ప్రొఫెసర్ల విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్ | tension continue on telugu professors release | Sakshi
Sakshi News home page

ప్రొఫెసర్ల విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్

Published Wed, Aug 5 2015 6:10 PM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM

ప్రొఫెసర్ల విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్

ప్రొఫెసర్ల విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్

న్యూఢిల్లీ: లిబియాలో కిడ్నాపైన తెలుగు ప్రొఫెసర్లు తిరువీధుల గోపీకృష్ణ, చిలువేరు బలరాం కిషన్ విడుదలపై స్పష్టత కొరవడింది. వీరిద్దరినీ ఉగ్రవాదులు విడిచిపెట్టారని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు ప్రకటించారు. వీరిద్దరూ లిబియాలోని  భారత రాయబార కార్యాలయానికి చేరుకున్నారని చెప్పారు.

అయితే బలరాం, గోపీకృష్ణలను వదిలేశారన్న సమచారం తమకు లేదని లిబియాలోని భారత రాయబారి ఎస్ డి శర్మ తెలిపారు. వీరిద్దరూ ఇంకా సురక్షిత ప్రాంతానికి రాలేదని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ చెప్పారు. ప్రభుత్వ ప్రతినిధుల గందరగోళ ప్రకటనలతో బలరాం, గోపీకృష్ణ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement