telugu professors
-
ఇథియెఫియాలో చిక్కుకున్న తెలుగు ప్రొఫెసర్లు
ఆఫ్రికా: తూర్పు ఆఫ్రికాలోని ఇథియెఫియాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్లు చిక్కుకున్నారు. బాలేరోబో సిటీలోని మడవలబు యూనివర్సిటీలో చిక్కుకున్న వారిలో 30 మంది తెలుగు ప్రొఫెసర్లు ఉన్నారు. పాలన, ప్రజాస్వామ్యంలో హక్కుల కోసం అక్కడి ప్రజలు ఇథియోపియాలో రహదారిని దిగ్బంధించడంతో వీరు చిక్కుకుపోయారు. దీంతో వారం రోజులుగా ప్రొఫెసర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు ప్రొఫెసర్లు క్షేమంగా ఉన్నట్లు భారత రాయబార కార్యాలయం సోమవారం తెలిపింది. వారిని సురక్షితంగా భారత్ రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెప్పారు. దీనిపై ఇథియోపియా ఎంపసీ అధికారులతో మాట్లాడుతున్నామన్నారు. ప్రొఫెసర్ల కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. వారిని క్షేమంగా తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని వారి కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
ఐసిస్ చెర నుంచి సురక్షితంగా..
-
ఐసిస్ చెర నుంచి సురక్షితంగా..
14 నెలల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం బయటపడిన తెలుగు ప్రొఫెసర్లు తీవ్రవాద స్థావరాలపై భద్రతా దళాల దాడితో విముక్తి సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్/టెక్కలి : 14 నెలల కిందట ఐసిస్ తీవ్రవాదుల చేతుల్లో బందీలుగా చిక్కుకున్న హైదరాబాద్‌కు చెందిన తెలుగు ప్రొఫెసర్లు చిలువేరు బలరాంకిషన్, తిరువీధుల గోపీకృష్ణ ఎట్టకేలకు విడుదలయ్యారు. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తమ కుటుంబసభ్యులకు ఫోన్‌చేసి తాము క్షేమంగా విడుదలయ్యామని, ప్రస్తుతం మిలటరీ రక్షణలో ఉన్నామని చెప్పారు. లిబియాలోని ట్రిపోలీకి 250 కి.మీల దూరంలో ఉన్న తాము భారత దౌత్య అధికారులను కలిశాక హైదరాబాద్ వస్తామన్నారు. వారిద్దరు సోమ లేదా మంగళవారాల్లో హైదరాబాద్ వచ్చే వీలుంది. ఊహించని రీతిలో గోపికృష్ణ, బాలరాం కిషన్ తమ కుటుంబసభ్యులకు ఫోన్ చేయటంతో ఆ రెండు కుటుంబాలు ఆనందంలో మునిగి తేలాయి. తమవారి విడుదలకు క ృషి చేసిన ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, కేంద్ర మంత్రి వెంకయ్య, తెలంగాణ సీఎం కేసీఆర్‌లకు కుటుంబసభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇండియాకొస్తూ ఐసిస్ చెరలోకి.. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ గోపీకృష్ణ, కరీంనగర్ జిల్లా శనిగరం గ్రామానికి చెందిన ఇంగ్లీష్ ప్రొఫెసర్ చిలువేరు బలరాంల కుటుంబాలు నగరంలోనే స్థిరపడ్డాయి. గోపీ భార్యపిల్లలు నాచారంలో, బలరాం భార్యాపిల్లలు ఆల్వాల్‌లో నివాసం ఉంటున్నారు. చాలా కాలంగా లిబియాలో పనిచేస్తూ, స్వస్థలానికి తిరిగి వస్తున్న క్రమంలో 2015 జూలై 29న ట్రిఫోలి సమీపంలో ఐసిస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. దీంతో గోపీ భార్య కళ్యాణి, పిల్లలు