హైదరాబాద్, బెంగళూరు: ఇద్దరు తెలుగువారు సహా నలుగురు భారతీయ ప్రొఫెసర్లు లిబియాలో కిడ్నాప్‌నకు గురయ్యారు. వీరిలో కర్ణాటకకు చెందిన ఇద్దరు శుక్రవారం సాయంత్రం విడుదల కాగా హైదరాబాద్‌కు చెందిన చిలువేరు బలరామ్ కిషన్, తిరువీధుల గోపీకృష్ణ ఇంకా ఉగ్రవాదుల చెరలోనే మగ్గుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ సిర్త్‌లో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న ఈ నలుగురూ బుధవారం ట్రిపోలి మీదుగా భారత్‌కు వస్తుండగా వర్సిటీకి 50 కి.మీ. దూరంలోని ఓ చెక్‌పాయింట్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఇస్లామిక్ రాజ్యస్థాపన కోసం ఇరాక్, సిరియాలలో నెత్తుటేర్లు పారిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్‌కుమార్ శుక్రవారం విడుదలయ్యారని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. మిగతా ఇద్దరినీ విడిపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అందుకు తీసుకుంటున్న చర్యలపై ప్రధాని నరేంద్రమోదీకి వివరణనిచ్చారు. కాగా, ఐఎస్ మిలిటెంట్ల దాడుల నేపథ్యంలో లిబియా నుంచి వచ్చేయాలంటూ అక్కడి భారతీయులకు కేంద్రం ఏడాది క్రితమే సూచనలు జారీచేసింది. ఇరాక్‌లో గతేడాది 39 మంది భారతీయులు కిడ్నాప్ కాగా, ఇప్పటికీ వారి ఆచూకీ తెలియలేదు.
Published Sat, Aug 1 2015 7:15 AM | Last Updated on Wed, Mar 20 2024 1:04 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement