోవడం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉద్యోగులపై పనిఒత్తిడి పెరిగిందని, ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపడితే ఉద్యోగులు మానసిక వికలాంగులుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తపాలా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. నిరుద్యోగ సమస్యను పెంచేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. కార్యక్రమంలో జీడీఎస్ డివిజన్ కార్యదర్శి లక్ష్మీకాంత్, పీ4 పోస్టుమన్ యూనియన్ డివిజన్ కార్యదర్శి ఈశ్వరయ్య, మహిళా నాయకురాళ్లు గాయత్రి, అరుణ, అంకిత పాల్గొన్నారు.