జాహ్నవి, సాయికుమార్.. బలరాం కిషన్ భార్య శ్రీదేవి, పిల్లలు విజయభాస్కర్, మధుసూదన్ అనేక మార్లు కేంద్రమంత్రులు, మోదీని కలిసి విజ్ఞాపనలు చేశారు. ఇటీవల లిబియా దేశంలో అమెరికా సైనికులు ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట వీరు బందీలుగా ఉన్న స్థావరాలపై దాడులు చేయగా, వీరు సురక్షితంగా బయట పడినట్లు సమాచారం. గోపీ ఇంట్లో ఆనందం... ‘నేను గోపీకృష్ణను మాట్లాడుతున్నా. ఉగ్రవాదుల చేర నుంచి బయటపడ్డా. నేను క్షేమంగా ఉన్నా. మీరు క్షేమంగా ఉన్నారా?’ అంటూ గోపీకృష్ణ తన భార్య కళ్యాణితో బుధవారం అర్థరాత్రి ఫోనులో మాట్లాడారు. తాను అమెరికాకు చెందిన బలగాల ఆధీనంలో ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ కుటుంబ సభ్యుల్లో సంతోషం వెల్లివిరిసింది. గురువారం ఉదయం కళ్యాణి తన పిల్లలతో కలిసి గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. గోపీకృష్ణ సోదరుడు మురళీకృష్ణ మాట్లాడుతూ.. ‘గోపీ క్షేమంగా ఉన్నాడన్న వార్త మా కుటుంబంలో పండుగ వాతావరణం తీసుకొచ్చింది. ఇది అతడికి పునర్జన్మగా భావిస్తున్నాం’ అన్నారు. బుధవారం రాత్రి 12 గంటలకు గోపీకృష్ణ తన భార్యతో పాటు తండ్రి నారాయణరావుతోనూ మాట్లాడినట్లు తెలిపారు. భర్త పలకరింపుతో ఉద్వేగానికి గురైన శ్రీదేవి: ‘హలో... శ్రీదేవి నేను బలరాంను మాట్లాడుతున్నాను. నేను క్షేమంగా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు?’ అంటూ తెలియని నంబర్ నుంచి బుధవారం అర్ధరాత్రి వచ్చిన ఫోన్లో ఉద్వేగపూరితమైన గొంతుతో పలకరింపు ఇది. దీంతో ఒక్కసారిగా మూగబోరుున శ్రీదేవి గొంతు సంతోషంతో బదులిచ్చింది. తన భర్త దాదాపు అర నిమిషం సేపు అక్కడి సైన్యం ఇచ్చిన ఫోన్ ద్వారా తనతో మాట్లాడారని ఆమె చెప్పారు. ఇన్నాళ్లు అధికారులు, సహ ఉద్యోగులు బలరాం క్షేమంగా ఉన్నాడంటూ చెప్తున్నప్పటికీ గుబులుతోనే ఉన్న శ్రీదేవి మొఖంలో నిమజ్జనం రోజు ఆనందం వెల్లివిరిసింది. దీంతో ఇంటిల్లిపాదీ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టెక్కలిలో సంబరాలు గోపికృష్ణ ఉగ్రవాదుల చెర నుంచి బయట పడినట్లు సమాచారం రావడంతో శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నివాసముంటున్న ఆయన తల్లిదండ్రులు వల్లభ నారాయణరావు, సరస్వతి, అమ్మమ్మ మహాలక్ష్మి ఆనందం వ్యక్తం చేశారు. వెంటనే హైదరాబాద్ బయల్దేరుతామని ‘సాక్షి’కి చెప్పారు. సంకీర్ణ దళాలు కాపాడాయి: సుష్మా లిబియాలో ఐసిస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన ఇద్దరు తెలుగు ఇంజినీర్లను రక్షించినట్లు విదేశీవ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ గురువారం ట్వీటర్లో తెలిపారు. ఐసిస్‌తో పోరాడుతున్న సంకీర్ణ బలగాలు సిర్త్ పట్టణంలో ఉగ్రవాదుల చెర నుంచి వీరిని విడిపించాయని.. ఇద్దరు ఇంజనీర్లూ క్షేమంగా ఉన్నారని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్‌స్వరూప్ మీడియాకు తెలిపారు. అయితే డాక్టర్ రామమూర్తి ఇంకా ఉగ్రవాదుల చెరలో బందీగానే ఉన్నారని.. ఆయనను విడిపించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. తెలుగు ఇంజినీర్లు ఇద్దరినీ వారి కుటుంబ సభ్యులతో రాయబార కార్యాలయం అధికారులు మాట్లాడించారని ఆయన వివరించారు. మాకిది..మరో జన్మ ‘నెలలు గడిచాయి. ఆయన తప్పక తిరిగి వస్తారన్న నమ్మకమే మమ్మల్ని ముందుకు నడిపించింది. మాకిది పునర్జన్మ. నా భర్త క్షేమంగా విడుదలయ్యానని ఫోన్ చేశాడు. ఈ 14 నెలలు నరకయాతన అనుభవించాము. దేవుని దయకు తోడు, ప్రధాని, సుష్మాస్వరాజ్ ప్రయత్నాలు ఫలించాయి. అందరికీ ధన్యావాలు. - కళ్యాణి(గోపీకృష్ణ భార్య) మా పూజలు ఫలించాయి ‘మా వారి కోసం నేను చేయని పూజ, వ్రతం లేదు. వాటన్నింటికి తోడు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రయత్నాలు కలిసి రావటంతో నా భర్త క్షేమంగా తిరిగొస్తున్నారు. మంచివాళ్లకు మంచే జరుగుతుందన్న విశ్వాసమే నన్ను, నా పిల్లల్ని ముందుకు నడిపింది. గాడ్ ఈజ్ గ్రేట్.’ - శ్రీదేవి(బలరాం భార్య) -
ఉగ్రవాదుల చెరలోనే తెలుగు ప్రొఫెసర్లు
-
ఇంకా ఉగ్రవాదుల చెరలోనే తెలుగు ప్రొఫెసర్లు
-
ప్రొఫెసర్ల విడుదలపై వీడని ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: లిబియాలో ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన ప్రొఫెసర్లు ఇంకా విడుదల కాలేదు. శుక్రవారం అర్ధరాత్రి వరకూ వారి విడుదలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అల్వాల్‌కు చెందిన ప్రొఫెసర్ చిలివేరు బలరాం కిషన్, నాచారానికి చెందిన ప్రొఫెసర్ గోపీకృష్ణలను ఉగ్రవాదులు శుక్రవారం రాత్రి ఏడు గంటలకు విడుదల చేస్తారని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అయితే అర్ధరాత్రి వరకూ విడుదలపై అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. -
ఇంకా విడుదలకాని ప్రొఫెసర్లు
-
ప్రొఫెసర్ల విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
-
ప్రొఫెసర్ల విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
న్యూఢిల్లీ: లిబియాలో కిడ్నాపైన తెలుగు ప్రొఫెసర్లు తిరువీధుల గోపీకృష్ణ, చిలువేరు బలరాం కిషన్ విడుదలపై స్పష్టత కొరవడింది. వీరిద్దరినీ ఉగ్రవాదులు విడిచిపెట్టారని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు ప్రకటించారు. వీరిద్దరూ లిబియాలోని భారత రాయబార కార్యాలయానికి చేరుకున్నారని చెప్పారు. అయితే బలరాం, గోపీకృష్ణలను వదిలేశారన్న సమచారం తమకు లేదని లిబియాలోని భారత రాయబారి ఎస్ డి శర్మ తెలిపారు. వీరిద్దరూ ఇంకా సురక్షిత ప్రాంతానికి రాలేదని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ చెప్పారు. ప్రభుత్వ ప్రతినిధుల గందరగోళ ప్రకటనలతో బలరాం, గోపీకృష్ణ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. -
తెలుగు ప్రొఫెసర్ల కిడ్నాప్ సుఖాంతం
-
'తెలుగు ప్రొఫెసర్ల కిడ్నాప్ సుఖాంతం'
న్యూఢిల్లీ: లిబియాలో కిడ్నాపైన తెలుగు ప్రొఫెసర్లు తిరువీధుల గోపీకృష్ణ, చిలువేరు బలరాం కిషన్ సురక్షితంగా బయటపడ్డారని ఢిల్లీలోని ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు తెలిపారు. వీరిని లిబియాలోని భారత దౌత్య కార్యాలయానికి తరలించారని వెల్లడించారు. ఈ విషయాన్ని ఎంబసీ అధికారులు ధ్రువీకరిస్తారని చెప్పారు. గురువారం సాయంత్రానికి వీరిని ఇండియాకు తీసుకొస్తామన్నారు. గోపీకృష్ణ, బలరాం విడుదలయ్యారన్న సమాచారంతో వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. గోపీకృష్ణ, బలరాంతో పాటు కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్ కుమార్ లను లిబియాలో ఐఎస్ఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. లక్ష్మీకాంత్, విజయ్ కుమార్ లను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. వీరు నలుగురు యూనివర్సిటీ ఆఫ్ సిర్త్ లో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. లక్ష్మీకాంత్ మంగళవారం హైదరాబాద్ చేరుకుని తర్వాత కర్ణాటక వెళ్లారు. -
బందీల విడుదలకు విద్యార్థుల దౌత్యం
ఇంకా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులచెరలోనే తెలుగు ప్రొఫెసర్లు * ఆందోళనలో గోపీకృష్ణ,బలరాం కిషన్ కుటుంబ సభ్యులు * ఐఎస్ఐఎస్ అనుబంధ విద్యార్థి సంఘాల ద్వారా విడుదలకు ప్రయత్నాలు సాక్షి, హైదరాబాద్: లిబియా దేశంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చెరలో ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్లు తిరువీధుల గోపీకృష్ణ, చిలువేరు బలరాం కిషన్‌లకు విముక్తి లభించలేదు. సోమవారం కూడా వీరు విడుదల కాకపోవటంతో ఇరువురు ప్రొఫెసర్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బందీలుగా ఉన్న ఇద్దరు ప్రొఫెసర్లను విడుదల చేసేందుకు ఐఎస్ఐఎస్ అనుబంధ విద్యార్థి సంఘాల ద్వారా దౌత్య అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జూలై 29న స్వదేశానికి వస్తున్న నలుగురు భారతీయులను ట్రిపోలి సమీపంలో కిడ్నాప్ చేసిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు.. వారిలో కర్ణాటకకు చెందిన ఇద్దరిని వదిలేసి, తెలుగు రాష్ట్రాలకు చెందిన గోపీకృష్ణ, బలరాం కిషన్‌లను తమ వద్ద బందీలుగా ఉంచుకున్న విషయం తెలిసిందే. అయితే కిడ్నాప్‌నకు గురై విడుదలైన కర్ణాటక ప్రొఫెసర్లు ఇచ్చిన సమాచారం మేరకు.. గోపీకృష్ణ, బలరాం కిషన్ ఆదివారం సాయంత్రం లేదా సోమవారం మధ్యాహ్నానికి కచ్చితంగా విడుదల అవుతారని దౌత్య అధికారులతో పాటు కుటుంబ సభ్యులు భావించారు. కానీ, సోమవారం తీపికబురు కోసం రోజంతా వేచిచూసిన గోపీకృష్ణ, బలరాం కుటుంబ సభ్యులు సాయంత్రానికి పూర్తిగా డీలాపడిపోయారు. రాత్రి పొద్దుపోయే వరకు బందీల విడుదలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే దౌత్య అధికారులు మాత్రం హ్యూన్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులనే దూతలుగా పంపి గోపీకృష్ణ, బలరాం కిషన్ల విడుదల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వాధి నేతలూ.. కనికరించండి.. ఏ రోజూ.. ఎవరికీ హాని చేయని తమ వారిని విడిపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత చొరవ తీసుకోవాలని బందీల కుటుంబ సభ్యులు వేడుకున్నారు. సోమవారం గోపీకృష్ణ భార్య కళ్యాణి, సోదరుడు మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ బోరున విలపించారు. కిడ్నాప్ అయిన నలుగురు ప్రొఫెసర్లలో కర్ణాటకకు చెందిన ఇద్దరు విడుదలయ్యారని తమ వారు కూడా త్వరగా విడుదల అయ్యేలా చూడాలని, దీనికి భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. లిబియా బందీలను విడిపించండి ఉగ్రవాదుల చెరలో ఉన్న తెలుగువారిని విడిపించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ను కోరినట్లు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సోమవారం ఢిల్లీలో చెప్పారు. తొమ్మిది మంది టీఆర్ఎస్ ఎంపీలు, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, రేణుకా చౌదరి, రాపోలు ఆనందభాస్కర్‌తో వెళ్లి సుష్మా స్వరాజ్‌ను కలిసినట్టు ఆయన తెలిపారు. దొరకని కేసీఆర్ అపారుుంట్‌మెంట్ సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నించామని కానీ లభించలేదని ప్రొఫెసర్ బలరాం కిషన్ కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం బలరాం విడుదల అవుతాడని ఆశాభావంతో ఉన్నామని, లేనిపక్షంలో ఢిల్లీ వెళ్లి సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రతినిధులను కలుస్తామని వారు చెప్పారు. -
గడువు ముగిసినా.. వీడని చెర
-
గడువు ముగిసినా.. వీడని చెర
ట్రిపోలిలో ఉగ్రవాదుల చెరలోనే తెలుగు ప్రొఫెసర్లు * ఆదివారం విడుదల చేస్తారని ఆశగా చూసిన బంధువులు * ప్రాణాలు కాపాడమంటూ దత్తాత్రేయకు వేడుకోలు సాక్షి, హైదరాబాద్: లిబియా దేశంలో కిడ్నాప్‌నకు గురైన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్లు తిరువీధుల గోపీకృష్ణ, చిలువేరు బలరాం కిషన్‌లు తీవ్రవాదుల చెర వీడలేదు. దీంతో ఇరు కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి. వీరితోపాటే కిడ్నాప్‌నకు గురై విడుదలైన కర్ణాటకకు చెందిన ప్రొఫెసర్లు లక్ష్మీకాంతం, విజయ్‌కుమార్‌లు విదేశాంగ శాఖ అధికారులతో చెప్పిన మాటల ప్రకారం ఆదివారం సాయంత్రానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు విడుదల కావాల్సి ఉంది. దీంతో గోపీకృష్ణ, బలరాం కిషన్ల కుటుంబసభ్యులు ఆదివారం రాత్రి వరకు ఎప్పుడు తీపి కబురు వస్తుందోనని ఎదురుచూస్తూ కాలం గడిపారు. తీరా సాయంత్రానికి సైతం ఎలాంటి సమాచారం లేకపోవటంతో బలరాం కిషన్ భార్య శ్రీదేవి ఇతర కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని దిల్కుష అతిథి గృహంలో కేంద్రమంత్రి దత్తాత్రేయను కలుసుకుని తమ వారి ప్రాణాలు ఎలాగైనా కాపాడమంటూ ప్రాధేయపడ్డారు. ఈ విషయమై దత్తాత్రేయ ప్రతిస్పందిస్తూ ఇద్దరు తెలుగు ప్రొఫెసర్ల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, సోమవారం మరోసారి తానే స్వయంగా విదేశాంగశాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతానని హామీ ఇచ్చారు. ఆ ఇద్దరినీ వదిలేస్తారు..: తీవ్రవాదుల చెరలో ఉన్న ఇద్దరు తెలుగువారిని తప్పకుండా విడుదల చేస్తారంటూ కిడ్నాప్ చెర నుండి విడుదలైన కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంతం, విజయ్‌కుమార్‌లు గోపీకృష్ణ, బలరాం కిషన్ల కుటుంబసభ్యులకు బరోసానిచ్చారు. వారిద్దరు లిబియా నుండి ఆదివారం స్వస్థలాలకు బయలుదేరే ముందు గోపీకృష్ణ, బలరాంకిషన్ల కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. తమ వద్ద ఉన్న ధృవపత్రాలన్నీ తీవ్రవాదులు క్షుణ్ణంగా పరిశీలించారని, గోపీకృష్ణ, బలరాంకిషన్‌లకు సంబంధించిన మరిన్ని ధృవపత్రాలను ట్రిపోలి యూనివర్సిటీ ప్రతినిధులు ఉగ్రవాదులకు పంపారని చెప్పారు. ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయంలోగా ఖచ్చితంగా విడుదలవుతారని, ఇదే విషయమై ఆదివారం కూడా తీవ్రవాదులతో సంప్రదింపులు జరిపిన యూనివర్సిటీ ప్రతినిధులు తమతో చెప్పారని లక్ష్మీకాంతం, విజయ్‌కుమార్‌లు పేర్కొన్నారు. -
లిబియాలో తెలుగు ప్రొఫెసర్ల కిడ్నాప్
-
లిబియాలో తెలుగు ప్రొఫెసర్ల కిడ్నాప్
నలుగురు భారతీయుల అపహరణ ఇద్దరి విడుదల.. చెరలోనే మనవాళ్లిద్దరు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల ఘాతుకమేనని అనుమానం న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్, బెంగళూరు: ఇద్దరు తెలుగువారు సహా నలుగురు భారతీయ ప్రొఫెసర్లు లిబియాలో కిడ్నాప్‌నకు గురయ్యారు. వీరిలో కర్ణాటకకు చెందిన ఇద్దరు శుక్రవారం సాయంత్రం విడుదల కాగా హైదరాబాద్‌కు చెందిన చిలువేరు బలరామ్ కిషన్, తిరువీధుల గోపీకృష్ణ ఇంకా ఉగ్రవాదుల చెరలోనే మగ్గుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ సిర్త్లో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న ఈ నలుగురూ బుధవారం ట్రిపోలి మీదుగా భారత్‌కు వస్తుండగా వర్సిటీకి 50 కి.మీ. దూరంలోని ఓ చెక్‌పాయింట్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఇస్లామిక్ రాజ్యస్థాపన కోసం ఇరాక్, సిరియాలలో నెత్తుటేర్లు పారిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్‌కుమార్ శుక్రవారం విడుదలయ్యారని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. మిగతా ఇద్దరినీ విడిపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అందుకు తీసుకుంటున్న చర్యలపై ప్రధాని నరేంద్రమోదీకి వివరణనిచ్చారు. కాగా, ఐఎస్ మిలిటెంట్ల దాడుల నేపథ్యంలో లిబియా నుంచి వచ్చేయాలంటూ అక్కడి భారతీయులకు కేంద్రం ఏడాది క్రితమే సూచనలు జారీచేసింది. ఇరాక్‌లో గతేడాది 39 మంది భారతీయులు కిడ్నాప్ కాగా, ఇప్పటికీ వారి ఆచూకీ తెలియలేదు. మా వారిని రప్పించండి..: కరీంనగర్ జిల్లా శనిగారం గ్రామానికి చెందిన చిలివేరు బలరామ్ కిషన్ కుటుంబం... హైదరాబాద్‌లో అల్వాల్ మానస సరోవర్‌లోని సాయిసాగర్ ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్నారు. ఇతని భార్య శ్రీదేవి ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. పెద్ద కుమారుడు విజయ్‌భాస్కర్ బీటెక్, చిన్న కుమారుడు మధుసూదన్ ఏడో తరగతి చదువుతున్నారు. బలరామ్ ఐదేళ్ల క్రితం సిర్త్ వర్సిటీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. బలరామ్ ఈ నెల 29న రాత్రి 7 గంటలకు లిబియా నుంచి ఇంటికి బయలుదేరుతున్నానంటూ ఫోన్ చేసి భార్య శ్రీదేవితో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన ఫోన్లో అందుబాటులోకి రాలేదు. తన భర్త, గోపీకృష్ణలను భారత్‌కు రప్పించాలని ఆమె ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ‘వీ ఆర్ సేఫ్’ అంటూ సందేశం: కిడ్నాప్‌నకు గురైన వారిలో ఒకరైన లక్ష్మీకాంత్ నుంచి బలరామ్ భార్య శ్రీదేవి సెల్‌ఫోన్‌కు శుక్రవారం సాయంత్రం 6.05 గంటలకు ఓ సంక్షిప్త సందేశం వచ్చింది. ‘వి ఆర్ సేఫ్ హియర్ ఇన్ సిర్త్ యూనివర్సిటీ డోన్ట్ వర్రీ’ (మేము సిర్త్ యూనివర్సిటీలో సురక్షితంగా ఉన్నాం. ఆందోళన వద్దు) అని అందులో పేర్కొన్నారు. భారత్ వస్తూ బందీగా... ఆందోళనలో తెలుగు కుటుంబాలు నలుగురు ప్రొఫెసర్లను గుర్తుతెలియనిదుండగులు కిడ్నాప్ చేసిన విషయాన్ని వారు ప్రయాణించిన కారు డ్రైవర్ హైదరాబాద్‌లోని గోపీకృష్ణ సోదరుడు మురళీకృష్ణకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన మురళీ ట్రిపోలీలో ఉన్న స్నేహితులను సంప్రదించడంతో పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన గోపీకృష్ణ సోదరుడు మురళీకృష్ణతో కలిసి పన్నెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి నాచారం ప్రాంతంలో స్థిరపడ్డారు. డిగ్రీ వరకు టెక్కలిలో చదువుకున్న గోిపీ, తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఎమ్మెస్సీ, తమిళనాడు కాంచీపురంలోని మీనాక్షి అమ్మన్ కళాశాలలో ఎంటెక్ చదివారు. బలరాం అదృశ్యంపై టీవీలో వార్త చూసి ఆందోళన చెందుతున్నభార్య శ్రీదేవి ఈయనకు 2004లో కళ్యాణితో వివాహమైంది. వీరి కుమార్తె జాహ్నవి (10) నాలుగో తరగతి, కుమారుడు కృష్ణ సాయికిశోర్ (4) యూకేజీ చదువుతున్నారు. 2004 నుంచి 2007 వరకు నల్గొండ జిల్లా భువనగిరిలోని అరోరా కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కుటుంబంతో లిబియాకు వలసవెళ్లి హున్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2011లో భార్యాపిల్లల్ని నాచారం రాఘవేంద్రనగర్‌కు పంపారు. ప్రస్తుతం స్రిట్ వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈయన తల్లిదండ్రులు వల్లభనారాయణరావు, సరస్వతితోపాటు అమ్మమ్మ టెక్కలిలో నివసిస్తున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీకి రంజాన్ సెలవులు కావడంతో కుటుంబసభ్యులతో గడపటానికి బుధవారం భారత్‌కు పయనమయ్యారు. కిడ్నాప్ విషయం తెలుసుకున్న శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్నాయుడు, ఆ జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం గోపీకృష్ణ తల్లిదండ్రులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.